హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్‌ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment