
2019–24 మధ్య ఏపీ నుంచి 15.74 లక్షల టన్నుల ఎగుమతి
మత్స్య ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి రూ.90.633 కోట్ల ఆదాయం
కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం నుంచి 2019–24 మధ్య 15.74లక్షల టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేశారు. దీనిద్వారా రూ.90,633కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఏపీలో మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు.
మత్స్య రంగానికి, రైతులకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకమే ఇందుకు కారణమని ప్రకటించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11లక్షల టన్నులు మత్స్య సంపద మాత్రమే ఎగుమతి అయినట్లు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో అనూహ్యంగా 15.74 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు చేసినట్లు వివరించారు. అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు.
జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆక్వా సాగు
రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందించడం, ధరలు పతనం కాకుండా చూడటం వంటి అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో 1.75లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులు 39 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెరిగాయి. రొయ్యల దిగుబడులు 4.54లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment