రెస్టారెంట్‌లో వెయిటర్‌ ఉద్యోగాలు.. క్యూ కట్టిన 3 వేల మంది విద్యార్థులు | Thousands Of Indian Students In Canada Queue For Waiter Jobs | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌లో వెయిటర్‌ ఉద్యోగాలు.. క్యూ కట్టిన 3 వేల మంది విద్యార్థులు

Published Sun, Oct 6 2024 12:12 PM | Last Updated on Mon, Oct 7 2024 1:35 PM

Thousands Of Indian Students In Canada Queue For Waiter Jobs

త్వరలో మా రెస్టారెంట్‌ ప్రారంభం కానుంది. అందులో పనిచేసేందుకు వెయిటర్లు, సర్వర్లు కావలెను అంటూ ఓ ప్రకటన. అంతే ఉద్యోగాల గురించి తెలుసుకున్న సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యేందుకు రెస్టారెంట్‌ క్యూ కట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

కెనడాలో నిరుద్యోగం పెరిగిపోయింది. బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వెలుపల విద్యార్థులు క్యూకట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారంటూ నెటిజన్లు ట్వీట్‌ చేశారు. 

బ్రాంప్టన్‌లో ప్రారంభమైన కొత్త రెస్టారెంట్‌లో పనిచేసేందుకు వెయిటర్,  సర్వెంట్ ఉద్యోగాల కోసం కెనడా నుండి 3,000 మంది విద్యార్థులు (ఎక్కువగా భారతీయులు) వరుసలో ఉన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని ఉద్దేశిస్తూ.. ట్రూడో.. కెనడాలో భారీ నిరుద్యోగం’ అనే క్యాప్షన్‌ను జోడించి విద్యార్థుల గురించి పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అనేక కలలతో భారత్‌ నుంచి కెనడాకు వచ్చే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. 

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో ఎప్పటిదనేది స్పష్టత లేకపోయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆర్థిక అనిశ్చితి మధ్య విదేశాలకు వెళ్లే సమయం గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. మాంద్యం కారణంగా విదేశాలకు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని అర్థం చేసుకోవాలి అని ఒక నెటిజన్‌ అంటుంటే.. మరికొందరు విద్యార్థులను సమర్థించారు.

రెస్టారెంట్‌లలో పార్ట్‌టైమ్ పని చేయడం చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు సర్వ సాధారణం అని అంటున్నారు. విద్యార్థులు ఇంకా చదువుతున్నట్లయితే, రెస్టారెంట్‌లో పనిచేయడం బహుశా తమను తాము పోషించుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగం కావచ్చు. దానిని నిరుద్యోగం అని అనకూడదని మరొకరు అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో విద్యార్థులు అలాంటి ఉద్యోగాలు చేసుకునే సంస్కృతి ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు.  

మరికొందరు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను కూడా ఎత్తిచూపారు. కెనడాలో పెద్దగా కలలు కనే ఈ విద్యార్థులకు ప్రారంభం చాలా కష్టంగా ఉండవచ్చు. చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరికి విజయం సాధించి, ఇంటికి తిరిగి వచ్చిన వారితో పోలిస్తే సుసంపన్నమైన జీవితాన్ని గడపడం మేం చూశాం’ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.   

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement