raises
-
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
రక్షణరంగ బడ్జెట్‌ను మరింత పెంచిన చైనా
చైనా తన రక్షణరంగ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్..
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు. బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది. తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనా పెంపు కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం. -
భారత్ లో డేటా సెంటర్లకు ఫుల్ డిమాండ్
-
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్! కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్ హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు -
‘కేక’ 57 మిలియన్ డాలర్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది. -
ఎట్టకేలకు శుభవార్త: కంపెనీ బోర్డుల్లో పెరుగుతున్న మహిళలు
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో (2013-2022) 18 శాతానికి చేరుకుంది. 2013లో ఇది 6 శాతంగా ఉండేది. 4,500 మంది పైచిలుకు డైరెక్టర్లు ఉన్న నిఫ్టీ 500 కంపెనీలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కంపెనీల చట్టంలో తప్పనిసరి చేసిన ఫలితంగానే బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది. నిఫ్టీ 500లోని 95 శాతం కంపెనీల బోర్డుల్లో ఒక మహిళ ఉన్నారని వివరించింది. అయితే, మహిళా చైర్పర్సన్లు ఉన్న కంపెనీల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని పేర్కొంది. బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై కంపెనీలు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. ప్రయత్నాలు అంత వేగంగా పురోగమించడం లేదని వివరించింది. చారిత్రకంగా చూస్తే భారతీయ సంస్థల బోర్డుల్లోని మహిళలకు ఎక్కువగా ఫిర్యాదుల పరిష్కారం, కార్పొరేట్ సోషల్ రెస్పాŠిన్సబిలిటీ (సీఎస్ఆర్) కమిటీల్లోనే చోటు దక్కుతూ వస్తోందని.. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందని ఈవై తెలిపింది. వేదికలో మరిన్ని విశేషాలు.. ♦ 24 శాతం మంది మహిళలతో లైఫ్ సైన్సెస్ రంగ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. మీడియా, వినోద రంగంలో ఇది 23 శాతంగా ఉంది. ఇక కన్జూమర్ ఉత్పత్తులు.. రిటైల్ రంగ కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంగా ఉంది. అత్యధికంగా మహిళా సిబ్బంది (34 శాతం) ఉన్న టెక్నాలజీ (ఐటీ, ఐటీఈఎస్) పరిశ్రమలో కూడా ఇది 20 శాతంగానే ఉంది. ♦ ఎనర్జీ, యుటిలిటీస్ రంగ (చమురు, గ్యాస్, విద్యుత్ మొదలైనవి) కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 2017 నుంచి ఒకే స్థాయిలో 15 శాతంగా స్థిరంగా ఉంది. ఇంధన రంగంలో కేవలం 600 మంది మహిళలు మాత్రమే మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ హోదాల్లో ఉన్నారు. ♦ అంతర్జాతీయంగా చూస్తే కంపెనీల బోర్డుల్లో 44.5 శాతం మహిళల ప్రాతినిధ్యంతో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది. స్వీడన్ (40 శాతం), నార్వే (36.4 శాతం), కెనడా (35.4 శాతం), బ్రిటన్ (35.3 శాతం), ఆస్ట్రేలియా (33.5 శాతం), అమెరికా (28.1 శాతం), సింగపూర్ (20.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
పాల ఉత్పత్తి మూడింతలు అవుతుంది
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే. అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు. -
గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా ఎస్బీఐకి రూ.3,800 కోట్లు
ముంబై: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ తాజాగా ఐఎఫ్ఎస్సీ గిఫ్ట్ సిటీ బ్రాంచీ ద్వారా 50 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)ను సమీకరించింది. గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా తొలిసారి ఆఫ్‌షోర్ యూఎస్ డాలరు సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేటు(ఎస్వోఎఫ్ఆర్) ఆధారిత సిండికేట్ రుణాన్ని అందుకున్నట్లు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) పేర్కొంది. 40 కోట్ల డాలర్ల విలువైన ఈ రుణ సౌకర్యంతోపాటు గ్రీన్‌షూ ఆప్షన్‌కింద మరో 10 కోట్ల డాలర్లను సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ మార్కెట్లలో బ్యాంకు సృష్టించుకున్న గుర్తింపునకు తాజా రుణ సమీకరణ నిదర్శనమని ఎస్బీఐ తెలియజేసింది. అంతేకాకుండా ఐఎఫ్ఎస్సీ గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ ఫైనాన్షియల్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో బ్యాంకుకున్న కట్టుబాటుకు ఇది మరో ముందడుగుగా అభివర్ణించింది. ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం నీరసించి రూ. 510 వద్ద ముగిసింది. చదవండి: ఎస్బీఐ షాకింగ్ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..! -
జికా వైరస్ కలకలం..100 దాటిన కేసులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో 16 జికా వైరస్ కేసులు నమోదు కావడంతో యూపీలో ఈ కేసుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రత్యేకంగా కాన్పూర్‌లో అత్యధిక జికా వైరస్ కేసులు నమోదు అవుతూ ఆ ప్రాంతాన్ని వణికిస్తోన్నాయి. కాన్పూర్‌లో అక్టోబరు 23న తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. జికా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’ -
పక్కా ప్లాన్.. ఒక్క రోజే రూ.30 లక్షలు హాంఫట్
సాక్షి,హిమాయత్‌నగర్( హైదరాబాద్): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా తమదైన పద్ధతిలో గుల్ల చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు విసిరే వలకు అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ఇలా శనివారం ఒక్కరోజే నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.30 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.7 లక్షలు.. ఎస్బీఐ ఏటీఎంల నుంచి భారీ మొత్తంలో నగదు కట్ అయినట్లు మహబూబ్‌గంజ్ బ్రాంచ్‌కు చెందిన మేనేజర్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం మిషన్ల నుంచి వేరే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వారు వేర్వేరు ఏటీఎంలలో రూ.7 లక్షల 30 వేల 400 నగదు డ్రా చేశారు. డ్రా చేసిన వ్యక్తులకు మిషన్ నుంచి డబ్బులు రాలేదంటూ తమ బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలను చెక్ చేయగా.. ఆయా ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు తమకు సిస్టంలో చూపిస్తోందనారు. ఇలా రూ.7లక్షల 30వేల 400 ఎలా పోయాయో, ఎవరు తీశారో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కేవైసీ అప్డేట్ పేరుతో.. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ రద్దు అవుతుందని నమ్మించి మోసం చేశారంటూ శ్రీనగర్‌కాలనీకి చెందిన చంద్రవర్మ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపిన వ్యక్తి కాల్ చేసి మెసేజ్ ఓపెన్ చేయమన్నట్లు పేర్కొన్నారు. అది ఓపెన్ చేశాక ఓటీపీ చెప్పడంతో ఆ వెంటనే అకౌంటులోంచి రూ.6 లక్షల 41వేల 59 స్వాహా చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ తనని మోసం చేశారంటూ ప్రేమ్‌నగర్‌కు చెందిన కల్యాణి ఫిర్యాదు చేశారు. కునాల్ అనే వ్యక్తి కాల్ చేసి ఇండిగోలో ఉద్యోగముందని ఇంటర్వూ్యకు ప్రిపేర్ కావాలన్నాడు. ముందుగా రూ.2100 చెల్లించి ఇంటర్వూ్యకు రాగా.. అకౌంట్లో కనీసం రూ.25 వేలు మెయింటెన్ చేయాలన్నాడు. ఇలా ఆధార్, పాన్ తదితర డాక్యుమెంట్లు అడిగి తన నుంచి పలు దఫాలుగా రూ.2 లక్షల 36 వేల 112 కాజేసినట్లు ఫిర్యాదు చేశారామె. పార్ట్ టైం జాబ్ పేరిట.. అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్ ఉందని ఓ వ్యక్తి కాల్ చేసి మోసం చేశాడని ఎస్సార్‌నగర్‌కు చెందిన విమల్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం కోసమంటూ రూ.1.8 లక్షలు సైబర్ కేటుగాళ్లు తమ అకౌంట్లలో వేయించుకున్నట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్లో తాను పెట్టిన సోఫా నచ్చి ఓ వ్యక్తి ఫోన్ కొంటానంటూ నమ్మించాడు. క్యూఆర్ కోడ్ పంపి రూ.1.49 లక్షలు దోచుకున్నట్లు నల్లకుంటకు చెందిన ఆశీష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.1.91 లక్షలు పెట్టుబడి పెట్టించి తనని మోసం చేశారంటూ తిలక్‌నగర్‌కు చెందిన రమేష్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆపిల్ ఫోన్ గెలుచుకున్నావంటూ.. యూసఫ్‌గూడకు చెందిన సుప్రదకు ఓ వ్యక్తి కాల్ చేసి మీరు ఆపిల్–13 ఫోన్‌ను గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ చెప్పాడు. మీకు ఓ లింక్ పంపామని, దానిని ఫిల్ చేసి క్లెయిమ్ చేస్తే మీకు ఫోన్ పంపిస్తామన్నారు. ఫిల్ చేశాక ఓటీపీ వస్తుందని.. అది చెప్పమనడంతో సుప్రద చెప్పింది. అంతే క్షణాల వ్యవధిలో అకౌంట్లో నుంచి రూ.5 లక్షల 54 వేల 986 కట్ అయ్యాయి. రాంచీలో ఇల్లు అద్దెకు కావాలంటూ.. వెస్ట్‌మారేడ్‌పల్లిలో నివసించే రాకేష్‌కుమార్ సింగ్ ఎస్బీఐ బ్యాంకులో చీఫ్ మేనేజర్‌గా రిటైరయ్యారు. ఆయనకు ఝార్ఖండ్‌లోని రాంచిలో సొంత ఇల్లు ఉంది. నగరంలోనే నివాసం ఉంటున్న కారణంగా ఆ ఇల్లు ఖాళీగా ఉంటోంది. దీంతో ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘మ్యాజిక్ బ్రిక్స్’లో యాడ్ ఇచ్చారు. యాడ్‌ను చూసిన ఓ వ్యక్తి ఫోన్ చేసి ఇల్లు బాగుంది తీసుకుంటానని నమ్మించాడు. ఇందుకోసం అడ్వాన్స్ చెల్లిస్తామని క్యూఆర్ కోడ్లు పంపారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో తొలుత రూ.లక్ష వరకు కట్ అయ్యాయి. ఇలా ఎందుకయ్యిందని రాకేష్‌కుమార్ ప్రశ్నించంగా.. పొరపాటయ్యిందని మరో కోడ్ పంపించారు. ఇలా పది కోడ్లు పంపి సుమారు పది అకౌంట్ల నుంచి రూ.10.8 లక్షలు స్వాహా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. చదవండి: హత్య కేసులో అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు.. పోలీసులకే చెమటలు -
పెరిగిన టెల్కోల ఆదాయం: టాప్‌లో ఎవరంటే?
సాక్షి,న్యూఢిల్లీ: టెలికం కంపెనీల ఆదాయం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో టర్నోవరు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.27 శాతం వృద్ధితో రూ.71,588 కోట్లు నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) 16.5 శాతం అధికమై రూ.47,623 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి సమకూరిన లైసెన్స్ ఫీజు 16.49 శాతం పెరిగి రూ.3,809 కోట్లకు చేరింది. అలాగే స్పెక్ట్రం వాడినందుకు వసూలైన రుసుం 22.22 శాతం హెచ్చి రూ.1,538 కోట్లు నమోదైంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను వెల్లడించింది. రిలయన్స్ జియో రూ.17,181 కోట్లుతో టాప్‌లో ఉండగా, భారతి ఎయిర్టెల్ రూ.11,340 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.6,588 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.2,135 కోట్ల ఏజీఆర్ సాధించాయి. టాటా టెలిసర్వీసెస్ రూ. 584.1 కోట్లు, ఎంటిఎన్ఎల్ రూ .369.84 కోట్లును సాధించగా, మిగతా కంపెనీలు ఎజిఆర్‌ను 100 కోట్ల రూపాయల కన్నా తక్కువే సాధించాయి. ఈ గణాంకాల ప్రకారం, ఏజీఆర్ ఆధారిత ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం వార్షిక ప్రాతిపదికన 85.07 రూపాయల నుండి 108.78 రూపాయలకు పెరిగింది. చదవండి: కార్పొరేట్ వార్: సుప్రీంకోర్టుకు సైరస్ మిస్త్రీ వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు -
భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. -
బ్యాంక్స్ ఆన్ ఫైర్ : మార్కెట్ల జోష్
సాక్షి, ముంబై: మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400పాయింట్లు జంప్ చేసిన సూచీలు అదేజోరును కంటిన్యూ చేస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌రంగషేర్లులాభాలతో దూకుడుమీదున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 438పాయింట్లుఎగిసి 46723 వద్ద,నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో13744 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, ఐవోసీ తదితర షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి పేపర్‌లెస్‌గా డిజిటల్ అవతారమెత్తింది. ఈనేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయకమైన బహీఖాతా పుస్తకం బదులుగా మేడిన్ ఇండియా ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బడ్జెట్‌ను చదవి వినిపించనున్నారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మల సీతారామన్ తదితరులు ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. కేబినెట్ ఆమోదం అనంతరం దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. -
పుంజుకున్న సూచీలు, 9వేల ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. భారీ నష్టాల్లోంచి భారీగా ఎగిసాయి. ఆరంభంలోనే 400 పాయింట్టలకుపైగా క్షీణించిన సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు పుంజుకుని తిరిగి30వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ 9వేల ఎగువకు చేరింది. ముఖ్యంగాబ్యాంకింగ్ షేర్లలో భారీ రికవరీతో నిఫ్టీ బ్యాంకు 900 పాయింట్లకు పైగా ఎగిసింది. ఫార్మ,ఆటో, మెటల్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల షేర్లలో లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 932 పాయింట్లు ఎగిసి 30982 వద్ద, నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 9057 వద్ద కొనసాగుతోంది. గెయిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత, యాక్సిస్ బ్యాంక్ , హిందూస్తాన్ యూనిలీవర్ భారీగా లాభపడుతుండగా, టీసీఎస్, ఐటీసీ నష్టపోతున్నాయి. -
19 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 15 పైసలు పెరిగి 71.21 డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత 19 పైసలు పెరిగి 71.19 కు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాల ధోరణి రూపాయికి బలాన్నిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే సోమవారం 71.36 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగాచమురు ధరలు మంగళవారం స్వల్పంగా పుంజు కున్నాయి. ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం, అమెరికన్ కరెన్సీని బలోపేతం దేశీయ కరెన్సీకి బలాన్నిస్తోందని ఫారెక్స్ వర్తకుల అంచనా. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ 2020 నేటి నుంచి (ఫిబ్రవరి 4) 6 వ తేదీవరకు తన ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో పరపతి విధాన సమీక్ష కీలకం. -
వరుసగా ఐదో రోజూ లాభాల్లోనే
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా మొదలైంది. ఇటీవల లాభాల్లో ఉన్న వరుసగా అయిదవ రోజు సోమవారం కూడా పుంజుకోవడం విశేషం. డాలరు మారకంలో శుక్రవారం 14పైసలు లాభపడి 71.31వద్ద ముగిసింది. ఈ రోజు 71.37వద్ద బలహీనంగా ప్రారంభమైనా వెంటనే పుంజుకుని 9 పైసలు ఎగిసి 71.22వద్ద ఉంది. డాలరులో పెరిగిన అమ్మకాలతో మన రూపాయికి బలమొచ్చిందని కరెన్సీ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనాయి. సెన్సెక్స్, 37వేలు, నిఫ్టీ 11వేల స్థాయిని కోల్పోయి నెగిటివ్ జోన్లోకి ఎంటరయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 163 పాయింట్లు క్షీణించి 36, 382వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 10882 వద్ద కొనసాగుతోంది. -
వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా లెండింగ్ వడ్డీరేట్లను పెంచేసింది. ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. 8.40 శాతంనుంచి 8.45 శాతానికి ఎంసీఎల్ఆర్ను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు జూన్ 7 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు , ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీరేటు రుసగా 7.95 శాతం, 8 శాతం, 8.1 శాతం, 8.3 శాతం ఉండనుంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో బీఓబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎప్సీ సహా కొన్ని బ్యాంకులు తమ ఎంసిఎల్ఆర్ను పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడివున్న గృహ, వాహన రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి. -
ఆర్బీఐ తప్పులో కాలేసిందా?
ముంబై: డీమానిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్లు కచ్చితమైన లెక్క ఎంత ? పెద్దనోట్ల తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నగదుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ.11.5 లక్షల కోట్లు జమ అయింది. అయితే ఈ గణాంకాలపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ అనుమానం వ్యక్తం చేసింది. బహుశా డబుల్ కౌంట్ అయి వుంటుందనే అభిప్రాయపడింది. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్లు , విత్ డ్రా కరెన్సీ తో పాటు , ముఖ్యంగా కొత్త నోట్లు, చెలామణీలో ఉన్ననోట్లను కలిపి డబుల్ లెక్కింపు జరిగి ఉంటుందనే అనుమానాలను లేవనెత్తింది. దీంతో ఏ లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక మార్కెట్ వర్గాలు అయెమయంలో పడిపోయాయి. కచ్చితమైన గణాంకాలు ప్రకటించకపో్యినప్పటికీ , దీనిపై ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కొంత వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ప్రకటనపై వ్యాఖ్యానించిడానికి నిరాకరించిన ఆమె డబుల్ లెక్కింపు అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తమతో ఉన్న పోస్ట్ ఆఫీస్, కో ఆపరేటివ్ ఖాతాల్లో ఇప్పటికే కొత్త నోట్ల డిపాజిట్లు ప్రారంభమైందన్నారు. 10-15 శాతం డబుల్ లెక్కింపు జరిగివుంటుందని ఎస్బీఐ పరిశోధనా విభాగం అంచనావేసినట్టుతెలిపారు. నవంబర్ 10 నాటికి ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు విలువ రూ 3.5 లక్షల కోట్లకు చేరింది. కాగా రివ్యూ పాలసీ సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ మొత్తం డిపాజిట్ల విలువ రూ 11.5 లక్షల కోట్ల దాటిందని చెప్పారు. అధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లద్వారా రూ 14.95 లక్షల కోట్ల డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వస్తుందని ఊహాగానాలకు దారి తీసిందని పేర్కొన్నారు. నల్లధనం వెలికితీత కోసం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం హడావిడిగా చేసింది కాదనీ, వివరణాత్మక చర్చల తర్వాత మాత్రమే జరిగిందని చెప్పారు.అలాగే వివిధ తరహా నోట్లను ఇప్పటికే రూ.3.81లక్షల కోట్ల విలువైన నోట్లను అందించామనీ, ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ గత మూడు సంవత్సరాల్లో సరఫరా చేసినదాని కంటే ఇది ఎక్కువని చెప్పారు. -
భారీగా పెరుగనున్న ఆపిల్ ఉత్పత్తుల ధరలు
రాత్రికి రాత్రే టెక్ దిగ్గజం ఆపిల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీ ఆఫర్ చేసే మ్యాక్ ప్రొ లాంటి కొన్ని ఉత్పత్తుల ధరలు 20 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా స్వీడన్ ఎలక్ట్రోలక్స్ కూడా తమ గృహోపకరణాలపై ధరలను 10 శాతం పెంచుతున్నట్టు తెలిపింది. ఈ సడెన్ నిర్ణయాలకు వెనుక కారణం బ్రెగ్జిట్ బాటలో యూకే వేగవంతంగా పయనిస్తుందనే వార్తలేనని తెలుస్తోంది. గత రెండేళ్లలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుందని, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా పౌండ్ క్షీణిస్తుండటంతో, ఈ ప్రభావం దిగుమతులపై పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతవారం 2,499 పౌండ్లకు(రూ.2,03,504) లభించిన ఆపిల్ డెస్క్‌టాప్ మిషన్ మ్యాక్ ప్రొపై కంపెనీ ప్రస్తుతం 2,999 పౌండ్ల(రూ.2,44,221) ధర పలుకుతోంది. మ్యాక్ మినీ ధర కూడా 399 పౌండ్ల(రూ.32,492) నుంచి 479 పౌండ్ల(రూ.39,007)కు పెరిగింది. అయితే అమెరికన్ మార్కెట్లో మాత్రం మ్యాక్ మినీ, మ్యాక్ ప్రొ ధరల్లో మార్పులు లేనట్టు ఆపిల్ తెలిపింది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు, వ్యాపార పద్దతులు, పన్నులు, వ్యాపార ఖర్చులు వంటి ప్రభావంతో అంతర్జాతీయంగా ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెంచినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. అయితే ఈ కారణాలు అన్ని దేశాల్లో ఒకేవిధంగా ఉండవని, ప్రాంతానికి ప్రాంతానికి మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ధరలను, అమెరికా రిటైల్ ధరలతో పోల్చిచూడదని తెలిపారు. పౌండ్ క్షీణిస్తుండటంతో, ఆ నష్టాన్ని భర్తీచేసుకోవడానికి ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు పెంచుతున్నట్టు ఎలక్ట్రోలక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోనస్ సామ్యూల్సన్ చెప్పారు. బ్రెగ్జిట్‌కు మొగ్గుచూపుతూ యూకే తీసుకున్న సంచలన నిర్ణయంతో డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ 18 శాతం మేర కుదేలైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా క్షీణించిన కరెన్సీ పౌండే. ఈ పతనంతో దిగుమతి ధరలు పెరుగుతున్నాయని, దీంతో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరుగుతుందని అక్కడి విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
కొంచెం తాగినా ముప్పు ముప్పే..
మందుబాబులు తరుచుగా చెప్పుకొని సమర్థించుకునే మాటలు.. 'ఎప్పుడో ఒకసారి తాగితే ఏమీ కాదు', 'కొంచెం తాగితే ఫర్వాలేదు'. అయితే ఈ అప్పుడప్పుడు, తక్కువ పరిమాణం అనే మాటలు కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించేవే అని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకునే వారిలో సైతం ఏడు రకాల క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతోందని న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో మెడికల్ స్కూల్ పరిశోధక బృందం నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు రెడ్‌వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న వాదన అర్ధరహితమైందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ పరిమాణం తక్కువగా తీసుకునే వారిలో సైతం నోరు, గొంతు, అహారవాహిక, కాలేయం, పెద్దప్రేగు వంటి శరీర భాగాలలో క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జెన్నీ కానర్ తెలిపారు. 2012 నుంచి క్యాన్సర్ కారణంగా సంభవించిన మరణాలను పరిశీలిస్తే.. ప్రతి 20 మరణాల్లో ఒకటి(ఐదు శాతం) ఆల్కహాల్ మూలంగానే అని కానర్ వెల్లడించారు. అయితే.. తీసుకునే ఆల్కహాల్ పరిమాణం పెరిగిన కొద్దీ క్యాన్సర్ ముప్పు శాతం కూడా పెరుగుతుందని ఆమె వెల్లడించారు. -
ఆడియో,వీడియో టేపులతో ఆడ్డంగా దొరికాడు