![100 Million Users Private Data Leaked in Online - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/cybersecurity_data.jpg.webp?itok=37qF4ttc)
స్మార్ట్‌ఫోన్‌ల వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీని వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పనులు ఈజీగా మారాయని సంతోషించే లోపే సైబర్ నేరగాళ్ల దాడితో భద్రత కరువై పోతోంది. కరోనా కాలంలో సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి. తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు వెల్లడించారు. చెక్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యాప్‌ల జాబితాను విడుదల చేశారు.
భారీగా డౌన్‌లోడ్ చేసిన కొన్ని ప్రసిద్ధ యాప్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి పలు యాప్‌లను 10 కోట్ల మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ యాప్‌ల్లో కొన్ని ఆస్ట్రాలజీ, ఫ్యాక్స్, ట్యాక్సీ సర్వీసెస్, స్క్రీన్ రికార్డింగ్ కు సంబంధించినవి ఉన్నాయని చెక్‌పాయింట్ రీసెర్చ్ నివేదిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు, టీలావా (ట్యాక్సీ యాప్), యాప్ లోగో మేకర్ వంటి యాప్‌లున్నాయి. ఈ యాప్‌ల్లోని లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. ఈ-మెయిల్, పాస్‌వర్డ్, పేరు, పుట్టిన తేదీ, లింగ సమాచారం, ప్రైవేట్ చాట్, పరికర స్థానం, వినియోగదారు ఐడెంటిఫైయర్‌లు వంటి సమాచారం ఇందులో ఉంది. ఆ మాల్వేర్ యాప్‌లు వినియోగదారు సమాచారం, డేటాను సేకరిస్తున్నాయి కాబట్టి ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment