బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్ | Andhra Pradesh Creates New Record In Blue Economy Exports | Sakshi
Sakshi News home page

బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్

Published Tue, May 7 2024 5:24 PM | Last Updated on Tue, May 7 2024 5:24 PM

Andhra Pradesh Creates New Record In Blue Economy Exports

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.

ఓడరేవులు
రామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లు
మచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లు
మూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లు
కాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లు

ఫిషింగ్ హార్బర్‌లు
జువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లు
నిజాంపట్నం: రూ. 451 కోట్లు
మచిలీపట్నం: రూ. 422 కోట్లు
ఉప్పాడ: రూ. 361 కోట్లు
బుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లు
పూడిమడక: రూ. 392.53 కోట్లు
బియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లు
వొడరేవు: రూ. 417.55 కోట్లు
కొత్తపట్నం: రూ. 392.45 కోట్లు
మంచినీళ్లపేట: అప్‌గ్రేడేషన్

ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు
చింతపల్లి: రూ. 23.74 కోట్లు
భీమిలి: రూ. 24.86 కోట్లు
రాజయ్యపేట: రూ. 24.73 కోట్లు
దొండవాక: రూ. 23.90 కోట్లు
ఉప్పలంక: రూ. 5.74 కోట్లు
రాయదరువు: రూ. 23.90 కోట్లు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్‌ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.

ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement