Aquaculture
-
కనుమరుగు రొయ్యో..!
కూటమి సర్కారు కుట్ర.. అందని ప్రోత్సాహకం.. పెరిగిన విద్యుత్ చార్జీలు.. నాసిరకం రొయ్య పిల్లల ఉత్పత్తి.. క్షీణించిన ఎగుమతులు.. దక్కని గిట్టుబాటు ధరలు.. వెరసి.. ఆక్వాకల్చర్ చతికిలపడింది. కొనేనాథులు లేక హేచరీలు మూతపడ్డాయి.. ఫలితంగా రొయ్యల చెరువులు వరి మడులుగా మారాయి. కుబేరులుగా మారిన ఆక్వా రైతులు ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. వాకాడు: నాడు రొయ్యల సాగు చేసిన రైతులు, హేచరీల యజమానులు కుబేరులుగా మారారు. అయితే నేడు రొయ్యల పరిశ్రమకు గడ్డు కాలం వచ్చింది. దీంతో తిరుపతి జిల్లాలో ఆక్వా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి కావడంతో విదేశీ మారక ద్రవ్యం బాగా పెరిగి ఎంతో మంది రైతులు కుబేరులుగా మారా రు. దీంతో ఆక్వాసాగు నలు మూలలకు విస్తరించింది.అనేక ప్రాంతాల్లో రైతులు, చిన్న చిన్న వ్యాపా రులు, ఉద్యోగులు సైతం లాభాలు గడించేందుకు తమ వృత్తులకు స్వస్తి పలికి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. ఆక్వా సాగుకు అనుగుణంగా జిల్లా సముద్ర తీరం వెంబడి 24 రొయ్య పిల్లల కేంద్రాలు వెలిశాయి. అందులో వాకాడు మండలంలో 23, కోట మండలంలో ఒక హేచరీ ఉన్నాయి. ఎక్కువసార్లు పిల్లల ఉత్పత్తితో నాణ్యత క్షీణత రొయ్యి పిల్లలను ఉత్పత్తి చేసే బ్లోడర్స్ విషయంలో హేచరీల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక తల్లి రొయ్యి (బ్లోడర్)తో మూడు సార్లు మాత్రమే రొయ్యి పిల్లలు పెట్టించాలి. అలా జరిపితేనే సాగు సక్సెస్ అవుతుంది. అదే తరహాలోనే వైరస్ లేకుండా మంచి దిగుబడులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియ ఏ ఒక్క హేచరీలో కూడా జరగడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని హేచరీలు తొలి కాన్పులో పెట్టించిన పిల్లలు, అలాగే 7, 8 కాన్పుల్లో పెట్టించిన పిల్లలను మిక్సింగ్ చేసి రైతులకు అంటగడుతున్నారు. ఇలా చేయడంతో అవి చెరువుల్లో ఎదుగుదల తగ్గిపోయి వివిధ సైజుల్లో పెరుగుతున్నాయి. ప్రతి హేచరీకి ఇతర దేశాల నుంచి నాణ్యమైన బ్లోడర్స్ వస్తాయని రైతులకు ఒక నమ్మకం ఉంది. కాని ఇతర దేశాల నుంచి ఒక తల్లి రొయ్యను (బ్లోడర్)ను తెప్పించి దాంతోపాటు లోకల్ బ్లోడర్స్ని కలిపి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ హేచరీలపై నమ్మకం లేని ఆక్వా రైతులు పాండిచ్చేరి, భీమవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి సీడ్ కొనుగోలు చేసేవారు.జిల్లాలోనే మొట్ట మొదటిసారి.. 1990–91లో తిరుపతి జిల్లా వాకాడు మండల తీర ప్రాంత గ్రామాలు అందలమాట, వాలమేడు ప్రాంతాల్లో రొయ్యిల సాగు ప్రారంభమైంది. అప్పటి నుంచి కనక వర్షం కురిపించిన ఆక్వా రంగం అందరినీ ఆకర్షించింది. అనేక ప్రాంతాల్లోని పలువురు రైతులు లాభాలు గడించేందుకు వరి పంటలను వదిలేసి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. అప్పట్లో వరి సాగు విస్తార్ణం తగ్గిపోయి ఆక్వా సాగు పెరిగిపోయింది. వరుస నష్టాలతో రైతులు ఆక్వా సాగును వదిలేసి మళ్లీ వరిసాగులోకి వస్తున్నారు.ఆక్వా రైతుకు జగనన్నఅండగత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు అండగా నిలిచారు. రొయ్య సాగు చేసే రైతులకు పలు రాయితీ ఇచ్చి, వారిని ఆదుకున్నారు. దీంతో ఆగిపోయిన రొయ్య ఎగుమతులను కరోనాలో సైతం యూరోపియన్ దేశాలకు ఎగుమతి జరిగింది. అదే సమయంలో ఆక్వా రైతుల కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో డాలర్ల సేద్యంగా మారిన టైగర్ రొయ్యల సాగుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 6 హేచరీల ద్వారా టైగర్ రొయ్య పిల్లల ఉత్పత్తికి అనుమతి లభించగా అందులో ఒక ఏపీలోనే 5 హేచరీలకు అనుమతులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాకు 3 హేచరీలకు టైగర్ సీడ్ ఉత్పత్తికి అనుమతి లభించించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా 76 రొయ్య పిల్లల హేచరీలు ఉండగా అందులో 3 హేచరీల్లో మాత్రమే టైగర్ సీడ్‌తోపాటు, లార్వా రేరింగ్ ఉత్పత్తికి అనుమతి లభించింది. అయితే నేడు హేచరీల యజమానులు 30 పైసలకు రొయ్యిపిల్లను విక్రయిస్తున్నా కొనే వారు కరువయ్యారు.కొనేవారు లేక మూత పడిన 20 హేచరీలుతిరుపతి జిల్లాలో తీరం వెంబడి 17 రొయ్య పిల్లల ఉ త్పత్తి హేచరీలు ఉన్నాయి. అందులో 3 హేచరీలు మాత్రమే ప్రస్తుతం అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. జిల్లాలో 2022 వరకు 4 వేల హెక్టార్లలో ఆక్వా సాగు సాగేది. అయితే రాను రాను రొయ్యల సాగులో రైతులకు నష్టాలే మిగలడంతో ఒక్కొక్కరుగా సాగుకు దూరమయ్యారు.ప్రస్తుతం చిల్లకూరు, గూ డూరు, కోట, వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో కేవలం 800 హెక్టార్లలో మాత్రమే సాగు ఉంది. దీంతో రొయ్య పిల్లలు కొనే వారు లేక హేచరీలు ఒక్కొక్కటి గా మూత పడ్డాయి. హేచరీల యజమానులకు వ్యాపారాలు లేక పెట్టిన పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. ఒక హేచరీ ని ర్మించాలంటే దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.11 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. అందులో దాదాపు 50 నుంచి 100 మంది వరకు వర్కర్లు ఉంటారు. ఒక్కొక్కరికి రూ.15 నుంచి రూ.40 వేలు వరకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కూటమి సర్కారు హేచరీలకు కరెంటు బిల్లులపై రాయితీ ఇస్తామని చెప్పి రూ.6.50కు పెంచి మోసం చేయడంతో మ రింత భారం పడింది. దీంతో ఏటా రూ.కో ట్లల్లో నష్టాలు రావడంతో హేచరీ నిర్వాహకులు నష్టాలు భరించలేక చేతులు ఎత్తేశారు. వేలాది మంది పనిలేక రోడ్డున పడ్డారు. నాణ్యమైన తల్లి రొయ్యతోనే అధిక దిగుబడి అధిక నాణ్యత కలిగిన రొయ్య పిల్లలను స్థిరంగా ఉత్పత్తి చేయడం, అలాగే రొయ్యల సాగు అవసరాలను తీర్చడానికి తీరంలో హేచరీలను ఏర్పాటు చేశారు. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఒకప్పుడు అమెరికా నుంచి అర్డిలైన్, పేనెట్ తదితర కంపెనీల నుంచి తల్లి రొయ్యలు రాష్టానికి వచ్చేవి. ఆయా కంపెనీలకు ముందుగా హేచరీల యజమాను లు ఒక్కో తల్లి రొయ్యకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు వరకు నగదు చెల్లించి ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ తరువాత బ్రోడర్స్(తల్లి రొయ్యలు) అమెరికా నుంచి ప్రభుత్వ మత్స్యశాఖ ల్యాబ్‌లకు వస్తాయి. అక్కడ పూర్తి స్థాయిలో తల్లిరొయ్యకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే బుకింగ్ చేసుకున్న ఆయా హేచరీలకు చేరుతాయి. హేచరీలకు చేరిన తరువాత మళ్లీ కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ(సీఏఏ) వారు పరిశీలన అనంతరం వారి అనుమతి మేరకు వాటి ద్వారా గుడ్లు పెట్టించడం జరుగుతుంది. జిల్లాలో అనుమతి లభించిన హేచరీలన్నీ వంద మిలియన్ల సీడ్ ఉత్పత్తి చేసే సామర్థం కలిగినవే. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులకు లోబడి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. తద్వారా ఉత్పత్తి చేసిన పిల్లలకు ఎలాంటి వ్యాధులు లేకుండా, మంచి పెరుగుదల వచ్చేటట్లు ముందుస్తు పరీక్షలు నిర్వహించి రైతులకు ఇవ్వాలి. ఇలా చేయడంతో రైతులు అనుకున్న దిగుబడుల కంటే అధనపు దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఇలా చేయడంతో 1996–2012 మధ్య కాలంలో రొయ్యల దిగుబడులు అధికంగా రావడం, ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడి ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ మొత్తంలో రొయ్యిలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం వచ్చేది. ఆక్వా కల్చర్ తగ్గిన మాట వాస్తవమేజిల్లాలో 24 రొయ్య పిల్లల హేచరీలున్నాయి. అందులో మూడు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. వివిధ కారణాలతో కల్చర్ తగ్గిన మాట వాస్తవమే. దీంతో హేచరీలు షట్‌డౌన్ అయ్యాయి. త్వరలోనే కల్చర్ పూర్తిస్థాయిలో ప్రారంభించి, గతంలో మాదిరి అన్ని హేచరీలు పనిచేస్తాయని అనుకుంటున్నాను. – నాగరాజు, జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ తిరుపతి -
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు
సాక్షి, అమరావతి: సాలికోర్నియా.. సముద్ర తీరం వెంబడి ఉప్పునీటి ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే ఈ మొక్కలను సంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని విమానాల్లో సైతం ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పును తట్టుకుని పుషి్పంచే మొక్కల జాతికి చెందిన సాలికోర్నియా మొక్కల్లో 50 శాతం వరకు సోడియం క్లోరైడ్ నిండి ఉంటుంది. ఇందులోని లవణీయత సంప్రదాయ సముద్ర ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. వీటి నుంచి తీసే ఉప్పును హెర్బల్ సాల్ట్, గ్రీన్ సాల్ట్‌గా పిలుస్తున్నారు. ప్రొటీన్లు.. విటమిన్లూ ఉన్నాయ్ సాలికోర్నియా మొక్కల్లో 11 శాతం ప్రొటీన్లు, 20 శాతం ఫైబర్, జింక్, పొటాషియం, ఏ, బీ–1, బీ–12, బీ–15, సీ, ఈ విటమిన్లు అపారంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు. రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గ్రీన్ సాల్ట్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా దేశాల్లో ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసే ఉప్పును అన్ని వంటకాల్లో వాడుతున్నారు. సీఎస్ఎంసీఆర్ఐ సాంకేతిక సహకారం గుజరాత్ భావనగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సాలికోర్నియా మొక్కల నుంచి ఉప్పు తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ప్రత్యామ్నాయ ఉప్పు తయారీకి సంబంధించిన అన్ని శాస్త్రీయ, సాంకేతిక సహాయాలను అందిస్తోంది. సాలికోర్నియా మొక్కల సాగు, కోత, మొక్కల్ని ఎండబెట్టడం, ఇతర ప్రక్రియల ద్వారా ఎకరాకు టన్ను ఉప్పు వస్తుందని సీఎస్ఎంసీఆర్ఐ చెబుతోంది. రూ.15 వేల పెట్టుబడితో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని సౌదీ దేశాలలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయట. ఏపీలోనూ సాగుకు అవకాశాలు రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పెద్దఎత్తున విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తీరం వెంబడి రిజర్వ్ మడ అడవుల్లో సాలికోర్నియా మొక్కలు విస్తారంగా ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఈ మొక్కల జాడను సీఎస్ఎంసీఆర్ఐ గుర్తించింది. ఉప్పునీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా సాలికోర్నియా మొక్కల సాగు నిలుస్తుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇండోర్‌లో కూడా సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే ఈ మొక్కల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆర్బీకేల ద్వారా చేప పిల్లలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా చేప, రొయ్య మేతలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నాణ్యమైన చేపల సీడ్‌ను కూడా సరఫరా చేయబోతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఉండగా.. ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లోని ఆర్బీకేలలో 734 మంది మత్స్య సహాయకులు సేవలందిస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వా సాగు నమోదుతో పాటు ఆక్వా చెరువులకు లైసెన్సులు సైతం జారీ చేస్తున్నారు. దిగుబడుల్లో నాణ్యత పెంచేందుకు చెరువుల్లో శాంపిల్స్ సేకరించి వాటర్ క్వాలిటీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఆక్వా సాగులో కీలకమైన ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారానే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న మత్స్య శాఖ ఆర్బీకేల ద్వారా 2,736 టన్నుల చేప, రొయ్యల మేతలను రైతులకు సరఫరా చేసింది. 54 సీడ్ ఫామ్స్‌తో అనుసంధానం ఇకపై చేపల రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన సీడ్ సరఫరా చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మత్స్య సహాయకులకు ఇచ్చిన ట్యాబ్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసింది. ఈ–మత్స్యకార యాప్ ద్వారా రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌ను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సాగునీటి వనరుల్లో నాణ్యమైన మత్స్య దిగుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌లో పెద్దఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని ఆర్బీకేల ద్వారా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఆర్బీకేల ద్వారా బుకింగ్ చేసి జిల్లాల వారీగా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఫిష్ ఫామ్స్‌తో పాటు రైతుల ద్వారా 10.13 కోట్ల సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1,817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉండగా.. వాటికి 10.10 కోట్ల సీడ్ అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 3.09 కోట్ల ఫిష్ సీడ్‌ను ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. వీటిని ఆయా ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన మత్స్యకారులు వేటసాగిస్తూ జీవనోపాధి పొందనున్నారు. మలి దశలో రైతులకు కావాల్సిన ఫిష్ సీడ్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాణ్యమైన చేప పిల్లల సరఫరాయే లక్ష్యం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నాం. మలిదశలో రైతులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు సన్నాహాలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ -
మరింత మందికి ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్న ప్రభుత్వం మరింతమందికి లబ్దిచేకూర్చాలని సంకల్పించింది. జోన్ పరిధిలో అసైన్డ్ భూములతో సహా వివిధరకాల ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న వారితోపాటు దేవదాయ భూములను లీజుకు తీసుకుని సాగుచేస్తున్న పదెకరాల్లోపు వారికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ భూముల హక్కులు ప్రభుత్వ, ఆయా దేవస్థానాల పేరిట నమోదై ఉండడంతో ఆక్వా సబ్సిడీ వర్తింపునకు సాంకేతికంగా ఇబ్బంది నెలకొంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అయా భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్న రైతులందరికి సబ్సిడీ వర్తించేలా వెసులుబాటు కల్పించింది. ఈ ఫిష్ సర్వే ప్రకారం 1,72,514 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 3,14,313 ఎకరాల్లోను, 4,691 మంది పదెకరాలకు పైగా విస్తీర్ణంలో.. మొత్తం 1,17,780 ఎకరాల్లోను ఆక్వా సాగుచేస్తున్నారు. నోటిఫైడ్ ఆక్వాజోన్ పరిధిలో 2,49,348 ఎకరాల్లో 1,00,792 మంది సాగుచేస్తున్నారు. వీరిలో 98,095 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,86,218 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నాన్ ఆక్వాజోన్ పరిధిలో 74,419 మంది 1,28,095 ఎకరాల్లో సాగుచేస్తుండగా, 76,413 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,82,744 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. జోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుదారులందరికీ ఈ నెల 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు.. జోన్ పరిధిలో పదెకరాల్లోపు అసైన్డ్‌తో సహా వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేస్తున్న వారికి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబును ఆదేశించారు. దీంతో మత్స్యశాఖాధికారులు జోన్ పరిధిలో అసైన్డ్ ల్యాండ్స్, వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్నవారిని గుర్తించి వారికి విద్యుత్ సబ్సిడీ వర్తించేలా చర్యలు చేపట్టారు. ఈ జాబితాలను తయారుచేసి ఆయా డిస్కమ్‌లకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హతగల ఆక్వాజోన్ ప్రాంతాల గుర్తింపునకు చేపట్టిన సర్వే పూర్తికాగా, వాటికి గ్రామసభతోపాటు జిల్లాస్థాయి కమిటీలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిస్కమ్‌లకు జాబితాలు ఆక్వాజోన్‌లో పదెకరాల్లోపు అర్హత కలిగిన విద్యుత్ కనెక్షన్ల వివరాలను డిస్కమ్‌లకు పంపించాం. వాటికి యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జోన్ పరిధిలో ఉన్న అసైన్డ్, ఇతర ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేసే పదెకరాల్లోపు రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టాం. ఈ జాబితాలను డిస్కమ్‌లకు పంపిస్తున్నాం. నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హమైన ప్రాంతాలను గుర్తించి జోన్ పరిధిలోకి బదలాయించేందుకు చర్యలు చేపట్టాం. – కూనపురెడ్డి కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్
కైకలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్ధనరెడ్డి చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని గోపవరం గ్రామంలో 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో పద్మ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సబ్సిడీ పొందని అర్హులైన ఆక్వా రైతులు ఆయా ప్రాంతాల డీఈలకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్) సాంకేతిక బిడ్లను పూర్తి చేసి ఆర్థిక అనుమతులకు పంపించామని పేర్కొన్నారు. సాంకేతికతను అందరూ ఆహ్వానించాలని కోరారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటివల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందన్నారు. ఈ ఏడాది నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 800 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, రానున్న రోజుల్లో కరెంటు కోతలు ఉండబోవని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఏపీ
సాక్షి, అమరావతి: ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులతో కలిసి ఆక్వా హబ్‌లు, రిటైల్ ఔట్లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం మంత్రి సమక్షంలో పేటీఎం, రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఆఫ్కాఫ్ చైర్మన్ కె.అనిల్ బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం రిటైల్ ఔట్లెట్ నిర్వాహకులకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్ (పోస్), క్యూఆర్ కోడ్, తదితరాలను పేటీఏం సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ ఔట్లెట్లను తీసుకొస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్ శర్మ మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పేటీఏంను భాగస్వామిని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. -
ఆక్వానందం.. ‘టైగర్’ రీ ఎంట్రీ
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగుకు మళ్లీ పూర్వవైభవం మొదలైంది. కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులతో నష్టాలు చవిచూసిన ఆక్వారైతులు ప్రకృతి అనుకూలం, ప్రభుత్వం ప్రోత్సాహంతో క్రమంగా లాభాలు చూస్తున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీగా కరెంట్ బిల్లులు, నకిలీల బెడదతో అక్వా సాగు అంటేనే రైతులు హడలెత్తిపోయే పరిస్థితులు ఉండేవి. చాలా మంది రైతులు నష్టాలు భరించలేక పంట విరామం ప్రకటించి సాగుకు దూరమయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆక్వా రంగానికి ప్రాధాన్యతనివ్వడంతో తిరిగి ఊపిరి పోసుకుంది. ఆక్వా సాగుకు విద్యుత్ రాయితీలు ప్రకటించడంతో పాటు ఏపీ ఆక్వా కల్చర్ యాక్ట్, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్–2020 ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌కు అవకాశం కల్పించడం, నకిలీలపై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో మళ్లీ నీలివిప్లవం మొదలైంది. బిట్రగుంట: ఆక్వా సాగులో విప్లవం సృష్టించిన జిల్లా మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లాదే అగ్రస్థానం కావడం విశేషం. ఆక్వా సాగుకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండేళ్ల నుంచి ఆక్వా సాగుతో పాటు దిగుబడులు, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోట, చిట్టమూరు, వాకాడు, తడ, తదితర మండలాల్లో వెనామీ రొయ్యల సాగు ఊపందుకుంది. ఆయా మండలాల పరిధిలో సుమారు 20 వేల హెక్టార్లకు పైగా రొయ్యల సాగు జరుగుతున్నట్లు అంచనా. గడిచిన రెండేళ్లలోనే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగినట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగానికి విద్యుత్ భారం తగ్గించడంతో సాగు వేగంగా ఊపందుకుంది. ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ 1.50 పైసలకే సరఫరా చేస్తుడడంతో రైతులకు లక్షల్లో ఆర్థిక ఊరట లభించింది. ఇప్పటి వరకు ఐదెకరాలకు మాత్రమే వర్తించే విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పదెకరాలకు పెంచడంతో యువ రైతులు కూడా ఆక్వా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టాలను తీసుకురావడంతో నకిలీ సీడ్, ఫీడ్‌లకు అడ్డుకట్ట పడి దిగుబడులు కూడా పెరిగాయి. క్షేత్ర స్థాయిలో అండగా ప్రభుత్వం ఆక్వా సాగు చేస్తున్న రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, నకిలీలను గుర్తించడం, తదితర అంశాలపై ఆర్బీకేల ద్వారా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు కల్పించింది. సచివాలయాల స్థాయిలో ‘ఈ–ఫిష్’ బుకింగ్ చేసి వైఎస్సార్ మత్స్య పొలంబడి ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతంలో రొయ్యల సాగుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ప్రస్తుతం అధికారులే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు మంజూరు చేస్తుండడం, విద్యుత్ రాయితీలు లభిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను తీసుకు వస్తుండడంతో రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా ల్యాబ్‌ల ద్వారా వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ, ఫీడ్ అనాలసిస్ పరీక్షలు ఆక్వా రైతులకు అందుబాటులో ఉంటాయి. ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు అనవసరంగా ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్ వాడే బాధ తప్పి ఖర్చులు ఆదావుతాయి. ఇంటికొచ్చి మరీ అనుమతులు గతంలో రొయ్యల సాగు చేయాలంటే అనుమతుల కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అధికారులే ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. సబ్సిడీ కరెంట్ ఇస్తుండటంతో ఖర్చులు కూడా బాగా తగ్గాయి. మా ఏరియాలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ధరలు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా ఉన్నాయి. – గుమ్మడి వెంకటేష్, ఇస్కపల్లి, ఆక్వా రైతు కరెంటు ఖర్చులు సగం తగ్గాయి ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. యూనిట్ కరెంట్ 1.50 పైసలకే ఇస్తుండడంతో కరెంట్ ఖర్చులు సగానికి తగ్గాయి. కరెంట్ సరఫరా కూడా బాగుంది. నేను మూడెకరాలు సాగు చేస్తున్నాను. గతంలో హేచరీలు నాసిరకం సీడ్ ఇచ్చేవి. ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఇప్పుడు మంచి సీడ్ లభిస్తోంది. ఫీడ్ ధరలపైన నియంత్రణ ఉంచితే బాగుంటుంది. – బత్తల ఆంజనేయులు, గోగులపల్లి, ఆక్వారైతు ‘టైగర్’ రీ ఎంట్రీ రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వెనామీతో పాటు ‘టైగర్’ రొయ్యల సాగుకు కూడా మళ్లీ ఊపిరి పోస్తున్నాయి. వ్యాధి రహిత తల్లి రొయ్యలను (స్పెషిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) దిగుమతి చేసుకుని వాటి ద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతులు మంజూరు కాగా వీటిలో మూడు హేచరీలు జిల్లాకు చెందినవే కావడం విశేషం. వీటి ద్వారా డిమాండ్‌కు సరిపడా నాణ్యమైన సీడ్ అందుబాటులోకి రానుంది. నకిలీ సీడ్‌కు అడ్డుకట్టకు కూడా ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టింది. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజ సిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తో పాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా ఆక్వా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. టైగర్ సాగుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో జిల్లాతో పాటు ఒంగోలు, గుంటూరు జిల్లాలో కూడా టైగర్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
చెరువుల్లో సముద్ర చేపలు!
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం రైతుల వినూత్న ఆలోచనతో.. ఆక్వా సాగు కొత్తపుంతలు తొక్కుతూ లాభాల బాటలో పయనిస్తున్నది. సహజంగా చెరువుల్లో సాధారణ రకాల చేపలు, రొయ్యలను సాగుచేస్తుంటారు. అయితే సముద్రంలో లభించే అరుదైన పండుగప్ప(సీబాస్), చందువాపార(సిల్వర్ పాంపనో) రకం చేపలను చెరువుల్లో పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన పెదపులుగువారిపాలెం రైతులకు వచ్చిన నేపథ్యంలో.. పంజరం సాగు ప్రచారంలోకి వచ్చింది. పంజరాల్లో చేపల పెంపకం ఇలా.. సముద్రంలో పెరిగే పండుగప్ప, చందువాపార చేపలు సాధారణంగా వాటి కన్నా పరిమాణంలో చిన్న చేపలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. దీనిని నివారించేందుకు పిల్లలను చెరువుల్లో వలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంజరాల్లో సాగు చేస్తున్నారు. వారానికొకసారి చేపలను గ్రేడింగ్ చేసి బరువు ఆధారంగా వేర్వేరు పంజరాల్లో పెంచుతున్నారు. పంజరంలో పెరిగే క్రమంలో చిన్న వయసు నుంచే రైతులు వేసే మేతను తినే అలవాటు చేస్తారు. ఇలా 100 గ్రాములు బరువు వచ్చే వరకు పంజరంలో పెంచిన తర్వాత ఒకే పరిమాణంలో ఉన్న చేపలను చెరువుల్లోకి విడుదల చేస్తారు. రొయ్య, చేపల పెంపకంలో తరచూ నష్టాలు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా పంజరాల్లో సాగు ప్రారంభించామని పెదపులువారిపాలెం రైతులు చెబుతున్నారు. ఆర్టీసీఏ సహకారంతో ప్రయోగాత్మకంగా తొలుత మూడెకరాల్లో సాగు చేసిన పంజరం తరహాసాగు లాభదాయకంగా ఉండడంతో.. ప్రస్తుతం 33 ఎకరాల్లో సాగవుతోందని చెబుతున్నారు. చెరువు వద్దే రూ.400 పైగా ధర.. పండుగప్ప, చందువాపార రకాలకు మన దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. చెరువు వద్దే పండుగప్ప చేప కిలో రూ.400 పైగా ధర పలుకుతుంది. వీటిని ఉప్పు చేపగా తయారుచేసి కిలో రూ.800–850 దాకా విక్రయిస్తున్నారు. అలాగే చందువాపార రకం రైతు వద్ద కిలో రూ.350 దాకా లభిస్తోంది. ‘ఆక్వా’ పార్కుతో మరింత ప్రోత్సాహం.. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్(ఆర్జీసీఏ), కొచ్చిన్‌లో ఉన్న సెంటర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) సముద్ర రకం చేపల సాగుకు పిల్లలను సరఫరా చేస్తున్నాయి. సముద్ర చేపల పెంపకాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిజాంపట్నంలో ఆక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 280 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న పార్కు డీపీఆర్ పూర్తవుతుంది. ప్రోత్సాహంతో పాటు శిక్షణ.. సముద్ర చేపలైన పండుగప్ప, చందువాపార రకం పెంచాలనుకునే రైతులకు అవసరమైన సాంకేతిక శిక్షణను ఆర్బీకేల ద్వారా అందించనున్నాం. చెరువుల తవ్వకానికి 40 శాతం దాకా సబ్సిడీ ఇవ్వనున్నాం. నాణ్యమైన, తక్కువ ధరలో చేప పిల్లలను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. – డి. సురేష్, డీడీ, మత్స్యశాఖ, గుంటూరు జిల్లా -
Aquaculture: ఆక్వాలో ఆంధ్రాదే అగ్రస్థానం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆక్వారంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల్లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా సాగుకు విద్యుత్‌కు సబ్సిడీ ప్రకటించారు. ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ యాక్టు, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్టు – 2020 ద్వారా నాణ్యమైన ఉత్పత్తులకు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా పరిశ్రమ తారాజువ్వలా దూసుకుపోతోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో .. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. దేశంలో ఉత్పత్తవుతున్న మత్స్య సంపదతో పోలిస్తే 31 శాతం వాటాను ఏపీ ఆక్రమించింది. వెనామీ రొయ్యలు, పండుగప్ప రకం చేపలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. ఒక్క కృష్ణా జిల్లాలో 1.80లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇప్పటి వరకూ రిజర్వాయర్లలో చేప పిల్లలను మాత్రమే వదిలేవారు. ఈ ఏడాది నుంచి మత్స్యకారుల వేట నిమిత్తం రొయ్య పిల్లలను సైతం విడిచిపెడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న ఉత్పత్తులు.. ఏపీ నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.19 వేల కోట్ల విలువైన 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రకటించింది. దిగుబడుల విషయానికొస్తే 2018–19లో 13.42 లక్షల టన్నులు, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు పెరిగాయి. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం – 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టం 2020ను ప్రవేశపెట్టింది. ఈ చట్టాల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు, మేతలకు అవకాశం ఏర్పడుతున్నది. ఈ చట్టాల ద్వారా ఆక్వా రైతులు రెన్యూవల్, నూతన లైసెన్సులు పొందాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు లైసెన్సులు పొందారు. అండగా ప్రభుత్వం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆక్వా సాగుకు విద్యుత్ సబ్సిడీ కల్పించింది. రాష్ట్రంలో 60,472 ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.332 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. సచివాలయ స్థాయిలో ఈ–ఫిష్ బుకింగ్ చేసి, వైఎస్సార్ మత్స్య పొలంబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కలిగిస్తున్నది. ఇవే కాకుండా వేట నిషేధ సమయంలో భృతి, డీజిల్‌పై సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా, ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఆక్వాకు ఊపిరి పోశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగానికి ఊపిరిపోశారు. కరోనా సమయంలోనూ ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ముఖ్యంగా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడం వల్ల డీజిల్ ఖర్చులు తగ్గాయి. దీంతో లక్షల్లో రైతులకు ఆర్థిక ఊరట కలిగింది. – మంగినేని రామకృష్ణ, ఆక్వా రైతు, కైకలూరు దిగుబడులు పెరిగాయి.. ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తోంది. అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యమైన సీడు, ఫీడు సరఫరాకు చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఏటేటా ఆక్వా ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. – లాల్ మహమ్మద్, జాయింట్ డైరెక్టరు, మత్స్యశాఖ, కృష్ణాజిల్లా -
మీసం మెలేసేందుకు ‘టైగర్’ రెడీ
సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాల క్రితం వరకు అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ‘ఆంధ్రా టైగర్’ రొయ్యలకు పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని.. వాటిద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతి లభించింది. వీటినుంచి డిమాండ్‌కు సరిపడా సీడ్ అందుబాటులోకి రానుండడంతో సమ్మర్ క్రాప్ (వేసవి పంట)లో కనీసం 50 వేల ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో 5 హేచరీలకు అనుమతి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్పీఎఫ్ బ్రూడర్స్ దిగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం వాటిని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ద్వారా నెల్లూరులోని వైష్ణవి ఆక్వాటెక్, తమిళనాడులోని యూని బయో (ఇండియా) హేచరీలకు ఇచ్చేందుకు అనుమతించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన సీడ్‌తో గతేడాది గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించడంతో వనామీ రొయ్యల సాగుకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. డిమాండ్‌కు తగ్గ సీడ్ అందుబాటులో లేకపోవడంతో రెండో పంట సమయంలో నకిలీల బారినపడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజసిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తోపాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన సీఏఏ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సి వచ్చింది. నకిలీలకు చెక్ పెట్టడంతోపాటు టైగర్ రొయ్యల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరిన్ని హేచరీలకు అనుమతి ఇవ్వాలని సీఏఏ నిర్ణయించింది. కొత్తగా ఏపీకి చెందిన రెండు హేచరీలు, రెండు లార్వా రేరింగ్ హేచరీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టైగర్ బ్రూడర్స్ దిగుమతి, సీడ్ ఉత్పత్తి కోసం అనుమతి పొందిన హేచరీల సంఖ్య మూడుకు చేరింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన నౌప్లీ (లార్వా) నుంచి సీడ్ ఉత్పత్తి చేసే రెండు యూనిట్లకు కొత్తగా అనుమతినివ్వడంతో టైగర్ సీడ్ ఉత్పత్తి, సాగులో దేశంలోనే ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది. ప్రస్తుతం అనుమతి పొందిన హేచరీలన్నీ వంద మిలియన్ సీడ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవే. అయితే, నిబంధనలకు లోబడే ఇవన్నీ సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సీఏఏ అనుమతి లేకుండా ఇతర హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేసినా, అమ్మినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. బ్రూడర్స్ దిగుమతి.. సీడ్ ఉత్పత్తికి అనుమతి పొందిన హేచరీలివీ.. యూని బయో (ఇండియా) హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ముగైయూర్, తమిళనాడు వైష్ణవి ఆక్వా టెక్, దుగరాజపట్నం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా మున్నంగి హేచరీస్, రామచంద్రరావుపేట పంచాయతీ, నెల్లూరు జిల్లా గాయత్రి బయో మెరైన్ యూనిట్–2, కొత్త ఓడరేవు, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా శ్రీ వైజయంతీ హేచరీస్ ఎల్ఎల్పీ, కారేడు, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా బీకేఎంఎన్ ఆక్వా, రాముడుపాలెం, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా -
Tiger Prawn: మళ్లీ టైగర్ శకం
జిల్లాలో నీలి విప్లవం సృష్టించి, అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన సింహపురి టైగర్ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభం కానుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలను వివిధ రకాల వైరస్లు వెంటాడడంతో కనుమరుగయ్యాయి. ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీలోనూ వైరస్లు విజృంభిస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. టైగర్ సరికొత్త బ్రీడర్తో తిరిగి రావడంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేశారు. సాక్షి, చిల్లకూరు: సింహపురిలో 1990వ దశకంలో టైగర్ రొయ్యలు నీలి విప్లవం సృష్టించాయి. దాదాపు దశా బ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలిదశలో రైతులను కోటీశ్వరులను తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటు వైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్లు వెంటాడుతుండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్‌లకు యాంటీబయోటిక్స్ వాడడంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు, కోట, వాకాడు, చిట ్టమూరు మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లలో సాగు చేసిన రైతులు ప్రస్తుతం 500 హెక్టార్లలో కూడా సాగు చేయలేక చతికిలపడ్డారు. చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు) టైగర్ టు వెనామీ టు టైగర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఏటా 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహపురిదే సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తర్వాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్లమచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో “టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధి పర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైంది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండడంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసింది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి తద్వారా తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తోంది. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలోని వాకాడులో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. చిల్లకూరు మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి సీడ్‌ను సరఫరా చేసి సుమారుగా 500 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. 120 రోజుల క్రితం పిల్ల రొయ్యను వదలిన తర్వాత ఎలాంటి వైరస్లు సోకకుండా మేత సకాలం వేస్తుండడంతో అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో బ్లాక్ టైగర్ ఈ ప్రాంతంలో బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం ఏర్పడింది. చదవండి: (సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం) 120 రోజుల్లో 15 కౌంట్ రొయ్యలు తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకు ఎకరాకు లక్ష పిల్లలు మాత్రమే వదలితే సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఇవి 120 రోజుల్లో 15 కౌంట్ వస్తుండడంతో పాటు లాభాలు బాగా వస్తుండడంతో రైతులు పూర్తిగా టైగర్ సాగు వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరాకు టన్ను నుంచి టన్నుర్నర దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల రూపాయికి అందుబాటులో ఉంది. లాభాలు బాగున్నాయి పదేళ్లుగా వెనామీ సాగు చేసి ఒడిదొడుకులకు గురయ్యాం. ప్రస్తుతం బ్లాక్ టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేపట్టా, 120 రోజుల్లో చిన్న పాటి వైరస్ కూడా రాకపోగా 15 కౌంట్‌తో హార్వెస్ట్ చేసాను. వెనామీ 40 కౌంట్ రొయ్యలు రూ.460 ఉండగా టైగర్ 15 కౌంట్ రూ.780 ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పోను లాభాలు బాగానే వస్తున్నాయి. – చిట్టేటి నారాయణ, ఆక్వా రైతు హేచరీలు పెంచేలా ఆలోచన బ్లాక్ టైగర్‌ను నెల్లూరు జిల్లాలో ప్రవేశ పెట్టాలని తొలిసారిగా వాకాడు ప్రాంతంలో ఒక హేచరీని లీజుకు తీసుకుని పిల్లను అందించే ప్రయత్నం చేశాం. అయితే ఆర్డర్లు భారీగా వస్తుండడంతో రాష్ట్రంలో విడవలూరు, విజయవాడ కరకట్ట, ఈతమొక్కల ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి పిల్ల రొయ్యను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించేలా చేస్తాం . – జిగ్నేష్బాయి, హేచరీ నిర్వాహకులు -
ఆక్వా.. అనుమతులు చకచకా
సాక్షి, అమరావతి: ఆక్వా కల్చర్ అభివృద్ధికి చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు చేపట్టింది. నిబంధనలను అనుసరించి కొత్తగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు చకచకా అనుమతులు జారీ చేస్తోంది. మరోవైపు సాగర తీరంలోని ఉప్పునీటి భూముల్లోనూ ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇందులో 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులున్నాయి. సుమారు 75 వేల హెక్టార్లలో ఉప్పునీటి (బ్రాకిష్ వాటర్) భూములు ఉండగా.. ఇవన్నీ ఆక్వా కల్చర్ సాగుకు అనుకూలమైనవి. ఇందులో ప్రస్తుతం 54,477 హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. మరో 21 వేల హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ఆ భూముల్లోనూ ఆక్వా సాగును విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఏఏ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో.. మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ద్వారా లైసెన్సులు తీసుకోవచ్చు. అదే సముద్ర తీరంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా సాగు చేపట్టాలంటే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) నుంచి అనుమతులు పొందాలి. తూర్పు తీరానికి సంబంధించి ఈ కేంద్రం చెన్నైలో మాత్రమే ఉండటంతో రాష్ట్రం నుంచి సిఫార్సు చేసిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఈ కారణంగా దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. రాష్ట్రంలో 54,477 హెక్టార్లలో ఉప్పునీటి ఆక్వా చెరువులు ఉండగా.. వాటిలో కేవలం 25,217 హెక్టార్ల (46 శాతం)లోని చెరువులకు మాత్రమే గుర్తింపు ఉంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ భూముల్లో అనధికారిక సాగు పెరిగిపోతూ వచ్చింది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఏఏ తొలి ప్రాంతీయ ఫెసిలిటీ సెంటర్‌ను ఏపీకి మంజూరు చేయించింది. ఈ సెంటర్‌ను మార్చి 18న విజయవాడలోని మత్స్యశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో ఉప్పునీటిలో ఆక్వా సాగు చేసే రైతులకు రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పడింది. సాగులో ఉన్న చెరువుల రిజిస్ట్రేషన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉప్పునీటి కింద 39,570 హెక్టార్లలో వనామీ, 3,796 హెక్టార్లలో మోనోడోన్ రొయ్యలు సాగవుతుండగా, 6,300 హెక్టార్లలో పసుపు పీత(మడ్ క్రాబ్), 4,811హెక్టార్లలో పండుగప్ప (సీ బాస్) సాగవుతోంది. బ్రాకిష్ వాటర్‌లో కొత్త రకాలకు ప్రోత్సాహం ఇదిలావుంటే.. తీరంలో సాగుకు అనుకూలంగా ఉన్న మరో 21వేల హెక్టార్ల విస్తీర్ణంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21లో కొత్తగా కనీసం 8 వేల హెక్టార్లలో బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఐదువేల హెక్టార్లలో సాగు కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా సాగులోకి తీసుకొస్తున్న ఉప్పునీటి చెరువుల్లో సిల్వర్ పాంపనో (తెల్ల సందువా), రెడ్ స్నాప్పర్, గ్రౌవర్, పి.ఇండిసియస్ రొయ్యల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఏఏ రాకతో రొయ్యల హేచరీల్లో బ్రూడర్, సీడ్ నాణ్యతను పెంపొందించేందుకు.. ఆక్వా కల్చర్ ఇన్పుట్స్ ధ్రువీకరించేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్‌కు సీఏఏ కేంద్రం ద్వారా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఉప్పునీటిలో ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను సీఏఏ ఫెసిలిటీ సెంటర్‌కు పంపించి 6 నుంచి 15 రోజుల్లో అనుమతులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టినట్టు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. -
రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటైంది. దీనితోపాటు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీలను, జిల్లా స్థాయి అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. కో వైస్ చైర్మన్‌గా ఈ రంగంలో నిపుణుడ్ని ప్రభుత్వం నామినేట్ చేయనుంది. అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సహా 24 మందిని సభ్యులుగా నియమించారు. అలాగే పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ కార్యదర్శి/కార్యదర్శిలు వైస్ చైర్మన్‌గా ఏర్పాటైన అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏపీఎస్ఏడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 12 మందిని సభ్యులుగా నియమించారు. అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపల్.. మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 19 మందిని సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుగా ఉంటారు. -
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
-
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫిషింగ్ హార్బర్లకు ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎఫ్ఐడీఎఫ్)లోను బదులుగా తగిన గ్రాంట్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రాన్ని కోరారు. శనివారం ఆయన రాజ్యసభ జీరోఅవర్‌లో మాట్లాడారు. అనుమతులు జారీ చేసిన మూడు ఫిషింగ్ హార్బర్లకు లోను బదులు గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, మిగిలినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావముంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. (రాజ్యసభలో విశాఖ వాణి) ఏపీకి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ. 379.17 కోట్లు, మచిలీపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ.285.609 కోట్లు, ఉప్పాడ అంచనా వ్యయం రూ. 350.44కోట్లకు భారత ప్రభుత్వ వాటా క్రింద ఒక్కొక్కదానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. అంటే రూ.450కోట్లు ఎఫ్ఐడీఎఫ్ రుణంగా కాకుండా, మొత్తం గ్రాంటు రూపంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిదిగా ఎంపీ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. (ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు) -
ఈ–పంట తరహాలో ఈ–ఫిష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య దిగుబడులను, సాగు విస్తీర్ణాన్ని 2025 నాటికి మూడింతలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాంకేతిక విధానాల అమలు ద్వారా కలగనున్న ప్రయోజనాలపై రైతులకు అవగాహన కలిగిస్తూ.. ఆ విధానాల అమలుకు ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ద్వారా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులన్నింటినీ క్షణాల్లో ప్రభుత్వానికి తెలిసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రస్తుత కోవిడ్–19 వంటి విపత్తులో ఆక్వా రైతులకు ఈ యాప్‌ల ద్వారా సత్వరం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ–పిష్ : వ్యవసాయ శాఖలోని ఈ–కర్షక్ విధానాన్ని పరిశీలించి మత్స్యశాఖ అధికారులు ఈ–ఫిష్ యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 1.95 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యలు సాగులో ఉన్నాయి. అయితే గ్రామ, మండల, జిల్లాల వారీగా పంటల వివరాలు నేటికీ లేవు. ఇప్పుడు సర్వే నంబర్లు, రైతుల పేర్లు, సాగులోని వివరాలను యాప్ ద్వారా నమోదు చేస్తూ డాష్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. తద్వారా నష్టపోయినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే అందించవచ్చు. మత్స్య సాగుబడి: వ్యవసాయ శాఖలోని పొలంబడిని ఆధారంగా చేసుకుని మత్స్య సాగుబడి యాప్‌ను రూపొందించారు. సాగులో మెళకువలు, అధిక దిగుబడుల కోసం మేత వినియోగం తదితర విషయాల్లో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి ఆర్బీకేలో మత్స్య సాగుబడిని ఏర్పాటు చేసి, రైతుల సందేహాలు నివృత్తి చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డులు : ఐదు హెక్టార్లలోపు చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద చెరువులు ఉన్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు. సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిండానికి చర్యలు తీసుకుంటున్నారు. రైతుల వివరాలు యాప్ ద్వారా నమోదు చేసి డాష్‌బోర్డు ద్వారా మత్స్యశాఖ ప్రధాన కార్యాలయానికి అనుసం«ధానం చేస్తున్నారు. తద్వారా ఆక్వా రైతుల పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఎస్ఎస్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ)లో ప్రభుత్వానికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నీటి నాణ్యత పరీక్షలు : ప్రభుత్వం రాష్ట్ర మత్స్య సహాయకులకు ఇచ్చిన టెస్ట్ కిట్ల ద్వారా చెరువుల్లోని నీటి నాణ్యతను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. రొయ్యలు, చేపల మేత, రోగనిరోధక మందుల వినియోగానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆక్వాల్యాబ్స్‌కు వీటిని అనుసంధానం చేస్తారు. నీలి విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ విపణిలో దేశ మత్స్య సంపద విక్రయాలు పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించాలి. తీర ప్రాంతంలో మత్స్య సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం చొరవ వల్ల మత్స్యశాఖ కూడా వినూత్న విధానాలు, శాస్త్ర సాంకేతిక విధానాల అమలు పట్ల మొగ్గు చూపుతోంది. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. – కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్ -
సాక్షి ఎఫెక్ట్: భంజ్‌దేవ్‌కు భారీ దెబ్బ
అధికారం అండతో అక్రమాలకు పాలడ్డారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించేసి చేపల చెరువులు తవ్వించేశారు. ఇదేమని ప్ర శ్నిస్తే అది తమ తాతలనాటి ఆస్తులంటూ బుకాయించారు. అంతేనా... సాగుకు వినియోగించాల్సిన నీటినీ చెరువులకు మళ్లించేశారు. దర్జాగా వ్యాపారం చేసుకుని కాసులు కూడేశారు. అధికారం మారింది. వారి తలరాత కూడా మారిపోయింది. అడ్డగోలు అక్రమాలపై వరుసగా ప్రచురితమైన సాక్షి కథనాలు అధికారులను కదిలించాయి. జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థా నం నుంచి ఆదేశాలూ అందాయి. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు అవన్నీ అక్రమాలేనని తేల్చారు. ఇన్నాళ్లు సర్కారును... ప్రజలను మభ్యపెట్టినందుకు తగిన శిక్ష విధించారు. ఏకంగా ఆక్వా లైసెన్సును రద్దు చేస్తూ తీర్మానించారు. ఇదీ సాలూరు టీడీపీ ఇన్చార్జి భంజ్‌దేవ్‌కు తగిలిన భారీదెబ్బ. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డుపెట్టుకుని సాలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ సాగించిన చేపల చెరువుల వ్యాపారంలో అక్రమాలు నిజమేనని సష్టమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నిర్ధారించింది. చేపల చెరువు తవ్వకానికి గ్రామదేవత స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారణయింది. దీని ఫలితంగా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటుకోసం గతంలో మంజూరు చేసిన అనుమతులు రద్దు చేస్తూ అక్వాకల్చర్ చెరువుల అనుమతులకోసం ఏర్పాటైన జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షలు కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, సభ్యులు జాయిం ట్ కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెం కటరావు, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి.సుమలత, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుదర్శన, వ్యవసాయ శాఖ డీడీ నంద్, భూగర్భ జలశాఖ ఇన్చార్జి డీడీ రమణమూర్తి గురువారం సమావేశమై తీర్మానించారు. అవన్నీ అక్రమాలే: పాచిపెంట మండలం విశ్వనాథపురంలో సర్వే నంబరు 12–1 లో ఆరు ఎకరాల స్థలంలో ఏపీ భంజ్‌దేవ్ చేపల చెరువు ఏర్పాటు చేసేందుకు గతంలో దరఖాస్తు చేసుకోగా ఆ మండల తహసీల్దార్ సిఫారసు మేరకు జిల్లా కమిటీ గతంలో ఆమోదం తెలిపింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చెపల చెరువు భూములపై దర్యాప్తు జరిపిన పార్వతీపురం సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ గ్రామదేవతకు చెందిన భూములు ఆక్రమిస్తూ ఈ చెరువు తవ్వించినట్టు నిర్థారించింది. ఈ స్థలానికి హక్కుదారుగా గ్రామదేవత వున్నారని, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ లో ఈ మేరకు నమోదై వున్నట్టు సబ్ కమిటీ పేర్కొంది. సర్వే నం.12–1లోని స్థలంపై అక్వా రైతు ఆర్పీ భంజ్‌దేవ్ సోదరుడైన ఏ.పి.భంజ్‌దేవ్‌కు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేనందున సబ్ కలెక్టర్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఇదే వ్యక్తుల చేతిలో గ్రామంలోని సర్వే నెంబరు 14–1లో 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులోనూ 2.81 ఎకరాల ప్రభుత్వ ఇనాం భూమి ఆక్రమణకు గురైనట్టు సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ చెరువు ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి పొందలేదని, ఈ చెరువు కూడా అక్రమమైనదేనని కమిటీ నిర్థారించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు తొలగించాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన చెరువులను కూడా నిర్మూలించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆదేశాలు... సబ్‌కలెక్టర్ విచారణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్, అతని సోదరులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ, గ్రామ దేవత భూములను ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేసుకుంటున్నారు. రైతులు సాగునీటికి వాడాల్సిన పెద్దగెడ్డ జలాశయ నీటిని తమ చేపల చెరువుకు మళ్లించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు కొందరు న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో హైకోర్టు బెంచ్ ఒక తీర్పు వెలువరించింది. చెరువులపై విచారణ జరిపి, ఆక్రమితమని తేలితే ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ బాధ్యతలను సబ్‌కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్ అప్పగించారు. సాక్షి కథనాల్లో చెప్పిన అంశాలన్నీ వాస్తవాలేనని సబ్ కలెక్టర్ విచారణలో తేలింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కమిటీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన సాక్షి భంజ్‌దేవ్ చేపల చెరువుల ఆక్రమణలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అన్ని ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించింది. వాటిని కూడా పిటిషన్‌దారులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా ‘సాక్షి’ కథనాల కారణంగా నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భంజ్‌దేవ్‌ను పిలిపించి వివరణ కోరారు. దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమానికి అడ్డుకట్టవేయడంలో ప్రధాన భూమిక పోషించిన ‘సాక్షి’ చరిత్ర సృష్టించింది. -
ఆక్వాలో నంబర్ వన్‌కు చేరాలి
సాక్షి, హైదరాబాద్: సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉందని, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నంబర్ వన్‌కు చేరాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఉన్న జల వనరులను 40 శాతమే ఆక్వాకల్చర్‌కు వినియోగించుకుంటున్నామని అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటైన ఆక్వాఆక్వేరియా ఇండియా– 2019 ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపీఈడీఏ లాంటి సంస్థలు, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్మెంట్ పద్ధతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాల్లో తగిన వాటా ఉం డేలా విధానాల రూపకల్పన జరగాలన్నారు. దేశంలో ఆహార సమృద్ధి ఉన్నప్పటికీ, ప్రొటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పద్ధతులే సరైనవని అభిప్రా యపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమం ఉద్యమంగా మారా లని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యోగాలపై దృష్టి పెట్టాలని, ఆహార అలవాట్లను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్థక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. 60 శాతం విదేశీ మారక ద్రవ్యం ఏపీ నుంచే... సువిశాల సముద్రతీరమున్న ఆంధ్రప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఏపీలో 14.5 లక్షల మంది ఈ రంగంతో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డీజిల్ రాయితీ పెంపు తోపాటు నాణ్యమైన సీడ్‌ను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలన్నారు. అభివృద్ధికి పలు చర్యలు... తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ముఖ్యమం త్రి కేసీఆర్ మత్స్యరంగ అభివృద్ధికి అధిక ప్రాధా న్యం కల్పించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ధి పథకం కింద మత్స్యకారులకు 70–90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు ఎంపీఈడీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసిన 10 మంది రైతులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసంవర్థక కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ సువర్ణ, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. -
పేరేమో చేపది... సాగేమో రొయ్యది
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): చేపల చెరువులకు అనుమతులు తీసుకుని ఆపేరుతో అనధికారికంగా రొయ్యల సాగు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ రొయ్యల సాగుతో పంట భూములు కలుషితమై చౌడుబారుతున్నాయి. రొయ్యల చెరువుల నుంచి విడుదలయ్యే కలుషిత నీటితో భూగర్భ జలాలు కలుషితమై పంట భూములతో పాటు గట్ల వెంబడి ఉండే కొబ్బరి చెట్లు, తాడిచెట్లు సైతం మోడుబారిపోతున్నాయి. మామూళ్లమత్తులో అధికారులు చెరువుల తవ్వకాలప్పుడు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, ఫిషరీస్ డిపార్టుమెంట్ల అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోవడంతో చెర్వుల యజమానులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. జిల్లాలో ఈ విధంగా అనధికారకంగా రొయ్యల సాగు సుమారు 2 వేల హెక్టార్లలో సాగుతున్నట్టు అంచనా. ఒక్క పెరవలి మండలంలోనే కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం, ఉసులమర్రు, తీపర్రు గ్రామాల్లో చేపల చెపల చెర్వుల తవ్వకాలకు 950 ఎకరాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో కేవలం 150 ఎకరాల్లో చేపల సాగు జరుగుతుండగా మిగిలిన 800 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఇప్పటికే కానూరు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు ఇలా.. ► చేపల చెరువుల యజమానులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారు. చేపల చెరువులు, పంటభూమల వద్ద బోరు వేయాలంటే సబంధిత శాఖ అనుమతి తప్పనిసరి. కానీ పెరవలి మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే బోర్లు వేశారు. అయినా ఎలాంటి చర్యలూ లేవు. ఏ చెర్వు యజమాని అనుమతులు తీసుకోకుండా బోర్లు వేశారు. ► గతంలో ఆప్రాంతంలో బోరు ఉంటే మరో బోరుకు అనుమతి ఇవ్వకూడదు. మరో బోరు వేయాలంటే పాత బోరు పూర్తిగా పాడైయిందని నిర్ధారించిన తరువాత మాత్రమే కొత్తదానికి అనుమతి ఇవ్వాలి. ► ఒకబోరు వేసిన చోట నుంచి మరో బోరు వేయడానికి 250 మీటర్ల దూరం ఉండాలి. అప్పుడే కొత్తబోరుకి అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకే చెర్వు వద్ద మూడు నుంచినాలుగు బోర్లు వేసి భూగర్భ జలాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈగ్రామాల ఆయకట్టు ప్రకారం మొత్తం కానూరు, కానూరు అగ్రహరం, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో కేవలం 350 బోర్లు వేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం 800 బోర్లు పైనే ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం ఉప్ప నీటిని పైకి తీసుకురావాలంటే ప్రత్యేక అనుమతి ఈ శాఖ వద్ద తీసుకోవలసి ఉంది. అలా తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతే కాకుండా పంటభూములు ఉన్న చోట ఈ బోర్లకు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా బోర్లు వేసి రొయ్యల సాగు చేస్తున్నారు. -
కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది. ఉప్పు వల్ల ముప్పు ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది ఆక్వా సాగు వల్ల, సముద్రం ఎగదన్ని వస్తున్నందు వల్ల నదులు, మురుగునీటి కాలువల్లో ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగింది. భూగర్భ జలాలు సైతం ఉప్పు బారిన పడుతున్నాయి. మరోవైపు కొబ్బరి ఆక్వా బారిన పడటంతో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. కోనసీమలో చాలాచోట్ల లవణాల సాంద్రత 2000 పీపీఎం దాటింది. ఇది ప్రమాద తీవ్రతకు సూచిక. ఈ పరిస్థితులే కొబ్బరి కాయ సైజు తగ్గడానికి, దిగుబడి పడిపోవడానికి కారణం. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, ప్రిన్సిపాల్, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ, అమలాపురం శక్తి హరిస్తోంది ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాల్లో లవణ శాతం పెరిగి కొబ్బరి చెట్లకు సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్లు అందడం లేదు. దీనివల్ల చెట్టు శక్తిహీనమై దిగుబడి తగ్గుతోంది. గడిచిన ఐదేళ్లలో కాయ సైజు భారీగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం. ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న చెట్లకు నల్లముట్టి పురుగు, తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువైంది. –ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
చెరై.. ఆక్వాపోనిక్స్ గ్రామం!
కేరళలోని చెరై అనే తీరప్రాంత గ్రామం తొలి పూర్తి ఆక్వాపోనిక్ వ్యవసాయ గ్రామంగా మారిపోయింది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ సేంద్రియ కూరగాయలతోపాటు చేపలను కూడా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం కొద్ది మంది ప్రారంభించిన ఆక్వాపోనిక్స్ సాగు తామర తంపరగా గ్రామం మొత్తానికీ పాకింది. పల్లిపురం సర్వీసు కో–ఆపరేటివ్ బ్యాంక్ (పి.ఎస్.సి.బి.) చొరవ తీసుకొని రసాయనాల్లేని ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించింది. తొలుత కొద్ది మందితో ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు ఇప్పుడు దాదాపు ఆ చిన్న ఊళ్లో ఉన్న 200 పైచిలుకు కుటుంబాలన్నీ చేపలు, కూరగాయలను రసాయనాల్లేకుండా పండించుకొని తింటున్నారు. ఆక్వాపోనిక్స్ అంటే? ఆక్వాకల్చర్+హైడ్రోపోనిక్స్ కలిస్తే ఆక్వాపోనిక్స్ అవుతుంది. చెరువులు, మడుల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. మట్టితో సంబంధం లేకుండా నీటిలో కరిగే మినరల్ సప్లిమెంట్లతో టబ్‌లు, బక్కెట్లలో కూరగాయలు / పండ్ల మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. చేపలు పెరుగుతున్న టబ్‌లో నుంచి నీటిని కూరగాయలు, పండ్ల మొక్కలు పెరిగే కుండీలు, మడుల్లోకి నిరంతరం చిన్న విద్యుత్తు పంపు ద్వారా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తవుడు, నూనె తీసిన వేరుశనగ / కొబ్బరి తెలగపిండిని చేపలకు ఆహారంగా వేస్తారు. మిగిలినపోయిన మేత, చేపల విసర్జితాలలోని పోషకాలతో కూడిన నీరు కూరగాయలు / పండ్ల మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గ్రోబాగ్స్, టబ్‌లు, కుండీల్లో రాతి చిప్స్‌ను పోసి వాటిలోనే కూరగాయలు, పండ్ల మొక్కలను నాటుతారు. ఈ టబ్‌లు, కుండీల పక్కనే ప్లాస్టిక్ షీట్లతో ఏర్పాటు చేసిన తొట్లలో చేపలు పెరుగుతూ ఉంటాయి. చేపల విసర్జితాలు మొక్కలకు ఆహారం అవుతుండగా.. మొక్కల వేళ్లు నీటిని శుద్ధి చేసి తిరిగి చేపలకు అందిస్తూ ఉండటం వల్ల పరస్పరాధారితంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నీటి వృథా లేకుండా, రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లు చెరై గ్రామ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఖర్చు ఏడాదిలో తిరిగొస్తుంది! ‘మొదట్లో చాన్నాళ్లు బ్రతిమిలాడినా చాలా మంది రైతులు రుణం ఇస్తామన్నా ఆక్వాపోనిక్స్ యూనిట్లను తీసుకోలేదు. కొద్ది మందే తీసుకున్నారు. ఏర్పాటు చేసుకోవడానికి మొదట ఖర్చు బాగానే ఉంటుంది. అయితే, ఏడాదిలోనే ఆ ఖర్చు చేపలు, కూరగాయల రూపంలో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 200 మందికిపై ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.’ అని కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు సత్యన మయ్యత్తిల్ అన్నారు. తొలిగా ఆక్వాపోనిక్స్ యూనిట్ పెట్టుకున్న రైతు శశిధరన్ చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘14,000 లీటర్ల నీరు పట్టే చేపల ట్యాంకులో 1,500కు పైగా చేప పిల్లలను వేశాను. వందకు పైగా గ్రోబాగ్స్‌లో కూరగాయలు పెంచుకుంటున్నా. చేపలు, కూరగాయలు మా ఇంటిల్లపాదికీ సరిపోను అందుతున్నాయి..’ అన్నారాయన. రైతులే కాక దిలీప్ వంటి వ్యాపారులు, మాజీ అటవీ శాఖాధికారి కిషోర్ కుమార్ వంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఇళ్ల దగ్గర ఆక్వాపోనిక్స్ యూనిట్లు పెట్టుకున్నారు. అందువల్లనే చెరై గ్రామం సంపూర్ణ ఆక్వాపోనిక్స్ గ్రామంగా మారింది. నీటిని నిమిషం ఆగకుండా పంప్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా నీటిని రీసర్క్యులేట్ చేయడానికి సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కిషోర్ కుమార్ మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేయడం విశేషం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) తోడ్పాటుతో పల్లిపురం సహకార బ్యాంకు తీసుకున్న చొరవే సేంద్రియ చేపలు, కూరగాయలను ఈ గ్రామస్తులందరూ పండించుకోగలుగుతున్నారు. ఏ విటమిన్ అధికంగా ఉండే ‘మోల’ / మెత్తళ్లు వంటి చిరు చేపలను ఈ పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి పిల్లలను వేస్తే చాలు నిరంతరం తనంతట తానే సంతతిని పెంపొందించుకునే లక్షణం కలిగి ఉండటం ఈ చిరు చేపల ప్రత్యేకత. మనం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయలేమా? ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు పండించుకుంటున్న మహిళ -
ఆక్వా సాగులో నష్టాలెందుకు వస్తున్నాయ్?
ఈ చిత్రంలో వ్యక్తి.. సతీష్. కృష్ణా జిల్లా బందరు మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలోని చెరువుల్లో వనామీ సాగు చేస్తున్నాడు. ఎకరానికి లక్ష చొప్పున 20 లక్షల రొయ్యి పిల్లలు వదిలాడు. గత మూడు రోజులుగా వాతావరణ మార్పులతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆక్సిజన్ లోపించి రొయ్య పిల్లలు చెరువుల పై భాగానికి వచ్చేశాయి. ఇది గమనించి అప్పటికప్పుడు ఎకరానికి కిలో చొప్పున 20 కిలోల ఆక్సిజన్ బిళ్లలు చల్లడంతో రొయ్యి పిల్లలు బతికిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకు వెచ్చించిన రూ.6 లక్షలు నష్టపోవాల్సి వచ్చేది. ఇది.. ఆక్వా రైతు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించే ఘటన. ఈ చిత్రంలో వ్యక్తి.. కల్లూరు బాబు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరులో రొయ్యల సాగు చేస్తున్నాడు. ఒక ఎకరా చెరువులో రూ.45 వేలు ఖర్చు చేసి లక్ష రొయ్య పిల్లలను వదిలాడు. అప్పటి నుంచి రొయ్యలు పట్టే వరకూ కరెంట్ బిల్లు రూ. 50 వేలు వచ్చింది. రొయ్యలకు రెండు టన్నుల ఫీడ్ వాడాడు. దీనికి రూ.1.60 లక్ష అయింది. అలాగే చెరువులో ఆక్సిజన్ కోసం ఏరేటర్స్, జనరేటర్‌కు అద్దె, దాని ఇంధనం, కాపలాదారు కూలీకి రూ.50 వేలు ఖర్చు చేశాడు. ఇలా అన్నిటికి కలిపి రూ.3.5 లక్షలు వ్యయమైంది. దిగుబడి.. 80 కౌంట్ రొయ్యలు టన్ను వచ్చింది. వాటిని విక్రయించగా రూ. 1.90 లక్షల రాబడి వచ్చింది. దీంతో రూ.1.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇవి.. సతీష్, కల్లూరు బాబు బాధలు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులందరూ ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా సాగులో రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, మచిలీపట్నం: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. సాగు ప్రారంభం నుంచి దిగుబడి వరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటేనే పంట చేతికి దక్కేది.. లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు. ఆక్వా సాగుకు వైరస్ సోకడంతోపాటు ధరలు తగ్గిపోతే నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సిందే. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆక్వా రంగం విస్తరించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో అధికారికంగా, 1.20 లక్షల ఎకరాల్లో అనధికారికంగా సాగు జరుగుతోంది. సీడ్ నుంచే కష్టాలు ప్రారంభం చెరువును బాగుచేసి రొయ్య పిల్లలు (సీడ్) వేయడం నుంచి ఆక్వా సాగు ప్రారంభమవుతుంది. చెరువు లోతును బట్టి లక్ష నుంచి లక్షన్నర వరకు పిల్లలను వదులుతారు. పిల్లల్ని వదిలిన క్షణం నుంచి ప్రతిరోజూ చెరువు వద్ద అప్రమత్తంగా ఉండాలి. రోజూ మూడు, నాలుగు పర్యాయాలు వాటికి మేత (ఫీడ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కపూట మేత ఇవ్వకపోయినా రొయ్య దిగుబడిపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు సైతం పిల్లల పరిస్థితిని పరిశీలిస్తుండాలి. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఈ సందర్భంలో ఆక్సిజన్ బిళ్లలను ఎకరానికి కిలో చొప్పున చల్లాలి. ఏరేటర్లు క్రమంగా తిరుగుతున్నాయో? లేదో? గమనిస్తుండాలి. ఎకరం చెరువులో లక్ష వరకు పిల్లలకు రూ.30 నుంచి రూ.40 వేలు, మేత (ఫీడ్), మందులు, చెరువు లీజుకు మొత్తం రూ.4–5 లక్షలు వెచ్చించాలి. ఎకరం చెరువుకు విద్యుత్ బిల్లు నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు వస్తుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ఏరేటర్ను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరానికి రెండు ఏరేటర్లు వినియోగిస్తారు. అంటే.. రోజుకు రూ.500 డీజిల్ రూపంలో అదనపు భారం పడుతోంది. పంట దిగుబడి ఆశించిన మేర అందితేనే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హేచరీల నుంచి నాసిరకం పిల్లలు దిగుమతి అవుతుండటంతో లక్ష పిల్లలను చెరువులో వేస్తే 30 నుంచి 40 శాతం వరకు చనిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి. వైరస్‌లతో తీవ్ర నష్టం వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో వైరస్లు (వైట్‌స్పాట్, విబ్రియో), ఈహెచ్‌పీ (ఎండ్రోజోవన్ హెపటోపినై) అనే ప్రొటోజోవా విజృంభిస్తున్నాయి. వీటి నియంత్రణకు మందులు, మినరల్స్ చెరువులో చల్లాల్సి ఉంటుంది. లేని పక్షంలో రొయ్యల్లో నాణ్యత లోపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వెనామీ రొయ్యలు గతేడాది 30 కౌంట్ (కిలోకి 40 రొయ్యలు) రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.380కు మించడం లేదు. గతేడాదితో పోల్చితే టన్నుపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకూ ధరలు పడిపోయాయి. పంట బాగా వచ్చిందంటే.. ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే రాబడి రూ. 5–6 లక్షల మధ్య ఉంటుంది. పెట్టుబడి రూ.4–5 లక్షల వరకు అవుతోంది. వ్యయప్రయాసల కోర్చి పగలనక, రాత్రనక పనిచేస్తే.. మూడు నెలల కష్టానికి కేవలం రూ.లక్ష ఆదాయం మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా తేడా వస్తే.. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లే. 60 కౌంట్ వరకు రొయ్యి పెరిగితే.. పెద్దగా నష్టం లేకుండా పెట్టుబడులు అయినా వస్తాయి. కౌంట్ 60 దాటితే... రైతు నష్టపోయినట్లే. కౌంట్ 100 దాటితే... పెట్టుబడి దాదాపు పోయినట్లే. 100 కౌంట్ దాటితే ఎగుమతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. స్థానికంగా అమ్ముకోవాల్సిందే. స్థానికంగా విక్రయిస్తే పెద్దగా ధరలు ఉండవు. రొయ్యలకు దేశీయంగా పెద్దగా ధర వచ్చే మార్కెటింగ్ లేదు. అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన కొనుగోలుదారులు సిండికేటై ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. గత పక్షంలో ధరల పతనం ఇలా.. పక్షం క్రితం 100 కౌంట్ రొయ్యలు టన్ను ధర రూ. 2.30 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2 లక్షలే ఉంది. అలాగే 90 కౌంట్ టన్ను రూ.2.50 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2.20 లక్షలే పలుకుతోంది. ఇలా ప్రతి కౌంట్‌పై టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ధరలు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ►రైతుల చేతికి పంట వచ్చే సమయానికి వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. నెక్.. రోజూ కోడిగుడ్డు ధరలను ప్రకటించినట్టే దేశీయంగా, అంతర్జాతీయంగా రొయ్యల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. ►రొయ్యల మందులు, మేతలు, రొయ్య పిల్లల ఉత్పత్తి మీద దేశంలో ఎలాంటి నియంత్రణ లేదు. నాణ్యత లేనివి మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం నియంత్రించాలి. నాణ్యత లేని సరుకు అమ్మితే చర్యలు తీసుకొనే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ►నష్టాల పాలవుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం రొయ్యల సాగులో రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యత లేని పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి. తల్లి రొయ్యకు కనీసం 100 రోజులు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తీసుకుని మన ప్రాంతానికి అలవాటుపడేలా మరో 20–30 రోజుల పాటు హేచరీల్లో వేయాలి. ఇక్కడి నీరు, వాతావరణం, నేలను అలవాటు చేసిన తర్వాత చెరువులో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – పట్టపు శ్రీనివాసరావు, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా ధరల తగ్గుదలతో నష్టాలు వాతావరణం అనుకూలించకపోవడం, వైట్‌కట్, వైరస్‌లతో పిల్లలు చనిపోతున్నాయి. డ్రెయిన్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. నాణ్యత లేమితోపాటు దాణా ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగి నష్టాలొస్తున్నాయి. – పులగం శీను, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జాగ్రత్తలు పాటించాలి రొయ్యల సాగులో జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధ్యమే. నేను మూడెకరాల్లో వనామీ రొయ్యల సాగు చేసి ఇటీవల మూడున్నర టన్నుల దిగుబడిని సాధించాను. ఎకరం చెరువులో 60 వేల పిల్లలను మాత్రమే వేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. – నారాయణ, రుద్రవరం, బందరు మండలం, కృష్ణా అవగాహన ఉంటే ఆక్వా లాభదాయకం రైతుల్లో అవగాహన, వాతావరణ అనుకూలత ఉంటే ఆక్వాకల్చర్ లాభదాయకమే. అయితే కనీస మెలకువలు, అవగాహన లేక నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, భౌతిక, రసాయనిక మార్పులతో రొయ్యలు మనుగడ సాగించలేకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. చేపలు చనిపోతే నీటిలో పైకి తేలతాయి. కానీ రొయ్యలు చనిపోతే చనిపోయినట్లు కూడా తెలియదు. రొయ్య పిల్లలు చనిపోతే చెరువులో కిందకు చేరి వ్యర్థాలుగా మారి విషపూరిత రసాయనాలుగా మారతాయి. ఎగువ భాగంలో ఉండే చెరువు నీటిలో వైరస్ ఉంటే.. అది దిగువన ఉన్న చెరువులకు కూడా సోకుతుంది. దీన్ని ఆక్వా రైతులు గ్రహించలేకపోతున్నారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో ఎకరానికి వేయాల్సిన రొయ్యల పిల్లల సంఖ్య కంటే రెట్టింపు వేస్తున్నారు. దీంతో అవి పెరిగేందుకు చెరువు సరిపోవడం లేదు. అంతేకాకుండా కృత్రిమ ఆహారం, రసాయనిక ఆహారాలను రెట్టింపు వేస్తున్నారు. ఆహారం మొత్తం పిల్లలకు చేరకుండా సగం నీటిలో కలిసి అడుగున విషపదార్థంగా మారుతుంది. ఈ వాతావరణంలో పెరిగిన రొయ్యలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి రొయ్యలనే విదేశాలు తిప్పిపంపేస్తున్నాయి. – ఆచార్య కె.వీరయ్య, కోఆర్డినేటర్, మ్యాట్రిక్స్ ఆక్వాకల్చర్ సెంటర్, ఏఎన్‌యూ