
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల అక్రమాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు నాలుగు వారాల్లో పంపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్‌హెఆర్‌సీ పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదు? ఎఫ్ఐఆర్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదు? అని డీజీపీని ప్రశ్నించింది.
ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదిక పరిస్థితిని అందించడంతో పాటు.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీకి సూచించింది.
కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వివరణ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment