EXPORTS
-
అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న
ప్రపంచ వాణిజ్యం, టారిఫ్‌లపై అనిశ్చితులున్నప్పటికీ రానున్న కాలంలో భారత్ నుంచి ఎగుమతులు వృద్ధి పథంలోనే సాగనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ సంతోష్ కుమార్ సారంగి పేర్కొన్నారు. అయితే ఇందుకు ఎగుమతిదారులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వాతావరణం భారత్‌కు బంగారంలాంటి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు.తయారీలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు.. ఎగుమతులు పుంజుకునేందుకు వైవిధ్యాన్ని చూపవలసి ఉంటుందని దేశీ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈవో) ఏర్పాటు చేసిన సోర్సెక్స్ ఇండియా 2025 షోలో సంతోష్ వివరించారు. చైనా తదితర దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి వీటిని భారత్‌కు సైతం వర్తింపచేయనున్నారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో కొన్ని ఎగుమతి సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌కు ప్రధానంగా ఇంజినీరింగ్, ఫార్మా ఎగుమతులు దెబ్బతినవచ్చని కొన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..ప్రస్తుత ఏడాదిలో భారత్ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. గతేడాది ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేశారు. ఇటీవల కొద్ది నెలలుగా ఎగుమతుల్లో మందగమనం నెలకొన్నప్పటికీ దీర్ఘకాలంలో పుంజుకోగలవని అభిప్రాయపడ్డారు. ఆర్డర్లపై పెరుగుతున్న విచారణలు సానుకూల అంచనాలకు దారి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి భవిష్యత్‌లో ఎగుమతులు వృద్ధి బాటలో సాగగలవని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. -
వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
న్యూఢిల్లీ: సేవల రంగం ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 450 బిలియన్ డాలర్లను (సుమారు రూ.39లక్షల కోట్లు) చేరుకోవాలని.. తద్వారా వస్తు ఎగుమతుల విలువను అధిగమించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ లక్ష్యంతో పనిచేయాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వస్తు ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కనుక సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 385–390 బిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 450 బిలియన్ డాలర్లను చేర్చేందుకు పరిశ్రమ కృషి చేయాలని కోరారు.2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో సేవల ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి 355 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో వస్తు ఎగుమతులు 3.1 శాతం క్షీణించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో మరింత పెద్ద లక్ష్యాలతో పనిచేయాలంటూ ‘నాస్కామ్ గ్లోబల్ కన్ఫ్లూయెన్స్’ ఆరంభ సమావేశంలో భాగంగా మంత్రి పరిశ్రమకు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఐపీవోకు ఫిజిక్స్వాలాజీసీసీల తోడ్పాటు..దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద ఎత్తున ఏర్పాటవుతుండడం, కొత్త టెక్నాలజీలతో సేవల ఎగుమతుల్లో ఏటా 15–18 శాతం వృద్ధి సాధించగలమన్నారు. దేశంలో 1,650 జీసీసీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పర్యాటకం, ఫైనాన్షియల్ రంగాల్లో అవకాశాలు దేశ సేవల ఎగుమతుల్లో 200 బిలియన్ డాలర్ల మేర ఐటీ, ఐటీ సంబంధిత సేవలే ఉన్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. అదే సమయంలో పర్యాటకం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోనూ సేవల ఎగుమతుల వృద్ధికి పెద్ద మొత్తంలో అవకాశాలు రానున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సేవల ఎగుమతుల్లో ఐటీ, ఐటీఈఎస్ ముందుంటాయన్నారు. క్లయింట్ లొకేషన్ నుంచి కాకుండా, మారుమూల ప్రాంతాల నుంచి మరిన్ని సేవలను అందించడంపై ఐటీ పరిశ్రమ దృష్టి పెట్టాలని కోరారు. దీనివల్ల పోటీతత్వం పెరిగి, వ్యయాలు తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌లో వేతనాలు చెల్లించడం ఇందులో ఉన్న మరో ప్రయోజనంగా పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ క్షీణతను చవిచూశాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 41.41 బిలియన్ డాలర్లతో (రూ.3.60 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 11 శాతం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 36.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు సైతం 50.96 బిలియన్ డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరిలో దిగుమతులు 60.92 బిలియన్ డాలర్లుగా (రూ.5.30 లక్షల కోట్లు) ఉంటే, ఈ ఏడాది జనవరి నెలలో 59.42 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) 14.05 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2021 ఆగస్ట్ తర్వాత అత్యంత కనిష్ట వాణిజ్య లోటు ఇదేనని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక నెలలో కనిష్ట దిగుమతులు 2023 ఏప్రిల్ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనించొచ్చు. స్వల్పంగా తగ్గిన పసిడి దిగుమతులు → ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. → జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతులు 21 శాతం తగ్గి 2.53 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → జనవరితో పోల్చి చూస్తే చమురు దిగుమతులు 13.4 బిలియన్ డాలర్ల నుంచి 11.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. → ఫిబ్రవరి నెలకు సేవల ఎగుమతులు 35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరిలో ఈ మొత్తం 38.55 బిలియన్ డాలర్లుగా ఉంది. → ఫిబ్రవరిలో సేవల దిగుమతుల విలువ 16.55 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో ఈ మొత్తం 18.22 బిలియన్ డాలర్లుగా నమోదైంది.800 బిలియన్ డాలర్ల ఎగుమతులు..2024–25లో సవాళ్లు నెలకొన్నప్పటికీ 800 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం అన్నది ప్రధానంగా చమురు, బంగారం, వెండి దిగుమతుల క్షీణతవల్లేనని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
‘మహీంద్రా’ ఇండియన్ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులకు 20 ఏళ్లు
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (MASL) భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2005లో మహీంద్రా తొలిసారి ద్రాక్ష పండ్ల షిప్‌మెంట్‌ను యూరప్‌కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది.సబోరో, ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. దాంతో ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను మూడు రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందిస్తోంది. సంస్థకు నాసిక్‌లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా నాసిక్, బారామతి, సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత‘గత 20 ఏళ్లలో ద్రాక్ష వ్యాపారంలో సాధించిన వృద్ధి ఎంఏఎస్ఎల్కు గర్వకారణం. వ్యవసాయ వేల్యూ చెయిన్‌లో భాగంగా ద్రాక్ష సాగులో పరివర్తన తేవడంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. మా కృషి ఫలితంగా ఇతర దేశాలకు భారతీయ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. అలాగే ప్రాంతీయంగా వందల కొద్దీ రైతుల జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలిగాం’ అని ఎంఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ రామచంద్రన్ తెలిపారు. 6.5 ఎకరాల్లో, 75,000 చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన మహీంద్రా గ్రేప్ ప్యాక్ హౌస్‌లో నిత్యం 80 మెట్రిక్ టన్నుల ద్రాక్షలు ప్యాక్ చేస్తారు. ఇందులో 12 ప్రీకూలింగ్ చాంబర్లు, 170 ఎంటీ సామర్థ్యంతో రెండు కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఒక్కో షిఫ్టులో 500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. సుస్థిర సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నాసిక్‌లో ఎంఏఎస్ఎల్కు 15 ఎకరాల్లో డెమో ఫార్మ్ ఉంది. -
భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్‌కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.తాజాగా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.#WATCH | Washington, DC: US President Donald Trump says, "...India charges us massive tariffs. Massive. You can't even sell anything in India...They have agreed, by the way; they want to cut their tariffs way down now because somebody is finally exposing them for what they have… pic.twitter.com/XwytKPli48— ANI (@ANI) March 7, 2025అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇక, ట్రంప్ సుంకాల ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. -
ఇంజినీరింగ్ ఎగుమతుల జోరు
కోల్‌కతా: జనవరి నెలలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 7 శాతం పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా (రూ.82వేల కోట్లు) ఉన్నట్టు ‘ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి’ (ఈఈపీసీ) ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు 18 శాతం అధికంగా 1.62 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు) విలువైన ఇంజినీరింగ్ ఎగుమతులు జరిగినట్టు తెలిపింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో మొత్తం ఇంజినీరింగ్ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం ఎగసి 97 బిలియన్ డాలర్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరినట్టు ఈఈపీసీ వెల్లడించింది. ఈ కాలంలో యూఎస్‌కు ఇంజినీరింగ్ ఎగుమతులు 9 శాతం పెరిగి 15.60 బిలియన్ డాలర్లుగా (రూ.1.37 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా యూఏఈకి ఎగుమతుల్లో పటిష్ట వృద్ధి నమోదైంది. జనవరిలో 56 శాతం పెరిగి 610 మిలియన్ డాలర్లుకు చేరగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్యకాలంలో చూసినా 45 శాతం ఎగసి 6.87 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈఈపీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జర్మనీ, మెక్సికో, టర్కీ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు జనవరి నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో యూకే, సౌదీ అరేబియా, మలేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్లకు తగ్గాయి. జనవరి నెలకు దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 25.86 శాతంగా ఉంది. ఇదీ చదవండి: టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..సవాళ్ల మధ్య రాణించిన ఎగుమతులు..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు వాణిజ్య రక్షణాత్మక ధోరణులు కొనసాగుతున్న తరుణంలోనూ దేశ ఇంజినీరింగ్ రంగం ఎగుమతుల పరంగా బలమైన వృద్ధిని చూపించినట్టు ఈఈపీసీ పేర్కొంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పులు దేశ వ్యాపార సంస్థలపై అసాధారణ స్థాయిలో ఒత్తిళ్లను పెంచే ప్రమాదం లేకపోలేదని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్ పంకజ్ చద్దా పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలో పనిచేసే ఈఈపీసీ ఇండియా.. ఎగుమతులను సులభతరం చేయడంతోపాటు, ఎంఎస్ఎంఈలు ప్రమాణాలను పెంచుకోవడానికి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానం కావడానికి సేవలు అందిస్తుంటుంది. యూఎస్ తాజా టారిఫ్‌లు రానున్న రోజుల్లో ఎగుమతిదారులు ఎదుర్కోనున్న సవాళ్లను తెలియజేస్తున్నట్టు ఈఈపీసీ ఛైర్మన్ చద్దా పేర్కొన్నారు. ఎగుమతిదారులు పోటీతత్వాన్ని కొనసాగించేందుకు రుణ సాయం, టెక్నాలజీ పరంగా ప్రభుత్వం నుంచి మద్దతు కొనసాగాల్సి ఉందన్నారు. -
ఫార్మా ఎగుమతుల్లో భారత్ జోరు
సాక్షి, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధాల సరఫరాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఎగుమతుల పరంగా కొత్త వృద్ధి శకానికి సిద్ధంగా ఉందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ), మెకిన్సే అండ్ కంపెనీ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 5 శాతం కంటే వేగంగా ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతోందని వివరించింది. ప్రపంచ ఫార్మా ఎగుమతులు 2011లో 424 బిలియన్ డాలర్ల నుంచి 2023 నాటికి 797 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత్ విషయంలో ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 28 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది. మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ చర్యలు, మెరుగైన నిర్వహణ, మొత్తం పరిశ్రమలో సామర్థ్యం పెరుగుదల ఇందుకు దోహదం చేసింది. విదేశాల్లోనూ పాగా.. భారత్ ఇప్పుడు ప్రపంచ జెనరిక్ ఔషధ డిమాండ్‌లో 20 శాతం సమరుస్తోంది. ఇందులో యూఎస్ జెనరిక్ ఔషధ అవసరాలలో 40 శాతం, యూకే మార్కెట్లో 25 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎగుమతుల విషయంలో పరిమాణం పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానం మనదే. భారత్‌కు వ్రస్తాల తర్వాత సుమారు 20 బిలియన్ డాలర్లతో అత్యధిక విదేశీ మారకం సమకూరుస్తున్న విభాగం ఇదే. ప్రపంచ వ్యాక్సిన్ డిమాండ్‌లో 60 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. 70 శాతం యాంటీ రెట్రోవైరల్ మందులు భారత్ నుంచి వెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే మందుల ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా అధికమై ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీలో భారత్ వాటా 8 శాతం ఉంది. బయోటెక్నాలజీ విభాగంలో 12వ ర్యాంకుతో పోటీపడుతోంది. ఆమోదం పొందిన బయోసిమిలర్ల సంఖ్య 2005లో 15 ఉంటే, 2023 నాటికి 138కి ఎగసింది. ఆమోదం పొందిన ఏఎన్‌డీఏల్లో టాపికల్స్, ఇంజెక్టేబుల్స్, నాసల్, ఆఫ్తాలి్మక్ వంటి సంక్లిష్ట డోసేజ్‌ల వాటా 2013లో 25 నుంచి 2023లో 30 శాతానికి చేరింది. యూఎస్‌ను మించిన కేంద్రాలు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదించిన తయారీ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2024 నాటికి 752కి చేరుకుంది. సంఖ్య పరంగా యూఎస్‌ను మించిపోయాయి. డబ్లు్యహెచ్‌వో జీఎంపీ ధ్రువీకరణ అందుకున్న ప్లాంట్లు 2,050, అలాగే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ (ఈడీక్యూఎం) ఆమోదం పొందిన ప్లాంట్లు 286 ఉన్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో యూఎస్ఎఫ్డీఏ అధికారిక చర్య సూచించిన (ఓఏఐ) కేసులు 50 శాతం తగ్గాయి. నిబంధనల తాలూకా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) కేసులు 27 శాతం క్షీణించాయి. కారి్మక వ్యయాలు తక్కువగా ఉండడం, సామర్థ్య మెరుగుదల, డిజిటల్ స్వీకరణ కారణంగా భారత కంపెనీలు అమెరికా, యూరోపియన్ తయారీదారుల కంటే 30–35 శాతం తక్కువ ధరకే ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రాధాన్య గమ్యస్థానంగా.. తక్కువ వ్యయానికే ఔషధాలు అందుబాటులో ఉండడంతో ప్రాధాన్య ఔట్సోర్సింగ్ గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఎంఆర్ఎన్ఏ, కణ, జన్యు చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో సహా అభివృద్ధి చెందుతున్న చికిత్సలకు ఉపయోగించే ఔషధాలు ఏటా 13–14 శాతం పెరుగుతున్నాయి. సంప్రదాయ ఔషధ వృద్ధి రేటును ఇవి అధిగమించాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ ఆధారిత పురోగతి కారణంగా అదనపు ఆదాయాన్ని 60 బిలియన్ డాలర్ల నుండి 110 బిలియన్ డాలర్లకు పెంచగలవని నివేదిక అంచనా వేసింది. మార్జిన్లను 4–7 శాతం మెరుగుపరుస్తాయని, ఉత్పాదకతను 50 శాతం పెంచగలవని వెల్లడించింది. ప్రపంచ ఫార్మా సరఫరా వ్యవస్థలో భారత పాత్రను బలోపేతం చేస్తూ తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి అయిదు అగ్రశ్రేణి భారతీయ కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సంస్థలు (సీడీఎంఓలు) 650 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. వెన్నంటే సవాళ్లు..ఔషధ రంగంలో భారత్ పురోగతి ఉన్నప్పటికీ.. పరిశ్రమ ఒక కీలక దశకు చేరుకున్నప్పుడు క్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక వివరించింది. డిజిటల్ పరివర్తన, స్మార్ట్ ఆటోమేషన్, కొత్త చికిత్సా విధానాల పెరుగుదల వంటి అంతరాయాలు ఔషధ కార్యకలాపాలను పునరి్నరి్మంచగలవని తెలిపింది. భౌగోళిక రాజకీయ మార్పులు, కొత్త పోకడలు, పెరుగుతున్న స్థిరత్వ డిమాండ్లు కూడా ముప్పును కలిగించే అవకాశం ఉందని వివరించింది. భారతీయ ఫార్మా కంపెనీలు పరిగణించవలసిన ఎనిమిది కీలక అంశాలలో లోపరహిత కార్యకలాపాలను సాధించడం, ఏఐ, డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, స్థిరత్వ ప్రయత్నాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ‘దశాబ్ద కాలంలో నిర్మించిన పునాది కారణంగా భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నేడు బలంగా ఉంది. అంతరాయాలు ఎదురుకానున్నందున అధిక పనితీరును నడిపించడానికి, ప్రపంచ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీలు తమ నిర్వహణ విధానాలను పునరాలోచించాలి’ అని మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామి విష్ణుకాంత్ పిట్టి తెలిపారు. -
రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమ వచ్చే 5–7 ఏళ్లలో ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు (రూ.8.6 లక్షల కోట్లు) పెంచుకునే లక్ష్యంతో పనిచేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2015లో ఎల్రక్టానిక్స్ గూడ్స్ ఎగుమతులు 167వ ర్యాంక్‌లో ఉంటే, అక్కడి నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకున్నట్టు చెప్పారు. జనవరి నెలలో 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ వస్తు ఎగుమతులు నమోదు కావడం గమనార్హం.ఇదీ చదవండి: యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (ఏఈఈఎంఏ) సమావేశంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పరిశ్రమ అధిక నాణ్యత ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి అందించే విధంగా ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తి విషయంలో భరోసానిచ్చే విధంగా పరిశ్రమ పనిచేయాలన్నారు. సమష్టిగా పనిచేస్తే పోటీతత్వాన్ని పెంచుకోవచ్చన్నారు. ఎంఎస్ఎంఈ రంగం, కస్టమర్ల ప్రయోజనాల మధ్య సమతూకాన్ని పాటించాలని పరిశ్రమకు సూచించారు. -
మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం నుంచి 2019–24 మధ్య 15.74లక్షల టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేశారు. దీనిద్వారా రూ.90,633కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఏపీలో మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు.మత్స్య రంగానికి, రైతులకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకమే ఇందుకు కారణమని ప్రకటించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11లక్షల టన్నులు మత్స్య సంపద మాత్రమే ఎగుమతి అయినట్లు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో అనూహ్యంగా 15.74 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు చేసినట్లు వివరించారు. అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆక్వా సాగు రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందించడం, ధరలు పతనం కాకుండా చూడటం వంటి అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో 1.75లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులు 39 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెరిగాయి. రొయ్యల దిగుబడులు 4.54లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరగడం విశేషం. -
'చరిత్ర సృష్టించబోతున్న భారత్': మొదటిసారి రికార్డ్!
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి, ఇందులో దేశం సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని వెల్లడించారు.2024-25 ఆర్ధిక సంవత్సరంలో.. భారతదేశ ఎగుమతులు మొదటిసారి రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. గత నాలుగేళ్లుగా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఎగుమతులు గణనీయంగా ఉంటాయని గోయల్ అన్నారు. జూన్ 2025తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఉల్లి, టమోటా, బంగాళాదుంప ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.మన ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారి 800 బిలియన్ డాలర్లను దాటుతుందని పియూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా నెలలుగా 600 బిలియన్ డాలర్ల వద్దనే స్థిరంగా ఉన్నాయి.ఎగుమతులు మాత్రమే కాకుండా.. దిగుమతుల అవసరం కూడా చాలా ఉంది. అయితే దిగుమతులు అనేవి కొరత, డిమాండ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, పప్పుధాన్యాలు, నూనెలు వంటివి ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి, అందులో ఉత్పత్తులను ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు దిగుమతులు పెరుగుతాయి. ఒక ప్రాంతంలో దిగుమతులు పెరిగితే.. పరిశ్రమల చూపుకూడా అటువైపు పడుతుంది. దీంతో అక్కడ కంపెనీలు ఏర్పడతాయి. ఇది ఎంతోమంది ఉపాధి కల్పిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. మొత్తం మీద దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. -
ఖండాంతరాలు దాటుతున్న మేడ్ ఇన్ ఇండియా కారు: ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) బ్రాండ్ కారు 'మాగ్నైట్' (Magnite) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అక్టోబర్ 2024లో లాంచ్ అయింది. ఈ మోడల్ ఇప్పుడు ఖండాంతరాలు దాటడానికి సిద్ధమైంది. ఇండియాలో తయారైన అప్డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ త్వరలో లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడవుతాయి.నిస్సాన్ ఇండియా జనవరి చివరిలో చెన్నై నుంచి దాదాపు 2,900 యూనిట్ల ఎల్‌హెచ్‌డి (లెఫ్ట్ హ్యండ్ డ్రైవ్) వేరియంట్ల మొదటి షిప్‌మెంట్‌ను ప్రారంభించింది. మరో 7,100 కార్లు త్వరలోనే ఎగుమతి అవుతాయని సమాచారం. మొత్తం మీద కంపెనీ భారత్ నుంచి 10,000 మాగ్నైట్ కార్లను ఎగుమతి చేయనుంది. ఈ కార్లు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలకు వెళతాయి.ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో భారత్ కూడా దూసుకెళుతోంది. కాబట్టి చాలా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా కార్లను కోరుకుంటున్నారు. ఈ కారణంగా భారత్ ఎగుమతులకు కూడా కేంద్రం అయింది. ఇప్పటికే పలు కంపెనీలు దేశంలో తయారైన కార్లను విదేశాలకు తరలిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియన్ బ్రాండ్ కార్లను వినియోగించనున్నాయి.నిస్సాన్ కంపెనీ ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన మాగ్నైట్ కార్లు 'లైఫ్ హ్యాండ్ డ్రైవ్' ఆప్షన్ కలిగి ఉంటాయి. ఎందుకంటే.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపయోగిస్తున్న కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్ పొందాయి. కాబట్టి మన దేశంలో ఎగుమతికి సిద్ధం చేసిన కార్లను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.నిస్సాన్ మాగ్నైట్ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.50 లక్షల మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూమరాంగ్ ఆకారపు డీఆర్ఎల్ వంటి వాటితో పాటు అప్డేటెడ్ గ్రిల్ కూడా ఈ కారులో చూడవచ్చు. ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందాయి.ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!మాగ్నైట్‌లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్) లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (100 పీఎస్ పవర్, 160 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజన్స్ ఉన్నాయి. ఇవి రెండూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.ఫేస్‌లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇంధన ఉత్పత్తి పెంపుఅమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్‌ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్లో అమెరికాను టాప్‌లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..అంతర్జాతీయ ధరలపై ప్రభావంయూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది. -
కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష నియామక పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో ఇరుదేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడునుంది. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కెనడా, మెక్సికో దేశాలు అమెరికా సరఫరా చేస్తున్న ప్రధాన ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.కెనడా అత్యధికంగా ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులుఖనిజ ఇంధనాలు, నూనెలు: 128.51 బిలియన్ డాలర్లురైల్వే మినహా ఇతర వాహనాలు: 58.21 బిలియన్ డాలర్లుయంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు: 33.75 బిలియన్ డాలర్లుప్లాస్టిక్స్: 14.05 బిలియన్ డాలర్లుముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు: 12.43 బిలియన్ డాలర్లుఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు: 11.87 బిలియన్ డాలర్లుకలప, చెక్క వస్తువులు: 11.53 బిలియన్ డాలర్లుఅల్యూమినియం: 11.36 బిలియన్ డాలర్లుఇనుము, ఉక్కు: 8.51 బిలియన్ డాలర్లుఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పరికరాలు: 7.58 బిలియన్ డాలర్లుమెక్సికో చేసే టాప్ ఎగుమతులువాహనాలు: 130.03 బిలియన్ డాలర్లువిద్యుత్ యంత్రాలు: 85.55 బిలియన్ డాలర్లున్యూక్లియర్ రియాక్టర్లు: 81.61 బిలియన్ డాలర్లుఖనిజ ఇంధనాలు, నూనెలు: 25.02 బిలియన్ డాలర్లుఆప్టికల్, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు: 22.33 బిలియన్ డాలర్లుఫర్నిచర్, పరుపులు: 13.35 బిలియన్ డాలర్లుపానీయాలు, స్పిరిట్స్, వెనిగర్: 11.75 బిలియన్ డాలర్లుప్లాస్టిక్స్: 10.26 బిలియన్ డాలర్లుకూరగాయలు, దుంపలు: 8.82 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’అమెరికా ఇరుదేశాలపై విధించిన 25 శాతం అధిక సుంకం వల్ల పైన పేర్కొన్న వస్తువులను సరఫరా చేస్తున్న ఇతర మిత్ర దేశాలకు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలున్నాయి. అయితే కెనడా, మెక్సికోలు ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాయి. కానీ, ఇందుకు ట్రంప్ అనుమతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
భారత్ ఎకానమీ వృద్ధి కోత
భారత్ ఎకానమీ 2024–25 ఆర్థిక సంవత్సరం అంచనాలకు పారిశ్రామిక మండలి–ఫిక్కీ(FICCI) 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ అంచనా వృద్ధి రేటు 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల విభాగం ఇటీవలే అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు సంబంధించి స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని సర్వే అభిప్రాయపడింది.ఎగుమతులు(Exports), విదేశీ మూలధన పెట్టుబడులు, ముడి పదార్థాల వ్యయాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరాల చైన్‌కు సమస్యలు తెచ్చే వీలుందని అవుట్‌లుక్ పేర్కొంది. భారత్ ఎకానమీలో ప్రైవేటు వినియోగం కీలక అంశమని తెలిపింది. అగ్రి ఉత్పాదకత, గ్రామీణ మౌలిక పరిస్థితులు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు పెంపుపై దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావచ్చని, ఇది వడ్డీరేట్లు దిగిరావడానికి దోహదపడుతుందని విశ్లేషించింది.కైలాక్‌కు భారత్ ఎన్సీఏపీ రేటింగ్వాహన రంగంలో ఉన్న స్కోడా(Skoda) ఆటో ఇండియా తయారీ కైలాక్ ఎస్యూవీ తాజాగా భారత్ ఎన్సీఏపీ 5–స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. స్కోడా నుంచి ఈ రేటింగ్ పొందిన తొలి మోడల్ ఇదే. స్కోడా కుషాక్, స్లావియా ఇప్పటికే గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ‘స్కోడా డిజైన్‌లో భద్రత ఒక భాగం. 2008 నుండి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో క్రాష్–టెస్ట్ జరిగింది. భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ–రేటెడ్ కార్ల సముదాయంతో భద్రతపై కంపెనీ ప్రచారంలో ముందుంది’ అని స్కోడా తెలిపింది.ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?భారత్‌లో జేవీసీ రీ–ఎంట్రీకంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ బ్రాండ్ జేవీసీ భారత టీవీ విపణిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్తో బ్రాండ్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రీమియం స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. ధర రూ.11,999 నుంచి ప్రారంభం. ఇవి అమెజాన్‌తో ప్రత్యేకంగా లభిస్తాయి. థామ్సన్, కొడాక్, బ్లావ్‌పంక్ట్, వైట్–వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల ఉత్పత్తులను సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే తయారు చేస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ కోసం షెంజెన్ స్కైవర్త్ డిజిటల్‌తో కంపెనీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరా గ్రూప్‌తో చేతులు కలిపిన జేవీసీ కంజ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. -
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
టెక్స్టైల్స్, అప్పారెల్ (వస్త్రాలు, దుస్తులు) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్–అక్టోబర్) 21.35 బిలియన్ డాలర్లకు (రూ.1.82 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే ఏడు శాతం వృద్ధి నమోదైంది. 8,733 మిలియన్ డాలర్ల(USD) ఎగుమతులు (మొత్తం ఎగుమతుల్లో 41 శాతం) రెడీమేడ్(readymade) వస్త్ర విభాగంలోనే నమోదయ్యాయి.కాటన్ టెక్స్టైల్స్ విభాగం నుంచి 7,082 మిలియన్ డాలర్లు (33 శాతం), మనుషుల తయారీ టెక్స్టైల్స్ ఎగుమతులు 3,105 మిలియన్ డాలర్లు (15 శాతం) చొప్పున ఉన్నట్టు కేంద్ర టెక్స్టైల్స్(Textile) శాఖ గణాంకాలు విడుదల చేసింది. వూల్ విభాగంలో 19 శాతం, హ్యాండ్లూమ్ విభాగంలో 6 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించగా, మిగిలిన అన్ని విభాగాల్లో ఎగుమతుల వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు ఇదే కాలంలో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు ఒక శాతం క్షీణించి 5,425 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రకటించింది. అత్యధికంగా మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్ దిగుమతులు 1,859 మిలియన్ డాలర్లు (34 శాతం)గా ఉన్నాయి. కాటన్ టెక్స్టైల్స్ విభాగంలో, ప్రధానంగా కాటన్ ఫైబర్(Cotton Fiber) దిగుమతులు పెరిగినట్టు టెక్స్టైల్స్ శాఖ నివేదిక వెల్లడించింది. ఇది దేశీ తయారీ సామర్థ్యం పెరగడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అంతర్జాతీయంగా 3.9 శాతం వాటా..2023–24లో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు 8.94 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం తగ్గాయి. 2023 సంవత్సరం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా ఆరో అతిపెద్ద దేశంగా నిలిచింది. ‘టెక్స్టైల్స్, అప్పారెల్ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. యూఎస్ఏ, ఈయూ 47 శాతం వాటాతో భారత్‌కు అతి పెద్ద ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. టెక్స్టైల్స్, అప్పారెల్ పరంగా వాణిజ్య మిగులుతో మన దేశం ఉంది.’అని టెక్స్టైల్స్ శాఖ వెల్లడించింది. -
ట్రంప్ హెచ్చరిక.. భారత్‌కు అనుకూలం!
