ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 17 వరకు భారతదేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.7 శాతం పెరిగి రూ.13.70 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది.
మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ. 6.95 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను కలిపి రూ. 6.73 లక్షల కోట్లుగా ఉంది.
ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సంవత్సరానికి 17 శాతం పెరిగి రూ.15.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 7.90 లక్షల కోట్లు, స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను రూ. 8.03 లక్షల కోట్లుగా ఉందని డిసెంబర్ 18న మంత్రిత్వ శాఖ తెలిపింది.
10.5 శాతం వృద్ధితో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24లో రూ. 18.2 లక్షల కోట్లుగా ఉందని అంచనా. తాత్కాలిక డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.25 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా రీఫండ్‌లను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment