rice exports
-
భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలు
భారతదేశంలో బియ్యం ఎగుమతుల మీద విధించిన పరిమితులను ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. 2022లో 40 శాతం లేదా 2.2 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఎగుమతి చేసింది. ఇండియా ప్రపంచంలోని దాదాపు 140 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. భారత్ తరువాత ఎక్కువ బియ్యం ఎగుమతులు చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్, వియత్నాం మొదలైనవి ఉన్నాయి.భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాల ఆహార భద్రతను తీర్చడానికి.. ఆ దేశ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతులకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేదించడమే కాకూండా.. కనీస ధరను కూడా నిర్ణయించింది. ఎగుమతికి సంబంధించిన ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే దేశంలో బియ్యం సరఫరాను పెంచడానికి 2023 జులై 20న బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. కాగా ఇప్పటికి ఆ పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
కాకినాడ పోర్టుపై కక్ష
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ పోర్టు దేశంలోనే రికార్డులు తిరగరాసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వేధింపులతో కుదేలవుతోంది. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డుతోంది. ఎగుమతిదారుల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక సాకుతో ఈ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది పొట్టుకొట్టి వారిని రోడ్డున పడేస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతిదారులు ఈ పోర్టులో కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు అడుగులేస్తున్నారు.మంత్రి నాదెండ్ల హడావుడిఎగుమతిదారుల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక కారణంతో కాకినాడ పోర్టులో ఎగుమతులను దెబ్బదీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఈ పోర్టుపై విషం కక్కుతూ వచ్చారు. ఈ పోర్టు ద్వారా విదేశాలకు పీడీఎస్ బియ్యం దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారంటూ నిందలు వేశారు. రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఎగుమతిదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. గత నెలలో కాకినాడ పోర్టు ఆధారిత ఎగుమతిదారుల గోడౌన్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో అధికారులు దాడులు చేసి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు నూకలను సీజ్ చేసి ఎగుమతిదారుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీజ్ చేసిన సరుకులో 28 వేల మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ ఎత్తేసి ఇటీవలే విడుదల చేశారు. ఆ తర్వాత ఎగుమతులకు పలు విధాలుగా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టుల ద్వారా రోజుల తరబడి ఎగుమతులు నిలిచిపోయేలా చేస్తున్నారు. కావాలనే పనిగట్టుకుని జరుగుతున్న ఈ వేధింపుల కారణంగా ఎగుమతిదారులు కాకినాడ పోర్టులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు తరలిపోవాలనే నిర్ణయంతో సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ : బియ్యం ధరలను నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ముడి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అత్యవసర అవసరాల దృష్ట్యా ఆఫ్రికా దేశాల విజ్ఞప్తితో కేంద్రం మానవతా దృక్పథంతో ప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణలో బియ్యం, నూకలు కలిపి 1.5 మెట్రిక్ టన్నుల ఎగుమతికి అనుమతించింది. ఇవి కాకుండా ఆఫ్రికా దేశం సెనగల్‌కు 5 లక్షల టన్నుల నూకల ఎగుమతికి అనుమతి వచ్చింది. గత జూలై నెలాంతానికి 2.5 లక్షల టన్నుల ఎగుమతి పూర్తి చేశారు. ఇవన్నీ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ పర్యవేక్షణలో జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, ఎన్సీఈఎల్(నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్), ఎన్సీసీఎఫ్(నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్), క్రిబ్కో నిర్వహించిన వేలంలో ఎక్స్‌పోర్టు కంపెనీలు ఎగుమతి హక్కులు దక్కించుకున్నాయి. దుబాయ్, స్విట్జర్లాండ్ లిమిటెడ్ కంపెనీలతో పాటు సింగపూర్ కేంద్రంగా నిర్వహించే ఓలం ఆగ్రో, అంతర్జాతీయంగా పేరున్న లూయీస్ బ్రూఫిన్, ఢిల్లీ, రాయ్‌పూర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన డీఆర్ కమోడిటీస్, బాలాజీ రైస్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ఫుడ్స్, పట్టాభి ఇంటర్నేషనల్, సరళ ఫుడ్స్ వంటి కంపెనీలు కాకినాడ పోర్టు నుంచి నూకలు, బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమయ్యాయి. దాదాపు 150 ఎగుమతి కంపెనీలు ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంలో క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ.. కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించక మునుపు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లు ఉన్నవే కావడం గమనార్హం. కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడాన్ని ఎగుమతిదారులు ఆక్షేపిస్తున్నారు. అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతిలో ట్రాక్ రికార్డు ఉన్న కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీస్తే వేలాది మంది రోడ్డున పడతారు.కుట్రలతో కుదేలుగడచిన ఐదేళ్లలో కోటీ 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు ఒక్క కాకినాడ పోర్టు నుంచే జరిగాయి. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరిగిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాకినాడ పోర్టుకు చంద్రగ్రహణం పట్టుకుంది. గద్దెనెక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఈ పోర్టు కార్యకలాపాలను దెబ్బతీస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ దేశంలోనే రికార్డు స్థాయిలో బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు భవితవ్యం కూటమి ప్రభుత్వ వేధింపులతో ప్రశ్నార్థకంగా మారింది. దీని ప్రభావంతో కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 20 వేల మంది రోడ్డున పడే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. -
బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత..?
బాస్మతీయేతర బియ్యంపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మంత్రుల బృందం సమావేశం కానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డిమాండ్-సరఫరా, ధరల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చర్చలు జరుగుతాయని ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘బస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ ఉంది. మంత్రుల బృందంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ విధానాలు, రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లో ధరలు..వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సహేతుక నిర్ణయం వెల్లడిస్తాం. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి భారతీయ ఎగుమతి విధానాలపై వ్యాపారులకు సరైన అవగాహన ఉంది. దేశంలో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 56 బిలియన్ డాలర్లు(రూ.4.6 లక్షల కోట్లు)కు చేరుకుంది. భారత్ ఎగుమతి చేస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో సమస్యలున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలుదేశీయంగా సరఫరాను పెంచడానికి జులై 20, 2023 నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. దాంతో స్థానికంగా బియ్యం పండిస్తున్న రైతులకు సరైన ధరలు లభించడం లేదనే వాదనలున్నాయి. రైతులు, వ్యాపారులు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. దాంతో ప్రభుత్వం మంత్రుల బృందంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. -
ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?
ప్రభుత్వం ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో బియ్యం ఎగుమతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 2023 ఆగస్టు నుంచి 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది ఎగుమతిదారులకు భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ సుంకాన్ని తగ్గించాలని లేదా దాని స్థానంలో ప్రత్యేక వెసులుబాటు ఉండాలనే డిమాండ్ ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం ఎగుమతుల సమస్యలను పరిష్కరించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయం ప్రకారం ఉప్పుడు బియ్యం ఎగుమతిపై టన్నుకు 100 అమెరికన్ డాలర్లు(రూ.8,300) వసూలు చేస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేసింది. దాంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. -
కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బియ్యం ఎగుమతిదారులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారన్న పేరుతో మొత్తం ఎగుమతులనే దెబ్బతీసే చర్యలకు దిగింది. ఈ ప్రభావం బియ్యం ఎగుమతిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కాకినాడ పోర్టుపైనా పడింది. ఈ పోర్టుకు విదేశాల్లో ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలోనే తిష్ట వేసి గోడౌన్లపై దాడులు, పీడీఎస్ బియ్యం సీజ్ అంటూ ఎగుమతిదారులను భయపెట్టి, వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఎగుమతిదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అంటున్నారు. బియ్యం ఎగుమతులపై మంత్రికి అవగాహన లేనందువల్లే వాటిని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గొడౌన్లపై దాడుల కారణంగా పోర్టులో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకొన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో ముడి బియ్యం ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితమే నిషేధించింది. ఎగుమతులను కఠినతరం చేసింది. అయితే ప్రత్యేక అనుమతులతో ప్రభుత్వ పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఓలం ఆగ్రోతోపాటు అంతర్జాతీయంగా మంచి పేరున్న లూయీస్ బ్రూఫిన్ వంటి దాదాపు 150 కంపెనీలు ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం రేవులకంటే కాకినాడ రేవులో నిర్వహణపరంగా ఉన్న వెసులుబాటుతో 80 శాతం ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఒక్క కాకినాడ నుంచే 1,47,55,837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరగలేదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పోర్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసే పరిస్థితి కలి్పంచవద్దని ఎగుమతిదారులు కోరుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఎగుమతులపై లేని ప్రతిబంధకాలు ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.అంతా పథకం ప్రకారమే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి ఒక పథకం ప్రకారం కాకినాడ పోర్టు, ఇక్కడి బియ్యం లావాదేవీలు, తరతరాలుగా రైస్ మిల్లింగ్ రంగంలో ఉన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ద్వారంపూడి కుటుంబం బియ్యం ఎగుమతులను శాసిస్తోందంటూ రాజకీయ లబ్థి కోసం ఆరోపణలకు దిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగి, కోట్లు పెట్టుబడులు పెట్టిన ఎగుమతిదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ వచ్చి యాంకరేజ్ పోర్టు, డీప్‌వాటర్ పోర్టులలోని పలు గోడౌన్లను రెండు రోజులు తనిఖీ చేశారు. తొలి రోజు 7,615 మెట్రిక్ టన్నులు, రెండో రోజు అశోక గోడౌన్లో 2,800 మెట్రిక్ టన్నులు, హెచ్‌ఒన్ గోదాముల్లో 2,500 మెట్రిక్ టన్నులు బియ్యం, స్టాక్ రిజిస్టర్లను సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. సింగపూర్‌కు చెందిన ఓలం, విశ్వప్రియ తదితర కంపెనీల గోడౌన్లలో సీజ్ చేసిన బియ్యంలో బాయిల్డ్ రైస్, బ్రోకెన్ రైస్ (నూకలు) ఉండటం గమనార్హం. ఇవన్నీ పీడీఎస్ బియ్యం అనే అనుమానంతో సీజ్ చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా బాయిల్డ్, నూకలను పీడీఎస్‌కు వినియోగించరు. అటువంటప్పుడు సీజ్ చేసిన బియ్యం పీడీఎస్ అని ఎలా నిర్ధారిస్తారని ఎగుమతిదారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లో బియ్యం ధరకంటే నూకల ధర తక్కువ. అటువంటప్పుడు పీడీఎస్ బియ్యం నూకలుగా మార్చి ఎగుమతి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని, బియ్యంలో నూకలు ఉంటే అవి పీడీఎస్ అని ఎలా అంటున్నారని ఎగుమతిదారులు నిలదీస్తున్నారు.కాకినాడ నుంచి తరలిపోనున్న ఎగుమతిదారులు!కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో ఎక్స్‌పోర్టర్లు ఇక్కడి రేవు ద్వారా ఎగుమతులకు స్వస్తి పలికేందుకు సిద్దమవుతున్నారు. కాకినాడ రేవును వదిలి కాండ్లా, పరదీప్ ఓడæరేవుల నుంచి ఎగుమతులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ 10 వేల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ విషయమై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా బియ్యం ఎగుమతులతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఇక్కడి ఎగుమతిదారులను ఇబ్బందులకు గురి చేసేలా దాడులకు పాల్పడి ఈ ప్రాంత రేవు ప్రతిష్టను దెబ్బ తీయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. -
వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బాస్మతి టాప్.. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది. ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్‌లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి. -
ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు
న్యూఢిల్లీ: బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1,42,000, మలేíÙయాకు 1,70,000, ఫిలిప్పైన్స్కు 2,95,000 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..
India additional safeguards on basmati rice: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కేటగిరీ కింద ఉన్న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని తప్పుగా వర్గీకరించి అక్రమ ఎగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ క్షేత్ర నివేదికలు అందినట్లు ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంది. దేశీయంగా ధరలను కట్టడి చేయడానికి, ఆహార భద్రత కోసం గత జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గమనించింది. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA)కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చని, అలాగే వాటి పరిశీలనకు ఏపీఈడీఏ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. ఇదీ చదవండి: రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు -
నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇపుడు మరో కీలకమైన అడుగువేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్ లిస్ట్‌లో నెక్ట్స్ చక్కెర ఉండవచ్చనే అంచనాలు ఆందోళన రేకెత్తిస్తోంది. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ జాబితాలో చక్కెర , ఇథనాల్ ఉండవచ్చని సంస్థ హెడ్ హెన్రిక్ అకమైన్ అన్నారు. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఇప్పటికే ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని, ఈనేపథ్యంలో చక్కెర విషయంలో ఇలాంటి నిషేధాలనే అమలు చేయనుంది అనేది ఆందోళన కలిగిస్తోందని అకమైన్ అన్నారు. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత, మరో ముఖ్యమైన ఆహారం వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్లలో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనను రేకెత్తించింది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్లో వరుసగా రెండో సంవత్సరం పడిపోనుందని అంచనా. ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. (అయ్యయ్యో.. దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) మరోవైపు మహారాష్ట్ర , కర్నాటకలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో చెరకు పొలాలు జూన్‌లో తగిన వర్షాలు పడలేదు. ఇది పంట ఒత్తిడికి దారితీసిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు. 2023-24లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం నుండి 31.7 మిలియన్ టన్నులకు 3.4శాతం తగ్గుతుందని గ్రూప్ అంచనా వేసింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్‌ను సరఫరా చేయగలదని జున్‌జున్‌వాలా చెప్పారు. ఇదిలా ఉండగా, జీవ ఇంధనం కోసం భారత్ మరింత చక్కెరను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇథనాల్‌ను తయారు చేయడానికి 4.5 మిలియన్ టన్నులను మళ్లించడాన్నిఅసోసియేషన్ గుర్తించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.8శాతం ఎక్కువ. భారతదేశం ఇంతకు ముందు చక్కెర ఎగుమతులను పరిమితం చేసింది. 2022-23 సీజన్లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నుల నుండి తగ్గింది. తదుపరి సీజన్లో, అకామైన్ అండ్ లిమాతో సహా విశ్లేషకులు 2 మిలియన్ నుండి 3 మిలియన్ టన్నులు మాత్రమే అనుమతించబడతారని భావిస్తున్నారు.ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలో, భారతదేశం ఎటువంటి ఎగుమతిని ఆంక్షలను విడుదల చేయకపోవచ్చు" అని స్టోన్ఎక్స్ సుగర్ అండ్ ఇథనాల్ హెడ్ బ్రూనో లిమా అన్నారు. అయితే ఇథనాల్ మళ్లింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. దక్షిణ ఆఫ్రికా మధ్య అమెరికా వంటి ఇతర ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తితో కలిపి, ఎల్‌నినో దక్షిణ ,ఆగ్నేయాసియా వేడి, పొడి వాతావరణ పరిస్థితులను తీసుకువస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది. థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి తగ్గుదల కనిపించవచ్చు. దీంతో షుగర్ ఫ్యూచర్లు ఈ సంవత్సరం దాదాపు 20శాతం పెరిగాయి, అయితే బ్రెజిల్ బంపర్ పంటను సాధించింది.(లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) 2023-24 చక్కెర ఎగుమతి కోటాలపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అక్టోబరు నుండి మాత్రమే హార్వెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలి వర్షాలు పంటకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్ఎంఏ వ్యాఖ్యానించింది. అయితే ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉంటుందనే ఐఎస్ఎంఏ అంచనాలను భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఖండించారు. ఇలాంటి ముందస్తు అంచనాలే దేశంలో తీవ్ర కొరతను సృష్టించిందన్నారు. అయితే పూర్తి ఉత్పత్తి గణాంకాల వరకు అధికారులువేచి చూస్తారని ఉంటారని రాబోబ్యాంక్లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు కార్లోస్ మేరా అన్నారు. -
బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్
Restrictions On Rice Export IMF To India బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా బియ్యం కొనుగోళ్లు విపరీతంగా పుంజు కున్నాయి. నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని దుకాణ దారులు చెబుతున్నారు. బాస్మతీయేతరరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలోపెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో దాన్ని నియంత్రించేందుకు వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని అక్కడి విక్రయదారులు వాపోతున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతులపై పరిమితులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ కొరత ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని , ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితులను తొలగించాలని భారతదేశాన్ని కోరుతున్నామని పేర్కొంది. ప్రస్తుత వాతావరణంలో, ఈ రకమైన పరిమితులు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ మీడియాతో అన్నారు. అటు ఈ నిషేధం కారణంగా అమెరికాలోని ఇండియన్ స్టోర్లలో పరిమితులు కొనసాగుతున్నాయి. దాదాపు స్టోర్లన్నీ ఖాళీ. టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్‌ను మాత్రమే అనే బోర్డులు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే పండుగ సీజన్లో దేశీయ సరఫరాను పెంచడానికి, రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం జూలై 20న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.దేశం నుండి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో ఈ రకం బియ్యం 25 శాతం ఎగుమతి అవుతాయి. At the Indian store today for spices, I checked to see if rice prices went up due to the export ban. I was shocked to see this. Limits on quantities. Stock up on your staples NOW. Other countries are looking at the ban on rice and are stock piling. pic.twitter.com/kns8AtoQ3E — Lisa Muhammad (@iamlisamuhammad) July 23, 2023 Don't know if these empty shelves at Walmart today where Basmati rice is usually stocked, is related to the news of India's ban on rice exports but it wouldn't surprise me either. pic.twitter.com/GHXfI9RoAM — JJ Crowley (@JJCrowleyMusic) July 23, 2023 కాగా భారతదేశం నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 2022-23లో 4.2 మిలియన్ల డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో 2.62 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియానుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతయ్యే దేశాల్లో ప్రధానంగా అమెరికా, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్ శ్రీలంక ఉన్నాయి. -
‘సన్నాల ఎగుమతి నిషేధం’తో రాష్ట్ర రైతులకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తు లో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకోవడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారనుంది. కేంద్రం చర్యతో విదేశాల్లో డిమాండ్ ఉన్న సాగు రకాలైన జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా బియ్యం వంగడాలు పండించే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రెండు సీజన్లలో సాగయ్యే సన్నాలను స్థానిక వినియోగంతోపాటు విదేశీ ఎగు మతుల కోసమే అధికంగా పండిస్తున్న రైతులు అధిక ధరలను పొందుతు న్నా రు. క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య విక్రయిస్తూ లాభపడుతు న్నారు. కానీ ప్రస్తుతం ఈ రైతులు కూడా ఈ వానాకాలం పంట నుంచే దొడ్డు బియ్యం వైపు మరలే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతి సుంకం విధించినా పెరిగిన ఎగుమతులు... బియ్యం ఎగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గతేడాది 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. కానీ సుంకం విధించినా ఎగుమతులు ఆగకపోగా సుమారు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లింది. అదే సమయంలో దేశంలో బియ్యం ధరలు ఒక్క ఏడాదిలోనే 11.5 శాతం మేర పెరిగాయి. అలాగే దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గతేడాది నుంచి అది 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీంతో కేంద్రం భవిష్యత్తు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో 24 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం పండించే పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ‘సాక్షి’తో అన్నారు. దేశీయ అవసరాలు, విదేశీ ఎగుమతులకే 40 శాతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం పండిస్తున్న రైతులు... దాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మిగతా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ను ల సన్న ధాన్యాన్ని (అంటే 40 శాతం పంటను) రైతులు స్వీ య అవసరాలతోపాటు స్థానిక, దేశీయ, విదేశీ విక్రయాల కోసం పండిస్తున్నట్లు ఓ మిల్లర్ల సంఘం నాయకుడు విశ్లేషించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి వచ్చే సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక, దేశీయ అవసరాలకు వినియోగి స్తున్న మిల్లర్లు... మరో 16 లక్షల మెట్రిక్ టన్ను లను వివిధ ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని సన్నబియ్యాన్ని ఎగుమతులకు వినియోగిస్తున్నారు. ఆ రకాలను మినహాయించాలి.. బాస్మతీయేతర ముడి బియ్యం ఎగుమతిపై నిషేధం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధం. జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ మొదలైన రకాలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది ఇష్టపడే వరి రకాలు. తెలంగాణలోనే పండే ఈ రకాలు ఎకరాకు బాస్మతి కంటే తక్కువ దిగుబడి ఇస్తాయి. అలాంటి శ్రేష్టమైన రకానికి లాభ దాయకమైన ధరలను పొందకపోతే రైతులు డిమాండ్‌లేని సాధారణ రకాలను సాగు చేస్తారు. బాస్మతి తర హాలోనే తెలంగాణలోని సూపర్ ఫైన్ రకాలను నిషేధం నుంచి మినహాయించాలి. –తూడి దేవేందర్‌రెడ్డి, దక్షిణ భారత మిల్లర్ల సంఘం నాయకుడు బియ్యం సేకరణలో రాష్ట్రానికి కేంద్రం సహకరించట్లేదు.. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే ప్రపంచానికి కూడా అవ సరమైన బియ్యాన్ని అందిస్తాం. ఇప్పటికే ఏటా 3 కోట్ల ట న్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులు వచ్చే రెండేళ్లలో మరో కోటి టన్నులు అదనంగా పండించబోతున్నా రు. అసలు యా సంగిలో దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్న రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ట్రాల్లో వరి పంట తగ్గడడం వల్లనే కేంద్రం ఎగుమ తులపై నిషేధం విధించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించే విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఆంక్షలను పక్కనపెట్టి ప్రస్తుతం మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని ముందుగా ఎఫ్‌సీఐ సేకరించాలి. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
క్యూకట్టిన ఎన్నా‘రైస్’.. అమెరికాలో 9 కిలోల రైస్ బ్యాగ్ రూ. 3,854
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా అమెరికాలోని రిటైల్ ఔట్లెట్లు ఎన్నారైలతో కిటకిటలాడు తున్నాయి. తెలుగువారు ఎక్కువగా నివసించే డాలస్, అట్లాంటా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోని స్టోర్ల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సోనామసూరి రకం బియ్యానికి కొరత ఏర్పడుతుందన్న భయంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో నిషేధానికి ముందు వరకు 9.07 కిలోల బ్యాగ్‌ను 16–18 డాలర్ల (రూ.1,312 –1,476)కు విక్రయించిన స్టోర్ల నిర్వాహకులు తాజాగా దాదాపు మూడు రెట్లు అధికంగా 47 డాలర్ల (రూ. 3,854) వరకు బ్యాగ్‌ను విక్రయిస్తున్నారు. కొన్ని స్టోర్ల యజమా నులు బియ్యం బ్యాగ్‌ల కొనుగోలుపై పరిమితి విధించగా మరికొందరు నిర్ణీత మొత్తంలో ఇతర వస్తువులు కొన్న వారికే బియ్యం బ్యాగ్‌లు విక్రయిస్తామని తేల్చిచెబుతున్నారు. ఆరు నెలలకు సరిపోవచ్చు..: భారత్ నుంచి నెలకు సగటున బాస్మతీయేతర బియ్యం 6,000 మెట్రిక్ టన్నులు యూఎస్ఏకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ వాటా 4,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని సమాచారం. ‘యూఎస్ఏలో ప్రస్తుతం సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భారత్ నుంచి 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం యూఎస్ఏకు రవాణాలో ఉంది. ఈ నిల్వలు ఆరు నెలలకు సరిపోవచ్చు’ అని ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో సుమారు రూ.8,200 కోట్ల విలువైన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించే ఒప్పందాలను రద్దు చేసుకొనే పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 40 శాతం ఉంది. నెలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర బియ్యం భారత్ నుంచి వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఫర్నిచర్ కొంటే బియ్యం ఫ్రీ బియ్యం కొరతను ఆసరా చేసుకొని డీఆర్ హోర్టన్ అనే అతిపెద్ద గృహ నిర్మాణ సంస్థ అమెరికాలోని 29 రాష్ట్రాల్లోని 90 మార్కెట్లలో అప్పటికప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ‘మీకు సోనా మసూరి దొరకడం లేదా? మేం మీకు సహాయం చేస్తాం. మావద్ద హోమ్ ఫర్నిచర్ కొంటే.. 15 లిబ్రా (ఎల్బీ–0.45 కేజీలు)ల సోనా మసూరి బియ్యం ఉచితంగా ఇస్తాం’ అంటూ ఆఫర్ మొదలెట్టేసింది. సోనామసూరిని మినహాయించాలి.. యూఎస్ఏ లోని భారతీయులు సోనా మసూరి బియ్యం అధికంగా వాడతా రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధం నుంచి సోనామసూరిని ప్రభుత్వం మినహాయించాలి. – కిరణ్‌కుమార్ పోల, డైరెక్టర్, డెక్కన్ గ్రెయింజ్ ఇండియా అవగాహన లేనివాళ్లే ఎక్కువ కొంటున్నారు.. భారత్ నుంచి సన్న బి య్యం ఎగుమతుల నిషే ధం శాశ్వతం కాదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మార్కెట్, సరఫరా, డిమాండ్‌పై అవగాహన లేనివాళ్లే అవసరానికి మించి బియ్యం కొంటున్నారు. – జ్యోతి ముదునూరి, ఎన్నారై, న్యూజెర్సీ పొద్దున్నే పరుగుపెట్టాం.. సోనామసూరి బియ్యం కొర త భయంతో స్టోర్లకు పొద్దు న్నే పరుగుపెట్టాం. బ్రౌన్, రెడ్ రైస్, చైనా రైస్ దొరుకుతున్నా మేం తినేది సోనామ సూరీయే. కొందరు వారి బంధువులు, స్నేహితుల కోసం కూడా కొనుగోలు చేస్తున్నారు. – శ్రీధర్ నూగూరి,ఎన్నారై, అగస్టా (జార్జియా స్టేట్) ప్రత్యేక కోడ్‌తో అనుమతించాలి ఎగుమతులపై నిషేధంతో విదేశాల్లో బియ్యం ధరలు పెరగొచ్చు. భారతీయులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హెచ్ఎస్ఎన్ కోడ్ కింద సోనా మసూరి రకాల ఎగుమతికి కేంద్రం అనుమతించాలి. – బీవీ కృష్ణారావు, అధ్యక్షుడు, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం -
యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
డీఎస్ఎం కొత్త రైస్ ప్లాంట్ మన తెలంగాణాలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్యం, పోషణ సంబంధ ఉత్పత్తుల తయారీలో ఉన్న రాయల్ డీఎస్ఎం హైదరాబాద్ సమీపంలో రైస్ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో విటమిన్లు, పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం తయారు చేస్తారు. ఏటా ఇక్కడ 3,600 టన్నుల బియ్యం ఉత్పత్తి చేస్తామని, భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాలకు సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది. -
బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైతులకు శాపం
సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: బియ్యం ఎగుమతులపై సుంకాన్ని, నూకల ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తలాతోక లేని నిర్ణయాలు రైతులను ముంచి కార్పొరేట్లకు పంచేలా ఉన్నాయని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పటాన్చెరులో జరిగిన సభలో మాట్లాడారు. దేశంలో ఆహార నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తారని, ఇప్పుడు కేంద్రం ఎందుకు నిషేధం విధిస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతుల పెట్టుబడులను రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు. దేశంలో నాలుగేళ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని, వడ్లు కొనేదిలేదని చెప్పిన కేంద్రమంత్రి ఇప్పుడు బియ్యం ఎగుమతులపై సుంకాలను విధించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు, చైనా, పాకిస్తాన్ వంటి దేశాల్లో కరువు ఏర్పడిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణ మాత్రం దక్షిణ భారతదేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేదని, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 65 లక్షల ఎకరాల వరి సాగవుతోందని హరీశ్ వివరించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ నుంచి శ్రీలంకకు బియ్యం
సాక్షి, కాకినాడ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగు దేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న లంకకు మానవతా సాయం కింద 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి పంపనుంది. ఇందులో అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయనుంది. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నులను చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. ఈ నౌక మరో రెండు రోజుల్లో కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకుంటుంది. సరుకుల సరఫరాలో కీలకంగా పోర్టు.. శ్రీలంకకు బియ్యం తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆఫ్రికా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతి చేయడానికి దేశంలో 22 మేజర్, 205 నాన్ మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం శ్రీలంకకు సైతం ఇక్కడి నుంచే బియ్యం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారపరంగానే కాకుండా మానవతా సాయం కింద పంపే సరుకుల సరఫరాలోనూ కాకినాడ పోర్టు కీలక భూమిక పోషిస్తోంది. కాగా.. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని శ్రీలంకకు పంపుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన స్వర్ణ రకం బియ్యం కూడా ఉన్నాయి. రవాణా ప్రక్రియ వేగవంతం వాస్తవానికి.. ముందుగా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం శ్రీలంక ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకుంది. ఆ సంస్థ బియ్యం సరఫరాకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా బియ్యానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతా సాయం ప్రకటించింది. బియ్యం సరఫరాకు అయ్యే ఖర్చుకు తాము పూచీగా ఉంటామని, ఆర్థిక భారం భరిస్తామని.. ఆలస్యం కాకుండా వెంటనే బియ్యం ఎగుమతి చేయాలని సదరు సంస్థను ఆదేశించింది. దీంతో బియ్యం ఎగుమతులకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. 40,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయాల్సి ఉండగా.. అత్యవసరంగా 11,000 మెట్రిక్ టన్నులను రెండు రోజుల్లో పంపేందుకు కాకినాడ పోర్టులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను శుక్రవారం, శనివారంలోగా లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీలంకకు నౌక బయలుదేరనుంది. ఈ బియ్యాన్ని నేరుగా శ్రీలంకలోని చౌకధరల డిపోలకు సరఫరా చేస్తారు. శ్రీలంక ప్రజలకు త్వరగా బియ్యం అందడంలో ఆలస్యాన్ని నివారించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. శ్రీలంకకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న బియ్యం ఎగుమతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నౌకలోకి లోడ్ చేశాం. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను కూడా త్వరితగతిన లోడ్ అయ్యేలా చూస్తున్నాం. – రాఘవరావు, కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారి -
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు మాట్లాడలేదు..
-
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు: కురసాల కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: ఎల్లో మీడియా కథనాలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ కేంద్రంగా కిలో బియ్యం రూ.25 లకే విదేశాలకు రిసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారని ఈనాడులో కథనం వచ్చిందన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే కాకినాడ నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం ఎగుమతి అయ్యాయా లేదా అంటూ ఈనాడు పత్రికను నిలదీశారు. అప్పుడెందుకు ఈ అనుమానం రాలేదని ప్రశ్నించారు కనీసం వివరణ తీసుకుని వార్త రాయాలన్న జర్నలిజం నైతిక విలువలు పాటించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకుపోయి వార్తలు రాయొద్దన్నారు. లాంగ్ గ్రేయిన్ రైస్ ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ఎగుమతి చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యాన్ని అధికారులు ముందుగా పరీక్షిస్తారని తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు బయటకు వచ్చి రాజకీయంగా నడవలంటే రెండు ఊత కర్రలు.. ఒక త్రీవీల్ ఛైర్ కావాలని, రాజకీయంగా కదలలేని స్ధితిలో మూలన పడిపోయారని విమర్శించారు. చదవండి: చంద్రబాబు రివర్స్ డ్రామా.. ఇదీ వాస్తవం -
జన్యుమార్పిడి బియ్యం కలకలం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ నుంచి జూన్‌లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్ కమిషన్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. ఫ్రాన్స్‌కు చెందిన వెస్తోవ్ కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై ఫ్రాన్స్ ప్రభుత్వం పలు దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో అమెరికాకు చెందిన మార్స్ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తాను ఉత్పత్తి చేసిన క్రిస్పీ ఎంఅండ్ఎం ప్రోడక్ట్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించింది. సేంద్రియ బియ్యంగా భావించి తాము ఇండియా నుంచి వచ్చిన ఆ బియ్యంతో ఈ ప్రోడక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. అమెరికా కంపెనీ చేసిన ఈ పనితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. రంగంలోకి ఐఏఆర్ఐ.. భారత్ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలోనూ ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు జీఎం రైస్‌ను ప్రయోగాత్మకంగానైనా పండిస్తున్నాయా అనే విషయంపై ఆరా తీస్తోంది. తమిళనాడుకు చెందిన నాలుగు సేంద్రీయ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వరిపై చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలే ఇందుకు సాక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూ.65వేల కోట్ల నష్టం? భారత్ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుంది. జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించదు. అయితే కొన్ని పరిశోధన కేంద్రాల్లో జీఎం రైస్‌పై క్షేత్రస్థాయి పరిశీలనలు సాగుతున్నాయి. దీన్ని ఐఏఆర్ఐ కూడా ధ్రువీకరించింది. ఇదే సందర్భంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగైదు సేంద్రియ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులు రద్దు చేసింది. ఏమీ లేనప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని యూరోపియన్ యూనియన్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎక్కడి నుంచి బియ్యం వెళ్లాయి? మహారాష్ట్ర అఖోలాలోని హోల్‌సేల్ బియ్యం వ్యాపారి ఓమ్ ప్రకాష్ శివప్రకాష్‌కి చెందిన సంస్థ నుంచి యూరప్‌కి పంపిన బియ్యంలో జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జెనిటికల్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ, ఐఏఆర్‌ఐకి చెందిన వ్యవసాయ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోపు ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రైవేటు విత్తన సంస్థల ప్రయోగ క్షేత్రాలను, ఇటీవల విడుదల చేసిన హైబ్రీడ్ వరి వంగడాలను కూడా ఈ బృందం తనిఖీ చేస్తోంది. -
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి
ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు. ఈ బియ్యం బస్తాలను ఈస్ట్ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్ ఆఫ్రికాలోని బెనిన్ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. -
ఇందూరు టు చెన్నై
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరులో పండిన బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఇక్కడి దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి తమ ప్రాంతానికి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. తమిళనాడులో రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన బాయిల్డ్ బియ్యాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి సేకరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని రైస్‌మిల్లర్ల నుంచి ఈ బియ్యాన్ని సేకరిస్తోంది. మొదటి విడతలో 3,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పోటీ పడుతున్న రైస్ మిల్లర్లు.. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏజెంట్‌గా వ్యవహరించనుంది. ఇందుకు గాను తమిళనాడు మన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు క్వింటాలుకు రూ.31 చొప్పున కమీషన్ చెల్లించనుంది. గ్రేడ్–ఏ బియ్యానికి టన్నుకు రూ.2,670 చొప్పున, కామన్ రకానికి రూ.2,610 చొప్పున కొనుగోలు చేయాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ ధరకు విక్రయిస్తే పెద్ద మొత్తంలో లాభాలుండటంతో దొడ్డుబియ్యాన్ని విక్రయించేందుకు మిల్లర్లు పోటీ పడుతున్నారు. తాము విక్రయిస్తామంటే తాము విక్రయిస్తామంటూ మిల్లర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే బియ్యం సరఫరా చేసే మిల్లర్ల జాబితాను అధికారులు రూపొందించినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన పౌరసరఫరాల సంస్థ అధికారులే స్వయంగా జిల్లాకు వచ్చి ఈ సేకరణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువగా.. నిబంధనల ప్రకారం ఈ బియ్యాన్ని సరఫరా చేయాల్సిన రైస్‌మిల్లరు కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.30 చొప్పున అదనపు రేటుకు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అంటే ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,590 ఉండగా, అదనంగా రూ.30 కలిపి మొత్తం క్వింటాలుకు రూ.1,620 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేయాలి. దీంతో రైతులకు కొంత ప్రయోజనం చేకూరుతుందని, మద్దతు ధర కంటే కాస్త అదనంగా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బియ్యాన్ని సరఫరా చేసే రైస్‌మిల్లరు ఏ రైతు వద్ద కొనుగోలు చేశారు, ఆ రైతు వివరాలు, వారికి ధాన్యం డబ్బుల చెల్లింపులు (చెక్ నెంబర్).. ఇలా అన్ని వివరాలను పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో చాలా మంది రైస్‌మిల్లర్లు కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసి, ఇలా సర్కారుకు అంట గట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, సర్కారుకు ఎక్కువ ధరకు విక్రయించి పెద్ద మొత్తంలో దండుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పౌరసరఫరాల సంస్థ ఈ బియ్యానికి సంబంధించి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిన రైతులు, వారి చెల్లింపులను పకడ్బందీగా పరిశీలిస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దొడ్డుబియ్యాన్ని సరఫరా చేసేందుకు మిల్లర్ల జాబితాను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు పంపించామని ఆ సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. అనుమతి వచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. -
మీ బాస్మతీ మాకొద్దు!
ఎగుమతులు తిరస్కరిస్తున్న అమెరికా కాకర, బెండ, మిర్చి ఉత్పత్తులు కూడా.. పురుగు మందుల అవశేషాలే కారణం సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉంటున్న కారణంగా ఇటీవలి కాలంలో మన దేశానికి చెందిన వ్యవసాయోత్పత్తులు ఎగుమతికి నోచుకోక పోవడం ప్రభుత్వవర్గాలను కలవరపరుస్తోంది. అమెరికా ఆహార, పురుగుమందుల పర్యవేక్షణ శాఖ గణాంకాల మేరకు ఎక్కువ వ్యవసాయోత్పత్తులు తిరస్కరణకు గురవుతున్న దేశాల్లో మన దేశం చైనా తర్వాత రెండోస్థానంలో ఉంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడం కాగా...ఇలా తిరస్కరణకు గురైన సరుకులు దేశీయ మార్కెట్లో యథేచ్ఛగా చలామణి అవుతున్నాయి. వీటివల్ల వినియోగదారుల ఆరోగ్యానికి చేటు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పలు రకాల బియ్యం, కూరగాయలు కూడా ఈ విధంగా తిరస్కరణకు గురవుతున్నారుు. మన దేశ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు 1,500 కోట్ల డాలర్లు. అయితే 2013 నవంబర్‌లో 202 సందర్భాల్లో భారత వ్యవసాయోత్పత్తులను అమెరికా తిరస్కరించింది. ఎక్కువగా బాస్మతి బియ్యం తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో దాదాపు 13 కంపెనీలు ఎగుమతి చేసిన బాస్మతి, సోనామసూరి బియ్యాన్ని అమెరికా తిరస్కరించింది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో బాస్మతి పైరుపై అగ్గితెగులు నివారణకు ‘ట్రై సైక్లోజోల్’ మందును అధికంగా వాడుతున్నారని, ఈ కారణంగానే బియ్యం ఎగుమతులను అమెరికా తిరస్కరిస్తోందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా నిబంధనల ప్రకారం బాస్మతిలో ‘ట్రై సైక్లోజోల్’ అవశేషాలు 0.01 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కన్నా ఎక్కువ ఉండకూడదు. మనదేశం ఎగుమతి చేస్తున్న బియ్యంలో దీని అవశేషాలు ఈ పరిమితికి మించి ఉండటం వల్ల అవి తిరస్కరణకు గురవుతున్నాయి. అహార పదార్థాల్లో పురుగుమందుల అవశేషాలను నిర్ధారించే, నియంత్రించే విధివిధానాలే మనకు లేవు. దీంతో ఆ సరుకు యథేచ్ఛగా దేశీయ మార్కెట్లలో చలామణి అవుతుంది. దీని వల్ల దేశీయ వినియోగదారులకు కలిగే నష్టం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు.