ఇంజన్ రూం నుంచి పొగలు చిమ్ముతున్న బోటు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఫిషింగ్ హార్బ ర్లో మరో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జీరో జెట్టీ మీద నిలిపి ఉంచిన మరబోటు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. దంగా ఎలమాజీకి చెందిన ఎఫ్‌వీఎస్‌ఎం 762–ఎంఎం 244 నంబరు గల బోటు వారం రోజుల పాటు వేట సాగించి గురువారం తీరానికి చేరుకుం ది. మత్స్య సంపదను ఖాళీ చేసిన సిబ్బంది ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. తిరిగి బోటును వేటకు పంపేందుకు శుక్రవారం ఉద యం బోటు సైలెన్సర్‌కు మరమ్మతు చేసేం దుకు వెల్డింగ్ పనులు ప్రారంభించారు. ఈ సమయంలో నిప్పురవ్వలు పక్కనే ఉన్న డీజిల్‌కు అంటుకోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే బోటులోంచి బయటకు వచ్చి పరిసరాల్లో ఉన్న వారిని హెచ్చరించారు.
దీంతో మిగిలిన బోట్లను దూరంగా తరలించారు. అగ్ని ప్రమాదానికి గురైన బోటులోని సామగ్రిని కొంతవరకూ ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో బోటు డెక్, ఇంజన్, ఫిష్ హోల్డ్(వేటలో చేపలను భద్రపరిచే గదులు), వలలు, గేర్‌బాక్స్, తదితర పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం జరిగిందని బోటు యజమాని ఎలమాజి వాపోయాడు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలాన్ని చేరుకున్న రాష్ట్ర అగ్నిమాపక శకటాలు మంటలు వ్యాపించకుండా అదుపు చేశాయి. సంఘటన స్థలాన్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఉమాకాంత్, మత్స్యశాఖ ఏడీ లక్ష్మణరావు, పోర్టు అధికారులు సందర్శించారు.
తరచూ ప్రమాదాలతో బెంబేలు
ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలతో మత్స్యకారులు బెంబేలెత్తుతున్నారు. ఫిబ్రవరి 17న జీరో జెట్టీ మీద నిలిపి ఉంచిన బోటు, 18న ఫిషింగ్ హార్బర్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న సుమారు 25 బడ్డీలు కాలిపోయాయి. 24న 11వ నంబరు జెట్టీలో ఉంచిన బోటు దగ్ధం కాగా.. ఓ కార్మికుడు మంటల్లో చిక్కుకుని మరణించాడు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శుక్రవారం జీరో జెట్టీ మీద ఉంచిన బోటు ఇంజను రూంలో మంటలు చెలరేగి సుమారు రూ.15 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment