స్టాక్స్‌.. రాకెట్స్‌! | Sensex, Nifty end Samvat 2079 with marginal gains | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌.. రాకెట్స్‌!

Published Sat, Nov 11 2023 4:48 AM | Last Updated on Sat, Nov 11 2023 6:08 AM

Sensex, Nifty end Samvat 2079 with marginal gains - Sakshi

ద్రవ్యోల్బణ,  వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్‌ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్‌ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్‌ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్‌ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్‌ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు.  

పసిడి 10 శాతం దాకా అప్‌ ..
అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్‌ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు.

మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్‌ ప్యానెళ్లు, కొత్త గ్రీన్‌ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు.   

ఆసక్తికరంగా గ్లోబల్‌ ఎకానమీ ..
సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్‌ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్‌ 2080లో గ్లోబల్‌ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్‌ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్‌ ఇండియా, బ్యాంకింగ్‌ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్‌ డిజిట్‌ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు.   
– ప్రణవ్‌ హరిదాసన్, ఎండీ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌
టీవీఎస్‌ మోటర్‌
ప్రస్తుత ధర: 1,633
టార్గెట్‌ ధర: రూ. 2,100

దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్‌ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు.

భారతి ఎయిర్‌టెల్‌
ప్రస్తుత ధర: 935.. టార్గెట్‌ ధర: రూ. 1,155
దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్, మొబైల్‌ ఫోన్స్‌ వంటి మెరుగైన డిజిటల్‌ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్‌పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్‌ సెగ్మెంట్‌లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు.  

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
ప్రస్తుత ధర: 1,654
టార్గెట్‌ ధర: రూ. 1,950

స్ట్రక్చరల్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్‌ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ రంగంలో 60 శాతం మార్కెట్‌ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్‌ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్‌ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు.  

జ్యోతి ల్యాబ్స్‌
ప్రస్తుత ధర: 414..  టార్గెట్‌ ధర: రూ. 440
1983లో ఉజాలా ఫ్యాబ్రిక్‌ వైట్‌నర్‌ అనే సింగిల్‌ ప్రోడక్ట్‌ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్‌ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్‌ ఉన్న హెంకెల్‌ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్‌ కేర్, డిష్‌వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్‌ సోప్స్‌ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్‌ కన్జూమర్‌ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.  

కేపీఐటీ టెక్నాలజీస్‌
ప్రస్తుత ధర: 1,369
టార్గెట్‌ ధర: రూ. 1,500

ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ (ఈఆర్‌అండ్‌డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్‌మెంట్‌ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్‌ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్‌ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు.  

ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌
 ఐసీఐసీఐ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 938
టార్గెట్‌ ధర రూ. 1,081

దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్‌ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్‌ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్‌ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స, స్టాక్‌ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. 

మారుతీ సుజుకీ
ప్రస్తుత ధర రూ. 10,391  
టార్గెట్‌ ధర రూ. 12,000

దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది.  

అల్ట్రాటెక్‌ సిమెంట్‌
ప్రస్తుత ధర: 8,720
టార్గెట్‌ ధర: రూ. 9,800

ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్‌ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్‌ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్‌ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది.  
 
పాలీక్యాబ్‌ ఇండియా

ప్రస్తుత ధర: 5,137
టార్గెట్‌ ధర:5,877

భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్‌ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్‌ఎంఈజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.  
 
కళ్యాణ్‌ జ్యుయలర్స్‌

ప్రస్తుత ధర: 338
టార్గెట్‌ ధర:రూ. 364

భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది.

స్టాక్స్‌బాక్స్‌
 అశోకా బిల్డ్‌కాన్‌
ప్రస్తుత ధర: రూ. 139
టార్గెట్‌ ధర: రూ. 163

దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్‌ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్‌ 30 నాటికి ఆర్డర్‌ బుక్‌ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్‌ ఎస్‌వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్‌ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి.

కోల్‌ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 323
టార్గెట్‌ ధర: రూ. 370

భారత్‌ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్‌ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్‌ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం.

కోల్గేట్‌–పామోలివ్‌ (ఇండియా)
ప్రస్తుత ధర: 2,106..  టార్గెట్‌ ధర: రూ. 2,500
ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్‌ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం.

పురవంకర
ప్రస్తుత ధర: రూ. 147
టార్గెట్‌ ధర: రూ. 176

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి.  

భారతి ఎయిర్‌టెల్‌
ప్రస్తుత ధర: 935
టార్గెట్‌ ధర: రూ. 1,106
 
పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్‌పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్‌పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి.

 కోటక్‌ సెక్యూరిటీస్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 2,314
టార్గెట్‌ ధర రూ. 2,725

కీలక రంగాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్‌వర్క్‌ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది.

కెనరా బ్యాంకు
ప్రస్తుత ధర రూ. 387
టార్గెట్‌ ధర రూ. 425

కెనరా బ్యాంకు అసెట్‌ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్‌ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది.  

సిప్లా
ప్రస్తుత ధర రూ. 1,240
టార్గెట్‌ ధర రూ. 1,320

సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్‌ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్‌ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం.

సైయంట్‌
ప్రస్తుత ధర రూ. 1,659
టార్గెట్‌ ధర రూ. 2,000

ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్‌ ఉంటుందని సైయంట్‌ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్‌ క్వార్టర్‌లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్‌ కొనసాగించవచ్చు.

ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌
ప్రస్తుత ధర రూ. 210
టార్గెట్‌ ధర రూ. 276

సెపె్టంబర్‌ క్వార్టర్లో పీసీబీఎల్‌ (ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్‌ కోసం డిమాండ్‌ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్‌ గ్రేడ్‌లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్‌ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్‌ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement