విదేశాలకు భారత పౌల్ట్రీ పరికరాలు..
• నాణ్యత, ధరలే ప్రధాన కారణం
• ఎగుమతుల వాటా 25 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
పౌల్ట్రీ పరికరాల తయారీలో ఉన్న భారత కంపెనీలకు విదేశీ మార్కెట్లు కలసి వస్తున్నారుు. నాణ్యత, అందుబాటు ధర కారణంగా భారత్‌లో రూపొందిన ఉపకరణాలకు పలు దేశాలకు చెందిన రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి తయారీ కంపెనీలకు ఆఫ్రికా ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. ఆ తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మధ్యప్రాచ్య దేశాలకు సైతం ఎగుమతులు పెరుగుతున్నారుు. దేశీయంగా పౌల్ట్రీ రంగంలో వేగం తగ్గడంతో కంపెనీలు ఎగుమతులపైనే ఫోకస్ చేస్తున్నారుు. పౌల్ట్రీ పరికరాల తయారీ కంపెనీల ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50-60 శాతం మాత్రమే ఉంది. ఎగుమతుల జోష్‌తో వచ్చే రెండేళ్లలో ఇది 80 శాతానికి చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నారుు.
ఆరేళ్లలో 16 నుంచి 25కు..
పౌల్ట్రీ పరికరాల మార్కెట్ దేశంలో 2009-10లో రూ.800 కోట్లు నమోదు చేసింది. ఆ సమయంలో ఎగుమతుల వాటా 16 శాతమే. 2015-16లో వ్యాపారం రూ.1,000 కోట్లకు ఎగసింది. ఎగుమతుల వాటా ఇందులో 25 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ తగ్గడంతో విదేశీ మార్కెట్లపై కంపెనీలు దృష్టిసారించాయని చెప్పడానికి పెరిగిన ఎగుమతులే నిదర్శనం. ఉపకరణాల తయారీలో వ్యవస్థీకృత రంగ కంపెనీలు 40 దాకా ఉంటాయని ధుమాల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అనిల్ ధుమాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. చిన్నచితకా 200 కంపెనీలు ఉంటాయని చెప్పారు. భారత ఉపకరణాలు భద్రమైనవన్న అభిప్రాయమూ విదేశాల్లో ఉందని అన్నారు. అందుకే ఇక్కడి కంపెనీలతో చేతులు కలిపేందుకు విదేశీ సంస్థలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. చైనా ఉత్పత్తులను భారత కంపెనీలు అనుసరించవని చెప్పారు. వన్ స్టాప్ సొల్యూషన్‌గా భారత్ ఎదిగిందని గుర్తు చేశారు.
జోరు తగ్గిన భారత్..
దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో ఒక లక్ష మంది రైతులు ఉన్నారు. మొత్తం పౌల్ట్రీ ఫామ్స్‌లో 5 శాతం మాత్రమే యాంత్రీకీకరణ చెందారుు. 2008కి ముందు పెద్ద ఎత్తున యాంత్రీకీకరణ జరిగింది. ఎగుమతులతో కలుపుకుని ఉపకరణాల మార్కెట్ రూ.3,000 కోట్లను నమోదు చేసింది. ఇప్పుడు రూ.1,000 కోట్లకు పడిపోరుుంది. భారత్‌లో జోరు తగ్గడమే ఇందుకు కారణమని చక్ర గ్రూప్ ఎండీ పి.చక్రధర రావు వెల్లడించారు. నాలుగేళ్లుగా దేశీయ పౌల్ట్రీ రంగం నష్టాలతో నడుస్తోంది. దీంతో కొత్త పెట్టుబడులకు రైతులు దూరంగా ఉంటున్నారు. కాగా, 2016-17లో పౌల్ట్రీ పరికరాల మార్కెట్ రూ.1,100 కోట్లు నమోదవుతుందని అంచనా. భారత వాతావరణానికి తగ్గట్టుగా ఉపకరణాలను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నారుు. విదేశాల నుంచి ఎవరూ తెప్పించుకోవడం లేదని చక్రధర రావు తెలిపారు.
ఇదీ భారత పౌల్ట్రీ మార్కెట్..
భారత్ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానం, బ్రారుులర్ చికెన్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 6,500 కోట్ల గుడ్లు, 38 లక్షల టన్నుల చికెన్ మాంసం ఉత్పత్తి అవుతోంది. పౌల్ట్రీ విపణి విలువ రూ.1 లక్ష కోట్లుంది. వృద్ధి రేటు 11-12 శాతం నమోదవుతోంది. దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఏటా రూ.10,000 కోట్ల వ్యాపారం జరుగుతోందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి తెలిపారు. దేశంలో సగటు వార్షిక వినియోగం చికెన్ 4 కిలోలు, గుడ్లు 57 ఉంది. అంతర్జాతీయ సగటు చూస్తే చికెన్ వినియోగం 11.2 కిలోలు, గుడ్లు సంఖ్య 155గా నమోదైంది.