రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా అక్కడ అభివృద్ధి ఆధారపడుతుంది. పరిశ్రమలు, వ్యవసాయం, సాంకేతికత, ఐటీ..ఇలా చాలా రంగాల ద్వారా రాష్ట్రాలకు రాబడి ఉంటుంది. 2022-23 సంవత్సరానికిగాను స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను కొన్ని సర్వేలు వెల్లడించాయి. తలసరి స్థూల నికర రాష్ట్రీయోత్పత్తి(నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ 10 స్థానాల్లో నిలిచింది. 2019 నుంచి మార్చి 2023 వరకు దాదాపు రూ.6600 కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. రాష్ట్ర జనాభా ఆధారంగా తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో సిక్కిం రూ.5.19లక్షలుతో మొదటిస్థానంలో ఉంది. గోవా-రూ.4.72లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. బిహార్ రూ.54వేలతో చివరి స్థానంలో ఉంది.
- సిక్కిం: రూ.5.19లక్షలు
- గోవా: రూ.4.72లక్షలు
- ఆంధ్రప్రదేశ్: రూ.2.19లక్షలు
- అరుణాచల్ ప్రదేశ్: రూ.2.05లక్షలు
- అస్సాం: రూ.1.18లక్షలు
- బిహార్: రూ.54వేలు
- ఛత్తీస్‌గఢ్: రూ.1.33లక్షలు
- గుజరాత్: రూ.2.41లక్షలు
- హరియాణా: రూ.2.96లక్షలు
- హిమాచల్ ప్రదేశ్: రూ.2.22లక్షలు
- ఝార్ఖండ్: రూ.91వేలు
- కర్ణాటక: రూ.3.01లక్షలు
- కేరళ: రూ.2.33లక్షలు
- మధ్యప్రదేశ్: రూ.1.4లక్షలు
- మహారాష్ట్ర: రూ.2.24లక్షలు
- మణిపుర్: రూ.91వేలు
- మేఘాలయ: రూ.98వేలు
- మిజోరం: రూ.1.98లక్షలు
- నాగాలాండ్: రూ.1.25లక్షలు
- ఒడిశా: రూ.1.5లక్షలు
- పంజాబ్: రూ.1.73లక్షలు
- రాజస్థాన్: రూ.1.56లక్షలు
- తమిళనాడు: రూ.2.73లక్షలు
- తెలంగాణ: రూ.3.08లక్షలు
- త్రిపుర: రూ.1.59లక్షలు
- ఉత్తర్ ప్రదేశ్: రూ.83వేలు
- ఉత్తరాఖండ్: రూ.2.33లక్షలు
- పశ్చిమ బెంగాల్: రూ.1.41లక్షలు
- నాగాలాండ్: రూ.1.25లక్షలు
- జమ్మూ కశ్మీర్: రూ.1.32లక్షలు
Comments
Please login to add a commentAdd a comment