PWC
-
కంపెనీ కార్యకలాపాలకు ‘మెటావర్స్’ - పీడబ్ల్యూసీ ఇండియా ఏం చెబుతుందంటే?
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించే ప్రణాళికతో ఉన్నాయి. ఈ విషయాన్ని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. మెటావర్స్ అనేది సంస్థ ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాలను కస్టమర్ ఉన్న చోట నుంచే వర్చువల్‌గా చూపించే టెక్నాలజీ. మెటావర్స్‌తో సంప్రదింపులు చేస్తున్న కంపెనీల్లో అధిక శాతం ఏడాదిలోనే తమ కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పాయి. మెటావర్స్ పట్ల తమకు సరైన అవగాహన ఉన్నట్టు 60 శాతం వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు (ఉన్నతోద్యో గులు) చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 కంపెనీల ప్రతినిధులను పీడబ్ల్యూసీ సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ‘‘మెటావర్స్‌తో అవకాశాలు అపారం. మెటావర్స్‌తో విశేషమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. వివిధ ప్రాంతాలు, తరాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు నూతన టెక్నాలజీ పట్ల అనుకూలంగా ఉన్నారు. దీంతో కంపెనీలు మెటావర్స్ సాంకేతికత అమలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్నర్ అశుతోష్ చాంద్ తెలిపారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు మెటావర్స్ విషయంలో కంపెనీలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాల కోసం సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. ఆరంభ దశలో.. మెటావర్స్ సాంకేతికత భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉన్నట్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 25 శాతం మంది తాము ఏడాదిలోపే మెటావర్స్‌తో తమ కార్యకలాపాలను అనుసంధానిస్తామని చెప్పగా, 47 శాతం కంపెనీల ప్రతినిధులు 2–3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. కస్టమర్లతో అర్థవంతంగా సంప్రదింపులు చేసేందుకు వీలుగా కంపెనీలకు మెటావర్స్ వినూత్న అవకాశం కల్పిస్తుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్త ఘోష్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది సైబర్ సెక్యూరిటీ వ్యాపారాలకు పెద్ద రిస్క్ అని చెప్పగా, 28 శాతం కంపెనీల ప్రతినిధులు టెక్నాలజీ పరిమితులను సవాలుగా పేర్కొన్నారు. -
పీడబ్ల్యూసీలో 30,000 నియామకాలు
న్యూఢిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో సుమారు 30,000 మంది సిబ్బందిని తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ చైర్మన్ బాబ్ మోరిట్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 31,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ చైర్మన్ జాన్–పాస్కల్ ట్రైకోయిర్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ తమకు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పురోగమించేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
జీవితాంతం వర్చువల్‌గానే..! ఎక్కడనుంచైనా పనిచేయండి..!ఉద్యోగులకు బంపర్ఆఫర్..!
కరోనా రాకతో ఉద్యోగులు పూర్తిగా ఇంటికే పరిమితమైనా విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. కోవిడ్-19 ఉదృత్తి కాస్త తగ్గిపోవడంతో పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తున్నారు. మరికొన్ని కంపెనీలు కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులు కార్యాలయాలకు కచ్చితంగా రావాలని హుకుంను జారీ చేశాయి. ఆఫీస్‌లకు అవసరం లేదు కానీ...! తాజాగా ప్రముఖ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రైజ్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) తన కంపెనీలో పనిచేసే 40 వేల యూఎస్ క్లయింట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులు జీవితాంతం ఆఫీస్‌లకు రానవసరం లేకుండా ఎక్కడినుంచైనా వర్చువల్‌గా పనిచేయవచ్చునని పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. పీడబ్య్లూసీ కాకుండా ఇతర ప్రధాన అకౌంటింగ్ సంస్థలు, డెలాయిట్ , కేపీఎమ్‌జీ కూడా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులను రిమోట్‌గా పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. చదవండి: నాడు కాలినడక.. నేడు అపరకుబేరుడు! పీడబ్య్లూసీ డిప్యూటీ పీపుల్ లీడర్, యోలాండా సీల్స్-కాఫీల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... క్లయింట్ సర్వీస్ ఉద్యోగుల కోసం పూర్తి సమయం వర్చువల్ వర్క్ అందించే తొలి సంస్థగా పీడబ్ల్యూసీ నిలిచిందన్నారు. హ్యూమన్ రిసోర్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగులు ఇప్పటికే దాదాపు పూర్తి సమయం పనిచేసే అవకాశాన్ని కలిగి ఉన్నారు. వర్చువల్‌గా పనిచేసే ఉద్యోగులు ఒక నెలలో మూడు రోజుల పాటు కచ్చితంగా ముఖ్యమైన క్లయింట్ మీటింగ్‌లకోసం, లెర్నింగ్ సెషన్ల కోసం ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాలనే షరతును తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని కంపెనీ డిప్యూటీ లీడర్ సీల్స్-కాఫీల్డ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వర్చువల్ ఉద్యోగాలను చేస్తున్నవారి వేతనాల పెంపుకు అడ్డంకిగా మారేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 284,000 మంది పనిచేస్తోంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! -
పీడబ్ల్యూసీ రూ.1,600 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ భారత్‌లో వచ్చే అయిదేళ్లలో రూ.1,600 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. అదనంగా 10,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించింది. ఈ కాలంలో క్యాంపస్‌ల ద్వారా నియామకాలను అయిదురెట్లకుపైగా పెంచనున్నట్టు వివరించింది. డిజిటల్, క్లౌడ్, సైబర్, అనలిటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగాల్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. న్యూ ఈక్వేషన్ పేరుతో నూతన వ్యాపార వ్యూహాన్ని ప్రకటించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. మారుతున్న పోకడలు, వేలాది క్లయింట్లు, భాగస్వాములతో సంప్రదింపుల తదనంతరం ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు వివరించింది. ‘భారతదేశం బలమైన ఆర్థిక మూల సిద్ధాంతాలను కలిగి ఉంది. జనాభా రూపంలో భారీ ప్రయోజనాలు, ఆవిష్కరణను పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. మా కొత్త వ్యూహం సంస్థకు, ఖాతాదారులకు, దేశ ఆర్థికాభివృద్ధిని మరింతగా పెంచడానికి.. అలాగే దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, సమాజానికి ఎక్కువ అవకాశాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ సంజీవ్ క్రిషన్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో సంస్థకు 15,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులు, భాగస్వాముల నైపుణ్య శిక్షణకు ఆదాయంలో కనీసం 1 శాతం వెచ్చిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 155 దేశాల్లో సంస్థ విస్తరించింది. 2,84,000ల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. -
ఉద్యోగులకు పీడబ్ల్యూసీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న తరుణంలో ఆర్థిక సేవలందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. బోనస్‌లు ప్రమోషన్లను అక్టోబర్1 2020న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ గత సంవత్సరాలతో పోలిస్తే వేతనాలు, ప్రమోషన్లు కొంత మేర తగ్గవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా సంస్థ క్లయింట్లకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని పీడబ్లుసీ చీఫ్ పబ్లిక్ అధికారి పద్మజ అలగానందన్ తెలిపారు. మరోవైపు తమ సంస్థ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రేటింగ్ సాధించిందని పద్మజ పేర్కొన్నారు. (చదవండి: లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే) -
లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే
సాక్షి, బిజినెస్ బ్యూరో : రియల్టర్లు లాభాలతోపాటు విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించాలని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అసోసియేట్ డైరెక్టర్ మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ సూచించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్‌ఏఆర్) ఇండియా 11వ కన్వెన్షన్ శనివారమిక్కడ ప్రారంభమైంది. ‘గేమ్ చేంజర్’థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదేదీ ఉండదని, తాను జీవితంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నానని తెలిపారు. దేశంలోనే నాల్గవ అతిపెద్ద సంస్థ అయిన పీడబ్ల్యూసీ ఇండియా కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికి 12 సార్లు 10 కే మారథాన్‌లో పాల్గొన్నానని, 20కే మారథాన్‌లో పాల్గొనాలనేది లక్ష్యమని తెలిపారు. సంస్థ ఎదుగుదలలో హైదరాబాద్ పాత్ర ఎన్‌ఏఆర్ ఇండియా చైర్మన్ రవివర్మ మాట్లాడుతూ ఎన్‌ఏఆర్ ఇండియా రియల్టీ పరిశ్రమలోని రియల్టర్లు, స్టేక్ హోల్డర్స్, ఏజెంట్ల గొంతును సమాజానికి వినిపించే సారథిగా పనిచేస్తుందని, పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. రెరా చట్టం తీసుకురావడంలో నార్ ఇండియా ముఖ్య భూమిక పోషించిందన్నారు. ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్ ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ వాటా 17–18% ఉంటుందన్నారు. దీనిపై 250కి పైగా అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయని, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించేది నిర్మాణ రంగమేనన్నారు. నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు కో–లివింగ్, కో–వర్కింగ్, వేర్‌హౌసింగ్ విభాగాలకు డిమాండ్ పెరుగుతోందని, రియల్టర్లు వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాదీ 2019–20 ఏడాదికి గాను ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ సుమంత్ రెడ్డి అర్నాని నియమితులయ్యారు. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) హోస్టింగ్‌గా వ్యవహరించిన దీనిలో కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) , నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి 1,500 మంది రియల్టర్లు పాల్గొన్నారు. ఎన్‌ఏఆర్ ఇండియాలో 16 రాష్ట్రాల్లో 48 చాప్టర్లలో 30 వేలకు పైగా సభ్యులున్నారు. -
బ్రిటన్ను మించనున్న భారత్!!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఈసారి బ్రిటన్ను భారత్ అధిగమించవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2017లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఆరో అతి పెద్ద ఎకానమీగా అవతరించింది. బ్రిటన్ అయిదో స్థానంలో ఉంది. అయితే, ఇక తాజా పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం భారత్ అయిదో స్థానానికి, ఫ్రాన్స్ ఆరో స్థానానికి చేరనుండగా.. బ్రిటన్ ఏడో స్థానానికి పడిపోనుంది. 2017లో బ్రిటన్ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుగాను, ఫ్రాన్స్ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలోనూ నమోదయ్యాయి. ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఒకే స్థాయి అభివృద్ధి, జనాభా తదితర అంశాల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్‌ల స్థానాలు అటూ, ఇటూ అవుతూ ఉంటాయని.. కానీ భారత్ మాత్రం ర్యాంకిగ్ పెంచుకుంటూనే ఉందని పీడబ్ల్యూసీ తెలిపింది. గ్లబల్ ఎకానమీ వాచ్ పేరిట రూపొందించిన బీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. 2019లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.6 శాతంగా ఉండనుండగా, ఫ్రాన్స్‌ది 1.7 శాతంగాను, బ్రిటన్‌ది 1.6 శాతంగాను వృద్ధి నమోదు కానుంది. ‘అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, చమురు సరఫరాపరమైన షాక్లేమీ లేకపోతే 2019–20లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చు. కొత్తగా అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ), కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తొలి ఏడాదిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు అధిక వృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది‘ అని పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపం చ ఎకానమీపై ప్రభావం చూపే అంశాల ఆధారంగా పీడబ్ల్యూసీ ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. -
సత్యం వ్యవహారం..
పీడబ్ల్యూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు! న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటింగ్ అవకతవకలకు సంబంధించి ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌పై (పీడ్లూ్యసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్కి ఆడిటింగ్ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009 జనవరిలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో పీడబ్ల్యూసీకి సెబీ షోకాజ్ నోటీసులిచ్చింది. తాము సెబీ పరిధిలోకి రామంటూ పీడబ్ల్యూసీ .. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పీడబ్ల్యూసీ నిర్ధారించిన బ్యాలెన్స్ షీట్ల ఆధారంగానే సత్యం కంప్యూటర్స్‌లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు.. దాని వైఖరి కారణంగా నష్టపోయారంటూ సెబీ వాదించింది. ఫలితంగా షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సెబీకి పూర్తి అధికారాలు ఉంటాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అప్పట్నుంచీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆరునెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించడంతో సెబీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. మే–జూన్‌లో పీడబ్ల్యూసీ వర్గాలను పలు దఫాలుగా విచారించింది. అటు ప్రభుత్వం నుంచి కూడా సెబీకి పీడబ్ల్యూసీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిశీలించాలని కేంద్రం సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
2040 నాటికి అమెరికాను అధిగమించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– పీడబ్ల్యూసీ అంచనావేసింది. కొనుగోలు శక్తి వైవిధ్యం (పీపీపీ) ప్రాతిపదికన 2040 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్నది తమ అంచనాగా వివరించింది. అంతర్జాతీయ ఆర్థికవేదిక వచ్చే కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్థమాన దేశాలవైపునకు మారుతుందని నివేదిక అంచనా. వచ్చే 34 సంవత్సరాల్లో బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీలతో కూడిన ఈ–7 దేశాల వార్షిక వృద్ధి సగటు 3.5 శాతంగా ఉంటుందని వివరించింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ7 దేశాల విషయంలో ఈ రేటు కేవలం 1.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. -
మెట్టు దిగిన భారత్ మార్కెట్
• ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి • దేశంలో పెట్టుబడులకు తగ్గిన ఆసక్తి • పీడబ్ల్యూసీ అంతర్జాతీయ సీఈఓల సర్వే దావోస్: అవకాశాలతో భారత్ ఊరిస్తోంది. వచ్చే 12 నెలల కాలానికి వృద్ధి అవకాశాలతో అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లను ఆకర్షిస్తున్న మార్కెట్లలో భారత్ ఆరో స్థానంలో ఉంది. కానీ, ఇది గతేడాది కంటే ఓ మెట్టు తక్కువే. గతేడాది టాప్ 5లో భారత్‌కు చోటు లభించింది. వృద్ధికి అవకాశాలున్నా...దేశంలో పెట్టుబడుల ఆసక్తి మూడేళ్లుగా తగ్గిపోయింది. పీడబ్ల్యూసీ నిర్వహించిన వార్షిక అంతర్జాతీయ సీఈవోల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దావోస్‌లో ఈ సంస్థ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అత్యధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్‌గా అమెరికా నంబర్ 1 స్థానంలో ఉంది. 43 శాతం సీఈవోలు ఇందుకు అనుకూలంగా ఓటేశారు. చైనా (33 శాతం ఓటు), జర్మనీ (17 శాతం), బ్రిటన్ (15 శాతం), జపాన్ (8శాతం), ఇండియా (7 శాతం) వరుస స్థానాల్లో ఉన్నాయి. సంస్థాగత సంస్కరణలు నిదానంగా పట్టాలెక్కడం, కరెన్సీ విలువల్లో క్షీణత వంటివి దేశంలో పెట్టుబడుల విషయంలో సీఈవోల ఆసక్తి సన్నగిల్లడానికి కారణాలు. అయితేనేమి, బలమైన వృద్ధి, ద్రవ్య, విధానపరమైన సంస్కరణలతో భారత్ టాప్ 6లో చోటు దక్కించుకోవడం విశేషం. ముఖ్యాంశాలు... ⇔ తాజా సర్వే ప్రకారం పెట్టుబడులకు అమెరికా, జర్మనీ, బ్రిటన్ ప్రాధాన్య దేశాలు కాగా, భారత్, బ్రెజిల్, రష్యా, అర్జెం టీనా విషయంలో పెట్టుబడుల ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ⇔ ఈ ఏడాదికి సంబంధించి ఎంతో ఆందోళనతో ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సీఈవోలు పేర్కొన్నారు. అయినప్పటికీ 38% సీఈవోలు వచ్చే 12 నెలల కాలంలో తమ కంపెనీల వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ⇔ ప్రపంచ ఆర్థిక రంగం ఈ ఏడాది పుంజుకుంటుందని 29 శాతం మంది చెప్పారు. ⇔ రక్షణాత్మక, వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధి అనే ధోరణి పెరిగిపోతుందన్న ఆందోళన సీఈవోల మాటల్లో వ్యక్తమైంది. 59% మంది రక్షణాత్మక వైఖరి పెరిగిపోతుండటంపై ఆందో ళన వ్యక్తం చేశారు. అమెరికా, మెక్సికోల్లో ఇలా భావిస్తున్న సీఈవోల శాతం 64గా ఉంది. ట్రంప్‌తో తిరోగమనం, బ్రెగ్జిట్ ఈయూ నుంచి తప్పుకోవడం వంటి ఆందోళన పరిచే అంశాలున్నప్పటికీ అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు ఉండటం ఊరట కలిగించేదే. దేశీయ సీఈవోల్లో ఆశావాదం వచ్చే ఏడాది కాలంలో తమ కంపెనీలు వృద్ధిని కొనసాగిస్తాయన్న నమ్మకాన్ని భారత్‌లో 71 శాతం సీఈవోలు వ్యక్తం చేయడం విశేషం. గతేడాది ఇదే అంశంపై 33 పాయింట్లు రాగా, ఈ ఏడాది సర్వేలో 38 పాయింట్లు వచ్చాయి. ‘‘భారత ఆర్థిక రంగం పట్ల ఉన్న విశ్వాసం తమ కంపెనీలు వృద్ధి చెందుతాయన్న సీఈవోల ఆశావాదంతో ప్రస్ఫుటమైంది. అయితే, నైపుణ్య మానవ వనరుల అందుబాటు, టెక్నాలజీల కారణంగా ఎదురవుతున్న నష్టం అనేవి ఆందోళన కలిగించే అంశాలు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ అన్నారు. అసమానతలు పెరిగాయ్: మిట్టల్ కంపెనీలు సమాజం వైపూ చూడాలని సూచన దావోస్: గత దశాబ్ద కాలంలో అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయని ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ మిట్టల్ అన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో భాగంగా ‘భవిష్యత్ భారీ వ్యాపారాలు’ అన్న అంశంపై మిట్టల్ ప్రసంగించారు. దాతృత్వ కార్యక్రమాలు కంపెనీలను వినియోగదారులకు చేరువ చేస్తాయన్నారు. ‘‘నేడు ప్రపంచం ఉద్యోగాల్లేని వృద్ధిని చూస్తోంది. దాతృత్వ కార్యక్రమాలు హృదయానికి సంబంధించినవే. కానీ, వీటి వల్ల వినియోగదారులు మిమ్మల్ని మరింత సానుకూలంగా చూస్తారు. భారత్‌లో కంపెనీలు తమ లాభాల్లో 2% నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని మిట్టల్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో అవకాశాలు: గుర్నానీ ఆధునిక ఆవిష్కరణలైన ఆటోమేషన్ (యాంత్రీకరణ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ స్సు)లను అవకాశాలుగా మలుచుకోవాలని ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా సీఈవో అయిన సీపీ గుర్నానీ సూచించారు. అయితే, ఈ విభాగాలకు సంబంధించిన నైపుణ్యాలను అలవరుచుకోవడమే ఓ సవాల్ వంటిదన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎవరైనా అనుసరించకుంటే వారు ఇంటెలిజెంట్ కారని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, నూతన ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయన్న మాటలను ఆయన కొట్టిపడేశారు. -
వృద్ధిపై మన సీఈవోల విశ్వాసమే మెండు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సీఈవోలతో పోలిస్తే భారతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) వారి కంపెనీల పనితీరు, వృద్ధిపై అధిక విశ్వాసంగా ఉన్నారు. పీడబ్ల్యూసీ 19వ వార్షిక గ్లోబల్ సీఈవో సర్వే (ఇండియా నివేదిక) ప్రకారం.. వచ్చే ఏడాది కాలంలో వారి వారి కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది భారతీయ సీఈవోలు అంచనా వేశారు. ఇక కంపెనీల వృద్ధిపై ఆశావహంగా ఉన్న అంతర్జాతీయ సీఈవోలు 35 శాతంగా మాత్రమే ఉన్నారు. వృద్ధి మార్కెట్లలో గ్లోబల్ సీఈవోల ర్యాంకింగ్‌లో గతేడాది 6వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. గత మూడేళ్లలో కన్నా ఈ ఏడాది వృద్ధి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని 75 శాతం మంది సీఈవోలు తెలిపారు. వేగవంతమైన టెక్నాలజీ మార్పు కంపెనీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని 79 శాతం మంది పేర్కొన్నారు. దాదాపు 70 శాతం మంది సీఈవోలు వచ్చే ఏడాది కాలంలో సిబ్బంది పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తుంటే, 89 శాతం మంది సీఈవోలు సిబ్బంది అధికారాలు, సంక్షేమానికి పెద్దపీట వేయడం గురించి ఆలోచిస్తున్నారు. -
భారత్ దూసుకుపోతుంది..