చైనా వస్తువులపై అధిక సుంకాలు వేస్తానంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక, భారత్ ఎగుమతులకు అనుకూలమని ఇండియా ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అభిప్రాయపడింది. ఏటా రూ.250 కోట్ల చొప్పున మూడేళ్ల పాటు మొత్తం రూ.750 కోట్ల సాయాన్ని ప్రకటించడం ద్వారా 25 బిలియన్ డాలర్ల విలువ మేర ఎగుమతులను (రూ.2.12 లక్షల కోట్లు) అదనంగా పెంచుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లింది.2025–26 బడ్జెట్(Budget)కు సంబంధించి తమ డిమాండ్లను ఆర్థిక శాఖతో భేటీ సందర్భంగా ఎఫ్ఐఈవో తెలియజేసింది. ఐదు శాతం ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్‌ను (రాయితీ వడ్డీ రేటు) సైతం కొనసాగించాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్విని కుమార్ డిమాండ్ చేశారు. చైనా(China) గతంలో ఆధిపత్యం ఎక్కువగా ఉన్న రంగాల్లో భారత్ గణనీయంగా ఎగుమతులు పెంచుకునేందుకు ఆ దేశంపై అమెరికా టారిఫ్‌లు వీలు కల్పిస్తాయని చెప్పారు. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, టెక్స్టైల్స్, గార్మెంట్స్, టోయ్స్, కెమికల్స్, ఆటో విడిభాగాలు, పాదరక్షలు, ఫర్నీచర్, హోమ్ డెకరేటివ్ ఉత్పత్తుల విభాగంలో చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించగలదని ఎఫ్ఐఈవో నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూఎస్‌కు ఎగుమతి(Export) చేయతగిన కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎఫ్ఐఈవో ఈ భేటీలో భాగంగా కోరింది.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడురుణ వ్యయాలను తగ్గించాలి.. రాయితీ వడ్డీ రేటు పథకం గడువు 2024 డిసెంబర్ 31 వరకే ఉందని, అది కూడా రూ.50 లక్షలకు మించిన ఆదాయం ఉన్న ఎంఎస్ఎంఈకే వర్తిస్తున్నట్టు కుమార్ చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే భారత ఎగుమతిదారులు రుణాలపై అధిక వడ్డీ రేట్లను ఎదుర్కొంటున్నట్టు ఆర్థిక శాఖ దృష్టికి ఎఫ్ఐఈవో తీసుకెళ్లింది. దీంతో భారత ఎగుమతిదారులపై రుణ వ్యయాలు అధికంగా ఉంటున్నట్టు తెలిపింది. ఐఈఎస్ పథకాన్ని మరికొంత కాలం పాటు కొనసాగించడం వల్ల ఎగుమతి దారులు తక్కువ రేటుకే రుణాలు పొందే వెసులుబాటు లభిస్తుందని, దీంతో అంతర్జాతీయంగా పోటీ పడొచ్చని వివరించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలపై పన్ను ప్రయోజనాలు, ప్రైవేటు రంగ షిప్పింగ్ సామర్థ్యాల పెంపునకు వీలుగా మూలధన వ్యయాలు అధికం చేయాలన్న డిమాండ్లను సైతం ఎఫ్ఐఈవో ఆర్థిక శాఖ ముందుంచింది. ఏటా షిప్పింగ్, రవాణా చార్జీలకే 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. -
గార్మెంట్స్ ఎగుమతులు జూమ్
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ కాలంలో భారత్ నుంచి రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతులు 11.4 శాతం పెరిగి 9.85 బిలియన్ డాలర్లకు(రూ.81,516 కోట్లు) చేరుకున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌ను ఈ వృద్ధి తెలియజేస్తోందని అపారెల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) తెలిపింది. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలతో సమీప భవిష్యత్తులో అధిక వ్యాపార అవకాశాలున్న భారత్ వైపునకు మళ్లనున్నాయని కౌన్సిల్ వివరించింది.దేశ స్వాభావిక బలాలు, కేంద్ర, రాష్ట్రాల పటిష్ట సహాయక విధానాలతో ప్రయోజనాలను పొందేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఏఈపీసీ ఛైర్మన్ సుదీర్ సెఖ్రి అన్నారు. ఎండ్–టు–ఎండ్ వాల్యూ చైన్ సామర్థ్యం, బలమైన ముడిసరుకు, స్థిర, బాధ్యతాయుత వ్యాపార పద్ధతులపై దృష్టి సారించే కర్మాగారాలతో భారత్ రాబోయే కాలంలో గణనీయ వృద్ధిని సాధిస్తుందని అన్నారు.ఇదీ చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలునమ్మకం పెరుగుతోంది..మేడ్–ఇన్–ఇండియా ఉత్పత్తులపై గ్లోబల్ బ్రాండ్లకు పెరుగుతున్న నమ్మకాన్ని కూడా ఈ వృద్ధి ప్రతిబింబిస్తోందని సుదీర్ తెలిపారు. ప్రత్యేకించి పండుగ సీజన్లో డిమాండ్ దూసుకెళ్లడం ఇందుకు ఉదాహరణ అని వివరించారు. అంతర్జాతీయ కొనుగోలుదారులు భారత్ టెక్స్ ఎక్స్పో–2025లో పాల్గొనాల్సిందిగా చైర్మన్ విజ్ఞప్తి చేశారు. భారత మొత్తం వస్త్ర వ్యవస్థను ఒకే గొడుకు కింద చూపే పెద్ద వేదిక అని వ్యాఖ్యానించారు. ‘భారత్ టెక్స్ రోడ్‌షో సందర్భంగా వివిధ దేశాలకు వెళ్లాం. అంతర్జాతీయ కొనుగోలుదారులు, రిటైల్ చైన్ల నుంచి అద్భుత ప్రతిస్పందనలను అందుకున్నాం. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రోత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్లాట్‌ఫామ్ గొప్ప సహకారాన్ని, సోర్సింగ్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుందని భావిస్తున్నాం’ అని వివరించారు. -
దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు
ఎగుమతుల వాటా పెరుగుతున్నంత వరకూ దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య అసమతుల్యత ఏర్పడడం లేదన్నారు. వాణిజ్యానికి, ఉత్పత్తుల రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించే ధోరణులను ప్రపంచ దేశాలు నివారించాలని ఆయన పేర్కొన్నారు.‘ప్రపంచమంతా 3–3.5 శాతం వృద్ధి చెందుతోంటే భారత ఎకానమీ 7 శాతం వృద్ధి సాధిస్తోంది. అలాంటప్పుడు భారత్‌లో వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దిగుమతులూ పెరుగుతాయి. అయితే, ఎగుమతుల్లో దిగుమతుల పాత్ర కూడా చాలా కీలకం. ఎగుమతుల్లో దిగుమతుల వాటాను (దిగుమతి చేసుకున్న వాటిని మరో రూపంలో ఎగుమతి చేయడం) మెరుగుపర్చుకుంటున్నంత వరకు మనం దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు‘ అని సునీల్ బరత్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియాఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఉత్పత్తుల ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 5.77 శాతం పెరిగి 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో వలసలు, మొబిలిటీ విషయంలో గందరగోళం నెలకొందని బరత్వాల్ తెలిపారు. భారతీయులు లేదా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయా దేశాలకు ప్రొఫెషనల్స్ రాకపోకలు సాగించాల్సిన (మొబిలిటీ) అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరాటంకమైన మొబిలిటీకి వెసులుబాటు కల్పించాలని భారత్ అడుగుతోందే తప్ప వలసలను అనుమతించమని కోరడం లేదని బరత్వాల్ స్పష్టం చేశారు. -
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రయాణం గర్వకారణం
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే. ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయ యువతకు తిరుగులేదు నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. -
భారత డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్‌లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్‌కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్‌లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: సేవల రంగం సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 57.7 వద్ద ముగిసింది. గడచిన 10 నెలల కాలంలో సూచీ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాలు, ఉత్పత్తిలో వృద్ధి మందగించినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.తీవ్ర పోటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ సవాళ్లు, వినియోగదారుల ఎంపికలో మార్పు (ఆన్లైన్ సర్వీసుల్లోకి మారడం), కొత్త ఎగుమతి ఆర్డర్లలో అంతగా పెరుగుదల లేకపోవడం వంటి అంశాలు కూడా సేవల రంగం మందగమనానికి కారణమయ్యాయి. ఆగస్టులో సూచీ 60.9 వద్ద ఉంది. కాగా సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. అయితే 2024లో సూచీ 60 లో పునకు పడిపోవడం సెపె్టంబర్‌లోనే మొదటిసారి. ఇదీ చదవండి: జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!తయారీ–సేవలు కలిపినా డౌన్...సేవలు–తయారీ రంగం కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.7 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 58.3కు తగ్గింది. అయితే సూచీలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందని, ఆగస్టు నుంచి వ్యాపార ధోరణి పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఒక్క తయారీ రంగమే సెప్టెంబర్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.5కు తగ్గింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టులో సూచీ 57.5 వద్ద ఉంది. 400 తయారీ సంస్థల ప్యానల్లోని పర్చేజింగ్ మేనేజర్లకు పంపబడిన ప్రశ్నపత్రాల ప్రతిస్పందనలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసి, హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐని రూపొందిస్తుంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా మెజారిటీ కాగా, పారిశ్రామిక రంగం వాటా దాదాపు 25 శాతం. ఇందులో తయారీ రంగం వాటా దాదాపు 75 శాతం. -
బియ్యం.. మరింత ప్రియం
సాక్షి, హైదరాబాద్: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారమే నోటిఫికేషన్ విడుదల చేసింది.పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్ ఆంక్షలు2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. -
‘భారత్‌లో తయారీ’తో పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ)తో భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తయారీకి భారత్‌ను కేంద్రంగా మలిచే లక్ష్యంతో 2014 సెపె్టంబర్ 25న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది. పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దీనిపై ‘ఎక్స్’లో ప్రధాని ఓ పోస్ట్ పెట్టారు. ‘‘వివిధ రంగాల్లో ఎగుమతులు ఎలా పెరిగాయన్నది గమనించాలి. సామర్థ్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సాధ్యమైన అన్ని విధాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణల విషయంలో భారత పురోగతి సైతం కొనసాగుతుంది’’అని తన పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద 14 రంగాల్లో అదనపు సామర్థ్యాలపై ప్రోత్సాహకాలు కల్పించడం గమనార్హం. నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ విధానాలు సులభంగా మార్చడం, మెరుగైన వ్యాపార వాతావరణానికి సంబంధించి సానుకూల చర్యలు ఇందుకు మద్దతుగా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనికితోడు అవినీతి పట్ల కఠిన వైఖరి, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి, దేశ, విదేశీ పెట్టుబడులు పెరగడానికి సాయపడినట్టు చెప్పారు. ‘‘మనం గొప్ప విజయం సాధించాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉంది’’అని గోయల్ పేర్కొన్నారు.తయారీ వాటా పెరుగుతుంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ వాటా పెరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా ఈ కార్యక్రమం సాయపడినట్టు మంత్రి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు.100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు‘‘ఏటా 70–80 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటా 100 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’అని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా సైతం ప్రకటించారు. ఎఫ్‌డీఐ దరఖాస్తుల అనుమతుల ప్రక్రియను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలుగా రక్షణ, రైల్వేలు, బీమా, టెలికం తదితర రంగాలకు సంబంధించి నిబంధనలను సరళతరం చేసినట్టు తెలిపారు. -
పోర్టుల్లో చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ: ఎగుమతి, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పోర్టుల్లో కొన్ని రకాల చార్జీలు తగ్గించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటెయినర్ వెసెల్స్ (సరుకులు, ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే) కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.వాణిజ్య, పరిశ్రమలు, షిప్పింగ్, పోర్టులు, ఫైనాన్స్, పౌర విమానయాన, రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు, ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో, కస్టమర్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘తాజాగా తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే, ఖాళీ కంటెయినర్ల లభ్యత పెరుగుతుంది. సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. పోర్టుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది’ అన్నారు. చర్యలు ఇవీ.. » కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎస్సీఐ అదనంగా 5 సెకండ్ హ్యాండ్ కంటెయినర్ నౌకలను కొనుగోలు చేస్తుంది. » రైల్వే బోర్డు, కంటెయినర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటెయినర్లను యార్డులో 90 రోజుల పాటు చార్జీల్లేకుండా అందుబాటులో ఉంచుతా యి. 90 రోజుల తర్వాత రూ.3,000గా వసూ లు చేస్తున్న చార్జీని రూ.1,500కు తగ్గించారు. » కంటెయినర్ సామర్థ్యాన్ని 9,000 టీఈయూల మేర పెంచుతున్నట్టు ఎస్సీఐ ప్రకటించింది. » 40 అడుగుల కంటెయినర్‌కు రేట్లను రూ.9,000 నుంచి రూ.2,000కు తగ్గించారు. 20 అడుగుల కంటెయినర్ చార్జీలు రూ.6,000 నుంచి రూ.1,000కు దిగొచ్చాయి. -
ఈ ఏడాది చివరి నాటికి రూ.1.08 లక్షల కోట్లు!.. అమెజాన్ డైరెక్టర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ (అమెజాన్ ఇండియా ఎగుమతుల కార్యక్రమం) ఎగుమతులు ఈ ఏడాది చివరికి మొత్తంగా 13 బిలియన్ డాలర్లకు (రూ.1.08 లక్షల కోట్లు) చేరుకుంటాయని సంస్థ డైరెక్టర్ భూపేన్ వకంకర్ తెలిపారు. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నట్టు చెప్పారు. 2015లో అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్‌లో తయారైన 40 కోట్లకుపైగా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందించినట్టు వకంకర్ తెలిపారు. 2015 నుంచి 2023 మధ్య అమెజాన్ 8 బిలియన్ డాలర్ల ఎగుమతులే నమోదు చేయగా, కేవలం ఏడాది వ్యవధిలోనే (2023–24) 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వివరించారు. గడిచిన 12 నెలల్లో 50వేల కొత్త విక్రేతలను ఇందులో చేర్చుకున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం విక్రేతల సంఖ్య 1.5 లక్షలకు చేరుకున్నట్టు వెల్లడించారు. దేశీ విక్రేతలు అంతర్జాతీయ బ్రాండ్ల సృష్టికి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ వీలు కల్పిస్తోంది. సౌందర్య ఉత్పత్తుల ఎగుమతులు 2023లో 40 శాతం వృద్ధిని చూడగా, వస్త్రాలు, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యధిక వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ భారత విక్రేతలకు ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా ఉన్నట్టు అమెజాన్ విడుదల చేసిన ‘ది ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2024’ నివేదిక వెల్లడించింది. -
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
విస్తరిస్తోన్న భారత ఫార్మా మార్కెట్
భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యూఎస్, యూకే, ఇటలీలో భారత్ మార్కెట్ వాటా పెరుగుతోందని పేర్కొంది. యూఎస్‌కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో రెండో స్థానానికి చేరుతామని అంచనా వేసింది.పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం..‘యూఎస్, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యూఎస్‌కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే భారత్ 2023లో తన యూఎస్ మార్కెట్ వాటాను విస్తరించింది. త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2022లో 7.33 బిలియన్ డాలర్లుగా(రూ.61 వేలకోట్లు) ఉన్న యూఎస్‌లోని భారత్ ఔషధ దిగుమతులు 2023లో 9.08 బిలియన్ డాలర్ల(రూ.76 వేలకోట్లు)కు పెరిగాయి. దాంతో ఇది 13.1%కు చేరింది. యూఎస్‌కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వాటాలు వరుసగా 13.85%, 13.7%కు పడిపోయాయి.ఇదీ చదవండి: ‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్లో భారత్ పదో స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కు పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 23.34 మిలియన్ డాలర్ల(రూ.195 కోట్లు)కు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరికరాల మార్కెట్ పెరిగింది. 2022లో దాని వాటా 0.45 శాతంగా ఉండేది. అది 2023లో 1.7%కు చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 13.02 మిలియన్ డాలర్ల(రూ.109 కోట్లు)కు చేరుకున్నాయి. ఇదిలాఉండగా, భారత్ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్ర అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’
బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని అదానీ పవర్ స్పష్టం చేసింది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. అయినా గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ పవర్ సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.ప్రకటనలోని వివరాల ప్రకారం..బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్‌కు సరఫరా చేసే విద్యుత్‌ను దేశీయంగా విక్రయించాలనేది వాటి సారాంశం. కానీ గతంలో ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. బంగ్లాకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను పాటిస్తామని చెప్పింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్‌కు చెందిన 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తయారవుతున్న 100% పవర్‌ను పొరుగు దేశానికి ఎగుమతి చేసేలా ఒప్పందం జరిగింది.ఇదీ చదవండి: ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిరతలు, అల్లర్ల వల్ల భారత్ నుంచి విద్యుత్ సరఫరా చేసే కంపెనీల మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతోపాటు గ్రిడ్ నిర్వహణ క్లిష్టంగా మారవచ్చని భావించి ప్రభుత్వం ఎగుమతి నిబంధనల్లో మార్పులు చేసింది. తాత్కాలికంగా విద్యుత్‌ను స్థానికంగా సరఫరా చేసి, అక్కడి పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి ఒప్పందాలకు అనువుగా విద్యుత్ ఎగుమతి చేసేలా వెసులుబాటు కల్పించింది. అయితే అన్ని కంపెనీలు కచ్చితంగా దీన్ని పాటించాలనే నియమం లేదు. -
ఈ కామర్స్ ఎగుమతులకు అడ్డంకులు..!
ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎగుమతులకు భారీ అవకాశాలున్నాయని, ఈ దిశగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఈవై–అసోచామ్ నివేదిక సూచించింది. కస్టమ్స్ ప్రక్రియలను సులభంగా మార్చడం, పటిష్ఠ చెల్లింపుల యంత్రాంగం, ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం ద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలని తెలిపింది.ఎఫ్‌డీఐ మద్దతుతో నడిచే ఈ-కామర్స్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తుల ఇన్వెంటరీ (నిల్వ)కి అనుమతించాలని, అది భారత ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాలకు మద్దతునిస్తుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో ఈ-కామర్స్ రూపంలో 200–300 బిలియన్ డాలర్లు సాధించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాధించాలంటే ప్రస్తుత ఎగుమతులు 50–60 రెట్లు పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది.ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?2022–23లో ఈ–కామర్స్ వేదికల ద్వారా చేసే ఎగుమతులు 4–5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు)గా ఉన్నాయి. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక శాతంలోపే కావడం గమనార్హం. సంక్లిష్ట కస్టమ్స్ విధానాలు, స్వదేశానికి చెల్లింపుల పరంగా సవాళ్లు, నియంత్రిత విధానాలు ఈ-కామర్స్ ఎగుమతులకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని సరళీకరించాని ఈవై అసోచామ్ నివేదిక సూచిస్తుంది. ఎగుమతులకు సంబంధించి విధానాల్లో మార్పులు అవసరమని తెలిపింది. ఈకామర్స్ ఎగుమతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని పేర్కొంది. -
ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?
ప్రభుత్వం ఉప్పుడు బియ్యం(పార్బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని యోచిస్తోంది. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో బియ్యం ఎగుమతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 2023 ఆగస్టు నుంచి 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇది ఎగుమతిదారులకు భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ సుంకాన్ని తగ్గించాలని లేదా దాని స్థానంలో ప్రత్యేక వెసులుబాటు ఉండాలనే డిమాండ్ ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం ఎగుమతుల సమస్యలను పరిష్కరించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైస్ ఫెడరేషన్ కన్సల్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయం ప్రకారం ఉప్పుడు బియ్యం ఎగుమతిపై టన్నుకు 100 అమెరికన్ డాలర్లు(రూ.8,300) వసూలు చేస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేసింది. దాంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దేశీయంగా వీటి నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. -
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది. -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్!
సాక్షి, అమరావతి: వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దూకుడు ప్రదర్శించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా తగ్గినా రాష్ట్రంలో 2.63 శాతం వృద్ధి నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2022–23లో రూ.1,59,368.02 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24కి రూ.1,63,562.68 కోట్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల ఎగుమతులు క్షీణించినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఎగుమతుల విలువ రూ.98,983.95 కోట్లుగా ఉంది. వాణిజ్య ఎగుమతులు గత ఐదేళ్లలో 65.24 శాతం వృద్ధి చెంది రూ.1,63,562.68 కోట్లకు చేరాయి. అంటే.. ఏటా సగటున 13.04 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా ఐదేళ్లలో ఎగుమతులు రూ.64,578.73 కోట్లకు పెరిగాయి. 2018–19 నాటికి దేశవ్యాప్త ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు 4.52 శాతం వాటాతో 6వ స్థానంలోకి ఎగబాకడం విశేషం.10 శాతం వాటా లక్ష్యంగా అడుగులు..2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్–3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఆయా దేశాలకు చేస్తున్న ఎగుమతుల్లో ఇతర ఉత్పత్తుల ఎగుమతికి ఉన్న అవకాశాలను గుర్తిస్తోంది. వాటిని అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25,000 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో రామాయపట్నం పోర్టు ఈ ఏడాది, మిగిలిన మూడు పోర్టులు 2025 నాటికి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించనుంది. దీంతో రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022కి నీతిఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలవడం విశేషం. రెండేళ్ల క్రితం ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 12 స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. -
ఇరాన్ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్‌తో వాణిజ్యం ఎలా ఉందంటే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్‌తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్ నుంచి ఇరాన్‌కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ చేసుకునే దిగుమతులు 672 మిలియన్ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్ నుంచి ఇరాన్ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్, షుగర్, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్, పెట్రోలియం బిట్యుమెన్, యాపిల్స్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్తోనూ భారత్‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్ డీజిల్, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్, టెక్స్ట్టైల్, మెటల్ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. -
భారత్ ఎగుమతులు విస్తరించాయ్!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు విస్తరించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, 115 దేశాలకు భారత్ ఎగుమతులు పెరిగాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 46.5 శాతం వెయిటేజ్ కలిగిన ఈ దేశాల్లో అమెరికా, యూఏఈ, నెథర్లాండ్స్, చైనా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. కాగా మొత్తం ఎగుమతులు 2022–23తో పోలి్చతే 2023–24లో 3 శాతం పతనమై 437.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో 325.3 బిలియన్ డాలర్ల నుంచి 341.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 776.4 బిలియన్ డాలర్ల నుంచి 778.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్ వాటా 2014లో 1.70 శాతం ఉంటే, 2023లో 1.82 శాతానికి ఎగశాయి. భారత్ ర్యాంక్ సైతం ఈ విషయంలో 19 నుంచి 17 శాతానికి మెరుగుపడింది. -
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి 0.2 శాతం ఎగుమతులు తగ్గినట్లు కస్టమ్స్ డేటా ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే ముడి ఖనిజాల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 17 అరుదైన ఖనిజాలను ఆ దేశం రవాణా చేస్తుంది. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డేటా వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.2024 ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు: 4,566 టన్నులు.2023 ఏప్రిల్‌లో ఎగుమతులు: 4,574 టన్నులు2024 మార్చిలో ఎగుమతులు: 4,709.6 టన్నులు 2024 మొదటి నాలుగు నెలల్లో మొత్తం ఎగుమతులు: 18,049.5 టన్నులుఏడాదివారీగా పెరుగుదల: 10 శాతం2024 ఏప్రిల్‌లో చైనా దిగుమతి చేసుకున్న ఖనిజాలు: మార్చితో పోలిస్తే 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.2024 మొదటి నాలుగు నెలల కాలంలో దిగుమతులు మొత్తం 18.1% తగ్గి 48,842.5 టన్నులుగా నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. చైనా ప్రపంచవ్యాప్తంగా 70 శాతం అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. 90 శాతం మైనింగ్ రిఫైన్డ్ అవుట్‌పుట్ సామర్థ్యం చైనా సొంతం. చైనా ఎగుమతిచేసే అరుదైన ఖనిజాలతో లేజర్లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు , విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుచైనా ఇలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంటే సమీప భవిష్యత్తులో వీటితో తయారయ్యే వస్తువుల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయంగా ఖనిజాల అన్వేషణ జరిపి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
ఎలక్షన్ ఎఫెక్ట్.. ఉల్లి ఎగుమతులకు మళ్ళీ బ్రేక్
2023 డిసెంబర్లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ 'ఉల్లి' ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని మరింత పొడిగించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతి ఆంక్షలు అమలులోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పైగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చినా ఎగుమతులు నిషేదించడం సమంజసం కాదని వెల్లడించారు. అతిపెద్ద ఉల్లి ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో 100 కేజీల ఉల్లి ధరలు 2023 డిసెంబర్లో రూ.4,500 వద్ద ఉండేవి. నేడు ఆ ధరలు 1200 రూపాయలకు పడిపోయాయని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉల్లి కోసం భారతదేశంపై ఆధారపడి ఉన్నాయి. భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడం వల్ల ఆ దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆసియా దేశాల మొత్తం ఉల్లిపాయల దిగుమతుల్లో సగానికి పైగా వాటా భారతదేశానిదే కావడం గమనార్హం. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు సమాచారం. -
ఎగుమతులు రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్ డాలర్లు. ► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. -
Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి? -
సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్టెక్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్‌టెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాక్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్‌టెల్స్, జియో టెక్స్‌టైల్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్ టెక్స్టైల్స్) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్)కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. ♦ మొబిటెక్: కియా, ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్‌టెక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ♦ జియో టెక్స్టైల్స్: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్యూబులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్ ఉంది. ఓడరేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. ♦ ఆగ్రోటెక్ టెక్స్టైల్స్: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్ నెట్లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్‌లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్‌టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి. చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ౖటెల్స్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రోటెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్‌టైల్స్‌కు 30 శాతం డిమాండ్ ఉంది. అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్.. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది.. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్టైల్స్.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్‌లో ఆగ్రో టెక్స్టైల్స్.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది. – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. జిల్లా ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు అనంతపురం సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు చిత్తూరు శానిటరీ ప్యాడ్స్ తూర్పుగోదావరి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు ప్రకాశం కన్వేయర్ బెల్ట్ పశ్చిమగోదావరి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం విశాఖపట్నం సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు -
ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని తెలిపాయి. ఎగుమతులకు అనుగుణంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఓ గ్లోబల్ షిప్పింగ్ లైన్‌నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు వ్యయభారం తగ్గనుందని చెప్పాయి. 2021లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చార్జీలో భాగంగా 80 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించాల్సి వచ్చేదని, 2030 నాటికి ఇది 200 బిలియన్ డాలర్లను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఆర్అండ్డీపై భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇది దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉందని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ అన్నారు. ఇదీ చదవండి: ఇకపై మృదువైన రోబోలు.. అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు మరింత చేరువయ్యేలా మార్కెటింగ్ సౌకర్యాలు కావాలని, మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీం కింద బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించాలని అహ్మద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్‌తో దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు. -
అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు రెండు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ నుండి అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య వార్షిక ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగి 6.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఇండస్ట్రీ బాడీ– ఐసీఈఏ (ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) తెలిపింది. 6.6 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్ నుంచి ఆల్ టైమ్ గరిష్ట స్థాయని ఐసీఈఏ చైర్మన్ మహీంద్రూ తెలిపారు. ఆయన తెలిపిన సమచారం ప్రకారం, చైనా నుండి అమెరికా మార్కెట్లోకి దిగుమతి అయ్యే ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల వాటా తగ్గింది. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారతదేశ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదయ్యింది. 2021–22 జనవరి–సెపె్టంబర్ మధ్య అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ సుమారు 253 శాతం పెరిగి 6.6 బిలియన్లకు చేరుకుంది. 2018లో ఈ విలువ 1.3 బిలియన్ డాలర్లయితే, 2022లో 4.5 బిలియన్ డాలర్లని మహీంద్రూ వెల్లడించారు. భారత్–అమెరికాల మధ్య మధ్య ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్యం కూడా 84 శాతం మేర రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. 2021–22 జనవరి–సెపె్టంబర్ మద్య ఈ విలువ 4.9 బిలియన్ డాలర్లయితే, 2022–23 ఇదే కాలంలో ఈ విలువ 9 బిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2023లో ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్య విలువ 8.4 బిలియన్ డాలర్లుకాగా, దశాబ్ద కాలంలో ఈ విలువను 100 బిలియన్ డాలర్లు చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బాటలో ఇండో–అమెరికా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ లక్ష్యం సాధనే ధ్యేయం కాగా, భారత్–అమెరికా టాస్క్ ఫోర్స్ ఫర్ ఎల్రక్టానిక్స్ కేవలం స్వల్ప కాలిక ప్రయోజనాలకు సంబంధించినది కాదని టాస్క్ ఫోర్స్ ఆన్ ఎల్రక్టానిక్స్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. భారీ ఎగుమతులకు సంబంధించి ఒక లక్ష్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినదని వివరించారు. ‘‘ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 9 నెలల్లో 9 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది చక్కటి అభివృద్ధిగా మేము పరిగణిస్తున్నాము. ఇప్పుడు మా లక్ష్యం ఈ వేగాన్ని మరింత పెంచడం. అమెరికా ఎల్రక్టానిక్స్ మార్కెట్లో భారత్ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచాలన్నది మా లక్ష్యం‘ అని మీడియాతో ఆయన అన్నారు. అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల పెరుగుదల ప్రపంచ ఎల్రక్టానిక్స్ మార్కెట్లో మన దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ ఎల్రక్టానిక్స్ వాణిజ్యంలో భారత్ ప్రాముఖ్యతను వెల్లడిస్తోందన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ విభాగంలో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో 5 రెట్లు వృద్ధిని భారత్ సాధించగలమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి భారీగా తగ్గుదల చైనా నుండి అమెరికాకు మొత్తం దిగుమతుల్లో ఎల్రక్టానిక్స్ వాటా 2018లో 46 శాతం. జనవరి–సెపె్టంబర్ 2023లో ఇది 24 శాతానికి తగ్గింది. 2018 అనేక చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను (ట్రంప్ టారిఫ్‌లు) అమెరికా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు వియత్నాం, తైవాన్‌ల నుంచి అమెరికాకు 2018 నుంచి 2022 మధ్య భారీగా ఎల్రక్టానిక్స్ ఎగుమతులు పెరగడం గమనార్హం. ఆయా దేశాల నుంచి వరుసగా ఎగుమతులు 420 శాతం, 239 శాతం మేర పెరిగాయి. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలు, సరఫరా గొలుసులను వైవిధ్యం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. 4 ఏళ్లలో భారీ వృద్ధి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదిగే సామర్థ్యం ఉంది. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయి. రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుంది. దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం. – అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి -
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్
ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డిసెంబర్లో వార్షికంగా 8.14 శాతం తగ్గి రూ. 18,281.49 కోట్లకు ( 2,195.23 మిలియన్ డాలర్లు) చేరుకున్నాయని జెమ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) పేర్కొంది. గత ఏడాది ఇదే నెల్లో ఈ ఎగుమతుల విలువ రూ.19,901.55 కోట్లని (2,413.46 మిలియన్ డాలర్లు) వివరించింది. కీలక ఎగుమతి మార్కెట్లలో మందగమన పరిస్థితులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, భారత్, అమెరికాసహా 60 దేశాల్లో ఎన్నికల వంటి అంశాలు ఈ విభాగం ఎగుమతుల రంగంపై ప్రభావం చూపుతున్నట్లు మండలి చైర్మన్ విపుల్ షా చెప్పారు. ఇక కట్ అండ్ డైమండ్ మొత్తం ఎగుమతులు డిసెంబరులో 31.42 శాతం తగ్గి రూ. 7,182.53 కోట్లకు (862.48 మిలియన్ డాలర్లు) చేరాయి. గత సంవత్సరం ఇదే నెల్లో ఈ విలువ రూ. 10,472.93 కోట్లు ( 1,270.36 మిలియన్ డాలర్లు). అయితే డిసెంబర్లో బంగారు ఆభరణాల ఎగుమతులు 47.32 శాతం పెరిగి రూ.7,508.05 కోట్లకు ( 901.52 మిలియన్ డాలర్లు) చేరాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ రూ. 5,096.25 కోట్లు ( 618.27 మిలియన్ డాలర్లు). -
ఒడిదుడుకుల బాటనే ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వస్తు ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల బాటలోనే కొనసాగుతున్నాయి. నవంబర్‌లో క్షీణతను నమోదుచేసుకున్న ఈ కీలక రంగం డిసెంబర్లో స్వల్పంగా ఒక శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. విలువలో ఇది 38.45 బిలియన్ డాలర్లు. అయితే వస్తు దిగుమతుల విభాగం మాత్రం క్షీణతలోనే కొనసాగింది. విలువ 4.85 శాతం తగ్గి 58.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు– దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.80 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కొన్ని ముఖ్యాంశాలు... ► పెట్రోలియం ప్రొడక్టులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు ఉత్పత్తులుసహా పలు విభాగాల్లో డిసెంబర్ ఎగుమతులు తగ్గాయి. ► ప్లాస్టిక్, ఎల్రక్టానిక్ గూడ్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల విభాగాలు వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ► క్రూడ్ దిగుమతులు సమీక్షా నెలలో 22.77% తగ్గి 15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు మాత్రం 156 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లుకు చేరాయి. 9 నెలల్లో క్షీణతే.. మరోవైపు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు 5.7 శాతం క్షీణించి 317.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా ఇదే కాలంలో 7.93% క్షీణించి 505.15 బిలియన్ డాలర్లుకు దిగాయి. వెరసి వాణిజ్యలోటు 188.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ఈ లోటు 212.34 బిలియన్ డాలర్లు. సేవల రంగం కూడా నిరాశే... సేవల రంగం ఎగుమతులు డిసెంబర్లో క్షీణతను నమోదుచేసుకుని, 27.88 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022 ఇదే కాలంలో ఈ విలువ 31.19 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఈ విలువ 239.5 బిలియన్ డాలర్ల నుంచి 247.92 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గోధుమలు, భాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, అప్పటికే గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వెల్లడించారు. గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం గానీ, అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే.. 2022 మే నుంచి భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2023 జులై నుంచి బాస్మతియేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైనా నియంత్రణలు విధించింది. ఆహార భద్రతా అవసరాలు ఉన్న ఇండోనేషియా, సెనెగల్, గాంబియా తదితర మిత్ర దేశాలకు మాత్రం భారత్ బియ్యం పంపిస్తోందని మంత్రి చెప్పారు. -
2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..?
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాయి. భారత్ మాత్రం ఎగుమతుల జోరుతో ముందుకు సాగుతోంది. గత ఏడాదికన్నా ప్రస్తుత సంవత్సరంలో అధిక ఎగుమతులు సాధించింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇండియా ఎగుమతుల్లో ముందడుగు వేయడం కీలక పరిణామం. దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రానున్న రోజుల్లో రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ఇటీవల జరిగిన ‘ఇండస్‌ఫుడ్ షో 2024’ కార్యక్రమంలో భర్తావాల్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రూ.4 లక్షలకోట్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030 సంవత్సరానికల్లా దాదాపు రూ.8 లక్షలకోట్లకు చేరుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెడీ-టూ-ఈట్ ఫుడ్ తదితర విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, దిగుమతి దేశాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమలకు సూచించారు. ఈ షోను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ బియ్యం, గోధుమ, చక్కెర తదితర ఎగుమతులపై నియంత్రణలు విధించినప్పటికీ, వాటి ఎగుమతి పెరిగిందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే.. ప్రపంచ దేశాల్లో భారత్ ఎనిమిదో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశంగా ఉంది. 2022-23 మొదటి మూడు త్రైమాసికాల్లో ప్రధాన వ్యవసాయ దిగుబడులు, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల్లో 12శాతం వృద్ధి నమోదైంది. వీటి ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, చైనా మొదటి వరుసలో ఉన్నాయి. ప్రపంచ దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్ నుంచి వివరాలు సేకరిస్తున్న సమయంలో కొత్తగా యూరప్ దేశాలతోపాటు ఈజిప్టు ఈ జాబితాలో చేరింది. ఈజిప్టు ఇప్పటి వరకు 25 వేల టన్నుల బియ్యం కోసం భారత్‌ను టెండరు కోరింది. -
వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బాస్మతి టాప్.. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది. ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్‌లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి. -
ఎగుమతుల్లో 5వ స్థానం..అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్
దేశంలోని ఆయా రాష్ట్రాలు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. ఎగమతులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నివేదికను విడుదల చేస్తుంది. అయితే తాజాగా, విడుదల చేసిన ఎగుమతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ - సెప్టెంబర్ -2023 మధ్య జరిగిన ఈ ఎగుమతులు విలువ రూ.85,021 కోట్లుగా ఉంది. ఇక, దేశంలోని ఆయా రాష్ట్రాల జరిగే ఎగుమతుల జాబిత ఇలా ఉంది. వాటిల్లో గూజరాత్ - రూ.5,52,855 కోట్లు మహరాష్ట్ర - రూ.2,72,492 కోట్లు తమిళనాడు - రూ.1,71,462 కోట్లు కర్ణాటక - రూ.1,04,448 కోట్లు ఆంధ్రప్రదేశ్ - రూ.85,021 కోట్లతో తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 🚨 Top Indian Export States in H1, FY24. (April - September) 1. Gujarat - 5,52,855 crore 2. Maharashtra - 2,72,492 crore 3. Tamil Nadu - 1,71,462 crore 4. Karnataka - 1,04,428 crore 5. Andhra Pradesh - 85,021 crore 6. Uttar Pradesh - 83,260 crore 7. Haryana - 67,258 crore 8.… — Indian Tech & Infra (@IndianTechGuide) December 10, 2023 -
ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలు, ఇతరత్రా గల్ఫ్ దేశాలకు ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా టారిఫ్యేతర అవరోధాలను తొలగించడంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలున్న సహారా ప్రాంత దేశాలు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ మిషన్లతో వర్చువల్ సమావేశాలు నిర్వహింనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, ఎగుమతుల స్థితిగతులు, టారిఫ్యేతర అడ్డంకులు మొదలైన వాటి గురిం చర్చింనట్లు వివరించారు. సహారా ప్రాంత దేశాలకు సంబంధిం దక్షిణాఫ్రికా .. భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో దక్షిణాఫ్రికాతో మొత్తం 18.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. ఇందులో 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (11.85 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 5.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టోగో (6.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టాంజానియా (6.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 3.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ఉన్నాయి. మిగతా ఆఫ్రికన్ దేశాల్లో మొజాంబిక్, అంగోలా, కెన్యా ఉన్నాయి. గల్ఫ్‌లో సౌదీ అరేబియా (52.76 బిలియన్ డాలర్లు), ఖతర్ (18.77 బిలియన్ డాలర్లు) తదితర దేశాలతో అత్యధికంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులకు ఊతమిచ్చే క్రమంలో ప్రధానంగా ఆహారం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టాలంటూ ఎగుమతిదార్లకు వాణిజ్య శాఖ సూంంది. అలాగే, అంతర్జాతీయంగా మరిన్ని ఎగ్జిబిషన్స్ వంటివి నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఎగుమతులు 7 శాతం తగ్గి సుమారు 245 బిలియన్ డాలర్లకు, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించి 392 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు
న్యూఢిల్లీ: బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1,42,000, మలేíÙయాకు 1,70,000, ఫిలిప్పైన్స్కు 2,95,000 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
ఎగుమతులు 3 శాతం డౌన్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సెసెప్టెంబర్‌లో ఇవి 63.37 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్‌లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్ డాలర్లకు దిగి వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెసెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులపై ఆశాభావం.. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయికి దిగి వచి్చందని సునీల్ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్ మెరుగ్గా రాణిస్తోందని సునీల్ చెప్పారు. ఆగస్టు గణాంకాల సవరణ.. కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్ డాలర్ల నుంచి 38.45 బిలియన్ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్ డాలర్ల నుంచి 60.1 బిలియన్ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో 3.88 శాతం పెరిగినట్లయ్యింది. మరిన్ని విశేషాలు.. ► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. ► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్ టూల్స్ వీటిలో ఉన్నాయి. ► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్ డాలర్లకు చేరాయి. -
పది దేశాలకు మరింతగా ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ తోడ్పాటు, పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహాలతో పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు 112 బిలియన్ డాలర్ల మేర పెంచుకోవచ్చని వివరించింది. సదరు దేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో దేశీ సంస్థలు పాల్గొనేందుకు, విక్రేతలు–కొనుగోలుదారుల సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడంలో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక స్కీమును రూపొందించవచ్చని ఎఫ్ఐఈవో తెలిపింది. అలాగే, విదేశాల్లోని దిగుమతి సంస్థలు, దేశీ ఎగుమతి సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించడంలో ఆయా దేశాల్లోని భారతీయ మిషన్లు పరిశ్రమకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొంది. తయారీ రంగంలో భారత్ సామర్థ్యాలను సదరు దేశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఎఫ్ఐఈవో వివరించింది. ‘112 బిలియన్ డాలర్ల మేర మరింతగా ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న 10 దేశాల్లో అమెరికా (31 బిలియన్ డాలర్లు), చైనా (22 బిలియన్ డాలర్లు), యూఏఈ (11 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (8.5 బిలియన్ డాలర్లు), జర్మనీ (7.4 బిలియన్ డాలర్లు), వియత్నాం (9.3 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (5 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (5.4 బిలియన్ డాలర్లు), ఇండొనేషియా (6 బిలియన్ డాలర్లు), మలేషియా (5.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి‘ అని ఎఫ్ఐఈవో తెలిపింది. 2030 నాటికి ఉత్పత్తులు, సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. 2022–23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► నివేదిక ప్రకారం పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలో వజ్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, మెరైన్ ఉత్పత్తులు, దుస్తులు, క్రిమిసంహాకరాలు, ఇనుము .. ఉక్కు, టీ, కాఫీ మొదలైనవి ఉన్నాయి. ► అమెరికాకు డైమండ్లు (3.7 బిలియన్ డాలర్లు), మోటర్ వాహనాలు (2.2 బిలియన్ డాలర్లు), ఆభరణాలు (1.4 బిలియన్ డాలర్లు), టెలిఫోన్ సెట్లు, ఇతరత్రా వాయిస్/ఇమేజ్ ట్రాన్స్మిషన్ పరికరాలు (1.3 బిలియన్ డాలర్లు) మొదలైన వాటి ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ► చైనాకు మోటర్ వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, పశుమాంసం, రొయ్యలు, మిరియాలు, గ్రానైట్, ఆముదం, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవచ్చు. ► జర్మనీకి అల్యూమినియం, కాఫీ, దుస్తులు, జీడిపప్పు, మోటర్ వాహనాలు, ఆభరణాలు ఎగుమతి చేయొచ్చు. ► బ్రిటన్‌కు వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కలప ఫరి్నచరు, బియ్యం, బ్లాక్ టీ, టర్బోజెట్లు, ఆటో విడిభాగాలు, శాండ్‌స్టోన్, పిల్లల దుస్తుల ఎగుమతులను పెంచుకోవచ్చు. ► ఇండొనేషియా, మలేíÙయాకు ఇనుము..ఉక్కు ఐటమ్లు, ఆటో విడిభాగాలు, క్రిమిసంహారకాలు, అల్యూమినియం మిశ్రమ లోహాలు, రాగి క్యాథోడ్లు, రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేయొచ్చు. ► ఎగుమతులు పెరగడం వల్ల దేశీయంగా ఉద్యోగాల కల్పనకు, తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ మారకాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. -
10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం
న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్‌లో భాగమైన అదానీ సోలార్కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. -
ఎగుమతుల్లో ఏపీ పైపైకి..
సాక్షి, అమరావతి: 2017–18 నుంచి 2022–23 మధ్య దేశ ఎగుమతులు సగటున 8.2 శాతం వృధ్ధి చెందగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 8.9 శాతం వృద్ధితో రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయని ఎగ్జిమ్ బ్యాంక్ అధ్యయన నివేదికలో పేర్కొంది. రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు దృష్టి పెట్టని మార్కెట్లను కూడా అందిపుచ్చుకోగలిగితే ఎగుమతులు మరింత వేగంగా విస్తరిస్తాయని తెలిపింది. అవకాశం ఉన్నా, ఇప్పటివరకు అందిపుచ్చుకోని మార్కెట్ విలువ రూ. 88,800 కోట్లు వరకు ఉందని అంచనా వేసింది. ఈ మార్కెట్ పైనా దృష్టి పెడితే రాష్ట్ర ఎగుమతుల విలువ రూ. 2.43 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఎగ్జిమ్ బ్యాంక్ మధ్యంతర అంచనాల ప్రకారం 2027–28 నాటికి రాష్ట్ర ఎగుమతులు రూ. 4.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇందులో వాణిజ్య ఉత్పత్తుల విలువ రూ. 4 లక్షల కోట్లుగా, సేవల రంగం వాటా రూ. 80 వేల కోట్లు ఉండనుంది. ప్రభుత్వంతో కలిసి ప్రోత్సాహక చర్యలు రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఎగ్జిమ్ బ్యాంక్ ఎండీ హర్ష బంగారి ‘సాక్షి’ కి తెలిపారు. ఇందుకోసం ఎగుమతిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు జిల్లాలవారీగా అవకాశాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇంతవరకు అవకాశాలు అందిపుచ్చుకోని రంగాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా అధిక విలువ ఉన్న రిఫైన్డ్ షుగర్‌ను బంగ్లాదేశ్‌కు, పేపర్ వోచర్ కార్డులను ఇథియోపియాకు ఎగుమతి చేసేలా ఎగ్జిమ్ బ్యాంక్ రెండు కంపెనీలను ప్రోత్సహించిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆరు ప్రధాన ఎగుమతి జిల్లాలైన తూర్పు, పశి్చమ గోదావరి, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేసి అక్కడి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. -
ఎగుమతుల్లో ఈ ఏడాదీ అదే జోష్
సాక్షి, అమరావతి: సముద్ర వాణిజ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో క్షీణత నమోదవుతున్నా, మన రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ – జూన్ మధ్య దేశవ్యాప్తంగా ఎగుమతులు 8.48 శాతం క్షీణించగా, అదే సమయంలో మన రాష్ట్ర ఎగుమతుల్లో 6.20 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2022 – 23) తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా రూ. 9,34,041.13 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో రూ.8,54,792.12 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు రూ.40,760.22 కోట్ల నుంచి రూ.43,289.32 కోట్లకు పెరిగాయి. తొలి త్రైమాసికంలో మొత్తం దేశ ఎగుమతుల్లో 5.06 శాతం వాటాతో మన రాష్ట్రం అయిదో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరో స్థానంలో ఉండగా ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఒక ర్యాంకును మెరుగుపరుచుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్ర ఎగుమతులు 10.79 శాతం వృద్ధితో రూ.1,59,368.02 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఎగుమతుల ప్రోత్సాహానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. విదేశాల్లో డిమాండ్ ఉన్న మన రాష్ట్ర ఉత్పత్తులను గుర్తించి, అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటోంది. రవాణా, ఇతర మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. ఎగుమతుల కోసం దేశంలో ఏక్కడా లేని విధంగా రూ.20,000 కోట్లతో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరికి, మిగిలిన మూడు పోర్టులు 2025 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతిఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. రెండేళ్ల క్రితం 20వ స్థానంలో ఉండగా, గత ఏడాదికి 12 స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. -
ఏడోనెలా ఎగుమతులు రివర్స్..పసిడి దిగుమతులు రయ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్లు కావడం గమనార్హం. ► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది. రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
ఈ-కామర్స్‌కు భారత్ ‘అమెజాన్’:ఇక్కడి మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. డిజిటైజేషన్, ఆర్థిక వృద్ధి, మొబైల్, ఇంటర్నెట్ విస్తృతి, యువత కారణంగా ఊపందుకున్న భారత ఈ-కామర్స్ ఆకర్షణీయంగా ఉందని అమెజాన్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ తెలిపారు. ఇక్కడ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కాలపరిమితి అంశంలో చాలా స్పష్టత ఉందన్నారు. కంపెనీ తన 2025 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉందని చెప్పారు. అమెజాన్ ఇటీవలే భారత్‌లో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సంస్థకు ఇక్కడి మార్కెట్లో 10 కోట్ల పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికీ పరిమితమని, దేశంలో ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో పదేళ్ల వరకు ఈ-కామర్స్ రంగంలో విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉత్తేజకర మార్కెట్‌గా..: ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చాలా ఉత్తేజకర మార్కెట్‌గా భారత్ కొనసాగుతోందని మనీష్ తెలిపారు. కాబట్టి అంతర్జాతీయంగా ఇక్కడి విపణిపై అమెజాన్ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ‘భారత మార్కెట్ చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంతటి వ్యాపార అవకాశాలున్న మార్కెట్లు ఎక్కువగా లేవు. ఈ-కామర్స్ విస్తృతి తక్కువగా ఉండడంతో పోటీ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. విస్తృతి 90 శాతానికి చేరినప్పుడు పోటీ గురించి ఆందోళన చెందాలి. కస్టమర్ అంచనాలను ఎలా అందుకోవాలో తొలి 10 ఏళ్లు మాకు నేర్పించాయి. మార్కెట్ చాలా నూతనంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. దీర్ఘకాలంలో మా అమ్మకందారులకు, కస్టమర్లకు ఇది మంచిదని భావిస్తున్నాను’ అని అన్నారు. భారత ఈ-కామర్స్ మార్కెట్ 2022లో 83 బిలియన్ డాలర్లు నమోదైంది. 2026 నాటికి ఇది 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎఫ్ఐఎస్ 2023 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. -
స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి యూఎస్‌కు జరుగుతున్న స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో కొత్త రికార్డు నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో దేశీయంగా తయారైన రూ.6,679 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు యూఎస్‌కు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.758 కోట్లుగా ఉంది. భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో విలువ పరంగా యూఎస్ మూడవ స్థానంలో ఉంది. ఇక మొత్తం ఎగుమతులు ఏప్రిల్–మే నెలలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 158 శాతం అధికమై రూ.19,975 కోట్లు నమోదయ్యాయి. యూఏఈకి రూ.3,983 కోట్లు, నెదర్లాండ్స్‌కు రూ.1,685 కోట్లు, యూకే మార్కెట్‌కు రూ.1,244 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు సరఫరా అయ్యాయి. ఇటలీ, చెక్ రిపబ్లిక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022–23లో భారత్ నుంచి వివిధ దేశాలకు చేరిన స్మార్ట్ఫోన్ల విలువ రూ.90,009 కోట్లు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రకటించడం, యుఎస్‌కు చెందిన ఆపిల్ దేశీయంగా తయారీలోకి ప్రవేశించిన తర్వాత స్మార్ట్ఫోన్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా భారత్ అవతరిస్తోంది. -
ఎగుమతుల్లో ‘ఎగిసిన’ ఏపీ
సాక్షి, అమరావతి: నీతి ఆయోగ్ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది. ఈ ర్యాంకుల్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్ (61.23) ఉన్నాయి. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ .. కేవలం రెండేళ్లలో 12 స్థానాలను మెరుగుపర్చుకుని సత్తా చాటింది. ఇక కోస్తాతీరం కలిగిన రాష్ట్రాలు 8 ఉంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతుల ఎకోసిస్టమ్‌లో 6వ స్థానం దక్కించుకుంది. టాప్ 100లో రాష్ట్రం నుంచి 8 జిల్లాలు.. దేశం నుంచి 2021–22లో 422 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్ డాలర్లు) ఉందని నివేదిక పేర్కొంది. 127 బిలియన్ డాలర్ల ఎగుమతులతో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కింది. అందులో విశాఖకు టాప్ 10లో తొమ్మిదో స్థానం దక్కగా ఉమ్మడి తూర్పుగోదావరికి 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యతకూడా భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిర్దిష్టమైన పాలసీలను రూపొందించి అమలు చేయడం ద్వారా ఏపీ ర్యాంకులు మెరుగుపడ్డాయని నీతిఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ జోన్స్, అగ్రిఎక్స్‌పోర్ట్ జోన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం వర్క్‌షాప్స్, ట్రేడ్ ఫెయిర్స్‌ను నిర్వహించిందంటూ కితాబునిచ్చింది. టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పోటీపడటానికి దోహదం చేసిందని, అది రాష్ట్ర ఎగుమతుల్లో భారీ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోకి విదేశీపెట్టుబడుల రాక పెరుగుతున్నప్పటికీ.. ఎగుమతుల ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా వ్యాపార వాతావరణం మెరుగుపర్చుకుంటే ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదు చేయవచ్చని సూచించింది. కాగా, ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ.. 2021లో 9వ ర్యాంకుకు, ఈ ఏడాది మరో ర్యాంకుకు ఎగబాకి అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఎగుమతులు భారీ పతనం.. మూడేళ్లలో ఇదే తొలిసారి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మందగమన ప్రభావం ముఖ్యంగా అమెరికా, యూరోప్ మార్కెట్ల నిరాశావాద ధోరణి భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతులపై ప్రభావం చూపుతోంది. జూన్‌లో వస్తు ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన మూడేళ్లలో (కరోనా సంక్షోభ సమయం 2020 మే నెల్లో 36.47 శాతం క్షీణత) ఇంత స్థాయిలో వస్తు ఎగుమతుల పతనం ఇదే తొలిసారి. ఇక దిగుమతులు కూడా 17.48 శాతం క్షీణించి 53.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జూన్‌లో 20.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో క్షీణతే.. ఇక ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) చూస్తే వస్తు ఎగుమతులు 15.13 శాతం క్షీణించి 102.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 12.67%క్షీణించి 160.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 57.6 బిలియన్ డాలర్లుగా ఉంది. విభాగాల వారీగా... జూన్‌లో చమురు దిగుమతుల విలువ 33.8 శాతం తగ్గి 12.54 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏప్రిల్–జూన్ మధ్య 18.52 శాతం క్షీణతతో 43.4 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు జూన్‌లో 82.38 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాన్ని చూస్తే, 7.54 శాతం తగ్గి 9.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూన్‌లో వెండి దిగుమతులు 94.36 శాతం పడిపోయి 0.79 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 21 క్షీణత నమోదుచేసుకున్నాయి. వీటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్, రసాయనాలు, రత్నాభరణాలు, తోలు, మెరైన్ ఉత్పత్తులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు జూన్‌లో 45.36% పెరిగి 2.43%గా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో ఈ ఎగుమతులు 47% పెరిగి 6.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
రక్షణ రంగానికి వెన్నెముక విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణశాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే రక్షణరంగ ఎగుమతులు గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణలు’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన అవకాశాలున్న విశాఖ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉందని చెప్పారు. తూర్పు నౌకాదళం, డాక్‌యార్డ్, షిప్‌యార్డు, ఎన్ఎస్టీఎల్ తదితర రక్షణ రంగం, అనుబంధ సంస్థలు ఉన్న విశాఖ భవిష్యత్తులో రక్షణ రంగం, ఏరోసిస్టమ్కు కేంద్రంగా మారనుందని చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విశాఖలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతికత బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా.. డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. దేశీయ తయారీరంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని, భవిష్యత్తులో రూ.25 వేల కోట్ల మార్క్‌ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టార్పెడోలు, క్షిపణులు, పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో అగ్రభాగంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఎగుమతుల్లో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఒకప్పుడు సప్లై చైన్‌గా ఉన్న ప్రైవేటు కంపెనీలు డెవలప్మెంట్ ప్రొడక్షన్ సెక్టార్‌గా మారాయని, క్రమంగా డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్స్ (డీసీపీపీ)గా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ తయారీ సంస్థలు ఏడు మిసైళ్లను తయారు చేశాయన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోందన్నారు. రక్షణ రంగం వైపుగా ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నా యని చెప్పారు. దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో సీఐఐ ఎస్ఐడీఎం చైర్మన్ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతిదారులు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కి చెందిన గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకూ చేసిన ఎగుమతులు ఈ ఏడాదితో 8 బిలియన్ డాలర్లు దాటనున్నాయి. గతేడాది ఇవి 5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అమెజాన్ తమ ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2023 నివేదికలో పేర్కొంది. 2015లో అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.25 లక్షల ఎగుమతిదారుల స్థాయికి చేరినట్లు వివరించింది. 1,200 మంది భారతీయ ఎగుమతిదారులు గతేడాది రూ. 1 కోటి విక్రయాలు సాధించినట్లు అమెజాన్ తెలిపింది. అత్యధికంగా ఎగుమతైన వాటిల్లో బొమ్మలు (50 శాతం), గృహ .. వంటగది ఉత్పత్తులు (35 శాతం), సౌందర్య సాధనాలు (25 శాతం) ఉన్నాయి. 2025 నాటికి భారత్ నుంచి మొత్తం ఈ-కామర్స్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లకు చేరేలా తోడ్పడేందుకు లక్షల కొద్దీ చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేయనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ తదితర దేశాలకు 26.6 కోట్ల పైచిలుకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఎగుమతవవుతు న్నాయని నివేదిక పేర్కొంది. 2023లో ఎగుమతులపరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
2 లక్షల కోట్ల డాలర్లకు ఎగుమతులు
న్యూఢిల్లీ: 2030 నాటికి వస్తు, సేవల ఎగుమతులను 2 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యం ఆచరణ సాధ్యమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఎస్సీ అగర్వాల్ తెలిపారు. సులభంగా వాణిజ్య రుణాల లభ్యత ఇందుకు కీలకంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో పోటీపడేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ వివరించారు. ఇటు దేశీయ వ్యాపారాలతో పాటు అటు సీమాంతర వాణిజ్యానికి కూడా సులభంగా రుణాలు లభించేలా చూడటంపై ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) ‘సీమాంతర వాణిజ్యంతో పోలిస్తే దేశీయంగా వ్యాపారాల కోసం రుణాలను పొందడం సులభతరంగా ఉంటుందని నాకు చెబుతుంటారు. సీమాంతర వాణిజ్యం చాలా రిస్కులతో కూడుకున్నదనే అభిప్రాయమే దీనికి కారణం కావచ్చు. మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడాలంటే దీన్ని సరిదిద్దాలి. ఇందులో రుణాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది‘ అని అగర్వాల్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021–22తో పోలిస్తే 2022–23లో వస్తు, సేవల ఎగుమతులు 14.68 శాతం పెరిగి 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఈ నేపథ్యంలో 2030 నాటికి వీటిని 2 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు)కు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. మరోవైపు, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య నిర్వహణ తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ తెలిపారు. కార్మిక శక్తి, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, పర్యావరణ అభివృద్ధి మొదలైనవి వ్యాపారాల్లో కీలకంగా మారాయని, పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం విషయంలో భారత్‌ను ఏ దేశమూ వదులుకునే పరిస్థితి లేదని, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగు రక్షణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. -
ఎగుమతుల్లో ఏపీ దూకుడు
-
ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు
సాక్షి, అమరావతి: ఆకాశమే హద్దుగా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూకుడు కనబరుస్తోంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో ఎగుమతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు.. పెద్ద ఎత్తున కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018–19లో రూ.8,929 కోట్లు ఉండగా 2022–23లో ఈ మొత్తం రూ.22,761.99 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగింది. 2021–22లో జరిగిన ఎగుమతుల విలువతో పోలిస్తే 2022–23లో రూ.2,860 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతయ్యాయి. ఇక జాతీయ స్థాయిలో 2022–23లో రూ.2.21 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24,826 కోట్ల విలువైన 80.86 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. వాటిలో ఒక్క మన రాష్ట్రం నుంచే రూ.22,762 కోట్ల విలువైన 79.25 లక్షల టన్నుల ఉత్పత్తులు ఉండటం విశేషం. తెలంగాణ నుంచి కేవలం రూ.2,064 కోట్ల విలువైన 1.61 లక్షల టన్నుల ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు తిరగరాస్తోందని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతులను 2022–23లో తొలి అర్ధ సంవత్సరంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎగుమతులు జరగలేదని చెబుతున్నారు. పురుగు మందుల అవశేషాల్లేని వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తే లక్ష్యంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేయనున్నందున 2023–24లో కోటి లక్షల టన్నులకు పైగా ఎగుమతులు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తొలిసారి గోధుమలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతి రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు పెద్ద ఎత్తున ఎగుమతవుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతి రకం బియ్యమే. 2018–19లో రూ.7,324 కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు నాన్ బాస్మతి రైస్ ఎగుమతి అయితే.. 2022–23కు వచ్చేసరికి రూ.18,693 కోట్ల విలువైన 67.32 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. నాన్ బాస్మతి రైస్ తర్వాత మొక్కజొన్న 2018–19లో రూ.130.77 కోట్ల విలువైన 91,626 టన్నులు ఎగుమతి కాగా, 2022–23లో ఏకంగా రూ.1,845.73 కోట్ల విలువైన 7.24 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. కాగా రాష్ట్రం నుంచి తొలిసారి గోధుమలు, ఆయిల్ కేక్స్, పౌల్ట్రీ, పశుదాణా ఉత్పత్తులు ఎగుమతి చేశారు. రూ.829.71 కోట్ల విలువైన 3.23 లక్షల టన్నుల గోధుమలు, రూ.317 కోట్ల విలువైన 1,906.89 టన్నుల పశుదాణా, రూ.17.6 కోట్ల విలువైన 8,371 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులు, రూ.4.68 కోట్ల విలువైన 3,028 టన్నుల ఆయిల్ కేక్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. రాష్ట్రం నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా.. గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు కూడా పంపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత నాలుగు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతోపాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. నాలుగేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతిసారీ రైతులు నష్టపోకుండా మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తున్నాయి. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలే కాదు.. అపరాలు, చిరు ధాన్యాలు, అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా సంస్కరణలు సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ‘గ్యాప్’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79.25 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతయ్యాయని ఎపెడా ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు ‘గ్యాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీ చేయబోతున్నాం. దీంతో 100కుపైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లభిస్తుంది. –గోపాలకృష్ణ ద్వివేది, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్.. తెలంగాణ కొత్త రికార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 17.31% సీఏజీఆర్‌తో పురోగమనం తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్ స్పేస్ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య: సుమారు 50 లక్షలు బెంగళూరు 15 లక్షలు హైదరాబాద్ 7.78 లక్షలు తమిళనాడు 10 లక్షలు పుణె 4 లక్షలు -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్‌లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్‌లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్‌కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఐ డ్రాప్స్‌ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
గోధుమల ఎగుమతుల బ్యాన్: ఫుడ్ ఎమర్జెన్సీ నుంచి ఇండియా ఎలా బైటపడిందో తెలుసా?
దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించింది. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్ సేనల కోసం నాటి ఇంగ్లండ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారు. దేశ విభజనతో ఇండియాలో ఆహారధాన్యాల కొరత తీవ్రం 1947 ఆగస్టులో జరిగిన దేశవిభజనతో భారతదేశంలో తిండిగింజల కొరత తీవ్రమైంది. వరి విపరీతంగా పండే తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్), గోధుమల సాగు విస్తారంగా జరుగుతూ, భారీ దిగుబడులకు పేరుగాంచిన పశ్చిమ పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్ లో అంతర్భాగం కావడం వల్ల భారత్ లో ఆహారధాన్యాల కొరత కనీవినీ రీతిలో పెరిగింది. అంతకు ముందు 1937లో ఇండియా నుంచి బర్మాను విడదీసి బ్రిటిష్ వారు దానికి స్వాతంత్య్రం ఇవ్వడంతో దేశంలో పప్పుధాన్యాల కొరత వచ్చింది. ఈ సమస్య నెమ్మది మీద పరిష్కారమైంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాని పండిత నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దేశంలో ఆహారధాన్యాల సాగును అభివృద్ధిచేసే కన్నా తిండి గింజలను దిగుమతి చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించాయి. మొదటి పదేళ్ల కాలంలో పరిశ్రమల స్థాపనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని 1959లో ఢిల్లీ వచ్చిన అమెరికా వ్యవసాయ నిపుణుల బృందం నెహ్రూ సర్కారుకు సలహా ఇచ్చింది. ఆహారధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినాగాని నెహ్రూ కాలం నుంచి 1970 వరకూ ఇండియాలో తిండి గింజల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగింది. 1964-1969 మధ్యకాలంలో అంటే శాస్త్రి, ఇందిరాగాంధీ పాలనలో అమెరికా నుంచి ఇండియాకు పీఎల్-480 అనే పథకం కింద నాసిరకం గోధుమలు ఉచితంగా, రాయితీ ధరలపై సరఫరా అయ్యేవి. అయితే, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి సి.సుబ్రమణ్యం చొరవతో రూపొందించి, ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు–హరిత విప్లవం పేరుతో తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు ఇచ్చాయి. అధిక దిగుబడినిచ్చే గోధుమ (మెక్సికో రకం), వరి వంగడాలు విస్తారంగా రైతులకు అందుబాటులోకి రావడం దేశంలో తిండిగింజల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో అమెరికా నుంచి ఆహారధాన్యాల సాయానికి భారత్ స్వస్తి పలికింది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రీన్ రివల్యూషన్ పద్ధతులు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో, 1968 రబీ సీజన్ లో దేశంలో అంతకు ముందు అత్యధికంగా పండిన పంట కన్నా 30 శాతం ఎక్కువ ఆహారధాన్యాల దిగుబడి సాధించాం. మధ్యలో అనావృష్టి పరిస్థితులు ఎదురైనా..ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో తిండి గింజలు ఎగుమతి చేసే దేశంగా ఇండియా ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ రికార్డ్.. అమెరికా మార్కెట్లో 44 శాతం వాటా
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా బెరైటీస్ మార్కెట్లో 44 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది. అమెరికా మార్కెట్లో ఒక దేశం గానీ, సంస్థ గానీ ఇంత శాతం వాటాను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం 30 శాతం వాటాను దక్కించుకున్న ఏపీఎండీసీ.. ఈ సంవత్సరం దాన్ని మరో 14 శాతం పెంచుకుని ప్రపంచ మార్కెట్లో సుస్థిర స్థానం సాధించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్న ఏపీఎండీసీ దాన్ని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్‌పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది రూ.1,300 కోట్లకు పెరిగింది. మంగంపేటలో విస్తారంగా బెరైటీస్.. బెరైటీస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలో విస్తారంగా ఉన్నాయి. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్ అత్యంత కీలకం కావడం, అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. భారత్‌లో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 98 శాతం మంగంపేటలోనే ఉన్నాయి. ఇక్కడ 74 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి సుమారు 30 దేశాలకు బెరైటీస్ ఎగుమతి అవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 40 మిలియన్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీశారు. బెరైటీస్‌ను ఎందుకు వాడతారంటే.. బెరైటీస్ ఖనిజాన్ని అనేక ఉత్పత్తులో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెయింట్, ప్లాస్టిక్‌లలో పూరకం, ఇంజన్ కంపార్ట్మెంట్లలో సౌండ్ తగ్గించడానికి, ఆటోమొబైల్ ఉత్పత్తులో నునుపు, తుప్పు నిరోధకత కోసం వినియోగిస్తారు. అలాగే ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఘర్షణ కలిగించే ఉత్పత్తులు, రేడియేషన్ షీల్డింగ్ కాంక్రీటు, గ్లాస్ సిరామిక్, వైద్య ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. -
రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 2.20 లక్షల కోట్లు!
రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి. ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే.. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్‌లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్‌తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా.. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు 2013–14 57,258 3,23,396 2014–15 66,276 3,71,774 2015–16 75,070 4,07,385 2016–17 85,470 4,31,891 2017–18 93,442 4,75,308 2018–19 1,09,219 5,43,033 2019–20 1,28,807 5,82,126 2020–21 1,45,522 6,28,615 2021–22 1,83,569 7,78,121 -
రికార్డు స్థాయిలో కియా ఎగుమతులు - ఏకంగా..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా 2 లక్షల ఎగుమతుల మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 95 దేశాలకు కార్లను ఎగుమతి చేసినట్లు సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్యం, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి భారీ డిమాండ్ నెలకొందని తెలిపింది. ఎగుమతుల్లో సెల్టోస్ కార్లు అత్యధికంగా 1,35,885 యూనిట్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. 2023 మార్చి త్రైమాసికంలో ఎగుమతులు 22% పెరిగినట్లు వివరించింది. -
భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం పటిష్టం
న్యూఢిల్లీ: భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో 17 శాతం పెరిగి 27.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021లో ఈ విలువ 23.7 బిలియన్ డాలర్లని కొరియా– ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కేఓటీఆర్ఏ) పేర్కొంది. భారత్‌కు కొరియా ఎగుమతులు 2022లో 21% పెరిగి 18.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతు లు 10.5% ఎగసి 8.9 బిలియన్ డాలర్లకు చేరాయి. 2023 భారత్–కొరియా ఇండస్ట్రీ భాగస్వామ్య కార్యక్రమంలో దేశంలో కొరియా రిపబ్లి క్ రాయబారి చాంగ్ జియో–బుక్ ఈ విషయాల ను తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగాల్లో ఇరుదేశాలు పరస్ప రం సహకరించుకుంటున్నట్లు వెల్లడించారు. -
భారత్ వైపు చూస్తున్న ప్రపంచం
ముంబై: ప్రపంచం భారత్, భారత పరిశ్రమల వైపు చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎగుమతులను పెంచుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్కెటింగ్ విధానాలు, బ్రాండింగ్ ఉత్పత్తులతో దేశంలోని వ్యవస్థాపక సామర్థ్యాలు భారత్ అసలైన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామయన్నారు. 49వ జెమ్ అండ్ జ్యుయలరీ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘ఈ నెల 24న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మంత్రులతో (ఐస్లాండ్, లీచెస్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) సమావేశం ఉంది. వారు భారత్‌తో వాణిజ్య చర్చలకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు, రష్యా కూడా భారత్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్నాయి. కనుక దేశ పారిశ్రామికవేత్తలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి’’అని మంత్రి సూచించారు. ప్రభుత్వం వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు నిజాయితీగా కృషి చేస్తోందంటూ, పరిశ్రమ నైతిక విధానాలు అనుసరించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం యూఎస్, జీ7 దేశాలతో చర్చించడం ద్వారా ఆంక్షలు లేకుండా చూడాలని ఇదే సమావేశంలో భాగంగా జెమ్, జ్యుయలరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా మంత్రిని కోరారు. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్‌టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
సేవల ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల జోరుతో.. సర్వీసుల రంగం ఆరోగ్యకర వృద్ధితో 2023–24లో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేస్తుందని సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ‘2022–23లో పరిశ్రమ 42 శాతం ఎగసి 322.72 బిలియన్ల విలువైన ఎగుమతులను సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో సర్వీసుల రంగం 350 బిలయన్ డాలర్లుగా ఉంటుంది. యాత్రలు, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. వృద్ధి వేగం కొనసాగనుంది. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు’ అని కౌన్సిల్ తెలిపింది. ప్రోత్సాహకాలు అవసరం.. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల విషయానికొస్తే భారతదేశ సేవా ఎగుమతులు చారిత్రాత్మకంగా ఉత్తర అమెరికా, యూరప్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రోత్సాహకాలు అవసరం. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. ఇది వారికి ధర, డెలివరీ పోటీగా, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవే శించడంలో సహాయపడుతుంది. కాబట్టి వృద్ధికి ప్రోత్సాహకాలు అందించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి’ అని కౌన్సిల్ వివరించింది. -
విదేశాలకు 6.62 లక్షల కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ప్యాసింజర్ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి. వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి. నిస్సాన్ మోటార్ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 27,137, హోండా కార్స్ ఇండియా 22,710, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 25 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. 1986–87 నుంచి కంపెనీ పలు దేశాలకు వాహనాల సరఫరా ప్రారంభించింది. తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్‌కు ఈ కార్లు అడుగుపెట్టాయి. ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు ఇక్కడ తయారైన కార్లు ఎగుమతి అవుతున్నాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు వీటిలో ఉన్నాయి. భారత తయారీ శక్తి సామర్థ్యాలకు ఈ మైలురాయి నిదర్శనమని తెలిపింది. అధిక నాణ్యత, ఉన్నత సాంకేతికత, విశ్వసనీయత, పనితీరుతోపాటు అందుబాటు ధరలో లభించడంతో కంపెనీ తయారీ కార్లు విదేశీ కస్టమర్ల ఆమోదం, ప్రశంసలను పొందాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. భారత్ నుంచి అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న సంస్థగా నిలిచామన్నారు. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
అభివృద్ధికి బాటలు
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్‌కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్‌హెచ్‌ల అనుసంధానానికి భారత్‌మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి. 22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్హెచ్లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి. రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్‌హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్‌హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్‌హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది. బిడ్ల పరిశీలన.. డీపీఆర్ కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు. విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్హెచ్ఏఐ నిర్ణయించాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో భరోసా విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆక్వా అదనపు అవకాశం కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి ♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు ♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్‌హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు ♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్‌హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి 22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 446 కి.మీ మొత్తం దూరం రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం రానున్నవి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌వే ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. -
డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
భారీగా మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. ఇందులో యాపిల్ ఫోన్ల ఎగుమతులే సగం విలువను ఆక్రమించగా, 40 శాతం శామ్సంగ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వివరాలను మొబైల్ తయారీ పరిశ్రమ సంఘం ఐసీఈఏ తెలిపింది. జనవరి నాటికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఫిబ్రవరి చివరికి 9.5 బిలియన్ డాలర్లకు చేరినట్టు అంచనా వేస్తున్నామని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రా నిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశం నుంచి 5.5 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. -
కోవిడ్ సంక్షోభం చూపిన ప్రత్యామ్నాయం.. నారికేళం.. కలిసొచ్చే కాలం..
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి సంక్షోభం ఓ ప్రత్యామ్నాయం చూపుతుంది. తప్పక మేలు చేస్తుంది’ అనేది కొబ్బరి విషయంలో వాస్తవ రూపం దాల్చనుంది. అంది పుచ్చుకోవాలే కానీ ‘కల్పవృక్షం’ విశ్వవ్యాప్తంగా మెరుగైన అవకాశాలను చూపుతుందని.. కొబ్బరికి కలిసొచ్చే కాలం మున్ముందు అపారంగా ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కొబ్బరి రైతులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూరుతాయని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోకోనట్ ప్రొడక్ట్స్, ట్రేడ్ అండ్ మార్కెటింగ్’ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు ఉద్ఘాటించారు. ప్రతికూలతలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయ్ రూగోస్ వైట్ ఫ్లై (తెల్లదోమ) వల్ల కొబ్బరి దిగుబడి తగ్గి ఆశించిన ధర దక్కడం లేదు. మరోవైపు క్వాయర్ ఉత్పత్తుల ధరలు నేలచూపు చూస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాలతో పోల్చుకుంటే అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్, దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఏపీ వెనుకబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి కొబ్బరి కాయ, కురిడీ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతులు, వ్యాపారుల ఆలోచనా ధోరణిలో మార్పులొస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల వినియోగం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నందున కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు నోచుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 3 కోట్ల మందికి కొబ్బరి దింపు, సేకరణ, ఎగుమతి, దిగుమతులు జీవనాధారంగా ఉండగా.. వారిలో రైతులు 1.20 కోట్ల మంది ఉన్నారు. డిమాండ్‌ను ఒడిసి పడితే.. అంతర్జాతీయంగా కొబ్బరి కాయ, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్లతో తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చిప్స్, కోకోనట్ వాటర్ ప్యాకెట్లు, నాటాడీకో వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త డిమాండ్ ఉంది. కొబ్బరిని ఆరోగ్యానికి ఔషధంగా గుర్తించారు. కొబ్బరి పాలలో ఉండే ల్యారిక్ యాసిడ్ చిన్న పిల్లలకు చాలా ఉపయోగకరం. పశువులకు సంక్రమిస్తున్న విభిన్న వ్యాధులు, వైరస్ల వల్ల వాటి నుంచి వచ్చే పాల వాడకంపై అభివృద్ధి చెందుతున్న దేశాలు విముఖత చూపుతున్నాయి. ఈ మార్కెట్‌ను కొబ్బరి పాలతో భర్తీ చేసేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కొబ్బరి పాల నుంచి తయారు చేసే వర్జిన్ కోకోనట్ ఆయిల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని సేవించడం వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాలు ఉత్సాహంగా ఉంటాయి. ఎయిడ్స్ రోగులకు ఇది ఇమ్యూనిటీ బూస్టర్ వంటిదని, ఆరోగ్యానికి దివ్య ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో యూరప్ దేశాలకు కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. అవకాశాలు అనేకం భారీ పరిశ్రమలు మొదలు ఫుడ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటే కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అనేకం ఉన్నాయి. డిమాండ్ పెరుగుతున్నందున ఔత్సాహికులు ఉప ఉత్పత్తులపై, కుటీర పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాల్సి ఉంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉత్పత్తులతో పాటు పీచు, పెంకు, కలప వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఎండు కొబ్బరి (కోప్రా), కొబ్బరి నూనె, వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, కొబ్బరి పాలు/క్రీమ్, కొబ్బరి పాలతో పొడి, వెనిగర్, చిప్స్, కొబ్బరి నీటితో పాటు పలు రకాల పానీయాలు ఉత్పత్తి చేయవచ్చు. ఔత్సాహికులు ఇప్పటికే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో యువ పారిశ్రామికవేత్త గుత్తుల ధర్మరాజు వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మరో యువ పారిశ్రామికవేత్త వికాస్ సైతం వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్ పేరిట ఇవే ఉత్పత్తులను జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు. వీరిని చూసి మరికొంతమంది ముందుకు వస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.3.50 కోట్లతో వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చార్కోల్ (చిప్ప బొగ్గు) తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇటువంటివి మరిన్ని ఏర్పాటు చేసేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వంటి సంస్థలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి మార్కెట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను బేబీ మసాజ్ ఆయిల్గా పశ్చిమ బెంగాల్, చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతున్నారు. మా కంపెనీ నుంచి ఆయిల్ కూడా ఇక్కడకు వెళ్తోంది. అక్కడి ఫార్మా కంపెనీలు సైతం వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను సిఫారసు చేస్తున్నాయి. మన ప్రాంతంలో జాన్సన్ అండ్ జాన్సన్ వాడుతున్నారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి వాడకం పెరుగుతోంది. మన దేశం కన్నా ఇతర దేశాల్లో అధికంగా కొబ్బరి ఉత్పత్తులను వాడుతున్నారు. ఆరోగ్యం పట్ల నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారు. – గుత్తుల ధర్మరాజు, కోనసీమ ఆగ్రోస్ కంపెనీ యజమాని, ముమ్మిడివరం -
ఆభరణాల ఎగుమతుల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో రూ.28,833 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధి అని జెమ్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. చైనా, మధ్యప్రాచ్య మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో కట్, పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 32 శాతం ఎగసి రూ.19,582 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాలు 30 శాతం అధికమై రూ.5,829 కోట్లకు చేరుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తరువాత యూఏఈకి బంగారు ఆభరణాల ఎగుమతులు 45 శాతం దూసుకెళ్లాయి. స్వల్ప క్షీణత తరువాత తిరిగి మధ్యప్య్రాచ్య మార్కెట్ పుంజుకుంటోందని అనడానికి ఇదే నిదర్శనం’ అని వివరించింది. కలిసి వస్తున్న చైనా మార్కెట్.. : ‘ప్రధానంగా యూఎస్‌కు ఎగుమతయ్యే రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాల విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 20 శాతం అధికం అయ్యాయి. కొన్ని నెలలుగా తిరోగమన వృద్ధి నమోదు చేసిన హాంగ్‌కాంగ్ ఇప్పుడు తిరిగి గాడిలో పడింది. చైనా మారెŠక్ట్ పుంజుకోవడం గొప్ప మెరుగుదలకు దారితీయవచ్చు. చైనాలో సగటు పొదుపు రేటు దాదాపు 40 శాతంగా ఉంది. పొదుపు విలువ లక్షల కోట్ల రూపాయలకు సమానం. సుదీర్ఘ లాక్డౌన్ వ్యవధి తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలో చూసిన విధంగా ’ప్రతీకార కొనుగోలు’కు అవకాశం ఉంది. ఫలితంగా వజ్రాలు, వజ్రాభరణాల పరిశ్రమలో వచ్చే ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నాం’ అని కౌన్సిల్ అభిప్రాయపడింది. -
AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: దేశీయ బొమ్మల పరిశ్రమ దశ తిరిగింది. ఈ రంగం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం చిన్నపిల్లల ఆట వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో బొమ్మల ఎగుమతులు ఆరు రెట్లకు పైగా పెరిగాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొమ్మల ఎగుమతులు రూ.167 కోట్లుగా ఉంటే అది 2021–22 నాటికి రూ.2,601 కోట్లకు చేరుకుంది. కానీ, దేశీయ ఎగుమతులు భారీగా పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో ఇది ఒక శాతంలోపే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ బొమ్మల ఎగుమతుల మార్కెట్ విలువ రూ.12,64,000 కోట్లుగా ఉంది. భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక దేశీయ బొమ్మల ఎగుమతుల్లో 77 శాతం అమెరికాకే జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో బొమ్మల దిగుమతులు భారీగా పడిపోయాయి. 2018–19లో భారత్ రూ.2,960 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకుంటే అది 2021–22 నాటికి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమయ్యింది. ఇందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’తో సత్ఫలితాలు మరోవైపు..స్థానిక ఆట బొమ్మలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ విధానం సత్ఫలితాలిస్తోంది. దేశీయ ఆట బొమ్మల మార్కెట్‌ను ఎటువంటి ప్రమాణాల్లేని చైనా వస్తువులు ఆక్రమించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్థానిక చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు ప్రచారం కల్పిస్తూనే మరోపక్క దిగుమతులకు అడ్డుకట్ట పడే విధంగా వివిధ ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఆటబొమ్మల దిగుమతులపై సుంకాన్ని 2020లో 20 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పెంచింది. అంతేకాక.. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు దిగుమతి అయ్యే బొమ్మలపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో బొమ్మలు తయారుచేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించడానికి రూ.55.65 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. రూ.3,500 కోట్లతో మరో పథకం అదే విధంగా.. ఇతర దేశాలతో పోటీపడేలా బొమ్మల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి రూ.3,500 కోట్లతో ఉత్పత్తి ఆధారిత, ప్రోత్సాహక ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. ఈ చర్యలు రాష్ట్రంలోని బొమ్మల తయారీ కళాకారులకు చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ కింద చేర్చి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2021–22లో రాష్ట్రం నుంచి రూ.3.66 కోట్ల విలువైన బొమ్మలు ఎగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
రెండోనెలా ఎగుమతులు కిందికే... జనవరిలో 7 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 6.58 శాతం తగ్గి, 32.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి నేపథ్యం. గడచిన 10 నెలలుగా ఇంజనీరింగ్ గూడ్స్, ముడి ఇనుము, ప్లాస్టిక్, రత్నాలు–ఆభరణాల రంగాలు క్షీణ రేటులో ఉన్నాయి. 10 నెలల్లో... ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 21.89 శాతం పెరిగి 602.20 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 233 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లుపైబడగా, 2022–23లో కూడా దాదాపు ఇదే గణాంకాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా సమీక్షా కాలం 10 నెలల్లో క్రూడ్ దిగుమతుల విలువ 53.54 శాతం పెరిగి 178.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులూ క్షీణతే.. దిగుమతులు కూడా జనవరిలో 3.63 శాతం క్షీణించాయి. విలువలో 50.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు ఏప్రిల్–జనవరి మధ్య 11.26% తగ్గి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 12 నెలల కనిష్టం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 12 నెలల కనిష్టంగా 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రష్యా నుంచి 384 శాతం పెరిగిన దిగుమతులు 2022–23 ఏప్రిల్–జనవరి మధ్య రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏకంగా 384 శాతం పెరగడం గమనార్హం. విలువలో ఏకంగా 37.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రూడ్ ఈ విలువలో కీలక వెయిటేజ్ పొందింది. 2021–22లో 9.86 బిలియన్ డాలర్ల దిగుమతులతో రష్యా భారత్‌కు 18వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. తాజా సమీక్షా నెల్లో ఈ అంకె 4కు తగ్గిపోయింది. ఆర్థిక మంత్రి సూచనలు.. అంతర్జాతీయంగా మందగమనం వచ్చే అవకాశాలను, తమ తమ వ్యాపారాలపై దాని ప్రభావాల గురించి ఎగుమతిదారులు ముందస్తుగానే అంచనాలు వేసుకుని సన్నద్ధంగా ఉండాలని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొన్నారు. రూపాయిలో వాణిజ్యానికి ఆసక్తి భారత్‌తో రూపాయిలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు పలు దేశాల్లో ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు వీలుగా పలు బ్యాంకులు ప్రత్యేక వ్యాస్టో అకౌంట్లను ప్రారంభిస్తున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అకౌంట్లు ప్రారంభించిన జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యుకో బ్యాంక్‌సహా 20 బ్యాంకులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రష్యాసహా రూపాయిలో ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్లు కూడా వీటిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలు, దీనితో డాలర్ మారకంలో వాణిజ్యంలో ఇబ్బందులు వంటి పరిణామాలు రూపాయిలో వాణిజ్యానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ టు యూఎస్
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకే జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి ఎగుమతులు జరుగుతున్న టాప్ 10 దేశాల్లో అమెరికా, చైనా, సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఇటీవలే భూకంపం సంభవించి అల్లాడిపోతున్న తుర్కియే కూడా ఉండడం గమనార్హం. అయితే మొత్తం ఎగుమతుల్లో 28.13 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళుతున్నాయని తాజా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడయింది. అన్నింటికంటే ఎక్కువగా ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఫార్మా రంగం వాటా 33.9 శాతం కాగా, ఆ తర్వాతి స్థానంలో ఆర్గానిక్ కెమికల్స్ (23.41 శాతం) ఉన్నాయి. ఇక, వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతుల జాబితాలో చోటు సాధించింది. మొత్తం ఎగుమతుల్లో పత్తి 3.72, కాఫీ, టీ ఉత్పత్తులు 2.36, ధాన్యాలు 1.81 శాతం ఉన్నాయి. ఇక ఒకప్పుడు ముత్యాల నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధిగాంచగా, ముత్యాలు, ఇతర విలువైన వస్తువులు కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో ముత్యాల ఎగుమతి 2.07 శాతంగా నమోదయింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 ఎక్స్‌పోర్ట్స్ ఇండెక్స్‌లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల ప్రోత్సాహక విధానాల రూపకల్పనలో మాత్రం 12వ స్థానంలో నిలిచింది. జీఎస్డీపీలో 7 శాతంగా సరుకుల ఎగుమతుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.2,65,510 కోట్ల విలువైన ఎగుమతులు రాష్ట్రం నుంచి జరిగాయి. ఇందులో సర్వీసెస్ రంగం నుంచి అత్యధికంగా 69.13 శాతం ఎగుమతి కాగా, సరుకుల ఎగుమతులు 30.87 శాతం మాత్రమే. కానీ ఒక్క సరుకుల ఎగుమతుల విలువ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 7.10 శాతంగా నమోదు కావడం గమనార్హం. సరుకుల ఎగుమతుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం సరుకుల ఎగుమతుల్లో 85 శాతం వరకు కేవలం 5 జిల్లాల నుంచే జరుగుతున్నాయి. -
Andhra Pradesh కోవిడ్‌లో దున్నేసింది!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని అధిగ మించి మరీ వ్యవపాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా 2019–20తో పోల్చితే 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా 20.75 శాతం మేర వృద్ధి నమోదైనట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఏపీ నుంచి 2020–21లో భారీగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కోవిడ్ విసిరిన సవాళ్ల మధ్య కూడా 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదు కావటాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2019–20లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.2.53 లక్షల కోట్లు ఉండగా కోవిడ్ మహమ్మారిని అధిగమించి 2020–21లో రూ.3.05 లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. పది దేశాలకే అత్యధికం భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ ఆరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా అది పెద్ద మార్కెట్‌గా నిలిచాయని, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ దేశాలదే 52.2 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020–21లో దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల వాటా 21.4 శాతంగా ఉంది. తరువాత సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, సుగంధ ద్రవ్యాలు 9.7 శాతం, గేదె మాంసం 7.7 శాతం, చక్కెర 6.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ ఐదు ఎగుమతుల వాటా 60.10 శాతంగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది. తొలిసారిగా రాష్ట్రానికి 4వ స్థానం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం 2020–21లో రూ.23,505.2 కోట్ల విలువైన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. అయితే గత సర్కారు హయాంలో ఏ ఒక్క ఆర్థిక ఏడాదిలోనూ రూ.9,000 కోట్ల మేర కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగలేదు. టీడీపీ హయాంలో 2028–19లో ఏపీ నుంచి రూ.8,929.5 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏడు రాష్ట్రాల వాటా 88 శాతం ఉన్నట్లు తెలిపింది. -
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు : రూ.1.6 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది. -
కడియం మొక్కల ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, అమరావతి: అందమైన పూల, అలంకరణ పూల మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ ఇప్పుడు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎగుమతి విధానాలు, ధ్రువపత్రాలు, నాణ్యతపై నర్సరీ రైతులకు అవగాహన కల్పించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశాలకు అవరమైన మొక్కలను పెంచి, ఎగుమతులు పెంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగతుందని తెలిపారు. నర్సరీకి అవసరమైన గాలిలో తేమ, ఉష్ణోగ్రతలు, సారవంతమైన భూమి ఉన్న కడియం చుట్టుపక్కల సుమారు 15 కి.మీ పరిధిలో 7,000 ఎకరాల్లో నరర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఏటా డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కడియం చుట్టుపక్కల సుమారు 2,300 నర్సరీలు ఉండగా, వీటిలో 15 సంస్థలు మాత్రమే ఎగుమతులకు లైసెన్సులు కలిగి ఉన్నాయి. 1,600 నర్సరీలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దీనివల్ల ఎగుమతులు పెరగడంలేదని అధికారులు భావిస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్న కడియం నర్సరీ రైతులు సరైన అవగాహన లేక అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి రూ.229 కోట్ల విలువైన మొక్కలు ఎగుమతి అవుతుండగా, ఎంతో పేరెన్నికగన్న కడియం నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కడియం నుంచి ఏడు దేశాలకు ఏటా రూ.5.5 కోట్ల విలువైన మొక్కలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. వచ్చే మూడేళ్లలో.. అంటే 2024–25కి ఈ మొత్తాన్ని రూ.7.4 కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం తూర్పు గోదావరి జిల్లా ఎగుమతుల కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం స్వాట్ అనాలసిస్ (స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, త్రెట్) చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి బాగా అవకాశాలున్న ఒమన్, కువైట్, బెహ్రయిన్, మాల్దీవులు, ఖతార్, టర్కీ, యూఏఈకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. అక్కడి మార్కెటింగ్‌కు అనుగుణంగా ఇక్కడి రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇదీ ప్రణాళిక అసంఘటిత రంగంలో ఉన్న నర్సరీలన్నింటినీ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఒక తాటిపైకి తెస్తారు. ఇతర దేశాల మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎగుమతి లైసెన్సులు ఉన్న వారిలోనూ చాలా మంది నాణ్యత సర్టిఫికేషన్స్ వంటి వాటిపై అవగాహన లేకపోవడంతో అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదు. వీరందరికీ జిల్లా ఎక్స్‌పోర్ట్స్ హబ్ ద్వారా శిక్షణ ఇస్తామని అధికారులు వెల్లడించారు. ► తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాల ప్రయోజనాలను వివరిస్తారు. ► 2022–27 రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక విధానం కింద పలు ప్రోత్సాహకాలను ఇస్తారు. విదేశీ ప్రదర్శనల్లో పాల్గొనే వారికి 30 శాతం అద్దె రాయితీ, ఎగుమతుల్లో కీలకమైన జెడ్ఈడీ సర్టిఫికెట్ పొందడంలో 10 శాతం రాయితీతో పాటు ఎగుమతి నాణ్యతకు సంబంధించిన ధృవపత్రాలు పొందడానికి అయ్యే వ్యయాల్లో 50 శాతం రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు. ► దేశీయంగా రియల్టర్లు, ల్యాండ్ స్కేపర్స్, ఆర్కిటెక్చర్స్‌కు అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు, మొక్కల సరఫరాపై అవగాహన కల్పిస్తారు. ► ఇండోర్, ఔట్‌డోర్ గార్డెన్స్‌లో చూపు తిప్పుకోలేని విధంగా వివిధ ఆకృతుల్లో మొక్కలను పెంచేలా నర్సరీ రైతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ హబ్స్‌లోప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్లో వృద్ధిలేకపోగా..
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022 డిసెంబర్లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి. ► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల పరిస్థితి ఇలా... ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్ భరత్వాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్–డిసెంబర్ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్–డిసెంబర్ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు నిలిచాయి. -
మేడిన్ ఆంధ్రా బ్రాండింగ్..ఎగుమతుల్లో జోష్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ఎగుమతులను పెంచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్ ఆంధ్రా బ్రాండ్‌కు ప్రచారం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను గుర్తించి, ఆ దేశాల్లో మరింతగా విస్తరించడానికి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పాటించాలన్నదానిపై ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తుండటంతో గత మూడేళ్లలో రాష్ట్ర ఎగుమతులు 50 శాతం మేర వృద్ధి చెందాయి. తొలిసారి 2019–20లో రూ.లక్ష కోట్లు దాటిన రాష్ట్ర ఎగుమతులు.. మూడేళ్లు గడిచేసరికి రూ.లక్షన్నర కోట్ల మార్కును అందుకుంటున్నాయి. 2019–20లో రూ.1,04,829 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 2020–21లో రూ.1,24,744, 2021–22లో రూ.1,43,843 కోట్లుగా నమోదయయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి రాష్ట్రం నుంచి రూ.93,938 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా, మార్చి నాటికి ఈ విలువ లక్షన్నర కోట్లకు అధిగమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో కీలకమైన క్వాలిటీ సర్టిఫికెట్‌పై అవగాహన కల్పిస్తుండటంతో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2020–21లో కూరగాయలు, పండ్లు ఎగుమతుల విలువ రూ.12,160.24 కోట్లుగా ఉంటే.. ప్రభుత్వ చర్యలతో ఆ తర్వాత రూ.14,060.14 కోట్లకు చేరింది. అలాగే ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.8,286.21 కోట్ల నుంచి రూ.12,777.56 కోట్లకు పెరిగింది. జిల్లాల వారీగా ఉత్పత్తుల ఎంపిక రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2021లో వాణిజ్య ఉత్సవ్ సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 26 జిల్లాలకు విడివిడిగా ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసి, ఎగుమతులను పెంచే విధంగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి, వాటిని మరింతగా ఎగుమతి చేసే విధంగా వివిధ దేశాల్లోని కొనుగోలుదారులతో చర్చలు జరపడం ద్వారా మార్కెట్‌ను విస్తృత పరుస్తోంది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు, జీడిపప్పు, నర్సరీ ఉత్పత్తుల ఎగుమతిలో ముందంజలో ఉంది. ఈ జిల్లా నుంచి దిగుమతి చేసుకునే దేశాలను గుర్తించి, అక్కడ మార్కెట్ అవకాశాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈ, ఇజ్రాయిల్, కువైట్, వియత్నాం రాయబారులతో నేరుగా చర్చలు జరిపి ఎగుమతి అవకాశాలను ప్రోత్సహించడం సత్ఫలితాలు ఇచ్చింది. 2020–21లో వియాత్నంకు రూ.2,262.58 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ ఈ చర్చల తర్వాత 2021–22లో రూ.3,833.08 కోట్లకు చేరింది. యూఏఈకి ఎగుమతులు రూ.2,941.04 కోట్ల నుంచి రూ.5,099.24 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఉత్పత్తులను గుర్తించి వాటికి జీయోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) గుర్తింపు తీసుకువచ్చి, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం గతంలో మూత పడిన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(ఏపీటీపీసీ)ను పునరుద్ధరించి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను అప్పగించింది. రూ.30,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖలో మేజర్ పోర్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 5 మైనర్ పోర్టులు.. గంగవరం, కాకినాడ యాంకర్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో కాకినాడ గేట్‌వే పోర్టు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ద్వారా రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న 5 మైనర్ పోర్టుల ద్వారా సగటున 100 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తుండగా, కొత్తగా నాలుగు పోర్టులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పోర్టుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రామాయపట్నం పోర్టును డిసెంబర్ 2023 నాటికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద రావడమే కాకుండా, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అదనంగా రూ.1,000 కోట్లు వచ్చి చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. ఇదిలా ఉండగా కాకినాడ యాంకర్ పోర్టు నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. 10 శాతం వాటా లక్ష్యం రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో నాలుగు శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ఉండే విధంగా నాలుగు కొత్త పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇదే సమయంలో పోర్టులను అనుసంధానిస్తూ మౌలిక వసతులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఎగుమతుల వృద్ధి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనుంది. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి విదేశీ మార్కెట్ విస్తరణపై దృష్టి ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను ఆయా దేశాలు ఇంకా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.. పక్క దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకావాలున్నాయా.. అన్న అంశాలను పరిశీలించి డేటాను క్రోడీకరిస్తున్నాం. ఇతర దేశాలతో పోటీపడుతూ ఆ దేశాల మార్కెట్‌కు విస్తరించడానికి ఎటువంటి మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలి.. ఇందుకోసం ఎటువంటి పథకాలను అమలు చేయాలన్న అంశాలను పరిశీలించి జిల్లాలు, ఉత్పత్తి ఆధారంగా కార్యచరణ ప్రణాళికను తయారు చేస్తున్నాం. విదేశాలతో పోటీ పడటానికి క్వాలిటీ సర్టిఫికేషన్‌పై ఎగుమతిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే తూర్పుగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ కార్యచరణ ప్రణాళిక పూర్తయ్యింది. త్వరలో మిగిలిన జిల్లాలకు సంబంధించి పూర్తి చేయనున్నాం. – జి.సృజన, డైరెక్టర్, పరిశ్రమల శాఖ ఈ కామర్స్ సంస్థలపై దృష్టి ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను గుర్తించి, 2025 నాటికి ఎగుమతి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. జిల్లా పారిశ్రామిక అధికారులు, ఏపీటీపీసీ అధికారులను సమన్వయం చేస్తూ రాష్ట్రంలోని ఎగుమతిదారులను గుర్తించి వారిని ట్రేడ్ పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఆన్లైన్ దిగ్గజ ఈకామర్స్ సంస్థలను గుర్తించి, వారి ఉత్పత్తులను ఇక్కడ నుంచి సరఫరా చేసే విధంగా లాజిస్టిక్ సప్లై చైన్స్ ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నాం. – జీఎస్ రావు, జాయింట్ డైరెక్టర్ (ఎక్స్‌పోర్ట్స్) 20 నుంచి 9వ ర్యాంకుకు వృద్ధి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎగుమతుల వాణిజ్య పరిమాణం పెరగడమే కాకుండా, ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లోనూ బాగా మెరుగుపడింది. నీతి ఆయోగ్ ఏటా ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020 సంవత్సరానికి నీతి ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020లో రాష్ట్రం 20వ స్థానంలో ఉండగా, 2021లో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రభుత్వ కృషి వల్ల ఎగుమతుల సన్నద్ధత సూచీలో ఏటా ఏపీ ర్యాంకు మెరుగు పడుతోందని నిపుణులు చెబుతున్నారు. -
షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ కొత్త వేరియంట్ల తయారీ కేంద్రంగా చైనా!
బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్‌కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం! -
5.62 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీ వరకూ 5.62 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య వేదిక– ఏఐఎస్‌టీఏ (ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్) మంగళవారం తెలిపింది. ప్రస్తుత (2022–23) మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి నవంబర్‌లో ప్రభుత్వం అనుమతించింది. ఏఐఎస్‌టీఏ లెక్కల ప్రకారం, చక్కెర మిల్లుల నుండి ఎగుమతుల కోసం పంపిన పరిమాణం 12.19 లక్షల టన్నులు. దీనిలో భౌతిక రవాణా ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం డిసెంబర్ 9 వరకు 5.62 లక్షల టన్నులు. యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)కి గరిష్టంగా చక్కెర ఎగుమతయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండోనేషియా, సోమాలియా, ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి. దాదాపు 5.22 లక్షల టన్నుల చక్కెర లోడింగ్ లేదా లోడింగ్ కోసం సిద్ధంగా ఉంది. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. -
ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాబోయే 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యుత్ సుంకం మాఫీ, సులభతర రుణ లభ్యత వంటి సహాయక చర్యలను ప్రకటించాలని ఎగుమతిదారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (ఆర్ఓడీటీఈపీ) పథకం రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల పెంపు లక్ష్యంగా ఇతర కార్యక్రమాల కోసం కూడా తగిన నిధులను వాణిజ్య మంత్రిత్వశాఖకు ఆర్థికశాఖ అందజేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఆర్ఓడీటీఈపీ కింద వివిధ కేంద్ర– రాష్ట్ర సుంకాలు, ఇన్పుట్ ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి ఆయా ఎగుమతిదారులకు చెల్లించడం జరుగుతుంది. ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి కస్టమ్స్ సుంకాలలో కొన్ని మార్పులు, తగిన వడ్డీరేటులో రుణ లభ్యత అవసరమని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. భారత్ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. 2022–23లో 450 బిలియన్ డాలర్ల లక్ష్యం. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్ష్య సాధనపై సందేహాలు నెలకొన్నాయి. ఎకానమీలో కీలకపాత్ర... దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎగుమతులు కీలకమైన చోదకమని, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించాలని ముంబైకి చెందిన ఎగుమతిదారు, ది బాంబే టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ కె సరాఫ్ పేర్కొన్నారు. ‘‘తమ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్న యూనిట్లకు విద్యుత్ సుంకాన్ని మినహాయించే విధానాన్ని బడ్జెట్ అందించాలి. ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేసే తయారీదారు ఎగుమతిదారులకు 2 శాతానికి సమానమైన పరిహారాన్ని మంజూరు చేయాలి. ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందుల భర్తీకి ఇది దోహదపడుతుంది. ఈ పరిహారాన్ని ప్రోత్సాహకంగా పరిగణించకూడదు’’ అని సరాఫ్ సూచించారు. ఎగుమతుల రంగం అధిక నాణ్యతతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యత స్పృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ రంగం ప్రోత్సహిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘భారత్ వస్తు, సేవల ఎగుమతులు 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 21.5 శాతంగా ఉన్నాయి. ఆసియాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నమోదవుతున్న 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతుల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్యాంకింగ్, షిప్పింగ్, బీమా, టూరిజం వంటి అనేక రంగాల నుంచి సేవల పరమైన ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం’’ అని కూడా ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. కాగా, లూథియానాకు చెందిన హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్సి రాల్హాన్ మాట్లాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సెక్టార్–నిర్దిష్ట క్లస్టర్లు లేదా పార్కులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులను అందించాలని కోరారు. ఇది తయారీదారుల పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని అన్నారు. ఆఫ్రికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎగ్జిబిషన్లు, ఫెయిర్లను నిర్వహించడానికి కూడా నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పిస్తారని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
అవసరంలేని దిగుమతులను గమనిస్తున్నాం
న్యూఢిల్లీ: అవసరం లేని దిగుమతులను గమనిస్తున్నామని, ఆయా ఉత్పత్తుల దేశీ తయారీ పెంచడం తమ ప్రాధాన్యతని కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్ తెలిపారు. ఈ తరహా దిగుమతులను నివారించగలిగితే, వాణిజ్య లోటు దిగొస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వాణిజ్య లోటు 198 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం తెలిసిందే. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 115 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఎన్నో సవాళ్లు నెలకొన్నా భారత్ నుంచి ఎగుమతులు బలంగా ఉన్నట్టు మీడియాతో చెప్పారు. గతేడాది అసాధారణ స్థాయిలో ఎగుమతులు పెరగడంతో, ఆ బేస్ ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వృద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని శాఖలకు నెలవారీగా దిగుమతులు పెరుగుతున్న సమాచారాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. స్థానికంగా తయారీని పెంచాలన్నదే ఇందులో వ్యూహంగా పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం మన దేశ ఎగుమతులపై ప్రభావం పడింది. కానీ, దేశీ వినియోగ డిమాండ్ బలంగా ఉండడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. దీంతో వాణిజ్య లోటు విషయంలో ఒత్తిడి నెలకొంది’’అని వివరించారు. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
దుస్తుల ఎగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతులు దేశం నుంచి నవంబరులో 11.7 శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ఎగుమతులు తిరోగమనం చెందాయని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. ‘యూకే, ఈయూ, యూఎస్ వంటి సంప్రదాయ మార్కెట్లు మాంద్యం, ఎదురుగాలులు చవిచూస్తున్నందున దేశం నుంచి రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం, ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులపై భారం పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఎగుమతులు సానుకూలంగా మారాయి. ప్రబలంగా ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమకు ఉన్న స్థితిస్థాపకతను ఇది సూచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ఎగుమతి లక్ష్యం రూ.1.45 లక్షల కోట్లు. ఏప్రిల్–నవంబరులో రూ.82,740 కోట్లకుపైగా ఎగుమతులు నమోదయ్యాయి’ అని కౌన్సిల్ వివరించింది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
నవంబర్‌లో ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఎగుమతు లు నవంబర్ నెలకు ఎలాంటి వృద్ధి లేకుండా 31.99 బిలియన్ డాలర్లు (రూ.2.62 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2021 నవంబర్ నెలలోనూ ఎగుమతులు 31.8 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక నవంబర్ నెలకు దిగుమతులు 55.88 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 53.93 బిలియన్ డాలర్లతో పోలిస్తే 4 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ ఎగుమతులు 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే ఎగుమతులు 295.26 బిలయన్ డాలర్లుగా, దిగుమతులు 493.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి వరుసగా 256.77 బిలియన్ డాలర్లు, 381.17 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. -
విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), గంగవరం పోర్టు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం.. సరుకు రవాణా రంగంలో సత్ఫలితాలిస్తున్నాయి. వీపీఏలో 32 బెర్త్‌లు, గంగవరంలో 9 బెర్త్‌లున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతుంటాయి. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రపంచ పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఎగుమతులకు సిద్ధం చేస్తున్న సముద్ర ఉత్పత్తులు ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే.. దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్‌టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి. విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ–సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్‌ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈపీసీజీతో ఎగుమతి సంస్థలకు వెసులుబాటు దేశ విదేశాల ఎగుమతులకు విశాఖపట్నం స్వర్గధామంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకం ద్వారా ఐజీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. షిప్పింగ్ బిల్స్ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకోవడం విషయంలోనూ వైజాగ్ కస్టమ్స్ ముందుంటుంది. ప్రతినెలా రూ.60 కోట్ల వరకు ఎగుమతిదారులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఐజీఎస్టీ రిఫండ్ ప్రతినెలా రూ.45 కోట్లు జరుగుతోంది. ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఎగుమతులను మరింత సులభతరం చేశాం. ఈ కారణంగా ఎగుమతుల విషయంలో వైజాగ్ దూసుకుపోతోంది. – డా. జేన్ జేసుదాస్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ -
బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్ నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే చర్య ఇది. దేశీయంగా లభ్యత పెంపు లక్ష్యంగా సెప్టెంబర్ తొలి రోజుల్లో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. రిటైల్ మార్కెట్లలో ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని కూడా విధించింది. ఆర్గానిక్ నాన్-బాస్మతీ రైస్, ఆర్గానిక్ నాన్-బాస్మతీ బ్రోకెన్ రైస్ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బియ్యం ఎగుమతుల విలువ 5.5 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 9.7 బిలియన్ డాలర్లు. సరైన చర్య... ‘‘భారత్ ఏటా 10,000-15000 టన్నుల సేంద్రీయ బియ్యాన్ని (బాస్మతి, బాస్మతీయేతర) ఎగుమతి చేస్తుంది. గత 4–5 ఏళ్లలో ఆర్గానిక్ బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయి. నిషేధం ఎత్తివేస్తూ, ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది’’ అని ప్రభుత్వ ప్రకటనపై ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్ సెటియా వ్యాఖ్యానించారు. -
ఎగుమతుల్లో పైపైకి..
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. తొలి రెండేళ్లు కరోనా మహమ్మారికి ఎదురొడ్డి మరీ ఎగుమతులు సాగాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఊపందుకున్నాయి. ఉదా.. 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13,855 కోట్ల విలువైన 2.62 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2021–22 నాటికి అవి రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.20వేల కోట్ల విలువైన 3.24 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. ఇక ఈ ఏడాది (2022–23) తొలి అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13వేల కోట్ల విలువైన 2.15 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆహార, ఆక్వా ఉత్పత్తులు కలిపి టీడీపీ ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22,784 కోట్ల విలువైన 34.10లక్షల టన్నులు ఎగుమతి అయితే 2021–22లో ఏకంగా రూ.39,921 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. టీడీపీ హయాంలో జరిగిన గరిష్ట ఎగుమతులను ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే సీఎం వైఎస్ జగన్ సర్కార్ అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున ఎగుమతులు జరగలేదని అధికారులతో పాటు ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది కోటి లక్షల టన్నుల మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో నాన్ బాస్మతీ రైస్‌దే సింహభాగం రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతీ రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, గోధుమలు, శుద్ధిచేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలతో పాటు పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. నాన్ బాస్మతీ రైస్ ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ నిలిచింది. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతీ రైస్‌దే. 2018–19లో రూ.7,324కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు ఎగుమతి అయితే.. 2021–22లో రూ.17,225 కోట్ల విలువైన 68.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,718 కోట్ల విలువైన 29.48 లక్షల టన్నుల నాన్ బాస్మతీ రైస్ ఎగుమతి అయ్యింది. ఏపీ నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా, గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. మూడేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. ► మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10 వేలకు పైగా పలికింది. ► రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలుకుతోంది. ► అలాగే, రూ.5 వేలు పలకని మినుములు రూ.7వేలు, వేరుశనగ సైతం రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నాయి. ► కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతున్నాయి. ► అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. ► ఇక దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ శాతం కూడా గణనీయంగా తగ్గడం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు. 14వేల టన్నులు ఎగుమతి చేశాం 2021–22లో ఏపీ నుంచి 50 వేల నుంచి 60 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగాయి. మా కంపెనీ ఒక్కటే 14 వేల టన్నులు ఎగుమతి చేసింది. ఇరాన్, మలేసియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేశాం. ఈ ఏడాది కూడా ఎగుమతులు ఆశాజనకంగా ఉండబోతున్నాయి. – ఎం. ప్రభాకరరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్, దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపెనీ ఎగుమతులు పెరగడం రైతుకు లాభదాయకం గతేడాది రికార్డు స్థాయిలో ఆక్వా ఎగుమతులు జరిగాయి. రైతులకు కూడా మంచి రేటు వచ్చింది. రొయ్యలతో పాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా వ్యాపారులు పోటీపడి కొన్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అయ్యాయి. – ఐసీఆర్ మోహన్‌రాజ్, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ‘గాప్’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులతో పాటు 20వేల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. వచ్చే సీజన్ నుంచి రైతులకు ‘గాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. అది ఉంటే యూరోపియన్ దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంవల్లే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్దఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
సిరి ధాన్యాల భారీ ఎగుమతులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ ఎత్తున కొర్రలు, సామలు, అరికల వంటి సిరి (చిరు/తృణ) ధాన్యాల ఎగుమతులపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకు తగిన వ్యూహ రచన చేసింది. ఎగుమతుల పురోగతికి క్యారీఫోర్, వాల్‌మార్ట్ వంటి గ్లోబల్ రిటైల్ సూపర్మార్కెట్లతో అనుసంధాన చర్యలతో పాటు, దేశ, అంతర్జాతీయ దౌత్య కార్యాలనూ వినియోగించుకునే ప్రయత్నాలు చేయాలన్నది ఈ వ్యూహ రచన ప్రధాన ఉద్దేశం. దేశీయ ఎగుమతుల బ్రాండింగ్, ప్రచారం వంటి అంశాలకు సంబంధించి తాజా వ్యూహం మంచి ఫలితాలను ఇస్తాయని కేంద్రం భావిస్తోందని ఒక ప్రకటన పేర్కొంది. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ (యూఎన్జీఏ) ప్రకటించడం దీనికి నేపథ్యం. దీనికి సంబంధించి వెలువడిన వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన ప్రకారం... ♦ బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) సమావేశాలను నిర్వహించడానికి, భారతీయ మిల్లెట్ల కోసం నేరుగా అవగాహనలు కుదుర్చుకోడానికి, డిపార్ట్మెంటల్ స్టోర్లు, సూపర్ మార్కెట్ హైపర్మార్కెట్ల వంటి పటిష్ట కొనుగోలుదారులను గుర్తించడానికి దేశ, అంతర్జాతీయ రాయబార కార్యాలయాల సహకారాన్ని భారత్ తీసుకుంటుంది. ♦ బ్రాండ్ ప్రమోషన్ వ్యూహం ప్రకారం, లులు గ్రూప్, క్యారీఫోర్, అల్ జజీరా, అల్ మాయా, వాల్‌మార్ట్ వంటి ప్రధాన అంతర్జాతీయ రిటైల్ సూపర్ మార్కెట్లు మిల్లెట్ల బ్రాండింగ్, అలాగే ప్రమోషన్ కోసం ‘మిల్లెట్ కార్నర్’లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ♦ ఎగుమతిదారులు, రైతులు, వ్యాపారులు పాల్గొనేలా 16 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారుల-విక్రయదారుల సమావేశాల ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ♦ గల్ఫుడ్ 2023, సియోల్ ఫుడ్ అండ్ హోటల్ షో, సౌదీ ఆగ్రో ఫుడ్, సిడ్నీలో ఫైన్ ఫుడ్ షో, బెల్జియం ఫుడ్ అండ్ బెవరేజెస్ షో వంటి వివిధ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో మిల్లెట్లు దాని విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రణాళికల రూపకల్పన జరుగుతోంది. ♦ నూడుల్స్, పాస్తా, అల్పాహారం తృణధాన్యాలు మిక్స్, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, స్వీట్లు వంటి రెడీ-టు-ఈట్ అలాగే రెడీ-టు-సర్వ్ విభాగంలో విలువ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం స్టార్టప్‌లను సమీకరించనుంది. ♦ఐసీఏఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) హైదరాబాద్, ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రి షన్, హైదరాబాద్, సీఎస్ఐఆర్–సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్సి్టట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) మైసూర్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి అంతర్జాతీయ మార్కెట్లో మినుములు అలాగే విలువ ఆధారిత మిల్లెట్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను కేంద్రం రూపొందిస్తోంది. ♦ ఎగుమతులకు ఊతం ఇవ్వడానికి, పోషకాహార తృణధాన్యాల సరఫరా గొలుసులోని (సప్లై చైన్) అడ్డంకులను తొలగించడానికి న్యూట్రి తృణధాన్యాల ఎగుమతిల ప్రోత్సాహక వేదిక (ఎన్సీఈపీఎఫ్) ఏర్పాటు జరిగింది. గ్లోబల్ మార్కెట్లో భారత్ హవా.. మిల్లెట్లలో కాల్షియం, ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22) భారతదేశం 34.32 మిలియన్ డాలర్ల విలువైన మిల్లెట్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఎగుమతులు పరిమాణం పరంగా, 2020-21లో 1,47,501.08 టన్నుల నుండి 2021-22లో 8 శాతం పెరిగి 1,59,332.16 టన్నులకు చేరుకుంది. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 41 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోని మిల్లెట్ల ఉత్పత్తిదేశాల్లో అగ్రగామిగా ఉంది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం, 2020లో ప్రపంచ మిల్లెట్ల ఉత్పత్తి 30.464 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ). ఇందులో భారతదేశం వాటా 12.49 ఎంఎంటీలు. భారతదేశం 2020-21తో పోల్చి 2021-22లో మిల్లెట్ ఉత్పత్తిలో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశంలో 15.92 ఎంఎంటీ ఉత్పత్తి జరిగింది. భారత్‌లో మొదటి ఐదు మిల్లెట్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. దేశ మిల్లెట్ ఎగుమతి వాటా మొత్తం మిల్లెట్ ఉత్పత్తిలో ఒక శాతం. భారతదేశం నుండి మిల్లెట్ల ఎగుమతులు ప్రధానంగా ధాన్యంగా ఉంటాయి. అలాగే భారతదేశం నుండి మిల్లెట్ల విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి చాలా తక్కువ. అయితే, ప్రస్తుత ప్రపంచ 9 బిలియన్ డాలర్ల మిల్లెట్ మార్కెట్ విలువ, 2025 నాటికి 12 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్ ప్రధాన మిల్లెట్ ఎగుమతి దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏ ఈ), నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, బ్రిటన్, అమెరికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన మిల్లెట్ దిగుమతి దేశాల్లో ఇండోనేషియా, బెల్జియం, జపాన్, జర్మనీ, మెక్సికో, ఇటలీ, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ ఎగుమతి చేసే మిల్లెట్లలో సజ్జలు, రాగి, కానరీ, జొన్నలు, బుక్వీట్లు (గోధుమ రకం) ఉన్నాయి. ఉత్పత్తిచేసి, ఎగుమతయ్యే మిల్లెట్లలో ప్రధానంగా 16 రకాలు ఉన్నాయి. వీటిలో జొన్న (జోవర్), పెరల్ మిల్లెట్ (బజ్రా), ఫింగర్ మిల్లెట్ (రాగి) మైనర్ మిల్లెట్ (కంగాణి), ప్రోసో మిల్లెట్ (చీనా), కోడో మిల్లెట్ (కోడో), బారాన్యర్డ్ మిల్లెట్ (సావా/సన్వా/ఝంగోరా), లిటిల్ మిల్లెట్ (కుట్కి) ఉన్నాయి. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
రూపాయిలో వాణిజ్యానికీ ప్రోత్సాహకాలు అందుతాయ్!
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలను పరిష్కరించుకున్నప్పటికీ, విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీఏ) కింద ఎగుమతిదారులు ప్రోత్సాహకాలను పొందేందుకు ఇకపై ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు. వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (జీడీఎఫ్‌టీ) ఈ మేరకు నిబంధనావళిని విడుదల చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంసహా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అడ్డంకులను కేంద్రం క్రమంగా తొలగిస్తోంది. తాజా నిర్ణయంతో రూపాయిలో ఎగుమతులకు సంబంధించి వాణిజ్య లావాదేవీల పరిష్కారానికి మార్గం మరింత సుగమం అయ్యింది. ఇప్పటికే దేశీయ కరెన్సీలో వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారత్ రూపాయిలో ఎగుమతులు– దిగుమతుల ఇన్వాయిస్, చెల్లింపు, సెటిల్మెంట్కు జీడీఎఫ్‌టీ అనుమతించింది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
Ukraine-Russia War: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా
కీవ్: ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయబోతున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉక్రెయిన్ 9 మిలియన్ టన్నులకుపైగా ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనివల్ల పలు దేశాల్లో ఆహారం ధరలు దిగివచ్చాయి. ఉక్రెయిన్‌పై ప్రతీకారంగానే ఎగుమతుల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఆగిపోవడం ఖాయం. -
ఎగుమతుల హబ్‌గా ఏపీ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. సముద్రతీర ప్రాంతంతో ఏపీ ఎక్స్పోర్ట్ హబ్‌గా నిలిచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మెరైన్, రైస్, ఫ్రూట్స్ వంటి ఎగుమతుల్లో ద్విగుణీకృతమైన ప్రగతిని ఏపీ సాధిస్తోందని.. విదేశీ వాణిజ్యానికి అన్ని అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయని ఆమె కొనియాడారు. కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మకమైన ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) మూడో క్యాంపస్‌ను శుక్రవారం కేంద్ర ఆర్థిక, వాణిజ్యశాఖా మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ ప్రారంభించారు. చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థికవ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుంద న్నారు. విశాలమైన సముద్రతీరం ఉన్న ఏపీలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను అర్థంచేసుకుని, ఇక్కడి ఎగుమతిదారులు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకున్నారన్నారు. అదే ఈ రోజు విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందువరసలో నిలిపిం దని ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లా ఒక్కో విశిష్ట ఉత్పత్తికి కేంద్రంగా ఉందన్నారు. ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా దేశ, విదేశాల్లో జరుగుతున్న వాణిజ్యాన్ని ఆకళింపు చేసుకుని వాటిపై పూర్తి పట్టు సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి చొరవతో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటీ, ఐఐఎఫ్‌టీ, ఐఐటీ తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని సీతారామన్ వెల్లడించారు. రాజకీయ సుస్థిరతతోనే ఆర్థిక శక్తిగా భారత్ మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో మరింతగా అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మానవ వనరులు అవసరమన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత, సమష్టి కృషి ఫలితంగానే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌టీ ఏర్పాటుతో కాకినాడ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. దేశీయ ఎగుమతుల్లో 5.8% (దాదాపు 16.8 బిలియన్ యూఎస్ డాలర్లు) ఏపీ నుంచి జరుగుతున్నాయన్నారు. గతంలో 20వ స్థానంలో ఉన్న ఈ ఎగుమతులు 2021 నాటికి 9వ స్థానానికి చేరుకున్నాయన్నారు. భారత్ ఆక్వాహబ్‌గా ఏపీ గుర్తింపు సాధించిందన్నారు. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, జీవీఎల్ నరసింహారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఐఐఎఫ్‌టీ వీసీ ప్రొ. మనోజ్‌పంత్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ఎగుమతులు రూ.61.7 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు రూ.61.7 లక్షల కోట్లు దాటతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎగుమతుల్లో 17 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. 2021–22లో భారత్ నుంచి విదేశాలకు చేరిన వస్తు, సేవల విలువ రూ.55.5 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం ఆయన ఈ విషయాలు వెల్లడించారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన ప్రత్యర్థి సంస్థ.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్‌యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్‌యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
జోరుగా గుంటూరు మిర్చి ఎగుమతులు..కోల్డ్ స్టోరేజీలు ఖాళీ
(బీవీ రాఘవరెడ్డి) కోవిడ్, బ్లాక్ థ్రిప్స్ తెగులు లాంటి అవరోధాలు ఎదురైనా గుంటూరు మిరప ఘాటు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లతో ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా ఏటా కనీసం 30 శాతం మిర్చి తర్వాత సీజన్ వరకు నిల్వ ఉంటుంది. కోల్డ్ స్టోరేజీల్లో మొత్తం నిల్వలు ముందుగానే ఖాళీ కావటం ఇటీవల ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 2–3 ఏళ్లుగా ఎండుమిర్చి ధరలు బాగున్నాయి. క్వింటాల్ రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. క్వింటాల్‌కు రూ.8 వేల కంటే అధిక ధర లభిస్తే రైతన్నకు లాభాలు దక్కుతాయి. గత రెండేళ్లలో దాదాపు 40 శాతం మిరప తోటలు బ్లాక్ థ్రిప్స్ బారిన పడినప్పటికీ మిగిలిన పంటకు మంచి ధర రావటంతో రైతులు అప్పుల పాలు కాకుండా గట్టెక్కారు. వచ్చే సీజన్లోనూ డిమాండ్.. దేశవ్యాప్తంగా మిర్చి ఉత్పత్తి తగ్గుతుండగా డిమాండ్ మాత్రం భారీగా ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ముగిసి హోటళ్లు తిరిగి ప్రారంభం కావటంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మిర్చికి గిరాకీ పెరిగింది. ఇప్పటికే క్వింటాల్ మిర్చి రూ.15,000–30,000 పలుకుతోంది. గత రెండు సీజన్లలో తేజ, బాడిగ రకం గరిష్టంగా రూ.30 వేలు ధర పలికాయి. మిర్చి పండించే కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా ప్రస్తుత సీజన్లో పంట విస్తీర్ణం 15–20 శాతం తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల ఆలస్యంగా విత్తడంతో పాటు వివిధ కారణాల వల్ల పంట రాక కనీసం 45–60 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రానున్న డిసెంబర్ సీజన్లో ఎగుమతులతో పాటు ధరలు 30 – 40 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. స్పైసెస్ పార్కుతో ఎగుమతులకు ఊపు గుంటూరు శివార్లలో ఏర్పాటైన స్పైసెస్ పార్కు గత మూడేళ్లుగా మిర్చి ఎగుమతులు పెరిగేందుకు ఎంతో దోహదం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మైదవోలు–వంకాయలపాడు పరిధిలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను నెలకొల్పాలని 2007లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో స్పైసెస్ పార్కు మంజూరైంది. దేశవ్యాప్తంగా 60 శాతం మిరప పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్నందున పార్కు కోసం ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేశారు. వెంటనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వెచ్చించాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 12 ఎకరాల్లో 23 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నాలుగు గోడౌన్లను నిర్మించింది. వీటికి 200 కేవీఏ సామర్థ్యం గల రెండు సోలార్ యూనిట్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పార్కు స్థలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు బోర్డు లీజుకు ఇస్తోంది. ఈ మేరకు 58 ప్లాట్లను సిద్ధం చేయగా 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. ఐటీసీతో సహా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న పలు ప్రముఖ సంస్థలు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో సొంత ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తున్నాయి. ఉత్తమ విధానాలపై శిక్షణ.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు కోసం స్పైసెస్ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఉత్పత్తులను శుభ్రపరచడం, గ్రేడింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్, నిల్వ చేసేందుకు గోడౌన్లు ఉంటాయి. పవర్ స్టేషన్లు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు, వేయింగ్ బ్రిడ్జిలు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నాణ్యతా నిర్ధారణకు ల్యాబ్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ కౌంటర్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు, గెస్ట్‌హౌస్ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. స్పైసెస్ పార్కు తరఫున రైతులు, వ్యాపారులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించటం ద్వారా రైతులకు మంచి ధర అందించేలా తోడ్పాటు అందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు పార్కులో అందుబాటులో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. తద్వారా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించవచ్చు. మూడేళ్లుగా మంచి ధరలు 12 ఎకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేస్తున్నా. గత మూడేళ్లుగా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎకరాకు 30–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత ఏడాది నల్ల పేను (బ్లాక్ థ్రిప్స్) తెగులు కారణంగా 15–20 క్వింటాళ్లకు మించలేదు. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. డిసెంబరు చివరలో మొదటి కోత వస్తుంది. జనవరి చివరికి మూడు కోతలు పూర్తవుతాయి. ఈసారి దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లకు తగ్గదని భావిస్తున్నా. – బొడ్లపాటి రామిరెడ్డి, రైతు, చేజర్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా ఆరోగ్యానికి మంచిదే ఔషధ గుణాలను కలిగి ఉండే మిర్చిని మితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ప్రపంచంలో 400 రకాలకు పైగా మిరపకాయలున్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 16 శాతం మిరప కాయలున్నాయి. మిర్చి ఉత్పత్తిలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఘాటైన మిరప రకం గుంటూరు సన్నం–ఎస్4 విదేశాలకు ఎగుమతి అయ్యే మిరపలో దాదాపు 30 శాతం వాటా గుంటూరు మిర్చిదే. + ఇక్కడ పండే కాయ నాణ్యత బాగుండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. -
వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి...
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల తొలి, తుది లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దిగుమతులు 8.66 శాతం పెరిగి 61.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 26.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య క్షీణత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ ఎగుమతులు వృద్ధిలేకపోగా 16.96 బిలియన్ డాలర్లు క్షీణించి 231.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.55 శాతం పెరిగి 380.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 148.46 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విలువ 76.25 బిలియన్ డాలర్లు. కీలక రంగాలు నిరాశ ► ఇంజనీరింగ్ వస్తు ఎగుమతులు 10.85 శాతం క్షీణించి 8.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు కూడా 18 శాతం క్షీణించి బిలియన్ డాలర్లకు తగాయి. ► ప్లాస్టిక్స్ కూడా ఇదే పరిస్థితి. 12.2 శాతం క్షీణతతో 660.66 మిలియన్ డాలర్లకు చేరాయి. ► అయితే రత్నాలు–ఆభరణాలు, పెట్రోలియం ప్రొడక్టులు, తోలు, ఫార్మా, కెమికల్స్, బియ్యం ఎగుమతులు పెరిగాయి. దిగుమతులు ఇలా... ► ఆయిల్ దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు 24.62 శాతం పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతులు 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల రంగం ఎగుమతులు 19 శాతం అప్ ఇదిలావుండగా, సేవల రంగం ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దిగుమతుల విలువ 20 శాతం పెరిగి 15.10 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సేవల ఎగుమతులు 27.88 శాతం వృద్ధితో 150.43 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై, ఆగస్లుల్లో సవరణలు ఇలా... జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలైలో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయని తొలి గణాంకాలు వెలువడ్డాయి. తాజా గణాంకాలు పరిస్థితిని ఆశాజనకంగా మార్చాయి. వరుసగా 22 నెలలూ ఎగుమతులు వృద్ధి బాటన నడిచినట్లయ్యింది. లక్ష్యం కష్టమేనా... 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం సాధన కష్టమేనన్న విశ్లేషణ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతాయన్న విశ్లేషణలే దీనికి కారణం. -
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
ఆగస్టులో ఎగుమతులు.. ‘ప్లస్సే’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో వృద్ధినే నమోదుచేసినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ బుధవారం వెలువరించిన సవరిత గణాంకాలు స్పష్టం చేశాయి. సమీక్షా నెల ఎగుమతుల్లో 1.62 శాతం వృద్ధి నమోదయిందని, విలువలో ఇది 33.92 డాలర్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, నెలవారీగా తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత అవి వృద్ధిబాటలోకి రావడం ఇది వరుసగా రెండవనెల. జూలైలో తొలి గణాంకాలు క్షీణత (–0.76) నుంచి 2 శాతం వృద్ధికి మారాయి. ఆగస్టు విషయంలో తొలి గణాంకాల క్షీణ అంచనా మైనస్ 1.15 శాతం. -
క్షీణించిన భారత్ ఎగుమతులు, ఆగస్ట్‌లో ఎంత శాతం అంటే
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఇక దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు రెట్టింపునకు పైగా పెరిగి, 28.68 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు భారీగా పెరగడానికి క్రూడ్ ఆయిల్ దిగుమతులు ప్రధాన కారణం. ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
చైనా ఫోన్లపై నిషేధం లేదు: కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవాలని చైనా మొబైల్ ఫోన్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రూ.12,000లోపు విలువ చేసే చైనీ ఫోన్ల విక్రయాలపై నిషేధ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశీ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో భారత కంపెనీలకు కీలక పాత్ర ఉందంటూ, దీనర్థం విదేశీ బ్రాండ్లను మినహాయించడం కాదన్నారు. ‘‘మరిన్ని ఎగుమతులు పెంచుకోవాలని చైనా బ్రాండ్ల వద్ద మేము పారదర్శకంగా ప్రస్తావించాం. వాటి సప్లయ్ చైన్, ముఖ్యంగా విడిభాగాల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ఉండాలి’’అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రూ.12 వేల లోపు ఫోన్లకు చైనా కంపెనీలను దూరం పెట్టాలన్న ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నారు. 2025–26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ, 120 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి 76 బిలియన్ డాలర్లుగా ఉంది. -
బందరు చేప భలే భలే..
సాక్షి, మచిలీపట్నం: బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతున్నారు. అలాగే దేశంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన ఏజెంట్లు ఎగరేసుకుపోతుంటారు. రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలతో పోల్చుకుంటే మచిలీపట్నంలో కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ నుంచి గత కొన్నేళ్లుగా సముద్ర ఉత్పత్తులు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. జిల్లాలో ఏకైక ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండిలో ఏర్పాటైంది. ఈ హార్బర్‌కు యూరోపియన్ దేశాల గుర్తింపు కూడా ఉంది. వందల రకాల మచిలీలు.. మచిలీపట్నం తీరంలో ఎక్కువగా తెల్ల చందువా (సిల్వర్ అండ్ వైట్ పాంప్రెట్), నల్ల చందువా (బ్లాక్ పాంప్రెట్), కోణాం, ముక్కు కోణాం (స్వర్డ్ ఫిష్), నెమలి కోణాం (సెయిల్ ఫిష్), వంజరం (సీర్ ఫిష్), నాలుకలు (సోల్), నామాల తూర (స్కిప్ జాక్ టూనా), పసుపురెక్క తూర (ఎల్లో ఫిన్), పెద్దకన్ను తూర (బిగ్ ఐ), కానా కంతలు (మాకేరల్స్), పావడాయి (రిబ్బన్), గొరక (క్రోకర్స్), సొర చేప, కండువ, మూడు చుక్కల పీత (త్రీస్పాట్ స్విమ్మింగ్ క్రాబ్)లతోపాటు టైగర్, వైట్ నారన్, పింక్, పువాలన్ (కలందన్), కరికేడి, శంఖు, డీప్ సీ ఫ్రాన్స్, కుక్కరొయ్యలు, సారగొరక, గులిగింత, జల్లలు, కుక్కసావడాయి, మెత్తా్తళ్లు, తెంగుడు రొయ్యపొట్టు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ప్రధానంగా టూనా, కోణాంలతోపాటు వంజరం, చందువా, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అత్యధిక ధర తెల్ల చందువా (కిలో రూ.2 వేల వరకు), కోణం (కిలో రూ.700) పలుకుతున్నాయి. వేటకు వెళ్లిన వారు రోజూ అనేక రకాల చేపలను గిలకలదిండి హార్బర్‌కు తెస్తున్నారు. అక్కడ వ్యాపారులు వేలంపాట ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు నేరుగా విశాఖ, కాకినాడ, చెన్నై తీసుకెళ్లి అక్కడే విక్రయిస్తున్నారు. సీజన్‌ను బట్టి వీటికి మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మచిలీపట్నంలో చేపల చెరువుల్లో ప్రత్యేకంగా పెంచే చేపల్లో పండుగప్ప, శీలవతి, తుల్లులు, నేమ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. టూనా చేపలకు డిమాండ్ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రసాయన పరిశ్రమలు లేవు. పెద్ద ఓడల రాకపోకలూ తక్కువే. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దొరికే వాటిలో రసాయన ధాతువులు ఎక్కువగా ఉంటున్నాయని.. మచిలీపట్నంలో నామమాత్రంగా కూడా ఉండడం లేదని యూరోప్, జపాన్ దేశస్తులు గుర్తించడం విశేషం. మచిలీపట్నం తీరంలో దొరికే టూనా చేపల కోసం జపాన్ దేశస్తుల నుంచి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుంచి తీసుకునే క్యాచింగ్ సర్టిఫికెట్లో మచిలీపట్నం సీకోస్ట్ అని ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెబుతున్నారు. బందరు చేపల కోసం విశాఖ, కాకినాడ, చెన్నై, కోచి, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సికింద్రాబాద్ వ్యాపారులు ఇక్కడ కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. రోజూ మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన చేపలను ఏజెంట్లు ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
భవిష్యత్‌కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు. -
ఎకానమీ.. శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తగ్గిన ఆహార ధరలు ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. ఈ స్పీడ్ తాజా సమీక్షా నెల్లో మరింత దిగిరావడం హర్షణీయం. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 6.75 శాతానికి దిగివచ్చింది. జూన్‌లో కూరగాయల ధరల స్పీడ్ 17.37 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల్లో 10.90 శాతానికి దిగివచ్చాయి. ఇక ఆయిల్ అండ్స్ ఫ్యాట్స్ ధరల స్పీడ్ ఇదే కాలంలో 9.36 శాతం నుంచి 7.52 శాతానికి తగ్గింది. గుడ్ల ధరలు 3.84 శాతం తగ్గాయి. పండ్ల ధరలు మాత్రం 3.10 శాతం నుంచి 6.41 శాతానికి ఎగశాయి. ఇంధనం, విద్యుత్ ధరలు తీవ్రంగానే (11.67 శాతం) కొనసాగుతున్నాయి. తయారీ, మైనింగ్ సానుకూలం జూన్‌లో వరుసగా రెండవనెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ రెండంకెలపైన వృద్ధిని సాధించింది. తయారీ (12.5 శాతం), విద్యుత్ 16.5 శాతం), మైనింగ్ (7.5 శాతం) రంగాల దన్నుతో పారిశ్రామిక ఉత్పత్తి జూన్‌లో 12.3 శాతంగా నమోదయ్యింది. అయితే మే నెలతో పోల్చితే (19.6 శాతం) సూచీ స్పీడ్ తగ్గింది. పెట్టుబడులు, డిమాండ్‌కు సూచికయిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి విభాగం 26.1 శాతం పురోగతి సాధించింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 23.8 శాతం వృద్ధి నమోదుకాగా, ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగం 2.9 శాతం పురోగమించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 12.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి బాటనే ఎగుమతులు... ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు ఆగస్టు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజా లెక్కల ప్రకారం, సవరిత గణాంకాలు వెల్లడించాయి. ఇక దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.72 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) భారత్ ఎగుమతులు 20 శాతం పెరిగి 157.44 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతులు 48 శాతం పెరిగి 256.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. -
గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ వడ్డింపుపై కేంద్రం మరోసారి కిలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును సగానికి తగ్గించింది. అలాగే జెట్ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై టాక్స్‌ను రద్దు చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై పన్నును పెంచింది. (Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?) అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.11 నుంచి రూ.5కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది. దీంతో డీజిల్ లీటర్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.11 నుంచి రూ.6 కు దిగి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 17,000 నుండి రూ.17,750కి పెంచింది.పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరోగా కొనసాగుతుంది. క్రూడాయిల్‌పై పన్ను పెంపుద్వారా ఓఎన్జీసీ, వేదాంత లాంటి ఉత్పత్తి దారులకు కష్ట కాలమేనని, అలాగే డీజిల్, ఏటీఎఫ్‌లపై పన్నుల కోత రిలయన్స్ కు సానుకూలమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ చదవండి:నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించిన సంగతి తెలిసిందే. జూన్‌లో 26.18 బిలియన్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఎగుమతులు మందగించడంతో జూలై నెలలో 31 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం సవరించింది. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన కేంద్రం మరోసారి సారి కోత పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం నుండి జూలైలో రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో రెండోసారి విండ్‌ఫాల్ టాక్స్‌ను తగ్గించింది. కమోడిటీ ధరలు పెరగడం, బలహీనమైన రూపాయి కారణంగా జూలైలో దిగుమతులు 43.59 శాతం పెరగగా, ఎగుమతులు 0.76 శాతం పడిపోయాయి. -
భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే పళ్లను, చేపల ఉత్పత్తులతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇసుకను చైనా నిషేధించింది. ఆయా ఉత్పత్తుల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయని, పైగా ఆ ప్యాకేజిలపై చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చిందంటూ సాకులు చెబుతూ తైవాన్ దిగుమతులను నిషేధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు. ఇలా మార్చి 2021లో తైవాన్ ఎగుమతి చేసే పైనాపిల్‌లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. పైగా రాజకీయపరంగానే ఇలా కక్ష పూరిత చర్యకు చైనా పాల్పడిందని సమాచారం. అదీగాక 2016 నుంచి తైవాన్ అధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా తైవాన్‌ని చుట్టుముట్టి ప్రత్యక్ష మిలటరీ డ్రిల్‌ను నిర్వహిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్‌లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్ పిపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది. (చదవండి: హైటెన్షన్.. తైవాన్‌లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక) -
పెరిగిన వెహికల్స్ ఎక్స్పోర్ట్..అగ్రస్థానంలో మారుతీ సుజికీ!
న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల ఊతంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 26 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1,27,083 యూనిట్లతో పోలిస్తే 1,60,263 యూనిట్లకు పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 88 శాతం పెరిగి 1,04,400 యూనిట్లుగాను, యుటిలిటీ వాహనాలు 18 శాతం పెరిగి 55,547 యూనిట్లుగాను నమోదయ్యాయి. వ్యాన్ల ఎగుమతులు 588 యూనిట్ల నుంచి 316 యూనిట్లకు తగ్గాయి. ‘లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు కోలుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో, మన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తుండటం, ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మారుతీ టాప్.. తొలి త్రైమాసికంలో 68,987 ప్యాసింజర్ వాహనాలను (53 శాతం అధికం) ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసింది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెసో, బ్రెజా మోడల్స్ టాప్‌లో ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎగుమతులు 34,520 యూనిట్లుగా (15 శాతం వృద్ధి) నమోదయ్యాయి. కియా ఇండియా 21,459 వాహనాలను (గత క్యూ1లో 12,448) ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటర్ ఇండియా 11,419 యూనిట్లు, ఫోక్స్‌వ్యాగన్ 7,146 యూనిట్లు, రెనో 6,658 వాహనాలు, హోండా కార్స్ 6,533 యూనిట్లను ఎగుమతి చేశాయి. వాహన రంగంలో కోటి ఉద్యోగాలు దేశీ ఆటోమొబైల్ రంగంలో వచ్చే 5–6 ఏళ్లలో యువతకు 1 కోటి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సంబంధించి 40 శాతం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు దేశీయంగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగానికి భారత్ కీలక కేంద్రంగా మారనుంది. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి -
ఈయూ ఆంక్షల మోత...టెన్షన్లో రష్యా!
EU said it will look into sanction regime on gold: ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధంకు దిగడంతో ఈయూ దేశాలు ఇప్పటికే రష్యా పై ఆంక్షలు మోత మోగించింది. అయినా రష్యా దూకుడు మాత్రం ఆగలేదు. పైగా ఉక్రెయిన్ పై మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడింది రష్యా. అంతేకాదు ఉక్రెయిన్ స్వాధీన దిశగా దాడులు వేగవంతం చేసింది కూడా. దీంతో రష్యాను నియంత్రించేలా మరిన్ని ఆంక్షలను విధించే దిశగా ఈయూ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈయూ రష్యా ఎగుమతులకు సంబంధించిన ముఖ్యమైన వాటిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు రష్యా బంగారం ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ కమిషన్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఈయూ రష్యా పై ఆరు ఆంక్షల ప్యాకేజిని విధించింది. ఈ మేరకు ఈయూ రష్యాకి సంబంధించి ఎగుమతులలో ముఖ్యమైనది అయిన బంగారం పై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ హెడ్ మారోస్ సెఫ్కోవిక్ తెలిపారు. తాము సభ్యదేశాల స్థాయిలో ఒప్పందానికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అదీగాక ఉక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫనిషినా కూడా రష్యా పై కొత్త ఆంక్షల ప్యాకేజిని ఆమోదించాలని కోరారు. అయినా ఇప్పటివరకు ఇన్ని ఆంక్షలు విధించినా రష్యాలో ఏ మాత్రం మార్పు రాలేదని, పైగా తాను చేసి దురాగతాలకు జవాబుదారీగా భావించేలా కూడా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు విధించనున్న ఆంక్షలు రష్యాని గట్టిగా నియంత్రించగలదని ఆశిస్తున్నానని, సాధ్యమైనంత త్వరితగతిన ఈ ఆంక్షలు ఆమోదించాలని కోరుకుంటున్నానని అన్నారు. (చదవండి: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు) -
రెండు వారాలకోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌పై సమీక్ష
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకోసారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షించనుంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ విషయాలు చెప్పారు. క్రూడాయిల్ బ్యారెల్ రేటు 40 డాలర్ల స్థాయికి పడిపోతే దీన్ని ఉపసంహరించవచ్చన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే ఆ రేటుకు రాకపోవచ్చని పేర్కొన్నారు. ముడిచమురు రేటు ఏ స్థాయిలో ఉంటే విండ్‌ఫాల్ ట్యాక్స్ ఉపసంహరించవచ్చనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రి చెప్పారు. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై రూ. 13 చొప్పున, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్పైన టన్నుకు రూ. 23,250 మేర పన్నులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. -
ఎకానమీకి ‘వాణిజ్య’ పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు మేలో రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021 మేలో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లు. సమీక్షా నెల్లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 20.55% పెరిగి (2021 మేనెల గణాంకాలతో పోల్చి) 38.94 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇక వస్తు దిగుమతుల విలువ 62.83% ఎగసి 63.22 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ఎగుమతుల రీతి.. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.65 శాతం పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో ఎగుమతులు 60.87 శాతం ఎగసి 8.54 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021 మేలో 2.96 బిలియన్ డాలర్లుంటే, తాజా సమీక్షా నెల్లో 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 17.35% పెరిగి 2.5 బి. డాలర్లకు చేరాయి. ► ఫార్మా ఎగుమతులు 10.28 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 28% పెరిగి 1.41 బి. డాలర్లకు చేరాయి. ► ముడి ఇనుము, జీడిపప్పు, హస్తకళలు, ప్లాస్టిక్స్, కార్పెట్, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. దిగుమతుల పరిస్థితి.. ► మే నెల్లో పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 102.72 శాతం ఎగసి 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి దిగుమతుల విలువ 2021 మేలో 677 మిలియన్ డాలర్లుంటే, 2022 మేలో 6 బిలియన్ డాలర్లకు చేరింది. రెండు నెలల్లో..: ఏప్రిల్–మే నెలల్లో ఎగుమతులు 25 శాతం పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇదే కాలంలో దిగుమతులు 45.42 శాతం ఎగసి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి ఆర్థిక సంవత్సరం (2022–23) రెండు నెలల్లో వాణిజ్యలోటు 44.69 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండు నెలల్లో వాణిజ్యలోటు 21.82 బిలియన్ డాలర్లు. సేవల దిగుమతుల తీరిది... ఇక వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో సేవల దిగుమతుల విలువ 45.01 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సేవల దిగుమతులు 45.52 శాతం పెరిగి 28.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
భారత గోధుమల ఎగుమతిపై యూఏఈ కీలక నిర్ణయం
గోధుమల ఎగుమతులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక, తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌ను కోరాయి. దీంతో, యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో.. తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మే 13కి ముందు యూఏఈకి తీసుకువచ్చిన భారతీయ గోధుమలను ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. గోధుమల షిప్మెంట్, గోధుమలు ఏ దేశం నుంచి వచ్చాయి, చెల్లింపులు జరిపిన తేదీ తదితర డాక్యుమెంట్లను తనిఖీ కోసం సబ్మిట్ చేయాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన గోధుమలు, గోధుమ పిండిని కంపెనీలు ఎగుమతి చేసుకోవచ్చని యూఏఈ స్పష్టం చేసింది. కానీ, ఇందు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ ఆర్థిక శాఖ ఆదేశించింది. -
గోధుమలపై ఎందుకీ గోల.. సరైన నిర్ణయం తీసుకోలేరా?
గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తగు తీసుకోకుంటే భారీ ఎత్తున గోధుములు పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. గోధుమల ఎగుమతిని కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో భారీగా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన గోధుమలకు పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించుకోవాలని అన్నట్టుగా వ్యూహాలు రూపొందించింది. దీంతో ఎడా పెడా గోధుమల ఎగుమతులు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్లో ఎండలు బాగా ఉన్నందున గోధమల దిగుమతి తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో మే 14న అకస్మాత్తుగా గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్రం నిషేధం అమల్లోకి వచ్చే సరికే దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు దేశంలోని ప్రముఖ పోర్టులకు చేరుకుని ఉన్నాయి. వీటిని ఒడల్లోకి ఎక్కించడమే తరువాయి అనే క్రమంలో గోధుమల ఎగుమతికి బ్రేక్ పడింది. తాజాగా కేంద్రం ప్రత్యేక అనుమతుల కింద 4 లక్షల టన్నుల పై చిలుకు గోధుమల ఎగుమతికి తాజాగా అనుమతి ఇచ్చింది. ఐనప్పటికీ ఇంకా 17 లక్షల టన్నుల గోధుమలు ఇంకా పోర్టుల్లోనే ఉండిపోయాయి. త్వరలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. పోర్టుల్లో ఆరుబయట ఉన్న గోధములు ఈ వర్షంలో చిక్కుకుంటే ఇబ్బందులు తప్పవని ట్రేడర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి దేశాల్లో డిమాండ్ ఉన్నందువల్ల పోర్టుల్లో ఉన్న సరుకు ఎగుమతికి ప్రత్యేక అనుమతి కావాలని కోరుతున్నారు. లేదంటే పోర్టుల్లో ఉన్న గోధుమలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐలకు తరలించాలని సూచిస్తున్నారు. లేదంటే ఇటు ఎగుమతి చేయలేక అటు దేశ అవసరాలకు ఉపయోగపడక గోధుమలు పాడైపోయే అవకాశం ఉందంటున్నారు. చదవండి: గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం -
మరి మన శక్తిని చాటేదెప్పుడు?
కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తప్పుడు సలహాలే అందుతు న్నాయా? లేక ఆహార ద్రవ్యోల్బ ణానికి అసలు కారణాలేమిటన్నది అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా విఫలమైందా? ఇవేవీ కాకుండా, ప్రజలపై సానుకూల ముద్ర పడేలా నాటకీయ ఫక్కీలో ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందా? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి గోధుమల ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించినట్లు? సమస్యపై విపరీతమైన సాను భూతి వ్యక్తం చేసి, ఎన్నికల్లో తమకు లబ్ధి కలిగేలా చూసుకోవడమే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశమా? 2021 –22 సంవత్సరానికి గానూ దేశం మొత్తమ్మీద పండిన పంటలపై ఇటీవలే మూడో ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. తిండిగింజల దిగుబడులు రికార్డు స్థాయిలో 31.45 కోట్ల టన్నులని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.77 మిలియన్ టన్నులు ఎక్కువ. బియ్యం దిగుబడి గత ఏడాది కంటే 52 లక్షల టన్నులు ఎక్కువ కాగా... గోధుమ పంట కూడా సుమారు 31 లక్షల టన్నుల వరకూ ఎక్కువ చేతికొచ్చింది. భారత దేశపు తిండిగింజలు అవసరానికి మించి రిజర్వులో ఉన్నాయి. గోధుమలు దాదాపు కోటీ తొంభై లక్షల టన్నులు నిల్వ ఉండగా, బియ్యం 5.5 కోట్ల టన్నులు గోదాముల్లో ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 74 లక్షల టన్నుల గోధుమలు, కోటీ 35 లక్షల టన్నుల బియ్యం బఫర్ స్టాక్‌గా ఉంటే సరిపోతుంది. గోధుమ ఎగుమతులను పెంచేందుకు పది దేశాలకు వ్యాపార బృందాలను పంపుతున్నట్లు ప్రకటించిన 48 గంటల్లోనే ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించింది? పైగా ఈ ఏడాది కోటి టన్నుల గోధుమలు ఎగుమతి చేస్తామని గొప్పగా ప్రకటించిన తరువాత నిషేధం విధించాల్సిన పరిస్థితులు ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. ఎగుమతుల ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చునన్న రైతుల ఆశలకు గండి పడింది. భారత్‌తో పోలిస్తే బయటి దేశాల్లో గోధుమల ధర ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎగుమతులపై నిషేధం విధించడం వారికి నష్టం చేకూర్చడంతో సమానమని చెప్పాలి. నిషేధం విధించకపోయి ఉంటే, భారత దేశపు గోధుమ వ్యాపారాన్ని తాము కూడా సమర్థంగా నిర్వహిం చగలమని చాటి చెప్పేందుకు వ్యాపారులకూ ఓ మంచి అవకాశం దక్కినట్లు అయ్యేది. భారతదేశం గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కార ణంగా గోధుమల సరఫరాకు సంబంధించి ప్రపంచం చిక్కులు ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్న సమయంలో తగినన్ని అందించడం ద్వారా మనం ఆ పని చేసిన ఘనతను తీసుకునే అవకాశం ఉండేది. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే అవకాశం సరేసరి. ఇప్పటి వరకూ ఎగుమతి చేయని దేశాలు, ప్రాంతాలకు గోధుమ లను పంపడం ద్వారా భవిష్యత్తులో మన సరుకులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చేవి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతూండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసి ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ అంత గాభరా అవసరం లేదు. వినియోగదారుల ధరల సూచీ తాలూకూ ఆహార ద్రవ్యోల్బణంలో తిండి గింజలు భాగస్వామ్యం పది శాతం కంటే తక్కువ. తయారు చేసిన ఆహార పదార్థాలు, వంట నూనెలు రెండూ దాదాపు 41 శాతం ఉంటాయి. పండ్లు, కాయగూరల భాగం 27.5 శాతం కాగా, ఆహార ద్రవ్యో ల్బణంలో పాలు, మాంసం, చేపల వంటి ఉత్పత్తుల భాగం 17 శాతం ఉంటుంది. అంటే తిండిగింజల ఎగుమ తులపై నిషేధం విధించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో కేవలం పది శాతం మాత్రమే ప్రభావితమవుతుందన్న మాట. ఇప్పుడు చెప్పండి... ఎగుమతుల నిషేధం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? వారి అసలు ఉద్దేశా లేమిటో నాకు అర్థమవుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తోందనీ, చాలా వేగంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకుంటోందనీ ఒక సందేశం పంపడం మాత్రమే బీజేపీ ఏలుబడిలోని ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘చూశారా, మీకు సాయపడేందుకు మేమె ప్పుడూ సిద్ధంగానే ఉంటా’మని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మాట కాకుండా... ‘ఎగుమ తుల గురించి మీరేమీ చింత పడాల్సిన అవసరం లేదు. దేశ అవసరాలకు మించి నిల్వలు ఉన్నాయి మన దగ్గర. అవసరమైనప్పుడు ప్రపంచాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేందుకు ఇదో మంచి అవకాశం’ అని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే... జీ–7 దేశాల వ్యవసాయ మంత్రులు భారత్ నిర్ణయంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జియోర్జివా కూడా భారత్ తన వైఖరిని మార్చుకుని గోధుమ ఎగుమతులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మొత్తమ్మీద చూస్తే... భారతదేశం ప్రపంచంలో ఓ పెద్ద శక్తిగా ఎదగాలన్న కాంక్షనైతే చూపుతోంది గానీ, మనకు అందుబాటులో ఉన్న చిన్న శక్తిని కూడా ఇతరులకు పంచడంలో విఫలమవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచం మన నుంచి ఇలాంటి చిన్న చర్యలను ఆశిస్తున్న సమయం లోనే మనం ఇలాంటి చర్యలకు దిగుతున్నాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం భాగస్వాములు కావచ్చు గాక; అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు గాక; మనల్ని మనం విశ్వ గురువులుగా ప్రకటించుకోనూవచ్చు గాక. కానీ అవసరమైన సందర్భాల్లో మనకు చేతనైన చిన్న పనులు కూడా చేయడంలో మాత్రం విఫలమవుతున్నాం. మరి ప్రపంచం మన సామర్థ్యాన్ని గుర్తించేదెలా? మనకు ఆ గుర్తింపు అవసరం లేదా? లేక ఆ మాత్రం తెలివిడి మనకు లేకుండా పోతోందా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ -
సామాన్యుల నెత్తిన మరో పిడుగు.. వాటి ధరలకు రెక్కలు?
నిత్యవసర వస్తువల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కూరగాయలు, వంట నూనెకు తోడు ఇటీవల గోధుమల ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు చక్కెర రెడీ అవుతుంది. అయితే పంచదార ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనుందంటూ రాయిటర్స్, బ్లూంబర్గ్‌లు కథనాలు ప్రచురించాయి. ఈ ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం 10 మిలియన్ టన్నులకే పరిమితి చేసే అవకాశం ఉందంటూ తేల్చి చెప్పాయి. బయటి దేశాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తే దేశీయంగా కొరత వచ్చి ధరలు పెరగవచ్చనే అంచనాతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటూ వార్తలు గుప్పుమన్నాయి. మన దేశంలో వార్షిక చక్కెర ఉత్పత్తి సామర్థ్యం 35.5 మిలియన్ టన్నులు. ఇందులో 9.5 మిలియన్ టన్నుల చక్కెరని ఈ ఏడాది ఎగుమతి చేయోచ్చని ముందుగా అంచనా వేసి ఆ మేరకు అనుమతులు జారీ చేశారు. అయితే సగం ఏడాది కూడా పూర్తి కాకముందే ఇప్పటికే 8 మిలియన టన్నుల చక్కెర ఎగుమతులకు ఆర్డర్లు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో చక్కెరకు డిమాండ్ పెరిగింది. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మన దేశంలో ఉన్న చర్కెర అంతా విదేశాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులపై కేంద్రం పరిమితి విధించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్లో చక్కెర కిలో ధర సగటున 41.50 దగ్గర ఉంది. ప్రభుత్వం కనుక ఎగుమతులపై పరిమితి విధిస్తే రాబోయే రోజుల్లో రూ. 40 నుంచి 43 మధ్యనే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు వర్గాలు అంటున్నాయి. అలాకాని పక్షంలో గోదుమల తరహాలోనే చక్కెర ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం వార్తలు బటయకు రావడంతో స్టాక్ మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. చదవండి: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్, టార్గెట్ ఎంతంటే? -
కీలక నిర్ణయం తీసుకున్న ఏషియన్ కంట్రీ.. కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గేనా?
అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వంట నూనెల ధర కాస్త తగ్గవచ్చనే ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఎగుమతులపై నిషేధం ప్రపంచంలోనే పామాయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే దేశీయంగా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు 2022 ఏప్రిల్ 28న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా నుంచి పామాయిల సరఫరా ఆగిపోతుందనే వార్తలతో వంట నూనె ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. మే 23 నుంచి గత మూడు వారాలుగా పామాయిల్ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2022 మే 23 నుంచి తిరిగి ఎగుమతులకు అవకాశం ఇస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మే 19న ప్రకటించారు. ధర తగ్గడంతో నిషేధం విధించేప్పుడు టోకు మార్కెట్లో లీటరు పామాయిల్ ధర 19,800 రూపయల దగ్గర ఉంది. నిషేధం కారణంగా ఆక్కడ పామాయిల్ ధర దిగివచ్చి ప్రస్తుతం 17 వేల రూపాయల దగ్గర ట్రేడవుతోంది. అయితే ఆ దేశం పెట్టుకున్న టార్గెట్ మాత్రం లీటరు పామాయిల్ 14 వేల రూపాలయకు దిగిరావాలని, అయితే దేశీయంగా పామాయిల్ నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పాటు స్థానిక వాణిజ్య రంగాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధర తగ్గేనా? ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో దేశీయంగా కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా నుంచి భారత్ భారీ ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా నిషేధాన్ని సాకుగా చూపుతూ మిగిలిన అన్ని వంటి నూనెల ధరలు పెంచాయి వ్యాపార వర్గాలు. కానీ త్వరలో పామాయిల్ దిగుమతి అవడం వల్ల డిమాండ్ మీద ఒత్తిడి తగ్గి ధరలు అదుపలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చదవండి: ‘పామాయిల్’ సెగ తగ్గేదెలా! -
AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్, ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన పాలసీలను తెస్తోంది. 2020–21లో రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ –2022 – 27 రూపొందించింది. ఈ ముసాయిదా పాలసీకి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. చదవండి: ఎంఎస్ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ‘పుష్’ విధానంతో రెట్టింపు ఎగుమతులను రెట్టింపు చేసేలా ‘పుష్’ (పీయూఎస్‌హెచ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తులకు మరింత విలువను జోడించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించనున్నారు(ప్రమోట్–పీ). ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. ఎగుమతులకు కీలకమైన ఓడ రేవులు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు లాంటి కీలక మౌలిక వసతులను అభివృద్ధి (అప్‌గ్రేడ్–యూ) చేయనున్నారు. ఇప్పటికే 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు విశాఖ, అనంతపురంలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ఎగుమతుల విధానాన్ని స్ట్రీమ్‌లైన్ (ఎస్) చేస్తూ నూతన టెక్నాలజీ వినియోగం ద్వారా (హార్నెస్–హెచ్) ఎగుమతులను ప్రోత్సహించేలా ముసాయిదా పాలసీలో ప్రతిపాదించారు. ఆరు ఆంశాలపై దృష్టి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆరు కీలక అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎగుమతుల సమాచారమంతా ఒకేచోట లభించే విధంగా డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగించుకోనున్నారు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్ హబ్, ఎయిర్‌పోర్టులు, పోర్టు, రహదారుల అనుసంధానం లాంటి వాటిపై భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రతి జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్ది ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నాణ్యతా పరమైన కారణాలతో ఎగుమతులు తిరస్కరణకు గురి కాకుండా క్వాలిటీ టెస్టింగ్ కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించండంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేలా పాలసీలో పలు ప్రతిపాదనలు పొందుపర్చారు. ‘స్వయం ఆంధ్రా’ పేరుతో బ్రాండింగ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను అంతర్జాతీయంగా సరఫరా చేసే విధంగా ‘స్వయం ఆంధ్రా’ పేరుతో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ)ఎగుమతులను ప్రోత్సహించనుంది. కేవలం ఎగుమతుల కోసం ఉత్పత్తి పేరుతో అంతర్జాతీయంగా ప్రచారం కల్పించి నాణ్యత ధ్రువీకరణ సదుపాయాలు కల్పిస్తారు. సర్టిఫికేషన్ చార్జీలపై సబ్సిడీ, మార్కెటింగ్, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనే వారికి రాయితీలతో పాటు ఫైనాన్సింగ్, అవార్డులు లాంటి ప్రోత్సాహకాలను పాలసీలో ప్రతిపాదించారు. ♦తూర్పు తీరంలో 974 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఏకైక రాష్ట్రం ♦14 నోటిఫైడ్ పోర్టులు ఉండగా 6 పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణ ♦మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦2020–21 నాటికి రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.24 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 19.14 శాతానికి సమానం ♦దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతం ♦దేశీయ ఎగుమతుల సంసిద్ధత ర్యాంకుల్లో 20 నుంచి 9 స్థానానికి ఎగబాకిన ఏపీ ♦వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఎగుమతులను రూ.3.50 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యం. జిల్లాల వారీగా ఉత్పత్తులకు ప్రోత్సాహం ఒక్కో జిల్లాల్లో ఎగుమతికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి ప్రోత్సహిస్తాం. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి పోర్టులపై రూ.20,000 కోట్లు సముద్ర వాణిజ్య అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తోంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
గోధుమల ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది. గోధుమ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి. దీంతో రైతుల దగ్గర నుంచి మంచి ధరకు గోధుమల్ని కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ సమయంలో గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని విధించడమంటే రైతు వ్యతిరేక విధానమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంతర్జాతీయంగా గోధుమలకు గిరాకీ పెరగడంతో రైతులకు మంచి ధర వస్తూ ఉంటే వాటిని ఆపేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం మండిపడ్డారు. మరోవైపు భారత్ కృషిక్ సమాజ్ (బీకేఎస్) కూడా గోధుమల ఎగుమతుల నిలిపివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం అంటే అది పరోక్షంగా రైతులపై పన్ను విధించడమేనని ఆ సంస్థ చైర్మన్ అజయ్ విర్ జాఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గోధుమల నిషేధం చర్యల్ని సమర్థించుకుంది. గోధుమ ధరలు 40% పెరిగిపోవడంతో ధరల్ని కట్టడి చేయడానికే ఎగుమతుల్ని నిలిపివేశామని చెబుతోంది. -
ఏప్రిల్‌లో ఎగుమతుల రికార్డు
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ ఎగుమతులకు సంబంధించి రెండవ విడత సవరిత గణాంకాలు మరింత మెరుగ్గా వెలువడ్డాయి. ఎగుమతులు 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. భారత్ ఎగుమతుల చరిత్రలో ఈ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఇక దిగుగుమతులు 30.97 శాతం పెరిగి 60.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 20.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఏప్రిల్‌లో ఈ లువ 15.29 బిలియన్ డాలర్లు. కాగా పసిడి దిగుమతులు 72 శాతం పడిపోయి 1.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవలకు సంబంధించి ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో 53 శాతం పెరిగి 27.60 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతుల విలువ 62 శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు ఎగసింది. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్! -
ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు ఆహార కొరత రాకుండా భారత్ అండగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో గోదుమలు ఎగుమతి చేస్తూ యుద్ధ ప్రభావం పలు దేశాలపై తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే గోధుమల దిగుమతిలో రెండో స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. అయితే రష్యా యుద్ధంలో తీరిక లేకుండా ఉండటం, మరోవైపు రష్యా నుంచి దిగుమతుల విషయంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో చాలా దేశాలు గోదుమల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో భారత్ ప్రపంచ దేశాలకు 2.42 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 14 లక్షల టన్నుల గోదుమలను ఎగుమతి చేయగలిగింది. అంతేకాదు మేలో ఏకంగా 15 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేసేందుకు రెడీ అయ్యింది. ఇండియా నుంచి భారీ ఎత్తున గోదుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఈజిప్టు ప్రథమ స్థానంలో ఉండగా ఇజ్రాయిల్, టర్కీ, ఇండోనేషియా వంటి ఏషియా దేశాలు, మొజాంబిక్, టాంజానియా వంటి నార్త్ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి తరఫున కెన్యా, సోమాలియా, జిబోటీ వంటి దేశాలకు సరఫరా చేస్తోంది. గోదుమలతో పాటు ఇతర ఆహారా ధాన్యాలను భారీ ఎత్తున ఇండియా ఎగుమతి చేస్తోంది. చదవండి: బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు -
ఎగుమతులు ‘రికార్డు’ శుభారంభం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్ డాలర్లకు ఎగశాయి. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. భారీ వాణిజ్యలోటు... ఇక సమీక్షా నెల్లో దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్ డాలర్లు. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► పెట్రోలియం ప్రొడక్టులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల రంగాల ఎగుమతులు మంచి పురోగతిని సాధించాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 15.38 శాతం ఎగసి 9.2 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం ప్రొడక్టుల విలువ భారీగా 113.21 శాతం పెరిగి 7.73 బిలియన్ డాలర్లకు చేరడం సానుకూల అంశం. ► కాగా, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2.11 శాతం క్షీణించి 3.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► ఇక మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లును చూస్తే 81.21% పెరిగి 19.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 2021 ఏప్రిల్‌లో 2 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ తాజా సమీక్షా నెల్లో ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అయితే పసిడి దిగుమతులు మాత్రం భారీగా 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరింత ఊపందుకుంటాయ్... ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది. అంత క్రితం మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది. -
మెరిసిన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్ డాలర్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 25.40 బిలియన్ డాలర్లు. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021–22 మార్చిలో స్థూలంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3,393.29 మిలియన్ డాల ర్లు. 2020–21 ఇదే నెల్లో ఈ విలువ 3,409.07 మిలియన్ డాలర్లు. అంటే స్వల్పంగా 0.46 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ► గడచిన ఆర్థిక సంవత్సరం దేశం మొత్తం ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చురుకోగా ఇందులో 10వ వంతు సహకారం, రత్నాలు, ఆభరణాల రంగానికి కావడం హర్షణీయం. ► మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులలో కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్ సెగ్మెంట్ భారీగా 62 శాతం వాటాను పొందింది. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), బెల్జియం, ఇజ్రాయెల్ నుండి బలమైన డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో ఇటీవల వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకం చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. దీనివల్ల ఈ కీలకమైన వృద్ధి మార్కెట్ల మంచి అవకాశాలను పొందడానికి ఈ రంగం సిద్ధమవుతుంది. ఆయా దేశాల్లో డిమాండ్‌లో తగిన ప్రాధాన్యతను పొందేందుకు సిద్ధంగా ఉంది. ► 2021–22లో అన్ని రకాల స్టడెడ్ బంగారు ఆభరణాల షిప్మెంట్లు అంతకుముందు సంవత్సరంలో 2,768.97 మిలియన్ డాలర్లతో పోలిస్తే 95 శాతం వృద్ధిని సాధించి 5,352.52 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ► 2021–22లో వెండి ఆభరణాల స్థూల ఎగుమతులు 2,721.87 మిలియన్ డాలర్లు. 2020–21లో ఈ విలువ 2336.82 మిలియన్ డాలర్లు. ► రత్నాల స్థూల ఎగుమతుల 2021–22లో 66.82 శాతం వృద్ధితో 311.41 మిలియన్ డాలర్లకు చేరాయి. 2020–21లో ఈ విలువ 188.66 మిలియన్ డాలర్లు. లక్ష్యంలో భాగస్వామ్యం గ్లోబల్ మార్కెట్లకు భారతదేశం ఎగుమతులు 56 శాతం పుంజుకున్నాయి. ఇది ఈ రంగానికి శుభ పరిణామం. కో విడ్ లాక్డౌన్ సడలింపులు, మంచి డిమాండ్, అనిశ్చిత వ్యాపార వాతావరణ పరిస్థితి ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు ఈ రంగం ఎగుమతులు పురోగమించడానికి కారణం. ప్రభుత్వ 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నెరవేర్చడంలో మా పరిశ్రమ పెద్ద ఎత్తున దోహదపడింది. కొన్ని అదనపు అవసరమైన విధాన మద్దతు చర్యలు పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి. – కోలిన్ షా, జీజేఈపీసీ చైర్మన్ -
దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 3శాతం
సాక్షి, హైదరాబాద్: దేశం నుంచి జరిగే సరుకులు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ వాటా 3 శాతమని.. అన్నిరకాల సదుపాయాలను మెరుగుపర్చుకోవడం ద్వారా రాష్ట్రం తన వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ‘ఇండియా–యూఏఈ, ఇండియా– ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై భాగస్వాముల అవగాహన’కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులకు.. సూక్ష్మ–చిన్న–మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఈ ఒప్పందాలతో లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పారిశ్రామిక ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. తెలంగాణ పరిశ్రమలు, ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ సౌకర్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. ఫార్మాస్యూటికల్స్, లెదర్, రత్నాలు–ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి రంగాలలో ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాస్థాయి ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ఏర్పాటును ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు, 150 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
నెలకు 40 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటును 40 బిలియన్ డాలర్లు దాటి చరిత్ర సృష్టించాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు తాజాగా గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ► ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాల మేరకు భారత్ 420 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది. ► మొత్తం ఎగుమతులు 419.65 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 611.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 192.24 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు 102.63 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. ► ఇక ఒక్క సేవల రంగాన్ని చూస్తే, 2021–22లో ఎగుమతుల విలువ చరిత్రాత్మక గరిష్ట స్థాయి 249.24 బిలియన్ డాలర్లకు చేరింది. 2020–21 ఇదే కాలంతో పోల్చి చూస్తే (206.09 బిలియన్ డాలర్లు) విలువ 21 శాతం పెరిగింది. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 23.20% పెరిగి 144.70 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020–21లో ఈ విలువ 117.52 బిలియన్ డాలర్లు. వెరసి ఒక్క సేవల రంగంలో వాణిజ్య మిగులు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 17.94 శాతం పెరిగి 88.57 బిలియన్ డాలర్ల నుంచి 104.45 బిలియన్ డాలర్లకు చేరింది.