న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న తరుణంలో ఆర్థిక సేవలందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. బోనస్‌లు ప్రమోషన్లను అక్టోబర్1 2020న ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ గత సంవత్సరాలతో పోలిస్తే వేతనాలు, ప్రమోషన్లు కొంత మేర తగ్గవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా సంస్థ క్లయింట్లకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని పీడబ్లుసీ చీఫ్ పబ్లిక్ అధికారి పద్మజ అలగానందన్ తెలిపారు. మరోవైపు తమ సంస్థ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రేటింగ్ సాధించిందని పద్మజ పేర్కొన్నారు. (చదవండి: లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే)
Comments
Please login to add a commentAdd a comment