పీడబ్ల్యూసీ అంచనా న్యూఢిల్లీ: వర్థమాన దేశాల్లో భారత్ మంచి పనితీరు కనబరుస్తుందని, వృద్ధి విషయంలో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ తెలిపింది. ఈ ఏడాది భారత్ 7.7 శాతం వృద్ధిని సాధిస్తుందని, వరుసగా రెండో ఏడాది కూడా చైనాను దాటేస్తుందని ఈ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఏడు (చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా, ఇండోనేషియా, టర్కీ)దేశాల్లో భారత్ మాత్రమే వేగంగా వృద్ధి సాధిస్తుందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., ఇటీవల సంస్కరణల ఫలాలు భారత్‌కు అందివస్తాయి. గత ఏడాది ఆర్బీఐ రెపోరేటును 8 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గించడం వల్ల వినియోగం జోరు పెరిగింది. పెట్టుబడుల వృద్ధికి తోడ్పాటు అందింది. విదేశీ పెట్టుబడుల పరిమితిని పలు రంగాల్లో పెంచడం వల్ల అభివృద్ధి చెందని తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఆర్థికాంశాల కన్నా భౌగోళిక రాజకీయాంశాలకే విధాన నిర్ణేతలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బ్రెజిల్, రష్యా ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణిస్తుంది. చైనా వృద్ధి మందగమనంగా ఉంటుంది. ఈ వర్థమాన దేశాలు తమ ట్రెండ్ రేట్ కంటే తక్కువ వృద్ధినే సాధిస్తాయి. చైనా ఆర్థిక వృద్ధి 6.5 శాతానికి తగ్గుతుంది. తయారీ, ఎగుమతుల రంగాల్లో వృద్ధి క్రమక్రమంగా మందగిస్తుంది. * 2010 నుంచి చూస్తే జీ 7 దేశాలు (అమెరికా, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా)వేగవంతమైన వృద్ధిని సాధిస్తాయి. * ఈ ఏడాది అమెరికా రికవరీ జోరుగా ఉంటుంది. యునెటైడ్ కింగ్డమ్ వృద్ధి కూడా జోరుగానే ఉంటుంది. * యూరోజోన్ సంక్షోభం ముగింపు ప్రారంభం ఈ ఏడాది ఉండొచ్చు. * బ్రిక్స్ దేశాలకు ఈ ఏడాది కూడా క్లిష్టంగానే ఉంటుంది. భారత్ మాత్రం మినహాయింపు. * యూరోప్‌లో వలస సమస్య, పశ్చిమాసియా సంక్షోభానికి అంతర్జాతీయ స్పందన, యూరోపియన్ యూనియన్‌లో యూకే సభ్యత్వంపై జరిగే రిఫరెండమ్.. ఈ అంశాలు వార్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. * దీర్ఘకాలం పాటు కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలోనే ఉండొచ్చు. వీటిని దిగుమతి చేసుకునే దేశాలకు ఇది సంతోషాన్నిచ్చే వార్త కాగా, కమోడిటీలను ఎగుమతి చేసే దేశాలకు మాత్రం అశనిపాతమే. -
వచ్చే డిసెంబర్‌కల్లా 1.5 కోట్ల 4జీ యూజర్లు: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: దేశంలో 4జీ(ఫోర్త్ జనరేషన్) టెలికం సేవలు జోరందుకోనున్నాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా 4జీ యూజర్ల సంఖ్య 1-1.5 కోట్లకు పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. భారత టెలికం రంగంలో కీలక ధోరణల పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్‌లు ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో 4జీ సేవలు ప్రారంభించగా.. బీఎస్ఎన్ఎల్, టికోనా ఇతరత్రా కంపెనీలు కూడా వచ్చే ఏడాది షురూ చేయనున్నాయి. ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 2015 మధ్యలో 4జీ సేవలను మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. కాగా, 4జీ నెట్వర్క్ సేవల ప్రారంభానికి గడువును మరో ఐదేళ్లు(2020 వరకూ) పొడిగించాలని టెలికం శాఖను సెల్యులర్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) కోరింది. టెక్నాలజీ, నియంత్రణపరమైన ఇబ్బందులను ఇందుకు కారణంగా పేర్కొంది. -
భారత్‌లో జోరుగా రిటైల్ రంగం: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ రంగం జోరుగా ఉందని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యూసీ) వెల్లడించింది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా: ద విన్నింగ్ లీప్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. 2020 కల్లా భారత రిటైల్ రంగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందంటున్న ఈ నివేదిక ప్రకారం.. భారత రిటైల్ రంగంలో 92% వాటా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. వీటిల్లో ఎక్కువ భాగం చిన్న కిరాణా షాపులదే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. అయితే మొత్తం రిటైల్ మార్కెట్లో వ్యవస్థీకృత రిటైల్ రంగం వాటా భారత్‌లో తక్కువగా ఉంది. భారత్‌లో ఇది 8% ఉండగా, అమెరికాలో 85%, ఇంగ్లాండ్‌లో 80%, థాయ్‌లాండ్‌లో 40%, చైనాలో 20%,గా ఉంది. భారత్‌లో వ్యవస్థీకృత రిటైల్ రంగం ఏడాదికి 24 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. 2034 కల్లా 50 శాతానికి చేరుతుంది. -
వచ్చే ఏడాది జోరుగా రియల్టీ: పీడబ్ల్యూసీ
ముంబై: వచ్చే ఏడాది భారత్‌లో రియల్టీ జోరు బావుంటుందని పీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం, ఈ ప్రభుత్వం స్మార్ట్‌సిటీల ఏర్పాటు చేయాలని యోచించడం వంటివి దీనికి కారణాలని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఏషియా పసిఫిక్ 2015’ పేరుతో వెలువరించిన నివేదిక తెలిపింది. ⇒వచ్చే ఏడాదిలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులు-హాట్ ఇన్వెస్ట్మెంట్ స్పాట్లు కానున్నాయి. ఆసియాలోని 22 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ మూడు నగరాల్లో రియల్టీ జోరు గత రెండు సంవత్సరాల కంటే పెరిగింది. ⇒భారీగా నిధులు ఉన్న ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాల కోసం చూస్తున్నారు. వారికి భారత్ స్వర్గధామంగా కనిపిస్తోంది. ⇒స్మార్ట్‌సిటీల ఏర్పాటు, పెద్ద స్థాయిలో తయారీ రంగాలకు ఊపునిచ్చే కార్యక్రమాలు, రీట్ల ఏర్పాటు, వంటి అంశాలు రియల్టీ జోరును మరింత పెంచుతాయి. ⇒ఇళ్ల ధరలు, అద్దెలు పెరుగుతాయ్. యాత్రాడాట్కామ్లో రిలయన్స్ క్యాప్ వాటా అమ్మకం! న్యూఢిల్లీ: ఈకామర్స్ బూమ్‌ను సొమ్ము చేసుకునే బాటలో యాత్రాడాట్కామ్లో ఉన్న 16% వాటాను విక్రయించేందుకు రిలయన్స్ క్యాపిటల్ సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా రెండు మూడు విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాటా విలువ రూ. 500 కోట్లుగా అంచనా. -
25 లక్షల కోట్ల మళ్లింపు
ఆరేళ్లలో స్విస్ బ్యాంకుల నుంచి భారీగా తరలిన విదేశీ నిధులు జ్యూరిక్/న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతపై భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో స్విస్ బ్యాంకుల్లో సొమ్ము రానురానూ కరిగిపోతోంది. గత ఆరేళ్లలోనే దాదాపు రూ. 25 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు స్విట్జర్లాండ్ బయటకు తరలిపోయాయట! ప్రముఖ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఇందులో భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంతన్న సమాచారం మాత్రం లభించలేదు. స్విట్జర్లాండ్‌లోని 90 ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ ప్రైవేట్ క్లయింట్ల లావాదేవీలను ఈ సంస్థ విశ్లేషించింది. మొత్తంగా దాదాపు రూ. 25 లక్షల కోట్ల నిధులను స్విస్ బ్యాంకుల నుంచి స్వదేశాలకు గానీ, ఇతర దేశాలకు గానీ మళ్లించుకునిపోయినట్లు తేలింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్ల మేరకు స్విట్జర్లాండ్ ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి బ్యాంకుల్లో విదేశీ డిపాజిట్లు వేగంగా తగ్గిపోతున్నట్లు తేలింది. ఇక్కడ భారతీయులు దాచుకుంటున్న సొత్తు కూడా క్రమంగా తగ్గిపోతోందని గతంలోనే పలు నివేదికల ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితి వల్ల స్విస్ బ్యాంకులకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చునని, నిధులను తరలించిన క్లయింట్లు భవిష్యత్తులో పన్ను ఒప్పందాలు పూర్తయిన తర్వాత మళ్లీ వాటిని వెనక్కి మళ్లించే అవకాశముందని పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. -
ఇబ్బడిముబ్బడిగా పీఈ పెట్టుబడులు
పదేళ్లలో 4 వేల కోట్ల డాలర్లకు: పీడబ్ల్యూసీ ముంబై: వచ్చే పదేళ్లలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడుల పరి మాణం 4,000 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధికి పీఈ పరిశ్రమ గతంలో కంటే వచ్చే పదేళ్లలో మెరుగ్గా దోహదపడుతుందని ‘2025 నాటికి భారత్‌లో పీఈ’ అనే నివేదికలో పేర్కొంది. 40కి పైగా పీఈ హౌస్‌ల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ఈ నివేదికలో ముఖ్యాంశాలు.. * గత ఆర్థిక సంవత్సరం అంతానికి దాదాపు 900 కోట్ల డాలర్లుగా ఉన్న పీఈ పెట్టుబడులు ఈ ఏడాది 1,000-1,200 కోట్ల డాలర్లకు చేరొచ్చు. * దాదాపు 70-80 కీలక ప్లేయర్లతో పీఈ పరిశ్రమ త్వరలో బలోపేతమయ్యే కానుంది. * రానున్న దశాబ్దంలో కొనుగోళ్లే (బైఅవుట్లు) అతిపెద్ద పెట్టుబడి అవకాశాలుగా పరిణమిస్తాయని పరిశ్రమ అంచనా. * ఈక్విటీ ఇన్వెస్టర్లు గత కొన్నేళ్లుగా వినియోగదారులు అధికంగా ఉండే వ్యాపారాలపైనే దృష్టికేంద్రీకరించారు. వచ్చే ఐదేళ్లలో దేశం నలుమూలలకూ అభివృద్ధి విస్తరించడంతో గ్రామీణ మార్కెట్లకూ వినియోగతత్వం (కన్సూమరిజం) వ్యాపించే అవకాశం ఉంది. * పీఈ కంపెనీలు గతంతో పోలిస్తే ఇపుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. -
బిగ్ 4 ఆడిటింగ్ నుంచి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్