న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది.
కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
బాస్మతి టాప్..
భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది.
ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్‌లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment