అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష నియామక పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో ఇరుదేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడునుంది. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కెనడా, మెక్సికో దేశాలు అమెరికా సరఫరా చేస్తున్న ప్రధాన ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.
కెనడా అత్యధికంగా ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులు
ఖనిజ ఇంధనాలు, నూనెలు: 128.51 బిలియన్ డాలర్లు
రైల్వే మినహా ఇతర వాహనాలు: 58.21 బిలియన్ డాలర్లు
యంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు: 33.75 బిలియన్ డాలర్లు
ప్లాస్టిక్స్: 14.05 బిలియన్ డాలర్లు
ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు: 12.43 బిలియన్ డాలర్లు
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు: 11.87 బిలియన్ డాలర్లు
కలప, చెక్క వస్తువులు: 11.53 బిలియన్ డాలర్లు
అల్యూమినియం: 11.36 బిలియన్ డాలర్లు
ఇనుము, ఉక్కు: 8.51 బిలియన్ డాలర్లు
ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పరికరాలు: 7.58 బిలియన్ డాలర్లు
మెక్సికో చేసే టాప్ ఎగుమతులు
వాహనాలు: 130.03 బిలియన్ డాలర్లు
విద్యుత్ యంత్రాలు: 85.55 బిలియన్ డాలర్లు
న్యూక్లియర్ రియాక్టర్లు: 81.61 బిలియన్ డాలర్లు
ఖనిజ ఇంధనాలు, నూనెలు: 25.02 బిలియన్ డాలర్లు
ఆప్టికల్, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు: 22.33 బిలియన్ డాలర్లు
ఫర్నిచర్, పరుపులు: 13.35 బిలియన్ డాలర్లు
పానీయాలు, స్పిరిట్స్, వెనిగర్: 11.75 బిలియన్ డాలర్లు
ప్లాస్టిక్స్: 10.26 బిలియన్ డాలర్లు
కూరగాయలు, దుంపలు: 8.82 బిలియన్ డాలర్లు
ఇదీ చదవండి: ‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’
అమెరికా ఇరుదేశాలపై విధించిన 25 శాతం అధిక సుంకం వల్ల పైన పేర్కొన్న వస్తువులను సరఫరా చేస్తున్న ఇతర మిత్ర దేశాలకు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలున్నాయి. అయితే కెనడా, మెక్సికోలు ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాయి. కానీ, ఇందుకు ట్రంప్ అనుమతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment