భారత్‌లో జోరుగా రిటైల్ రంగం: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ రంగం జోరుగా ఉందని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యూసీ) వెల్లడించింది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా: ద విన్నింగ్ లీప్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. 2020 కల్లా భారత రిటైల్ రంగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందంటున్న ఈ నివేదిక ప్రకారం.. భారత రిటైల్ రంగంలో 92% వాటా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది.
వీటిల్లో ఎక్కువ భాగం చిన్న కిరాణా షాపులదే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. అయితే మొత్తం రిటైల్ మార్కెట్లో వ్యవస్థీకృత రిటైల్ రంగం వాటా భారత్‌లో తక్కువగా ఉంది. భారత్‌లో ఇది 8% ఉండగా, అమెరికాలో 85%, ఇంగ్లాండ్‌లో 80%, థాయ్‌లాండ్‌లో 40%, చైనాలో 20%,గా ఉంది. భారత్‌లో వ్యవస్థీకృత రిటైల్ రంగం ఏడాదికి 24 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. 2034 కల్లా 50 శాతానికి చేరుతుంది.