సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరే రోజు, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే రోజు రానే వచ్చింది. ఈ రోజు బాలరాముని దర్శనం కేవలం ప్రముఖులకు మాత్రమే.. రేపటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా వేలకోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదికలు చెబుతున్నాయి.
రామ మందిర నిర్మాణంతో అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశం కానుంది. గతంలో కంటే ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
2024-25 ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ రూ.20000 నుంచి రూ.25000 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయం రెట్టింపు అవుతుందని, ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి.
ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్
2022లో ఉత్తరప్రదేశ్ సందర్శించిన పర్యాటకులు 32 కోట్లు, ఇందులో 2.21 కోట్లమంది జనాభా అయోధ్యకు వచ్చారు. పర్యాటకులు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తరప్రదేశ్, అయోధ్య రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది.
2027 నాటికి ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని, దేశ జీడీపీలో ఇది 10శాతం అని చెబుతున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజ్‌లో ఉత్తరప్రదేశ్ 2వ స్థానం పొందుతుందని సమాచారం. నార్వే జీడీపీని అప్పటికి ఉత్తరప్రదేశ్ అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment