రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల ప్రభావం
చమురు ధరలు, డాలరు కదలికలు కీలకం
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్‌పై అంచనాలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే.
దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్‌ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గత వారమిలా..
శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్‌క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్‌చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్‌బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్‌టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.
ఆర్థిక గణాంకాలు
దేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు.
యుద్ధ భయాలు
రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్‌వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది.
అక్టోబర్‌లో తుఫాను సహా బోయింగ్‌లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు
ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment