NSDC
-
ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్‌హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రీ ఆన్లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్‌హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్ఎస్డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్ఎస్డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
శామ్సంగ్ గ్రూప్ భారీ పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శామ్సంగ్ గ్రూప్ తన సెమీకండక్టర్, బయోఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్స్ యూనిట్లలో 205 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాబోయే మూడు ఏళ్లలో 40,000 మందికి ఉపాది కల్పించనున్నట్లు శామ్సంగ్ తెలిపింది. "ప్రత్యక్ష ఉపాధిని పెంచడం, విద్యా అవకాశాలను అందించడం, యువత సృజనాత్మక సామర్థ్యాలు వ్యాపారాలు & సమాజానికి ఎక్కువ దోహదపడేలా చూడటానికి స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశ్యం" అని అధికారిక ప్రకటనలో తెలిపింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, శామ్సంగ్ బయోలాజిక్స్ వంటి ప్రధాన అనుబంధ సంస్థలు టెలికమ్యూనికేషన్స్, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాలలో పరిశోధనలను & ఖర్చులను చూస్తాయి. దక్షిణ కొరియా కేంద్రంగా సెమీకండక్టర్ల తయారీపై దృష్టి సారించడానికి 2030 నాటికి $151 బిలియన్లను పెట్టుబడి పెట్టాలనే శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ దీర్ఘకాలిక లక్ష్యం. దేశీయ ఎస్ఎంఈల తయారీ సామర్థ్యాలను అప్ గ్రేడ్ చేసే లక్ష్యంతో శామ్సంగ్ తన 'స్మార్ట్ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్'ను కూడా ప్రారంభించింది. ఇక మన దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ కింద ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)తో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్(డిజిటల్, ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. (చదవండి: మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు.. ఇరగదీస్తున్నాయిగా) -
శామ్సంగ్ గుడ్‌న్యూస్, 50వేల మందికి శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్.. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌డీసీకి చెందిన 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్ (డిజిటల్, ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. 200 గంటలపాటు తరగతి గది, ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత అయిదు నెలలపాటు శామ్సంగ్ రిటైల్ స్టోర్‌లో శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులకు భత్యం చెల్లిస్తారు చదవండి : పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం -
మారుతి, ఎన్‌ఎస్‌డీసీతో ఉబెర్ భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటో మేజర్ మారుతి సుజుకి, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో క్యాబ్ డ్రైవర్ల శిక్షణ, మరియు సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించింది. సుమారు నాలుగు లక్షలమంది డ్రైవర్లతో అమెరికా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద క్యాబ్ ప్రొవైడర్ గా ఉన్న ఉబెర్ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ, సదుపాయాలకోసం కృషి చేస్తోంది. 2018 నాటికి పది లక్షల మందికి జీవనోపాధి అవకాశాలు సృష్టించే యోచనలో మారుతీ, ఎన్ఎస్డీసీ భాగస్వామ్యంతో 'ఉబెర్ షాన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మారుతీ సుజుకి భాగస్వామ్యంతో 2018 నాటికి సుమారు పదిలక్షలమందికి జీవనోపాధి అవకాశాలను కల్పించాలనే తమ లక్ష్యం నెరవేరనుందని ఉబెర్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద 30,000 డ్రైవర్లకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సి తెలిపారు. నైపుణ్యం లేని డ్రైవర్లకు శిక్షణ అందించి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఉద్దేశించిందని ఉబెర్ భారతదేశం అధ్యక్షుడు అమిత్ జైన్ పీటీఐకి తెలిపారు. అలాగే డ్రైవర్లు వాణిజ్య లైసెన్సుల, వాహనం ఫైనాన్సింగ్, లీజింగ్ పరిష్కారాల్లో ఈ ప్రణాళిక సహాయాన్నంది స్తుందన్నారు. ఢిల్లీ / ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నైలలో 4నెలల పైలట్ ప్రోగ్రాంను నిర్వహించనున్నామన్నారు. ఇది పూర్తయ్యాక దీని ఆధారంగా భారతదేశం అంతటా ఇతర నగరాలకు విస్తరిస్తామని జైన్ ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ శిక్షణా కేంద్రాల ద్వారా కొత్త, పాత డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఆటోమొబైల్ సెక్టార్ లో స్కిల్ బిల్డింగ్ కు ఇది ప్రోత్సాహాన్నందిస్తుందని పేర్కొన్నారు. -
కడపలో ఎన్ఎస్డీసీ-దాల్మియా భారత్ నైపుణ్య శిక్షణా కేంద్రం!
న్యూఢిల్లీ: కడపలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు కానున్నది. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చే నిమిత్తం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), దాల్మియా భారత్ ఫౌండేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రానున్న పదేళ్లలో దాదాపు 60,000 మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తామని ఎన్ఎస్డీసీ తెలిపింది. వస్త్రాలు, రిటైల్, ఆటో, హెల్త్‌కేర్, రియల్టీ, వ్యవసాయం తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొంది. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిలో 70 శాతం మందికి తప్పక ఉపాధి కల్పిస్తామని ఎన్ఎస్డీసీ సీఈవో జయంత్ కృష్ణా తెలిపారు. మొత్తంగా తమిళనాడు (తిరుచ్చి), ఆంధ్రప్రదేశ్ (కడప), కర్నాటక (బెల్గామ్), ఉత్తరప్రదేశ్ (సీతాపూర్), అస్సాం (గువాహటి), ఒడిస్సా (రూర్కెలా, కటక్), జార్ఖండ్ (బొకారొ) ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ గౌతమ్ దాల్మియా తెలిపారు. -
నైపుణ్యాల పెంపునకు రూ.1,000 కోట్లు
శివగంగ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది యువజనులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇక్కడకు సమీపంలోని అమరావతిపుత్తూర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ విషయం చెప్పారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మొత్తం విద్యార్ధుల్లో 15 శాతం మంది మాత్రమే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని విదేశాల్లో ఉద్యోగాలు పొందగలుగుతున్నారని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.