చైనా తన రక్షణరంగ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్‌ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment