check point
-
ఢిల్లీ ఎంట్రీ పాయింట్లను పర్యవేక్షించండి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.ఇక జీఆర్ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుంది. -
ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా
స్మార్ట్ఫోన్ల వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీని వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పనులు ఈజీగా మారాయని సంతోషించే లోపే సైబర్ నేరగాళ్ల దాడితో భద్రత కరువై పోతోంది. కరోనా కాలంలో సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి. తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు వెల్లడించారు. చెక్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యాప్‌ల జాబితాను విడుదల చేశారు. భారీగా డౌన్లోడ్ చేసిన కొన్ని ప్రసిద్ధ యాప్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి పలు యాప్‌లను 10 కోట్ల మంది తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ యాప్‌ల్లో కొన్ని ఆస్ట్రాలజీ, ఫ్యాక్స్, ట్యాక్సీ సర్వీసెస్, స్క్రీన్ రికార్డింగ్ కు సంబంధించినవి ఉన్నాయని చెక్‌పాయింట్ రీసెర్చ్ నివేదిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు, టీలావా (ట్యాక్సీ యాప్), యాప్ లోగో మేకర్ వంటి యాప్‌లున్నాయి. ఈ యాప్‌ల్లోని లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. ఈ-మెయిల్, పాస్వర్డ్, పేరు, పుట్టిన తేదీ, లింగ సమాచారం, ప్రైవేట్ చాట్, పరికర స్థానం, వినియోగదారు ఐడెంటిఫైయర్లు వంటి సమాచారం ఇందులో ఉంది. ఆ మాల్వేర్ యాప్‌లు వినియోగదారు సమాచారం, డేటాను సేకరిస్తున్నాయి కాబట్టి ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. -
‘ఎంట్రీ’ మామూలే!
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్పాయింట్లు అవినీతికి అడ్డాలుగా మారాయి. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సిన సిబ్బంది.. సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలించకుండానే డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు మామూలయ్యాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 44వ నంబ రు (బెంగుళూరు–నాగ్‌పూర్) జాతీయ రహదారి తో పాటు 161 వ నంబరు (సంగారెడ్డి–నాందే డ్–అకోలా) జాతీయ రహదారులపై రవాణా శాఖ చెక్‌పాయింట్, చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆ యా రహదారుల మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర, దక్షిణ భారత దేశాల్లోని వివిధ రాష్ట్రాలకు సరకుల రవాణాకు సంబంధించిన వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని పొందుర్తి సమీపంలో ఆర్టీఏ చెక్‌పాయింట్ ఉంది. దీని మీదుగా నిత్యం వందలాది లారీలు, ఇతర రవాణా వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి రవాణా వాహనం ఆగాల్సిందే.. అక్కడి సిబ్బంది అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. ఇది బహిరంగ రహస్యం. రవాణా చెక్పాయింట్లతో పాటు చెక్‌పోస్టుల వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలు, రవాణా అవుతున్న సామగ్రికి సంబంధించిన పత్రాలు, లోడ్, పన్నులు చెల్లించిన పత్రాలతో పాటు వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్లు లారీని ఆపడం, అక్కడి సిబ్బందికి డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. 161వ నంబరు జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్పూర్ ఆర్టీఏ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రవేశం పేరుతో ‘ఎంట్రీ’ అంటూ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే చెక్‌పోస్టులు, చెక్పాయింట్ల వద్ద పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అప్పుడు లెక్కకు మించిన డబ్బులు ఉన్నాయన్న ఆరోపణలతో పలువురిపై చర్యలు తీసుకున్నారు. దానికితోడు చెక్‌పోస్టులు, పాయింట్ల వద్ద రవాణా శాఖ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తులే ఎక్కువ హల్చల్ చేస్తుంటారు. జాతీయ రహదారులపై రవాణా శాఖ వసూళ్లపై లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. మూడు రోజుల్లో వేలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆర్టీఏ వసూళ్లపై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
భారత్ పై చైనా సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టించిన వన్నాక్రై సైబర్ ఎటాక్ ఉదంతం ఇంకా మరువకముందే, ఆండ్రాయిడ్ లోకి జుడీ అనే మాల్వేర్ చొచ్చుకుని వచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లను గడగడలాడించింది. తాజాగా చైనాకు చెందిన ఓ మాల్వేర్ భూతం భారత్ పై అటాక్ చేసింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కంప్యూటర్లను ''ఫైర్ బాల్'' అనే మాల్వేర్ అటాక్ చేసిందని సెక్యురిటీ సంస్థ చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. ఫైర్ బాల్ రూపంలో వచ్చిన ఈ కొత్త సైబర్ అటాక్ తో, హైజాకర్లు యూజర్ల డీఫాల్డ్ సెర్చ్ ఇంజిన్ ను మారుస్తున్నారని చెప్పింది. అయితే ఈ అటాక్ ఎక్కువగా భారత్ పై ప్రభావం చూపినట్టు చెక్ పాయింట్ పేర్కొంది. అమెరికాలో 55 లక్షల పీసీలు దీని ప్రభావితం కాగ, ఇండియా, బ్రెజిట్ లో చెరో 2.5 కోట్ల మిషన్ల చొప్పున ఫైర్ బాల్ మాల్వేర్ ప్రమాదం బారినపడినట్టు తెలిపింది. తమ నెట్ వర్క్ క్లయింట్స్ అనాలిసిస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదు కంప్యూటర్ నెట్ వర్క్స్ లో కనీసం ఒకటి దీని ప్రభావానికి గురైనట్టు చెక్ పాయింట్ అంచనావేస్తోంది. బీజింగ్ కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ రాఫోటెక్, వైర్డ్.కామ్ తరఫును వెబ్ ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తారని చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. బాధితుల మిషన్లలో ఎలాంటి కోడ్ నైనా రన్ చేసే సామర్థ్యం ఈ మాల్వేర్ కు ఉందని వెల్లడించింది. లేదా కొత్త కొత్త హానికరమైన ఫైల్స్ ను సిస్టమ్స్ లోకి డౌన్ లోడ్ చేస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఈ మాల్వేర్ ఒక యాడ్వేర్. అంటే అవసరం ఉన్నా లేకున్నా.. ప్రకటనలు గుప్పిస్తుందని చెక్ పాయింట్ పేర్కొంది. -
ఏసీబీ దాడి
భిక్కనూరు, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం పొందూర్తి గ్రామశివారులో జాతీయరహదారి పక్కన ఉన్న ఆర్టీఏ చెక్ పాయింట్‌పై శనివారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడి చేశారు. వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులైన హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మల్లికార్జున్, నర్సన్నపల్లికి చెందిన చందాని శ్రీధర్, నందవెంకట్రాజం, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన బెజ్జం చందులతో పాటు విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ సురేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ. 58 వేల 320 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.పొందూర్తి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు 8 నెలల కాలంలో రెండుసార్లు దాడులు నిర్వహించారు. గతేడాది జూన్‌లో దాడులు నిర్వహించి అప్పటి ఏఎంవీఐ అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.