Foreign markets
-
దేశ, విదేశీ గణాంకాలకు ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.గత వారమిలా..శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్‌చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.ఆర్థిక గణాంకాలుదేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు. యుద్ధ భయాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్‌వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో తుఫాను సహా బోయింగ్‌లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది. -
వాహన ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ.. ► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి. -
అమెరికాలో తొలిసారిగా అమూల్ పాలు
న్యూఢిల్లీ: అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహతా తెలిపారు. ‘మేము దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. కానీ తాజా పాలను భారత్ వెలుపల ప్రవేశపెట్టడం మాత్రం ఇదే ప్రథమం. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ ఎన్ ట్రిమ్ ఉత్పత్తులను వారం రోజుల్లో ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 108 ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిషిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ ఎంఎంపీఏ చేపడుతుందని, అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ తమ సంస్థ చేపడుతుందని మెహతా చెప్పారు. ముందుగా న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో అమూల్ పాలు లభిస్తాయి. వచ్చే 3–4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మెహతా చెప్పారు. రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. జీసీఎంఎంఎఫ్ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది. -
విదేశాల్లో దుకాణం బంద్! ఆస్తులు అమ్మేస్తున్న జొమాటో..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విదేశాల్లో తమ ఉనికిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆస్తులు అమ్మేస్తోంది. జొమాటో వియత్నాం కంపెనీ లిమిటెడ్, పోలాండ్‌కు చెందిన గ్యాస్ట్రోనౌసీ వంటి అనుబంధ సంస్థలను లిక్విడేట్ చేస్తున్నట్లు జొమాటో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వియత్నాం, పోలాండ్లోని తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థల కోసం ఖర్చు తగ్గించే చర్యగా రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు జొమాటో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్లో తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 2023 మార్చి నుంచి పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది. 2023 సంవత్సరంలో జొమాటో చిలీ ఎస్పీఏ, పీటీ జొమాటో మీడియా ఇండోనేషియా (PTZMI), జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్, జొమాటో ఆస్ట్రేలియా, జొమాటో మీడియా పోర్చుగల్ యూనిపెస్సోల్ ఎల్డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌టైమ్, జొమాటో స్లొవేకియా వంటి వివిధ సంస్థలకు జొమాటో వీడ్కోలు పలికింది. అలాగే కెనడా, యూఎస్, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్, సింగపూర్లలోనూ జొమాటో తన అకార్యకలాపాలను నిలిపివేసింది. ఇలా అనేక దేశాల నుంచి వైదొలిగినప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో మాత్రం యాక్టివ్గానే ఉంది. 16 ప్రత్యక్ష అనుబంధ సంస్థలు, 12 స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలు, జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్ కామర్స్, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఒక అనుబంధ కంపెనీలను జొమాటో తన 2023 వార్షిక నివేదికలో పేర్కొంది. -
డీఎస్పీ అంతర్జాతీయ ఫండ్స్‌లో పెట్టుబడులకు బ్రేక్
న్యూఢిల్లీ: డీఎస్పీ మ్యూచువల్ ఫండ్.. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఆరు పథకాల్లోకి తాజా పెట్టుబడులు స్వీకరించడం లేదని ప్రకటించింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, డీఎస్పీ గ్లోబల్ అలోకేషన్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ గోల్డ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ ఎనర్జీ ఫండ్ పథకాలకు ఈ నిర్ణయం అమలవుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలకు తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవద్దంటూ సెబీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు 7 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) మించకూడదని సెబీ లోగడే పరిమితి విధించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ ఈ పరిమితి దాటిపోవడంతో తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం నిలిపివేయాలని సెబీ ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి 2 నుంచి అన్ని కొనుగోళ్లు.. స్విచ్ ఇన్, న్యూసిప్/ఎస్టీపీ/డీటీపీ రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు ఆమోదించడం లేదని డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ప్రకటన జారీ చేసింది. -
విదేశాలకు భారత పౌల్ట్రీ పరికరాలు..
• నాణ్యత, ధరలే ప్రధాన కారణం • ఎగుమతుల వాటా 25 శాతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో పౌల్ట్రీ పరికరాల తయారీలో ఉన్న భారత కంపెనీలకు విదేశీ మార్కెట్లు కలసి వస్తున్నారుు. నాణ్యత, అందుబాటు ధర కారణంగా భారత్‌లో రూపొందిన ఉపకరణాలకు పలు దేశాలకు చెందిన రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి తయారీ కంపెనీలకు ఆఫ్రికా ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. ఆ తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మధ్యప్రాచ్య దేశాలకు సైతం ఎగుమతులు పెరుగుతున్నారుు. దేశీయంగా పౌల్ట్రీ రంగంలో వేగం తగ్గడంతో కంపెనీలు ఎగుమతులపైనే ఫోకస్ చేస్తున్నారుు. పౌల్ట్రీ పరికరాల తయారీ కంపెనీల ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50-60 శాతం మాత్రమే ఉంది. ఎగుమతుల జోష్‌తో వచ్చే రెండేళ్లలో ఇది 80 శాతానికి చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నారుు. ఆరేళ్లలో 16 నుంచి 25కు.. పౌల్ట్రీ పరికరాల మార్కెట్ దేశంలో 2009-10లో రూ.800 కోట్లు నమోదు చేసింది. ఆ సమయంలో ఎగుమతుల వాటా 16 శాతమే. 2015-16లో వ్యాపారం రూ.1,000 కోట్లకు ఎగసింది. ఎగుమతుల వాటా ఇందులో 25 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ తగ్గడంతో విదేశీ మార్కెట్లపై కంపెనీలు దృష్టిసారించాయని చెప్పడానికి పెరిగిన ఎగుమతులే నిదర్శనం. ఉపకరణాల తయారీలో వ్యవస్థీకృత రంగ కంపెనీలు 40 దాకా ఉంటాయని ధుమాల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అనిల్ ధుమాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. చిన్నచితకా 200 కంపెనీలు ఉంటాయని చెప్పారు. భారత ఉపకరణాలు భద్రమైనవన్న అభిప్రాయమూ విదేశాల్లో ఉందని అన్నారు. అందుకే ఇక్కడి కంపెనీలతో చేతులు కలిపేందుకు విదేశీ సంస్థలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. చైనా ఉత్పత్తులను భారత కంపెనీలు అనుసరించవని చెప్పారు. వన్ స్టాప్ సొల్యూషన్‌గా భారత్ ఎదిగిందని గుర్తు చేశారు. జోరు తగ్గిన భారత్.. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో ఒక లక్ష మంది రైతులు ఉన్నారు. మొత్తం పౌల్ట్రీ ఫామ్స్‌లో 5 శాతం మాత్రమే యాంత్రీకీకరణ చెందారుు. 2008కి ముందు పెద్ద ఎత్తున యాంత్రీకీకరణ జరిగింది. ఎగుమతులతో కలుపుకుని ఉపకరణాల మార్కెట్ రూ.3,000 కోట్లను నమోదు చేసింది. ఇప్పుడు రూ.1,000 కోట్లకు పడిపోరుుంది. భారత్‌లో జోరు తగ్గడమే ఇందుకు కారణమని చక్ర గ్రూప్ ఎండీ పి.చక్రధర రావు వెల్లడించారు. నాలుగేళ్లుగా దేశీయ పౌల్ట్రీ రంగం నష్టాలతో నడుస్తోంది. దీంతో కొత్త పెట్టుబడులకు రైతులు దూరంగా ఉంటున్నారు. కాగా, 2016-17లో పౌల్ట్రీ పరికరాల మార్కెట్ రూ.1,100 కోట్లు నమోదవుతుందని అంచనా. భారత వాతావరణానికి తగ్గట్టుగా ఉపకరణాలను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నారుు. విదేశాల నుంచి ఎవరూ తెప్పించుకోవడం లేదని చక్రధర రావు తెలిపారు. ఇదీ భారత పౌల్ట్రీ మార్కెట్.. భారత్ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానం, బ్రారుులర్ చికెన్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 6,500 కోట్ల గుడ్లు, 38 లక్షల టన్నుల చికెన్ మాంసం ఉత్పత్తి అవుతోంది. పౌల్ట్రీ విపణి విలువ రూ.1 లక్ష కోట్లుంది. వృద్ధి రేటు 11-12 శాతం నమోదవుతోంది. దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఏటా రూ.10,000 కోట్ల వ్యాపారం జరుగుతోందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి తెలిపారు. దేశంలో సగటు వార్షిక వినియోగం చికెన్ 4 కిలోలు, గుడ్లు 57 ఉంది. అంతర్జాతీయ సగటు చూస్తే చికెన్ వినియోగం 11.2 కిలోలు, గుడ్లు సంఖ్య 155గా నమోదైంది. -
27,000 దాటిన సెన్సెక్స్
మార్కెట్ అప్డేట్ * 217 పాయింట్లు ఫ్లస్ * ఐదు వారాల గరిష్టం విదేశీ మార్కెట్ల ప్రోత్సాహం, డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ మరోసారి మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరుసి సెన్సెక్స్ 217 పాయింట్లు ఎగసి 27,098 వద్ద ముగిసింది. తద్వారా ఐదు వారాల తరువాత మళ్లీ 27,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా, నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుంది. 8,090 వద్ద నిలిచింది. ఒక దశలో 8,098ను తాకింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా రియల్టీ, మెటల్స్, ఆటో, ఐటీ రంగాలు 2.5-1.5% మధ్య పుంజుకున్నాయి. ఇతర విశేషాలివీ... * మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, సెయిల్ 6-2% మధ్య ఎగశాయి. * మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, బజాజ్ఆటో, రిలయన్స్, ఎంఅండ్ఎం, మారుతీ, సిప్లా 3.5-1.5% మధ్య బలపడ్డాయి. * రియల్టీ షేర్లు డీఎల్ ఎఫ్, శోభా, డీబీ, ఇండియాబుల్స్, యూనిటెక్ 6-3% మధ్య జంప్ చేశాయి. * హెల్త్‌కేర్ బ్లూచిప్స్ డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1%పైగా నష్టపోయాయి. * మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,610 లాభపడగా, 1,355 క్షీణించాయి. * ఎఫ్ఐఐలు రూ. 786 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ రూ. 507 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి. * బీఎస్ఈ-500లో ఎస్ఆర్ఎఫ్ 20% దూసుకెళ్లాయి. -
విదేశీ రుణ నిబంధనల సడలింపు
ముంబై: విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు విదేశీ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే నిబంధనలను సడలించింది. బ్యాంకులు ఈక్విటీ క్యాపిటల్‌లో 100 శాతం దాకా విదేశాల నుంచి రుణాలు తీసుకోవచ్చు. అయితే 10 మిలియన్ డాలర్ల దాకా గరిష్ట పరిమితి ఉంటుంది. అలాగే, డాలర్ మారకంలో విదేశీ రుణాల సమీకరణకు సంబంధించి బ్యాంకులు .. తనతో స్వాప్ లావాదేవీలు కుదుర్చుకునే విషయంలోనూ ఆర్బీఐ నిబంధనలు సడలించింది. మరోవైపు, విదేశీ విద్యార్థులు..అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో (యూసీబీ) ఖాతాలు తెరవడానికి సంబంధించి కేవైసీ (ఖాతాదారుల వివరాల వెల్లడి) నిబంధనలు కూడా ఆర్బీఐ సరళతరం చేసింది. దీని ప్రకారం విద్యార్థుల పాస్‌పోర్టు, వీసాల ప్రాతిపదికన యూసీబీలు నాన్ రెసిడెంట్ ఆర్డినరి (ఎన్ఆర్వో) ఇవ్వొచ్చు. ఆ తర్వాత 30 రోజుల్లోగా సదరు విద్యార్థి స్థానికంగా తన చిరునామా ధృవీకరణ (రెంటల్ అగ్రిమెంట్ వంటివి) పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కరెన్సీ నోట్లు, నాణేల పంపిణీకి బీసీల సేవలు కరెన్సీ నోట్లకు డిమాండ్‌ను తట్టుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషించాల్సిందిగా బ్యాంకులకు భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సూచించింది. బ్యాంకు నోట్లు, నాణేలు పంపిణి చేయడానికి బిజినెస్ కరెస్పాండెంట్ల(బీసీ)ల సేవలను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని ఆరబీఐ కోరింది.