వచ్చే ఏడాది జోరుగా రియల్టీ: పీడబ్ల్యూసీ | pwc report says in future real estate should be good | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది జోరుగా రియల్టీ: పీడబ్ల్యూసీ

Published Thu, Dec 11 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

pwc report says in future real estate should be good

ముంబై: వచ్చే ఏడాది భారత్‌లో రియల్టీ జోరు బావుంటుందని పీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం, ఈ ప్రభుత్వం స్మార్ట్‌సిటీల ఏర్పాటు చేయాలని యోచించడం వంటివి దీనికి కారణాలని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఏషియా పసిఫిక్ 2015’ పేరుతో వెలువరించిన నివేదిక తెలిపింది.

 ⇒వచ్చే ఏడాదిలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులు-హాట్ ఇన్వెస్ట్‌మెంట్ స్పాట్‌లు కానున్నాయి.  ఆసియాలోని 22 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ మూడు నగరాల్లో రియల్టీ జోరు గత రెండు సంవత్సరాల కంటే పెరిగింది.
 ⇒భారీగా నిధులు ఉన్న ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాల కోసం చూస్తున్నారు. వారికి భారత్ స్వర్గధామంగా కనిపిస్తోంది.
 ⇒స్మార్ట్‌సిటీల ఏర్పాటు, పెద్ద స్థాయిలో తయారీ రంగాలకు ఊపునిచ్చే కార్యక్రమాలు, రీట్‌ల ఏర్పాటు, వంటి అంశాలు రియల్టీ జోరును మరింత పెంచుతాయి.
 ⇒ఇళ్ల ధరలు, అద్దెలు పెరుగుతాయ్.
 
యాత్రాడాట్‌కామ్‌లో రిలయన్స్ క్యాప్ వాటా అమ్మకం!
 న్యూఢిల్లీ: ఈకామర్స్ బూమ్‌ను సొమ్ము చేసుకునే బాటలో యాత్రాడాట్‌కామ్‌లో ఉన్న 16% వాటాను విక్రయించేందుకు రిలయన్స్ క్యాపిటల్ సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా రెండు మూడు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాటా విలువ రూ. 500 కోట్లుగా అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement