హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్‌సంగ్.. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్‌సంగ్ శిక్షణ ఇవ్వనుంది.
దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌డీసీకి చెందిన 120 కేంద్రాల్లో శామ్‌సంగ్ దోస్త్ (డిజిటల్, ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. 200 గంటలపాటు తరగతి గది, ఆన్‌లైన్ పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత అయిదు నెలలపాటు శామ్‌సంగ్ రిటైల్ స్టోర్‌లో శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులకు భత్యం చెల్లిస్తారు
చదవండి : పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
Comments
Please login to add a commentAdd a comment