
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్‌ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్‌ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు.
