న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్‌లో భాగమైన అదానీ సోలార్‌కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్‌ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment