Fishing harber
-
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న ఓ టీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి సమీపంలోనే హార్బర్ పెట్రోల్ బంక్ ఉంది. కానీ, ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. -
వలకు చిక్కని చేప
సాక్షి, అమరావతి బ్యూరో: మత్స్యకారుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే ఎదురవుతోంది. కొన్నాళ్లుగా సాగరంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వీరిలో అలజడిని రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ముగిసాక బోట్లలో వేటకెళ్లిన మత్స్యకారులకు పుష్కలంగా చేపలు లభ్యమవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా అరకొర చేపలే పడుతున్నాయి. కొన్నాళ్ల నుంచి సముద్రంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. మూడు, నాలుగు మైళ్ల వేగంతో.. సాగరం లోపల సాధారణంగా ‘వడి’ (నీటి ప్రవాహం) వేగం గంటకు ఒకట్రెండు మైళ్ల వేగం ఉంటుంది. అలాంటి సమయంలో మత్స్యకారుల వలలకు చేపలు ఎక్కువగా చిక్కుతాయి. కానీ ఇటీవల ‘వడి’ మూడు, నాలుగు మైళ్ల వేగంతో ఉంటోంది. ఫలితంగా ఆ వేగానికి వలలు చుట్టుకుపోయి చేపలు చిక్కకుండా పోతున్నాయి. జిల్లాలో 105 మెకనైజ్డ్, 2054 మోటారైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం మత్స్యకారులు చేపల వేట సాగిస్తుంటారు. వీరిలో కొందరు ట్యూనా చేపలను, మరికొందరు రొయ్యలను వేటాడుతుంటారు. ఒక్కో బోటు సముద్రంలో దాదాపు వారం రోజుల పాటు వేటను కొనసాగిస్తారు. ఇలా సాధారణంగా ఈ సీజనులో నాలుగైదు టన్నుల ట్యూనా చేపలు లభ్యమవుతాయి. వీటి ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. కానీ కొన్నాళ్ల నుంచి కనీసం ఒక్క టన్ను చేపలు దొరకడం కూడా గగనమవుతోందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో రొయ్యల వేట ద్వారా రూ.2 లక్షలు సమకూరేది. ప్రస్తుతం రూ.లక్ష విలువైన రొయ్యలు కూడా పడటం లేదని చెబుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న సైకం ఆంజనేయులు స్వగ్రామం మచిలీ పట్నం మండలం చినకరగ్రహారం. ఇటీవల రూ.30 వేల పెట్టుబడితో తన బోటును కళాసీలతో సముద్రంలో చేపల వేటకు పంపించారు. నాలుగు రోజుల పాటు వేట సాగిస్తే రూ.1,700 విలువైన చేపలు మాత్రమే లభ్యమయ్యాయి. గతంలోనూ వేటకు పంపిన బోటు అరకొర చేపలతోనే తిరిగొచ్చింది. ఇక నష్టాలను భరించలేక తన బోటును రేవులో కట్టేసి వేటను నిలిపివేశారు. 18 ఏళ్లుగా చేపలవేట వృత్తిలో ఉన్న తాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆంజనేయులు అంటున్నారు. ఒక్క ఆంజనేయులే కాదు.. సముద్రంలో వేట సాగించే జిల్లాలో పలువురి మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. నష్టాలే మిగులుతున్నాయి సముంద్రంలో కొన్నాళ్ల నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ‘వడి’ అధికంగా ఉండడం వల్ల చేపల లభ్యత కష్టతరంగా మారింది. పైగా వలలు దెబ్బతింటున్నాయి. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. డీజిల్ ధర అమాంతంగా పెరగడం, చేపలు లభ్యం కాకపోవడంతో నష్టాల పాలవుతున్నాం. ఈ నష్టాలను భరించలేక, మరో గత్యంతరం లేక బోట్లకు హార్బర్‌లోనే ఉంచేయాల్సి వస్తోంది. -శేఖర్, మత్స్యకారుడు, మచిలీపట్నం -
4 ఏళ్లలో 4 పోర్టులు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వ్యాపారంలో (బ్లూ ఎకానమీ) ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టి మూడు, నాలుగేళ్లలో పూర్తిచేసేలా అడుగులు వేస్తోంది. అలాగే, ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు ద్వారా మత్స్యరంగంలో అనూహ్య మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. ఎగుమతులు,దిగుమతులు మూడింతలు పెంపు దేశంలో గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. ప్రస్తుతం ఒక మేజర్ పోర్టు, 16 మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిద్వారా (విశాఖ మేజర్ పోర్టును మినహాయించి) ఏటా 103 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. వీటిని మూడింతలు పెంచేలా పోర్టుల ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు ప్రణాళిక రూపొందించింది. అలాగే.. ► 2024 సంవత్సరానికల్లా భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టుల నిర్మాణం పూర్తిచేసి కార్గో ఎగుమతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ► సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ► రూ.3,800 కోట్ల అంచనాతో రామాయపట్నం, రూ.4 వేల కోట్ల అంచనాతో మచిలీపట్నం పోర్టుల సవివర నివేదికలు (డీపీఆర్) ఇప్పటికే తయారయ్యాయి. ► రూ.3,200 కోట్ల అంచనాతో భావనపాడు పోర్టు సవివర నివేదిక ఈ నెల పదో తేదీకల్లా సిద్ధం కానుంది. ► కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టును ప్రైవేటుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే జీఎంఆర్‌కు అప్పగించారు. త్వరలో అది ఫైనాన్షియల్ క్లోజర్‌కు రానుంది. ► ఈ నాలుగింటినీ చేపట్టేందుకు ఈ నెలలోనే పీఎంసీ (ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్)ని నియమించనున్నారు. ► నెలరోజుల్లో ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ► ఇక భావనపాడు, రామాయపట్నం పోర్టులను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. ► మచిలీపట్నం పోర్టును పీపీపీ విధానంలో చేపడతారు. ► ఈ నాలుగు పోర్టుల ద్వారా సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసే అవకాశం ఉంది. ఫిషింగ్ హార్బర్లతో అనూహ్య మార్పు మత్స్యకారుల అవసరాలు తీర్చేలా రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎనిమిది ఆధునిక ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయి. అవి.. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణాజిల్లా మచిలీపట్నం రెండో దశ, గుంటూరు జిల్లా నిజాంపట్నం రెండో దశ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెలలో వీటికి టెండర్లు పిలవనున్నారు. ► సాధారణ హార్బర్లలా కాకుండా మత్స్యకారులకు ఉపయోగపడేలా.. మార్కెటింగ్, నిల్వకు ఇబ్బంది లేకుండా అందులోనే ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తున్నారు. ► ఒక్కో హార్బర్ నిర్మాణానికి రూ.250కోట్ల నుంచి రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ► కేంద్ర ప్రభుత్వం, నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా వీటికి అవసరమైన నిధులు సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. ► ఈ ఫిషింగ్ హార్బర్లలోనే ఒకటి, రెండు బెర్తులు ఏర్పాటుచేయడానికి సాధ్యాసాధ్యాలను మారిటైమ్ బోర్డు పరిశీలిస్తోంది. కోస్ట్‌గార్డ్ ఈ తరహా బెర్తులను తీసుకుని పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది. ► రాబోయే రోజుల్లో కోస్టల్ షిప్పింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ తరహా ఆలోచన చేస్తున్నారు. ► జువ్వలదిన్నె ఇందుకు అనువుగా ఉందని ఇప్పటికే నిర్ధారించారు. మిగిలిన హార్బర్లలోనూ ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. 2024కి నాలుగు పోర్టులు పూర్తి చేస్తాం నాలుగు పోర్టులను 2024 నాటికి పూర్తిచేసి కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసేలా కార్యాచరణ రూపొందించాం. ఎనిమిది ఆధునిక హార్బర్లను కూడా చేపట్టనున్నాం. ఈ నెలలోనే వీటికి టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. పోర్టులు, హార్బర్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా ముందుకెళ్తున్నాం. – రామకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ -
ఫిషింగ్ హార్బర్లో మరో బోటు దగ్ధం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఫిషింగ్ హార్బ ర్లో మరో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జీరో జెట్టీ మీద నిలిపి ఉంచిన మరబోటు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. దంగా ఎలమాజీకి చెందిన ఎఫ్‌వీఎస్‌ఎం 762–ఎంఎం 244 నంబరు గల బోటు వారం రోజుల పాటు వేట సాగించి గురువారం తీరానికి చేరుకుం ది. మత్స్య సంపదను ఖాళీ చేసిన సిబ్బంది ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. తిరిగి బోటును వేటకు పంపేందుకు శుక్రవారం ఉద యం బోటు సైలెన్సర్‌కు మరమ్మతు చేసేం దుకు వెల్డింగ్ పనులు ప్రారంభించారు. ఈ సమయంలో నిప్పురవ్వలు పక్కనే ఉన్న డీజిల్‌కు అంటుకోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే బోటులోంచి బయటకు వచ్చి పరిసరాల్లో ఉన్న వారిని హెచ్చరించారు. దీంతో మిగిలిన బోట్లను దూరంగా తరలించారు. అగ్ని ప్రమాదానికి గురైన బోటులోని సామగ్రిని కొంతవరకూ ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో బోటు డెక్, ఇంజన్, ఫిష్ హోల్డ్(వేటలో చేపలను భద్రపరిచే గదులు), వలలు, గేర్‌బాక్స్, తదితర పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం జరిగిందని బోటు యజమాని ఎలమాజి వాపోయాడు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలాన్ని చేరుకున్న రాష్ట్ర అగ్నిమాపక శకటాలు మంటలు వ్యాపించకుండా అదుపు చేశాయి. సంఘటన స్థలాన్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఉమాకాంత్, మత్స్యశాఖ ఏడీ లక్ష్మణరావు, పోర్టు అధికారులు సందర్శించారు. తరచూ ప్రమాదాలతో బెంబేలు ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలతో మత్స్యకారులు బెంబేలెత్తుతున్నారు. ఫిబ్రవరి 17న జీరో జెట్టీ మీద నిలిపి ఉంచిన బోటు, 18న ఫిషింగ్ హార్బర్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న సుమారు 25 బడ్డీలు కాలిపోయాయి. 24న 11వ నంబరు జెట్టీలో ఉంచిన బోటు దగ్ధం కాగా.. ఓ కార్మికుడు మంటల్లో చిక్కుకుని మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శుక్రవారం జీరో జెట్టీ మీద ఉంచిన బోటు ఇంజను రూంలో మంటలు చెలరేగి సుమారు రూ.15 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. -
ఫిషింగ్ హార్బర్లో మంటలు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా వాకలపూడిలోని ఫిష్పింగ్ హార్బర్లో బుధవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బోటు క్యాబిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో మత్స్యకారులు భయాందోళనలకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.