retail sector
-
రూ.16,499కే జియో ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తాజాగా దేశీయ మార్కెట్లో 4జీ సిమ్ ఆధారిత ల్యాప్‌టాప్ ‘జియోబుక్’ పరిచయం చేసింది. ధర రూ.16,499. బరువు 990 గ్రాములు. జియో ఓఎస్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2 గిగాహెట్జ్ ఆక్టా కోర్ చిప్సెట్, 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్ హెచ్డీ డిస్ప్లే, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ గెస్చర్ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది. హెచ్డీ వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్స్, వైర్లెస్ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్ చాట్‌బాట్, స్క్రీన్ ఎక్స్టెన్షన్, ఇన్‌బిల్ట్ యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు అమెజాన్‌లో లభిస్తుంది. -
దేశీ రిటైల్ రంగం @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు. ‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి .. రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు. రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అటు ఆన్లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
బాబోయ్.. ఆ రంగంలో ఉద్యోగాలు, మాకొద్దంటున్న గ్రాడ్యుయేట్లు!
కరోనా మహమ్మారి దెబ్బకు చాలా రంగాలు డీలా పడడంతో పాటు కొన్ని రంగాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిటైల్ ఉద్యోగాలకు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో రిటైల్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య 11.80 శాతం తగ్గినట్లు గ్లోబల్ జాబ్ సైట్ ఇన్డెడ్ నివేదికలో పేర్కొంది. కరోనా కంటే ముందు మూడేళ్లలో 5.50 శాతం వృద్ధి నమోదైన ఈ రంగంలో.. ఆ తర్వాత మాత్రం 11.80 శాతం తగ్గినట్లు నివేదికలో వెల్లడించింది. గత సంవత్సరం లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రజలు ఆన్లైన్లో కొనుగోలు చేయడానికే మొగ్గు చూపారు. దీంతో రీటైల్ రంగంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా, ఉద్యోగార్థులకు ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. నివేదికలోని డేటా వివరాలు ప్రకారం ఉద్యోగార్ధుల ఆసక్తి.. స్టోర్ మేనేజర్ (15 శాతం), రిటైల్ సేల్స్ అసోసియేట్ (14.4 శాతం), క్యాషియర్ (11 శాతం), బ్రాంచ్ మేనేజర్ (9.49 శాతం), లాజిస్టిక్స్ అసోసియేట్ (9.08 శాతం) వంటి పోస్ట్‌లకు మాత్రం డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా రిటైల్ రంగ ఉద్యోగ అవకాశాలు కలిగిన నగరాల్లో బెంగళూరు 12.26 శాతం వాటాతో తొలి స్థానంలో ఉండగా, ముంబై 8.2 శాతం, చెన్నై 6.02 శాతం తర్వాత స్థానంలో ఉన్నాయి. చదవండి: 400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి! -
పుంజుకుంటున్న ఎఫ్ఎంసీజీ రంగం!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ జూన్ త్రైమాసికంలో మోస్తరు వృద్ధిని చూసింది. విలువ పరంగా వ్యాపారం 10.9 శాతం పెరిగింది. ఆహారేతర వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో తగినప్పటికీ.. మొత్తం మీద వినియోగం పెరగడం కలిసొచ్చింది. డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం మీద వినియోగం మళ్లీ పుంజుకుంటున్నట్టు పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్లో యూనిట్ పరిమాణం పెరిగిందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు తగ్గినట్టు వివరించింది. పరిమాణం పరంగా సానుకూల ధోరణి ఉండొచ్చని, దీనికితోడు ధరల ఆధారిత వృద్ధి కూడా ఉంటుందని అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో రెండంకెల వృద్ధి నమోదైనట్టు నీల్సన్ ఐక్యూ ఎండీ సతీష్ పిళ్లై (భారత్) చెప్పారు. గత ఐదు త్రైమాసికాలుగా రెండంకెల స్థాయిలో ధరల పెరుగుదలను చూస్తున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం, ఇతరస్థూల ఆర్థిక గణాంకాలను ప్రస్తావించారు. ఎఫ్ఎంసీజీలో ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదవుతుందని నీల్సన్ఐక్యూ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తోందని.. కొంత నిదానంగా అయినా గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగం పెరగొచ్చని అంచనా వేసింది. రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు జూన్ త్రైమాసికంలో విక్రయాల పరంగా వృద్ధిని నమోదు చేశాయి. చదవండి👉 'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో! -
లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్‌మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్‌మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు. వాల్‌మార్ట్‌లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్‌పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. -
శామ్సంగ్ గుడ్‌న్యూస్, 50వేల మందికి శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్.. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌డీసీకి చెందిన 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్ (డిజిటల్, ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. 200 గంటలపాటు తరగతి గది, ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత అయిదు నెలలపాటు శామ్సంగ్ రిటైల్ స్టోర్‌లో శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులకు భత్యం చెల్లిస్తారు చదవండి : పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం -
Shopping Mall: షాపింగ్ మాల్స్ ఢమాల్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్స్ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్‌లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్ యజమానులు సాధారణంగా లీజ్ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్డౌన్ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్ వేవ్‌లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్ గ్రూప్ ఈడీ అభిషేక్ బన్సల్ తెలిపారు. రెంటల్ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్ డైరెక్టర్ హర్‡్ష బన్సల్ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్మన్, వేక్ఫీల్డ్ చెబుతోంది. ఇతర ఆదాయాలూ తగ్గాయి.. మొత్తం రెంటల్ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్–అప్ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్ ఇండియా డైరెక్టర్ హర్షవర్ధన్ సింగ్ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్ పుంజుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముప్పులా పరిణమించిందని చెప్పారు. -
రిటైల్ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: రిటైల్ రంగానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ + ఆఫ్‌లైన్ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్ ఎగుమతులు 125 బిలియన్ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్లైన్ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది. మార్కెట్ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్ మార్కెట్ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్‌లైన్+ఆఫ్‌లైన్ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది. సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అభిప్రాయపడ్డారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడుతూ ఆహార సంబంధిత వ్యాపార ప్రణాళికలకు ఫ్లిప్‌కార్ట్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ఫ్లిప్‌కార్ట్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదిత ప్రణాళిక నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నియంత్రణ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) తెలిపింది. మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఆధారంగా నడిచే మార్కెట్ దేశ రైతులు భారీ ప్రయోజనాన్ని సమకూరుస్తుందన్నారు.సప్లయ్ చెయిన్ సామర్థ్యం పెంపు, పారదర్శకతతో దేశ రైతులకు,ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయమైన విలువను చేకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవసాయంలో కీలక మార్పులకు దోహపడుతుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెజాన్ 2017లో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. కాగా దేశం పెరుగుతున్న ఆహార రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికను గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిన, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఈ కొత్త వెంచర్లో 258 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో కిరాణా విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది. కఠిన ఆంక్షలతో ఇంటికే పరిమితమైన చాలామంది వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. దీంతో గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ అమెజాన్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. రాబోయే నెలల్లో కూడా ఇది కొనసాగుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహార రిటైల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండటం గమనార్హం. చదవండి : అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్: కొత్త పథకాలు షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా ప్రభావం రిటైల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఇప్పటి వరకు భవన యజమాని, దుకాణదారు మధ్య అద్దె చెల్లించేలా ఒప్పందాలు ఉండేవి. రానున్న రోజుల్లో అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలోకి వచ్చి మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాక వ్యాపారం తిరిగి గాడిన పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. వ్యాపారాలు అంతంతే నమోదు అవుతాయి కాబట్టి అద్దెలు చెల్లించే స్థాయి విక్రయదారులకు ఉండదని నిపుణులు అంటున్నారు. వ్యాపారాలు లేనందున భవన యజమానులకు మరో మార్గం లేదని, ఆదాయంలో వాటా తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దుకాణదారులు కోలుకోవడానికి ఈ విధానం చక్కని పరిష్కారం అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నిబంధన ప్రకారం.. ఫోర్స్ మెజోర్ నిబంధన ప్రకారం అద్దెలో వెసులుబాటును దుకాణదారులు కోరవచ్చు. మూతపడ్డ కాలానికి అద్దె చెల్లించలేమని చెప్పేందుకూ ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మాల్స్‌లో దాదాపు 60 శాతం మేర స్థలాన్ని ప్రధాన బ్రాండ్ల యాంకర్ స్టోర్లతో నిండిపోయి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫోర్స్ మెజోర్ నిబంధనను వినియోగించుకుంటాయి. రిటైలర్ల ఆదాయంలో అద్దె ఖర్చు 12–16 శాతముంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. మాల్ యజమానులు 45 శాతం అద్దె కోల్పోయే చాన్స్ ఉందని చెబుతోంది. ఒకవేళ రెండు నెలలకుపైగా దుకాణాలు మూసివేస్తే దాని ప్రభావంతో 62 శాతం అద్దె కోల్పోయే అవకాశం ఉందని వివరించింది. కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో దుకాణదారుల ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది. గతంలో రోజుకు ఎంతకాదన్నా దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో రూ.500 కోట్ల వ్యాపారం నమోదయ్యేదని అంచనా. మొదలైన వినతులు.. అద్దెలు తగ్గించాల్సిందిగా రిటైలర్ల నుంచి వినతులు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థలు, మాల్ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రిటైలర్లు ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లను రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేశాయి. అద్దె నుంచి మినహాయించాల్సిందిగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్ ఇప్పటికే భవన యజమానులకు విన్నవించింది. ఇదే బాటలో వీ–మార్ట్ సైతం చేరింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో అద్దె చెల్లించలేమని స్థల యజమానులకు సమాచారం ఇచ్చామని వీ–మార్ట్ సీఎండీ లలిత్ అగర్వాల్ వెల్లడించారు. -
సింగిల్ ‘బ్రాండ్’ బాజా..!
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్ బ్రాండ్ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ సంస్థల భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జారా, హెచ్అండ్ఎం, గ్యాప్ వంటి సంస్థలు కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా నిబంధనల సడలింపుతో మార్గం సుగమమైంది. ఒకే బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే పలు సింగిల్ బ్రాండ్ విదేశీ సంస్థలు.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా ముందు ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయాలన్న నిబంధన వాటికి అడ్డంకిగా ఉంటోంది. స్టోర్ ఏర్పాటు వ్యయాలు భారీగా ఉంటున్న నేపథ్యంలో అసలు తమ ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలియకుండా ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సరికాదనే ఉద్దేశంతో అవి వెనుకడుగు వేస్తూ వస్తున్నాయి. ఒకవేళ ముందుకొచ్చినా.. స్థానికంగా ఏదో ఒక సంస్థతో టైఅప్ పెట్టుకోవడం తప్పనిసరవుతోంది. దీంతో పాటు 30 శాతం కొనుగోళ్లు స్థానికంగా జరపాలన్న మరో నిబంధన కూడా విదేశీ సంస్థలకు అడ్డంకిగా ఉంటోంది. ఫలితంగా.. అవి స్థానికంగా ఇతర సంస్థలతో జట్టు కట్టి కార్యకలాపాలు సాగించాల్సి వస్తోంది. తాజాగా తప్పనిసరి ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు, సోర్సింగ్ నిబంధనలను సడలించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు.. నిబంధనల సడలింపుతో సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు ముందుగా ఆన్లైన్లో విక్రయాలు జరపవచ్చు. అయితే, రెండేళ్ల వ్యవధిలో ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సోర్సింగ్ విషయానికొస్తే సింగిల్ బ్రాండ్ రిటైలర్లు తొలి అయిదేళ్లలో సగటున 30% స్థానికంగా కొనుగోళ్లు చేస్తే చాలు. ఆ తర్వాత నుంచి ఏటా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇందులోనూ రిటైలర్లకు ఇంకొంత వెసులుబాటు లభించనుంది. సదరు బ్రాండ్‌ను విక్రయించే కంపెనీ లేదా ఆ గ్రూప్ కంపెనీలు లేదా థర్డ్ పార్టీ వెండార్లయినా సరే స్థానికంగా జరిపే కొనుగోళ్లు సోర్సింగ్ నిబంధన పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు యాపిల్‌కు వెండార్.. ఫాక్స్‌కాన్ గానీ స్థానికంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.. అది సోర్సిం గ్పరంగా యాపిల్‌కు కూడా దఖలుపడుతుంది. వాస్తవానికి చిన్న, మధ్య తరహా దేశీ సంస్థలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ 30 శాతం నిబంధన పెట్టారు. విదేశీ సింగిల్ బ్రాండ్ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ఈ సోర్సింగ్ నిబంధన కూడా ఒక కారణమే. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా వంటి సంస్థలు భారత్‌లో చాన్నాళ్లుగా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ స్టోర్ పెట్టాలంటే కచ్చితంగా 30 శాతం ఇక్కడివే కొనాలన్న నిబంధన కారణంగా చాలా కాలం ముందుకు రాలేదు. తాజాగా నిబంధనల మార్పుతో విదేశీ రిటైలర్లకు మరింత వెసులుబాటు లభించనుంది. ఉపాధికి ఊతం.. నిబంధనలను సడలించడం ఉభయతారకంగా ఉంటుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆయా సంస్థలు స్వయంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఊతం లభిస్తుందని, ఆన్లైన్లో విక్రయాలు జరిపినా ఉపాధి కల్పనకు తోడ్పాటు లభించగలదని భావిస్తోంది. లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరగగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. 2013లో అమెజాన్ భారత మార్కెట్లోకి వచ్చినప్పట్నుంచి 2,00,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగిందని అంచనా. అమెజాన్ సుమారు 5,00,000 మంది విక్రేతలతో కలిసి పనిచేస్తోంది. అమ్మకాలు పెరిగే కొద్దీ ఆయా విక్రేతలు మరింత మంది సిబ్బందిని తీసుకుంటూ ఉండటం వల్ల ఆ రకంగా కూడా ఉపాధికి ఊతం లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘స్మార్ట్‌ఫోన్స్’ విస్తరణ.. నిబంధనల సడలింపుతో ఎగుమతులకు కూడా ఉపయోగపడేలా భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ‘ఆఫ్‌లైన్ స్టోర్స్ విస్తరణకు కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఇప్పటికే మా స్థానిక భాగస్వాములతో అన్ని ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తాజా పరిణామంతో భారత తయారీ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు రాగలవని మరో స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటెజీ విభాగం) నిపుణ్ మార్యా చెప్పారు. యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి దిగ్గజ బ్రాండ్ల సొంత స్టోర్స్ ఏర్పాటుతో దేశీ మొబైల్ హ్యాండ్సెట్ రిటైలింగ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదని పరిశ్రమ సమాఖ్య ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అభిప్రాయపడింది. సన్నాహాల్లో యాపిల్.. 3 నెలల్లో ఆన్లైన్ విక్రయాలు ఏడాదిన్నరలో తొలి ఆఫ్‌లైన్ స్టోర్ సింగిల్ బ్రాండ్ రిటైల్ నిబంధనల సడలింపుతో టెక్ దిగ్గజం యాపిల్ తమ తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించే సన్నాహాల్లో పడింది. వచ్చే 3–5 నెలల్లో ఇది సిద్ధం కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆన్లైన్ స్టోర్స్ తరహాలోనే ఇది కూడా ఉండనుందని పేర్కొన్నాయి. ఇక వచ్చే 12–18 నెలల్లో ఆఫ్‌లైన్ స్టోర్ సైతం ప్రారంభించాలని యాపిల్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ భాగస్వామ్యంతో యాపిల్ ఆన్లైన్లో భారత్‌లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో 35–40 శాతం వాటా ఈ–కామర్స్‌దే ఉంటోంది. ఐప్యాడ్ ట్యాబ్లెట్స్, మాక్‌బుక్ ల్యాప్టాప్స్ అమ్మకాలు కూడా ఆన్లైన్లో భారీగానే ఉంటున్నాయి. దేశీయంగా మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాల వాటా 25 శాతం పైగా ఉంటోంది. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యాపిల్ భావిస్తోంది. ‘భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు అందిస్తున్న సేవలను భారతీయ కస్టమర్లకు కూడా అందిస్తాం. త్వరలోనే మిగతా ప్రణాళికలను వెల్లడిస్తాం‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాపిల్‌కు 25 దేశాల్లో స్టోర్స్ ఉన్నాయి. -
చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హితవు పలికారు. రౌండ్ ట్రిప్పింగ్ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో తప్పుడు పనుల్లో పాల్గొనే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ సంస్కృతి, మైండ్‌సెట్‌ను మార్చేస్తాం’’ అని పీయూష్ గోయల్ సీఐఐ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయవాదులు, అంతర్జాతీయంగా నాలుగు అతిపెద్ద ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థలు (పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈఅండ్‌వై) ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. భారత చట్ట స్ఫూర్తికి విరుద్ధమైన సలహాలు ఇవ్వొద్దని పరోక్షంగా హెచ్చరించారు. బహుళ బ్రాండ్ల ఉత్పత్తుల రిటైల్ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టాన్ని కంపెనీలు గౌరవించాలని, లొసుగుల ద్వారా దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. చట్టానికి అనుగుణంగా... ‘‘మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించే విధానం అమల్లో ఉంది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ ఒక్కరూ దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు సమస్య ఏమీ ఉండదు’’ అని మంత్రి పేర్కొన్నారు. చట్టానికి అనుగుణంగా నడచుకోండి. రౌండ్ ట్రిప్పింగ్‌ను చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మీలో ఎవరైనా అది చేసుంటే అంగీకరించి ప్రక్షాళన చేసుకుని, ఆ అధ్యాయానికి ముగింపు పలకండి’’ అని మంత్రి సూచించారు. దొడ్డిదారిన వచ్చిన వారు బయటపడే మార్గం కోసం కామా, పుల్‌స్టాప్‌లను వెతకొద్దన్నారు. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై గోయల్ స్పందిస్తూ... చట్టంలో కొన్ని నిబంధనలు భారంగా ఉన్నాయని, వాటిని సభ్యదేశాల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎగుమతిదారులకు విదేశీ మారక రుణాలు ఎగుమతిదారులకు విదేశీ మారక రూపంలో రుణాలను సమకూర్చే విషయంలో బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖజానాపై పెద్దగా భారం పడకుండా, ఖరీదైన రుణ సమస్యను పరిష్కరించే మార్గాలున్నాయని చెప్పారు. వాణిజ్యానికి సంబంధించి ఏ అంశానికైనా సబ్సిడీలన్నవి పరిష్కారం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా విదేశీ కరెన్సీ రుణాలు సమకూర్చనున్నామని, బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ విషయం లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రాల పన్నులను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 50 బిలియన్ డాలర్ల ఎగుమతులకు అవకాశాలున్నాయని వాణిజ్య శాఖ మదింపు వేసినట్టు చెప్పారు. -
2.76 లక్షల కొత్త కొలువులు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్–సెప్టెంబర్ 2019–20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం రిటైల్ రంగంలో నికరంగా ఉద్యోగావకాశాలు 2 శాతం పెరిగి అదనంగా 1.66 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీలో 1 శాతం వృద్ధితో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. 27,560 ఉద్యోగాలతో ఢిల్లీ రిటైల్ రంగం అగ్రస్థానంలో.. 22,770 కొత్త కొలువులతో బెంగళూరు ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. విదేశీ రిటైల్ దిగ్గజాల రాకతో పాటు రిటైల్ రంగం భారీగా వృద్ధి చెందడం, కార్యకలాపాలు విస్తరించడం, కంపెనీల కొనుగోళ్లు జరగడం తదితర అంశాలు ఉపాధి కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ పేర్కొంది. ఎఫ్ఎంసీజీలో ముంబై, ఢిల్లీ టాప్.. రిటైల్‌లో కొత్త కొలువులకు ఢిల్లీ, బెంగళూరు అగ్రస్థానాల్లో ఉండగా.. ఎఫ్ఎంసీజీ విభాగంలో ముంబై (14,770 కొత్త ఉద్యోగాలు), ఢిల్లీ (10,880) టాప్ స్థానాల్లో ఉంటాయి. ఫుడ్ పార్కుల ఏర్పాటు, సామర్థ్యాల పెంపు, ప్రస్తుత కంపెనీలు.. ఇతర సంస్థలను కొనుగోళ్లు చేయడం, క్యాష్ అండ్ క్యారీ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, సింగిల్, మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులకు అనుమతించడం వంటి అంశాలు ఈ ఉపాధి కల్పనకు ఊతంగా ఉండగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ హెడ్ (డిజిటల్, ఐటీ విభాగం)మయూర్ సారస్వత్ తెలిపారు. మొత్తం మీద చూస్తే రిటైల్ ద్వారా 15.11 శాతం, ఎఫ్ఎంసీజీ వల్ల 10.31% ఉద్యోగాల వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు మాత్రమే కాకుండా ఫ్రెషర్లకు కూడా బాగానే అవకాశాలు లభించగలవని సారస్వత్ తెలిపారు. కేవలం రిటైల్‌లోనే 33,310 తాజా గ్రాడ్యుయేట్స్‌కు కొత్తగా ఉద్యోగావకాశాలు లభించగలవన్నారు. నివేదిక ప్రకారం 2018–19 అక్టోబర్–మార్చి వ్యవధితో పోలిస్తే 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగుల వలసలు భారీగా నమోదయ్యాయి. రిటైల్‌లో 19.82 శాతంగాను, ఎఫ్ఎంసీజీలో 16.03 శాతంగాను ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జట్టు!
ముంబై: భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ, అలీబాబా చేతులు కలపనున్నది. ఈ రెండు సంస్థలు కలసి భారత్‌లో భారీ రిటైల్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచంలో వేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల జోరుకు చెక్ పెట్టడానికి ఈ జాయింట్వెంచర్ను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు యోచిస్తున్నాయని సమాచారం. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా గత నెల చివర్లో ముంబైలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో కలిసి చర్చలు జరిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటిలో ఇరువురూ పలు అంశాలపై చర్చలు జరిపారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో భాగంగా రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయాలని అలీబాబా సంస్థ యోచిస్తోందని, దీని కోసం ఆ సంస్థ 500–600 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలీబాబాకు స్వల్పమైన వాటాతో ఇరు సంస్థలు కలిసి వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. భారీ డిజిటల్‌మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటు చేసే విషయం కూడా చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలపాయి. ఒక వేళ ఈ డీల్ సాకారమైతే, భారత్‌లో అలీబాబాకు ఇదే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ విషయంలో అలీబాబాకు గోల్డ్‌మన్ శాక్స్ సలహాదారుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి గోల్డ్‌మన్ శాక్స్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం మీద భారత ఈ కామర్స్ రంగంలో భారీ పోరుకు తెర లేవనున్నది. నిధులు పుష్కలంగా ఉన్న రెండు దిగ్గజ సంస్థలు(ఆమెజాన్ వర్సెస్ ఆలీబాబా) భారత ఈ కామర్స్ మార్కెట్లో అగ్రస్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ పోటీ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణుల అంచనా. మరోవైపు ఈ డీల్ అలీబాబాకు అత్యంత కీలకం కానున్నది. ఈ సంస్థకు 49 శాతం వాటా ఉన్న పేటీఎమ్‌కు ఇటీవలనే ఆర్బీఐ వినియోదార్ల డేటా విషయమై హెచ్చరిక జారీ చేసింది. పేటీఎమ్ కస్టమర్ల డేటాను ఈ చైనా కంపెనీ యాక్సెస్ చేస్తోందని ఆర్బీఐ ఆనుమానిస్తోంది. కాగా రిలయన్స్ రిటైల్ 5,200 పట్టణాల్లో మొత్తం 8,533 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాది కాలానికి రిలయన్స్ రిటైల్ రూ.2,529 కోట్ల స్థూల లాభం సాధించింది. ఈ కంపెనీ టర్నోవర్ 1,000 కోట్ల డాలర్లను దాటేసింది. ‘ప్రపంచాన్ని మార్చే’ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం ఫార్చ్యూన్ సంస్థ రూపొందించిన ప్రపంచాన్ని మార్చే కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం మెర్క్, మూడో స్థానంలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలు నిలిచాయి. ఐదో స్థానాన్ని చైనాకు చెందిన అలీబాబా సాధించింది. -
25 శాతం రిటైల్ జాబ్స్‌కు కొత్త నైపుణ్యాలు!!
ముంబై: రిటైల్ రంగంలోని ఉద్యోగ సిబ్బందిలో దాదాపు 20– 25 శాతం మందికి వచ్చే ఐదేళ్లలో కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి. ఫిక్కీ–నాస్కామ్, ఈవై సంయుక్త నివేదిక ప్రకారం.. గరిష్ఠంగా వినియోగించుకునేలా ఏర్పాటవుతున్న సరఫరా చైన్లు వచ్చే ఐదేళ్లలో రిటైల్ రంగంలో వృద్ధికి దోహదపడనున్నాయి. ఇది 95 శాతం మంది పరిశ్రమ నిపుణుల అభిప్రాయం కాగా... మధ్యతరగతి వర్గం పెరగటం, వ్యాపార ఆవిష్కరణలు వృద్ధికి కారణంగా నిలుస్తాయని 76 శాతం మంది నిపుణులు చెప్పారు. ‘ఈ–కామర్స్, మొబైల్ ఆధారిత ఈ–టెయిలింగ్ వంటి కొత్త బిజినెస్ మోడళ్లు టైర్–1, టైర్–2, టైర్–3 పట్టణాల్లో పాపులర్ అయ్యాయి. ఈ వృద్ధి ప్రభావం ఇప్పటికే జాబ్ మార్కెట్‌పై కనిపిస్తోంది’ అని ఈవైకు చెందిన అనురాగ్ మాలిక్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, వెబ్ అండ్ యాప్ డిజైన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కస్టమర్ సర్వీస్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్ వంటి వాటిల్లో కొత్త ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. -
దేశీ రిటైల్‌లోకి ‘బ్లాక్ స్టోన్’!
• నెక్సస్ మాల్స్ పేరిట ఇప్పటికే సొంత సబ్సిడరీ • నష్టాల్లో ఉన్న మాల్స్‌ను చేజిక్కించుకునే వ్యూహం • అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో భారీ మాల్స్ కొనుగోలు • ఏడాది చివరికల్లా మరిన్ని కొనుగోళ్లు; త్వరలో ప్రకటన? ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ భారత రిటైల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ వృద్ధి అవకాశాలున్న దేశీ రిటైల్ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం సొంతంగా నెక్సస్ మాల్స్ పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. కష్టాల్లో ఉన్న షాపింగ్ మాల్స్‌ను చేజిక్కించుకుని, మళ్లీ వాటిని లాభాలబాట (టర్న్‌ఎరౌండ్) పట్టించడంపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో ‘ఆల్ఫా వన్’ మాల్స్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 1.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంగల రిటైలింగ్ స్పేస్ ఈ మాల్స్‌కు ఉంది. ఈ ఏడాది చివరికల్లా మరికొన్ని షాపింగ్ సెంటర్లను దక్కించుకోవడం ద్వారా దీన్ని 2.4 మిలియన్ చదరపుటడుగులకు చేర్చాలని బ్లాక్‌స్టోన్ లక్ష్యిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 మాల్స్... పీఈ ఇన్వెస్ట్మెంట్లలో పేరొందిన బ్లాక్‌స్టోన్ అంతర్జాతీయంగా ఇప్పటికే రిటైల్ బిజినెస్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సంస్థకు 1,000కి పైగానే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అమెరికాలో తన అనుబంధ సంస్థ ‘బ్రిక్స్మార్’ సంస్థ ద్వారా రిటైల్ మాల్స్‌ను నడుపుతోంది. ఇక 14 యూరోపియన్ దేశాల్లో ‘మల్టీ’ అనే కంపెనీ ద్వారా వీటిని నిర్వహిస్తోంది. కాగా, భారత్‌లోకి ఎంట్రీని అధికారికంగా త్వరలో బ్లాక్‌స్టోన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి ఈ సంస్థ దిగ్గజ స్థానంలో ఉంది. ‘బ్లాక్‌స్టోన్ వంటి ఇన్వెస్టర్ రిటైల్ రంగంలోకి రావడం వల్ల ప్రస్తుతం ఉన్న మాల్స్ డెవలపర్లకు తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. దీంతో కొత్త వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు పెట్టుబడులు లభిస్తాయి. అంతేకాదు!! ఇలాంటి పెద్ద సంస్థల రాకతో మాల్ మేనేజ్మెంట్లో నైపుణ్యాలు పెరుగుతాయి’’ అని రియల్టీ పరిశోధన సంస్థ సీబీ రిచర్డ్స్ అండ్ ఎల్లీస్ ఇండియా రిటైల్ సర్వీసెస్ హెడ్ వివేక్ కౌల్ చెప్పారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే... భారత్‌లో జాతీయ స్థాయిలో గొలుసు కట్టు షాపింగ్ మాల్స్ ఉన్న సంస్థలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారీగానే డిమాండ్... భారత సంస్థాగత రిటైల్ రంగంలో డిమాండ్ జోరుగానే కొనసాగుతోందని... ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలైన మాసిమి డుటి, లాంగ్చాంప్, కోల్ హన్, హంకెమాలర్ వంటి రిటైల్ సంస్థలు ఇక్కడ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుండటమే దీనికి నిదర్శనమని సీబీఆర్ఈ తాజా నివేదిక తెలిపింది. మరోపక్క, జారా, హెచ్ అండ్ ఎం, గ్యాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటి దిగ్గజ బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, గ్లోబల్ రిస్క్ ఇన్వెస్టర్లు ఇక్కడి రిటైల్ అసెట్స్‌లో పెట్టుబడులకు కాస్త వెనుకంజ వేస్తున్నారని సంస్థ తెలియజేసింది. ‘‘భారత్‌లో షాపింగ్ మాల్ కార్యకలాపాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం, వినియోగదారుల వ్యవహారశైలిలో మార్పు తేవటం అనేది నెక్సస్ మాల్స్‌కు కీలకంగా నిలుస్తుంది. ఎందుకంటే వినియోగ వృద్ధి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మాల్స్ నిలదొక్కుకోవడం కష్టతరంగానే ఉంది’’ అని రిటైల్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిగ్ బజార్ భారీ విస్తరణ
* దేశవ్యాప్తంగా 2015లో 12 స్టోర్లు * తెలుగు రాష్ట్రాల్లో 4 ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్లను విస్తరిస్తోంది. 2015లో కొత్తగా 12 ఔట్లెట్లను తెరుస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టోర్లు రానున్నాయి. ఏప్రిల్‌కల్లా హైదరాబాద్ చందానగర్, రాజమండ్రిలో ఏర్పాటవుతున్నాయి. డిసెంబర్‌కల్లా హైదరాబాద్ టోలిచౌకి, గుంటూరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయని ఫ్యూచర్ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు ముంబై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్లో తెలిపారు. స్టోర్లు 40-70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కస్టమర్లకు వినూత్న షాపింగ్ అనుభూతి కల్పించేందుకు స్టోర్ల డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. 24 నుంచి సబ్ సే సస్తా..: ఈ నెల 24-26 వరకు ‘చవకైన 3 రోజులు’ పేరుతో భారీ డిస్కౌంట్లను బిగ్ బజార్ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు ఏ ఉత్పత్తులపట్ల మక్కువ చూపుతున్నారో అధ్యయనం చేసి అందుబాటులో ఉంచుతున్నట్టు బిగ్ బజార్ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. ఫ్యామిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్, మార్కెటింగ్ మేనేజర్ రితేష్‌తో కలిసి గురువారమిక్కడ ఆఫర్లను ప్రకటించారు. ఏటా జనవరిలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది సేల్‌లో 1 కోటి మంది కస్టమర్లు షాపింగ్ చేశారని పేర్కొన్నారు. -
ఎన్ని వేల కోట్లు చేతులు మారాయి?
బాబు సర్కారుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతి తెలిపే బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో విప్ జారీ చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌లో అందుకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని వేల కోట్లు చేతులు మారితే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. రిలయన్స్, వాల్‌మార్ట్, ఐటీసీ, లైఫ్‌స్టైల్ తదితర కంపెనీల ప్రతినిధులు సీఎంను కలిసి రాష్ట్రంలో రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు అనుమతి కోరిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించడం శోచనీయమన్నారు. గతంలో పార్లమెంట్లో వీటిని వ్యతిరేకించి ఇప్పుడు అనుమతిస్తామని చెప్పటం ఏమిటని నిలదీశారు. 2012లో పార్లమెంట్లో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ సైతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిందన్నారు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులిస్తున్నామని కూడా బాబు ప్రకటించారన్నారు. పార్లమెంట్లో చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన దివంగత ఎర్రన్నాయుడు బిల్లుపై అభ్యంతరం తెలిపారని గుర్తుచేశారు. -
భారత్‌లో జోరుగా రిటైల్ రంగం: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ రంగం జోరుగా ఉందని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యూసీ) వెల్లడించింది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా: ద విన్నింగ్ లీప్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. 2020 కల్లా భారత రిటైల్ రంగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందంటున్న ఈ నివేదిక ప్రకారం.. భారత రిటైల్ రంగంలో 92% వాటా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. వీటిల్లో ఎక్కువ భాగం చిన్న కిరాణా షాపులదే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. అయితే మొత్తం రిటైల్ మార్కెట్లో వ్యవస్థీకృత రిటైల్ రంగం వాటా భారత్‌లో తక్కువగా ఉంది. భారత్‌లో ఇది 8% ఉండగా, అమెరికాలో 85%, ఇంగ్లాండ్‌లో 80%, థాయ్‌లాండ్‌లో 40%, చైనాలో 20%,గా ఉంది. భారత్‌లో వ్యవస్థీకృత రిటైల్ రంగం ఏడాదికి 24 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. 2034 కల్లా 50 శాతానికి చేరుతుంది. -
లైఫ్ కథా చిత్రమ్
‘మేరీకోమ్’ కథ మాదిరిగా నా బయోగ్రఫీపై సినిమా తీస్తామంటూ కొందరు కలిశారు. అయితే ఇప్పటికిప్పుడు నా లైఫ్ స్టోరీ తెరకెక్కాలని కోరుకోవట్లేదు. ఒకవేళ సినిమాగా తీస్తే.. నా పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సరిగ్గా సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గురువారం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఫ్యాబ్బి (ఫ్యాబులస్ అండ్ బియాండ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ లోగోను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆవిష్కరించింది. ఫర్నిచర్ తయారీలో పేరొందిన జేఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ ద్వారా రిటైల్ రంగంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో సానియా మాట్లాడుతూ- ‘కుటుంబంతో తాజ్‌మహల్ వీక్షించడం లైఫ్‌లో మరచిపోలేని అనుభూతి. ఫాబ్బి కంపెనీ తీరు నచ్చాకే బ్రాండ్ అంబాసిడర్‌గా ఓకే చెప్పాను. ఆటలో రాణించాలంటే కఠోర సాధనతో పాటు ఫిట్నెస్ అవసరం’ అని వివరించింది. ఈ ఈవెంట్‌కు గంట ఆలస్యంగా వచ్చిన సానియా.. టాఫిక్ జామ్ వల్ల సకాలంలో చేరుకోలేకపోయానని వివరణనిచ్చింది. - సాక్షి, సిటీ ప్లస్ -
అత్యున్నత కెరీర్‌కు.. ప్యా‘కింగ్’
ప్యాకేజింగ్.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ కెరీర్. మనం ఉదయాన లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాడే ప్రతి వస్తువునూ గమనించండి.. ప్యాకింగ్ లేని వస్తువు ఏదైనా ఉందేమోనని. ఒక్కటి కూడా కనిపించదు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది.. ప్యాకేజింగ్. నగరం కేంద్రంగా ఎన్నో కంపెనీలు వివిధ చిన్నా, పెద్ద వస్తువులను తయారు చేస్తున్నాయి. వీటి తయారీ ఒకెత్తయితే.. ఆయా వస్తువులు వినియోగదారుడిని ఆకట్టుకునేలా ప్యాక్ చేయడం మరో ఎత్తు. ఈ కారణంతో కంపెనీలు ప్యాకింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ప్యాకేజింగ్ రంగంలో నిష్ణాతులను నియమించుకుని భారీ స్థాయిలో వేతనాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వంటివి ప్యాకింగ్‌లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే ఏ రంగానికీ తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అవకాశాలెన్నో.. అందిపుచ్చుకునేవారేరీ? గుండుసూది మొదలుకొని టూత్ పేస్టులు, సబ్బులు, పౌడర్లు, సెంట్లు, షేవింగ్ సామగ్రి, దుస్తులు, బూట్లు, చెప్పులు, స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలు, పిల్లలాడుకునే బొమ్మలు, అగర్బత్తీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు, వివిధ వ్యాధుల నివారణ మందులు, రైతులు పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు,.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రతిదానికీ ప్యాకింగ్ ఉండాల్సిందే. అందుకే ఏ రంగానికైనా ఆర్థిక మాంద్యం ఉందేమో కానీ.. ప్యాకేజింగ్ రంగానికి లేదు. సమయంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులూ ఉద్యోగాలందించే విభాగం ప్యాకేజింగ్. మన దేశంలో చిన్నా, పెద్దా అన్నీ కలుపుకుని దాదాపు 22,000 వరకు ప్యాకేజింగ్ కంపెనీలుంటాయని అంచనా! నగరాల్లో ప్రతి ప్రాంతంలోనూ రిటైల్ మాల్స్ ఏర్పాటు చేసిన కంపెనీల దృష్టి ఇప్పుడు ఓ మాదిరి పట్టణాలపై కూడా పడింది. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్.. రిటైల్ రంగానికి దీటుగా వర్థిల్లుతోంది. నేటి బిజీ జీవితంలో దుకాణానికి వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చే తీరిక, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఈ నే పథ్యంలోనే అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. వస్తువులను ఆయా వినియోగదారులు ఉన్నచోటకి సురక్షితంగా, చెడిపోకుండా పంపాలంటే తగిన ప్యాకింగ్ తప్పనిసరి. ఇలా అటు రిటైల్ రంగంలోనూ, ఇటు ఈ-కామర్స్ కోణంలోనూ ప్యాకేజింగ్ నిపుణులకు అవకాశాలకు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. 2011 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ప్యాకేజింగ్ మార్కెట్‌గా భారత్ నిలిచింది. 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. వచ్చే నాలుగు, ఐదేళ్లలో ఏటా ఈ రంగం 12.3 శాతం వృద్ధిరేటుతో పురోగమించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ప్యాకేజింగ్‌లో విభాగాలు ప్యాకేజింగ్ అంటే వస్తువులను ప్యాకింగ్ చేయడం మాత్రమే కాదు. ఇందులో మరెన్నో విభాగాలు ఉంటాయి. ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులను పరిశీలించడం, ఆయా వస్తువులకు సరిపోయే ప్యాకేజింగ్ పద్ధతులను ఎంపిక చేయడం, వినియోగదారుడిని ఆకట్టుకునే డిజైన్‌ను రూపొందించడం, ఆ ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుందో..లేదో పరీక్షించడం, ప్యాకింగ్ నాణ్యతను పరిశీలించడం, పర్యావరణానికి హాని కలిగించని వాటిని ఉపయోగించడం, ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, పోటీ సంస్థలను అధిగమించడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. ఇలా ప్యాకేజింగ్ రంగంలో ఎన్నో విభాగాలు.. అందులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలుంటాయి. స్వయం ఉపాధికి సమృద్ధిగా అవకాశాలున్న రంగం.. ప్యాకేజింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ రంగంలో.. నిష్ణాతులను అందించడానికి, ప్యాకేజింగ్ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య మంత్రిత్వశాఖ 1966లో ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ). ఆహార, వాణిజ్య, ఫార్మా, ఇతర రంగాల కంపెనీల ఉత్పత్తులకు పటిష్ట ప్యాకేజింగ్ రూపొందించడం.. విదేశాలకు ఎగుమతయ్యే ఆహార వస్తువులు, పదార్థాలు, రసాయనాలు, ఆభరణాలకు ప్యాకేజింగ్ చేసే నిష్ణాతులను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం. ముంబై ప్రధాన క్యాంపస్‌గా దేశవ్యాప్తంగా ఐఐపీకి మరో 4 క్యాంపస్‌లున్నాయి. అవి. హైదరాబాద్ (సనత్‌నగర్), ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. ఈ సంస్థ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేయడంలో దేశవ్యాప్తంగా పేరుగాంచింది. వెబ్సైట్: www.iip-in.com ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఏ ఫుల్‌టైం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్ వ్యవధి: 3 నెలలు. అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక విధానం: మొదట వచ్చినవారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. ఏ ఫుల్‌టైం పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ వ్యవధి: రెండేళ్లు. మొత్తం సీట్లు: హైదరాబాద్ క్యాంపస్‌లో 60, ముంబైలో 80, ఢిల్లీ-80, కోల్‌కతా-60 అర్హత: సైన్స్/ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్/సంబంధిత సబ్జెక్టులలో ద్వితీయశ్రేణిలో గ్రాడ్యుయేషన్ (12+3) విధానంలో ఉత్తీర్ణత. ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరు పర్సనల్ ఇంటర్వ్యూ నాటికి ఉత్తీర్ణులై ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, ప్రవేశపరీక్ష, మౌఖిక పరీక్షల ఆధారంగా. ప్రవేశపరీక్షను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు. మౌఖిక పరీక్ష ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులపై గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. ఇవేకాకుండా దూరవిద్య విధానంలో కూడా ఐఐపీ కోర్సులు నిర్వహిస్తోంది. ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌కు పార్ట్‌టైం, వీకెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ద్వారా.. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్)’ ద్వారా మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. హైదరాబాద్ (రామంతాపూర్)లో ఉన్న జేఎన్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత విద్యార్థులందరికీ దాదాపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారు. కోర్సుల్లో ఏం నేర్పుతారు? కంపెనీలు, పరిశ్రమలు ఏ ఉత్పత్తిని బయటకు తీసుకువచ్చినా... వాటిని వినియోగదారుడు ఇష్టపడేలా చేయడంలో ప్యాకేజింగ్‌దే కీలకపాత్ర. ప్యాకేజీ ఎంత బాగుంటుందనేదానిపైనే అమ్మకాలు ఆధారపడి ఉంటాయి. అందుకే కోర్సులో ప్యాకేజింగ్ అంటే? దాని అవసరం? అందులో దశలు? ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం? కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి? ఆహార పదార్థాలకు అనువైన ప్యాకేజింగ్ ఏది? ఏ మోతాదులో చేయాలి? వంటివి నేర్పుతారు. డిమాండ్ ఉన్న కెరీర్ ఢిల్లీ మార్కెట్ నుంచి గల్లీ మార్కెట్ వరకు వివిధ వస్తువులు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. ఈ వస్తువులు వినియోగదారులను ఆకర్షించడానికి పొందికైన, ఆకర్షణీయమైన ప్యాకింగ్ తప్పనిసరి. ఈ రంగంలో డిమాండ్‌కు తగిన విధంగా నిపుణులు లేరు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ కోర్సు ఉత్తీర్ణుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల్లో సైతం వీరికి మంచి అవకాశాలున్నాయి. ప్రారంభంలోనే భారీ వేతనాలు అందుకోవచ్చు. ఓ మాదిరి కంపెనీల్లో రూ.25,000 నుంచి వేతనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి లక్షల్లో సంపాదించొచ్చు. ఈ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత ఆర్థిక స్థోమత ఉంటే సొంతంగా ప్యాకేజింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కెరీర్లో మరింత రాణించొచ్చు. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీలు: ఐఐపీలో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు ఇవ్వడానికి వివిధ కంపెనీలు పోటీపడుతున్నాయి. వాటిలో హరిత-ఎన్టీఐ, నెస్లే ఇండియా లిమిటెడ్, ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్, క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్, క్యాస్ట్రాల్, కోకాకోలా, సిప్లా, డాబర్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, గుజరాత్ గ్లాస్ లిమిటెడ్, హిమాలయ డ్రగ్, హిందూస్థాన్ యూనిలీవర్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐటీసీ, జాన్సన్ అండ్ జాన్సన్, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్, మాట్రిక్స్, ది పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలున్నాయి. ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్! శ్రీతయారీ, రిటైల్ రంగంలో అభివృద్ధి నేపథ్యంలో ప్యాకేజింగ్ విభాగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఉత్పత్తులు విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ నిపుణుల కృషి ఎంతో ఉంటుంది. కాబట్టి మెకానికల్, ఫార్మాస్యూటికల్, ఫెర్టిలైజర్, అగ్రికల్చర్, టాయ్స్తోపాటు దాదాపు అన్ని పరిశ్రమలూ ప్యాకేజింగ్ టెక్నోక్రాట్స్‌ను నియమించుకుంటున్నాయి. వీరికి కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇతర ఉద్యోగాల్లో మాదిరి ప్యాకేజింగ్ కొలువుల్లోనూ వివిధ స్థాయిలుంటాయి. గ్రౌండ్ లెవల్ టెక్నీషియన్లు, సూపర్వైజర్లుగా ప్యాకేజింగ్ కంపెనీల్లో చేరొచ్చు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ తర్వాత ఒకేషనల్, స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ప్యాకేజింగ్ ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్‌గా పేర్కొనొచ్చు. ఉత్పత్తుల డిజైన్‌కు అనుగుణంగా ఉండేలా స్ట్రక్చరింగ్ కోసం ఇంజనీరింగ్ దృక్పథం తోడ్పడుతుంది. ప్రారంభంలోనే ఏడాదికి కనీసం రూ.3 లక్షల వేతనం లభిస్తోంది. ప్యాకేజింగ్‌లో శిక్షణ పొందిన వారు ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించొచ్చ్ణు - ఎ.వి.పి.ఎస్. చక్రవర్తి, ైచైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్- హైదరాబాద్ బ్రాంచ్. -
మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐని అనుమతించం
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ప్రభుత్వం అనుమతించబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ‘ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు..’ అని మోడీ సర్కార్ ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఈ రంగంలో ఎఫ్డీఐపై బీజేపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించి ఎన్నికల్లో నెగ్గిందని అన్నారు. మునుపటి యూపీఏ ప్రభుత్వం మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐని అనుమతించగా, బీజేపీ వ్యతిరేకించింది. అయితే, యూపీఏ విధానానికి స్వస్తిపలికే చర్యలను మోడీ సర్కార్ ఇప్పటివరకు చేపట్టలేదు. యూకేకు చెందిన టెస్కో పెట్టుబడి ప్రతిపాదనను మాత్రమే యూపీఏ హయాంలో అనుమతించారు. ఈ-కామర్స్‌లోనూ అంగీకరించం... మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో ఏ రూపంలోనూ ఎఫ్‌డీఐని అనుమతించేది లేదనీ, ఈ-కామర్స్ రూట్లో కూడా ఒప్పుకోబోమనీ నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి ప్రశ్నించగా, ఈ విషయంపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయనీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ బదులిచ్చారు. కాగా, నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. మేధో హక్కులపై త్వరలో పాలసీ మేధో సంపత్తి హక్కుల(ఐపీఆర్)ను మరింత సమర్థవంతంగా అమలుచేసేదిశగా 6 నెలల్లో కార్యాచరణ విధానాన్ని(పాలసీ)ని ప్రకటించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘భారత్‌కు ప్రస్తుతం ఐపీఆర్ పాలసీ లేదు. తొలిసారిగా మేం దీన్ని అమల్లోకి తీసుకురానున్నాం. ఫార్మా ఇతరత్రా కొన్ని రంగాల్లో మన మేధో హక్కులను కూడా పరిరక్షించుకోవాలంటే తగిన పాలసీ అవసరం. మరోపక్క, అమెరికాతో ఐపీఆర్ విషయంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వీటన్నింటికీ సరైన విధానం ఒక్కటే పరిష్కారమార్గం’ అని పేర్కొన్నారు.