Reliance Retail launches JioBook laptop for just Rs 16,499 - Sakshi
Sakshi News home page

రూ.16,499కే జియో ల్యాప్‌టాప్‌

Published Tue, Aug 1 2023 4:03 AM | Last Updated on Tue, Aug 1 2023 12:02 PM

Reliance Retail launches JioBook laptop for Rs 16,499 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిటైల్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తాజాగా దేశీయ మార్కెట్లో 4జీ సిమ్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌ ‘జియోబుక్‌’ పరిచయం చేసింది. ధర రూ.16,499. బరువు 990 గ్రాములు.

జియో ఓఎస్, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, 2 గిగాహెట్జ్‌ ఆక్టా కోర్‌ చిప్‌సెట్, 4 జీబీ ఎల్‌పీడీడీఆర్‌4 ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్‌ మల్టీ గెస్చర్‌ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది.

హెచ్‌డీ వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్స్, వైర్‌లెస్‌ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్‌ చాట్‌బాట్, స్క్రీన్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్‌బిల్ట్‌ యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌ వంటి హంగులు ఉన్నాయి. 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఉందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్‌ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్లతోపాటు అమెజాన్‌లో లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement