లైఫ్ కథా చిత్రమ్ | life story film: Deepika padukone exactly fit to my role, says sania mirza | Sakshi
Sakshi News home page

లైఫ్ కథా చిత్రమ్

Published Fri, Oct 10 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

లైఫ్ కథా చిత్రమ్

లైఫ్ కథా చిత్రమ్

‘మేరీకోమ్’ కథ మాదిరిగా నా బయోగ్రఫీపై సినిమా తీస్తామంటూ కొందరు కలిశారు. అయితే ఇప్పటికిప్పుడు నా లైఫ్ స్టోరీ తెరకెక్కాలని కోరుకోవట్లేదు. ఒకవేళ సినిమాగా తీస్తే.. నా పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సరిగ్గా సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గురువారం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాబ్‌బి (ఫ్యాబులస్ అండ్ బియాండ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ లోగోను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆవిష్కరించింది.

ఫర్నిచర్ తయారీలో పేరొందిన జేఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ ద్వారా రిటైల్ రంగంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో సానియా మాట్లాడుతూ- ‘కుటుంబంతో తాజ్‌మహల్ వీక్షించడం లైఫ్‌లో మరచిపోలేని  అనుభూతి. ఫాబ్‌బి కంపెనీ తీరు నచ్చాకే బ్రాండ్ అంబాసిడర్‌గా ఓకే చెప్పాను. ఆటలో రాణించాలంటే కఠోర సాధనతో పాటు ఫిట్‌నెస్ అవసరం’ అని వివరించింది. ఈ ఈవెంట్‌కు గంట ఆలస్యంగా వచ్చిన సానియా.. టాఫిక్ జామ్ వల్ల సకాలంలో చేరుకోలేకపోయానని వివరణనిచ్చింది.
  - సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement