భారత్ పై చైనా సైబర్ అటాక్
భారత్ పై చైనా సైబర్ అటాక్
Published Mon, Jun 5 2017 12:02 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టించిన వన్నాక్రై సైబర్ ఎటాక్ ఉదంతం ఇంకా మరువకముందే, ఆండ్రాయిడ్ లోకి జుడీ అనే మాల్వేర్ చొచ్చుకుని వచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లను గడగడలాడించింది. తాజాగా చైనాకు చెందిన ఓ మాల్వేర్ భూతం భారత్ పై అటాక్ చేసింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కంప్యూటర్లను ''ఫైర్ బాల్'' అనే మాల్వేర్ అటాక్ చేసిందని సెక్యురిటీ సంస్థ చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. ఫైర్ బాల్ రూపంలో వచ్చిన ఈ కొత్త సైబర్ అటాక్ తో, హైజాకర్లు యూజర్ల డీఫాల్డ్ సెర్చ్ ఇంజిన్ ను మారుస్తున్నారని చెప్పింది. అయితే ఈ అటాక్ ఎక్కువగా భారత్ పై ప్రభావం చూపినట్టు చెక్ పాయింట్ పేర్కొంది. అమెరికాలో 55 లక్షల పీసీలు దీని ప్రభావితం కాగ, ఇండియా, బ్రెజిట్ లో చెరో 2.5 కోట్ల మిషన్ల చొప్పున ఫైర్ బాల్ మాల్వేర్ ప్రమాదం బారినపడినట్టు తెలిపింది.
తమ నెట్ వర్క్ క్లయింట్స్ అనాలిసిస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదు కంప్యూటర్ నెట్ వర్క్స్ లో కనీసం ఒకటి దీని ప్రభావానికి గురైనట్టు చెక్ పాయింట్ అంచనావేస్తోంది. బీజింగ్ కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ రాఫోటెక్, వైర్డ్.కామ్ తరఫును వెబ్ ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తారని చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. బాధితుల మిషన్లలో ఎలాంటి కోడ్ నైనా రన్ చేసే సామర్థ్యం ఈ మాల్వేర్ కు ఉందని వెల్లడించింది. లేదా కొత్త కొత్త హానికరమైన ఫైల్స్ ను సిస్టమ్స్ లోకి డౌన్ లోడ్ చేస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఈ మాల్‌వేర్ ఒక యాడ్‌వేర్. అంటే అవసరం ఉన్నా లేకున్నా.. ప్రకటనలు గుప్పిస్తుందని చెక్ పాయింట్ పేర్కొంది.
Advertisement
Advertisement