దేశ జీడీపీలో 38 శాతానికి చేరిన వ్యక్తిగత రుణాలు
వ్యక్తిగత పొదుపుతో పోలిస్తే.. అప్పులే రెండు రెట్లు అధికం
వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం ఇంటి రుణాలే
ఆందోళన కలిగిస్తున్న క్రెడిట్ కార్డు వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు పెరుగుదల.. కేర్‌ఎడ్జ్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారా. అవునంటోంది కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ. మనవాళ్లు పొదుపు చేయడం కంటే.. అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులు ఉన్నట్టు కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని పేర్కొంది. దేశ జీడీపీలో వ్యక్తిగత అప్పులు ఏకంగా 38 శాతానికి చేరాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.173.82 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంటే.. అందులో 38 శాతం అంటే సుమారు రూ.66 లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్లు చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్ జీడీపీలో వ్యక్తిగత అప్పులు 35 శాతం, దక్షిణాఫ్రికాలో 34 శాతానికే పరిమితమైనట్టు కేర్‌ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో 24 శాతానికే అంటే రూ.42 లక్షల కోట్లకే పరిమిత మైంది.
అప్పులతో ‘రియల్’ పరుగులు
మొత్తం వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం గృహరుణాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం వ్యయం చేస్తుండటాన్ని ఆహ్వానించింది.
అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు, రియల్ ఎస్టేట్ వంటి సంపద సృష్టికి విని యోగంచడం సంతోషం కలిగించే విషయంగా పేర్కొంది. దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటికంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయ డానికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు విని యోగిస్తారని, కానీ.. భారత దేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడీపీలో వ్యక్తిగత అప్పులు 38 శాతానికి చేరినా అది ప్ర మాదకర స్థాయి కాదని వెల్లడించింది. ఈ అప్పు లు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ఇతర అప్పులు వస్తే క్రెడిట్ కార్డు వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు భారీగా పెరుగు తున్నట్టు హె చ్చరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత ఆదా యం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment