భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్‌లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్‌ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్‌కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్‌డ్ టోవ్‌డ్ ఆర్టిలరీ గన్‌లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు
‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్‌లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment