
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. గత రెండ ోరోజులుగా సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) సర్వర్ పని చేయడం లేదని పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు తెలంగాణ రాష్ట్రంలో. దాంతో మార్కెట్ యార్డులలో వేల ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీనిపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ ఔన్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట/ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు సర్వర్ డౌన్ పేరుతో పత్తి కొనుగోలు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందంధి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment