
వృద్ధుల సంరక్షణ కార్యకలాపాల్లో నియామకం
ఎన్‌ఎస్‌డీసీ సీఈవో వేద్‌మణి తివారీ
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఏటా లక్ష మందికి అంతర్జాతీయంగా సంరక్షణ కార్యకలాపాల్లో ఉపాధి కల్పించనున్నట్లు జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీఈవో 'వేద్ మణి తివారీ' ప్రకటించారు. మరో రెండేళ్ల తర్వాత నుంచి నియామకాలు మొదలవుతాయన్నారు. వృద్ధ జనాభా పెరుగుతున్న దేశాల్లో వారి సంరక్షణ సేవల్లో నియమించనున్నట్టు చెప్పారు.
దేశంలో నిరుద్యోగం గురించి ప్రస్తావించగా.. అధికారిక లెక్కల ప్రకారం ఇది 6.5 శాతంగా ఉందని, అమెరికాలోనూ 4.5 శాతం మంది నిరుద్యోగులు ఉన్నట్టు గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో భారత్ నుంచి 20,000 మంది నిర్మాణ రంగ కార్మికులు ఇజ్రాయెల్‌కు వెళ్లారని చెప్పారు. దేశవ్యాప్తంగా 100 నైపుణ్య మదింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తివారీ తెలిపారు.
‘‘ఇజ్రాయెల్ లేదా జపాన్ లేదా జర్మనీ వెళ్లాలనుకునే వారు ఈ కేంద్రాల వద్ద హాజరు కావాలి. అక్కడ నైపుణ్యాలను పరీక్షించి సరి్టఫికెట్ ఇస్తారు. అప్పుడు వర్క్‌వీసా కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు’’అని వివరించారు. ఎన్‌ఎస్‌డీసీ 4 కోట్ల మందికి శిక్షణ ఇవ్వగా, మూడు నెలల్లోనే 94 లక్షల మందికి ఉపాధి లభించినట్టు తివారీ వెల్లడించారు.
అత్యాధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 50 భవిష్యత్ నైపుణ్య కల్పన కేంద్రాలను, 10 ఎన్‌ఎస్‌డీసీ ఇంటర్నేషనల్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పరిశ్రమల అనుసంధానతతో కూడిన శిక్షణా కార్యక్రమాలు 300కు మించగా, 13 ప్రముఖ టెక్నాలజీలు వీటి పరిధిలో ఉన్నట్టు చెప్పారు. ఏటా 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment