Defence
-
యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్
అమెరికా తన రక్షణశాఖలో పనిచేస్తున్న 5,400 మంది సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నట్లు తెలిపింది. అమెరికా పెంటగాన్(యూఎస్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం)లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సిబ్బంది సందర్శించి వచ్చే వారం నుంచి ప్రొబేషనరీ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏడాది కంటే తక్కువ కాలం సర్వీసులో ఉన్నవారిపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది. దాంతోపాటు తదుపరి నియామకాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీఓజీఈ స్పష్టం చేసింది. యూఎస్ రక్షణశాఖ సామర్థ్యాన్ని పెంచడం, ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.కొవ్వును తగ్గించి కండరాలు పెంచాలి..అమెరికాలో మొత్తంగా ప్రభుత్వ అదీనంలోని శ్రామిక శక్తిని 5-8% తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. సామర్థ్యాలను పెంచడానికి, అధ్యక్షుడి ప్రాధాన్యతలపై డిపార్ట్మెంట్ దృష్టి సారించిందన్నారు. ఈ లేఆఫ్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కొవ్వు(హెడ్ క్వార్టర్స్‌లోని సిబ్బంది)ను తగ్గించి కండరాలను (వార్ఫైటర్లు) పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ విభాగంలో ఉన్న వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్యలపై కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అంతిమంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతలకు నిధులు సమకూర్చేందుకేనని అభిప్రాయపడుతున్నారు.అతిపెద్ద అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ విభాగంలో 7,00,000 మందికి పైగా పూర్తికాల కార్మికులు పనిచేస్తున్నారు. ఫెడరల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రుణాల ముందస్తు ముగింపుపై ఛార్జీలొద్దుపెంటగాన్పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం. వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న ఈ ఆఫీస్ 6.5 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనాల్లో ఒకటిగా ఉంది. వీటిలో కేవలం 3.7 మిలియన్ చదరపు అడుగులను మాత్రమే కార్యాకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ భవనాన్ని యూఎస్ మిలిటరీకి చిహ్నంగా భావిస్తారు. ఇందులో సుమారు 23,000 మంది సైనిక, ఇతర ఉద్యోగులు, 3,000 మంది రక్షణేతర సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. -
‘త్రివిధ దళాల ఎక్స్ పో’ కోసం ప్రభుత్వ ప్రణాళికలు
దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, ఎగుమతులు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాల వార్షిక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఏకీకృత కార్యక్రమం ఇటీవల జరిగిన ప్రత్యేక ఏరోఇండియా(AeroIndia) ప్రదర్శనను భర్తీ చేయనుంది. లాజిస్టిక్ సవాళ్లు, పరిమిత ప్రదేశంలో నిర్వహణ సమస్యలను కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రదర్శన పరిష్కరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.ఏకీకృత కార్యక్రమం: ఏరోఇండియా పేరుతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఏరోస్పేస్ షో పద్ధతిని తొలగించి త్రివిధ దళాల ఎక్స్పోను నిర్వహించాలని యోచిస్తున్నారు. డిఫెన్స్, ఎయిర్, నేవీ వ్యవస్థలపై ఈ ఎక్స్‌పోలో దృష్టి సారిస్తారు.లాజిస్టిక్ సవాళ్లు: ఏటా ఏరోఇండియా ప్రదర్శన బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. అయితే పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు లాజిస్టిక్ సవాళ్లు సమస్యగా మారుతున్నాయి. దీనికోసం మరింత అనువైన వేదికను సిద్ధం చేసి దీనికి పరిష్కారం అందించాలని కొత్త ఎక్స్ పో లక్ష్యంగా పెట్టుకుంది.వ్యాపార ధోరణి: త్రివిధ దళాల ఎక్స్ పో ద్వారా వాటాదారులందరూ హాజరై వ్యాపార కార్యక్రమాలపై దృష్టి సారించడం సులభతరం అవుతుంది. ఇది ఎగుమతులను ప్రోత్సహించడానికి, వ్యాపార భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు సహాయపడుతుంది.ఫ్లాగ్ షిప్ ఈవెంట్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించి విదేశీ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?రక్షణ రంగంపై ప్రభావంత్రివిధ దళాల ఎక్స్ పో నిర్వహించడం ద్వారా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి, వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక వేదికను సిద్ధం చేసినట్లవుతుంది. ఇది రక్షణ పరిశ్రమపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. రక్షణ రంగంలోని ఉత్పత్తుల తయారీలో దేశ స్వావలంబనకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
రక్షణ బడ్జెట్ రూ.6.81 లక్షల కోట్లు.. ఏం చేస్తారో తెలుసా..?
కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి రూ.6,81,210 కోట్లు కేటాయించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా భూభాగంలో సాయుధ దళాలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రక్షణ బడ్జెట్లోని ముఖ్యాంశాలుమూలధన వ్యయం: రూ.1,92,387 కోట్లుమూలధన వ్యయంలో కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్వేర్లలో పెట్టుబడులు పెడుతారు. 2024-25లో మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ.1,59,500 కోట్లుగా ఉన్నాయి.రెవెన్యూ వ్యయం: రూ.4,88,822 కోట్లుఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పింఛన్లు ఉంటాయి. సైనిక పింఛన్లకు రూ.1,60,795 కోట్లు కేటాయించడం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఆధునీకరణపై దృష్టిపెంచిన బడ్జెట్ కేటాయింపులు భారత సాయుధ దళాలలో ఆధునికీకరణ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి. ఆపరేషనల్ సంసిద్ధతను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టనున్నారు. సైనిక స్థావరాలు, శిక్షణ సౌకర్యాలు, లాజిస్టిక్స్‌తో సహా రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, విమానాలు, నౌకాదళ నౌకలను కొనుగోలు చేస్తారు. -
భారత డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్‌లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్‌కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్‌లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. -
దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను సమకూర్చడం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. యుద్ధ రంగానికి సంబంధించిన సవాళ్లలో మార్పుల నేపథ్యంలో కచ్చితమైన, అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో బలగాలకు సరైన సమయానికి అందే సమాచారమే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుందని అన్నారు. యుద్ధ క్షేత్రంలోని వారికి సరైన సమయంలో కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తేనే శత్రువును దెబ్బకొట్టగలుగుతారన్నారు. అందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ కేంద్రాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల్లో రూ.3,200 కోట్ల నిధులతో భారత నావికాదళం నిర్మిస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమాచారం, సాంకేతికత కీలకం ‘దేశ భద్రతలో అత్యంత కీలకమైన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో సంతోషంగా ఉంది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందించాల్సిన విషయం. భారత రక్షణ రంగంలో డాక్టర్ కలాం అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. భారత్‌కు కొత్త సైనిక సాంకేతికతను అందించడంతో పాటు, ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తినిచ్చారు. కొత్తగా నిర్మించనున్న రాడార్ స్టేషన్‌తో భారత నౌకాదళ సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుంది. కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు సాఫీగా నడవడంలో సమాచారం, సాంకేతికత ఎంతో కీలకంగా వ్యవహరించాయి. భారతదేశం తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, బలమైన సముద్ర దళంగా ఉండాలంటే పటిష్టమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం అవసరం..’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఉండాలి ‘పర్యావరణంపై ప్రాజెక్ట్ ప్రభావం లేకుండా చూస్తాం. పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండొద్దు. దేశ భద్రతే ప్రధానం. ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఐదేళ్లే అధికారంలో ఉన్నా..భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశం రక్షణ విషయానికి వస్తే అంతా ఏకమవుతామని ఈ రాడార్ కేంద్ర శంకుస్థాపనతో నిరూపితమైంది..’ అని రక్షణ మంత్రి అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. వ్యవసాయంలో అధునిక పద్ధతులు, అభివృద్ధితో దేశంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సంస్థలతో పాటు రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుంది. తాజాగా వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభమైతే స్థానిక ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది..’ అని రాజ్‌నాథ్ వివరించారు. అభివృద్ధి తప్ప ప్రకృతి అనర్ధాలు లేవు: సీఎం దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటును కొందరు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలతో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దీనికి భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలన్నీ 2017లో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి దర్శనానికి దారి వదలండి. విద్యా సంస్థల్లో స్థానికులకు అవకాశం కల్పించండి. వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని రక్షణశాఖ మంత్రికి నేను మాట ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నౌకాదళ ముఖ్య అధికారి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ.. భారత నావికాదళ కమ్యూనికేషన్ సామర్థ్యాలలో కొత్త అధ్యాయానికి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌కు సీఎం, కేంద్రమంత్రుల స్వాగతం వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శంకుస్థాపనకు హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో అంతా రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్‌నాథ్ సాయంత్రం 4.01 గంటలకు హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుని 4.18 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. -
మొరాకోలో టాటా డిఫెన్స్ ఫ్యాక్టరీ.. విదేశాల్లో స్వదేశీ బ్రాండ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫామ్‌లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి. -
రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ కంపెనీలు దేశంలో తయారీని ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో స్థానికంగా ఉత్పాదకత పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు హెచ్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల దేశ ఆదాయం ఊపందుకుంటుంది. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. రక్షణశాఖలోనూ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం ఈ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. డిఫెన్స్ విభాగానికి అవసరమయ్యే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఆ రంగం అభివృద్ధికి కేంద్రం మూలధనం సేకరించాలని ప్రతిపాదించింది. అందుకోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)తో కలిసి ఇటీవల రూ.1.44 లక్షల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌సీఈ) కొనుగోలు చేయనున్నారు. ఎఫ్‌ఆర్‌సీఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగి రియల్‌టైమ్ పరిస్థితులను అంచనావేస్తూ శత్రువులపై పోరాడే యుద్ధ ట్యాంక్. ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లుఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇది గగనతలంలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించి ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంటలతో వాటిని నియంత్రిస్తుంది.ఇదీ చదవండి: ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహంఇండియన్ కోస్ట్ గార్డ్ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఆమోదించారు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు చేయనున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్. అధునాతన సాంకేతికత కలిగిన దీన్ని తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించనున్నారు. ఏదైనా విపత్తుల సమయంలోనూ ఇది సహాయపడుతుంది. -
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. -
డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్!
పాకిస్థాన్ గతేడాదితో పోలిస్తే రక్షణరంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాక్ ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది.పాక్ బుధవారం రూ.18లక్షలకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాయాదిదేశం గతేడాది రక్షణ రంగానికి రూ.1.8లక్షల కోట్లమేర నిధులు ఇచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికిగాను రూ.1.5లక్షలకోట్లు ఖర్చుచేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికిగాను డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15 శాతం ఎక్కువ. కాగా, రానున్న బడ్జెట్ సెషన్లో భారత్‌కూడా ఆమేరకు కేటాయింపులు పెంచుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మొత్తం తన బడ్జెట్లో దాదాపు 12 శాతం రక్షణ రంగానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో భారత్ కూడా ఆ శాఖకు నిధులు గుమ్మురిస్తుందనే వాదనలున్నాయి. ఒకవేళ రానున్న బడ్జెట్ సమావేశాల్లో భారత్ డిఫెన్స్ రంగానికి కేటాయింపులు పెంచితే ఆ రంగంలోని లిస్టెడ్ కంపెనీల స్టాక్‌లు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం–2 మిస్సైల్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎస్‌యూ–30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం–2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం–2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర ఎం–2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. -
రక్షణరంగ బడ్జెట్‌ను మరింత పెంచిన చైనా
చైనా తన రక్షణరంగ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
దక్షిణాసియాలోనే అతిపెద్ద డిఫెన్స్ కాంప్లెక్స్ ఏర్పాటు.. ఎక్కడంటే..
భారత రక్షణ రంగానికి తోడ్పాటునందించేలా ‘అదానీ డిఫెన్స్’ మరో ముందడుగు వేసింది. అదానీ డిఫెన్స్‌కు చెందిన దక్షిణాసియాలోనే అతిపెద్దదైన మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజా సుబ్రమణి పాల్గొన్నారు. రక్షణ శాఖ, యూపీ ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. భారత ఆర్మీ 2019 ఫిబ్రవరి 26న ‘ఆపరేషన్ బందర్’ పేరుతో పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంపై వైమానిక దాడిని నిర్వహించింది. ఈ ఆపరేషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సును అధికారికంగా ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌లో రానున్న అద్భుతమైన అప్డేట్లు.. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సదుపాయంలో పెద్దఎత్తున మందుగుండు సామగ్రి, బుల్లెట్లు, క్షిపణులను తయారు చేయనున్నారు. కాన్పూర్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌కు భూమిని కేటాయించిన 18 నెలల్లోనే కార్యకలాపాలను మొదలుపెట్టడం అనేది ముఖ్యమైన అంశమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ప్రాజెక్టును చేపట్టాం. దీనివల్ల 4,000 ఉద్యోగాలు ఏర్పడతాయి’ అని అదానీ డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ వెల్లడించారు. -
అమెరికాకు అదిరిపోయే కౌంటరిచ్చిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: అగ్ర రాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అంతరిక్ష హక్కులు, తాము ప్రయోగించిన నిఘా ఉపగ్రహానికి అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా మండిపడినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్రమంలో నార్త్ కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని తాము యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెలిపారు. తమ చట్టబద్ధమైన అంతరిక్ష ఉపగ్రహా కార్యక్రమాలకు సంబంధించిన విధానాలను ఉల్లంఘించడానికి ప్రయత్నస్తే.. తాము కూడా అమెరికా గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేయటం, ప్రతిఘటించడానికి తమదైన వ్యూహాలను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా స్వీయ రక్షణలో భాగంగా అమెరికా స్పేస్ కమాండ్ ప్రతినిధి షెరిల్ క్లింకెల్ మాట్లాడుతూ.. అన్ని డొమైన్లలోని తమ ప్రత్యర్థి దేశాల శక్తి, సామర్థ్యాలను తాము ఎందుర్కొవటంతో పాటు, అవసరమైతే వాటిని నాశనం చేసే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర కోరియా బాలిస్టిక్ టెక్నాలజీ ఉపయోగించి చేపట్టే పలు క్షిపణీ పరీక్షల విషయంలో యూఎన్ తీర్మాణాల పాటించని విషయం తెలిసిందే. అయితే అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాలకు బాలిస్టిక్ క్షిపణలు అభివృద్ధికి మధ్య సాంకేతికత విషయంలో దగ్గరి సంబంధాలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
Madhavi Kattekola: జై జవాన్‌కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్
మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్, విద్యుత్ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ రింగ్ ప్లస్ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్, రింగ్ ప్లస్ అక్వా, మైనీ ప్రెసిషన్లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. -
గాజాలో ఇజ్రాయెల్ దాడులు అంతకు మించి: చైనా
బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం పెద్ద యుద్ధంగా పరిణామం చెందకుండా చైనా సహకారాన్ని కోరుతూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజే చైనా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయి. "పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఎవరూ ఎటువంటి చర్య తీసుకోకూడదు. వీలైనంత త్వరగా చర్చల దిశగా అడుగులు వేయాలి." అని వాంగ్ యి సౌదీ విదేశాంగ మంత్రితో ఈ మేరకు మాట్లాడారు. కాగా.. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం పశ్చిమాసియాను సందర్శించనున్నారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి తన పాత్రను పోషించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య ముగియడానికి ఏకైక మార్గం ఇరుదేశాలు చర్చలను ప్రారంభించడమేనని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం టూ- స్టేట్ ఫార్ములాగా పేర్కొన్న చైనా.. పాలస్తీనా స్వతంత్రానికి పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా స్పందన సరిగా లేదని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా ప్రకటన అసత్యంగా ఉందని ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచించకుండా ప్రకటన వెలువరించిందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..లాభాల్లో డిఫెన్స్ స్టాక్స్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్ రంగ స్టాక్‌లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిన డిఫెన్స్స్టాక్లో ర్యాలీ కనబడుతుంది. యుద్ధంలో వాడే వార్హెడ్ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో లిస్టయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి రక్షణరంగ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనిపించింది. అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్‌కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్‌లైన్ స్టాక్స్ పడిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఎయిర్‌లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్‌కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. -
మూన్ మూడ్: చంద్రయాన్–3 షేర్లు జిగేల్
చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. చంద్రయాన్–3 మిషన్‌కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్‌ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్అండ్టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం! చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
జెన్ టెక్నాలజీస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ శిక్షణా సంబంధ సొల్యూషన్స్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 47 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 7.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 3 రెట్లుపైగా ఎగసి రూ. 132 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 37 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. సిమ్యులేషన్ ఎగుమతుల విజయవంత నిర్వహణ, దేశీయంగా యాంటీడ్రోన్ ఆర్డర్లు వంటి అంశాలు ప్రోత్సాహకర పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అశోక్ అట్లూరి పేర్కొన్నారు. కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,000 కోట్లుకాగా.. వీటిలో రూ. 202 కోట్లు క్యూ1లో సాధించినట్లు వెల్లడించారు. ఈ బాటలో జులైలో మరో రూ. 500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 675 వద్ద ముగిసింది. -
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్‌నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్‌కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
బరాక్ ఒబామాపై బీజేపీ నేతలు ఫైర్..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశంలో మైనారిటీల భద్రత గురించి ప్రశ్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొదట వ్యాఖానించగా ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా వ్యాఖ్యలపై మొదట స్పందించిన నిర్మలా సీతారామన్.. మీ హయాంలో మొత్తం ఆరు ముస్లిం దేశాలపైన దాడులు జరిగాయని, దాదాపుగా 26 వేలకు పైగా బాంబులు వేశారు. ఆయన మాటలను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించే ఏకైక దేశం భారతదేశమని, ఈ విషయం ఒబామా మరచిపోకూడదని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు చేశారన్నది కూడా ఆలోచించాలని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh speaks on former US President Barack Obama's remarks about the rights of Indian Muslims "Obama ji should not forget that India is the only country which considers all the people living in the world as family members... He should also think… pic.twitter.com/k7Swn7HpW1 — ANI (@ANI) June 26, 2023 ఇది కూడా చదవండి: ప్రధానికి మణిపూర్‌లో పరిస్థితిని వివరించిన అమిత్ షా -
అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్–ట్రాక్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్‌కు అందజేయానికి జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్ అస్టిన్ వద్ద రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్‌లో బేసిక్ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) కుదిరింది. -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్‌కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది. -
మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్
ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్‌పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొనసాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం. ► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరించుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్ వద్ద 4,614 ట్యాంకులున్నాయి. ► అర్జున్ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్ సైన్యం వద్ద ఉన్నాయి. ► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం. ► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరువున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్’ చేపట్టింది. ► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అమెరికాలోనే ఎక్కువగా.. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశాలు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యాధునిక లెపర్డ్–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు. ఉక్రెయిన్ వద్ద ఆనాటి ట్యాంకులు ఉక్రెయిన్ ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగం. ఉక్రెయిన్ వద్ద ఉన్న యుద్ధ ట్యాంకుల్లో యూఎస్ఎస్ఆర్ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు. ర్యాంకుల కథాకమామిషు.. ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్ ఫైర్ పవర్’ ర్యాంకులు ఇస్తోంది. -
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె
-
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
హనీట్రాప్: భారత క్షిపణుల డేటా పాకిస్థాన్, చైనాలకు అందిందా?
సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్‌రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. జర్నలిస్టుగా పరిచయం చేసుకుని.. మల్లికార్జున్‌రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్‌లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్‌గా మల్లికార్జున్‌తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్‌లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది. వలపు వలతో ముగ్గులోకి దింపి.. ఓ దశలో మల్లికార్జున్‌రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్డీఓ కె–సిరీస్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా (ఎస్ఎల్బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్‌తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్‌లతో పాటు సాగరిక సిరీస్‌కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది. సిమ్రన్, ఓమీషా పేర్లతో.. ఈమె ఫేస్బుక్లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్‌రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ వ్యయం ఏటేటా ఎగబాకుతోంది. ప్రపంచ సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సరికొత్త శిఖరాలకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా(38%), చైనా(14%), భారత్(3.6%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించింది. ప్రపంచ సైనిక వ్యయం మొత్తంలో మొదటి 5 దేశాలదే 62 శాతం ఉండటం గమనార్హం. బ్రిటన్(3.2%), రష్యా(3.1%).. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్ఐపీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనప్పటికీ ప్రపంచ దేశాల రక్షణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎస్ఐపీఆర్ఐ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డిగో లోపెస్ డా సిల్వా వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకోవడంతో రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ సంఖ్య 2.3 శాతంగా ఉంది. అమెరికా మిలటరీ ఖర్చులు 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 1.4 శాతం తగ్గింది. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను 24 శాతం పెంచింది. అదే సమయంలో ఆయుధాల కొనుగోళ్ల ఖర్చు 6.4 శాతం తగ్గించింది. రెండో స్థానంలో ఉన్న చైనా 2020తో పోల్చితే 4.7 శాతం వృద్ధితో 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించింది. గత ఏడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020తో పోల్చితే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి భారత రక్షణ వ్యయం 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించారని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. (క్లిక్: భారత్‌కు బంపరాఫర్.. అమెరికా, యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!) బ్రిటన్ గత సంవత్సరం రక్షణ కోసం 68.4 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం పెంచడంతో 65.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా మూడో సంవత్సరం మిలటరీ పద్దు పెరగడంతో రష్యా సైనిక వ్యయం 2021లో జీడీపీలో 4.1 శాతానికి చేరుకుంది. (క్లిక్: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు) -
ఉక్రెయిన్‌పై రష్యా ‘కింజల్’ ప్రయోగం.. అమెరికా ఏం చెప్పిందో చూడండి!
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టి 27 రోజులైనప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు కూడా రష్యన్ బలగాలు ప్రయోగిస్తున్నాయి. ఇటీవల అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’ను కూడా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి అని కూడా చెప్పింది. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. (చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!) అయితే తాజాగా ఆ ప్రకటనలను అగ్రరాజ్యం అమెరికా తోసిపుచ్చింది. దీనిపై అమెరికా రక్షణశాఖ అధికారి మాట్లాడుతూ.. సైనికులు అలాంటి ఆయుధాన్ని ఉపయోగించడం అంత సులువు కాదని, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ తరహా ఆయుధాల్ని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అయితే రష్యా ఇటువంటి ప్రకటనల ద్వారా పశ్చిమ దేశాలకు హెచ్చరిక సందేశాలు పంపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. కింజల్ ప్రయోగించడంపై అసలు స్పష్టతే లేదని ఆయన అన్నారు. కాగా రష్యా మిలిటరీ అధికారుల ప్రకారం.. ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్‌ను ప్రయోగించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే ) -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం.. భారత్‌లో రాకెట్లా దూసుకెళ్తున్న షేర్లు ఇవే!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ఆ తర్వాత అనంతర పరిణామాలతో ఇన్వెస్టర్ల ఆలోచణ ధోరణిలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రష్యా దాడులు, అమెరికా దాని మిత్ర పక్ష దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా బడా వ్యాపారాల భవిష్యత్తు డోలయమానంలో పడగా, వాటి లాభాల మార్జిన్లకు కోతలు పడుతున్నాయి. అయితే యుద్ధం తెచ్చిన ఉద్రిక్తల కారణంగా రక్షణ రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు రయ్‌రయ్‌మంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి మూడు వారాలు దాటినా నేటికి ఫలితం తేలలేదు. పైగా రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఓ పక్క. అమెరికా దాని మిత్ర పక్షలు ఒక పక్క అనే పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాలు మూడో ప్రపంచ యుద్దం ముంగిట సంయమనం పాటిస్తున్నాయి. కానీ యుద్ధ భయాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాలకు వేదికగా నిలిచిన యూరప్ దేశాలు తమ రక్షణ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. నాటోను నమ్మలేం మరోవైపు కీలక సమయంలో నాటో దేశాలు చేతులెత్తాశాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను పునరాలోచనలో పడేసింది. దేశ రక్షణ విషయంలో ఔట్సోర్సింగ్ నమ్మదగిన వ్యవహారం కాదనేట్టుగా పరిస్థితులు మారాయి. చాలా దేశాలు రక్షణ బడ్జెట్ పెంచే యోచనలో ఉన్నాయి. అస్థిరంగా ఆయిల్ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తదనంతర పరిణామాల్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవి చూశాయి. ఇన్వెస్టర్లు వివిధ కంపెనీల్లో తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుని ఆయిల్, బంగారంలలో పెట్టుబడులు పెట్టారు. కానీ ముడి చమురు ధరలు మరింర అస్థిరంగా మారాయి. కేవలం పది రోజలు వ్యవధిలోనే బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల వరకు హెచ్చు తగ్గులు చవిచూసింది. బంగారానిది ఇదే బాట. దీంతో నమ్మకమైన పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు రక్షణ రంగంలో ఉన్న కంపెనీల వైపుకు చూస్తున్నారు. ఫలితగా డిఫెన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీల స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. డిఫెన్స్‌పైనే గురి - డిఫెన్స్ సెక్టార్‌కి అవసరమైన ముడి పరికరాలు తయారు చేసే భారత డైనమిక్స్ షేరు ధర ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూ. 529లు ఉండగా మధ్యాహ్నాం దాదాపు 7 శాతం వృద్ధితో రూ.36లు లాభపడి 558.65కి చేరుకుంది. - మన దేశంలో డిఫెన్స్‌లో ఎంతో కీలకమైన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ షేరు ధర ఈ రోజు ఉదయం రూ. 1394ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 4.13 శాతంత వృద్ధితో రూ.1433 దగ్గర ట్రేడవుతోంది. - భారత్ ఎలక్ట్రానిక్ షేరు ఒక శాతం వృద్ది కనబరిచి రూ.207.80 దగ్గర ట్రేడవుతోంది - భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) షేర్లు రూ.25ల లాభంతో 1.65 శాతం వృద్ధి కనబరిచి రూ.1542 దగ్గర ట్రేడవుతోంది. - కీలకమైన సెమికండక్టర్లు తయారు చేసే ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్ లిమిటెడ్ షేరు 4.52 శాతం వృద్ధితో రూ.226.55 దగ్గర ట్రేడవుతోంది. జెన్ టెక్నాలజీస్ షేర్లు సైతం లాభాల్లో ఉన్నాయి. చదవండి: Ukraine War: శాంతించిన క్రూడ్.. దిగొచ్చిన బంగారం! -
Anand Mahindra: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?
టాలీవుడ్లోనే కాదు రిమేకైన అన్ని భాషల్లో దుమ్ము రేపింది పోకిరి సినిమా. ఆ సినమాలో ఫేమస్ డైలాగుల్లో ఒకటి.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహేశ్ మాటలతోనే తూటాలు పేల్చాడు. సరిగ్గా అలాంటి డైలాగ్‌నే చైనా రక్షణ బడ్జెట్ కేటాయింపులను ఎద్దేవా చేస్తూ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి దాదాపు 230 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు చైనా ప్రకటించింది. ఇంచుమించు అమెరికా స్థాయిలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయించింది చైనా. మన దేశ రక్షణ బడ్జెట్‌తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. వీటిని ప్రస్తావిస్తూ చైనాకు చురకలు అంటించారు ఆనంద్ మహీంద్రా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉదహారిస్తూ సైజ్ అనేది అసలు విషయమే కాదు. ఫ్యూచర్లో యుద్ధ రీతులు మొత్తం మారిపోనున్నాయి. భారీగా ఉండే యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌ని అతి చిన్నగా ఉండే సాయుధ డ్రోన్లు తుత్తునియలు చేశాయి. ఎంత ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్‌గా ఖర్చు పెట్టామన్నదే లెక్క అంటూ బడాయిలకు పోయిన చైనాకు చురకలు అంటించారు ఆనంద్ మహీంద్రా. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ చైనా పట్ల వ్యంగగా చేసిన ట్వీట్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. భవిష్యత్తులో వార్ఫేర్ పూర్తిగా మారిపోనుందన్నారు. శాటిలైట్, కమ్యూనికేషన్ ఆధారిత యుద్ధం ప్రధానంగా జరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగా మారడం బెటర్ తప్పితే భారీ ఆయుధాలు సమకూర్చుకోవడం వృధా అంటున్నారు నెటిజన్లు. ‘Size doesn’t matter.’ The future of warfare will be different. In the Ukraine, armed drones are playing havoc with convoys of tanks. It’s not how much we spend but how smartly we spend that will matter… https://t.co/K5VoFkZ6wd — anand mahindra (@anandmahindra) March 9, 2022 చదవండి: Anand Mahindra: రష్యా - ఉక్రెయిన్ దేశాలే కాదు..ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది -
తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!
Helicopter Flew Without Pilot: ఇక నుంచి హెలికాప్టర్లను నడపటానికి ఫైలెట్లు అవసరం ఉండదట. పైగా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే గలిగే ఫైలెట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ప్రత్యక సాంకేతికతో రూపొందించిన ఈ చాపర్ 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైగా దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానం స్వయం ప్రతిపత్తితో పయనించే హెలికాప్టర్. ఇది అలియాస్ అనే యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పూర్తిగా కంప్యూటర్-ఆపరేటెడ్ హెలికాప్టర్. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ నుంచి ఈ ట్రయల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో పనితీరు ముగిసిన వాటిని తొలగించి, వాటి స్థానంలో అలియాస్ ఈ ఆటోమేటడ్ ఫైలెట్ రహిత హెలికాప్టర్లను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ మేరకు అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ మాట్లాడుతూ..."ఈ రకమైన స్వయంప్రతిపత్త హెలికాప్టర్ సాంకేతికతకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది భద్రత తోపాటు భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం. రెండవది హెలికాప్టర్ సహాయకారి. మూడవది ఖర్చు తగ్గింపు. అని పేర్కొన్నాడు. ఇది ఆర్మీకి కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇది తప్పనిసరిగా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లో ఈ పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా పయనించడమే కాక క్లిష్టమైన దృశ్యమన రహిత వాతావరణ పరిస్థితిల్లోనూ, విభిన్న క్లిష్ట పరిస్థితిలోనూ సులభంగా పయనించగలిగే వెసులుబాటుని కల్పిస్తోంది. WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe — Reuters Asia (@ReutersAsia) February 12, 2022 (చదవండి: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..) -
యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు
కోల్‌కతా: మేకిన్ ఇండియాను మేక్ ఫ్రమ్ ఇండియాగా మార్చే కార్యక్రమానికి మద్దిస్తూ మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) తాజాగా నావల్ గ్రూప్ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది. సర్ఫేస్ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. తద్వారా దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. ఇందుకు రెండు సంస్థల అధికారులూ ఎంవోయూపై సంతకాలు చేశారు. యూరోపియన్ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా జీఆర్ఎస్ఈ గోవిండ్ డిజైన్ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్ఎస్ఈ రూపొందించనుంది. ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్ఎస్ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది. -
ఇటలీ విమానంపై కాల్పులు
రోమ్: కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అఫ్గాన్ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగినట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్ పౌరులతో కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారని మీడియా వెల్లడించింది. పైలట్ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్ తెలిపారని పేర్కొంది. తమ సీ–130 రకం రవాణా విమానంపై కాబూల్‌లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అఫ్గాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది విదేశీయులతోపాటు, అఫ్గాన్ పౌరులను ఖాళీ చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. -
ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తయింది. 75వ ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఇన్నేళ్లలో భారత్ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. అలాగే రక్షణ రంగంలో కూడా గొప్ప పురోగతిని సాధించింది. పాకిస్తాన్, చైనాలతో తొలినాళ్లలో జరిగిన యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడు మనదేశ రక్షణ రంగం పూర్తి స్థాయిలో బలోపేతం అయింది. మనం శత్రువును దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని పెంచుకున్నాం. బరువు తగ్గింది: మన రక్షణరంగం ఇప్పుడు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను సంతరించుకుంది. సైనికుల దుస్తుల దగ్గర నుంచి ఆయుధాల వరకు ప్రతిదీ అధునాతనమైంది. బరువైన హెల్మెట్ల స్థానంలో బుల్లెట్ ప్రూఫ్ ఫైబర్ హెల్మెట్లు వచ్చాయి. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లున్నాయి. మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో డ్యూటీ చేయడానికి వీలుగా షూస్, కళ్లద్దాల వంటివి గతంలో ఉండేవి కాదు. ఇప్పుడవన్నీ ఉన్నాయి. నైట్ విజన్ గాగుల్స్, బైనాక్యులర్స్, గుడారాల మెటీరియల్ నుంచి పారాషూట్ల వరకు ప్రతిదీ అధునాతనమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ అభివృద్ధి చెందినంత వేగంగా రక్షణ రంగం కూడా మెరుగవుతూ వచ్చింది. ఎంత కఠినమైన ప్రదేశాల్లో అయినా ప్రయాణించగలిగిన వాహనాలను, అదికూడా తక్కువ బరువు కలిగి, ఎక్కువ మైలేజీనిచ్చే ప్రత్యేక లక్షణాలతో వాహనాలను దేశీయంగా తయారు చేసు కున్నాం. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కొండల మధ్య ఇరుకుదారులను రహదారులుగా మార్చుకున్నాం. ఒకప్పుడు... ప్రత్యర్థి మన భూభాగంలోకి వచ్చినట్లు తెలిసిన తర్వాత మన సైన్యం ఆ ప్రదేశానికి చేరడానికి రోజులు పట్టేది. ఇప్పుడు గంటలో చేరి పోగలుగుతున్నాం. గురి పెరిగింది: ఆయుధ సంపత్తి విషయానికి వస్తే... రైఫిల్స్ నుంచి యుద్ధట్యాంకుల వరకు ప్రతిదీ ఒక మెట్టు... రెండు మెట్లు కాదు... వందమెట్లు పై స్థాయికి చేరినట్లు చెప్పుకోవాలి. మొదట్లో మనం బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ వాడే వాళ్లం. తర్వాత వచ్చిన 7.62 ఎంఎం రైఫిల్స్ కూడా బరువుగానే ఉండేవి. ఇప్పుడున్న 5.56 ఎంఎం రైఫిళ్లు తేలికగా ఉండడంతోపాటు సమర్థవంతమైనవి. టూ ఇంచ్ మోటార్లు, రాకెట్ లాంచర్లు, మెషీన్‌గన్, మిస్సైల్స్... అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి. ట్యాంకులయితే టీ 55, టీ 72 నుంచి అత్యుత్తమ శ్రేణి అర్జున్ ట్యాంకులున్నాయి. మనం రాడార్ వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో... మన సరిహద్దుకు ఇవతల ఎంతో లోపల ఉండి కూడా సరిహద్దు అవతల ప్రత్యర్థి కదలికలను అంచనా వేయగలుగుతున్నాం. బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉన్న సైనికులకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాం. మన సైనికులు సురక్షితమైన రహస్య ప్రదేశం నుంచి దూరాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఆయు ధాలున్నాయి. నీటి నుంచి నింగి వరకు: నేవీ రంగం... మిస్సైల్ షిప్‌లు, సబ్మెరైన్లు, న్యూక్లియర్ సబ్మెరైన్ల సంఖ్యను బాగా పెంచుకుంది. ఎక్కడ అవసరం వస్తే తక్షణం అక్కడ మోహరించగలిగినంత శక్తిమంతంగా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో విక్రాంత్, విరాట్ ఉండేవి. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు మన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. మిగ్ 21, 23, 27, జాగ్వార్‌తోపాటు రఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి ఫిఫ్త్ జనరేషన్ సిస్టమ్ యుద్ధ సామగ్రిని సమకూర్చుకున్నాం. పైగా ప్రస్తుతం మన సైనికులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో శిక్షణ నిస్తున్నాం. గెలుపు ధీమా: ఇన్ని ప్రత్యేక చర్యల ద్వారా మన సైనికుల్లో గెలిచి తీరుతామనే ధైర్యం పెరిగింది. ఒక తరం కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ... ‘ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి’ అనే పట్టుదలతో పోరాడింది. ఇప్పుడు మనదేశం సాధించిన యుద్ధనైపుణ్యం సైనికులకు భరోసానిస్తోంది. సైనికుల్లో ‘ఎంతటి ప్రత్యర్థి మీద అయినా సరే ఒక మెట్టు మెరుగ్గా పోరాడి విజయం సాధించగలం. భారత్‌ను గెలుపు పీఠం మీద నిలబెట్టగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. - కల్నల్ పి. రమేష్ కుమార్ (రిటైర్డ్) వ్యాసకర్త డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్, తెలంగాణ (సంభాషణ: వాకా మంజులారెడ్డి) -
ఏరోస్పేస్,డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ బెస్ట్ : కేటీఆర్
-
విమానాల గ్యారేజ్! ఇక్కడ విమానాలు రిపేర్ చేయబడును
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైమానిక, అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఎంఆర్వో రంగంలో అంతర్జాతీయంగా అవకాశాలు పెరుగుతుండటంతో కొత్త అవకాశాలతో భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల అవసరాలు తీర్చొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్ ఏరోటెక్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఆర్వో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్వో హబ్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖత చూపుతుండటంతో నిర్వహణ, మరమ్మ తులు, ఓవర్ హాలింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. భారత్‌లో ఎంఆర్వో రంగం ఏటా 15% వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.10వేల కోట్ల పరిశ్రమగా ఎదుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణ కూడా వీటి బాటలోనే నడవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఓఈఎం కంపెనీల పెట్టుబడులు వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా మారుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు టాటా, అదానీ, కల్యాణి వంటి దేశీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టాటా గ్రూప్ తమ ఏరోస్పేస్ ఉత్పత్తుల్లో 90 శాతం హైదరాబాద్ నుంచే తయారు చేస్తోంది. జీఈ, సాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏరో ఇంజిన్ తయారీ కర్మాగారాలను ఏర్పాటు స్థాపించగా, బోయింగ్ సంస్థ అపాచీ, చినోక్స్ హెలీకాప్టర్లు, యుద్ధ విమానాల విడిభాగాలు, లాక్‌హీడ్ హెలికాప్టర్ క్యాబిన్లు, ఎఫ్–16 రెక్కలను తయారుచేస్తోంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు సీఎఫ్ఎం, ఫ్రాట్ అండ్ విట్నీ రాష్ట్రంలో ఇంజిన్ ట్రైనింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాయి. మౌలిక వసతులు, శిక్షణపై దృష్టి వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడం ద్వారా ఎంఆర్వో రంగం కూడా వృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు డజను వరకు డీఆర్డీఓ పరిశోధనశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా, ఏరోస్పేస్ రంగంలో 25కు పైగా పెద్ద కంపెనీలు, సుమారు 1,200 వరకు అనుబంధ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఏరోస్పేస్ రంగం కోసం ఆదిబట్ల, ఎలిమినేడు ఏరోస్పేస్ పార్కులతో పాటు కొత్తగా మరో 3 కొత్త పార్కులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంఆర్వో రంగంలో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో కొత్తగా శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో ఐఎస్బీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏరోనాటికల్ సొసైటీ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (భూమిని కేటాయించారు) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు ‘టి హబ్’ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కాలీన్స్ ఏరోస్పేస్ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. చదవండి: అభివృద్ధిలో ప్రజా కోణం ఏది? -
బడ్జెట్ 2021: చైనా దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఎప్పుడు రక్షణ శాఖకే ఉంటాయి. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా రక్షణ శాఖకు భారీగా కేటాయింపులు వచ్చాయి. 15 ఏళ్లలో లేనట్టు ఈసారి కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల తెలిపారు. మొత్తం రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. ఇందులో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం గమనార్హం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. దీంతో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం.. సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సరిహదుల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరిపారు. (బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి! ) ఈ కేటాయింపులపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘‘2021-22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్ల కేటాయింపుతో పాటు మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఇచ్చిన ప్రధానమంతి, ఆర్థిక మంత్రికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 15 ఏళ్ల తర్వాత మూలధన వ్యయంలో 19 శాతం పెంపు జరిగింది’’ అని ట్విట్టర్లో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.రక్షణ రంగానికి గతేడాది కేటాయింపులు పరిశీలిస్తే రూ.3.62 లక్షల కేటాయింపులు జరగ్గా ఈ ఆర్థిక సంవత్సరం రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 7.4 శాతం పెరిగింది. ఇక ఆయుధాల కొనుగోలు, మరమ్మతులకు గతేడాది రూ.1,13,734 కోట్లు ఉండగా ఈసారి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 18 శాతం పెంపుతో రూ.1,35,060 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ నిధులతో ముఖ్యంగా చలికాలంలో లడ్డాఖ్లో50 వేల భద్రతా దళాలకు సౌకర్యాల మెరుగు చేయనున్నారు. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు పక్క దేశం చైనా కన్నా చాలా తక్కువ. చైనా బడ్జెట్ పరిశీలిస్తే 2014-19 కాలంలో 261.11 బిలియన్ డాలర్లు కేటాయించింది. భారత్ కేవలం 71.1 బిలియన్ డాలర్లు కేటాయించడం గమనార్హం. ఇక మన దాయాది దేశం 10.3 బిలియన్ డాలర్లు కేటాయించింది. ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారత్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్లో రక్షణకు అత్యధిక కేటాయింపులు జరిగాయి. I specially thank PM& FM for increasing the defence budget to 4.78 lakh cr for FY21-22 which includes capital expenditure worth Rs 1.35 lakh crore. It is nearly19 percent increase in Defence capital expenditure. This is highest ever increase in capital outlay for defence in 15yrs — Rajnath Singh (@rajnathsingh) February 1, 2021 -
అమెరికా ఆంక్షలను పట్టించుకోం : రష్యా
న్యూఢిల్లీ: భారత్‌తో ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా సహా అన్ని రక్షణ ఒప్పందాల అమలు కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోమని తెలిపింది. రష్యా రాయబారి నికొలాయ్ కుదాషెవ్, రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బబూష్కిన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను టర్కీపై అమెరికా ఆంక్షలను విధించింది. దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేందుకు అమెరికా ఇలా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించడం అన్యాయం. ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలను తప్ప ఇలా ఏకపక్షంగా ప్రకటించే చర్యలను పట్టించుకోం. ఏది ఏమైనా భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా కొనసాగుతుంది’ అని అన్నారు. ఎస్–400 క్షిపణి వ్యవస్థలు ఐదింటిని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్ రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్ డాలర్లను చెల్లించింది. -
ఏరోస్పేస్, డిఫెన్స్... హబ్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : విమానయాన, రక్షణ రంగాల్లో భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తోంది. విమానయాన రంగంలో అతివేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. మిలటరీ ఆధునీకరణకు వచ్చే ఐదేళ్లలో రూ.9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రక్షణరంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రైవేటు పెట్టుబడులకు దారులు తెరవడంతో అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈ ఎం) భారతీయ కంపెనీలతో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని... వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులు, శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏరోస్పేస్ యూనివర్సిటీ... ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి రావడంతో తెలంగాణ ‘ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్’గా రూపు దిద్దుకుంటోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, టాటా, ప్రాట్ విట్నీ, జీఈ, కొలిన్స్ ఏరోస్పేస్, ఐఏఐ, థేల్స్, ఆదాని, రఫేల్ వంటి సంస్థలు రాష్ట్రం లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టాయి. వివిధ ఏరోస్పేస్ పార్కుల్లో స్థలం కేటాయింపు, టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు, రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు రాయితీలు తదితరాలపై ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానయాన, రక్షణ పరికరాల ఉత్పత్తులకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రఖ్యాత శిక్షణ సంస్థలు ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ (యూఎస్), క్రేన్ఫీల్డ్ యూనివర్సిటీ (యూకే), ఏరో క్యాంపస్ అక్వెంటైన్ (ఫ్రాన్స్) భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులో ఉండే ఫీజుతో ఏరోస్పేస్, డిఫెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా కొత్త పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉంటే ప్రపంచస్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వాతావరణం ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’అమెరికాకు చెంది న బోయింగ్, ప్రాట్ విట్నీ, కొలిన్స్ఏరోస్పేస్వంటి వంటి సంస్థలతో స్టార్టప్‌ల కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది. అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’లో దేశీయ ఏరోస్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్ స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశం ఉంది. మరో రెండు ఏరోస్పేస్ పార్కులు మౌలికవసతుల పరంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఏరోస్పేస్ పార్కులతో పాటు, రెండు హార్డ్‌వేర్ పార్కులు, 50 జనరల్ ఇంజనీరింగ్ పార్కులు ఉన్నాయి. వీటితో పాటు పలు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ పార్కులు, ఎస్ఈజెడ్లు కూడా ఏవియేషన్, డిఫెన్స్ రంగాల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ రంగంలో వస్తున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు మరో రెండు ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విమాన, రక్షణ రంగ పరిశ్రమలు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెద్ద కంపెనీలు 25 ఎంఎస్ఎంఈలు 1,000 పైగా -
యూఎస్ డిఫెన్స్: కశ్యప్ పటేల్‌కు కీలక పదవి
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్ పటేల్‌ను) అమెరికా రక్షణ కార్యదర్శి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించారు. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ రక్షణ కార్యదర్శిగా మార్క్ ఎస్పర్‌ను ట్రంప్ తొలిగించిన ఒకరోజు తర్వాత ఈ నియాయకం జరిగింది. ‘మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ స్థానంలో క్రిస్ మిల్లర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెన్ స్టీవర్ట్ స్థానంలో ఇండో-అమెరికాన్ కశ్యప్ పటేల్‌ను నియమించారు. గతంలో వైట్‌హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో జాతీయ ఉగ్రవాద నిరోధక సీనియర్ న్యాయవాదిగా పటేల్ పనిచేశారు. 2019 జూన్‌లో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) సీనియర్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. (రక్షణ శాఖా మంత్రి మార్క్ ఎస్పర్ తొలగింపు! ) న్యూయార్క్‌లో జన్మించిన కశ్యప్ పటేల్‌కు భారత్‌లోని గుజరాత్ మూలాలున్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు చెందినవారు. 1970లో కెనడా నుంచి వచ్చి అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. స్కూలింగ్ అనంతరం ఫ్లోరిడాలో పై చదువులు అభ్యసించిన కశ్యప్ పటేల్ వాషింగ్టన్ డీసీకి ప్రాసిక్యూరట్గా పనిచేశారు. ఆ తర్వాత తూర్పు ఆఫ్రికా, కెన్యా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్ కమాండో సభ్యునిగా యూఎస్ ప్రభుత్వం నియమించింది. (అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ) -
రక్షణ ఒప్పందంపై అత్యుత్సాహం!
ఫిలిప్పీన్స్ అనుభవంలోంచి చూస్తే, అమెరికా పాలనాయంత్రాంగం పరివర్తనా స్థితిలో ఉంటున్నప్పుడు భారత్, అమెరికాల మధ్య ఇటీవల రక్షణ ఒప్పందం ఖరారైన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసులో ఏముండేది అనేది ప్రాధాన్యత కలిగిన విషయం. రాబోయే ఎన్నికల్లో జో బైడెన్ గెల్చినట్లయితే చైనా పట్ల భారత్ వ్యతిరేకత ఎలా పరిణమిస్తుంది? ఇతర రంగాల్లో అమెరికా, చైనా సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒబామా విధానంపై మన వైఖరి ఏ రూపు తీసుకుంటుంది? పైగా మన రక్షణ రంగానికి అమెరికా సాంకేతిక మద్దతు ఇవ్వనప్పుడు ఈ ఒప్పందం నుంచి భారత్ పెద్దగా ఆశించేది ఏమీ ఉండదు. ఈ అక్టోబర్ 27న భారత్–అమెరికాల మధ్య ప్రాదేశిక సహకారం కోసం కుదిరిన మౌలిక సదుపాయాల మార్పిడి సహకార ఒప్పందం (బెకా)పై మనం మరీ ఉబ్బితబ్బిబ్బవడానికి ముందు క్షేత్ర వాస్తవాలను గురించి ఆలోచించుకోవాల్సి ఉంది. మన రక్షణ వ్యవస్థలను మెరుగుపర్చడానికి అమెరికా సాంకేతిక సహకారం అందించడం అనేది కచ్చితంగా గొప్ప విజయం అనే చెప్పాలి. అయితే అంతకుమించి మనం దేన్ని ఆశించినా అది వాస్తవ విరుద్ధమే అవుతుంది. మన టీవీ మీడియా ఇప్పటికే ఈ ఒప్పందంపై చాలా అతిగా స్పందించింది. కొన్ని ప్రసార సంస్థలయితే మరీ ముందుకెళ్లి, 1962 అక్టోబర్ 27న జనరల్ బీఎమ్ కౌల్ సిఫార్సు చేసిన యుఎస్ ఎయిర్ అంబ్రెల్లా (గగనతల రక్షణ ఛత్రం) వంటి భద్రతాపరమైన రక్షణను అమెరికా మనకు అందిస్తుందని కూడా వ్యాఖ్యానించేశాయి. చైనా మరీ దూకుడుగా వ్యవహరిస్తున్న ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో కూడా ఇలాంటి తరహా సహకారాన్ని అమెరికా అందించలేదు. 1971 నుంచి చైనా దురాక్రమణను ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ కేస్ స్టడీ దీన్నే నిరూపిస్తుంది. ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో అమెరికాకు అత్యంత పూర్వ మిత్రదేశం ఫిలిప్పీన్స్ అన్నది తెలిసిందే. స్పానిష్ యుద్ధనౌకను మనీలా బే వద్ద అడ్మిరల్ జార్జ్ డివే ధ్వంసం చేసి వలసవాద స్పెయిన్‌ని 1898లో లొంగదీసుకున్నప్పటినుంచి అమెరికా–ఫిలిప్పీన్స్ సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధానంతరం నష్టపరిహారం కింద ఫిలిప్పీన్స్, గ్వామ్, ప్యూర్టోరికోలను అమెరికా హస్తగతం చేయడమే కాకుండా 20 మిలియన్ డాలర్ల పరిహారాన్ని కూడా స్పెయిన్ చెల్లించింది. ఆనాటి నుంచి జపానీస్ అక్రమణ జరిగిన మూడేళ్లు మినహా (1941–44), అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు చాలా సన్నిహితంగా సాగాయి. ప్రత్యేకించి 1946లో రిపబ్లిక్‌గా ఫిలిప్పీన్స్ స్వాతంత్య్రం పొందిన తర్వాత ఈ రెండుదేశాల మధ్య బంధం బలీయంగా మారింది. దీని ఫలితంగా ఫిలిప్పీన్స్ నుంచి అతిపెద్ద సంఖ్యలో (2018నాటికి 20 లక్షలమంది) అమెరికాకు వలసలు పెరిగాయి. ఇరుదేశాలూ 1947లో సైనిక స్థావరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1951లో పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఐలండ్ భూభాగాలతో సహా ఇరుదేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం నిరవధికంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా దక్షిణ చైనా సముద్రంలోని తమ దీవులలో ప్రవేశించడానికి, జోక్యం చేసుకోవడానికి అమెరికాకు ఫిలిప్పీన్స్ అనుమతించేసింది. అయితే దక్షిణ చైనా సముద్రంలోని ఈ దీవులపై తమకూ హక్కు ఉందని చైనా, తైవాన్, బ్రూనై, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంనుంచి ప్రకటిస్తూ రావడంతో అమెరికా, ఫిలిప్పీన్స్ దీవుల్లోకి అడుగుపెట్టడం, ఆ వివాదంలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాకుండా పోయింది. విదేశీయుల ఉనికి పట్ల స్థానికంగా వ్యతిరేకత తీవ్రమవడంతో క్లార్క్, సుబిక్ బే ప్రాంతంలోని సైనిక స్థావరాలను అమెరికా 1992లో ఖాళీ చేసింది. అయితే పెరుగుతున్న ఉగ్రవాదంతో పోరాడేందుకు 1998లో సైనిక సందర్శనల ఒప్పందం కుదిరి మరింత సైనిక సహకారం సాధ్యమవడంతో పై ఘటన ఇరుదేశాల సంబంధాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె దేశంలో మాదకద్రవ్యాలపై కఠిన వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో మానవహక్కుల దుస్థితిపై అమెరికా విమర్శలు ప్రారంభించడంతో 2016 నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త వేడెక్కుతూ వచ్చాయి. 2014 ఏప్రిల్ 28న ఇరుదేశాల సైన్యాల మధ్య విస్తృత రక్షణ సహకార ఒప్పందం కుదిరిన తర్వాత కూడా దక్షిణ చైనా సముద్రంపై అమెరికా విధానాన్ని ఒబామా యంత్రాంగం పునర్ వ్యాఖ్యానం చేసినప్పుడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఒబామా పాలనాయంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా చైనా మధ్య సహకారం ఇతర రంగాల్లో దెబ్బతింటుంది కాబట్టి ప్రాంతీయ వివాదాలలోకి తలదూర్చబోనని అమెరికా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో విస్తృత ఎకనమిక్ జోన్ అని చైనా చెప్పుకుంటున్న ప్రాంతంలో స్వేచ్ఛగా అన్ని దేశాల నౌకలు సంచరించడానికి అమెరికా ప్రాధాన్యమిచ్చింది. అయితే ఈ విధాన మార్పు వల్ల ప్రభావితమయ్యే దేశాలకు సాంత్వన కలగకుండా పోయింది. అమెరికా తనకు సహాయం చేయకుంటే తాను రష్యా లేదా చైనా పక్షం చేరడానికి కూడా సిద్ధపడతానని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టే బెదిరించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు విఘాతం ఏర్పడింది. శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు (పీసీఏ) ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా ప్రకటించిన తర్వాత కూడా చైనా దురాక్రమణతో వ్యవహరించడంలో తనకు అమెరికా సహాయపడలేదని డ్యుటెర్టే నిస్పృహ చెందాడు. 2013లో స్పార్టీ దీవులపై వివాదాన్ని కూడా ఫిలిప్పీన్స్ ఈ పీసీఏ ముందుకు తీసుకెళ్లింది. ఈ దీవిపై చైనా చారిత్రక హక్కు ప్రకటించడానికి ఎలాంటి చట్టబద్ధతా లేదని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు 2016 జూలై 12న తీర్పు చెప్పింది. ఒబామా పాలనా యంత్రాంగంలా కాకుండా, ట్రంప్ పాలన చైనావైఖరిని మరింత కఠినంగా దుయ్యబడుతూ, దక్షిణ చైనా సముద్రంపై ఆసియన్ దేశాల హక్కుకు మద్దతునిస్తూ వస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో 2019 మార్చి నెలలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో భేటీ జరిపి దక్షిణ చైనా సముద్రంలో పరస్పర రక్షణకు హామీ ఇచ్చారు. పైగా ఆ ప్రాంతంలో చైనా ప్రకటించిన హక్కుల్లో చాలావరకు అక్రమమని చెబుతూ చైనా వైఖరిని ఖండించాడు కూడా. 2019 ఏప్రిల్ 15న అమెరికా, ఫిలిప్పీన్స్ రక్షణ శాఖలు తాజాగా ప్రత్యేక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కిల్ వెపన్ సిస్టమ్–ఐఐ పట్ల తగిన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఈ ఒప్పందం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, 2020 ఏప్రిల్ నెలలో వియత్నాం చేపల బోటును చైనా ధ్వంసం చేసినప్పుడు కానీ, 2019 ప్రారంభంలో ఫిలిప్పీన్స్ దీవులను 100 చైనా ఓడలు చుట్టుముట్టి హెచ్చరిక పంపినప్పుడు కానీ ట్రంప్ యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది. 2020 నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరగడానికి ముందుగా స్పార్టీదీవులపై దాడికి ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తాడని పుకార్లు వచ్చినప్పుడు అమెరికా సైనిక జోక్యం గురించిన వార్తలు మొదటిసారిగా వినవచ్చాయి. దీనిఫలితంగా, అమెరికా తమకు నిజంగా సహాయం చేస్తుందని ఫిలిప్పీన్స్ ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. 2019 డిసెం బర్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో 64 శాతం íఫిలి ప్పీన్స్ ప్రజలు తమకు అమెరికా సన్నిహత మిత్రురాలు అని భావిస్తున్నట్లు తేలింది. అమెరికా తనకు సన్నిహిత మిత్రురాలు అని భావించే దేశాల్లో ఇజ్రాయెల్ (82 శాతం) దక్షిణ కొరియా (71 శాతం)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న ఫిలిప్పీన్స్ దేశస్తుల్లో 47 శాతం మంది పెరుగుతున్న చైనా ఆర్థిక శక్తి మంచి పరిణామమేనని చెప్పగా 48 శాతం మంది అది చెడు పరిణామమని భావించారు. మరీ ముఖ్యంగా తైవాన్ పరిశోధకుడు రిచ్చర్డ్ జావద్ హైదరియన్ ఆగస్టు 4వ తేదీన సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం సమర్పించిన పరిశోధనా పత్రంలో ఫిలిప్పీన్స్ ప్రజల మనోభావాలను మరింత విస్తరించి చెప్పాడు. అమెరికాతో రక్షణ ఒప్పందాలు ఫిలిప్పీన్స్ ప్రజలకు ఉపయోగకరమేనా అనే ప్రశ్నకు కనీసం సగంమంది ప్రజలు తాము ఏమీ తేల్చుకోలేకపోతున్నామని చెప్పారు. కాగా 17 శాతం మంది ప్రజలు ఆ ఒప్పందంతో ఏ మేలూ జరగదని చెప్పారు. పైగా అమెరికాతో కంటే చైనా లేక రష్యాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టెకి సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు మద్దతివ్వడం గమనార్హం. అయితే ఈ ప్రశ్నకు 2015లో 43 శాతంమంది తమ దేశాధ్యక్షుడికి మద్దతు తెలుపగా 2017లో అది 67 శాతానికి పెరగడం విశేషం. ఫిలిప్పీన్స్ అనుభవం నేపథ్యంలోంచి చూస్తే, అమెరికా పాలనాయంత్రాంగం పరివర్తనా స్థితిలో ఉంటున్నప్పుడు భారత్, అమెరికాల మధ్య ఇటీవల రక్షణ ఒప్పందం అంతిమంగా ఖరారైన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసులో ఏముండేది అనేది ప్రాధాన్యత కలిగిన విషయం. రాబోయే ఎన్నికల్లో జో బైడెన్ గెల్చినట్లయితే చైనా పట్ల భారత్ వ్యతిరేకత ఎలా పరిణమిస్తుంది? ఇతర రంగాల్లో అమెరికా, చైనా సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒబామా విధానం పట్ల మన వైఖరి ఏ రూపు తీసుకుంటుంది? పైగా రక్షణ రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వనప్పుడు ఈ ఒప్పందం నుంచి భారత్ పెద్దగా ఆశించేది ఏమీ ఉండదని గ్రహించాలి. -వప్పాల బాలచంద్రన్ వ్యాసకర్త మాజీ ప్రత్యేక కార్యదర్శి, కేబినెట్ సెక్రటేరియట్ -
మరింత పటిష్టంగా రక్షణ బంధం
దాదాపు పదిహేనేళ్లుగా చర్చలకే పరిమితమవుతూ వస్తున్న అత్యంత కీలకమైన భారత–అమెరికా రక్షణ ఒప్పందంపై ఎట్టకేలకు మంగళవారం సంతకాలయ్యాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరో వారంలో ముగియబోతుండగా కుదిరిన ఈ ఒప్పందంపై హర్షామోదాలు వ్యక్తమవుతున్నట్టే సంశయాలు కూడా రాజుకుంటున్నాయి. తాజా ఎన్నికల తర్వాత అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ ఏలుబడి రావొచ్చునని సర్వేలన్నీ చెబుతున్నవేళ ఇంత అత్యవసరంగా ఈ కీలక ఒప్పందం కుదుర్చు కోవాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్న తలెత్తింది. అయితే పాలకులెవరన్న దాంతో నిమిత్తం లేకుండా అమెరికాకు ఈ కీలక ఒప్పందం ఎంతో అవసరం. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా మొండికేసి, మనకు సమస్యలు సృష్టిస్తున్న మాట వాస్తవమే అయినా ఆ దేశంతో మనకంటే ఎక్కు వగా సమస్యలు ఎదుర్కొంటున్నది అమెరికాయే. భౌగోళిక సరిహద్దులు లేవన్న మాటేగానీ... బహుళ రంగాల్లో చైనా వేస్తున్న ఎత్తులకు అమెరికా చాన్నాళ్లుగా చిత్తవుతోంది. అన్నిచోట్లా తన ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా దూసుకుపోతున్న చైనాను నిలువరించడం అమెరికాకు జీవన్మరణ సమస్య అయింది. కనుకనే మంగళవారం భారత–అమెరికాల మధ్య సంతకాలైన ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్’(బెకా) మనకన్నా ఆ దేశానికి తక్షణావసరం. అయితే అంతమాత్రం చేత దానివల్ల మనకు ఒరిగేదేమీ ఉండదని చెప్పడానికి లేదు. ఈ ఒప్పందం అమెరికాకు చెందిన అత్యంతాధునిక సైనిక ఉపకరణాలు లభ్యం కావడానికి... శత్రు కదలికలను ఎప్పటికప్పుడు రాబట్టి వారిపై తక్షణమే దాడిచేసేందుకు వీలుకలిగించే నిఘా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకూ తన సొంత సైనిక అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్న సైనిక సాంకేతి కతను అమెరికా మనకు అందజేస్తుంది. వాస్తవానికి అమెరికాతో ఇంతక్రితం కుదిరిన రెండు కీలక ఒప్పందాలు–2016నాటి సైనిక సంబంధ మౌలిక అవసరాలకు సంబంధించిన అంశాల్లో పరస్పర సహకరించుకునే ఒప్పందం(లెమోవా), 2018 నాటి కమ్యూనికేషన్లు, భద్రతారంగాల ఒడంబడిక (కామ్కాసా)లకు ఇది కొనసాగింపు. దీంతో ఇరు దేశాల మధ్యా సైనిక సహకారానికి సంబంధించి పటిష్టమైన బంధం ఏర్పడినట్టయింది. ఇప్పుడు కుదిరిన బెకా ఒప్పందం వాస్తవానికి యూపీఏ తొలి దశ పాలనలోనే సాకారం కావలసివుంది. అయితే అప్పట్లో మిత్రపక్షాలైన వామపక్షాల నుంచి తీవ్ర మైన ఒత్తిళ్లు రావడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. అమెరికా చట్టం ప్రకారం బెకా ఒప్పందం వున్న దేశాలతో తప్ప మరే దేశంతోనూ అది పూర్తి స్థాయి సైనిక బంధాన్ని ఏర్పర్చు కోకూడదు. లెమోవా ఒప్పందం సమయంలోనే మన సైనిక స్థావరాల ఆనుపానులు, అక్కడున్న కీలకమైన సదుపాయాల వివరాలు అమెరికాకు వెల్లడవుతాయని...మన త్రివిధ దళాల సామర్థ్యానికి సంబంధించిన డిజిటల్ సమాచారం ఆ దేశానికి తెలుస్తుందని రక్షణ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపారు. గల్ఫ్ యుద్ధ సమయంలో తమ విమానాలకు ఇంధనం నింపుకునే సదుపాయం కల్పించ మని అమెరికా అడిగినప్పుడు నలుమూలలనుంచీ వచ్చిన ఒత్తిళ్లతో అప్పటి వాజపేయి ప్రభుత్వం నిరాకరించింది. కానీ లెమోవా ఒప్పందంతో అదిప్పుడు సాధ్యమే. ఈ మూడు ఒప్పందాల పర్య వసానంగా అమెరికాకు మనం అందజేసే అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ఆ దేశం కూడా మనకు కల్పిస్తుంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా అమెరికాకు ప్రపంచంలో కీలకమైనచోట్ల సైనిక స్థావరాలున్నాయి. మనకు తజికిస్తాన్లోని వైమానిక దళ స్థావరం తప్ప మరెక్కడా స్థావరాలు లేవు. కనుక సమాన ప్రతిపత్తి అన్నది కాగితాలకే పరిమితమవుతుంది. అయితే యుద్ధ సమయాల్లో మన త్రివిధ దళాలకు అసరమైన ఆహారం, మంచినీరు, రవాణా, ఔషధాలు, సైనిక సామగ్రి విడి భాగాలు, వాటి మరమ్మతు, శిక్షణ, ఇతర సేవలు అందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. మన త్రివిధ దళాలకు డేటా సంబంధ అంశాల్లో... ముఖ్యంగా వాటి ఆధారంగా శత్రువులను ఎదు ర్కొనడానికి, వారిపై పైచేయి సాధించేందుకు అనువైన వ్యూహ రచనలో అమెరికా శిక్షణ లభిస్తుంది. అమెరికాతో సాగుతున్న పోటీలో చైనా క్రమేపీ బలపడుతోంది. అమెరికా జీడీపీకి చైనా జీడీపీకి మధ్య ఇప్పుడు పెద్దగా వ్యత్యాసం లేదు. పెట్టుబడుల్లోనూ అది ముందుంది. అమెరికా సన్నిహిత దేశాల్లోనే దాని పెట్టుబడులు పెరుగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీల్లో ఇప్పుడు చైనా వాణిజ్యం ముమ్మరమైంది. చైనా పెట్టుబడులను కాదంటే ఆ దేశాల్లో లక్షలాదిమంది ఉపాధి అవకాశాలు దెబ్బతిని, అక్కడి ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం వుంది. ముఖ్యంగా బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా వుంది. ఈ దేశాలను చైనాకు దూరం చేయడం అమెరికాకు అంత సులభం కాదు. ఉన్నంతంలో ట్రంప్ చైనాను ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎంతోకొంత లొంగదీయగలిగారు. అది అమెరికానుంచి అంతక్రితంకన్నా రెట్టింపు పరిమాణంలో సోయాబీన్స్‌ను కొనేలా, మాంస ఉత్పత్తుల్ని మునుపటికన్నా 16 రెట్లు అధికంగా దిగుమతి చేసుకునేలా, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని సైతం భారీగా కొనుగోలు చేసేలా ఒప్పించగలిగారు. ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ఇవి మాత్రమే చాలవు. చైనాను కట్టడి చేయడానికి మరిన్ని అవసరం. అందులో భాగమే వివిధ దేశాలతో అమెరికా కుదుర్చుకుంటున్న ఒప్పందాలు. ఈ మాదిరే యూరోప్ దేశాలతో సైతం అవగాహనకు రావడానికి అది పావులు కదుపుతోంది. అదే సమయంలో చైనా తప్పుడు వ్యూహాలతో, దురాశతో ఇరుగుపొరుగుతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందాలు మన ప్రయో జనాలకు అనువుగా వుండేలా చూడాలి. అందుకు భిన్నంగా వుంటే మనకు లాభంకన్నా నష్టమే మిగులుతుంది. -
భారత్-అమెరికాల మధ్య కీలక ఒప్పందంపై సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం జరిగిన మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్ పొందే వెసులుబాటు కలుగుతుంది. తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశాల్లో సమగ్ర, ఫలవంతమైన చర్చలు జరిపామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి అని అన్నారు. రక్షణ సంబంధాలపై ఉపయుక్తమైన చర్చలు జరిగాయని, సైనిక సహకారంలోనూ ఇరుదేశాల మధ్య పురోగతి సాధ్యమయ్యేలా చర్చలు సాగాయని తెలిపారు. ఇక రెండు దశాబ్ధాలుగా భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్య విస్తరణ స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. చదవండి : మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ? భారత్‌కు వెన్నుదన్ను: మైక్ పాంపియో భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇక కరోనా వైరస్, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం భారత్-అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచ భద్రత, ఇతర అంశాలపై పాంపియో, ఎస్సర్‌లతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. -
భారత్-జపాన్ రక్షణ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, జపాన్ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. రక్షణ ఒప్పందం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని అబే షింజో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. భారత్-జపాన్ల మధ్య రక్షణ ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు రక్షణ పరికరాలు, సేవలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చొరవ చూపారంటూ షింజో అబేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇరువురు నేతలు ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు సహా ఇరు దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. గత కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతున్న భారత్-జపాన్ భాగస్వామ్యం ఇక ముందు కూడా ఉత్తేజంగా కొనసాగుతుందని మోదీ, అబే విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : ‘డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ’ -
రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
సాక్షి, అమరావతి : 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉ.11 గంటలకు పాలసీ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు..ఉపాధి కల్పించే పరిశ్రమలను బట్టే ప్రోత్సాహం అందనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చే చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ల సమ్మిళితం కానున్నాయి. -
జయా జైట్లీకి షాక్ : నాలుగేళ్ల జైలుశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. జయా జైట్లీతో, మరొక ఇద్దరికి నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. 2001నాటి రక్షణ శాఖ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వీరికి నాలుగేళ్ళ జైలు శిక్షను విధింస్తూ గురువారం తీర్పును వెలువరించింది. మరో రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. దోషులుగా తేలిన జయా జైట్లీ, సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్పీ ముర్గయి గురువారం సాయంత్రం 5 గంటలలోగా లొంగిపోవాలని సీబీఐ న్యాయమూర్తి జడ్జి వీరేందర్ భట్ ఆదేశించారు. ఈ మేరకు వివరాలను దోషుల్లో తరపు న్యాయవాది విక్రమ్ పన్వర్ మీడియాకు వివరించారు. -
కరోనా: బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి మృతి
ఢాకా: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసీన్ చౌదరి (57) కరోనా వ్యాధితో మరణించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. అబ్దుల్లా మృతిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు. గత నెల మే 29న అనారోగ్యంతో ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రి (సీఎంహెచ్)లో చేరిన అబ్దుల్లాకు కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆయనను జూన్ 6న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని అదనపు కార్యదర్శి ఎండీ మహమూద్ ఉల్ హక్ తెలిపారు. ఆయన మృతికి బంగ్లాదేశ్ రక్షణ శాఖ సిబ్బంది, ఇతరులు నివాళులర్పించారు. కాగా అబ్దుల్లాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
రక్షణ ఆయుధాల రంగంలోకి మేఘా
సాక్షి, హైదరాబాద్ : మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు అనుమతులు సంపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ మంత్రిత్వ శాఖలు అనుమతులిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకుంది.. వివిధ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులను జారీ చేసింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ తాజాగా ఈ పరిశ్రమతో దేశ రక్షణకు సంబంధించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశిస్తోంది. మేఘా గ్రూప్‌కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విదితమే. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధ ట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలిక పాటి యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్విప్మెంట్ను కూడా ఉత్పత్తి చేయనుంది. మేఘా ఇంజనీరింగ్...... దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు , తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతిని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా అత్యంత సుదూర ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పంపింగ్ చేస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, పట్టిసీమ, నంబులపూలకుంట (ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత ’మేఘా‘ది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లో 10 మెగావాట్ల అరుదైన కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టు ఎంఇఐఎల్ నిర్మించి రికార్డ్ నెలకొల్పింది. కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి, గోదావరి-ఏలేరు, నర్మద- క్షిప్రా - సింహస్థ ఇలా దేశంలో ఐదు నదులను మొదటి సారిగా అనుసంధానం చేసింది. హైదరాబాద్ సిటీ తాగునీటి కష్టాలను దూరం చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని ఎంఇఐఎల్ నిర్మించడం మరో ఘనత. దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ (WUPPTCL) విద్యుత్ సరఫరా (పవర్ ట్రాన్స్మిషన్) వ్యవస్థను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టు లను తొలిసారిగి ప్రవేశపెట్టింది. ఎన్పీకుంట విద్యుత్ సబ్ స్టేషన్, పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఏడాదిలోనే పూర్తిచేసినందుకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. -
‘ఏ దేశం ముందూ భారత్ తలవంచదు’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు సమస్యలను భారత్, చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందకు ప్రయత్నిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌లో రక్షణ వ్యవస్థ సుశిక్షితంగా ఉందని, ఏ దేశం ముందు భారత్ తలవంచబోదని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భారత్ రక్షణ పరికరాలను, ఆయుధాలను ఎగుమతి చేస్తుందని, స్వయం సమృద్ధి దిశగా మనం ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాఫేల్ యుద్ధవిమానాలు రాఫేల్ బారత రక్షణ సామర్ధ్యాలను బలోపేతం చేస్తుందని ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. నేపాల్‌తోనూ విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని, ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా మంచి సంబంధాలున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. చదవండి : మానస సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్ -
రక్షణశాఖలో కరోనా కలకలం
ఢిల్లీ : భారత రక్షణ శాఖలో కరోనా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. ఆయన పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్.. రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారనన్న దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో మొత్తం కార్యాలయాలను శుభ్రం చేయించి ఉద్యోగులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. (గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..) ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 8వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. లాక్డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పక్షం రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచంలోనే కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో ప్రస్తుతం మన దేశం 7వ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అతి త్వరలోనే భారత్ అమెరికా సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ) -
ట్రంప్‌పై విరుచుకుపడ్డ డిఫెన్స్ మాజీ చీఫ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ డిఫెన్స్ మాజీ చీఫ్ జిమ్ మాటిస్ విరుచుకుపడ్డారు. అమెరికన్లను విభజించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, నిరసనలతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో పరిణితికలిగిన నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అమెరికన్లను సమైక్యపరిచేందుకు ప్రయత్నించని తొలి అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అని అగ్రరాజ్య అధ్యక్షుడి తీరుపై మండిపడ్డారు. పౌరులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించకపోగా ట్రంప్ తమను విడదీస్తున్నారని మాటిస్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పరిణితి కలిగిన నాయకత్వం కొరవడిన పరిణామాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సాగుతున్న వర్ణవివక్ష ర్యాలీలకు మద్దతు ప్రకటించిన పెంటగాన్ మాజీ చీఫ్ మాటిస్ సిరియాలో అమెరికన్ దళాల ఉపసంహరణపై ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018 డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: జార్జ్ ఫ్లాయిడ్ నిరసనలు.. ట్రంప్‌కు షాక్ -
త్వరలో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సైబర్ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో నూతన సైబర్ సెక్యూరిటీ పాలసీను రూపొందిస్తున్నట్లు జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డీనేటర్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ 2020లో రాజేష్ పంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు నెలల్లో సైబర్ పాలసీకి చెందిన విధానాల రూపకల్పన పూర్తవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే అవకాశాలు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సైబర్ నేరాలు ఎక్కువయితే జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రజలకు మెరుగైన సేవలందిస్తు సమాచారాన్ని భద్రపరచడం అంత సులువు కాదని రైల్వే ఉన్నతాధికారి విజయ్ దేవ్నాథ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రక్షణశాఖ సలహాదారు అమిత్ శర్మ పేర్కొన్నారు. -
అస్థిరతలు కొనసాగొచ్చు..
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్పీ పారిబాస్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ గౌరవ్‌దువా తెలిపారు. మెటల్స్, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇన్స్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో కోవిడ్–19 వైరస్ సంబంధిత పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్–జూన్) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ తెలిపారు. ఎఫ్‌పీఐలు బుల్లిష్... భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. అయితే సమీప భవిష్యత్తు పెట్టుబడు లపై కోవిడ్–19 ప్రభావం ఉండవచ్చని అంచనా. -
'డిఫెన్స్ క్లస్టర్‌గా దొనకొండ ప్రాంతం!'
సాక్షి,లక్నో: లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్పో-2020 కార్యక్రమానికి ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని తెలిపారు.(నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి) డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్ రెడ్డి తెలిపారు. -
బంధం విస్తృతం
న్యూఢిల్లీ: సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో శనివారం రెండు దేశాల అధికారులు ఈ మేరకు 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ‘మీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోతో చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్‌ను కీలకమైన భాగస్వామిగా ఆయన వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న జయిర్ బొల్సనారో తన కూతురు లారా, కోడలు లెటిసియా ఫిర్మోతోపాటు 8 మంది మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందంతో శుక్రవారం వచ్చారు. భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా రసాయనాలు, సింథటిక్ దారం, వాహన భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు అలాగే, బ్రెజిల్ నుంచి ముడి చమురు, బంగారం, ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. -
త్రిదళాధిపతి
-
‘రక్షణ సంబంధాలు మరింత బలోపేతం’
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా రక్షణ సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అమెరికా రాజకీయ, మిలటరీ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్ అన్నారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్, ఢిల్లీ యూఎస్ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఫిలియన్‌తో కలసి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రక్షణ రంగంలో ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల కారణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక రక్షణ పరికరాల ఉత్పత్తి, పరస్పర సహకారం మరింతగా మెరుగుపడుతుందని జోయల్ స్టార్ అన్నారు. బలమైన భారత్– అమెరికా ప్రైవేట్‌రంగ భాగస్వామ్యంతో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏరోస్పేస్, రక్షణ రంగ ఉత్పత్తి కేంద్రాలు పెరిగే అవకాశం ఉందన్నారు. విశాఖ తీరంలో ‘టైగర్ ట్రంప్’ విశాఖ సముద్ర తీరంలో ఇటీవల ‘టైగర్ ట్రంప్’పేరిట తొలిసారిగా ఉభయ దేశాలకు చెందిన త్రివిధ దళాలు మిలిటరీ విన్యాసాలు జరిపాయని జోయల్ స్టార్ వెల్లడించారు. విశాఖ తీరంలో గతేడాది మూడు అమెరికా నావికాదళ నౌకలతో విన్యాసాలు నిర్వహించామన్నారు. ఇండో అమెరికా సైన్యాలు సంయుక్తంగా పనిచేయడం వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని, ఇందు లో భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నామన్నారు. భారత్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో వాణిజ్యం పదేళ్ల కాలంలో 16 బిలియన్ డాలర్లకు చేరడం అభినందనీయమన్నారు. అమెరికా రక్షణ రంగం అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతికతను భారత్‌కు అందజేయడంపై సంప్రదింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు. -
మీ తరఫున గొంతెత్తుతాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాంటి వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాలను నేరుగా సంప్రదిస్తే అమెరికా పెట్టుబడి సంస్థలు స్థానికంగా ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే అమెరికా సంస్థలకు ప్రోత్సాహం అందించడంతో పాటు మద్దతు ఇస్తామన్నారు. తెలంగాణతో నేరుగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే సంస్థల పక్షాన వారు ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం కోసం ఢిల్లీ స్థాయిలో గొంతెత్తుతామన్నారు. హైదరాబాద్‌లో భారత్ అమెరికా రక్షణ సంబంధాలపై జరుగుతున్న రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా బుధవారం కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. అంతర్జాతీయ బిజినెస్ కౌన్సిల్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), యూఎస్ రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు గురువారం ముగియనుంది. ఐదేళ్లలో గణనీయమైన పురోగతి.. ‘రాష్ట్రంలో ఆదిబట్ల, నాదర్గుల్, జీఎంఆర్, ఆదానీ ఎయిరోస్పేస్ పార్కులతో పాటు రాష్ట్రం లోని వివిధ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, ఎస్ఈజెడ్లను కేంద్రంగా చేసుకుని ఎయిరోస్పేస్, డిఫెన్స్ కంపె నీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను తయారు చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేసే ప్రపంచ స్థాయి ఎయిరోస్పేస్ వర్సిటీ ద్వారా తక్కువ ఫీజులతో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ‘ఎయిరోస్పేస్, డిఫెన్స్‌కు సంబంధించి ప్రైవేటు రంగంలోనూ 25కు పైగా పెద్ద కంపెనీలు, వేయికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఈ రంగంలో రాష్ట్రంలో గత ఐదేళ్లలో పురోగతి సాధించగా, అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, హనీవెల్ వంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు భారీ పెట్టుబడులతో తరలివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే సికోర్క్సీ హెలికాప్టర్‌తో పాటు, ఎఫ్ 16 యుద్ధ విమానాల రెక్కలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల వాటా రూ.1.13 లక్షల కోట్లు కాగా, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది’అని కేటీఆర్ అన్నారు. బంధం మరింత బలోపేతమవ్వాలి: అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతం లో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, రెండు దేశాల నడుమ రక్షణ బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని యూఎస్ రాజకీయ, రక్షణ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్ అన్నారు. 2008 నుంచి ఇరు దేశాల నడుమ రక్షణ రంగ వాణిజ్యం క్రమంగా పెరుగుతూ వస్తోందని, మానవ రహిత యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైల్స్ తదితరాలకు సంబంధించిన అత్యున్నత సాంకేతికతను భారత్‌కు అందజేస్తున్నా మని చెప్పారు. ఇప్పటికే భారత్–అమెరికా కంపెనీలు సంయుక్తంగా సీ130 రవాణా విమానాలు, ఎఫ్ –16 యుద్ధ విమానాలతో పాటు అపాచి యుద్ధ హెలికాప్టర్లను సంయుక్తంగా హైదరాబాద్ లో తయారు చేస్తున్నాయన్నారు. భారత్ కూడా సొంతంగా డిఫెన్స్, ఎయిరోస్పేస్ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని అభినందిస్తున్నామని, రక్షణ రంగంలో పరస్పర సహకారం, సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ వాణిజ్యం ఉభయ దేశాల నడుమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా రక్షణ, బయోటెక్, ఐటీ రంగాలకు తెలంగాణ చిరునామాగా మారిందని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మాన్ అన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర రక్షణ రంగ ఉత్పత్తుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. -
టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు. -
ఆధునికీకరణే అసలైన రక్షణ
అతిశక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ఈ సారి రక్షణ రంగ కేటాయింపుల్లో నాటకీయ చర్యకు పూనుకుంటారని మన వ్యూహాత్మక నిపుణులు పెట్టుకున్న అంచనాలు ఘోరంగా తప్పాయి. మోదీ మిలటరీ దుస్తుల్లో ఫోజు ఇచ్చినంత మాత్రాన దేశాన్ని పాకిస్తాన్ లాగా దివాలా తీయించి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేలా భారత్‌ను మార్చే తరహా యుద్ధవాది కాలేరు. జీడీపీ వృద్ధికి అనుగుణంగానే రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నది విస్మరించకూడదు. గత యుద్ధాల్లో మాదిరిగా పాక్‌ని కఠినంగా శిక్షిద్దాం అనే తరహా దూకుడు ఆలోచనలు కట్టిపెట్టి రక్షణ రంగానికి కేటాయించిన తక్కువ మొత్తాన్ని మెరుగ్గా, ఉత్తమంగా ఎలా ఖర్చుపెట్టాలన్న అంశంపై ఆలోచించాలి. ఆధునికీకరణ, సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా సైనికబలగాలను మెరుగైన శక్తిగా మలచడం ఇప్పటి అవసరం. ఈ వారం ప్రధానంగా మూడు విషయాలు మనలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ సారి కూడా రక్షణరంగానికి బడ్జెట్లో పెద్దగా అదనపు కేటాయింపులు లేకపోవడం పట్ల మన వ్యూహాత్మక నిపుణుల బృందం పెదవి విరుస్తోంది. రెండు. ప్రముఖ అమెరికన్ వ్యూహాత్మక అంశాల నిపుణుడు క్రిస్టీన్ ఫెయిర్ ది ప్రింట్ మేగజైన్‌కు చెందిన సృజన్ శుక్లాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ప్రకటన. దాని ప్రకారం లష్కరే తోయిబా భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలలో ఒకటిగా మాత్రమే ఉండటం లేదు. అది పాకిస్తాన్ సైన్యానికి చెందిన తక్కువ వ్యయంతో ప్రత్యేక సైనిక చర్యలు కొనసాగించే యూనిట్. ఇది భారత్ ఏమాత్రం తూగలేని అత్యంత అసమాన యుద్ధతంత్రాన్ని నడుపుతోంది. ఇలాంటి స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో పాకిస్తాన్‌ని భారత్ అసలు ఓడించలేదు. మూడో అంశం. దివంగత ఎయిర్ కమోడోర్ జస్జిత్ సింగ్ రచించిన ఒక పుస్తకం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం భారతీయ వాయుసేన తన వద్ద ఉన్న పాత ఫ్రెంచ్ మిరేజ్ విమానాలను పరీక్షించడానికి ఇజ్రాయిల్ ఇంజనీర్లకు అనుమతించింది. వీరు అధునాతన రష్యన్ ఆర్–73 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను మోసుకెళ్లేలా మన పాత మిరేజ్ యుద్ధవిమానాలను ఆధునికీకరిస్తారు. అయితే వారి ఒరిజనల్ క్షిపణి, మాత్రా–530డి ఉపయోగానికి పనికిరాకుండా పోయిన తరుణంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. భారతీయ వాయుసేనకు సొంతమైన ఫ్రెంచ్ మిరేజ్లకు రష్యన్ క్షిపణులను ఇజ్రాయెల్ నిపుణులు అమర్చడం అనే అంశం రాజ్‌కపూర్ కళాఖండం శ్రీ 420 సినిమాలో పాటల రచయిత శైలేంద్ర రాసిన అద్భుతమైన పంక్తులను మరోసారి గుర్తుకు తెస్తోంది. మేరా జూతా హై జపానీ అనే ఆ పాట పల్లవికి అర్థం ఏమిటంటే.. ‘‘నా చెప్పులు జపాన్వి, ట్రౌజర్లు బ్రిటిష్ తయారీ, నా టోపీ రష్యాది కావచ్చు, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ భారతీయతతో కూడినది’’. ఈ పంక్తులు 1955లో ఒక కొత్త రిపబ్లిక్కు ఉత్తేజం కలిగించేవే మరి. అయితే 65 సంవత్సరాల తర్వాత కూడా మన సాయుధ బలగాల పరిస్థితిని వర్ణించడానికి ఇప్పటికీ ఈ పాటే పాడుకోవలసిందేనా? మొదటగా బడ్జెట్ వర్సెస్ జీడీపీ సమస్యను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం రక్షణ రంగ బడ్జెట్‌ని పెన్షన్లతో కలిపి రూ. 4.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే ఇది స్థూల దేశీయోత్పత్తిలో సరిగ్గా 2 శాతానికి సమానం. దీంట్లో సైనికుల పెన్షన్లను మినహాయిస్తే, రక్షణ బడ్జెట్ రూ. 3.18లక్షల కోట్లు లేదా మన జీడీపీలో 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. రక్షణకు ఇంత తక్కువ మొత్తం కేటాయింపుతో భారత్ తన్ను తాను కాపాడుకోగలదా? ఇంతకు మించి అధికంగా రక్షణ రంగానికి కేటాయించడానికి భారత్‌కు శక్తిలేదా? తక్షణ స్పందన ఏమిటంటే ఒకటో ప్రశ్నకు లేదు అనీ, రెండో ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది కాలం క్రితం వరకు నేను కూడా ఇలాగే భావించేవాడిని. కాని నా అభిప్రాయం తప్పు అనిపిస్తోంది. వ్యూహాత్మక అంశాలపై చర్చలో, జీడీపీకి, జాతీయ బడ్జెట్‌కు మధ్య వ్యత్యాసాన్ని ఎన్నడూ చర్చించరు. బడ్జెట్ మాత్రమే ప్రభుత్వానికి చెంది నదని, జీడీపీ ప్రభుత్వానిది కాదనిపించేలా చర్చలు సాగేవి. అందుకే జాతీయ బడ్జెట్లో కేటాయించే శాతానికి అనుగుణంగానే రక్షణ వ్యయాన్ని పరిశీలించేవారు. ఈరోజు రుణ చెల్లింపులకు కేటాయించే 23 శాతం తర్పాత, బడ్జెట్లో అతిపెద్ద భాగానికి 15.5 శాతం వెచ్చిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలు మొత్తంపై పెట్టే వ్యయం (15.1శాతం) కంటే ఇది ఎక్కువ. జీడీపీలో మరొక అర్థ శాతం మొత్తాన్ని లేక మొత్తం బడ్జెట్లో 3.5 శాతం మొత్తాన్ని పారామిలిటరీ బలగాలపై వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ఆర్థిక మంత్రి అయినా ఇంతకు మించి రక్షణ రంగానికి నిధులను మళ్లించగలరా? మా డేటా జర్నలిస్టు అభిషేక్ మిశ్రా 1986 నుంచి రక్షణ రంగ బడ్జెట్ ధోరణులను నాకు తెలియపర్చారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారీగా సైనిక విస్తరణ చేపట్టిన సంవత్సరాల్లో మాత్రమే మన రక్షణ బడ్జెట్ జీడీపీలో అత్యధికంగా 4 శాతానికి పెరిగింది. కాకతాళీయంగా ఫ్రెంచ్ మిరేజ్ యుద్ధవిమానాలు మనకు అందడం అప్పుడే మొదలయ్యాయి. అప్పటినుంచి బడ్జెట్లు జీడీపీలో సగటున 2.82 శాతం మేరకు నిలకడగా, స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో జీడీపీ వృద్ధి కూడా ముందంజ వేసింది. గత 20 ఏళ్లలో అంటే కార్గిల్ యుద్దం నాటి నుంచి, బడ్జెట్ పెంపు సంవత్సరానికి సగటున 8.91శాతంగా నమోదవుతోంది. ఇప్పుడు మీరు గావుకేకలు వేయవచ్చు, నిందించవచ్చు కానీ నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా డబ్బును మరింతగా ముద్రించడం ద్వారా లేక పేదలకు అందిస్తున్న సబ్సిడీలలో (ఇవి బడ్జెట్లో 6.6 శాతం) లేక వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలపై పెడుతున్న వ్యయంపై కోత విధించడం ద్వారా రక్షణరంగానికి చేస్తున్న వ్యయాన్ని బాధ్యతారహితంగా లేక రాజకీయ మూర్ఖత్వంతో పెంచిన పాపాన పోలేదు. కానీ అత్యంత శక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ దఫా ఏదైనా నాటకీయ చర్యకు నడుం కడుతారని పెట్టుకున్న అంచనాలు తప్పాయి. మోదీ ఎవరి తరపునో మూర్ఖుడిగా తన్ను తాను ముద్రించుకునే తరహా వ్యక్తి కాదు. అలాగని ఎవరినీ లెక్కచేయని యుద్ధవాది అసలే కాదు. మిలటరీ దుస్తుల్లో వ్యూహాత్మక భంగిమ పెట్టినంతమాత్రాన మోదీ పాకిస్తాన్ లాగా దివాలా తీసి, అడుక్కోవడానికి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేటటువంటి, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే దేశంగా మాత్రం భారత్‌ను మార్చలేరు. అందుచేత భారతీయ వ్యూహాత్మక చర్చాక్రమం నేటి నూతన వాస్తవికతా స్థాయికి తగినట్లుగా తన వైఖరిని మార్చుకోవలసి ఉంది. ఏది మనకు తగినది అనే దానిగురించే ఆలోచించాలి. వృద్ధి అనేది జీడీపీకి అనుగుణంగానే పెరుగుతుంది. కాబట్టి 2024లో మన జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లకు చేరుకున్నట్లయితే, మన రక్షణ రంగ వ్యయం కూడా 2 శాతంకి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఈ 2 శాతం మొత్తంతో ఎలాంటి రక్షణను, ఏ రకమైన రక్షణను కొనుగోలు చేయగలం అనే అంశం గురించే ఇప్పుడు మనం చర్చించాల్సి ఉంది. ప్రస్తుత సైనికబలగాల స్థాయిని చూస్తే భారతదేశం దీర్ఘకాలిక యుద్ధంలో (అంటే రెండు వారాలకు మించి సాగే యుద్ధం) పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బలంగా ఉంటున్నట్లు కనిపించవచ్చు. కానీ ఈరోజు ఇది సరిపోదు. పాక్‌తో గతంలో మనం చేసిన రెండు యుద్ధాలు కేవలం 22 రోజులు (1965లో), 13 రోజుల (1971) లోపే ముగిసిపోయాయి. కానీ ఇంత స్వల్పకాలిక యుద్ధతంత్రంలో నేడు పాకిస్తాన్‌ను భారత్ ఓడించలేదని క్రిస్టీన్ ఫెయిర్ సరిగ్గానే చెప్పారు. కాబట్టి మనం వేయాల్సిన ప్రశ్న మరింత సంక్లిష్టమైనది. పుల్వామా వంటి ఘటనల ద్వారా నయవంచనకు దిగుతున్న పాకిస్తాన్‌ను కఠినంగా శిక్షించడానికి భారత్ కీలక ప్రాంతాల్లో ఆధిక్యతను ఇప్పుడు చలాయించగలదా? అందులోనూ భారతీయ సైనికుల ప్రాణాలకు తక్కువ నష్టం వాటిల్లేలా (బాలాకోట్లోలాగా కాకుండా) సమర్థ యుద్ధతంత్రాన్ని భారత్ సాగించగలదా? ఈ దశలో, మన సైనిక బలగాలు కానీ, వైమానిక బలగాలు కానీ, పాకిస్తాన్‌ని కఠినంగా శిక్షించేటంతటి శక్తిని కలిగిలేవు. మూడువారాల యుద్ధాన్ని మర్చిపోండి, కానీ సరిహద్దుల్లో ఆధీనరేఖ వద్ద సైతం పాకిస్తాన్ మనకంటే మెరుగైన ఆయుధాలను, సుశిక్షుతులైన సైనికులను, స్నైఫర్ రైఫిల్స్‌ని, దానికి తగిన మందుగుండు సామగ్రిని మోహరించి ఉంచింది. ప్రత్యేకించి యూపీఏ పదేళ్ల పాలనలో గుణాత్మకంగా పెరిగిన మన వైమానికి శక్తి స్థాయి ఏమిటో ఫిబ్రవరి 26–27 తేదీల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేసి మనకు ఆనందం కలిగించాయి. అయితే పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యత మన నావికా బలగానికే ఉంది. కానీ పాక్‌ని శిక్షించడానికి నావికా బలగాన్ని ఉపయోగించడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. పైగా మనం సాగించే జలయుద్ధం వల్ల తక్కిన ప్రపంచానికి రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు కలగవచ్చు. పైగా రూ. 4.31 లక్షల కోట్ల రక్షణ రంగ బడ్జెట్లో అధికభాగం పెన్షన్లకు (రూ. 1.12 లక్షల కోట్లు) పోగా త్రివిధ దళాల వేతనాలకు రూ. 1.08,468 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక ఫిక్సెడ్ ఖర్చులు, నిర్వహణ, వినియోగ వ్యయాలకు మరొక లక్ష కోట్లు ఖర్చవుతోంది. ఇక మిగిలిన కొన్ని వందల కోట్ల డబ్బుతో రక్షణ రంగంలో కొనుగోళ్లకు ఎంత ఖర్చు పెట్టగలరు? అందుకే మన సాయుధ బలగాలు ఆధునీకరణ మంత్రం జపిస్తూ ప్రాధేయపడుతున్నాయి. ఇక్కడ సైనిక స్థావరం కావాలి, ఇక్కడ క్షిపణి కేంద్రం ఏర్పర్చాలి. ఇక్కడ రాడార్ నెలకొల్పాలి. ఇవన్నీ అత్యవసరాలే. అయితే ఈ అన్ని యంత్రాల కంటే మనిషి అంటే సైనికులు చాలా ముఖ్యమైనవారు. అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న దేశం మరింత సమర్థవంతంగా ఉండాలి. ఎక్కువ డబ్బును అది వెచ్చించలేకపోతే, కనీసం ఉత్తమంగా అయినా ఖర్చుపెట్టాలి. మీ ఖర్చు మొత్తం వేతనాలు, పెన్షన్లకే ముగిసిపోరాదు. మీ సైనికులకు మరిన్ని ఆయుధాలు కావాలి. కానీ ప్రస్తుత తరుణంలో ఇన్ని లక్షల మంది సైనికులను మనం భరించగలమా? మన బలగాలను సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా మెరుగైన శక్తిగా మలచాల్సిన అవసరం ఉంది. భారత్‌కి ఇప్పుడు సూత్రబద్ధమైన మార్పు కావాలి. అంతేతప్ప మన వ్యూహాత్మక బృందాలు గత యుద్ధాలను మళ్లీ చేయాలనే తత్వానికి వెంటనే అడ్డుకట్టలేయాలి. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
హాక్ జెట్ తొలి మహిళా పైలట్ మోహనా
నాగ్‌పూర్: ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ అరుదైన ఘనత సాధించారు. అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే–132 జెట్‌ను నడిపారు. -
రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయింపు
-
మూడు లక్షల కోట్లకు పెరిగిన రక్షణ బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ శాఖకు రూ మూడు లక్షల కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పార్లమెంట్లో శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సైనికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం రూ 35,000 కోట్లు కేటాయించామన్నారు. సైనికులకు అలవెన్సులు, వేతన పెంపు చేపట్టామన్నారు. సైనికులే దేశానికి గర్వకారణమని, 40 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్‌ను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిందన్నారు. ప్రభుత్వం త్వరలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు. -
తమిళనాట పారిశ్రామిక కారిడార్
తిరుచిరాపల్లి: రక్షణ సంబంధ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 3,038 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక భాగం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టనున్నాయి. ఇక ప్రైవేటు కంపెనీలైన టీవీఎస్, డేటా ప్యాట్రన్స్, అల్ఫా డిజైన్స్ తదితర సంస్థలు పెట్టనున్నాయి. ఇందులో తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ అంతర్జాతీయ భారీ భద్రతా సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ ప్రకటించింది. తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తమిళనాడు డిఫెన్స్ ప్రొడక్షన్ క్వాడ్ అని కూడా పిలవనున్నారు. ఈ కారిడార్ జాబితాలో తిరుచిరాపల్లితోపాటు రాజధాని నగరం చెన్నై, హోసూర్, సేలం, కోయంబతూర్ కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ ‘డిఫెన్స్ కారిడార్‌కి స్థానిక పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పాలక్కాడ్ వరకూ పొడిగించాలంటూ అనేకమంది కోరుతున్నారు. అయితే దీనిని ప్రస్తుతానికి ఈ ఐదు నగరాలకే పరిమితం చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కారిడార్ వల్ల రక్షణ ఉత్పత్తులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతేకాకుండా వివిధ రక్షణ కారిడార్ల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుందన్నారు. ఈ ఐదు నగరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు ఉన్నాయని, రక్షణ ఉత్పత్తుల విక్రేతలు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర అనుబంధ సంస్థలతో చేయి చేయి కలిపి ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి’అని అన్నారు. పారిశ్రామిక కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి ఐదు వందలమందికిపైగా వివిధ సంస్థల ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. గతేడాదే ప్రకటన దేశంలో రెండు రణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్లను ప్రారంభిస్తామంటూ గతేడాది ఫిబ్రవరి, రెండో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం తెలిసిందే. అందులోభాగంగా ఒకటి ఉత్తరప్రదేశ్‌లో, మరొకటి తమిళనాడులో మొదలయ్యాయి. తొలుత ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో గతేడాది ఆగస్టు, 11వ తేదీన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించడం తెలిసిందే. -
వాద్రా సంబంధీకులపై ఈడీ దాడులు
న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా సంబంధీకుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులోని పలుచోట్ల శుక్రవారం ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. వాద్రా, మరో వ్యక్తికి చెందిన సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాల్లో వారు కమీషన్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఆ డబ్బుతో వారు విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. వారి ఇళ్లల్లోనే సోదాలు జరపడానికి తగిన సాక్ష్యాలు సేకరించినట్లు చెప్పారు. అయితే ఎవరి ఇళ్లపై దాడులు జరిపినదీ, ఏ రక్షణ ఒప్పందం కింద ఈ చర్యలు తీసుకున్నదీ వెల్లడించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించిన నాలుగు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీకి ఓటమి భయం: కాంగ్రెస్ తాజా సోదాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మోదీ..వాద్రాపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పింది. వాద్రా లాయర్ జ్యోతి ఖైతాన్ కూడా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. సెర్చ్ వారంట్లు లేకుండానే ఈడీ అధికారులు వాద్రా సంబంధీకుల ఇళ్లలోకి ప్రవేశించి లోపలి నుంచి తాళం వేశారని ఆరోపించారు. ఈ చర్య వెనక ప్రభుత్వ పాత్ర ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. లేని సాక్ష్యాల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
కామ్ కాసా ఒప్పందం అంటే..
భారత్, అమెరికా మధ్య అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (కామ్ కాసా)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో అమెరికా భారత్‌కు విక్రయించే అత్యాధునిక ఆయుధాలకు కమ్యూనికేషన్ పరికరాలను అమర్చడం, ఉపగ్రహాల సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఇంతకీ ఈ ఒప్పందం ఏమిటంటే.. సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి అత్యంత ఆధునిక సాంకేతికపరమైన యుద్ధ పరికరాలు కొనుగోలు చేయడం కోసం కుదుర్చుకోవాల్సిన మూడు ప్రధానమైన ఒప్పందాల్లో కామ్ కాసా ఒకటి. కామ్కాసా ఒప్పందానికి ముందు భారత్ 2016లో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన మూడో ఒప్పందం బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పాషియల్ కోపరేషన్‌పై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అమర్చడానికి వీలవుతుంది. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య కమ్యూనికేషన్లు మరింత విస్తృతం అవుతాయి. ఉదాహరణకి భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, లేదంటే జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. రక్షణ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన చట్టపరమైన ప్రాతిపదికలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. ఈ ఒప్పందంతో అమెరికా నుంచి సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డ్రోన్లు శత్రుదేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టగలవు. వాటిని టార్గెట్ కూడా చేయగలవు. కమ్యూనికేషన్ల కోసం ఇప్పటివరకు భారత్ వినియోగిస్తున్న వ్యవస్థ కంటే అమెరికా అమర్చే పరికరాలు సాంకేతికపరంగా అత్యున్నతమైనవి. అత్యంత సురక్షితమైనవి కూడా. దీనిని గతంలో కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెక్యూరిటీ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ అని పిలిచారు. అయితే ఇది భారత్‌కు చెందినదని స్పష్టంగా గుర్తించడానికి వీలుగా కామ్ కాసా అని మార్చారు. ఈ ఒప్పందం గత పదేళ్లుగా ఇరుదేశాల మధ్య నానుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం భారత్ సైనిక స్వేచ్ఛ సమగ్రతను కాలరాసే చర్య అన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాదు భారత్ సైన్యాన్ని అమెరికా రక్షణవ్యవస్థ చేతుల్లో పెట్టేసినట్టేనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రష్యాతో మనకున్న రక్షణ సంబంధాలపై కూడా కామ్కాసా ఒప్పందం ప్రభావాన్ని చూపిస్తుందని విమర్శలు వచ్చాయి.అయితే ట్రంప్ సర్కార్ మన దేశానికి వ్యూహాత్మక వ్యాపార భాగస్వామి హోదా కట్టబెట్టి భారత్ అంటే తమకున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. -
విజయాలు కూడా వెక్కిరిస్తాయి!
నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించిపోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటిపోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టిందే తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది. భారత్ విదేశ వ్యవహారాల, వ్యూహాత్మక వాతావరణ పరిస్థితిని చూస్తూ ఉంటే రైలు ప్రమాదాన్ని తలపిస్తున్నది. ఇది అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి మాదిరిగా స్వొత్కర్షతో టు ప్లస్ టు చర్చలను మూడోసారి వాయిదా వేయడం వంటిది కాదు. భారత్ విదేశీ వ్యవహారాల పరిస్థితి ఒక సంవత్సరం క్రితం మనం చూసిన చిత్రానికీ ఇప్పటి దృశ్యానికీ అసలు పోలికే లేదు. అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశ రాజధాని నుంచి ఇంకో దేశ రాజధానికి ఉరుకుతూ ఆయా దేశాల నేతలను ఆలింగనం చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు భారత్ వేగంగా ఎదుగుతున్న శక్తి. మోదీ అంటే భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న శక్తిమంతమైన, కలుపుగోలుతనం కలిగిన, అవిశ్రాం తంగా శ్రమపడగలిగిన నాయకుడు. అంతర్జాతీయ రాజకీయ రంగంలో ఒక తార. పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో తన నిర్ణయాత్మక, సానుకూల జోక్యంతో ఆయన ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే ఇందుకు మంచి ఉదాహరణ. ఈ అభిప్రాయమంతా గడచిన ఆరు మాసాలలో చెదిరిపోయింది. సున్నితమైన, స్థిరమైన భారత్ ఎదుగుదల మాదిరి గానే మన మీద ఉన్న అంతర్జాతీయ దృష్టి కూడా అవమానకరంగా అధోముఖం పట్టింది. మోదీ మద్దతుదారులు దీనికి నిరసన ప్రకటిస్తారు. కానీ పక్షపాత ధోరణి కలిగిన రాజకీయులు మతిలేనివారిగా ఉండిపోతే, శక్తిమంతమైన వ్యవస్థ అన్న స్థాయిని ఊహించుకుంటున్న దేశం వాస్తవాలను గమనించలేదు. పెద్ద ప్రయాణం ఇలా క్రమంగా ఎందుకు బలహీనపడిందో మనం పరీక్షిం చాలి. కొన్ని వాస్తవాలు మాత్రం భారత్ అదుపు చేయగలిగిన స్థితిలో లేవు. అందులో డొనాల్డ్ ట్రంప్ ఆవిర్భావం ఒకటి. అదే సమయంలో ఇటీవల చొరవ తీసుకుని మరీ చేసినట్టు ఉన్న కొన్ని ఘోర తప్పిదాలు భారత అంతర్జాతీయ సంబంధాలను మానవ తప్పిదాలన్నట్టు చూపుతున్నాయి. నాయకులు తాము ఎంచుకున్న విధానాన్ని దౌత్యంలో ప్రవేశపెడతారు. మోదీ దౌత్య విధానం లావాదేవీలతో కూడినదన్న వాస్తవాన్ని సౌత్ బ్లాక్‌లోని ఆయన ఔత్సాహికులు పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ఈ విధానానికి బీజేపీ ఆమోదం ఉంది. అలాగే బీజేపీకి అనుకూలంగా ఉండే అంతర్జాతీయ సంస్థలలోని బృందాలలో కూడా దానికి అనుకూలత ఉంది. అయితే ఏ కొద్దిమంది విషయంలో తప్ప మిగిలిన వారందరికీ నేడు దాని ఎడల నమ్మకం లేదు. మోదీ మొదటి మూడేళ్ల పాలనలో గొప్ప దౌత్య విజయాలంటూ ఒకదాని తరువాత ఒకటిగా విజయోత్సవాలు జరుపుకోవడం దీని ఫలి తమే. బాధ్యత కలిగిన శక్తులుగా మూడు అంతర్జాతీయ క్షిపణి అణు సాంకేతిక వ్యవస్థలను భారత్ అంగీకరించింది. ఉపఖండంలో అమెరికా విధానం పూర్తిగా ఎటూ మొగ్గని రీతిలోనే ఉంది. వ్యూహాత్మక బంధాలే వాస్తవికంగా కనిపిస్తున్నాయి. బిల్ క్లింటన్ రెండో దఫా పదవీకాలం నుంచి భారత్ విదేశీ వ్యవహారాలు మెరుగుపడడం మొదలైంది. విధానాల కొనసాగింపు, ఆర్థికవృద్ధి దిశలను నిర్దేశించాయి. మోదీ తన శక్తితో, వ్యక్తిగత శైలిలతో, పూర్తి మెజారిటీ ఉండడంతో దీనిని మరింతగా విస్తరించారు. అయితే రైలును పట్టాలు తప్పించినదేమిటి? అంతర్జాతీయంగా రెండు ప్రతికూలతలు సంభవించినా అవి మోదీ ప్రభుత్వ తప్పిదాల వల్లకాదు. అవి– అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎదుగుదల, చైనా కొత్త ప్రకటన. ట్రంప్ చర్యలు, మరీ ముఖ్యంగా ఇరాన్ సంబంధాలలో మార్పు దరిమిలా చమురు ధరలు పెరగడానికి ప్రత్యక్షంగా దోహదం చేశాయి. ఇదే భారత్ దేశీయ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను అనిశ్చిత స్థితిలోకి నెట్టివేశాయి. భారత్ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చైనా–పాకిస్తాన్ ఆర్థిక నడవా పథకాన్ని డ్రాగన్ ముందుకు తోస్తున్నది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులలో, బంగ్లాదేశ్‌లో చైనా వేస్తున్న అడుగులు కూడా మరొక అంశం. అంటే ఉపఖండంలో భారత్‌కు ఉన్న పూర్వ వైభవాన్ని యథాతథంగా కొనసాగించడానికి చైనా అనుకూలంగా లేదన్న సంగతి కూడా వాటితో స్పష్టమవుతుంది. అణు సరఫరాదారుల బృందం నుంచి భారత్‌ను తప్పించవలసిందంటూ జార్జి డబ్లు్య బుష్ ఫోన్ లోనే హు జింటావోను ఆదేశించిన రోజులు కావు ఇవి. ప్రస్తుత అధ్యక్షుడు జింగ్పింగ్ అలాంటి మాటలు వినడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా ఫోన్లో చెప్పే పనికి ట్రంప్ కూడా పూనుకోడు. ఎందుకంటే, మోదీ లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తారు. ట్రంప్ వాటికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మోదీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన తప్పిదం ఒకటి ఉంది. అది– దేశీయ రాజకీయాల కోసం సున్నితమైన అంతర్జాతీయ సంబంధాలను ఉపయోగించుకోవడం. చరిత్రలో విజయవంతమైన నాయకులుగా చలామణీ అయినవారికి ఉన్న మొదటి లక్షణం వ్యూహాత్మక సహనం. వ్యూహాత్మక బంధాలను నిర్మించే క్రమంలో మంచి నాయకులు సునీల్ గావస్కర్ వలే బ్యాటింగ్ చేస్తారు గానీ వీరేంద్ర సెహ్వాగ్ వలె కాదు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అన్నింటి ప్రచార కార్యక్రమంలోను మోదీ విదేశాంగ విధానంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. అది విజయానికి ఉపయోగపడింది కూడా. కానీ దౌత్య విజయాల గురించి వెను వెంటనే వెల్లడించడం వల్ల ప్రమాదం ఉంది. మీకున్న వ్యూహాత్మక అవకాశాలు దానితో సన్నగిల్లిపోతాయి. ఇలాంటి వాటి విషయంలో ఇందిరాగాంధీ మూడో కంటికి తెలియనిచ్చేవారు కాదు. అలా అని ఆమె మూర్ఖురాలు కాదు. రాజకీయాలు తెలియనివారు కూడా కాదు. తక్షణ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి వ్యూహాత్మక చర్యలను ఉపయోగించుకుంటే, ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి మనకున్న మార్గాలు మూసుకుపోతాయి. ఇంకా దారుణమేమిటంటే– వాటి గురించి మీ శత్రువులకు అవగాహన పెరుగుతుంది. డోక్లాంతో, తరువాత జరిగిన పరిణామాలతో చైనా ఒక విషయం స్పష్టం చేసింది. భారత సైనిక పాటవానికి తాము భయపడేది లేదని ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ చైనా నీడకు చేరింది. గడచిన నవంబర్ 13న మనీలాలో మోదీ, ట్రంప్ సమావేశ వ్యవహారం కూడా దౌత్య వర్గాలలో ఏమాత్రం దాగకుండా బయట ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ సమావేశంలో ట్రంప్ హావభావాలు, ప్రవర్తన గతంలో మాదిరిగా లేవు. ఆనాటి మర్యాద లేదు. మోదీని అనుకరిస్తూ ట్రంప్ మాట్లాడినట్టు ఉన్న వీడియో బయటపడడంతో మోదీ పట్ల అతడికి ఉన్న అమర్యాద కూడా బయటపడింది. ఆ తరువాతే భారత వాణిజ్య ప్రయోజనాల మీద ట్రంప్ దెబ్బ కొట్టారు. అదే సమయంలో వీసాల విషయంలో బ్రిటన్ కూడా దెబ్బ కొట్టింది. ఇండియా పాస్‌పోర్టుకు విలువ పెరిగిందంటూ చెబుతున్న మాట ఈ పరిణామాలతో భంగపడినట్టు ఉంటుంది. నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించి పోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటి పోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టినది తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది. నేనిలా అంటున్నందుకు మీరు నన్ను ఉరిమి చూడవచ్చు. కానీ ఇది ప్రపంచం మొత్తానికీ తెలుసు.సైనిక శక్తి పతనం అనేది ఆర్థిక వ్యవస్థ క్షీణతతో ముడిపడి ఉంటుంది. మీ స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–ని లెక్కించే పద్ధతిని మార్పు చేయడం ద్వారా మీరు మీ ప్రజలను సులువుగా ఏమార్చవచ్చు. దాన్ని విశ్వసించడం మీరు ప్రారంభించినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. భారత్ వికాసం గురించి, మన విజ్ఞానాన్ని, దిశను యావత్ ప్రపంచమే ఎలా అబ్బురంగా తిలకిస్తోంది అనేదాని గురించి, క్రిస్మస్ పండుగకు పోటీగా యోగా దినోత్సవం ప్రస్తుతం భారత ఆధ్యాత్మికతా శక్తిని స్ఫురించే అంతర్జాతీయ వేడుకగా ఎలా మారింది అనే అంశం గురించి నిరంతరాయంగా చర్చిస్తున్నారు. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్ ఇటీవలే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సమక్షంలో చేసిన అలాంటి ఒక ప్రసంగాన్ని చూడండి. భారత్ విశ్వగురువుగా మారే క్రమంలో ఉందని విజయగర్వంతో ప్రకటించారు కూడా. అలాంటప్పుడు అన్ని కాలాల్లోనూ మన ఉత్తమమైన మిత్రదేశం అమెరికాతో మన సంబంధాలు ఎందుకు దిగజారుతున్నట్లు? బంగ్లాదేశ్ మినహాయిస్తే చైనా కౌగిలిలో ఉన్న మన పొరుగుదేశాలన్ని మనతో శత్రువైఖరితో, అనుమానాస్పదంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ఈ విశ్వగురు దేశానికి చెందిన ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంత అనాగరికంగా ఎలా వ్యవహరిస్తారు? ట్రంప్ పాలనాయంత్రాంగంలో అసాధారణ వ్యక్తిగా ఉన్న నిక్కీ హేలీ నేరుగా భారత్‌కి వచ్చి ఇరాన్‌తో మన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని ఎలా ఆదేశి స్తారు? అలాగే చైనా అధ్యక్షుడు గ్జిని కలిసినప్పుడు మన మోదీ శరీరభాష పూర్తిగా ఎందుకు మారిపోయినట్లు? పాక్ అక్రమిత కశ్మీర్‌లోని భారతీయ భూభాగం గుండా సిపిఇసి రహదారిని నిర్మిస్తుండటంపై మన నాయకులు నిరనస తెలిపి ఎంతకాలమైంది?అందుకే ఊపిరి సలపకుండా మనం చేసుకుంటున్న వేడుకలకు మంగళం పాడాల్సిన సమయం ఇదే మరి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకుని వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకుని అంతర్మథనం చేసుకోవడమే ఉత్తమం. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
భారత్–అమెరికా 2+2 చర్చలు వాయిదా
న్యూఢిల్లీ: భారత్–అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జూలై 6న జరగాల్సిన 2+2 చర్చలు వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాలతో ఈ చర్చలు వాయిదా పడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌చేసిన ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుష్మా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన మరో తేదీన అమెరికా లేదా భారత్‌లో సమావేశమయ్యేందుకు అంగీకరించారు. 2017లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా 2+2 చర్చలు జరిపేందుకు భారత్, అమెరికాలు అంగీకరించాయి. -
రక్షణ రంగంలో భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యం
-
ఫైనాన్స్ కమిషన్‌పై అనుమానాలొద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువిడందై: 15వ ఆర్థికసంఘం నిబంధనలు కొన్ని రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా నియంత్రణకోసం పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలంటూ కేంద్రమే ఆర్థిక సంఘానికి సూచించిందని గురువారం చెన్నైలో వెల్లడించారు. ఇటీవల కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వివరణనిచ్చారు. అంతకుముందు, కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్పోను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారత సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకే దేశాన్ని రక్షణ రంగ తయారీ కేంద్రంగా మార్చే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శమని, అలాగని సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదన్నారు. కాగా, కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఇంతవరకు స్పందించకపోవటంతో ఈ పర్యటనలో తమిళులు మోదీకి నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు, విపక్షాలు పార్లమెంటు కార్యక్రమాలను జరగనివ్వకపోవటానికి నిరసనగా బీజేపీ ఎంపీలు దేశవ్యాప్తంగా గురువారం ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ కూడా ఈ దీక్షలో ఉంటూనే తమిళనాడులో పర్యటించారు. తమిళనాడుకు లాభమే: మోదీ కేరళలో ఇటీవల జరిగిన భేటీలో కేరళ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అయితే.. ఈ సమావేశానికి తమిళనాడు హాజరుకాకపోయినా.. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవటం ద్వారా కేంద్ర పన్ను ఆదాయం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించింది. అయితే ఈ నిబంధనల ద్వారా తమిళనాడు వంటి రాష్ట్రాలకు మేలే జరుగుతుందని గురువారం నాటి కార్యక్రమంలో ప్రధాని పేర్కొనటం గమనార్హం. ‘15వ ఆర్థిక సంఘాన్ని అడ్డంపెట్టుకుని ఓ ప్రాంతం, ఓ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారం అర్థరహితం. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మా మంత్రం. మనమంతా కలసి నవభారత నిర్మాణానికి పనిచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా చేయాలి’ అని మోదీ పేర్కొన్నారు. యూపీఏ విధానాల వల్లే.. దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే పొరుగుదేశాలతో శాంతి నెలకొల్పటంలోనూ ఉందని మోదీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఈ కార్యక్రమంలో పలు స్వదేశీ, విదేశీ రక్షణ రంగ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల దేశంలో రక్షణ రంగం చతికిలబడిందని మోదీ విమర్శించారు. దీని మూలంగా భారత మిలటరీ యుద్ధ సంసిద్ధతపై ప్రభావం పడిందన్నారు. ‘నాటి రాజకీయ అచేతనం కారణంగా దేశంలో అత్యంత కీలకమైన రక్షణ సంసిద్ధత మూలనపడింది. వారి సోమరితనం, అసమర్థత, బయటకు కనిపించని ఉద్దేశాల కారణంగా జరిగిన నష్టాన్ని మనం చూశాం. గత ప్రభుత్వం పరిష్కరించాల్సిన చాలా సమస్యలను ఇప్పుడు మేం పరిష్కరిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రపంచ శాంతి, ఐకమత్యం, సామరస్యం కోసం భారత్ ఎప్పుడూ త్యాగం చేస్తూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలను గుర్తుచేసుకోండి. వేల ఏళ్ల భారత చరిత్రను చూసుకోండి. మా దేశం ఎప్పుడూ సామ్రాజ్యకాంక్షతో ఇతర దేశాలపై దండెత్తలేదు. రాజ్యాలను, దేశాలను గెలవటం కంటే ప్రజల మనసులు గెలవటాన్నే మేం విశ్వసిస్తాం. వైదిక కాలం నుంచి శాంతి, సోదరభావం వంటి సందేశాలను ప్రపంచానికి ఇచ్చిన పుణ్యభూమి ఇది’ అని మోదీ పేర్కొన్నారు. ఎగుమతిచేసే సామర్థ్యానికి.. ‘2014 మేలో రక్షణ రంగ ఎగుమతుల అనుమతుల సంఖ్య 118 అని.. దీని విలువ దాదాపు రూ.3,767 కోట్లు. కానీ మేమొచ్చాక నాలుగేళ్ల లోపలే 794 ఎగుమతుల అనుమతులిచ్చాం. వీటి విలువ దాదాపు రూ.84వేల కోట్లు. రక్షణ రంగ సేకరణ విధివిధానాలను కూడా ఇరువర్గాలకు మేలు చేసేలా సమీక్షించాం. స్వదేశీయంగా రక్షణ రంగ పరిశ్రమ వృద్ధి చెందాలనేదే మా లక్ష్యం’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రక్షణశాఖ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలది ప్రధానపాత్ర అన్న మోదీ.. ఈ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమిళనాట ‘గోబ్యాక్ మోదీ’ చెన్నై: ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన సందర్భంగా తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై కేంద్ర వైఖరికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. గోబ్యాక్ మోదీ అని రాసి ఉన్న బెలూన్లను ఎగురవేశారు. ప్రధాని మద్రాస్ ఐఐటీకి వెళ్లే సమయంలో కొందరు ఆయన వ్యతిరేక నినాదాలు చేశారు. డీఎంకేతోపాటు సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. చెన్నైతోపాటు దిండిగల్, కరూర్, రామనాథపురం, విరుధునగర్, మదురై, కోయంబత్తూర్లలోనూ ఇదే విధంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితర నేతల ఇళ్ల వద్ద నల్లజెండాలు ఎగురవేశారు. ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో కనిపించే కరుణానిధితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కనిమొళి నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చెన్నైలో మోదీ వ్యతిరేక నినాదాలిస్తున్నకనిమొళి, డీఎంకే నేతలు దేశీయంగా ఫైటర్ జెట్ల తయారీ తిరువిడందై: ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్‌లోనే తయారుచేసేందుకు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం..మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ విమానాల తయారీకి మన దేశంలో అధునాతన రక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే భవిష్యత్ సాంకేతికతలను రూపొందిస్తామని బోయింగ్ వెల్లడించింది. చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పోలో రెండో రోజైన గురువారం ఈ నిర్ణయం వెలువడింది. భారత వాయుసేనకు 110 యుద్ధ విమానాలను సరఫరా చేసే డీల్ రేసులో లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, డసాల్ట్ తదితర దిగ్గజ కంపెనీలతో పాటు బోయింగ్ కూడా ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే సుమారు 15 బిలియన్ డాలర్ల ఆ కాంట్రాక్టు కూడా బోయింగ్‌కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
డిఫెన్స్ ఎక్స్పోను సందర్శించిన ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పోను గురువారం సందర్శించారు. అంతకు ముందు అదే ప్రాంగణంలో 2.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 685 ఎగ్జిబిషన్ స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన వివిధ దేశాల ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. కాగా ప్రధాని మోదీ ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై పాత విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి...ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహాబలిపురం, అక్కడి నుంచి కారులో డిఫెన్స్ ఎక్స్పో మైదానానికి విచ్చేశారు. ఇక అక్కడి కార్యక్రమాలను ముగించుకుని మరలా చెన్నై విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి కారులో చెన్నై అడయారు కేన్సర్ ఇన్స్టిట్యూట్ వజ్రతోత్సవ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళతారు. రాష్ట్రంలో కావేరీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రధాని పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రత్యేక భద్రతా దళం అధికారులు నిన్నే చెన్నైకి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని ప్రారంభించబోయే ప్రదర్శనశాలకు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను తనిఖీ చేశారు. వివిధ హోదాల్లోని రెండువేల మంది పోలీసు అధికారులతోపాటు 60 ప్రత్యేక కమాండోలను రంగంలోకి దించారు. అలాగే డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో నిన్న (బుధవారం) నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందై ఈసీఆర్ రోడ్డులో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో రూ.480 కోట్లతో కేంద్ర రక్షణశాఖ భారీఎత్తున డిఫెన్స్ ఎక్స్‌పోకు రూపకల్పన చేసింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఎక్స్పోను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన డిఫెన్స్ ఎక్స్పో భాగస్వామ్యులు, సందర్శకుల రాకతోనూ, వారి వాహనాలతోనూ ఐదు కిలోమీటర్ల మేర ఈసీఆర్ నిండిపోయింది. 47 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, ఫిరంగులు ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగస్వామ్యులై తమ దేశ ప్రతిభను చాటాయి. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ గుండెలదరగొట్టాయి, తలకిందులుగా ఎగురుతూ పొగలు చిమ్ముతూ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అలాగే యుద్ధ ఫిరంగుల విన్యాసాలు అదరగొట్టాయి. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాట 167 దేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు తిలకించారు. ఈ ఎక్స్పో 14వ తేదీ వరకు నాలుగురోజులపాటు కొనసాగుతుంది. -
డిఫెన్స్ ఎక్స్పో అదుర్స్
చెన్నైలో ప్రారంభమైన డిఫెన్స్ ఎక్స్‌పోలో ‘అర్జున్ మార్క్–2’ యుద్ధ ట్యాంకు విన్యాసం. భారత్, అమెరికా, రష్యా, ఇంగ్లండ్ తదితర 47 దేశాలకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఎక్స్పోను నేడు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. -
డజను ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌దాడికి గురైన ఈ వెబ్సైట్లలో చైనీస్ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని జాతీయ సైబర్ భద్రత (ఎన్సీఎస్) సమన్వయకర్త గుల్షన్ రాయ్ అన్నారు. నెట్వర్కింగ్ వ్యవస్థలో హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. -
డిఫెన్స్‌లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
-
యూపీలో డిఫెన్స్ కారిడార్
లక్నో: ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని వల్ల రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్లకు విస్తరిస్తామని తెలిపారు. బుధవారం లక్నోలో మొదలైన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఈ విషయం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ యూపీ పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ..యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్నారు. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించే సామర్థ్యం(పొటెన్షియల్), విధానాలు(పాలసీ), ప్రణాళికలు(ప్లానింగ్), పనితీరు(పెర్ఫామెన్స్) లాంటివి అభివృద్ధికి మార్గాలని, ఈ విషయంలో యూపీ సర్కారు, ప్రజలు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
భారత్‌కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
భద్రత సమాచారమూ ఇవ్వరా?
విశ్లేషణ రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? 1. రైళ్ల రక్షణ హెచ్చరిక వ్యవస్థ (ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టం)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (íసీఈఎల్) 2013లో ప్రతిపాదించిన పథకానికి మంజూరు చేసిన వ్యయం ఎంత? 2. మంజూరుపత్రం కాపీ ఇవ్వండి. 3. విడుదలైన డబ్బు వినియోగించినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 4. సీఈఎల్‌కు విడుదల చేసిన నిధుల వివరాలు ఇవ్వండి. 5. సీఈఎల్ పథకాన్ని పూర్తిచేసినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 6. ప్రాజెక్టు పూర్తికాకపోతే కారణాలు తెలపండి, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పండి. 7. మంజూరు చేసిన వ్యయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి అయిందా? కాక అదనపు ఖర్చును మంజూరు చేస్తూ జారీ చేసిన పత్రం నకలు ఇవ్వండి. 8. ఈ ప్రాజెక్టు టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలించి ఉంటుంది. వారి నివేదికలో ఆర్థిక సాంకేతిక లోపాల గురించి ప్రస్తావిస్తే ఆ వివరాలు ఇవ్వండని ఎనిమిది అంశాలమీద సమాచారాన్ని అడిగారు అస్తిత్వ అనే వ్యక్తి. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డీఎస్ఐఆర్) జవాబు ఇవ్వాలి. కానీ ఇదంతా వ్యక్తిగతమట. సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వరట. అస్తిత్వ అడిగిన సమాచారం సంక్షిప్తంగానైనా ఇవ్వాలని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. ప్రాజెక్టు వివరాలను వ్యక్తిగత సమాచారమంటూ తిరస్కరించడం తీవ్రమైన విషయం. రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? పోనీ íసీపీఐఓ భావించినట్టు ఇది వ్యక్తిగత సమాచారమని అనుకున్నా, దానికి జనహితం అనే మినహాయింపు ఉంది కదా! ఆ జనహితం కోసమైనా ఈ సమాచారం ఇవ్వవచ్చు కదా? ఆర్టీఐ దరఖాస్తు 23.5.2017న దాఖలైంది. విమల్ కుమార్ వరుణ్ ఆ దరఖాస్తును జి– విభా గం శాస్త్రజ్ఞుడు బీఎన్ సర్కార్‌కు పంపారు. సెక్షన్ 5(4) కింద అస్తిత్వగారు కోరిన సమాచారం ఇవ్వాలని కోరుతూ 25.5.2017న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని సమాచార కమిషన్‌కు వివరణతో పాటు సమర్పించారు. అయినా బీఎన్ సర్కార్ ఇది వ్యక్తిగత సమాచారమనీ, సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వడం చెల్లదనీ జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఆదేశం తరువాత కూడా పూర్తి సమాచారం రాలేదని అస్తిత్వ కమిషన్‌కు వివరించారు. సీఇఎల్కు పరిశోధన చేయడానికి గాను తమ విభాగం (డీఎస్ఐఆర్) ఆర్థిక సాయం చేస్తుందని, మార్కెట్ అవసరాలను అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు చేయడానికి సహకరించి, ఆ వస్తువులను వాణిజ్యపరంగా వినియోగిస్తుందని వివరించారు. కొన్ని ధృవపత్రాలు కూడా అస్తిత్వకు ఇచ్చామనీ, అయితే పొరబాటున వాటిని ధృవీకరించడం మరి చిపోయామనీ చెప్పారు. అయితే సీఈఎల్ అనేది కంపెనీ కనుక, వాణిజ్య వ్యవహారాలను నడుపుతుంది కనుక అడిగిన సమాచారం మొత్తం ఇస్తే అందులో వాణిజ్య రహస్యాలు ఉంటాయి కనుక ఇవ్వకూడదని సెక్షన్ 8(1)(డి) కింద మినహా యింపు వర్తిస్తుందని భావించామని, కానీ పొరబాటున సెక్షన్ 8(1)(జె) అని రాశామని కూడా సీపీఐఓ తన వివరణలో తెలియజేశారు. రికార్డు పరిశీలిస్తే డిసెంబర్ 13 (2017)న ఇచ్చిన జవాబుల్లో కూడా డీమ్డ్ పీఐఓ బీఎన్ సర్కార్ 5,6,7,8 అంశాలకు సరైన జవాబు, పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. అయిదో అంశంపైన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పలేదు. ఆరో ప్రశ్నకు ఆలస్యంగా ‘పరిశీలనలో ఉంది’ అని జవాబు ఇచ్చారు. ఏ పరిశీలన? ఎవరి పరిశీలన? ఏడో పాయింట్‌కు నాట్ అప్లికబుల్ అని ఊరుకున్నారు. మొత్తం ప్రాజెక్టు మంజూరైన వ్యయానికి లోబడి ఉందా లేదా అంటే వర్తించదు అని జవాబిస్తారా? ఎనిమిదో పాయింట్‌కు అటువంటి కమిటీ లేదు. కమిటీ ఏ లోపాన్నీ కనిపెట్టలేదని జవాబు. 5 నుంచి 8 వరకు పాయింట్లకు వాణిజ్య రహస్యానికి సంబంధమే లేదు. కనుక 8(1)(డి) కూడా వర్తించదు. బీఎన్ సర్కార్ గారు మళ్లీ మళ్లీ 8(1)(డి)నే వర్తిస్తుందని, పత్రాలను ధృవీకరించనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఇవ్వాల్సిన జవాబులా ఇవి? విమల్ కుమార్ వరుణ్ సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని స్పష్టంగా లేఖ రాశారు. కానీ సమాచారం అధీనంలో ఉన్న శాస్త్రజ్ఞుడైన సర్కార్ నిరాకరించడం వల్ల ఇవ్వలేకపోయారు. అస్తిత్వ ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనేకానేక లోపాలను వివరిస్తూ ఆడిట్ ఇచ్చిన ఒక నివేదిక భాగాలను కమిషన్‌కు సమర్పించారు. వీటికి జవాబి వ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. (అస్తిత్వ వర్సెస్ సైన్స్/టెక్నాలజీ మంత్రిత్వశాఖ CIC/DOSIR/A/2017/159662 కేసులో సీఐసీ 12 జనవరి 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాఢభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆ భూములను వాడుకునే వీలు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ, రైల్వేశాఖ అధీనంలోని భూములు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాలకు వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ‘అవసరార్థం స్థిరాస్తి సేకరణ చట్ట సవరణ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల రక్షణశాఖకు చెందిన బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు ఆ శాఖ అంగీకరించింది. రక్షణ అవసరాల కోసం హైదరాబాద్‌లో రక్షణశాఖకు భూములిస్తే.. ఆ శాఖ స్థానికంగా ఉండే ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిబంధనలు పెడుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వేధింపులు మానుకోవాలి. జాతీయ భద్రత గురించి భూములు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకొని చర్చలు జరపాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూములు బదిలీ చేసుకోవాలి గానీ వెల కట్టడం సరికాదు’ అని అన్నారు. నాడు ‘కల్యాణలక్ష్మి’ ఉండుంటే..: కడియం తొర్రూరు రూరల్ (పాలకుర్తి): ‘నాకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు.. పేదలైన మా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు నానా కష్టాలు పడ్డారు.. ఇప్పటిలా కల్యాణలక్ష్మి ఉంటే మాకు ఆ ఇబ్బందులు ఉండేవి కావు’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం గ్రామంలో బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు ఆడపిల్లలేనని, ఒక్క కొడుకైనా కలగకపాయేనని కన్నతల్లి ఆవేదన చెందేదని, కానీ.. కూతుళ్లను ఉన్నతంగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దానని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లిది.. తనది ఒకే గ్రామమని.. ఉన్నత కుటుంబం నుంచి ఎర్రబెల్లి, పేద కుటుంబం నుంచి తాను అభివృద్ధి చెందామని అన్నారు. -
మాల్యాపై ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవు
లండన్: వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశానికి పారిపోయిన లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించే క్రమంలో లండన్‌లో రెండవ రోజు వాదనలు కొనసాగాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా మాల్యా పై నగదు బదిలీ అభియోగాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది. మాల్యా తరపు లాయర్ క్లారా మోంట్‌గోమెరీ మంగళవారం తన వాదనలను వినిపిస్తూ మాల్యాపై ఆరోపణలను సమర్ధించటానికి ఎటువంటి ఆధారం లేదన్నారు. మాల్యా రుణాలు తీసుకుని మోసం చేశారన్న వాదనకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సరైన సాక్ష్యాలు లేవని ఆమె పేర్కొన్నారు. సీపీఎస్ సమర్పించిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని వాదించారు. ఈ కేసు విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ భారత ప్రభుత్వం తరఫున వాదిస్తోంది. బుధవారం, శుక్రవారం సెలవు రోజులు కావడంతో తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది. కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల మోసం, అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలు విజయ్ మాల్యాపై ఉండగా గత ఏడాది మార్చిలో దేశం విడిచి లండన్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
భారత్‌తో బంధం చాలా ముఖ్యం
వాషింగ్టన్ : భారత్‌తో మరింత బలమైన రక్షణ సంబంధాలను అమెరికా కోరుకుంటోందని ఆ దేశ దక్షిణ, మధ్య ఆసియా సంబంధాల కార్యదర్శి జీ వెల్స్ స్పష్టం చేశారు. ధృఢమైన ద్వైపాక్షిక సంబంధాల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఎప్-16, ఎఫ్-18 యుద్ధ విమానాల అమ్మకాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆమె చెప్పారు. అమెరికా రక్షణ కార్యదర్శి రెక్స్ టెల్లర్‌సన్స్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్‌ల పర్యటన ముగించుకుని తిరిగి రాగానే.. ముఖ్య విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. భారత్, అమెరికాల మధ్య ఏర్పడ్డ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 21వ శతాబ్దాన్ని ప్రభావంతం చేస్తుందని ఆమె తెలిపారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయడం వల్ల చైనా, ఇతర దేశాలను నిలువరించవచ్చన్నారు. భారత్‌తో అమెరికా మరింత లోతైన రక్షణ సంబంధాలను కోరుకుంటోందోని ఆమె తెలిపారు. ఈ దశాబ్దం ఆరంభంలో అధమస్థాయిలో ఉన్న రక్షణ వాణిజ్యం ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇక 115 బిలియన్ డాలర్ల విలువ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 140 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఆమె సూచించారు. -
భారత్- అమెరికా సంబంధాలపై.. డ్రాగన్ కామెంట్
బీజింగ్ : భారత్ విషయంలో చైనా స్వరం మారుతోంది. ముఖ్యంగా డోక్లామ్ వివాదం తరువాత భారత్ గురించి మాట్లాడేటప్పుడు.. చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. భారత్-అమెరికా రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల గురించి చైనా గురువారం సానుకూలంగా స్పందించింది. భారత్-అమెరికా మధ్య ఏర్పడుతున్న రక్షణ సంబంధాలు.. ఆసియాలో శాంతికి అనుకూలిస్తాయని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ వూ కియాన్ అభిప్రాయపడ్డారు. భారత్-అమెరికాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలపై తమ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉందన్నారు. భారత్-అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల ఆసియాలో శాంతి నెలకొంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ ఈ నెల 26, 27 తేదీల్లో భారత్‌లో పర్యటించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎఫ్-16 యుద్ధవిమానాలను 'మేకిన్ ఇండియా'లో భాగంగా రూపొందించడం, భారత్‌కు గార్డియన్ డ్రోన్ల అమ్మకంపైనా చైనా ఆచితూచి స్పందించింది. హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన గార్డియన్ డ్రోన్ల క్రయవిక్రయాలపైనా డ్రాగన్ స్పందిస్తూ.. దీని గురించి పెద్దగా ఆలోచించే పని లేదని పేర్కొంది. -
రక్షణ శాఖలోకి త్వరలో మహిళలు
-
రక్షణ శాఖలోకి త్వరలో మహిళలు
న్యూఢిల్లీః రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీస్ విభాగంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సైనిక బలగాల్లో లింగ వైరుధ్యాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. తొలిదశలో భాగంగా 800 మంది మహిళలను మిలటరీ పోలీసు విభాగంలో చేర్చుకుంటారు. 1992 నుంచి వైద్య సేవలు వంటి ఎంపిక చేసిన విభాగాల్లో మిలటరీ పోలీసులో మహిళలను అనుమతించారు.మరోవైపు సైనిక సిబ్బంది ర్యాంకుల అప్గ్రేడేషన్ను చేపట్టాలని ప్రతిపాదించారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే కీలక నిర్ణయాలు వెలువడటం గమనార్హం. తొలి పూర్తిస్ధాయి మహిళా రక్షణ మంత్రి నిర్మల దేశీయ పరిజ్ఞానంతో మంత్రిత్వ శాఖను కొత్త పుంతలు తొక్కించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నఅంశాల పరిష్కారం తన ప్రాదాన్యతాంశాలుగా ముందుకెళ్లనున్నారు. -
అనూహ్యం: కొత్త రక్షణమంత్రి నిర్మల!
సాక్షి, న్యూఢిల్లీ: తాజా కేంద్ర కేబినెట్ విస్తరణలో కీలకమైన రక్షణశాఖ ఎవరికి అప్పగిస్తారన్న అంశానికి తెరపడింది. అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు ఈ కీలకమైన పదవి దక్కింది. ఎవరూ ఊహించనిరీతిలో ఆమెకు ఈ పదవి దక్కడం గమనార్హం. వాణిజ్య, జౌళి శాఖల సహాయమంత్రిగా సమర్థంగా పనిచేసిన నిర్మల పనితీరును మెచ్చి.. ప్రధాని మోదీ ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఒక మహిళకు ఈ పదవిని అప్పగించడం గమనార్హం. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ ఘనత సొంతం చేసుకున్నారు. ఇక, మిగతా పోర్ట్పోలియోల కేటాయింపు ఊహించినరీతిలోనే సాగింది. ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలుప్రమాదాల నేపథ్యంలో సురేశ్ ప్రభు రైల్వేమంత్రిగా రాజీనామా చేయడంతో కీలకమైన ఈ శాఖ పీయూష్ గోయల్‌కు దక్కింది. తాజా విస్తరణలో కేబినెట్ మంత్రిగా పీయూష్ ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఇక, వాణిజ్యశాఖ మంత్రిగా సురేశ్ ప్రభు, పెట్రోలియం, స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్, సమాచారశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ, ఉపరితల రవాణా, జలవనరులశాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గజపతిరాజు (పౌరవిమానాయానం), సుజనాచౌదరి (సైన్స్ అండ్ టెక్నాలజీ)శాఖల్లో మార్పలేమీ చోటుచేసుకోలేదు. రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిపోవడంతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రక్షణశాఖ బాధ్యతలను అదనంగా మోస్తున్న సంగతి తెలిసిందే. ఈ శాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించడంతో ప్రస్తుతం జైట్లీ వద్ద ఆర్థికశాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఉంది. తాజా కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అదనపు బాధ్యతల భారం నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నట్టు ఆర్థికమంత్రి జైట్లీ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త మంత్రుల మంత్రిత్వశాఖలు ఇలా ఉండనున్నాయి. మంత్రులు-మంత్రిత్వశాఖలు రక్షణశాఖ: నిర్మలా సీతారామన్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ: అరుణ్ జైట్లీ పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి శాఖ: ధర్మేంద్ర ప్రధాన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ: సురేశ్ ప్రభు తాగునీరు,పారిశుద్ధ్యం శాఖ: ఉమాభారతి రైల్వేశాఖ: పీయూష్ గోయల్ టెక్స్టైల్, సమాచారశాఖ: స్మృతి ఇరానీ మైనారిటీ వ్యవహారాలశాఖ: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరితల రవాణా, జలవనరులశాఖ: నితిన్ గడ్కరీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గనులు: నరేంద్ర తోమర్ (స్వతంత్ర హోదా) విద్యుత్ శాఖ: రాజ్‌కుమార్ సింగ్ (స్వతంత్ర హోదా) టూరిజంశాఖ: అల్ఫాన్స్ కన్నంథనమ్ (స్వతంత్ర హోదా) పట్టణాభివృద్ధి, హౌజింగ్: హర్దీప్సింగ్ పూరి (స్వతంత్ర హోదా) క్రీడలు, యువజన వ్యవహారాలు: రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ (స్వతంత్ర హోదా) పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి: విజయ్ గోయల్ ఆర్థికశాఖ సహాయమంత్రి: శివప్రతాప్ శుక్లా వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి: అశ్వినీకుమార్ చూబే స్కిల్ డవలప్మెంట్ సహాయమంత్రి: అనంత్‌కుమార్ హెగ్డే వ్యవసాయశాఖ సహాయమంత్రి: గజేంద్రసింగ్ షెకావత్ మానవ వనరులశాఖ సహాయమంత్రి: సత్యపాల్ సింగ్ మహిళా, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి: వీరేంద్ర కుమార్ -
అనూహ్యం: కొత్త రక్షణమంత్రి నిర్మల!
-
బంగ్లదేశ్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం
-
బంగ్లదేశ్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రక్షణ శాఖ రంగం బలోపేతానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగురోజుల భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అనంతరం ఇరు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కీలకమైన పౌర అణు సహకారం, రక్షణ ఒప్పందాలు సహా దాదాపు 22 ఒప్పందాలపై భారత్, బంగ్లాదేశ్‌లు సంతకం చేశాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాద నిరోధం, భద్రతా సహకాంపై చర్చించామని, బంగ్లాదేశ్‌కు భారత్ సుదీర్ఘ కాలం నమ్మదగిన మిత్రదేశమని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ కోరుకుంటే భద్రతా రంగంలో తమ సాయం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. కాగా అంతకు ముందు కోల్‌కతా-ఖుల్నా-ఢాకా (బంగ్లాదేశ్) బస్సు సర్వీసును అధికారులు ప్రారంభించారు. -
ఆత్మ రక్షణలో అధికార పక్షం
త్రికాలమ్ మంత్రివర్గంలో మార్పులు చేసే క్రమంలో శనివారం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో, శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. అలిగేవారు అలుగుతున్నారు. బెదిరించేవారు బెదిరిస్తున్నారు. వేడుకునేవారు వేడుకుంటున్నారు. విన్నవించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్ది చెబుతున్నారు. మంత్రివర్గంలో మార్పులు జరిగిన ప్రతిసారీ ఈ తంతు అని వార్యం. పదవులు ఆశించేవారు ఎక్కువ. పదవులు తక్కువ. ఇంతవరకూ మంత్రులుగా పని చేసినవారు సాధించిన ఘనకార్యాలు ఏమిటో, ఇప్పుడు కొత్తగా చేరేవారు చేయబోయేది ఏమిటో తెలియదు. మంత్రివర్గ సభ్యులతో సమాలోచన జరిపి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక నిర్ణయం తీసుకునే ముందు చర్చ జరిగినట్టు, ముఖ్యమంత్రి అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఒక్క మంత్రి అయినా వెలిబుచ్చినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక పొరపాటు నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు వారించే సాహసం, వివేకం ఉన్న వారికి అవకాశం ఇచ్చినట్లయితే ప్రభుత్వం తప్పులు తక్కువ చేస్తుంది. ముఖ్య మంత్రి ఏది చెబితే దానికి తలలూపేవారినే చేర్చుకుంటే ప్రభుత్వం తప్పులు ఎక్కువ చేసి చిక్కులు కొనితెచ్చుకుంటుంది. విషయ పరిజ్ఞానం ఉన్న శాసనసభ్యులకు అవకాశం ఇస్తే మంత్రివర్గం పనితీరు మెరుగవుతుంది. ప్రభుత్వానికీ, అధికారపార్టీకీ, ముఖ్యమంత్రికీ మంచి పేరు వస్తుంది. రెండున్నర సంవత్సరాలుగా మంత్రులు పని చేసిన తీరును చూసిన ముఖ్యమంత్రి ఎవరికి ఉద్వాసన చెప్పాలో, ఎవరికి ముఖ్యమైన శాఖలు అప్పగించాలో నిర్ణయించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చింది. కేవలం కులాల సమతౌల్యం మాత్రమే చూడకుండా పార్లమెంటరీ సంప్రదాయాలు తెలిసినవారికీ, అధ్యయనశీలం ఉన్నవారికీ, ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయం కలిగినవారికీ మంత్రి పదవులు ఇస్తారో లేక ప్రతిభకు కాకుండా విధేయతకే ప్రాధాన్యం ఇస్తారో కొన్ని గంట లలో తెలిసిపోతుంది. వైఎస్ఆర్సీపీ టికెట్టుపై గెలిచి పార్టీ ఫిరాయించివారిని పార్టీలో చేర్చుకున్న సమయంలో వారికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయ డం ఒక సవాలు. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించడం అనైతికం. వారికి మంత్రి పదవులు ఇవ్వడం అక్రమం. తెలంగాణలో టీడీపీ టికెట్టుపైన గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ చేత మంత్రిగా ప్రమాణం చేయించినందుకు గవర్నర్‌ను తప్పుపట్టి విమర్శించిన చంద్రబాబు అదే గవర్నర్ నరసింహన్ చేత ఫిరాయింపుదారులతో ప్రమాణం చేయించడం ద్వంద్వ ప్రమాణాలకూ, విలువల పతనానికీ పరాకాష్ఠ. బాదల్ నుంచి కేసీఆర్ వరకూ అందరూ చేస్తున్నదే కనుక కుమారుడు లోకేశ్‌ను చేర్చుకోవడాన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. కానీ ఫిరాయింపుదారులకు పద వులు ఇవ్వడం మాత్రం ప్రజలు సహించరు. కేసీఆర్ చేసినా చంద్రబాబు చేసినా అది అనైతికమే, అభ్యంతరకరమే. ఒకటి ఉదాహరణ, ఒకటి హెచ్చరిక సమావేశాలు ఎట్లా జనరంజకంగా జరగాలో చెప్పుకోవాలంటే తెలంగాణ అసెం బ్లీనీ, ఎట్లా జరగకూడదో చూపించాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనీ ఉదాహరణగా చెప్పుకోవచ్చునంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు బాగా ప్రచారమైనాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు పాతరోజులను గుర్తుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు చర్చ లేకుండా సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ, కేకలూ, పొలికేకలతో అట్టుడికాయి. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లా డటానికి అవకాశం లభిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతకు మైకు దొరకడమే గగనం అవుతోంది. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు ఏదైనా చెప్పడానికి లేస్తే ప్రతిపక్ష నాయకుడు కూర్చోవడం ఆనవాయితీ. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుండగానే ఆయన మైక్ ఆగిపోయి అచ్చెన్నాయుడూ, బుచ్చయ్య చౌదరీ, కాల్వ శ్రీనివాసులూ, యనమల రామకృష్ణుడూ, అనిత తదిరులంతా ప్రతిపక్ష నాయకుడిని తనివితీరా తిట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ‘పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి మైక్ కట్ అవుతోంది అధ్యక్షా’ అంటూ తెలంగాణ శాసనసభలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అమ రావతిలో అధికారపక్షం ధోరణిలో మార్పు లేదు. చంద్రబాబు మొత్తం 13 రోజుల్లో ఎనిమిది గంటలకు పైగా మాట్లాడితే 67 మంది సభ్యులున్న (ఫిరా యించినవారి పేర్లు సైతం వైఎస్ఆర్సీపీ జాబితాలోనే ఉన్నాయి) ప్రతిపక్షానికి కేవలం 3.46 గంటల సమయం దొరికింది. నలుగురు సభ్యులున్న బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడటానికి 3.13 గంటల సేపు అనుమతించారు. సభలో చర్చ జరగకపోవడానికి బాధ్యత ఎవరిది? ప్రతిపక్షానిది అనే సమా ధానం అధికారపార్టీ నుంచి వస్తుంది. కానీ సభను సజావుగా జరిపించవలసిన బాధ్యత అధికారపక్షానిదీ, సభానాయకుడిదీ. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి అదేపనిగా ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ సంగతి విస్మరిస్తే కుదరదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు కేంద్రంగా సభ నడవడం. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో ప్రతిపక్షనేతను అదే పనిగా తిట్టించడం. తిట్ల దండకం మినహా వారి నియోజకవర్గాలను పట్టిపీడిస్తున్న సమస్యల ప్రస్తావనకు ఫిరాయింపుదారుకు అవకాశం లేదు. ప్రతిపక్ష నాయకుడు అన్ని అంశాలపైనా అధ్యయనం చేసి గణాంకాలతో సహా సవివరంగా మాట్లాడుతుంటే అధికారపక్ష సభ్యులకు ఆ అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిని తిడితే సరిపోతుంది. మంత్రులూ ఇదే పని చేస్తున్నారు. ఉత్తరోత్తరా ఎవరైనా పరిశోధకులు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలను అధ్యయనం చేస్తే ఎంత నేలబారుగా కొందరు సభ్యులు వ్యవహరించారో చూసి విస్తుపోతారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం ఒక్క బిల్లుపైన కూడా సంపూర్ణంగా చర్చ జరగని సమావేశం ఇదే. మొత్తం 21 బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ ఒక్కదానిపైన కూడా ప్రతిపక్షం అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ముఖ్యమంత్రి వ్యక్తి గతంగా దూషించడం, ప్రతిపక్ష నాయకుడు పరీక్షలు రాయలేదనీ, ఆర్థిక ఉగ్ర వాది అనీ, నేరస్థుడనీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఎవరి స్థాయి తగ్గింది? తన అభిప్రాయం చెప్పడానికి రెండు నిమిషాలు మైకు ఇవ్వమని పదేపదే ప్రతిపక్ష నాయకుడు విజ్ఞప్తి చేసినా నాలుగు రోజుల పాటు మైకు ఇవ్వని పరిస్థితి గతంలో ఎన్నడూ కనలేదు. వినలేదు. ప్రతిపక్షనేత తీరుపైన రెండు గంటలు చర్చ జరిపి ఆయన వైఖరిని నిరసిస్తూ ఒక తీర్మానం ఆమోదించిన ఘనత సైతం ఈ శాసనసభదే. ప్రతి విమర్శకీ జగన్మోహన్రెడ్డి దీటుగా సమా ధానం చెప్పారు. తన ఆస్తుల గురించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య లను సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా తన మీద సీబీఐ విచారణ వెనుక, కేసుల వెనుక ఉన్న కారణాలు ఏమిటో, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి ఎట్లా కేసులు పెట్టించారో సవివరంగా చెప్పారు. తాను ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలలో చదివిన వైనం, ప్రతి పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైన విషయం స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు చంద్రబాబు ఆంగ్లభాషా ప్రావీణ్యంపైన కూడా వ్యాఖ్యానించారు. జానెడు పోయి మూరెడు కుంగడం అంటే ఇదే. జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతలను ప్రశ్నించడం అక్కడ అనవసరం. విద్యా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి మంత్రిపదవి ఇవ్వడం, ఆ మంత్రికి విద్యామంత్రి బంధువు కావ డం వంటి లాలూచీ వ్యవహారం దేశంలో మరెక్కడా లేదు. అటువంటి వ్యక్తుల నిర్వాకాలను ముఖ్యమంత్రి వెనకేసుకొని రావడంతో ఆయనే అపఖ్యాతి పాలవు తున్నారు. మంత్రిత్వశాఖలను మార్చే సమయంలోనైనా ఇటువంటి పొర పాట్లను ముఖ్యమంత్రి సర్దుకుంటారేమో చూడాలి. ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలపైనా తొందరపాటు వ్యాఖ్యలు స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి టీడీపీ అభ్యర్థులు ఎట్లా ఎన్నికైనారో అందరికీ తెలుసు. టీడీపీకి చెందిన సభ్యుల కంటే వైఎస్ఆర్సీపీ సభ్యులు రెట్టింపు కంటే అధికంగా ఉన్న కడపలో కూడా ఓటర్లను సంపాదించి విజయం సాధించడం ఒక ఘనకార్యంగా ముఖ్యమంత్రి డంబాలు పోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పులివెందులలో సైతం గెలుస్తామంటూ, 2019 ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ఉచ్ఛస్వరంతో భీషణ ప్రతిజ్ఞ చేయడం చూశాం. టీచర్లూ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పీడీ ఎఫ్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పెద్ద మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులపై గెలిచిన ప్పుడు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు 80 రోజులకు తక్కువ కాకుండా జరగాలంటూ టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాదన విస్మరించారు. ఈ యేడు శీతాకాల సమావేశాలు జరగనే లేదు. బడ్జెట్ సమావేశాలు జరిగింది 14 రోజులు మాత్రమే. అందులో ఒక రోజు గవర్నర్ ప్రసంగానికి పోతే మిగిలినవి 13. అందులో రెండు రోజులు నారాయణ స్కూల్లో పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీపైన రచ్చ. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగి ఉంటే పద్ధతిగా ఉండేది. ప్రతిపక్షం రెండు రోజులు గొడవ చేసిన తర్వాత పరీక్ష పత్రం లీకేజీపైన చర్చ జరపక తప్పలేదు. లీకేజీ వ్యవహారంపైన నారాయణ ఒక విధంగా, విద్యామంత్రి గంటా మరో విధంగా మాట్లాడటం, ఈ సంగతి ‘సాక్షి’కి మాత్రమే ఎట్లా తెలిసిందంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించడం విడ్డూరం. ప్రశ్నపత్రం లీకైనట్టు తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి తనకు అందిన ప్రశ్నపత్రాన్ని జిల్లా విద్యాధికారికి పంపించి, లీకైన మాట వాస్తవమని, అది అసలైన ప్రశ్నపత్రమేనని అధికారి ధ్రువీకరించిన తర్వాతనే వార్తను టీవీ చానల్‌కు పంపించాడు. ఇది వృత్తిపరంగా ఉన్నతమైన ప్రమాణాలు పాటించే జర్నలిస్టులు చేసే ప్రక్రియ. ఇందుకు అభినందించవలసింది పోయి అతడిని అభి శంసించినట్టు మాట్లాడటం అన్యాయం. ఏదైనా అంశంపైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుకోవడం ఆనవా యితీ. కానీ అగ్రిగోల్డ్ వ్యవహారంపైన చర్చ ముందుకు సాగకుండా పత్తిపాటి పుల్లారావు చేత సవాళ్లు చేయించి చర్చను పక్కదారి పట్టించింది అధికారపక్షమే. అగ్రిగోల్డ్ ఖాతాదారులు బజారుపాలు కావడంలో యాజమాన్యంతో పాటు కొందరు అధికారపక్ష ప్రముఖుల పాత్ర ఏమిటో కూడా వెల్లడి కావాలి. సీబీఐ దర్యాప్తు జరిపించవలసిన వ్యవహారం ఇది. కేసీఆర్ చేసినట్టే చంద్రబాబు కూడా సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ప్రారంభించారు. సభాపతి తన ఇంట ర్వూ్యని సభలో ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుపైన ఒక ప్రజెంటేషన్, ఖరారు కాని అమరావతి న గర డిజైన్లతో మరో ప్రజెంటేషన్ చూపించారు. ప్రతిపక్షాన్ని కలుపుకొని పోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వం దేశం మొత్తంలో బహుశా ఇది ఒక్కటే. ప్రత్యేక హోదా విష యంలో కానీ పోలవరం ప్రాజెక్టు సందర్భంలో కానీ ప్రతిపక్షం ప్రస్తావనే లేదు. రాజధాని నిర్మాణంపైన కె. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు బుట్ట దాఖలు చేశారో చెప్పలేదు. ఆ నివేదికపైన శాసనసభలో కానీ వెలుపల కానీ చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ప్రతిపక్షం సరి పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయం. మొత్తంమీద బడ్జెట్ సమావేశాలు మొదటి నుంచీ అధికారపక్షానికి ప్రతి కూలంగానే సాగాయి. రోడ్డు రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపైన టీడీపీ నాయకులు కేశినేని నానీ, బోండా ఉమా తదితరుల దాడి, నారాయణ స్కూలులో ప్రశ్నపత్రం లీజేకీ, ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు వ్యాపించి నలు గురి మృతి వంటి ఘటనలు అధికారపక్షాన్ని చిరాకు పరిచాయి. చివరికి ‘కాగ్’ నివేదిక రెండున్నరేళ్ళుగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అక్షరసత్యాలంటూ ఘోషించింది. పట్టిసీమపైన అవసరానికి మించి ఖర్చు చేశారనీ, కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారనీ, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతు న్నప్పుడు పట్టిసీమ కానీ, పురుషోత్తపట్టణం, చింతలపూడి ప్రాజెక్టులు కానీ అన వసరమనీ ‘కాగ్’ స్పష్టం చేసింది. కేంద్ర అనుమతులు లేని ఈ ప్రాజెక్టులపైన ఇంత ప్రజాధనం ఎట్లా ఖర్చు చేశారంటూ ప్రభుత్వాన్ని ‘కాగ్’ నిలదీసింది. అధి కారపక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోగా ప్రతిపక్షం ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సారి సభలో ప్రతిపక్షానిదే పైచేయి అన్నది టీడీపీ నాయకులు కూడా అనుకుం టున్న మాట. సభానాయకుడే ప్రతిపక్ష నాయకుడిని కథానాయకుడిని చేసిన సన్నివేశం మనం ఈ సమావేశాలలో చూశాం. - కె. రామచంద్రమూర్తి -
ఆర్థిక, రక్షణ శాఖలకు ఈసీ మందలింపు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలవుతున్న సమయంలో తమ అనుమతిలేకుండా నిర్ణయాలు తీసుకున్న ఆర్థిక, రక్షణ శాఖల తీరును ఎన్నికల సంఘం తప్పుపట్టింది. తమ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ కేబినెట్ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాసింది. రక్షణ, ఆర్థిక శాఖలు, నీతి ఆయోగ్ ముఖ్య విషయాలను తమకు తెలియజేయలేదంది. తమ ఆమోదం పొందకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఆర్థిక శాఖ నిర్ణయించడంతో ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
చైనాకు చెక్ పెట్టేందుకు..!
హనోయ్: శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్నట్లు ఆయన వియత్నాం పర్యటనను గమనిస్తే అర్థమౌతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోదీ హనోయ్ పర్యటన కొనసాగుతోంది. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధులను అందించేందుకు మోదీ అంగీకరించారు. దీంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వియత్నాంతో సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'గా మారిందని శనివారం మోదీ ప్రకటించారు. ఆ దేశ ప్రధాని యువాన్ ఫుసితో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యేలా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకుంటున్నామని, వియత్నాం రక్షణరంగానికి మరో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్ బోట్స్, సైబర్ సెక్యురిటీ లాంటి పలు అంశాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. గత 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
‘రక్షణ’ దుమారం!
అధికారంలో ఉండగా వరస కుంభకోణాలతో వెలవెలబోయి సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ను స్కాంలు ఇప్పట్లో వదిలేలా లేవు. అధికార పీఠం దిగి రెండేళ్లవుతుండగా అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఆమె సహాయకుడు అహ్మద్ పటేల్ తదితరుల పాత్రపై కొత్తగా ఆరోపణలు ముసురుకున్నాయి. సాధారణంగా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో కెక్కే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పెద్దల సభలో అడుగుపెట్టిన మరుసటిరోజే ఈ స్కాంలో సోనియా పేరును ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనపై ఎన్డీఏ సర్కారును ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని షాక్. పార్టీలో ‘75 ఏళ్లకు రిటైర్మెంట్’ విధానాన్ని అమలుచేస్తూ సీనియర్లను పక్కనబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ 76 ఏళ్ల వయసున్న స్వామికి రాజ్యసభ అవకాశం ఎందుకిచ్చారో ఇప్పుడందరికీ అర్ధమై ఉంటుంది. వాస్తవానికి ఇదేమీ కొత్తగా బయటపడిన స్కాం కాదు. 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌లాండ్‌తో ఏడబ్ల్యూ-101 హెలికాప్టర్లు డజను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరడం కోసం మధ్యవర్తులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఏడాది వ్యవధిలోనే ఇటలీలో వెల్లువెత్తాయి. రూ. 3, 546 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో మొత్తంగా రూ.360 కోట్లు చేతులు మారాయని వాటి సారాంశం. అమెరికా హెలికాప్టర్ల తయారీ సంస్థ సిరోస్కీ ఉత్పత్తి చేస్తున్న ఎస్-92 సూపర్హాక్ను అధిగమించి అగస్టావెస్ట్‌లాండ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రక్షణ కొనుగోళ్లు అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఏది కొన్నా టెండర్లు పిలవడం తప్పనిసరి. అందులో ఏ సంస్థను ఎంపిక చేసినా మరో సంస్థ లొసుగులు వెదకడం షరా మామూలు. కాంట్రాక్టు చేజిక్కించుకున్న సంస్థపై నిఘా మొదల వుతుంది. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో కాంట్రాక్టు పొందిన సంస్థను ఎవరూ దెబ్బతీయలేరు. ఎక్కువ సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంది గనుకే వివాదాలు ముసురుకుంటాయి. బోఫోర్స్ మొదలుకొని దాదాపు అన్నిటా ఇదే తంతు. దళారుల ప్రమేయాన్ని అంగీకరించబోమని మన ప్రభుత్వాలు పైకి చెప్ప డమే తప్ప సొమ్ములు చేతులు మారుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. రక్షణ ఉత్పత్తుల సంస్థలు నాసిరకం పరికరాలు, ఉత్పత్తులు అంటగట్టే ప్రమాదం ఉండటమే ఇందులోని ప్రధాన సమస్య. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. మన వైమానిక దళం ఐఏఎఫ్ వినియోగిస్తున్న సోవియెట్ తయారీ ఎంఐ-8 హెలికాప్టర్లకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో మరింత సామర్థ్యంగల హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా 1999లో నిర్ణయించారు. ఆ హెలికాప్టర్ల సామర్థ్యం, ప్రమాణాలు ఎలా ఉండాలో నిర్ణయించడానికి మరో నాలుగేళ్లుపట్టింది. అవి గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగి ఉండాలని, రాత్రిపూట ప్రయాణానికి అనువుగా ఉండాలని, ఏ వాతావరణాన్నయినా తట్టుకునేలా ఉండాలని నిర్దేశించారు. 2005లో మొదటిసారి టెండర్ పిల్చినప్పుడున్న ఈ నిబంధనలు ఏడాది వ్యవధిలోనే మారాయి. అగస్టా వెస్ట్‌లాండ్‌కు అర్హత సాధించి పెట్టేందుకే ఈ మార్పులు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ముందనుకున్న ప్రమాణాలను ఎందుకు తగ్గించాల్సివచ్చిందో, ఆ మార్పులు చేసిందెవరో...వారినలా చేయమన్నదెవరో గుర్తిస్తే దర్యాప్తులో చాలా భాగం పూర్తయినట్టే. కానీ 2013లో యూపీఏ సర్కారు దర్యాప్తునకు ఆదేశించినా ఈ విషయంలో సీబీఐ రాబట్టిందేమీ లేదు. అటు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు పరిస్థితీ ఇంతే. ఎన్డీఏ సర్కారు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇటలీ ఈ విషయంలో చాలా మెరుగు. ఈ ఒప్పందంలో అయిదు కోట్ల యూరోలు ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణపై దళారి రాల్ఫ్ హష్కేను స్విట్జర్లాండ్‌లో 2012లోనే అరెస్టు చేశారు. మరి కొన్నాళ్లకే అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్మెకానికా చైర్మన్ ఓర్సీ, సీఈఓ స్పాగ్నోలినీలు సైతం కటకటాల వెనక్కు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన ఇటలీ పోలీసు విభాగం హష్కే, మరో ముగ్గురి మధ్య చోటుచేసుకున్న సంభాషణలను సైతం రికార్డు చేయగలిగింది. హెలికాప్టర్ల ఒప్పందం సాకారం కావడం కోసం చెల్లించిన ముడుపుల్ని మారిషస్, ట్యునీషియాల్లోని సంస్థల ద్వారా చేర్చామన్నది ఈ సంభాషణల సారాంశం. అంతేకాదు...భారత్‌లో దర్యాప్తు చేసే ‘మూర్ఖులు’ ఏళ్ల తరబడి శ్రమించినా వీటిని ఛేదించలేరని వారు జోకులేసు కున్నారు. కనీసం అలా అన్నందుకైనా సీబీఐ గట్టిగా పనిచేసి ఉండాల్సింది. కానీ జరిగిందేమీ లేదు. 2014 అక్టోబర్‌లో ఇటలీలోని కింది కోర్టు ఓర్సీ, స్పాగ్నోలినీలపై అవినీతి ఆరోపణలు కొట్టేసింది. అయితే ఇన్వాయిస్లు సరిగా లేవన్న ఆరోపణను అంగీకరిస్తూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. ఇటీవలే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి ముడుపులు చేతులు మారాయని నిర్ధారించింది. నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అంతేకాదు అప్పట్లో ఐఏఎఫ్ చీఫ్‌గా ఉన్న త్యాగికి ఆయన బంధువుల ద్వారా అవి అందాయని తేల్చింది. ఫలితంగానే ప్రస్తుత వివాదం రాజుకుంది. విపక్షంలో ఉన్నవారు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అధికార పక్షం కూడా ఆ పనే చేయడం సబబనిపించుకోదు. ఉన్న అధికారాన్ని వినియోగించుకుని వచ్చిన ఆరోపణలోని వాస్తవాలేమిటో తేల్చడం ముఖ్యం. గత రెండేళ్లుగా సీబీఐ ఈ విషయంలో ఎందుకు ప్రగతి సాధించలేకపోయిందో ఆరా తీసి లోటుపాట్లను సరిదిద్దడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్ర ధారులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టడం అవసరం. దీన్ని రాజకీయ కోణంలోనే చూడటంవల్లా, వాగ్యుద్ధాలకు దిగడంవల్లా దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ఇరు పక్షాలూ ఈ సంగతి గ్రహించాలి. -
చైనా ఆ బడ్జెట్‌ను పెంచుతోంది!
బీజింగ్: చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఏ ఏటికాఏడూ పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరం రక్షణ బడ్జెట్‌ను 10.1 శాతం పెంచిన చైనా.. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రక్షణ రంగానికి భారీగానే కెటాయింపులు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పార్లమెంట్.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో వార్షిక బడ్జెట్ నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార ప్రతినిధి ఫు ఇంగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో 7 నుంచి 8 శాతం వరకు రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నివేదికలో వెల్లడి కానున్నాయి. -
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్
అర్హత: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఫైనలియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు. ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ 200 ఇండియన్ నావల్ అకాడమీ 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 05 వయోపరిమితులు: ఇండియన్ మిలిటరీ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఇండియన్ నావల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2-1-1993 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. అయితే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్న వారికి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అంటే 2-1-1991 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే వివాహ లేదా అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. అవివాహ మహిళా అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష విధానం: సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఔత్సాహికులకు ఒక విధంగా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఔత్సాహికులకు మరోవిధంగా ఉంటుంది. మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రాతపరీక్ష: పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం పేపర్-1 ఇంగ్లీష్ 100 2 గంటలు పేపర్-2 జన రల్ నాలెడ్జి 100 2 గంటలు పేపర్-3 ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ 100 2 గంటలు ఓటీఏ పరీక్ష విధానం: పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం పేపర్-1 ఇంగ్లిష్ 100 2 గంటలు పేపర్-2 జనరల్ నాలెడ్జి 100 2 గంటలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు. ఇలా ప్రిపేరవ్వాలి.. జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థుల్లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. దీనికోసం వర్డ్పవర్ మేడ్ ఈజీ, ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వంటి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. జనరల్ నాలెడ్‌జ: భారతదేశ చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్ని సబ్జెక్టుల్లో అంటే జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిల్లో ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. మ్యాథమేటిక్స్: వాస్తవానికి సీడీఎస్ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్గా పేర్కొన్నారు. ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమేటిక్స్ అంశాలను ప్రశ్నలుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి నంబర్ సిస్టమ్, రియల్ నంబర్స్, దూరం-కాలం, పని; శాతాలు; వడ్డీరేట్లు; లాభనష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఇక ఆల్జీబ్రాలో రిమైండర్ థీరమ్, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం, పాలినామియల్ థీరమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్ అండ్ కో ఎఫిషియెంట్స్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధ ఫార్ములాలు, సిద్ధాంతాలు, భావనలు తెలుసుకోవాలి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీనితోపాటుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. శిక్షణ తీరుతెన్నులు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి వారు ఎంచుకున్న ప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్ని బట్టి సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ-డెహ్రాడూన్, నేవల్ అకాడమీ-గోవా, ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ-హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నైల్లో 18 నెలలపాటు, ఓటీఏలో అభ్యర్థులకు 11 నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఉద్యోగ పరిధి: ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ప్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. రెండు, మూడేళ్లకోసారి ప్రమోషన్లు ఉంటాయి. పన్నెండేళ్లు సర్వీస్‌లో కొనసాగితే సంబంధిత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ హోదా పొందొచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవ చ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్లో దరఖాస్తుల ప్రారంభం: 7-11-2015 దరఖాస్తుల ముగింపు తేదీ: 4-12-2015 పరీక్షాకేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. -
'బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వొద్దు'
న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి అశోక గజపతిరాజును తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం మంత్రి తుమ్మల ఢిల్లీలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజును కలిశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్టు సమాచారం. అశోక గజపతిరాజు దీనికి సమాధానంగా దేశం కోసం ఆర్మీ పని చేస్తోంది.. ఇవ్వకూడదంటే ఎలా అని తుమ్మలను ప్రశ్నించారు. అదే విధంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తుమ్మలను కోరారు. కొత్తగూడెంలో నూతన ఎయిర్ పోర్టు కోసం స్థలం సేకరిస్తే పరిశీలిస్తామని బదులిచ్చారు. అశోకగజపతిరాజుతో పాటు నితిన్ గడ్కరి, మేనకా గాంధీలను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా కలిశారు. జాతీయ రహదారుల విస్తరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ వారికి వివరించారు. -
భారత్‌ను సింహంగా తయారు చేస్తాం: పారికర్
భువనేశ్వర్: భారతదేశాన్ని సింహంలాగా తయారుచేస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. 'మేకనైతే బలిపీఠం ఎక్కించేందుకు ఎవరైనా సిద్ధమవుతారు.. కానీ సింహం విషయంలో ఆ సాహసం చేస్తారా.. అందుకే సింహమంతటి శక్తిమంతగా భారత్‌ను తయారు చేస్తాం' అని ఆయన చెప్పారు.భారతదేశం త్వరలోనే యుద్ధ సమాగ్రిని ఎగుమతి చేయనుందని వివరించారు. మొత్తం 38 దేశాలకు యుద్ధ సామాగ్రితోపాటు ఆయా దేశాల్లో యుద్ధ మెళకువలు నేర్చుకునేందుకు భారత సైనికాధికారులను పంపిస్తామని చెప్పారు. ఏ ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోబోమని, ప్రతి దేశంతో స్నేహపూర్వక సంబంధాలతో ముందుకు వెళుతూ దేశాన్ని పటిష్ఠంగా రూపుదిద్దుతామని చెప్పారు. విదేశాలతో మంచి సంబంధాల్లో భాగంగానే వారి దేశాల్లోని సైనికులకు భారత్‌లో శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించామని, వారు త్వరలోనే రానున్నారని చెప్పారు. అయితే, ఏ దేశాల సైనికులు భారత్‌లో శిక్షణకు వస్తున్నారన్న విషయం మాత్రం భద్రతా దృష్ఠ్యా చెప్పలేదు. త్వరలోనే విశాఖపట్నం తీరంలో నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలు కూడా పాల్గొంటున్నాయని చెప్పారు. చైనా వస్తుందా అన్న ప్రశ్నకు తాము ఇంకా ఆహ్వానం పంపించాల్సి ఉందని తెలిపారు. జాబితా పూర్తవగానే మీడియాకు విడుదల చేస్తామని తెలిపారు. -
ఆత్మరక్షణలో అధికారపార్టీ
-
ఇక్కడ వేడుకలు నిర్వహించొద్దు!
-
‘ప్రత్యక్ష’మైతే ‘రక్షణ’కు లోపమే
ఇండియా వంటి వర్ధమాన దేశాలను మరింతగా లొంగ దీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు కొన్ని పడికట్టు పదాలను మత్తుమందులా చల్లుతూ ఉంటుంది. ‘స్మార్ట్ సిటీస్’, ‘అభివృద్ధి నగరాలు’ అలాంటి పదాలే. అందులో ఉన్నది లాభాల వేటే. ‘‘మా విధానాల, పథకాల ‘కాపీ’యే బీజేపీ-ఎన్డీఏ మోడీ ప్రభుత్వ నిర్వాకమంతా!’’ అని నేడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ -యూపీఏ నేతలు కొందరు విమర్శించారంటే, అందులో నిజం లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులలోనే బీజేపీ తన ‘మేకవన్నె’ దుస్తులను క్రమంగా వదిలేసి, పులిచర్మం కప్పుకోవడం మొదలుపెట్టింది. నిజం కురచ, బొంకు పొడవు అని సామెత. నరేంద్ర మోడీ గద్దెనెక్కడంతోనే ‘కఠిన నిర్ణయాలకు’ దేశం సన్నద్ధంగా ఉండాలని ముందస్తు హెచ్చరిక చేశారు. ఆ కఠిన నిర్ణయాలు దేశంలో రోజుకొక తీరున బతుకుభారంతో కుంగిపోతున్న 90 శాతం ప్రజాబాహుళ్యం ప్రయోజనాలను కాపాడేవి కావు. నిజానికి ఇవి ‘చాయ్‌వాలా’ తీసుకోవలసిన నిర్ణయాలు కూడా కావు. చేపట్టవలసిన విధానాలూ కావు. అనుసరించవ లసిన అభివృద్ధి మంత్రం కూడా ఇది కాదు. దేశ ప్రగతికి ఉద్దేశించిన ప్రణాళికాబద్ధమైన, కనీస మౌలిక వసతులపై ఫిర్యాదులకు తావులేని పరిస్థితిని కల్పించేందుకు ఉద్దేశించినవి కూడా కావు, మోడీ కఠిన నిర్ణయాలు. ప్రజాస్వామిక వ్యవస్థకు అవసరమైన ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణానికి ఆచరించవలసిన కఠిన నిర్ణయాలు కూడా కావు. ప్రధానమంత్రి నుంచి మనం ఆశించేది, అతడు అనుసరించబోయే రాజకీయ, ఆర్థికపరమైన ప్రకటనలే. ఎలాంటి ‘గుప్త విద్యలు’ కాదు. గుప్త విద్యల గూడుపుఠాణి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వ బడ్జెట్లో ఒక్క విషయం తప్ప అన్నీ గుప్త విద్యలు గానే ఉన్నాయి. ఆ ఒక్క విషయం - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ద్వారాలు ఇంకాస్త పెద్దగా తెరవడమే. ఇంతకు ముందుకన్నా ప్రత్యక్షంగా ఎక్కువ వాటాలతో భారత కంపెనీలలో ప్రవేశించడానికి బాహాటంగా తలుపులు తెరవడమే. దేశ సార్వభౌమాధికారానికీ, సమగ్రతకూ భద్రత కల్పించే రక్షణ విభాగ పరిశ్రమలలోకి బహుళజాతి సంస్థల పెట్టుబడులనూ, వాటి జోక్యాన్నీ పెంచడం ఇలాంటిదే. ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇంతవరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. పైగా, దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగానికీ, రైతాంగ శ్రేయస్సుకీ ఉద్దేశించిన సబ్సిడీలలో కోత పెట్టడానికి మోడీ ప్రభుత్వం సన్నద్ధం కావడం ఇంకొక విశేషం. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయోత్పత్తులను దీటుగా ఎదుర్కొంటున్న రైతులకూ; ఈ వర్ధమానదేశంలో ఆహారం, ఎరువులు, ఇక్కడి పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉండే రాయితీలన్నింటికీ అలాంటి గతే పట్టించాలని ఆ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పని మొత్తం ఒక్కసారే నిర్వహిస్తే ప్రజాబాహుళ్యంలో ‘గత్తర’ తప్పదు. కాబట్టి విచిత్ర తరహాలో కల్పించిన ‘ఓదార్పు’ అనే రాయితీ ఏమిటీ అంటే, సబ్సిడీల ఉపసంహరణ ప్రస్తుతానికి బదులు రేపటికి వాయిదా వేయడమే. మరో మాటలో చెప్పాలంటే ఆహార, ఎరువుల రాయితీలను తొలగించడం ఖాయమని హెచ్చరించడమే. ప్రజలను మభ్యపెట్టడానికే రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అవకాశాన్ని 49 శాతానికి పెంచి, మిగిలిన 51 శాతం భారత ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుందని చెప్పడమంటే, ప్రజలను భ్రమలలో ఉంచడానికే. మన రిజర్వు బ్యాంకు ఇదే అంశం మీద ఇదివరకు ఇచ్చిన ఒక సమీక్షలో స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘విదేశీ గుత్త పెట్టుబడులు భారత పరిశ్రమలలోకి ప్రవేశించేది పేరుకు 25/26 శాతమే అయినా, ఆ 26 శాతంతో పాటు విదేశీ సాంకేతిక నైపుణ్యంతో రంగ ప్రవేశం చేస్తాయి కాబట్టి ఆ పెట్టుబడులే భారత ప్రయోజనాలను శాసిస్తాయి.’ అని అనుమానాలకు తావులేని రీతిలో రిజర్వు బ్యాంకు వివరించింది. ఆ తరువాత కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అమెరికా కనుసన్నలలోనే నడిచే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల ‘సంస్కరణల’ తాఖీదులనే అమలు చేస్తూ వచ్చాయి. ఇండియా వంటి వర్ధమాన దేశాలను మరింతగా లొంగ దీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు కొన్ని పడికట్టు పదాలను మత్తు మందులా చల్లుతూ ఉంటుంది. ‘స్మార్ట్ సిటీస్’, ‘అభివృద్ధి నగరాలు’ అలాంటి పదాలే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారానే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఇండియా వంటి బడుగు వర్ధమాన దేశాలలో పాగా వేసిందన్నదే వాస్తవం. ధర్మగుణంతో, కారుణ్యంతో ఆ పెట్టుబడులు ఇక్కడికి రాలేదని అనుభవం చెబుతోంది. అందులో ఉన్నది లాభాల వేటే. ఎఫ్‌డీఐతో వచ్చిన లాభాలు న్యూయార్క్, లండన్, టోక్యో, బెర్లిన్ నగరాలలో ఉన్న ఆయా సంస్థలకు చేరుకుంటాయి. అదే దేశీయ పరిశ్రమలు చేసే అదనపు ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు ఇక్కడి పరిశ్రమల వ్యాప్తికి, పారిశ్రామికీకరణకు, దేశీయ పెట్టుబడి విస్తరణకు ఉపయోగపడతాయి. అంటే ఇండియా వంటి వర్ధమాన దేశాలకు మిగిలేది హళ్లికి హళ్లి, సున్నాకు సున్న. అంతేకాదు, విదేశాలకు తరలిపోయే లాభాలుగానీ, వడ్డీలు గానీ మూడురెట్లు ఉంటున్నాయి. చౌకగా లభించే ముడిసరుకు, కారు చౌకగా దొరికే శ్రామిక శక్తి ఈ లాభాలకు చోదకశక్తులు. ఇదేకాకుండా, ఇండియాలో వ్యాపారాలను, సంస్థలను కొనుగోలు చేయడానికి విదేశీ గుత్త పెట్టుబడులు ఎఫ్డీఐలో 70 శాతం ఉపయోగిస్తాయన్నది మరో వాస్తవం. బీజేపీ పాలనలో వెల్లువ ఒక్క బీజేపీ పాలన(2001-2002)లోనే 65 శాతం ఎఫ్‌డీఐలు ఇండియా చేరాయి. అదీ ఎప్పుడు? 2001లో ప్రపంచ మొత్తం ఎఫ్‌డీఐలు సగానికి సగం పడిపోగా (అప్పటికి ముప్పయ్యేళ్లలో ఈ పతనం అతి పెద్దది) ఇక్కడ మాత్రం అవి 47 శాతానికి పైగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిని చూసే, భారతీయ జాతీయోద్యమ తొలి తరం మహనీయుడు, ప్రసిద్ధ ఆర్థికవేత్తలలో ఒకరు దాదాబాయ్ నౌరోజీ ‘డ్రైన్ థియరీ’ని ముందుకు (దేశీయ సొమ్ము విదేశీయులకు లాభాల రూపంలో ఊడ్చుకుపోవడం) తీసుకువచ్చారు. తాజాగా ‘ది హిందు’ కూడా మోడీ ఆర్థిక విధానం కాంగ్రెస్-యూపీఏ విధానాల కంటే భిన్నమైనది కాక, వాటి కొనసాగింపేనని వ్యాఖ్యానించింది. పోఖ్రాన్ -1 అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలను బీజేపీ హయాంలో నిర్వహించిన పోఖ్రాన్-2 అణుశక్తి పాటవ పరీక్షల (1998) తరువాత విధించినవి 2002లో చాలావరకు తొలగిం చారు. రెండో పోఖ్రాన్ పరీక్షల సామర్థ్యం ప్రశ్నార్థకమైన తరువాత ఈ నిర్ణయం జరిగింది. భారత్ కంపెనీలతో కుదుర్చుకోదగిన 150 రకాల సైనిక, వ్యాపార నిబంధనలను 20కి అమెరికా కుదించింది. నాటి భారత ప్రధాని వాజపేయి, అమెరికా అధ్యక్షుడు బుష్ మధ్య సెప్టెంబర్ 1, 2001లో జరిగిన ఒప్పందం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆ తరువాతే బుష్ మంత్రివర్గ సభ్యులు ఐదుగురు పలుసార్లు భారత్‌లో పర్యటించారు. ఆ క్రమంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి పావెల్, రక్షణ కార్యదర్శి డొనాల్డ్ రమ్స్‌ఫీల్డ్, ఆర్థిక కార్యదర్శి ఓనీల్, వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి క్రిస్టీ టాడ్ విట్మన్ ఇక్కడకు దూసుకొచ్చారు. వీరుగాక మరో వంద మంది అమెరికా అధికార ప్రతినిధులు కూడా వచ్చారు. ఈ వరదంతా బీజేపీ హయాంలోనే. అమెరికా విదేశీ వ్యవహారాల ఉప కార్యదర్శి, సైనిక దళాల సంయుక్త అధిపతి జనరల్ రిచర్డ్ మేయర్స్, ఎఫ్‌బీఐ డెరైక్టర్ రాబర్ట్ ముల్లర్ ఢిల్లీ వచ్చారు. బీజేపీ-బుష్ మధ్య కుదిరిన ఆ ఒప్పందాన్నే ‘భారత విదేశాంగ విధానంలో చరిత్రాత్మక మలుపు’ అని నాటి అమెరికా రాయబారి రాబర్ట్ బ్లాక్విల్ నవంబర్ 27, 2002న కోల్‌కతాలో ప్రకటించారు కూడా. ‘1648 నాటి వెస్ట్‌ఫేలియా ఒడంబడిక తరువాత మళ్లీ ఈ ఆధునికయుగంలో ఇదే చరిత్రాత్మకమైన ఒప్పం దం’ అని ఆయన అన్నాడు. ఆ తరువాతే 2003లో అమెరికా గూఢచారి సంస్థ అత్యాధునిక కెమేరాలు అమర్చిన ఉపగ్రహంతో మన రక్షణ వ్యవస్థ కేంద్రాలను ఫొటోలు తీసిన సంగతిని మరచిపోరాదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ, ఇద్దరి పాలన దొందుకు దొందే! విశ్లేషణ: ఏబీకే ప్రసాద్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
డిఫెన్స్ మద్యం స్వాధీనం
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : అక్రమంగా విక్రరుుస్తున్న డిఫెన్స్ మద్యాన్ని హన్మకొండ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు కథనం ప్రకారం.. హన్మకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని ఒక ఇంట్లో డిఫెన్స్ మద్యం అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు పక్కాసమాచారం అందింది. దీంతో వారు ఆకస్మికంగా ఆ ఇంటిపై దాడులు చేసి, రూ.35 వేల విలువైన 40 ఫుల్‌బాటిళ్ల డిఫెన్స్ మద్యం పట్టుకున్నారు. దాడిలో పట్టుబడిన కాశిబుగ్గకు చెందిన పల్లె రాజును విచారించగా, హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీకి చెందిన తాటికొండ శ్రీనివాసులుతో కలిసి డిఫెన్స్ మద్యం ను అమ్ముతున్నట్లు వెల్లడించాడు. రక్షణ శాఖ వ్యక్తుల వద్ద నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. డిఫెన్స్ మద్యం అక్రమంగా కలిగి ఉండడం, అమ్మడం నేరమని సీఐ తెలిపారు. ఈ మద్యంపై ప్రభుత్వానికి రావాల్సిన సుంకం రానందున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంగా పరిగణిస్తామని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దాడుల్లో సీఐ సిఐ గండ్రదేవేందర్రావుతోపాటు ఎస్సైలు రామకోటేశ్వర్రావు, సీతారామరాజు, సిబ్బంది రవీందర్, ఖలీ ల్, సత్తయ్య, సురేష్, రమేశ్ పాల్గొన్నారు. ఎన్డీపీ మద్యం సమాచారం తెలిస్తే 0870-2422652 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు. భీమారంలో మరో 55 మద్యం బాటిళ్లు.. భీమారం : భీమారంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరాలపై కేయూసీ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 55 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. భీమారానికి చెందిన ఉక్కు ప్రేమ్‌సాగర్ తనకు పరిచయస్తులైన ఆర్మీ జవాన్ల నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసేవాడు. ఇలా 55 బాటిళ్లు నిల్వ చేశాడు. అతడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారంతో కేయూసీ సీఐ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడులు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 35 రాయల్ స్టాగ్, 15 బ్లెండర్ స్ప్రైడ్, 5 సిగ్నిచర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయదారుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
ఆంటోనీజీ! మేల్కొంటారా?
యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంతో దేశ రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఆంటోనీ ఒక అచేతనమైన నేతగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం బాగా బలహీనపడింది. ఇరాక్‌పై అమెరికా యుద్ధం ప్రకటించిన సందర్భంగా అప్పటి అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్ఫెల్డ్ ఒక మాట చెప్పారు. ‘‘నీ దగ్గర ఉన్న ఆర్మీతో నువ్వు యుద్ధం చేయాలి. అంతేగానీ సైనికదళం ఎలా ఉండాలో కోరు కోవద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశ రక్షణమంత్రికి ఉండాల్సిన అసలు లక్షణమేమిటంటే ఎలాంటి ఘర్షణలు లేని ప్రశాంత సమయాలలో సైనిక సామర్థ్యా న్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. యుద్ధాలు వచ్చేటప్పుడు ఇవి అక్కరకొస్తాయి. ప్రతి యుద్ధమూ కొత్త అనుభవాన్ని నేర్పుతుంది. సాధారణంగా వివిధ దేశాలు తమ సైన్యానికి ఎప్పటికప్పుడు కొత్త యుద్ధవిద్యలలో తర్ఫీదునిస్తాయి. ఎందుకంటే అంతకుముందు జరిగిన యుద్ధాలలో శత్రువులు ఉపయోగించిన ఎత్తుగడలనూ, వ్యూహాలనూ మళ్లీమళ్లీ ఉపయోగించరు కాబట్టి సైన్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాలిబాన్లాంటి మతవాదశక్తులు కొన్ని దేశాలలో తమతో కలిసిపోరాడేవారిని కలుపుకొని దాడులకు తెగబడుతుంటాయి. ఈ శక్తులు తమకు సత్తువ ఉన్నప్పుడు దాడులు చేస్తాయి, లేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి. యుద్ధంలో ఇదోరకమైన ఘర్షణ. తాలిబాన్ వద్ద ఫిరంగులు, వైమానిక దళం వంటి వనరులు లేవు. అయితే తాలిబాన్ భావజాలాన్ని వంటబట్టించుకున్న తీవ్రవాదులూ, పోరాడాలన్న కాంక్ష, లక్ష్యం, అన్నింటికీ మించి అమూల్యమైన సమయం వారి వద్ద ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు తాలిబాన్లు ‘ధర్మయుద్ధం’ చేస్తున్నారు. అంతేకాదు క్రమంగా ఈ ప్రభావం పాకిస్థాన్ పొరుగున్న ఉన్న భారత భూభాగంలోని కాశ్మీరుకూ, చైనాలోని జింజియాంగ్కూ విస్తరించేలా చూడాలన్నది తాలిబన్ మతవాదుల పన్నాగం. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో తమకు అనుకూల ప్రభుత్వాలను స్థాపించుకోవాలని కలలు కంటున్న తాలిబన్, లష్కరే తోయిబాలు ఇండియాతో ఘర్షణపడుతూ ఉగ్రవాద అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయి. కాని వాటికి ఇవి ఒక సైద్ధాంతిక నాణేనికి రెండు పార్శ్వాలని చెప్పవచ్చు. దక్షిణ, సెంట్రల్ ఆసియా నుంచి నాటో దళాలను ఉపసంహరించుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే పత్రికలలో చూచాయిగా వార్తలొస్తున్నాయి. మతఛాందస శక్తులలో ఒకవిధమైన విజయగర్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మతఛాందస శక్తులు కొంతసేపు విరామం తీసుకుని మళ్లీ పుంజుకుని ‘ముస్లిం భూభాగాల’ ‘విముక్తి’ కోసం జరుగుతున్న సుదీర్ఘ మార్చ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, చైనాలో ముస్లిమ్‌లకు లౌకిక వ్యవస్థను వారు ఎంతమాత్రం అంగీకరించరు. అఫ్ఘానిస్థాన్ నుంచి 20 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ నిష్ర్కమించిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో శాంతిని కాపాడడం భారత సైన్యానికి ఎంత సవాల్‌గా మారిందో మనకు తెలుస్తూనే ఉంది. దక్షిణ రష్యా, సెంట్రల్ ఆసియా మాదిరిగా చైనాపై కూడా ఉగ్రవాదులు కన్నేశారు. చైనాలోని ఒక రైల్వే స్టేషన్లో ఇటీవలే కొంతమంది సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించి నరమేధం సృష్టించారు. చైనాలోని ఏకైక ముస్లిమ్ మెజారిటీ రాష్ట్రమైన జింజియాంగ్‌లో ఉగ్రవాదం పెచ్చుపెరిగింది. దీన్ని చైనా పాలకులు ఎంతగా దాచిపెట్టాలన్నా అది ఎప్పటికప్పుడు బయటపడిపోతోంది. ఉగ్రవాదులు భవిష్యత్తులో పాకిస్థాన్‌ను తమ కోటగా వాడుకోవడం కొనసాగిస్తే, పాక్‌తో తమ సంబంధాల వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో చైనా ఇప్పుడు పునస్సమీక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో భారత్ కూడా తన విధానాన్ని సమీక్షించుకోవాలి. ఉగ్రవాదులను అణచివేసేందుకు తీసుకునే కఠిన చర్యలు బహుముఖ పోరుకు దారితీస్తే దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోరుకు ఇండియా సిద్ధంగా లేదని స్పష్టంగా తేలిపోతోంది. గత ఐదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల భారత రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఏకే ఆంటోనీ ఒక అచేతనమైన నాయకుడిగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం గణనీయంగా బలహీనపడింది. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. అయినా ఆంటోనీగారు నిద్రమబ్బు వీడలేదు. భారత రక్షణ పరికరాలు నాసిరకంగా ఉన్నాయి. నావికాదళాన్ని పట్టిపీడిస్తున్న నిర్లక్ష్య వ్యాధి లక్షణాలకు నిదర్శనమే ఇటీవల నేవీలో వరుసగా జరుగుతున్న అనేక ప్రమాదాలని వేరే చెప్పనక్కర్లేదు. ఇది నావికాసిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. నావికాదళంలో అనేక ప్రమాదాలు సంభవించినా రాజకీయ నాయకులు బాధ్యత వహించిన పాపాన పోలేదు. శత్రువు మన తలుపు పక్కకు వచ్చి నక్కాడు. అయినా ఆంటోనీ ఇంకా మత్తులో జోగుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్నాటికల్లా కొత్త రక్షణ మంత్రి రావచ్చు. రక్షణ రంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికీ, పునర్నిర్మించడానికి ఎంతో వ్యవధి పడుతుంది. కాని మనకు అంత సమ యం లేదు. దక్షిణాసియాలో పరిస్థితులు వేగంగా మారి పోతున్నాయి. అవి మంచి మార్పులు అనుకోడానికి లేదు. కొత్త ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది. శత్రువుకు శత్రువు మనకు తప్పనిసరిగా మిత్రుడు కావల్సిన అవసరం ఏమీ లేదు. కాని యుద్ధక్షేత్రంలో అతను సహచరుడు కావచ్చు. భారత్, చైనా పరస్పరం అనుమానించుకోవడం కన్నా సహకరించుకుంటేనే మంచిది. సెంట్రల్ ఆసియాలో ఉన్న ప్రమాదాల గురించి రష్యాకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకులు పట్టుకుని సంచరించే మతోన్మాదుల గురించి పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాల్సిందే. చైనా, పాకిస్థాన్ ఏం చేయాలో అవి తేల్చుకోవాలి. ఉగ్రవాదులను అణచివేయాలన్నా, ఇతర దేశాలపై యుద్ధం చేయాలన్నా అది భారతే చేయాల్సి ఉంటుంది. మన తరఫున మరో దేశం యుద్ధం చేయదని భారత్ గుర్తిస్తే మంచిది. ఇంకో విషయం... ఎప్పటికైనా సైన్యాలే యుద్ధాలు చేయాలి. యుద్ధంలో శత్రుదేశాన్ని మట్టికరిపించే సత్తాగల సైన్యం మనకు ఉందా? ఆలోచించాల్సిందే! బైలైన్: ఎంజే అక్బర్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
సొంతిల్లు... 30 లోపే!
వరంగల్ జిల్లాలోని మచ్చుపహాడ్ మా సొంతూరు. 20 ఎకరాలుండేది. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు, ఇతరత్రా అవసరాలకు మొత్తం కరిగిపోయింది. ఈ క్రమంలో నాన్నగారు చనిపోవడంతో బాధ్యతలన్నీ నాపై పడ్డాయి. పేరుకు సొంతిల్లున్నా అది శిథిలమై కూలి పోయింది. ఫలితంగా కొన్నాళ్ల పాటు మా మేనమామ దగ్గర, కొన్నాళ్లు అద్దె ఇళ్లలో గడిపాం. దీంతో ఎలాగైనా సరే సొంతిల్లు.. అదీ రాజధాని హైదరాబాద్‌లో సాధించాలన్న కోరిక బలంగా నాటుకుంది. ఇంటర్మీడియెట్ దశలో.. టీనేజ్‌లో అనుకున్నది ఒక దశాబ్దం తర్వాత 2011లో సాకారమైంది. వరంగల్, హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇటు ఇంటి అవసరాలతో పాటు అటు సొంతిల్లు కోసం కూడా కొంచెం కొంచెం పొదుపు చేశా. ఇలా నేననుకున్న బడ్జెట్, కోరుకున్న ఇంటి కోసం వెదుకుతుండగా మూడేళ్ల క్రితం ఉప్పల్‌లోని పర్వతపూర్‌లో ఇల్లు కనిపించింది. ధర రూ.20 లక్షల పైచిలుకే. డౌన్పేమెంట్లు, ఈఎంఐల గురించి ముందే ప్రణాళిక వేసుకోవడం ఇక్కడ పనికొచ్చింది. ముందుగా డౌన్‌పేమెంట్‌కు కొంత డబ్బు సమకూర్చుకున్నా. దీని కోసం ఇతరత్రా పొదుపు మొత్తాలను బ్రేక్ చేశా. ఊళ్లో కొంత ప్రాపర్టీ మిగిలితే దాన్ని విక్రయించా. ఇంకాస్త మొత్తం చేతి కొచ్చింది. కాస్త బాధగా అనిపించినా.. ఇంట్లో బంగారాన్ని విక్రయించా. మరికాస్త డబ్బు చేతికొచ్చింది. అప్పట్లో నా జీతం సుమారు రూ. 27,000. బ్యాంకుల్ని సంప్రదించగా..చివరికి పీఎన్బీ రూ.12 లక్షల దాకా గృహ రుణం ఇస్తామంది. ఇంకాస్త తక్కువయింది. బంధుమిత్రుల నుంచి చేబదులు తీసుకుని కట్టేశా. అలా ఇల్లు సొంతమైంది. ఖర్చులు తగ్గించుకున్నాం .. ఈఎంఐలు మొదలయ్యాయి. నెలకు రూ. 13,000 కట్టాలి. అదే సమయంలో వేరే బాధ్యతలూ పడ్డాయి. దీంతో భారం పెరిగింది. కుటుంబ సభ్యుల అండతో ఖర్చుల్ని సాధ్యమైనంత తగ్గించుకున్నాం. అంతలో ఇంకో సంస్థ కాస్త ఎక్కువ జీతంతో మంచి ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు చక్కబడ్డాయి. చూస్తుండగానే రెండున్నరేళ్ల ఈఎంఐలు కట్టేశా. ఆదా.. పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూసినా మరే రకంగా చూసినా నా నిర్ణయం కరెక్టేననిపిస్తోంది. ఆర్థిక మందగమనంతో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా తగ్గినపుడు తీసుకోవడం కలిసొచ్చింది. నేను ఇల్లు తీసుకున్న ప్రాంతం కీలకమైన హైదరాబాద్-వరంగల్ హైవేకి దగ్గర్లో ఉంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఐటీఐఆర్ ఇక్కడే రాబోతోంది. మరోవైపు, అద్దె రూపంలో చెల్లించాల్సిన దాదాపు రూ. 7,000-8,000ను ఈఎంఐకి బదలాయిస్తున్నా. సొంతింటిని నేను దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌గానే భావిస్తున్నాను కనుక అది పెట్టుబడి కిందే లెక్క. ఇది పోతే అదనంగా చెల్లించాల్సింది నెలకు రూ.5 వేలే. నా ఇంటి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గత రెండున్నరేళ్లలో ఇది దాదాపు 40 శాతం పెరిగింది. - రాజిరెడ్డి కేశిరెడ్డి