సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment