మరో 50 ఏళ్లలో దేశాభివృద్ధి ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

మరో 50 ఏళ్లలో దేశ అభివృద్ధి ఎంతో తెలుసా..

Published Mon, Apr 15 2024 12:30 PM

Inidan Economy Will Became Touches 50 Trillion USD Mark In 2075 - Sakshi

ప్రపంచంలో 2075 సంవత్సరం వరకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే దేశాలను అంచనావేస్తూ గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక విడుదల చేసింది. భారత్‌ ఇప్పటికే 4 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేసిన విషయం తెలిసిందే.

  • చైనా: 57 ట్రిలియన్ డాలర్లు
  • భారతదేశం: 52.5 ట్రిలియన్ డాలర్లు
  • యునైటెడ్ స్టేట్స్: 51.5 ట్రిలియన్ డాలర్లు
  • ఇండోనేషియా: 13.7 ట్రిలియన్ డాలర్లు
  • నైజీరియా: 13.1 ట్రిలియన్ డాలర్లు
  • ఈజిప్ట్: 10.4 ట్రిలియన్ డాలర్లు
  • బ్రెజిల్: 8.7 ట్రిలియన్ డాలర్లు
  • జర్మనీ: 8.1 ట్రిలియన్ డాలర్లు
  • మెక్సికో: 7.6 ట్రిలియన్ డాలర్లు
  • యూకే: 7.6 ట్రిలియన్ డాలర్లు
  • జపాన్: 7.5 ట్రిలియన్ డాలర్లు
  • రష్యా: 6.9 ట్రిలియన్ డాలర్లు
  • ఫిలిప్పీన్స్: 6.6 ట్రిలియన్ డాలర్లు
  • ఫ్రాన్స్: 6.5 ట్రిలియన్ డాలర్లు
  • బంగ్లాదేశ్: 6.3 ట్రిలియన్ డాలర్లు

కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి గతంలో చేసిన ప్రకటన ప్రకారం.. 1980–81లో భారత్‌ ఎకానమీ పరిమాణం 189 బిలియన్‌ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్‌ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారింది.

ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం

2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్‌ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్న భారత్‌ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా.  2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిగా కొనసాగుతోంది.

Advertisement
Advertisement