
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 15 పైసలు పెరిగి 71.21 డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత 19 పైసలు పెరిగి 71.19 కు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాల ధోరణి రూపాయికి బలాన్నిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే సోమవారం 71.36 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగాచమురు ధరలు మంగళవారం స్వల్పంగా పుంజు కున్నాయి. ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం, అమెరికన్ కరెన్సీని బలోపేతం దేశీయ కరెన్సీకి బలాన్నిస్తోందని ఫారెక్స్ వర్తకుల అంచనా. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ 2020 నేటి నుంచి (ఫిబ్రవరి 4) 6 వ తేదీవరకు తన ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో పరపతి విధాన సమీక్ష కీలకం.