Domestic markets
-
దేశ, విదేశీ గణాంకాలకు ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.గత వారమిలా..శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్‌చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.ఆర్థిక గణాంకాలుదేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు. యుద్ధ భయాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్‌వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో తుఫాను సహా బోయింగ్‌లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది. -
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్స్.. రాకెట్స్!
ద్రవ్యోల్బణ, వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు. పసిడి 10 శాతం దాకా అప్ .. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు. మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్లు, కొత్త గ్రీన్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. ఆసక్తికరంగా గ్లోబల్ ఎకానమీ .. సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్ 2080లో గ్లోబల్ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్ డిజిట్ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు. – ప్రణవ్ హరిదాసన్, ఎండీ, యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టీవీఎస్ మోటర్ ప్రస్తుత ధర: 1,633 టార్గెట్ ధర: రూ. 2,100 దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935.. టార్గెట్ ధర: రూ. 1,155 దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ ఫోన్స్ వంటి మెరుగైన డిజిటల్ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్ సెగ్మెంట్లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుత ధర: 1,654 టార్గెట్ ధర: రూ. 1,950 స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ రంగంలో 60 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు. జ్యోతి ల్యాబ్స్ ప్రస్తుత ధర: 414.. టార్గెట్ ధర: రూ. 440 1983లో ఉజాలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనే సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్ ఉన్న హెంకెల్ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ కేర్, డిష్వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్ సోప్స్ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్ కన్జూమర్ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: 1,369 టార్గెట్ ధర: రూ. 1,500 ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 938 టార్గెట్ ధర రూ. 1,081 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స, స్టాక్ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 10,391 టార్గెట్ ధర రూ. 12,000 దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ధర: 8,720 టార్గెట్ ధర: రూ. 9,800 ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది. పాలీక్యాబ్ ఇండియా ప్రస్తుత ధర: 5,137 టార్గెట్ ధర:5,877 భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్ఎంఈజీ (ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రస్తుత ధర: 338 టార్గెట్ ధర:రూ. 364 భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది. స్టాక్స్‌బాక్స్ అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర: రూ. 139 టార్గెట్ ధర: రూ. 163 దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్ ఎస్వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి. కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 323 టార్గెట్ ధర: రూ. 370 భారత్ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం. కోల్గేట్–పామోలివ్ (ఇండియా) ప్రస్తుత ధర: 2,106.. టార్గెట్ ధర: రూ. 2,500 ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్మెంట్ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం. పురవంకర ప్రస్తుత ధర: రూ. 147 టార్గెట్ ధర: రూ. 176 ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935 టార్గెట్ ధర: రూ. 1,106 పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 2,314 టార్గెట్ ధర రూ. 2,725 కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది. కెనరా బ్యాంకు ప్రస్తుత ధర రూ. 387 టార్గెట్ ధర రూ. 425 కెనరా బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది. సిప్లా ప్రస్తుత ధర రూ. 1,240 టార్గెట్ ధర రూ. 1,320 సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం. సైయంట్ ప్రస్తుత ధర రూ. 1,659 టార్గెట్ ధర రూ. 2,000 ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్ ఉంటుందని సైయంట్ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్ క్వార్టర్లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్ కొనసాగించవచ్చు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రస్తుత ధర రూ. 210 టార్గెట్ ధర రూ. 276 సెపె్టంబర్ క్వార్టర్లో పీసీబీఎల్ (ఫిలిప్స్ కార్బన్ బ్లాక్) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్ కోసం డిమాండ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్ గ్రేడ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది. -
రూ.16,499కే జియో ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తాజాగా దేశీయ మార్కెట్లో 4జీ సిమ్ ఆధారిత ల్యాప్‌టాప్ ‘జియోబుక్’ పరిచయం చేసింది. ధర రూ.16,499. బరువు 990 గ్రాములు. జియో ఓఎస్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2 గిగాహెట్జ్ ఆక్టా కోర్ చిప్సెట్, 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్ హెచ్డీ డిస్ప్లే, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ గెస్చర్ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది. హెచ్డీ వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్స్, వైర్లెస్ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్ చాట్‌బాట్, స్క్రీన్ ఎక్స్టెన్షన్, ఇన్‌బిల్ట్ యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు అమెజాన్‌లో లభిస్తుంది. -
ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు. అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్‌కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్‌గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్‌లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు. మెరుగ్గా లార్జ్ క్యాప్స్ .. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్‌పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్‌పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు. -
ద్రవ్యోల్బణం, ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలతో (బుధవారం వెలువడనున్న) పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమ నాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. హోళీ సందర్భంగా శుక్రవారం(మార్చి 18న) ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గతవారంలో సెన్సెక్స్ 1,216 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు తగ్గేంత వరకు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మార్కెట్లను నడిపించనున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు క్రూడాయిల్ ధరలు కూడా కీలకం కానున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ టోకు, రిటైల్ గణాంకాలు, ఎఫ్ఐఐల అమ్మకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించవచ్చు. సాంకేతికంగా దిగువస్థాయిలో నిఫ్టీకి 16,400 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ మార్చి మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–4 తేదీల మధ్య ఎఫ్ఐఐలు మొత్తం రూ.45,608 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల రూపంలో రూ. 41,168 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 4,431 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ‘‘పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం భారత్ మార్కెట్‌పై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ తెలిపారు. ఐపీవోకు నవీ టెక్నాలజీస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,350 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవో నిధుల కోసం పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ బన్సల్ ఐపీవోలో భాగంగా ఎలాంటి వాటాను విక్రయించబోవడంలేదని ప్రాస్పెక్టస్ ద్వారా కంపెనీ వెల్లడించింది. -
ఆకాశమే హద్దుగా..
కరోనా వైరస్ దెబ్బతో 2020లో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కుదేలైన దేశీ మార్కెట్లు.. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా ఎగిశాయి. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునేందుకు ఆపసోపాలు పడుతున్నా.. స్టాక్స్ మొదలుకుని బంగారం దాకా అన్నీ కొంగొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలతో పాటు ఆకర్షణీయమైన స్టాక్‌లు, పసిడి పరుగులపై నెలకొన్న అంచనాలపై కథనం... కరెక్షన్లు ఉన్నా.. మార్కెట్లు ముందుకే.. కొత్త సంవత్సరంలోనూ బుల్ పరుగు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యమధ్యలో కొంత కరెక్షన్ వచ్చినా.. మొత్తం మీద మార్కెట్లు మరింతగా పెరగడం ఖాయమని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే 2021 డిసెంబర్ నాటికి నిఫ్టీ 15,000 మార్కును దాటగలదని జేపీ మోర్గాన్ వర్గాలు తెలిపాయి. ఇక వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరమని నొమురా అభిప్రాయపడింది. మార్కెట్లు బుల్ రన్‌లోనే ఉన్నాయని, మూడేళ్ల కన్సాలిడేషన్ బ్రేకవుట్‌ను బట్టి చూస్తే 2021లో 16,200 టార్గెట్ సాధించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ తెలిపింది. పడితే కొనుగోళ్లకు అవకాశం.. సాధారణంగా బుల్ పరుగులో 15–20 శాతం కరెక్షన్కు అవకాశాలు లేకపోలేదని, అయితే దీన్ని ప్రతికూలాంశంగా భావించాల్సిన పని లేదని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. 11,400 కీలక మద్దతుగా .. ఈ కరెక్షన్లను కొనుగోళ్లకు అవకాశాలుగా మల్చుకోవచ్చని తెలిపింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా చూస్తే.. అమెరికా ఎన్నికలు జరిగిన మరుసటి సంవత్సరం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు సానుకూల రాబడులే అందిస్తూ వస్తున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్ తన నివేదికలో వివరించింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్స్, టెలికం రంగాలపై దృష్టి పెట్టొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. ఇక ఆర్డర్లు భారీగా ఉండటం, ప్రాజెక్టుల అమలు మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా నూతన సంవత్సరంలో ఇన్ఫ్రా రంగం ఆశావహంగా ఉండగలదని యస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. కాస్త రిస్కులు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్స్, టెలికం రంగాలవైపు చూడొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. గణనీయంగా పడిపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), విద్యుత్, రియల్ ఎస్టేట్‌తో పాటు ఎఫ్ఎంసీజీ రంగ సంస్థల షేర్లను పరిశీలించవచ్చన్నది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సూచన. అనిశ్చితిలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటోంది. తాజాగా కరోనా వైరస్ సంక్షోభ కాలంలోనూ అది రుజువైంది. 2020 తొలినాళ్లలో దేశీయంగా పుత్తడి గ్రాముల రేటు రూ. 39,100 దగ్గర, అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 1,517 డాలర్ల దగ్గర ప్రారంభమైంది. కరోనా వైరస్ పరిణామాలతో ప్రారంభంలో రూ. 38,400 రేటుకు పడిపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా ఎగిసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్)లో ధర రూ. 56,191 స్థాయిని, అంతర్జాతీయంగా ఔన్సు రేటు (31.1 గ్రాములు) 2,075 డాలర్ల రికార్డు స్థాయిలను తాకింది. కొత్త సంవత్సరంలోనూ పసిడి జోరు కొనసాగే అవకాశాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా రికవరీ మందకొడిగా సాగుతున్నందున కొత్త సంవత్సరంలో ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ. 57,000 నుంచి రూ. 63,000 దాకా చేరొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ప్యాకేజీ, డాలర్ బలహీనత ఊతం.. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ బలహీనతల ఊతంతో బంగారం రేట్లు మరోసారి పెరగవచ్చని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సరీ్వసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘‘భారత్, చైనాలో పసిడికి డిమాండ్ బాగా పెరగవచ్చు. రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంటే 2021లో పుత్తడి రేటు దేశీయంగా రూ. 60,000, అంతర్జాతీయంగా 2,200 డాలర్లు తాకొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పసిడి రేట్లకు కొనుగోలుదారులు అలవాటుపడుతుండటం, పేరుకుపోయిన డిమాండ్, తక్కువ వడ్డీ రేట్లు, అసాధారణ స్థాయిలో నిధుల ప్రవాహం మొదలైన అంశాలన్నీ బంగారం రేట్లు పెరగడానికి దోహదపడగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ చూడని అసాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పరిశ్రమవర్గాలతో సమాలోచనల సందర్భంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రస్తుతం భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగాలకు ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు, 2021 బడ్జెట్.. ఇన్వెస్టర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం నిధుల కోసం నానా తంటాలు పడుతోందని.. గతేడాది కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించినప్పటికీ..కొత్తగా కోవిడ్–19 సర్‌చార్జీలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. టీకాల నుంచి ద్రవ్యోల్బణం దాకా... కొత్త సంవత్సరంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు కార్పొరేట్ల ఫలితాలు కంపెనీల ఆదాయాలు ఏడాది వ్యవధిలోనే దాదాపు కరోనా పూర్వ స్థాయికి చేరగలవని ఈక్విటీల నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ల ఆదాయాల అంచనాల వృద్ధి 6, 8 శాతం పైగా ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. మెటల్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇప్పటికే మెరుగైన రాబడులు అందిస్తుండగా.. రిటైల్, ఆటో మొదలైనవి కూడా అదే బాటలో ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక రికవరీ కరోనా దెబ్బతో ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా క్షీణించింది. అయితే లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు మళ్లీ రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటుతున్నాయి. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారత ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.3 శాతం క్షీణించే అవకాశమున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం 8.8 శాతం స్థాయిలో వృద్ధి సాధించవచ్చు. కోవిడ్–19 వ్యాప్తి ట్రెండ్, టీకాలు కరోనా వైరస్ టీకాల సమర్థత, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నూతన సంవత్సరంలో అన్నింటికన్నా కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు వేస్తుండగా.. భారత్‌లోనూ జనవరిలో దీన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైజర్–బయోఎన్‌టెక్, ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ టీకాలపై అందరి దృష్టి ఉంది. ఇక సెకండ్ వేవ్ కట్టడీ కీలక అంశమే కావడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ రేట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనాల ప్రకారం భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ఇది ఇప్పుడప్పుడే దిగి వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి 2021 మొత్తం మీద రిజర్వ్ బ్యాంక్ .. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా మధ్యకాలికంగా చూస్తే ద్రవ్యోల్బణం ఎగియవచ్చని, 2022లో ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాల్సి రావొచ్చని నొమురా భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కాస్త దిగి వచ్చినా .. కమోడిటీల రేట్లకు రెక్కలు రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం తదితర అంశాల కారణంగా ఇతరత్రా ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా. ఇవే కాకుండా అమెరికాలో కరోనా వైరస్‌పరమైన ఆర్థిక ప్యాకేజీ, బ్రెగ్జిట్, అమెరికా–చైనా మధ్య సంబంధాలు, ఇతరత్రా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనవి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. -
ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్ ముగింపును నమోదుచేశాయి. ఇక ఈ వారంలో.. ఫలితాలు ప్రకటించే దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యునిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటు ద్రవ్యోల్బణ సమాచారం, అంతర్జాతీయ అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. 80 కంపెనీల ఫలితాలు.. బీఎస్ఈలో లిస్టైన 80 కంపెనీలు ఈవారంలో (జనవరి 14–19) క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం ఇండియా బుల్స్ వెంచర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం జీ ఎంటర్టైన్మెంట్, డెన్ నెట్వర్క్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ట్రైడెంట్.. బుధవారం డీసీబీ బ్యాంక్, హెచ్‌టీ మీడియా, మైండ్‌ట్రీ ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ర్యాలీస్ ఇండియా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫలితాలు ఉండగా.. శుక్రవారం విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ లైఫ్, అతుల్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలో వెల్లడికానున్న ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా వెల్లడి మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి .. డిసెంబర్ నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. వాణిజ్య శేషాన్ని ప్రభుత్వం మంగళవారం వెల్లడించనుండగా.. జనవరి 11 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వల సమాచారాన్ని శుక్రవారం ఆర్బీఐ తెలియజేయనుంది. ఇదే రోజున జనవరి 4 నాటికి మొత్తం డిపాజిట్లు, బ్యాంక్ రుణా ల వృద్ధి సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 6 శాతం ర్యాలీ చేశాయి. గతేడాది డిసెంబర్లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే.. 20 శాతం పెరిగాయి. శుక్రవారం 60.55 వద్ద ముగియగా.. క్రూడ్ ధరల్లో ర్యాలీ కొనసాగితే దేశీ సూచీలకు ప్రతికూల అంశంకానున్నట్లు ఎక్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. ఇక ముడిచమురు ధర పెరుగుదల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 70.49 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ అంశాలు ఏంచేస్తాయో.. అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ ముగింపు ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు యురోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగే ప్రక్రియకు సంబంధించి మంగళవారం కీలక సమాచారం వెల్లడికానుంది. యూకే ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ఉపసంహరణ డీల్‌పై బ్రిటిష్ పార్లమెంట్ ఓటు వేయనుంది. ఇక గతవారంలో అమెరికా–చైనాల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఈ చర్చల సారాంశం ఏంటనే విషయంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. ఈనెలలోని గడిచిన తొమ్మిది సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.3,600 కోట్లను ఉపసంహరించుకున్నారు. జనవరి 1–12 కాలంలో రూ.3,677 కోట్లను వీరు వెనక్కుతీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
మార్కెట్ మళ్లీ జంప్
- ఈసారి చైనా జోష్ - సెన్సెక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు అప్ - కోలుకున్న రూపాయి కొన్నాళ్లుగా కలవరపెడుతున్న చైనా నుంచి కాస్త సానుకూల పరిణామాలు రావడంతో మంగళవారం దేశీ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 424 పాయింట్లు ఎగిసి కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 129 పాయింట్లు పెరిగింది. ఎకానమీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలు, బ్యంకర్లు, ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం కూడా మార్కెట్లకు ఊతమిచ్చినట్లు జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. రూపాయి కూడా 27 పైసల మేర బలపడి రెండేళ్ల కనిష్టం నుంచి 66.54 స్థాయికి కోలుకుంది. సెన్సెక్స్ ఒక దశలో ఇంట్రా డే గరిష్ట స్థాయి 25,411 పాయింట్లను కూడా తాకి.. చివరికి 25,318 వద్ద ముగిసింది. చైనా, వర్షాభావ భయాలతో గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 871 పాయింట్లు క్షీణించింది. మరోవైపు నిఫ్టీ సైతం కొంత సేపు 7,700 మార్కుపై కదలాడి చివరికి 129 పాయింట్ల లాభంతో 7,688 వద్ద ముగిసింది. వెలుగులో ఫైనాన్షియల్ స్టాక్స్.. బేస్ రేట్ ఆధారిత వడ్డీ రేట్లకు సంబంధించిన ప్రతిపాదిత నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కొంత సడలించే అవకాశాలున్నాయన్న వార్తలతో ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రధాన ఆకర్షణగా నిల్చాయి. 30 షేర్ల సెన్సెక్స్‌లో 26 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,459 స్టాక్స్ లాభాల్లో.. 1,190 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవరు రూ. 2,042 కోట్ల నుంచి రూ. 2,666 కోట్లకు పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 660 కోట్ల విలువ చేసే స్టాక్స్ విక్రయించగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 447 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. మరోవైపు, ఎన్ఎస్ఈ స్టాక్స్‌లో రూ. 16,034 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 2,19,091 కోట్లు టర్నోవరు నమోదైంది. షార్ట్ కవరింగ్, తక్కువ స్థాయుల్లో కొనుగోళ్ల కారణంగా బ్లూ చిప్ షేర్లు మొదలైనవి పెరిగాయని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. అయితే, వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించిన తర్వాతే మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉందని వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. చైనా ఊతం.. చైనా ప్రభుత్వం కొత్తగా ఆదాయ పన్ను కోతలు, స్వల్పకాలిక స్పెక్యులేషన్‌ను నివారించేందుకు.. షేర్ల పతనాన్ని నిరోధించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను ప్రతిపాదించడం అక్కడి మార్కెట్స్‌కు ఉత్సాహాన్నిచ్చింది. చైనా షాంఘై కాంపోజిట్ సూచీ 2.92 శాతం మేర, హాంకాంగ్‌కి చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3.28 శాతం పెరగ్గా.. జపాన్ సూచీ నికాయ్ మాత్రం 2.43 శాతం క్షీణించింది. మరోవైపు, జర్మనీ ఎగుమతులు దిగుమతుల సానూకూల గణాంకాలతో యూరోపియన్ సూచీలు పెరిగాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలైన దేశాల సూచీలు 2.04 శాతం దాకా లాభపడ్డాయి. -
పీ-నోట్లను నియంత్రించం..
- పెట్టుబడులకు ప్రతికూలమైన చర్యలేవీ ఉండవు... - ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ న్యూఢిల్లీ: పీ-నోట్ల రూపంలో దేశీ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నియంత్రించే ఆలోచనేదీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం కట్టడికి పార్టిసిపేటరీ-నోట్లపై కఠిన నియంత్రణలు అమలు చేయాల్సిందేనంటూ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజా నివేదికలో సిఫార్సు చేయటం తెలిసిందే. ఈ నివేదికతో పీ-నోట్లపై ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగి... సోమవారం భారత్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిన నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే ఎలాంటి చర్యలనూ ప్రభుత్వం తీసుకోబోదని స్పష్టంచేశారు. ‘పీ-నోట్లపై షా కమిటీ సూచనలను నిశితంగా పరిశీలిస్తాం. అయితే, దీనిపై మా అభిప్రాయం ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ దుందుడుకుగా వ్యవహరించదు. ముఖ్యంగా పెట్టుబడులకు ప్రతికూలంగా ఎటువంటి చర్యలూ ఉండవు’ అని చెప్పారు. మరోపక్క, సిట్ సిఫార్సులపై సెబీ, ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల తర్వాతే ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ కూడా భరోసా ఇచ్చారు. 2009 నుంచి తగ్గుముఖం...: దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా పీ-నోట్లను ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐలు), హెడ్జ్ ఫండ్లు, ఇతర విదేశీ సంస్థలు వీటిద్వారానే పెట్టుబడులు పెడతాయి. సెబీ వద్ద రిజిస్టర్ అయిన్ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ/ఎఫ్‌పీఐ) ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయి. సెబీకి తమ వివరాలేవీ తెలియకుండా ఉండేందుకే విదేశీ ఇన్వెస్టర్లు ఈ రూట్‌ను ఎంచుకుంటారు. అయితే, నల్లధనాన్ని చెలామణీలోకి తెచ్చేందుకు కొందరు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారన్న వాదనలున్నాయి. పీ-నోట్లను నియంత్రించాలన్న సూచనలు 2007లో కూడా తెరపైకి వచ్చాయి. మార్కెట్ భారీగా పడిపోవడంతో అటువంటి చర్యలేవీ ఉండబోవని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, స్టాక్ మార్కెట్‌ను ఉపయోగించుకొని పన్నుల ఎగవేతలకు పాల్పడేవారికి అడ్డుకట్టవేయడం, నల్లధనానికి చెక్ చెప్పాలంటే పీ-నోట్ పెట్టుబడులకు కళ్లెం వేయడం కూడా కీలకమేనని తాజాగా సిట్ నివేదిక కుండబద్దలు కొట్టింది. భారత్ స్టాక్ మార్కెట్లోకి కొన్నేళ్ల క్రితం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ/ఎఫ్‌పీఐ) మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం వరకూ పీ-నోట్ల ద్వారానే వచ్చేవి. అయితే, నిబంధనలను సెబీ కొంత కఠినతరం చేయడంతో 2009 తర్వాత ఈ వాటా 15-20 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది మే నాటికి పీ-నోట్ పెట్టుబడులు ఏడేళ్ల గరిష్టస్థాయిలో రూ.2.85 లక్షల కోట్లకు చేరాయి. జూన్ చివరికి ఇవి రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంప్రదింపుల తర్వాతే ఐఎఫ్సీపై నిర్ణయం ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్(ఐఎఫ్‌సీ)పై రిజర్వ్ బ్యాంక్ సహా అన్ని పక్షాలతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. వడ్డీరేట్లపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కళ్లెం వేసేలా రూపొందించిన ఎఫ్ఎస్ఎల్ఆర్సీ నివేదికను కమిటీ ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించింది. -
మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!
డెరివేటివ్స్ ముగింపు నేపథ్యం ⇒కీలకంకానున్న విదేశీ అంశాలు ⇒ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే ⇒మార్కెట్ నడకపై నిపుణుల అంచనాలు ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల(డెరివేటివ్స్) ముగింపు నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు బుధవారమే(24న) ముగియనుంది. వెరసి ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇక మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సైతం రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ రెండు రోజుల్లోనూ కీలక బిల్లుల ఆమోదంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు, రష్యాలో జరిగే పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. బీమా బిల్లుపై దృష్టి పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజులే గడువున్న కారణంగా బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పెంపు వంటి బిల్లుల ఆమోదం కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు బిల్లులు ఆమోదంపొందే అంశంపై దృష్టిపెడతారని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సైతం 13 నెలల కనిష్టాన్ని తాకింది. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం భారీ ఒడిదుడుకులను చవిచూస్తాయని పలువురు నిపుణులు చెప్పారు. ప్రపంచ పరిణామాలు జపాన్ మాంద్య పరిస్థితులు, చైనా, యూరప్ దేశాల ఆర్థిక మందగమనం వంటి విదేశీ పరిణామాలు మార్కెట్ల నడకను నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్పీ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్థాయిలో కనిపిస్తున్న రిస్క్ పరిస్థితులు, ప్రత్యేకంగా ఆయిల్ ఉత్పాదక దేశాలు(ఒపెక్) ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు వివరించారు. ఇక దేశీయంగా చూస్తే వస్తు, సేవల పన్ను చట్టాన్ని(జీఎస్టీ) పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆశ్చర్యకర పరిణామమని వ్యాఖ్యానించారు. మొత్తంగా పన్నుల విధానాన్ని సంస్కరించే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గడిచిన శుక్రవారం(19న) లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ నెలలో రూ. 14,000 కోట్ల పెట్టుబడులు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ(డిసెంబర్1-19) రూ. 14,239 కోట్లు(2.3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఈక్విటీలకు రూ. 3,430 కోట్లు(57 కోట్ల డాలర్లు), రూ.10,808 కోట్ల(1.75 బిలియన్ డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు డిసెంబర్19 వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులు రూ. 2.6 లక్షల కోట్లను(42.6 బిలియన్ డాలర్లు) తాకాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలు ఈక్విటీలలో పెట్టుబడులకు ప్రోత్సాహానిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.