దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ | Google CEO Sundar Pichai Reveals Top Five Most Common Questions On Google Search In Diwali 2023 - Sakshi
Sakshi News home page

దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

Published Thu, Nov 16 2023 4:16 PM | Last Updated on Thu, Nov 16 2023 4:40 PM

Sundar Pichai Reveals Top Five Questions On Google Search In Diwali 2023 - Sakshi

ఇటీవల జరిగిన దీపావళి సమయంలో గూగుల్‌లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఐదు విషయాలను సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) రివీల్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి జరుపుకునే అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ ప్రశ్నలను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఐదు అంకెలతో కూడిన ఒక దీపాన్ని సూపించే ఫోటో కూడా షేర్ చేశారు. ఈ అంకెల ద్వారానే ప్రశ్నలను తెలియజేసారు.

సుందర్ పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలు
👉భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు?
👉దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తారు?
👉దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు?
👉దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు?
👉దీపావళి సమయంలో ఆయిల్ బాత్ ఎందుకు?

ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్‌పీరియన్స్!

ఈ ప్రశ్నలను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకునేవారు పండుగ అర్థం, సంప్రదాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో తెలుస్తోంది. దీపావళి జరుపుకుంటున్న చాలా మందికి ఆ పండుగ విశిష్టత గురించి తెలియదు, అలాంటి వారు ద్వారా సర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement