export ban
-
‘సన్నాల ఎగుమతి నిషేధం’తో రాష్ట్ర రైతులకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తు లో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకోవడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారనుంది. కేంద్రం చర్యతో విదేశాల్లో డిమాండ్ ఉన్న సాగు రకాలైన జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా బియ్యం వంగడాలు పండించే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రెండు సీజన్లలో సాగయ్యే సన్నాలను స్థానిక వినియోగంతోపాటు విదేశీ ఎగు మతుల కోసమే అధికంగా పండిస్తున్న రైతులు అధిక ధరలను పొందుతు న్నా రు. క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య విక్రయిస్తూ లాభపడుతు న్నారు. కానీ ప్రస్తుతం ఈ రైతులు కూడా ఈ వానాకాలం పంట నుంచే దొడ్డు బియ్యం వైపు మరలే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతి సుంకం విధించినా పెరిగిన ఎగుమతులు... బియ్యం ఎగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గతేడాది 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. కానీ సుంకం విధించినా ఎగుమతులు ఆగకపోగా సుమారు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లింది. అదే సమయంలో దేశంలో బియ్యం ధరలు ఒక్క ఏడాదిలోనే 11.5 శాతం మేర పెరిగాయి. అలాగే దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గతేడాది నుంచి అది 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీంతో కేంద్రం భవిష్యత్తు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో 24 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం పండించే పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ‘సాక్షి’తో అన్నారు. దేశీయ అవసరాలు, విదేశీ ఎగుమతులకే 40 శాతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం పండిస్తున్న రైతులు... దాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మిగతా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ను ల సన్న ధాన్యాన్ని (అంటే 40 శాతం పంటను) రైతులు స్వీ య అవసరాలతోపాటు స్థానిక, దేశీయ, విదేశీ విక్రయాల కోసం పండిస్తున్నట్లు ఓ మిల్లర్ల సంఘం నాయకుడు విశ్లేషించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి వచ్చే సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక, దేశీయ అవసరాలకు వినియోగి స్తున్న మిల్లర్లు... మరో 16 లక్షల మెట్రిక్ టన్ను లను వివిధ ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని సన్నబియ్యాన్ని ఎగుమతులకు వినియోగిస్తున్నారు. ఆ రకాలను మినహాయించాలి.. బాస్మతీయేతర ముడి బియ్యం ఎగుమతిపై నిషేధం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధం. జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ మొదలైన రకాలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది ఇష్టపడే వరి రకాలు. తెలంగాణలోనే పండే ఈ రకాలు ఎకరాకు బాస్మతి కంటే తక్కువ దిగుబడి ఇస్తాయి. అలాంటి శ్రేష్టమైన రకానికి లాభ దాయకమైన ధరలను పొందకపోతే రైతులు డిమాండ్‌లేని సాధారణ రకాలను సాగు చేస్తారు. బాస్మతి తర హాలోనే తెలంగాణలోని సూపర్ ఫైన్ రకాలను నిషేధం నుంచి మినహాయించాలి. –తూడి దేవేందర్‌రెడ్డి, దక్షిణ భారత మిల్లర్ల సంఘం నాయకుడు బియ్యం సేకరణలో రాష్ట్రానికి కేంద్రం సహకరించట్లేదు.. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే ప్రపంచానికి కూడా అవ సరమైన బియ్యాన్ని అందిస్తాం. ఇప్పటికే ఏటా 3 కోట్ల ట న్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులు వచ్చే రెండేళ్లలో మరో కోటి టన్నులు అదనంగా పండించబోతున్నా రు. అసలు యా సంగిలో దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్న రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ట్రాల్లో వరి పంట తగ్గడడం వల్లనే కేంద్రం ఎగుమ తులపై నిషేధం విధించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించే విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఆంక్షలను పక్కనపెట్టి ప్రస్తుతం మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని ముందుగా ఎఫ్‌సీఐ సేకరించాలి. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
గోధుమ నిల్వలపై పరిమితులు
న్యూఢిల్లీ: పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్) విధానం కింద సెంట్రల్ పూల్ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది. గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
జూన్ 1 నుంచి కోళ్ల ఎగుమతులు బంద్.. చికెన్ కోసం జనం క్యూ!
సింగపూర్: మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భగ్గుమనేలా ఉన్నాయి. ఈనేపథ్యంలో జనం చికెన్ కోసం సూపర్మార్కెట్లు, మాంసం దుకాణాలకు పోటెత్తారు. రేపటి నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఇదే అదనుగా మాంస ప్రియులు పెద్ద మొత్తాల్లో కోడి మాంసాన్ని కొనుగోలు చేశారు. దీంతో చాలా మాంసం కొట్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. జూన్ 1 నుంచి మలేసియా చికెన్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిత్తింది. స్వదేశంలో కోడి మాంసం డిమాండ్, సరఫరా చైన్‌ను స్థిరీకరించేందుకు మలేసియా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు 3.6 మిలియన్ కోళ్ల ఎగుమతిని నిలుపుదల చేస్తున్నామని గతవారం ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ తెలిపారు. దేశంలో చికెన్ సరఫరా పెంచి ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి👉 కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే.. ఒక్కసారిగా మలేసియా పౌల్ట్రీపైనే సింగపూర్ చికెన్ వ్యాపారం మూడోవంతు ఆధారపడి ఉంది. ఇక మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 శాతం వరకు రేట్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జనం మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మరోవైపు కోడి మాంసం సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని సింగపూర్ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. చికెన్ ప్రత్యామ్నాయ మాంసంవైపునకు కూడా మళ్లాలని ప్రజలకు సూచించింది. చదవండి👉ఒక్క అడుగు అటువైపు వేసిఉంటే నుజ్జునుజ్జు అయ్యేవాడే.. భయంగొలిపే వీడియో! -
గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్: కేంద్ర మంత్రి
దావోస్: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు. దేశం 2 మిలియన్ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్ టన్నులుగా ఉందని గోయల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సెషన్లో అన్నారు. మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు, బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది. ఉత్పత్తి-గుమతి ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. విదేశాల నుండి భారత్ గోధుమలకు మెరుగైన డిమాండ్ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్ టన్నులు. అయితే 105–106 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్ టన్నులు. India wheat exports are less than 1% of world trade and our export regulation should not affect global markets. We continue to allow exports to vulnerable countries and neighbors. pic.twitter.com/N61929BNt5 — Piyush Goyal (@PiyushGoyal) May 25, 2022 -
భారత్‌ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం
ముంబై: గోధుమల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం ద్రవ్యోల్బణం నియంత్రణకు కొంత సానుకూలమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రస్తుత అధిక వేడి వాతావరణం గోధుమల దిగుబడికి ఎన్నో సవాళ్లను విసురుతోంది. ప్రభుత్వం అనూహ్యంగా గోధుమల ఎగుమతులను నిషేధించడం దేశీయంగా ధరల ఒత్తిళ్లను కొంత వరకు తగ్గించగలదు’’అని బార్క్లేస్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు 8 శాతం సమీపానికి చేరడం తెలిసిందే. కొద్ది కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ రెపో రేటు పెంపు, గోధుమల ఎగుమతులపై నిషేధం సానుకూలిస్తాయన్న అభిప్రాయాలను బార్క్లేస్ వ్యక్తం చేసింది. గోధుమల ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై 0.27 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించడం, సెర్బియా, కజకిస్థాన్ ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించిన తరహాలోనే భారత్ నిర్ణయం కూడా ఉందని బార్క్లేస్ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు ఇప్పటికే 44 శాతం పెరగ్గగా.. దేశీయంగా మూడు శాతమే పెరగడం గమనార్హం. ఎగుమతులపై నిషేధం విధించకుండా 10 మిలియన్ టన్నుల సమీకరణ లక్ష్యాన్ని ధరలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం సాధించడం కష్టమవుతుందని బార్క్లేస్ నివేదిక పేర్కొంది. -
భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర
సాక్షి, అమరావతి: భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర చేస్తోంది. భారత్ నుంచి చైనాకు ఎగుమతి అయ్యే ష్రింప్ ప్యాకింగ్‌పై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ కుంటి సాకులు వెతుకుతోంది.. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ చైనా వారానికి ఐదు నుంచి ఏడు ఆక్వా కంపెనీలను డీలిస్టింగ్ చేస్తోంది. అదీకాక వర్చువల్ ఆడిట్ పేరుతో కంపెనీలపై బ్యాన్ విధిస్తోంది. ఆక్వా ఇండియా ఎకానమీపై చైనా అధ్యక్షుడు జిన్ పిన్ కుతంత్రం చేస్తున్నాడు. చైనా నిర్ణయంతో పలు రాష్ట్రాలు, ఏపీలోని ష్రింప్ ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ), కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎగుమతి దారులు కోరుతున్నారు. ఏపీలోని భీమవరం కేంద్రంగా భారీగా ష్రింప్ ఎక్స్పోర్ట్ కంపెనీలు యాంటీ వైరస్ టెస్టులు చేసినా చైనా వెనక్కి పంపుతోందటూ వ్యాపారులు తెలిపారు. భారత్ నుంచి ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల అక్వా ఉత్పత్తులు ఆమెరికా, చైనా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. చైనా 58 కంపెనీలు సస్పెండ్ చేయగా 16 కంపెనీలు డీలిస్టింగ్ చేసింది. భారత్‌కు చెందిన రూ. 1200 కోట్ల దిగుమతులు,1000 కంటైనర్లు చైనా పోర్టుల్లో నిలిచిపోయాయి. -
తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి దేశీయంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ తొలుత వీటిని ప్రభుత్వానికే సరఫరా చేయనుంది. ఇందుకు వీలుగా తొలి దశలో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించినట్లు కంపెనీ వెల్లడించింది. తొలి దశలో దేశీయంగా అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేసేటంతవరకూ ఎగుమతులకు అవకాశముండదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా పేర్కొన్నారు. ఈ షరతులపైనే వ్యాక్సిన్‌కు తాజాగా అనుమతి లభించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా వ్యాక్సిన్‌ను ప్రయివేట్ మార్కెట్లోనూ విక్రయించేందుకు వీలుండదని ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. చౌక ధరలో ప్రభుత్వానికి ఒక్కో డోసునూ రూ. 200 ధర(2.74 డాలర్లు)లో చౌకగా సరఫరా చేయనున్నట్లు పూనావాలా వెల్లడించారు. తొలి దశలో 10 కోట్ల డోసేజీలను చౌక ధరలో అందించనున్నట్లు తెలియజేశారు. తదుపరి వ్యాక్సిన్ ధరలు పెరగనున్నట్లు చెప్పారు. దేశీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే తొలి ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు. 7-10 రోజుల్లో వ్యాక్సిన్స పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. తదుపరి కాలంలో ప్రయివేట్ మార్కెట్లలో వీటిని రూ. 1000 ధరలో విక్రయించే వీలున్నట్లు చెప్పారు. కోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవాక్స్‌కు వ్యాక్సిన్ల సరఫరా చేసేందుకు మార్చి, ఏప్రిల్ వరకూ వేచిచూడవలసి ఉంటుందని పూనావాలా పేర్కొన్నారు. గవీ(జీఏవీఐ), సీఈపీఐల భాగస్వామ్యంలో పేద, మధ్యాదాయ దేశాలకు కోవాక్స్ ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాలు వ్యాక్సిన్ల సరఫరా కోసం పలు కంపెనీలతో తొలి దశలోనే ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రాజెనెకాకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను దేశీయంగా కోవీషీల్డ్ పేరుతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా 10 కోట్ల డోసేజీలను ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయవలసి ఉంది. అంతేకాకుండా నోవోవాక్స్కు సైతం 10 కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు 30-4 కోట్ల డోసేజీల సరఫరాకు వీలుగా కోవాక్స్‌తో డీల్‌పై చర్చలు తుది దశకు చేరినట్లు పూనావాలా పేర్కొన్నారు. వెరసి ఇటు దేశీ ప్రభుత్వానికి, అటు కోవాక్స్‌కూ వ్యాక్సిన్ల సరఫరాలో బ్యాలన్స్‌ను పాటించవలసి ఉన్నట్లు చెప్పారు. -
‘రైతులపై సర్జికల్ స్ర్టైక్ చేశారు’
ముంబై : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించి రైతులపై సర్జికల్ స్ర్టైక్ చేసిందని ఎన్సీపీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి డిమాండ్ పెరిగిన సమయంలో రైతుల దిగుబడులకు మంచి ధర రాకుండా ఈ నిర్ణయం అడ్డుకుంటోందని ఎన్సీపీ ప్రతినిధి మహేష్ తపసి అన్నారు. ఉల్లి ఎగుమతుల నిషేధం తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉల్లి రైతుల ఇబ్బందులను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు వివరించారని చెప్పారు. చదవండి : ఉల్లి ఘాటు ఈ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని గోయల్ హామీ ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉల్లి రైతులు ఆందోళన బాట పట్టారని తెలిపారు. కరోనా వైరస్‌తో ఉల్లి దిగుమతులు 13 శాతం పడిపోవడంతో 1150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా ఉల్లి సాగవుతోంది. ఇక దేశంలో ఉల్లి ధరలు పెరగకుండా సరఫరాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది. -
ఉల్లి.. తలచినంతనే కన్నీటి జల్లు!
ఉల్లిపాయ.. పెట్రోలు.. బీరు.. ఈ మూడూ ఇప్పుడు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. దేశ రాజధాని నగరంలో ఉల్లిపాయలు కిలో 80-90 రూపాయలకు పైగా ఉంటోంది. రాష్ట్ర రాజధాని నగరంలో కూడా 40 నుంచి 60 రూపాయలకు ఏమాత్రం తగ్గడంలేదు. రైతు బజార్లలోనే చూసుకున్నా కూడా కిలో ఉల్లిపాయలు 44 రూపాయల వరకు ఉంటున్నాయి. ఉల్లిపాయను కోస్తే కాదు.. తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. వారం కాదు.. నెల కాదు.. దాదాపు మూడు నెలలుగా ఉల్లిపాయ ధరలు ఆకాశంలోనే ఉంటున్నా, ప్రభుత్వాలు మాత్రం చలించిన పాపాన పోవట్లేదు. దేశంలోని చాలా వరకు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయలు కిలో 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్రలో అకాల వర్షాలు కురవడం వల్ల అక్కడి ఖరీఫ్ పంట బాగా దెబ్బతింది. దీంతో దిగుబడి లేక ఉల్లిధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో జనం ప్రభుత్వాల మీద మండిపడుతున్నారు. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదన్న కోపంతో ఉత్తర భారతంలో ఓ వ్యక్తి ఏకంగా ఓ చిరువ్యాపారిని తుపాకితో కాల్చిపారేసిన సంఘటన కూడా జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే ఉల్లిపాయల వాడకం పూర్తిగా మానేశారు. బిర్యానీ, రోటీలు ఆర్డర్ చేసినప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయలు కోసి, నిమ్మకాయ ముక్కలతో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం కేవలం కీరా, క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి రేటు చూస్తే అంత భయపడాల్సి వస్తోంది మరి. ఉల్లిధరలు అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎగుమతుల మీద నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో టన్నుకు 650 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను 900 డాలర్లు చేశారు. అయినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఉల్లిపాయల సరఫరా పడిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈనెలలో ఉల్లిపంట దిగుబడి వస్తుందని, అది బాగా వస్తే అప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఖాయమని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.