సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్‌లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తు లో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకోవడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారనుంది.
కేంద్రం చర్యతో విదేశాల్లో డిమాండ్ ఉన్న సాగు రకాలైన జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా బియ్యం వంగడాలు పండించే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రెండు సీజన్‌లలో సాగయ్యే సన్నాలను స్థానిక వినియోగంతోపాటు విదేశీ ఎగు మతుల కోసమే అధికంగా పండిస్తున్న రైతులు అధిక ధరలను పొందుతు న్నా రు.
క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య విక్రయిస్తూ లాభపడుతు న్నారు. కానీ ప్రస్తుతం ఈ రైతులు కూడా ఈ వానాకాలం పంట నుంచే దొడ్డు బియ్యం వైపు మరలే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎగుమతి సుంకం విధించినా పెరిగిన ఎగుమతులు...
బియ్యం ఎగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గతేడాది 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. కానీ సుంకం విధించినా ఎగుమతులు ఆగకపోగా సుమారు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లింది. అదే సమయంలో దేశంలో బియ్యం ధరలు ఒక్క ఏడాదిలోనే 11.5 శాతం మేర పెరిగాయి.
అలాగే దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గతేడాది నుంచి అది 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీంతో కేంద్రం భవిష్యత్తు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో 24 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం పండించే పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ‘సాక్షి’తో అన్నారు.
దేశీయ అవసరాలు, విదేశీ ఎగుమతులకే 40 శాతం
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం పండిస్తున్న రైతులు... దాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మిగతా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ను ల సన్న ధాన్యాన్ని (అంటే 40 శాతం పంటను) రైతులు స్వీ య అవసరాలతోపాటు స్థానిక, దేశీయ, విదేశీ విక్రయాల కోసం పండిస్తున్నట్లు ఓ మిల్లర్ల సంఘం నాయకుడు విశ్లేషించారు.
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి వచ్చే సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక, దేశీయ అవసరాలకు వినియోగి స్తున్న మిల్లర్లు... మరో 16 లక్షల మెట్రిక్ టన్ను లను వివిధ ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని సన్నబియ్యాన్ని ఎగుమతులకు వినియోగిస్తున్నారు.
ఆ రకాలను మినహాయించాలి..
బాస్మతీయేతర ముడి బియ్యం ఎగుమతిపై నిషేధం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధం. జైశ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ మొదలైన రకాలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది ఇష్టపడే వరి రకాలు. తెలంగాణలోనే పండే ఈ రకాలు ఎకరాకు బాస్మతి కంటే తక్కువ దిగుబడి ఇస్తాయి.
అలాంటి శ్రేష్టమైన రకానికి లాభ దాయకమైన ధరలను పొందకపోతే రైతులు డిమాండ్‌లేని సాధారణ రకాలను సాగు చేస్తారు. బాస్మతి తర హాలోనే తెలంగాణలోని సూపర్ ఫైన్ రకాలను నిషేధం నుంచి మినహాయించాలి. –తూడి దేవేందర్‌రెడ్డి, దక్షిణ భారత మిల్లర్ల సంఘం నాయకుడు
బియ్యం సేకరణలో రాష్ట్రానికి కేంద్రం సహకరించట్లేదు..
ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే ప్రపంచానికి కూడా అవ సరమైన బియ్యాన్ని అందిస్తాం. ఇప్పటికే ఏటా 3 కోట్ల ట న్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులు వచ్చే రెండేళ్లలో మరో కోటి టన్నులు అదనంగా పండించబోతున్నా రు. అసలు యా సంగిలో దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్న రాష్ట్రం తెలంగాణనే.
ఇతర రాష్ట్రాల్లో వరి పంట తగ్గడడం వల్లనే కేంద్రం ఎగుమ తులపై నిషేధం విధించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించే విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఆంక్షలను పక్కనపెట్టి ప్రస్తుతం మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని ముందుగా ఎఫ్‌సీఐ సేకరించాలి. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
Comments
Please login to add a commentAdd a comment