Diwali 2023
-
దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్
ఇటీవల జరిగిన దీపావళి సమయంలో గూగుల్‌లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఐదు విషయాలను సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) రివీల్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి జరుపుకునే అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ ప్రశ్నలను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఐదు అంకెలతో కూడిన ఒక దీపాన్ని సూపించే ఫోటో కూడా షేర్ చేశారు. ఈ అంకెల ద్వారానే ప్రశ్నలను తెలియజేసారు. సుందర్ పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలు 👉భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? 👉దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తారు? 👉దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు? 👉దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? 👉దీపావళి సమయంలో ఆయిల్ బాత్ ఎందుకు? ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! ఈ ప్రశ్నలను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకునేవారు పండుగ అర్థం, సంప్రదాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో తెలుస్తోంది. దీపావళి జరుపుకుంటున్న చాలా మందికి ఆ పండుగ విశిష్టత గురించి తెలియదు, అలాంటి వారు ద్వారా సర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Happy Diwali to all who celebrate! We’re seeing lots of interest about Diwali traditions on Search, here are a few of the top trending “why” questions worldwide: https://t.co/6ALN4CvVwb pic.twitter.com/54VNnF8GqO — Sundar Pichai (@sundarpichai) November 12, 2023 -
ఫైర్ క్రాకర్స్‌తో బైక్‌పై డేంజరస్ స్టంట్స్: గుండెలదిరిపోయే వీడియో వైరల్
చెన్నై: దీపావళి వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు జాతీయ రహదారిపై బాణా సంచా పేల్చుతూ ప్రమాదకరమైన స్టంట్ చేసిన వైనం వైరల్‌గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసాలతో రోడ్డుమీద బీభత్సం సృష్టించారు. బైక్‌కు పటాకులు తగిలించి మరీ వాటిని పేల్చుకుంటూ చేసిన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాళ్లు అనుకున్నట్టుగా వీడియో వైరల్ అయ్యింది గానీ చివరికి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అటు నెటిజన్లు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. 71 వేల మంది ఫాలోవర్లున్న ‘డెవిల్ రైడర్’ అనే ఇన్‌స్టా పేజీలో నవంబర్ 9న ఈ వీడియో అప్లోడ్ అయింది. సిరుమరుత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై, వాహనానికి బాణాసంచా తగిలించుకుని, దాన్ని గిరా గిరా తిప్పుతూ, బైక్‌పై వెళ్లే వ్యక్తి కొద్దిసేపు బైక్ ముందు భాగాన్ని రోడ్డుపై నుంచి పైకి లేపుతూ బైకును ఒక టైరుపై ఉంచి స్టంట్స్ చేశాడు. బైక్ వెళ్తుండగానే బాణా సంచా పేల్చడంతో అవిపెద్ద ఎత్తున పేలి, గుండెలదిరేలా భారీగా మెరుపులు రావడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైడర్ తంజావూరుకు చెందిన ఎస్ అజయ్ అని గుర్తించారు. అజయ్‌తోపాటు, దాదాపు 10మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని జిల్లా ఎస్పీ వరుణ్‌కుమార్ ఎక్స్ (ట్విటర్)లో ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తమిళనాడులో కార్కు టపాసులు తగిలించి పేల్చిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. #WATCH | Tamil Nadu | In a viral video, a group of bikers were seen performing stunts and bursting firecrackers while riding motorcycles in Tiruchirappalli. Trichy SP Dr. Varun Kumar tells ANI, "Trichy District police arrested 10 persons under various IPC sections and under the… pic.twitter.com/fShjqlR6wV — ANI (@ANI) November 14, 2023 -
హైదరాబాద్ : ఘనంగా ‘సదర్’ ఉత్సవాలు (ఫొటోలు)
-
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
టపాసుల కాలుస్తుండగా పలువురికి తీవ్రగాయాలు
-
Diwali 2023 : అంబరాన్నంటిన దీపావళి సంబురాలు (ఫొటోలు)
-
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు
-
మంత్రి రోజా ఇంట్లో దీపావళి సంబరాలు
-
Team India Diwali Bash: దీపావళి సంబురాల్లో టీమిండియా.. చూడటానికి రెండు కళ్లు చాలవు (ఫోటోలు)
-
సోనూసూద్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
బాలీవుడ్ నటుడు, నిర్మాత సోనూసూద్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాల కంటే సామాజిక కార్యక్రమాల విషయంలోనే ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆయన ఈసారి దీపావళిని కూడా ప్రత్యేకంగా జరుపుకున్నారు. స్క్రీన్‌పైనే విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం హీరోగా వెలుగుతూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నటుడు తన అభిమానులతో కలిసి దీపావళీ పండుగను జరుపుకున్నాడు. సోనూసూద్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబైలోని ఆయన ఇంటి ముందు అభిమానులు భారీగా గుమిగూడారు. వారిని చూసిని ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఈ ఏడాది దీపావళిని అభిమానులతో కలిసి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సెల్ఫీలకు పోజులిచ్చి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో స్పందిస్తూ.. 'దీపావళిని ఇలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నట్లు భావిస్తున్నాను. వారి ప్రార్థనలతోనే నేను ఇక్కడ నిలబడి ఉన్నా. పండుగ రోజు ఏదైనా పార్టీకి వెళ్లి సరదాగా ఉండటం కంటే.. ఇలా వారితో గడపడం మనసుకు హత్తుకునేలా ఉంది. అని ఆయన అన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన అందరికీ స్వీట్స్ గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చారు. కొందరికి పేద విద్యార్థులకు ట్యాబ్స్ కూడా ఇచ్చారు. చాలా మంది అభిమానులు వారికున్న ఇబ్బందులు తెలుపుతూ సాయం చేయాలని ఒక అర్జీ పత్రాన్ని సోనూసూద్‌కు ఇచ్చారు. అవన్నీ స్వీకరించిన సోనూ త్వరలో కాల్ చేస్తామని తెలిపారు. దీంతో వారంతో ఆయనతో సంతోషంగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ కరోనా సమయంలో దేశంలోని చాలా మందికి వివిధ మార్గాల్లో సహాయం చేయడం ద్వారా సోనూ సూద్ నిజ జీవితంలో కూడా హీరో అయ్యాడు. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా బీహార్‌లోని నవాదా నగర్లో రెండు కళ్లూ అంధుడైన ఓ చిన్నారికి వైద్య ఖర్చులు భరించాడు. దీని ద్వారా ఓ అంధ బాలుడి జీవితం వెలుగులోకి వచ్చింది. వారిద్దరికీ ప్రాణం పోసిన సోనూసూద్ బీహార్‌లోని నవాడా నగరంలోని పక్రిబరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగన్ పంచాయతీ అమర్పూర్ గ్రామంలో గుల్షన్ అనే 11 నెలల పాప పుట్టుకతోనే అంధురాలు. కుటుంబం కూడా నిరుపేద కావడంతో చిన్నారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. ఇలా చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించిన సోనూసూద్.. గుల్షన్‌కు కంటిచూపు వచ్చేలా చేశాడు. అలాగే కొన్ని నెలల క్రితం ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సోనూసూద్ సాయం చేశాడు. ఉజ్జయినిలోని కనిపూర్లోని తిరుపతి ధామ్‌లో నివసిస్తున్న అథర్వ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ స్మా-2తో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు నటుడు సోనూసూద్‌ను కలుసుకుని చిన్నారి అనారోగ్యంపై తమ బాధను పంచుకున్నారు. అందువలన, వారు అధర్వకు చికిత్స కోసం అన్ని విధాలుగా సహాయం చేశారు. అంతే కాకుండా బిడ్డ చికిత్స కోసం వీలైనంత ఎక్కువ విరాళాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ చిన్నారికి ఆపరేషన్ చేపించేందుకు ఆయన అన్నీ ఏర్పాట్లు చేశాడు. My family ❤️ https://t.co/LaC0rA58Zt — sonu sood (@SonuSood) November 10, 2023 #WATCH | Actor Sonu Sood met his fans gathered outside his residence in Mumbai today, on the occasion of #Diwali pic.twitter.com/WhdrhQNEsJ — ANI (@ANI) November 12, 2023 -
అయోధ్యలో కన్నుల పండుగగా దీపోత్సవం (ఫొటోలు)
-
దీపావళి కాంతుల వేడుకల్లో సినీ తారలు (ఫొటోలు)
-
కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!
దీపావళి పండుగ సందర్భంగా కంపెనీలు మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయని చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. అనుకున్న విధంగానే కొన్ని కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద లక్షల డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్‌యూవీ400 దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ పండుగ సీజన్లో తన 'ఎక్స్‌యూవీ400' ఎలక్ట్రిక్ కారు మీద ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారు కొనుగోలుపైన 5 సంవత్సరాల పాటు ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ ఛార్జింగ్ కాండీ సదుపాయాలను అందిస్తుంది. ఎక్స్‌యూవీ400 ధరలు రూ. 15.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ హ్యుందాయ్ కంపెనీ తన 'కోనా' ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద దీపావళి సందర్భంగా రూ. 2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 23.84 లక్షలు. అయితే ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే రూ. 2 లక్షల తగ్గింపు లభిస్తుంది. సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దీపావళి సందర్భంగా తన 'సీ5 ఎయిర్‌క్రాస్' SUV మీద రూ. 2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 36.91 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్కోడా కుషాక్ దీపావళి పండుగ సందర్భంగా స్కోడా కంపెనీ తన కుషాక్ కారు మీద రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. దేశీయ విఫణిలో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఆఫర్ ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్ ఎంజీ ఆస్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఆస్టర్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 1.75 లక్షల తగ్గింపు అందిస్తోంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. -
పండుగపూట పడిపోయిన పసిడి.. స్థిరంగా వెండి - కొత్త ధరలు ఇలా!
భారతీయ మార్కెట్లో దసరా సందర్భంగా భారీగా పెరిగిన పసిడి ధరలు దీపావళి సమయంలో కొంత తగ్గుముఖం పట్టాయి. నేడు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5554, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6059గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 55540, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60590గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5599 (22 క్యారెట్స్), రూ. 6108 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 55990, రూ. 61080గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 10 (22 క్యారెట్స్), రూ. 10 (24 క్యారెట్స్) మాత్రమే తగ్గింది. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5569, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6069గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 10 (22 క్యారెట్స్), రూ. 60 (24 క్యారెట్స్) తగ్గి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55690, రూ. 60690కి చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కూడా స్థిరంగా ఉన్నాయి. -
ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా..
వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్ 12న) తారలు సోషల్ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్ చేశారో చూద్దాం.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Krésha (@kreshabajaj) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: కన్నుమూసిన సీనియర్ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే.. -
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దీపావళి అంటేనే కాంతి-వెలుగు. చీకటిపై వెలుగు..చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం..దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నా’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 12, 2023 -
స్టాక్స్.. రాకెట్స్!
ద్రవ్యోల్బణ, వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు. పసిడి 10 శాతం దాకా అప్ .. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు. మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్లు, కొత్త గ్రీన్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. ఆసక్తికరంగా గ్లోబల్ ఎకానమీ .. సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్ 2080లో గ్లోబల్ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్ డిజిట్ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు. – ప్రణవ్ హరిదాసన్, ఎండీ, యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టీవీఎస్ మోటర్ ప్రస్తుత ధర: 1,633 టార్గెట్ ధర: రూ. 2,100 దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935.. టార్గెట్ ధర: రూ. 1,155 దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ ఫోన్స్ వంటి మెరుగైన డిజిటల్ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్ సెగ్మెంట్లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుత ధర: 1,654 టార్గెట్ ధర: రూ. 1,950 స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ రంగంలో 60 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు. జ్యోతి ల్యాబ్స్ ప్రస్తుత ధర: 414.. టార్గెట్ ధర: రూ. 440 1983లో ఉజాలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనే సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్ ఉన్న హెంకెల్ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ కేర్, డిష్వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్ సోప్స్ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్ కన్జూమర్ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: 1,369 టార్గెట్ ధర: రూ. 1,500 ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 938 టార్గెట్ ధర రూ. 1,081 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స, స్టాక్ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 10,391 టార్గెట్ ధర రూ. 12,000 దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ధర: 8,720 టార్గెట్ ధర: రూ. 9,800 ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది. పాలీక్యాబ్ ఇండియా ప్రస్తుత ధర: 5,137 టార్గెట్ ధర:5,877 భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్ఎంఈజీ (ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రస్తుత ధర: 338 టార్గెట్ ధర:రూ. 364 భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది. స్టాక్స్‌బాక్స్ అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర: రూ. 139 టార్గెట్ ధర: రూ. 163 దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్ ఎస్వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి. కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 323 టార్గెట్ ధర: రూ. 370 భారత్ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం. కోల్గేట్–పామోలివ్ (ఇండియా) ప్రస్తుత ధర: 2,106.. టార్గెట్ ధర: రూ. 2,500 ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్మెంట్ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం. పురవంకర ప్రస్తుత ధర: రూ. 147 టార్గెట్ ధర: రూ. 176 ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935 టార్గెట్ ధర: రూ. 1,106 పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 2,314 టార్గెట్ ధర రూ. 2,725 కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది. కెనరా బ్యాంకు ప్రస్తుత ధర రూ. 387 టార్గెట్ ధర రూ. 425 కెనరా బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది. సిప్లా ప్రస్తుత ధర రూ. 1,240 టార్గెట్ ధర రూ. 1,320 సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం. సైయంట్ ప్రస్తుత ధర రూ. 1,659 టార్గెట్ ధర రూ. 2,000 ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్ ఉంటుందని సైయంట్ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్ క్వార్టర్లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్ కొనసాగించవచ్చు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రస్తుత ధర రూ. 210 టార్గెట్ ధర రూ. 276 సెపె్టంబర్ క్వార్టర్లో పీసీబీఎల్ (ఫిలిప్స్ కార్బన్ బ్లాక్) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్ కోసం డిమాండ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్ గ్రేడ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది. -
Dhanteras 2023: బంగారానికి ధనత్రయోదశి డిమాండ్
న్యూఢిల్లీ: దీపావళికి ముందు ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం షాపులు సందడిగా కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే బంగారం, వెండి విక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు కూడా కొంత తగ్గడం సానుకూలించింది. అక్టోబర్ 28న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.63,000 వరకు వెళ్లగా, అక్కడి నుంచి రూ.1,500 వరకు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఎక్కువ మందిలో ఉండడం తెలిసిందే. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,950 వద్ద ముగియగా, ధనత్రయోదశి సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాములకు రూ.50,139 (పన్నులు కాకుండా) పలికింది. సాధారణంగా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల వరకు బంగారం అమ్ముడుపోతుంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి షాపులకు కస్టమర్ల రాక పెరిగినట్టు వర్తకులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత త్రయోదశి రావడం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటున్నందున కొనుగోళ్లు మరింత పెరగొచ్చని వర్తకుల అంచనాగా ఉంది. ‘‘బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. మంచి విక్రయాలు నమోదవుతాయని భావిస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆరి్టకల్స్ కొనుగోళ్లు జరిగాయి. ఇందులో బంగారం కొనుగోళ్లు రూ.27,000 కోట్లుగా, వెండి కొనుగోళ్లు రూ.3,000 కోట్ల వరకు ఉంటాయని ఆల్ ఇండియా జ్యుయలర్స్, అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. గతేడాది ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు రూ.25,000 కోట్లుగా ఉన్నాయి. -
చిన్నారులతో లక్ష్మి మంచు దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన 'దీపావళి' సందర్భంగా దేశీయ మార్కెట్లో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువుల సేల్స్ ఒక ఎత్తయితే, టపాసులు విక్రయాలే మరో ఎత్తుగా సాగుతాయి. రాబోయే దీపావళిని దృష్టిలో ఉంచుకుని భారత్ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించింది. దీని వల్ల చైనాకు వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చైనా వస్తువులను భారతదేశంలోకి దిగుమతి చేసుకోకూడదని తీసుకున్న నిర్ణయంతో చైనా సుమారు రూ. 50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలునివ్వడంతో దీపావళి సమయంలో చైనా ఉత్పతుల దిగుమతులు భారీగా తగ్గుతాయి. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి 'సీఏఐటీ' ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించాడు. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, బదులుగా భారతీయ వస్తువులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా భారీ నష్టం.. ప్రతి సంవత్సరం పండుగ సీజన్లలో భారతీయ వ్యాపారులు చైనా నుంచి రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారని సమాచారం. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా.. రాఖీ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్లు, వినాయక చవితి సమయంలో రూ. 500 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.