సాక్షి, ముంబై: మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400పాయింట్లు జంప్ చేసిన సూచీలు అదేజోరును కంటిన్యూ చేస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌రంగషేర్లులాభాలతో దూకుడుమీదున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 438పాయింట్లుఎగిసి 46723 వద్ద,నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో13744 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, ఐవోసీ తదితర షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి పేపర్‌లెస్‌గా డిజిటల్ అవతారమెత్తింది. ఈనేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయకమైన బహీఖాతా పుస్తకం బదులుగా మేడిన్ ఇండియా ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బడ్జెట్‌ను చదవి వినిపించనున్నారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మల సీతారామన్ తదితరులు ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. కేబినెట్ ఆమోదం అనంతరం దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment