malware attack
-
మొబైల్ ముట్టుకుంటే ముప్పే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మాల్వేర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడాలను కూడా దాటేసింది. జీస్కేలర్ థ్రెట్‌ల్యాబ్జ్ రూపొందించిన ’మొబైల్, ఐవోటీ, ఓటీ థ్రెట్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.2023 జూన్ నుంచి 2024 మే వరకు 2000 కోట్ల పైచిలుకు మాల్వేర్ ముప్పు సంబంధిత మొబైల్ లావాదేవీలు, ఇతరత్రా సైబర్ ముప్పుల గణాంకాలను విశ్లేషించిన మీదట ఈ రిపోర్ట్ రూపొందింది. ‘అంతర్జాతీయంగా మొబైల్ మాల్వేర్ దాడుల విషయంలో భారత్ టాప్ టార్గెట్‌గా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈసారి మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి మొత్తం అటాక్స్‌లో 28 శాతం దాడులు భారత్ లక్ష్యంగా జరిగాయి. అమెరికా (27.3 శాతం), కెనడా (15.9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వేగవంతమవుతుండటం, సైబర్ ముప్పులు పెరుగుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది‘ అని నివేదిక వివరించింది.గూగుల్ ప్లే స్టోర్‌లో 200 పైచిలుకు హానికారక యాప్స్‌ను గుర్తించినట్లు, ఐవోటీ మాల్వేర్ లావాదేవీలు వార్షికంగా 45 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇది సైబర్ దాడుల ముప్పు తీవ్రతను తెలియజేస్తుందని వివరించింది. అత్యధికంగా సైబర్ దాడులకు గురవుతున్నప్పటికీ.. మాల్వేర్ ఆరిజిన్ పాయింట్ (ప్రారంభ స్థానం) విషయంలో మాత్రం భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరింది.రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. మొబైల్ అటాక్స్‌లో సగభాగం ట్రోజన్ల రూపంలో (హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుని, రన్ చేసేలా ప్రేరేపించే మోసపూరిత మాల్ వేర్) ఉంటున్నాయి. ఆర్థిక రంగంలో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు 29% పెరగ్గా, మొబైల్ స్పైవేర్ దాడులు ఏకంగా 111% ఎగిశాయి. ఆర్థికంగా మోసగించే లక్ష్యంతో చేసే మాల్వేర్ దాడులు, మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్లాంటి (ఎంఎఫ్ఏ) వివిధ అంచెల భద్రతా వలయాలను కూడా ఛేదించే విధంగా ఉంటున్నాయి. వివిధ ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, క్రిప్టో వాలెట్లకు సంబంధించి ఫేక్ లాగిన్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి దిగ్గజ భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అచ్చం సిసలైన బ్యాంకింగ్ వెబ్సైట్లను పోలి ఉండే ఫేక్ సైట్లలో.. బ్యాంకుల కస్టమర్లు కీలక వివరాలను పొందుపర్చేలా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తూ, మోసగిస్తున్నారు. గతంలోనూ నకిలీ కార్డ్ అప్డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్వేర్ను జొప్పించేందుకు ఇలాంటి మోసాలే జరిగాయి. పోస్టల్ సర్వీసులను కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. యూజర్‌కు రావాల్సిన ప్యాకేజీ మిస్సయ్యిందనో లేక డెలివరీ అడ్రెస్ సరిగ్గా లేదనో ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా వారిని కంగారుపెట్టి, తక్షణం స్పందించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఫేక్ సైట్ల లింకులను ఎస్ఎంఎస్ల ద్వారా పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. అంతగా రక్షణ లేని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ (ఐవోటీ/ఓటీ) మొదలైనవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్‌గా ఉంటున్నాయి. కాబట్టి భారతీయ సంస్థలు సురక్షితంగా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
భారత్‌కు మాల్వేర్ ముప్పు.. సైబర్‌సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు మాల్‌వేర్‌పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి. అలాగే రాన్సమ్వేర్ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్‌వాల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్ వంటి దేశాల్లో సైబర్ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేబాశీష్ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2022లో 173.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్‌వాల్ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం! -
మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. అలా చేస్తే..మీ ఫోన్ డేటా మొత్తం హ్యాక్
కొత్తరకమైన ఆండ్రాయిడ్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్తగా ఉండమని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మెుబైల్ ఫోన్లలోకి దామ్ ప్రవేశించి డేటాను హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డ్స్, హిస్టరీ, కెమెరాలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లక్షిత డివైజ్‌లపై రాన్సమ్వేర్ను సృష్టించి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను కూడా సులభంగా ఛేదించగలదని వెల్లడించింది. డివైజ్‌లోకి ఈ మాల్వేర్ చొరబడిన తర్వాత మెుబైల్ సెక్యూరిటీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత సున్నితమైన డేటాను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తన ప్రయత్నంలో సఫలమైతే ఫోన్లోని హిస్టరీని, బుక్‌మార్క్‌ను, కాల్ లాగ్స్ వంటి కీలక సమాచారాన్ని సులభంగా రాబడుతుంది. సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ డేటాను డిలీట్ చేసి, హ్యాక్ చేసిన డేటాను '.enc' ఫార్మాట్లో ఎన్‌క్ట్రిప్ట్ చేసుకుని భద్రపరుచుకుంటుందని వెల్లడించాయి. దీంతో పాటు ఫైల్స్‌ను అప్లోడ్, డైన్లోడ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్గారిథంతో కమాండ్ అండ్ కంట్రోల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని భారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్స్‌పై క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ టీం తెలిపింది. యూఆర్ఎల్లో 'bitly','tinyur' వంటివి ఉంటే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. చదవండి:హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా? -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్‌వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్‌ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్‌ట్యాగ్ అనానిమస్ సూడాన్‌లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్‌క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్‌తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్‌కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్‌గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు దాని సర్వర్‌ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్‌ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్‌సైట్‌ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్‌గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్‌లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
సెల్‌ఫోన్ యూజర్స్‌కు అలర్ట్.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్’
సాక్షి, విజయవాడ: ఫోన్లో బ్లూటూత్.. వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్‌స్పాట్ ద్వారా ‘పెయిర్’ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్ల ఫోన్‌తో మన ఫోన్ కనెక్టవుతుంది. వెంటనే మాల్వేర్తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్లో వైఫై ఆప్షన్ ఆన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్‌గా వైఫై కనెక్ట్ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్ సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్విక్ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్ తదితర యాప్స్ సాయంతో ఫోన్ ఆపరేటింగ్ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా సొమ్మును దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను సైబర్ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్‌కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి బ్లూ బగ్గింగ్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ పోలీస్‌స్టేషన్ -
సీడీఎస్ఎల్ సిస్టమ్‌లో మాల్వేర్
న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్వేర్ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్ఎల్ శుక్రవారం వెల్లడించింది. ఇది లావాదేవీల సెటిల్మెంట్లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్కనెక్ట్ చేసినట్లు సీడీఎస్ఎల్ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. -
కేంద్రం వార్నింగ్.. భారత్‌లోకి కొత్త రకం బ్యాంకింగ్ వైరస్ ఎంట్రీ!
బనశంకరి: నేరాలు దాని స్వరూపాన్ని మార్చుకుంటోంది. క్రెడిట్ కార్డులు బకాయిలు చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగి డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు కన్నం వేసేందుకు సోవా అనే మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ అడుగు పెట్టింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, స్మార్ట్ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లను టార్గెట్‌గా చేసుకుని ఈ వైరస్ దాడి చేస్తుంది. అమెరికా, రష్యా, స్పెయిన్ అనంతరం భారత్ బ్యాంకింగ్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుంది. జూలైలో ఈ వైరస్ భారత్‌లో కనబడగా ప్రస్తుతం మరింత అప్డేట్ కాబడి తన హవా కొనసాగిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. మొబైల్లో ప్రవేశించే ఈ వైరస్‌ను తొలగించడం (అన్ ఇన్స్టాల్) చాలాకష్టం. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యాప్‌ల్లో దాగి ఉంటుంది. వివిధ రూపాల్లో.. పేమెంట్ యాప్ రూపంలో సోవా మీ మొబైల్లో చేరవచ్చు. బ్యాంకింగ్ ఇ–కామర్స్ యాప్‌లు రూపంలో కనబడవచ్చు. వాటిని వినియోగించినప్పుడు కస్టమర్లు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురి అవుతుందని జాతీయ కంప్యూటర్ భద్రతా అత్యవసర బృందం (సర్ట్స్ ఇన్) హెచ్చరించింది. గూగుల్‌క్రోమ్, అమెజాన్, ఎఫ్ఎఫ్టీ రూపంలో స్మార్ట్స్ ఫోన్‌లోనికి దొంగలా వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. అనంతరం వినియోగదారులకు తెలియకుండా పాస్వర్డ్ లాగిన్ వివరాలు చోరీ చేస్తుంది. ఇది ప్రమాదకరం సోవా–0.5 సోవా కానీ లేదా మరో వైరస్ కానీ సైబర్‌స్పేస్‌లో కస్టమర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి సోవా అనేది కొత్తది కాదు. విదేశాల్లో ఇది చాలా వరకు దెబ్బతీసింది. ప్రస్తుతం భారత్‌లో ప్రవేశించిన సోవా 5.0 మరింత ప్రమాదకారి అని సైబర్ నిపుణుడు జీ.అనంతప్రభు తెలిపారు. మొబైల్ లేదా కంప్యూటర్లో రారయండ్ సమ్వేర్లో చేరుకుని మీ అకౌంట్‌ను లాక్ చేస్తుంది. అన్‌లాక్ చేయడానికి సైబర్ వంచకులు డబ్బు అడుగుతారు. ఈ ఫ్యూచర్ సైతం సోవాకు చేరుతుంది. కస్టమర్లు జాగ్రత్త వహించాలి. గూగుల్, ఫేస్బుక్, జీ మెయిల్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. బ్యాకింగ్ వ్యవహారాలకు కన్నం వేస్తుంది. 200కు పైగా యాప్‌లు బ్యాంకింగ్ అప్లికేషన్లు, క్రిప్టో ఎక్సేంజీలు, వ్యాలెట్లతో పాటు 200కు పైగా మొబైల్ అప్లికేషన్లను కొత్త వైరస్ టార్గెట్ చేసుకుంటుందని భద్రతా సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ నెట్‌బ్యాకింగ్ అప్లికేషన్లకు లాక్ ఇన్ చేయగా, బ్యాంక్ అకౌంట్లలో ప్రవేశించినప్పుడు ఈ సోవా మాల్వేర్ డేటాను కాజేస్తుంది. సైబర్ సాక్షరత సమస్యకు పరిహారమని ఐటీ నిపుణుడు వినాయక్ పీఎస్, తెలిపారు. ఇలా జాగ్రత పడాలి : - మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారాలు చేసేవారు తమ అకౌంట్‌ను రెండు దశల్లో ధ్రువీకరణ (ఐడెంటీఫికేషన్) వ్యవస్థ వినియోగించాలి. - బ్యాంకింగ్ యాప్‌లను నిత్యం అప్డేట్ చేయాలి - కచ్చితంగా ఉత్తమమైన యాంటీ వైరస్ మొబైల్ వినియోగించాలి - మొబైల్స్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయరాదు - యాప్‌లు, ఓపెన్, బ్రౌజర్లు నిత్యం అప్డేట్ చేసి అధికారిక యాప్ స్టోర్ నుచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్లును మాత్రమే వినియోగించాలి. - పబ్లిక్ వైఫైను వినియోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. -
రష్యా-ఉక్రెయిన్ డిజిటల్ వార్
మాస్కో/కీవ్: రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్ జఖరోవ్ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్ఫర్ఉక్రెయిన్ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్ ఆటోమేషన్ స్టార్టప్‌ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ యాడ్ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా నుంచి రైల్వేల వరకు... డిజిటల్ ఆర్మీలోని రోమన్ జఖరోవ్ బృందం ‘‘లిబరేటర్’’ అనే టూల్‌ని రూపొందించింది. ఈ టూల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా రష్యా వెబ్సైట్లపై దాడులు చేయవచ్చు. సైబర్ దాడులకు లోనుకాకుండా రష్యా దగ్గర పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మీడియా, బ్యాంకులు, టెలిఫోన్లు, రైల్వేలు చాలా రంగాలకు చెందిన వెబ్సైట్లలో మాల్వేర్ జొప్పించి కొద్ది సేపైనా నిలువరించడంలో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ విజయం సాధిస్తోందని సైబర్ సెక్యూరిటీ అధికారి విక్టర్ జోరా చెప్పారు. మరికొందరు ఐటీ నిపుణులు ఐటీ ఆర్మీ అన్న పేరుతో గ్రూప్‌గా ఏర్పడి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్‌లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూపు ఐటీ రంగంలో నిపుణులైన ఉక్రెయిన్లు ఎక్కడ ఉన్నా తమకు సహకారం అందించాలని పిలుపునిస్తోంది. ఇది సరైన పనేనా? ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో ఇలా ప్రతీ వ్యక్తి సైబర్ యుద్ధానికి దిగడంపై సొంతదేశంలోనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్ సైబర్ సంస్థ రష్యా ఉపగ్రహాలను కూడా అడ్డుకున్నామని ప్రచారం చేస్తోంది. ఉపగ్రహాలపై కూడా కన్నేశామని చెప్పుకోవడం వల్ల ఉక్రెయిన్‌కి మరింత నష్టం జరుగుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలనే టార్గెట్ చేస్తే అంతరిక్ష యుద్ధానికి దారి తీస్తుందని, అదే అసలు సిసలు యుద్ధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తాము ప్రోత్సహించడం లేదని ఉక్రెయిన్ ప్రత్యేక కమ్యూనికేషన్ల సర్వీసులకు చెందిన డిప్యూటీ చైర్మన్ జోరా స్పష్టం చేశారు. యూరప్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్ ఉక్రెయిన్ సైబర్ దాడులతో రైల్వే టికెట్ల బుకింగ్, బ్యాంకింగ్, టెలిఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతూ ఉండడంతో రష్యా కూడా తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు యూరప్ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, గ్రీస్, ఇటలీ, పోలండ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. మానవీయ కోణంలో.. రెండు దేశాల మధ్య ఈ పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు విలన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రష్యా నెటిజన్లు చాలా మంది సామాజిక మాధ్యమాల వేదికగా ఉక్రెయిన్‌కి మద్దతు ప్రకటిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు మతి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ రష్యన్ల నుంచి మద్దతు రావడంతో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ వారి పట్ల మానవీయ కోణంతో స్పందిస్తోంది. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న సైనికులు క్షేమ సమాచారాల్ని రష్యాలో వారి తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించారు. వారి వీడియోలు తీసి ఉంచడం, మరణించిన సైనికులు ఫొటోలు అప్లోడ్ చేయడం, యుద్ధం వద్దంటూ గ్రాఫికల్ డిజైన్స్ సందేశాలు రూపొందించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. -
వామ్మో బ్రాటా.. కొంచెం కొంచెంగా స్మార్ట్‌ఫోన్‌ను కబళిస్తది
Android Users ALERT: స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాంకు లాగిన్ వివరాలను లూటీ చేయడంతో పాటు ఫోన్ సర్వడాటాను కబళించేందుకు మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్వేర్ ‘బ్రాటా’ సిద్ధమైపోయింది. అప్పుడెప్పుడో 2019లో ఈ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ కలకలం సృష్టింంచిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఆర్థిక పురోగతిపై పంజా విసిరిన ఈ మాల్వేర్ ఇప్పుడు మరోసారి ఆండ్రాయిడ్ ఫోన్లపై దాడికి కోరలు చాచింది. గతంలో బ్రెజిల్ కేంద్రంగా బ్రాటాతో లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్ డాటాలను దుండగులు కొల్లగొట్టారు. కాస్పర్ స్కీ గుర్తించి.. అప్రమత్తం చేయడంతో మిగతా యూజర్లు జాగ్రత్తపడ్డారు. ఆ టైంలో మాయమై.. మళ్లీ ఈమధ్యే ప్రత్యక్షమైంది. పోయిన నెల(డిసెంబర్)లో పలువురి బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, ఆపై ఫోన్లలోని డేటా గాయబ్ అయిపోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ అధ్యయనంలో ఈ విషయం తేలింది. బ్రిటన్, పోల్యాండ్, ఇటలీ, స్పెయిన్, చైనాతో పాటు పలు లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో క్లిఫీ స్టడీ మిగతా దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఎలాగంటే.. పుష్ నోటిఫికేషన్లు, గూగుల్ ప్లే, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా ‘బ్రాటా’ మాల్వేర్ ను యూజర్ల ఫోన్లలోకి జొప్పిస్తున్నారు సైబర్ దుండగులు. అయితే డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్ ను యాంటీ వైరస్ లు కూడా అడ్డుకోలేకపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అచ్చం వైరస్ వేరియెంట్లలాగానే ఈ మాల్వేర్ వేరియెంట్లు సైతం స్టార్ట్ఫోన్ను కొంచెం కొంచెం కబళించేస్తుండడం విశేషం. మూడు రకాలుగా.. బ్రాటా.ఏ.. కొన్ని నెలలుగా ఎక్కువగా వ్యాప్తిలో ఉందని, దాంట్లోని జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ తో ఫోన్‌ను ఏకంగా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టే అవకాశం ఉంది. బ్రాటా.బీ.. లోనూ బ్రాటా ఏ టైప్ ఫీచర్లే ఉన్నాయి. కాకపోతే.. మొదటి రకంతో పోలిస్తే మరింత డేంజర్. రకరకాల కోడ్లు, పేజీలతో బ్యాంకుల లాగిన్ వివరాలను బ్రాటా.బీ తస్కరిస్తుంది. బ్రాటా.సీ విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో మాల్వేర్ను జొప్పించడానికి ఉపయోగిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకున్న యాప్(మాల్వేర్ యాప్) ద్వారా.. డాటా అంతా చోరీ చేస్తున్నారు. కాబట్టి దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుర్తించడం ఎలా.. ►ఉన్నట్లుండి ఫోన్ స్లో కావడం, క్రాష్ కావడం, ఎర్రర్ మెసేజ్ అంటూ రిపీట్‌గా చూపించడం. ►రీబూట్(రీస్టార్ట్) లేదంటే షట్ డౌన్ కాకపోవడం ►ఏదైనా యాప్, సాఫ్ట్వేర్ ఎంతకు డిలీట్ కాకపోవడం, ►పాప్ అప్స్, సంబంధంలేని యాడ్స్, పేజీ కంటెంట్‌ను డిస్ట్రర్బ్ చేసే యాడ్స్ ►అధికారిక వెబ్సైట్లలోనూ అవసరమైన యాడ్స్ కనిపిస్తుండడం. ►పోర్న్ వీడియోలకు దూరంగా ఉండడం, అనధికారిక గేమ్స్ జోలికి పోకపోవడం!. ►ప్లేస్టోర్లోనూ అధికారిక యాప్‌లను.. అదీ రేటింగ్, రివ్యూలను చూశాకే డౌన్లోడ్ చేసుకోవడం. -
ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్, పీసీలోని పాస్‌వర్డ్‌లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సేవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్‌టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్‌టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్‌లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. (చదవండి: 50 బిలియన్ డాలర్ల లక్ష్యం..! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!) -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ది డేంజరస్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఐదు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ప్రడియో ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో కన్పించింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించింది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగల్ ప్లే స్టోర్‌పై మరోసారి జోకర్ మాల్వేర్ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ప్రడియో ఒక అలర్ట్ జారీ చేసింది. జోకర్ మాల్వేర్ సుమారు పది యాప్స్‌లో ఉన్నట్లు ప్రడియో గుర్తించింది. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని ప్రడియో పేర్కొంది. ఈ యాప్స్ మీ స్మార్ట్ఫోన్లలో ఉంటే హ్యకర్లు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను క్షణాల్లో ఊడ్చేస్తారని ప్రడియో వెల్లడించింది. జోకర్ మాల్వేర్ డిటెక్ట్ఐనా యాప్స్ ఇవే..! కలర్ మెసేజ్ యాప్ సేఫ్టీ యాప్‌లాక్ కన్వీనియెంట్ స్కానర్ 2, ఎమోజి వాల్‌పేపర్స్ సెపరేట్ డాక్ స్కానర్ ఫింగర్‌టిప్ గేమ్బాక్స్ ఈజీ పీడీఎఫ్ స్కానర్ సూపర్-క్లిక్ వీపీఎన్ యాప్ వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్ ఫ్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ యాప్ చదవండి: టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కలే..! -
'జోకర్' రంగంలోకి దిగింది.. స్క్విడ్ గేమ్ క్రేజ్ మాములుగా లేదుగా..!
‘స్క్విడ్ గేమ్’.90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్‌ను క్యాష్ చేసుకునేందుకు హ్యాకర్స్ మాల్వేర్తో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన గూగుల్ 'ప్లే స్టోర్'లో స్క్విడ్ గేమ్ పేరుతో ఉన్న యాప్స్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మాల్వేర్ ఉన్న ఆ యాప్స్ 5వేల డౌన్ లోడ్లు దాటిన్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు యూజర్లను టార్గెట్ చేసేందుకు జోకర్ రంగంలోకి దిగినట్లు మాల్వేర్ రీసెర్చర్లు గుర్తించారు. 12ఏళ్ల కష్టం దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ 12 ఏళ్ల క్రితం అంటే 2009 లో స్క్విడ్‌గేమ్ పేరుతో స్టోరీ రాసుకున్నారు. కాలం కలిసిరాక, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తెరక్కెక్కేందుకు ఇన్నేళ్లు పట్టింది. అయినా ఈ ఏడాది సెప్టెంబర్ 17న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు ఊహించని విధంగా వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటే డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21.4 మిలియన్ల బడ్జెట్ తో ఈ సిరీస్‌ను తెరకెక్కించగా 900 మిలియన్ల లాభాల్ని గడించింది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ సిరీస్‌ను 142మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ట్విట్టర్ యూజర్ @ReBensk పేరుతో స్క్విడ్ గేమ్ వాల్ పేపర్లుతో ఓ యాప్‌ను డిజైన్ చేశారు. ఆ యాప్‌లో మాల్వేర్ ఉందనే విషయాన్ని తొలిసారి గుర్తించారంటూ ఫోర్బ్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ స్క్విడ్ గేమ్ వాల్ పేపర్ యాప్‌తో ప్రమాదకరమైన యాడ్స్ తో పాటు ఎస్ఎంఎస్లతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేయాలని డిమాండ్ చేసినట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో గుర్తించారు. అంతేకాదు ఈ యాప్స్‌లలో జోకర్ మాల్వేర్ ఇన్ స్టాల్ చేసినట్లు లుకాస్ తెలిపారు. జోకర్ మాల్వేర్ జోకర్ మాల్వేర్..! ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. మొదటిసారి 2017లో గూగుల్‌లో ప్లేస్టోర్లలో యాప్స్‌పై దాడి చేసింది. దీంతో దీన్ని గుర్తించేందుకు గూగుల్‌కే మూడేళ్లు పట్టింది. గుర్తించిన తరువాత సుమారు జోకర్ మాల్వేర్ నిండిన 1800 యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేసింది. తాజాగా స్క్విడ్ గేమ్ పేరుతో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌లలో ఈ జోకర్ మాల్వేర్ ఉన్నట్లు ఈఎస్ఈటీ మాల్వేర్ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో హెచ్చరించారు. చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో.. -
మీ ఫోన్లో ఈ పాపులర్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఇప్పుడు మరోసారి పాపులర్ ఎడిటింగ్ యాప్స్ రూపంలో నెటిజన్లను టార్గెట్ చేశారు. ఇటీవల గూగుల్ ప్రమాదకరమైన 150 యాప్స్‌పై నిషేదం విధించిన తర్వాత తాజాగా మరో మూడు యాప్స్‌ను నిషేదించినట్లు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేదించిన ఈ మూడు యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, డబ్బును దొంగలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. భద్రతా సంస్థ కాస్పర్ స్కై ఈ ప్రమాధకరమైన యాప్స్‌ను గుర్తించింది. వినియోగదారుల సమాచారంతో తస్కరించేందుకు ఫేస్బుక్ లాగిన్ వివరాలు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అనేక వెబ్ సేవలు, యాప్స్ 'లాగిన్ విత్ ఫేస్బుక్' అనే బటన్ ద్వారా వినియోగదారులను త్వరగా ధృవీకరించడానికి వారికి అనుమతిస్తాయి. అయితే, భద్రతా సంస్థ ప్రకారం.. ఈ యాప్స్ లాగిన్ డీటైల్స్ దొంగిలించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి సైన్-ఇన్ డేటాను ఉపయోగిస్తున్నాయి.(చదవండి: అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!) గూగుల్ నిషేదిత యాప్స్ జాబితా గూగుల్ నిషేధించిన యాప్స్ పేర్లు "మ్యాజిక్ ఫోటో ల్యాబ్ - ఫోటో ఎడిటర్", "బ్లెండర్ ఫోటో ఎడిటర్-ఈజీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్", "పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్ 2021". ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి నిషేదించారు. వీటి నుంచి సురక్షితంగా ఉండటం ఎలా.. మొదట మీరు మీ మొబైల్ వీటిని వెంటనే డిలీట్ చేయండి. ఆ తర్వాత మీ ఫేస్బుక్ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకోండి. చాలా మంది ఫోటో ఎడిటింగ్ యాప్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసే ముందు సాధ్యమైనంత వరకు క్రెడెన్షియల్స్ వెరిఫై చేయండి. ఆన్లైన్లో ఒకసారి వీటి గురుంచి నెగెటివ్ వార్తలు ఉన్నాయో లేదో చూడండి.(చదవండి: ‘బిట్‌కాయిన్ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’) -
ఈ 26 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో. అంత కంటే వేగంగా సైబర్ క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వినియోగదారుల నుంచి డబ్బును దొంగిలించే 26 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ నిషేధించినట్లు తెలిపింది. హ్యాకర్లు కంప్యూటర్లలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్ భద్రత సంస్థ ఈ హానికరమైన యాప్స్ కనుగొనే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ జింపెరియం గూగుల్ సంస్థకు ఈ హానికర యాప్స్ గురుంచి పిర్యాదు చేసిన తర్వాత వాటిని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్ లేటర్, బస్ - మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. కానీ, దుర దృష్టవశాత్తు ఈ హానికర ఆండ్రాయిడ్ యాప్స్ గురుంచి వాటిని వాడుతున్న చాలా మందికి తెలియదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది.(చదవండి: సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం మిలియన్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడమే. టాప్ ఇన్ క్రామ్టెడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ 5,00,000 నుంచి 10,00,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న యాప్స్ ను కనీసం 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్(Zimperium zLabs) సెక్యూరిటీ రీసెర్చర్లు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లను గ్రిఫ్ట్ హార్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. హానికరమైన 26 యాప్స్: Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 -
సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!
ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది. మీ మొబైల్/కంప్యూటరుకి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్'తో పోలి ఉంటుంది. "ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి" అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది. ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ఫ్లూబోట్ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) We’ve broken down some details on the FluBot text scam currently infecting Android phones. Please share this with your friends and family and help us stop the spread. https://t.co/zoz8G9o8i0 — CERT NZ (@CERTNZ) October 1, 2021 ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా.. ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం మీ స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్ ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. -
136 యాప్స్‌పై నిషేధం.. అర్జెంట్‌గా డిలీట్ చేయండి
Google Ban 136 Malicious Apps: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు హెచ్చరిక. ప్లేస్టోర్ నుంచి 136 యాప్స్‌ను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్స్ ద్వారా ప్రమాదకరమైన మాల్వేర్ను ప్రయోగించి.. హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా యూజర్లు కొద్దికొద్దిగా డబ్బును పొగొట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూజర్లు అర్జెంట్‌గా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని గూగుల్ సూచించింది. యాప్స్ ద్వారా మాల్వేర్ దాడులతో హ్యాకర్లు తెలివిగా ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా డబ్బును మాయం చేస్తున్నారట. డల్లాస్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘జింపేరియమ్’ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 136 యాప్స్ మీద నిషేధం విధించింది గూగుల్. ఇంకా గూగుల్‌ప్లే స్టోర్ నుంచి తొలగించని ఈ యాప్స్‌ను.. ఫోన్ వాడకందారులే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఒకవేళ యాప్స్ తొలగించినప్పటికీ.. థర్డ్‌పార్టీ యాప్ మార్కెట్ ప్లేస్‌తోనూ నడిచే అవకాశం ఉందని, కాబట్టి యాప్స్‌ను తీసేయాలని గూగుల్ సూచిస్తోంది. బ్యాన్ చేసిన యాప్స్‌లో పాపులర్ యాప్స్ సైతం కొన్ని ఉండడం విశేషం. ఐకేర్-ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్‌లేటర్, జియోస్పాట్: జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, హార్ట్ రేట్ అండ్ పల్స్ ట్రాకర్, హ్యాండీ ట్రాన్స్‌లేటర్ ప్రో లాంటి యాప్స్ సైతం ఉన్నాయి. గ్రిఫ్ట్‌హోర్స్ ఆండ్రాయిడ్ ట్రోజన్ మొబైల్ ప్రీమియం సర్వీస్ ద్వారా దాదాపు కోటి మంది ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారని జింపేరియమ్ జీల్యాబ్ గుర్తించింది. ఫిషింగ్ టెక్నిక్‌లు, గిఫ్ట్‌ల పేరుతో టోకరా, తెలియకుండానే డాటాను తస్కరించడం లాంటి యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే భారీగా చోరీ చేయగా.. ఆండ్రాయిడ్ యూజర్లు కింద పేర్కొన్న యాప్స్ గనుక ఫోన్లలో ఉంటే.. వాటిని తొలగించాలని చెబుతోంది. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 Idle Gun Tycoo\u202an\u202c Scanner App Scan Docs & Notes Chat Translator All Messengers Hunt Contact Icony Horoscope : Fortune Fitness Point Qibla AR Pro Heart Rate and Meal Tracker Mine Easy Translator PhoneControl Block Spam Calls Parallax paper 3D SnapLens – Photo Translator Qibla Pass Direction Caller-x Clap Photo Effect Pro iConnected Tracker Smart Call Recorder Daily Horoscope & Life Palmestry Qibla Compass (Kaaba Locator) Prookie-Cartoon Photo Editor Qibla Ultimate Truck – RoudDrive Offroad GPS Phone Tracker – Family Locator Call Recorder iCall PikCho Editor app Street Cars: pro Racing Cinema Hall: Free HD Movies Live Wallpaper & Background Intelligent Translator Pro Face Analyzer iTranslator_ Text & Voice & Photo Pulse App – Heart Rate Monitor Video & Photo Recovery Manager 2 Быстрые кредиты 24\7 Fitness Trainer ClipBuddy Vector arts Ludo Speak v2.0 Battery Live Wallpaper 4K Heart Rate Pro Health Monitor Locatoria – Find Location GetContacter Photo Lab AR Phone Booster – Battery Saver English Arabic Translator direct VPN Zone – Fast & Easy Proxy 100% Projector for Mobile Phone Forza H Mobile 4 Ultimate Edition Amazing Sticky Slime Simulator ASMR\u200f Clap To Find My Phone Screen Mirroring TV Cast Free Calls WorldWide My Locator Plus iSalam Qibla Compass Language Translator-Easy&Fast WiFi Unlock Password Pro X Pony Video Chat-Live Stream Zodiac : Hand Ludo Game Classic Loca – Find Location Easy TV Show Qibla correct Quran Coran Koran Dating App – Sweet Meet R Circle – Location Finder TagsContact Ela-Salaty: Muslim Prayer Times & Qibla Direction Qibla Compass Soul Scanner – Check Your CIAO – Live Video Chat Plant Camera Identifier Color Call Changer Squishy and Pop it Keyboard: Virtual Projector App Scanner Pro App: PDF Document QR Reader Pro FX Keyboard You Frame Call Record Pro Free Islamic Stickers 2021 QR Code Reader – Barcode Scanner Bag X-Ray 100% Scanner Phone Caller Screen 2021 Translate It – Online App Mobile Things Finder Proof-Caller Phone Search by Clap Second Translate PRO CallerID 3D Camera To Plan Qibla Finder – Qibla Direction Stickers Maker for WhatsApp Qibla direction watch (compass) Piano Bot Easy Lessons CallHelp: Second Phone Number FastPulse – Heart Rate Monitor Caller ID & Spam Blocker Free Coupons 2021 KFC Saudi – Get free delivery and 50% off coupons Skycoach HOO Live – Meet and Chat Easy Bass Booster Coupons & Gifts: InstaShop FindContact Launcher iOS for Android Call Blocker-Spam Call Blocker Call Blocker-Spam Call Blocker Live Mobile Number Tracker చదవండి: వాట్సాప్‌లో రూపాయి సింబల్ ఫీచర్.. ఇందుకోసమేనంట! -
అలర్ట్: ప్రమాదంలో 70 దేశాల ఆండ్రాయిడ్ యూజర్లు
ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల్లో 10మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. సైబర్ నేరస్తులు 'గిఫ్ట్ హార్స్' అనే మాల్వేర్ సాయంతో సైబర్ నేరస్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 70దేశాలకు చెందిన ఆండ్రాయిడ్ యూజర్స్ అకౌంట్లలో నుంచి ఉన్న మనీని కాజేసేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జింపేరియం హెచ్చరికలు జారీ చేసింది.ఇదే విషయం తమ రీసెర్చ్‌లో వెలుగులోకి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.సైబర్ నేరస్తులు పక్కా ప్లాన్‌తో గూగుల్ ప్లే స్టోర్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా(ఫిష్షీ) లింక్స్ పంపి యూజర్ల ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్లను తస్కరిస్తారు. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 డబ్బుల్ని ఎలా దొంగిలిస్తారు? సైబర్ నేరస్తులు ముందుగా లోకల్ లాంగ్వేజ్‌లో యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాడ్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు సెండ్ చేస్తారు. ఆ యాడ్స్ లో ఉన్న లిక్ క్లిక్ చేస్తారో వారికి కళ్లు చెదిరే బహుమతులు అందిస్తామని ఊరిస్తారు. ఆ ఆఫర్లకు అట్రాక్ట్ అయిన యూజర్లు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీరు సెలక్ట్ చేసుకున్న గిఫ్ట్ మీకు కావాలనుకుంటే ఫోన్‌నెంబర్‌తో పాటు మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ పంపిస్తారు. వ్యక్తిగత వివరాల్ని యాడ్ చేసే సమయంలో ఐపీ అడ్రస్ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారు. అంతేకాదు తాము అందించే భారీ గిఫ్ట్‌లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో యూజర్ నుంచి ప్రతి నెలా రూ.3100లు వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జెడ్‌ల్యాబ్స్ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడి' అని అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి: ఆన్లైన్లో గేమ్స్ ఆడేవారిపై సైబర్ నేరస్తుల దాడులు..! -
గుడ్ న్యూస్: ఇకపై ఫొటోలు, వీడియోల 'లీకు'ల బెడద తప్పనుంది
ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు భద్రంగా ఉంటాయా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సైబర్ నేరస్తులు మాల్ వేర్ సాయంతో ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను లీక్ చేస్తున్నారు.డార్క్ వెబ్‌లో అసాంఘిక కార్యకలపాల కోసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ బాధ మీకు తొలగనుంది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ వినయోగదారులకు లీకుల బెడద తప్పనుంది. తొలుత 'గూగుల్ ఫిక్సెల్' వినియోగదారుల కోసం ఫొటో, వీడియో ఫోల్డర్‌కి లాక్ వేసే ఫీచర్ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి గూగుల్ ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ ఏడాది జూన్‌లో గూగుల్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే ఆ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేసి త్వరలో విడుదల చేయనుందని టెక్ న్యూస్ వెబ్సైట్ 'ది వెర్జ్' ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం..గూగుల్ ఫిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 యూజర్లు తమ ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండేందుకు లాక్ పెట్టుకోవచ్చు.గూగుల్ ఫోటోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సాయంతో పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లాక్ ఫీచర్‌ను వినియోగిస్తే ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్లో ఉన్న ఫొటోల్ని, వీడియోల డేటాను సేకరించ లేవు. ఆ యాప్స్‌కు చిక్కకుండా ఈ లాక్ ఫీచర్ వాటిని హైడ్ చేస్తుంది. వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా ఫోన్లో ఉన్న ఫొటోల్ని బ్యాకప్ తీసుకోవడానికి లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్' నుంచి వచ్చే నోటిఫికేషన్‌తో ఫోల్డర్‌కి లాక్ చేయడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్ -
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్తగా దాడులు చేస్తున్న మాల్వేర్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తూ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్'ను డ్రినిక్ అనే పేరుతో పిలుస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం దీనిని ఎస్ఎంఎస్ దొంగిలించడానికి ఉపయోగించేవారు. అయితే, ఇటీవల బ్యాంకు వినియోగదారుల సమాచారాన్ని దొంగలించేలా హ్యాకర్లు 'డ్రినిక్ మాల్వేర్'ను అభివృద్ధి చేశారు. సున్నితమైన బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి దీనిని తయారు చేశారు. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో సహా 27కి పైగా భారతీయ బ్యాంకుల వినియోగదారులను ఇప్పటికే ఈ మాల్వేర్ ఉపయోగించి దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ తెలిపింది. ఒక్కసారి దాడి జరిగితే ఖాతాదారుల సున్నితమైన డేటా, గోప్యత, భద్రతను గట్టిగా దెబ్బతీస్తాయని, అలాగే పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు అవకాశం ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది.(చదవండి: నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్!) ఈ కొత్త మాల్వేర్ ఎలా పనిచేస్తుంది? బాధితుడు ఫిషింగ్ వెబ్సైట్ లింక్ కలిగి ఉన్న ఎస్ఎమ్ఎస్(ఆదాయపు పన్ను శాఖ, భారత ప్రభుత్వ వెబ్సైట్ పేరుతో) అందుకుంటారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తి చేయడం కోసం వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి, హానికరమైన ఎపికె(APK) ఫైలును డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయాలని కోరుతారు. ఈ హానికరమైన ఆండ్రాయిడ్ యాప్ ఆదాయపు పన్ను శాఖ/ ఇతర ప్రభుత్వ యాప్ పేరుతో ఉండవచ్చు. ఒకవేల ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఎమ్ఎస్, కాల్ లాగ్, కాంటాక్ట్ మొదలైన అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని యాప్ యూజర్ ని కోరుతుంది.(చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!) ఒకవేళ యూజర్ వెబ్సైట్లో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోయిన, అనుమతులు ఇవ్వకపోయిన మీరు ముందుకు కొనసాగలేరు. ముందుకు సాగడం కోసం యూజర్ ని వివరాలు, అనుమతులు ఇవ్వాలని కోరుతుంది. ఆ తర్వాత డేటాలో పూర్తి పేరు, పాన్, ఆధార్ నెంబరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ చిరునామా, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్, సీఐఎఫ్ నెంబరు, డెబిట్ కార్డు నెంబరు, గడువు తేదీ, సీవీవీ, పిన్ వంటి ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ వివరాలను యూజర్ నమోదు చేసిన తర్వాత యూజర్ బ్యాంక్ ఖాతాకు రీఫండ్ చేసిన డబ్బు మొత్తం బ్యాంకు ఖాతాలో జమాచేయలా? అని అప్లికేషన్ పేర్కొంటుంది. వినియోగదారుడు గనుక అమౌంట్ లోనికి ప్రవేశించి "బదిలీ(Transfer)" క్లిక్ చేసినప్పుడు, అప్లికేషన్ ఒక నకిలీ అప్ డేట్ స్క్రీన్ ప్రదర్శిస్తుంది. కాబట్టి, బ్యాంక్ ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫేక్ ఎస్ఎమ్ఎస్, కాల్స్, యాప్స్, వెబ్సైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిస్తుంది. ఏదైన అప్లికేషన్ ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఎవరైనా లేదా ఎక్కడైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం కానీ, నమోదు చేయడం కానీ చేయవద్దు నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ఎప్పుడు మీ ఆర్ధిక వివరాలు ఆడగవని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! కొత్తగా..
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి ప్లైట్రాప్ అనే ట్రోజాన్(పలు సైట్ల నకిలీ రూపం) ఫేస్బుక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రోజన్ వల్ల ఇప్పటివరకు భారత్‌తో కలిపి 144 దేశాలలో పదివేల మంది ఆండ్రాయిడ్ యూజర్లను ప్రభావితం చేసినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం వెల్లడించింది. దీనిని వియత్నాంకు చెందిన సైబర్‌నేరగాళ్లు రూపోందించనట్లుగా తెలుస్తోంది. ఈ ట్రోజన్ ఈ ఏడాది మార్చి నుంచే ఆండ్రాయిడ్ యూజర్లపై దాడి చేస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. ఈ ట్రోజన్ ఏం చేస్తుందటే..! నెట్‌ఫ్లిక్స్, గూగుల్ యాడ్స్‌కు సంబంధించిన యాప్‌ల కూపన్ కోడ్లను ఫ్లైట్రాప్ ట్రోజన్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఎరగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూపన్ కోడ్లకోసం ఇచ్చిన లింక్‌లను ఓపెన్ చేయగానే యూజర్ల ఫేస్బుక్ ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని జింపెరియం తన పరిశోధనలో వెల్లడించింది. ఒకసారి యూజర్ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రోజన్ చేరితే ఫేస్బుక్ ఖాతాల ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఐడీ, లోకేషన్, ఈ-మెయిల్, ఐపీ అడ్రస్‌లను హాకర్లు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోటో కర్టసీ: జింపెరియం ఎలా వస్తాయంటే...! ఫ్లైట్రాప్ ట్రోజన్ గూగుల్ ప్లే స్టోర్‌లోని పలు యాప్‌ల ద్వారా, ఇతర థర్డ్‌పార్టీ యాప్స్ ద్వారా యూజర్ల స్మార్ట్ఫోన్లలోకి హ్యాకర్లు చొప్పిస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. గూగుల్ ఇప్పటికే హానికరమైన యాప్‌లను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఇతర థర్డ్‌పార్టీ యాప్స్ ద్వారా ఈ ట్రోజన్లు ఫోన్లలోకి వచ్చే అవకాశం ఉందని జింపెరియం హెచ్చరించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఫోన్లనుంచి వెంటనే తీసివేయాలని ఆండ్రాయిడ్ యూజర్లకు జింపెరియం సూచించింది. -
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
పెగాసస్ హ్యాకింగ్‌పై స్పందించిన వాట్సాప్ చీఫ్..!
ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ ‘పెగాసస్’ స్పైవేర్‌తో ప్రముఖ జర్నలిస్టులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షనేతలు, మరి కొందరిపై సైబర్‌దాడి జరిగినట్లు వస్తోన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ హ్యాకింగ్‌పై భారత ప్రభుత్వం తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా ప్రముఖుల డేటా హ్యాక్ అయ్యిందని వస్తోన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. భయంకరమైన మానవ హాక్కుల ఉల్లంఘనే...! వాట్సాప్ హెడ్ విల్ కాత్‌కార్ట్ పెగాసస్ మాల్వేర్ హ్యాకింగ్‌పై తీవ్రంగా దుయ్యబట్టారు. గ్లోబల్ మీడియా కన్సార్టియం నిర్వహించిన దర్యాప్తులో ఎన్ఎస్వో పెగాసస్ మాల్వేర్తో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టుల గూఢాచర్యంపై వాట్సాప్ హెడ్ విల్ కాత్‌కార్ట్ స్పందించారు. ఎన్ఎస్వో పెగాసస్ మాల్వేర్తో భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ స్పైవేర్‌ను వెంటనే నిర్విర్యం చేయాలని తెలిపారు. స్పైవేర్‌ను వాడుతున్న 50 దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎన్ఎస్వో గ్రూప్‌కు చెందిన పెగాసస్ మాల్వేర్ యూజర్ల ప్రైవసీను దెబ్బతీస్తుందని వాట్సాప్ 2019లో దావాను దాఖలు చేసింది. యూజర్ల భద్రతను పెంచడానికి, పెగసాస్ స్పైవేర్‌ను దుర్వినియోగం చేసే సంస్థలను జవాబుదారీగా ఉంచడానికి మానవ హక్కుల రక్షకులు, టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని వాట్సాప్ హెడ్ క్యాత్‌కార్ట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన చర్య ఇంటర్నెట్‌యుగంలో యూజర్ల భద్రత కోసం ఆయా కంపెనీలకు మేల్కొలుపు కాల్ అని క్యాత్‌కార్ట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ పౌరుల జీవితాల్లో మొబైల్ అనేది ప్రాథమిక కంప్యూటర్‌గా ఎదిగింది. వీలైనంతగా యూజర్ల డేటా సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వాలు, కంపెనీలపై ఉందని పేర్కొన్నారు. Human rights defenders, tech companies and governments must work together to increase security and hold the abusers of spyware accountable. Microsoft was bold in their actions last week https://t.co/dbRgdfTIcA — Will Cathcart (@wcathcart) July 18, 2021 -
ఈ 10 యాప్‌లు మీ ఫోన్లో ఉన్నాయా? వెంటనే అలర్ట్ అవ్వండి
నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్ లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ సందేశాలకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ఇలా అనేక పనులు చేస్తుంటాం. కానీ, మీరు వాడే యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయని మీకు తెలుసా?. తాజాగా 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగలించినట్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ వెల్లడించింది. వీటిలో తొమ్మిది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయని, వాటి గురుంచి నివేదించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు డాక్టర్ వెబ్ తెలిపింది. ఈ యాప్స్ ని చాలా వరకు 1,00,000 మందికి పైగా ఇన్స్టాల్ చేసుకొన్నారు. మరొక దాన్ని 5 మిలియన్ మంది ఇన్ స్టాల్ చేశారు. డాక్టర్ వెబ్ నివేదిక ప్రకారం, ఫోటో ఎడిటింగ్ యాప్స్, పీఐపీ ఫోటో యాప్స్ ను 5 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో వరుసగా App Lock Keep, App Lock Manager, Lockit Master యాప్స్ ఉన్నాయి. ఈ జాబితాలో మెమొరీ క్లీనర్, ఫిట్ నెస్ యాప్, రెండు హొరోస్కోప్ యాప్స్ కూడా ఉన్నాయి. వీటిని చాలా సార్లు ప్రజలు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. Rubbish Cleaner, Inkwell Fitness, Horoscope Daily, HscopeDaily అనే వాటిని 1,00,000 మంది డౌన్లోడ్ చేశారు. "ఈ స్టీలర్ ట్రోజన్ల యాప్స్ ను విశ్లేషించే సమయంలో ఎడిటర్ ఫోటోపిప్ అనే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన తర్వాత కూడా ఇప్పటికీ సాఫ్ట్ వేర్ అగ్రిగేటర్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది" అని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. చాలా మాల్వేర్ యాప్స్ లాగా కాకుండా ఇన్-యాప్ ప్రకటనలను నిలిపివేయడానికి, కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవడానికి వారి ఫేస్బుక్ ఖాతాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. వినియోగదారుల ఎంటర్ చేసిన లాగిన్ వివరాలను వారు దొంగలిస్తారు. డాక్టర్ వెబ్ తన బ్లాగ్ పోస్టులో చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం యూజర్ల డేటాను దొంగలించి ఉండవచ్చు అని తెలిపింది. చదవండి: కొత్త బైక్ కొనేవారికి టీవీఎస్ మోటార్ గుడ్‌న్యూస్! -
Joker Malware Android: జోకర్ మళ్లొచ్చాడు.. తస్మాత్ జాగ్రత్త!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఖతర్నాక్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. ముంబై: జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించుకుంది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్ మాల్వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం. ఏం చేయాలంటే.. యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్ యాక్సెస్ పర్మిషన్ను తొలగించాలి. అవసరం లేని సర్వీసులు, సబ్స్క్రిప్షన్ల నుంచి బయటకు వచ్చేయాలి. ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్లో దాచిపెట్టుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం. అనవసరమైన యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకపోవడం. రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం. యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవడం. 2020లో 11 ‘జోకర్’ అనుమానిత యాప్స్‌ను ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 22కి పైనే ఉంది. మొండి జోకర్ జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త!
కరోనా మహమ్మారి కాలంలో సైబర్ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేస్తే ఇప్పుడు ఏకంగా గూగుల్ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాల కోసం వాడుకుంటున్నారు. గూగుల్ క్రోమ్ యాప్ లాంటి ఒక కొత్త నకిలీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ ను సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మొబైల్స్ కి మాల్వేర్ సోకినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రెడియో పరిశోధకులు తెలిపారు. స్మిషింగ్ ట్రోజాన్ ను నకిలీ గూగుల్ క్రోమ్ ద్వారా ఫోన్లోకి పంపించి మొబైల్‌నే ఏకంగా మాల్వేర్ సూపర్ స్ప్రెడర్గా మార్చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ అనేది మొబైల్ పై దాడి చేయడంలో ఒక భాగం మాత్రమే. ఈ నకిలీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీ క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగలించడంతో పాటు ఇతరులకు మెసేజ్‌ల ద్వారా స్పామ్, ఫిషింగ్ లింక్‌లను పంపించి మొబైల్స్‌ను హ్యాక్ చేయడానికి వెక్టర్‌గా ఉపయోగిస్తుంది. గత వారాల్లో లక్షలాది మంది దీని భారీనా పడినట్లు అంచనా వేస్తున్నాము అని ప్రెడియో పరిశోధకులు తమ వెబ్‌సైట్‌లోని ‘సెక్యూరిటీ అలర్ట్ ’పోస్ట్‌లో చెప్పారు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ మీ ఫోన్లోకి ఎలా ప్రవేశిస్తుంది? మీకు విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్డేట్ తర్వాత మీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు చెల్లించాలి అని పేర్కొంటుంది. మీరు కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే మీ వివరాలన్నీ సైబర్ క్రైమినల్ చేతికి చిక్కుతాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీన్నే స్మిషింగ్ ట్రోజాన్ అంటున్నారు. మీ ఫోన్ మాల్వేర్ ‘సూపర్ స్ప్రెడర్’ గా ఎలా మారుతుంది? ఇది ఇక్కడితో ఆగదు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ బాధితుడి ఫోన్లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత. బాధితుల మొబైల్ నుంచి వారానికి 2000 కంటే ఎక్కువ మెసేజ్ లను, ప్రతిరోజూ 2 లేదా 3 గంటలలో ఒకరినొకరు అనుసరిస్తున్నట్లు అనిపించే యాదృచ్ఛిక ఫోన్ నంబర్లకు పంపుతుంది. ఇలా ఒకరి మొబైల్ నుంచి మరొక మొబైల్ కి పంపించి దాడి చేస్తారు. ఈ నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ చూడటానికి అధికారిక క్రోమ్ యాప్ లాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యాప్ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి నిజమైనది కానిది గుర్తుపట్టొచ్చు. మొబైల్లోని యాంటీ వైరస్లు సైతం దీన్ని గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ ఫేక్ గూగుల్ క్రోమ్ యాప్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి, పరిశోధకులు రెండు నకిలీ క్రోమ్ యాప్ లు కనుగొన్నారు. ఇలాంటి సైబర్ నెరగాళ్ల చేతిలో చిక్కుకుండా ఉండటానికి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోవడం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడ కూడా డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయవద్దు అని సూచిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు ఎల్లప్పడు అధికారిక గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలని కోరారు. చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! -
అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్శిల్ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్ తెలియాలంటే ఈ లింకును క్లిక్ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మీ ఫోన్‌కు సందేశం వచ్చిందనుకోండి. నిజంగా పార్శిల్ రావాల్సిన వాళ్లు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి.. ఆర్డర్లు ఇవ్వని వాళ్లు పార్శిల్ ఏంటనే ఉత్సుకతతో లింకును ఓపెన్ చేస్తారు. సైబర్ నేరగాళ్లు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ’ఫ్లూబోట్’ మాల్వేర్ను ఆండ్రాయిడ్ ఫోన్ల పైకి వదులుతున్నారు. ఇప్పటికే లండన్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్‌లో అనేక మంది దీని బారినపడ్డారని, భారత్‌కూ ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై లండన్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్సీఎస్సీ) అలర్ట్ జారీ చేసింది. ఆన్‌లైన్‌కు డిమాండ్ పెరగడంతో.. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక మంది నేరుగా షాపింగ్ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆన్లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. దేశీయ వెబ్ సైట్లు, యాప్‌లతో పాటు విదేశాలకు చెందిన వాటిల్లోనూ ఖరీదు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అనేక అంతర్జాతీయ విమానాలు, కంటైనర్లను తీసుకొచ్చే కార్గో లైనర్లు రద్దయ్యాయి. ఈ కారణంగా అంతర్జాతీయ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు కొరియర్ సంస్థల పేరుతో డెలివరీ ట్రాకింగ్ అంటూ ఫ్లూబోట్ మాల్వేర్ను పంపిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఆ సందేశంలో వచ్చిన లింకును క్లిక్ చేసిన మరుక్షణం ఆ మాల్వేర్ ఫోన్లో నిక్షిప్తమైపోతుంది. ఈ మెసేజీలను సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ల ద్వారా బల్క్ విధానంలో పంపిస్తారు. ఫలితంగా వాళ్లు ఎక్కడ నుంచి పంపారు.. ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం సాధ్యపడదు. అన్ని పాస్వర్డ్స్ వారి అధీనంలోకి.. ఇటీవల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్.. ఇలా ప్రతి ఒక్కటీ ఫోన్ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ-మెయిల్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాలను మొబైల్ లోనే వాడుతున్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్‌కు పిన్, పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేషియల్ విధానాల్లో లాక్‌లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో నిక్షిప్తమై ఉండే ఫ్లూబోట్ వైరస్ ఈ పాస్‌వర్డ్స్‌ను సంగ్రహిస్తుంది. ఆ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి అందిస్తుంది. దీన్ని దుండగులు దుర్వినియోగం చేస్తుండటంతో వ్యక్తిగత డేటాతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తోంది. ఒకసారి ఫోన్లోకి ప్రవేశించిన ఫ్లూబోట్ అంత తేలిగ్గా పోదని, ఇది ఫోన్లో నిక్షిప్తమైనట్లు గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఫార్మాట్ చేస్తేనే వైరస్ తొలుగుతుంది. అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు.. వివిధ రకాలైన వైరస్లు, మాల్వేర్స్ను సైబర్ నేరగాళ్లు లింకులు, ఆకర్షణీయమైన ఫొటోల రూపంలో పంపిస్తారు. ఆయా వ్యక్తుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు, ఉత్సుకత కలిగించేలా తయారు చేసిన సందేశాలు, ఫొటోల లింకుల్లో మాల్వేర్ను నిక్షిప్తం చేస్తారు. సైబర్ నేరగాళ్లు కొన్ని రకాలైన వైరస్‌లను ఫోన్లను హ్యాక్ చేసి లబ్ధి పొందడానికి వినియోగిస్తారు. మరికొన్నింటిని తమ ఉనికి చాటుకోవడానికి, ఏజెన్సీలకు సవాళ్లు విసరడానికి, వినియోగదారుల ఫోన్లు క్రాష్ చేయడానికి ప్రయోగిస్తారు. వీటిలో ఏ తరహా మాల్వేర్తో అయినా సాధారణ ప్రజలకు ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్లు, సందేశాలతో వచ్చే లింకులను క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. - సైబర్ క్రైం నిపుణులు -
ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి!
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. వీరు తమ ఒక్కరూ తమ అవసరాల కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసే యాప్స్‌లో ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయో, యూజర్లకు హాని చేసేవి కూడా అన్నే ఉన్నాయి. వాటినే మాల్వేర్, యాడ్వేర్ యాప్స్ అంటారు. ఇలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ తొలగిస్తుంది. అలాగే, ప్రైవేట్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు కూడా మాల్వేర్ యాప్స్ లిస్ట్ రిలీజ్ చేస్తుంటాయి. వాటిని కూడా గూగుల్ తొలగిస్తూ ఉంటుంది. తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ మాల్వేర్ ఉన్న 8 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించి వాటి జాబితాను విడుదల చేసింది. ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్సులా ప్రాంతాలకు చెందిన యూజర్స్‌ని ఎక్కువగా ఈ యాప్స్ టార్గెట్ చేసినట్టు తెలిపింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ యాప్ లను 7,00,00 కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోటో ఎడిటర్స్, వాల్‌పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్, కెమెరా యాప్స్ పేరుతో ఇవి యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. మొదట గూగుల్ పరిశోదన సమయంలో వీరు మొదట క్లీన్ వర్షన్‌ని గూగుల్ ప్లే స్టోర్‌కు సమర్పించి, ఆ తర్వాత అప్డేట్స్ రూపంలో మాల్వేర్ ప్రవేశపెట్టినట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ను వెంటనే డిలీట్ చేసుకోవాలని మెకాఫీ సూచిస్తుంది. మాల్వేర్ యాప్స్: com.studio.keypaper2021 com.pip.editor.digital camera org.my.favorites.up.keypaper com.tremendous.coloration.hairdryer com.ce1ab3.app.picture.editor com.hit.digital camera.pip com.daynight.keyboard.wallpaper Com.tremendous.star.ringtones చదవండి: Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ -
భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. -
కరెంట్‌కూ సైబర్ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యవస్థకూ సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్రం సూచనలివీ... ► విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రొజన్స్/సైబర్ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ► కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. ► చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ► ఈ దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో ఏవైనా పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటిని సర్టిఫైడ్ ల్యాబ్‌లలో పరీక్షించాలి. ► విదేశాల నుంచి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నా, ఇతర వస్తువుల తయారీ/అసెంబ్లింగ్‌కు వాటిని వినియోగించినా, విద్యుత్ సరఫరా వ్యవస్థలో వాడినా ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలి. ► కేంద్ర జాబితాలోని దేశాల నుంచి గత జూలై 7కి ముందు విద్యుత్ పరికరాలు, విడిభాగాల దిగుమతి కోసం వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే ఆ పరికరాలు వచి్చన వెంటనే పరీక్షలు నిర్వహించాలి. ► విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై ఈ పరికరాలు సైబర్ భద్రతతోపాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ముప్పు కలిగించే అవకాశం లేదని ధ్రువీకరించుకోవాలి. చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుంచి దిగుమతులపై నియంత్రణ విధించింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ల తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతి నిలిచిపోయి రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కొరత ఏర్పడింది. రైతులతోపాటు కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయలేక డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల, గ్రిడ్ నిర్వహణ ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కం ప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుం టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ఏవైనా మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి వ్యవస్థలను ముష్కరులు హైజాక్ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రించే అవకాశాలుంటాయి. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వ్యూహాత్మకమైన దేశ భద్రతావ్యవస్థలు పనిచేయకుండా హైజాకర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. -
హ్యాకర్ల ఆటలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి, వాస్తవానికి మధ్య అంతరం దాదాపుగా చెరిగిపోయింది. ఐటీ ఉద్యోగాలు ఇళ్లకు చేరిపోవడం, పాఠశాలలు నట్టింట్లోకి వచ్చేయడం, కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తరచూ కొనేస్తుండటంతో మనకొచ్చిన సౌలభ్యమేమిటో తెలియదు గానీ.. సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది.. ఈ కోవిడ్ కాలంలోనూ హ్యాకర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ భద్రతపై ఇకనైనా కాసింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ పేరుతో సిద్ధం చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. కోవిడ్ మహమ్మారి కాలంలో హ్యాకర్లు కంపెనీల నెట్‌వర్క్‌లలోకి చొరబడటం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎక్కువైంది. నార్టన్ లైఫ్‌లాక్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్స్ 2019 నివేదిక ప్రకారం.. భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 39 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు తస్కరణ బారినపడ్డారు. మాల్వేర్ల సాయంతో కంప్యూటర్లపై పట్టు సాధించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడం సాధారణమైపోతోంది. ఈ సమాచారాన్ని బ్రోకర్లకు అమ్ముకుని హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు..సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ క్లుప్తంగా వీపీఎన్ చాలా ముఖ్యమని డిజిటల్ వెల్బీయింగ్ 2020 సర్వే ద్వారా స్పష్టమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కంపెనీతో సురక్షిత పద్ధతిలో కనెక్టయ్యేందుకు వీపీఎన్ ఉపయోగపడుతుంది. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేయడం వల్ల హ్యాకర్ల పప్పులు ఉడకవు. వైర్లెస్ ఫిడిలిటీ లేదా వైఫై కనెక్షన్‌కూ భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడటం తక్కువవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ సర్వే తెలిపింది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ కోసం సర్వే చేసిన వారిలో 24 శాతం మంది పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నట్లు తెలపడం ఇక్కడ గమనించదగ్గ విషయం..లాక్డౌన్ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని దొంగిలించడం ఎక్కువైందని తేలింది. డార్క్‌వెబ్‌లో నిక్షిప్తమయ్యే ఈ సమాచారాన్ని తొలగించడం అంత సులువు కాదు. అందువల్లనే ఆన్లైన్లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్' మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే.. 'జోకర్' మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్' బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్) ఇప్పటికే లక్షా 20 వేల డౌన్లోడ్స్ ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్ పరీక్షించింది. 17 యాప్స్ భారీగా ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల గూగుల్ గుర్తించిన 17 ఇన్ఫెక్టెడ్ యాప్స్ ఇవే.. One Sentence Translator - Multifunctional Translator Style Photo Collage Meticulous Scanner Desire Translate Talent Photo Editor - Blur focus Care Message Part Message Paper Doc Scanner Blue Scanner Hummingbird PDF Converter - Photo to PDF All Good PDF Scanner Mint Leaf Message-Your Private Message Unique Keyboard - Fancy Fonts & Free Emoticons Tangram App Lock Direct Messenger Private SMS -
ఎన్ఐసీపై సైబర్ దాడి
న్యూఢిల్లీ: కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు చెందిన కంప్యూటర్లపై మాల్వేర్ దాడి జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్ఐసీ ప్రధాన విధుల్లో ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ –గవర్నెన్స్‌లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఐసీకి చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై ఈ సైబర్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి, ఎన్ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్లోకి మాల్వేర్ చొరబడింది’ అని శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఆ ఉద్యోగి తన పర్సనల్ ఈ మెయిల్‌ను ఉపయోగించలేకపోయాడని, ఆ తరువాత పలువురు ఇతర ఉద్యోగులకు ఇదే సమస్య ఎదురైందని వివరించారు. అయితే, ఆ మాల్వేర్ దాడి వల్ల ఎలాంటి సమాచార నష్టం జరగలేదని ఎన్ఐసీ తెలిపిందన్నారు. ‘ఎన్ఐసీ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ తొలి వారంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. ఆ బగ్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించాం. ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేం’ అని ఆయన వివరించారు. అయితే, బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. నిజానికి అమెరికా నుంచి ప్రాక్సీ సర్వర్ ద్వారా ఆ మాల్వేర్ ఈమెయిల్ బెంగళూరులోని ఆ ఐటీ సంస్థకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఢల్లీ పోలీసు విభాగం అదనపు పీఆర్ఓ అనిల్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు తమ కంప్యూటర్లపై దాడికి ప్రయత్నించినట్లు ఎన్ఐసీ గుర్తించింది. సైబర్ ప్రపంచంలో ఇది సాధారణంగా, తరచుగా చోటు చేసుకునే విషయమే. ఈ దాడిని తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా ఎన్ఐసీ గుర్తించి, తదనుగుణంగా సమాచార భద్రతకు చర్యలు తీసుకుంది’ అని మిట్టల్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ చేసి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ చీఫ్ సహా అత్యంత ప్రముఖుల డేటాను దొంగలించారని, ఇందులో చైనా సంస్థ హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఐసీ కంప్యూటర్లపై దాడి ఆందోళనకరంగా మారింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ’క్లుప్తంగా సెర్ట్.ఇన్ హెచ్చరించింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్ డ్రాయర్ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్అప్డేట్ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్వేర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
వాట్సాప్ హ్యాకింగ్.. వెలుగులోకి సంచలన అంశాలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సంస్థ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేశారని, ఇందుకుగాను ఇజ్రాయెల్ కంపెనీ ప్రభుత్వ గూఢచారులకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌కు సమాధానమిస్తూ వాట్సాప్ ఈ విస్మయ పరిచే విషయాలను వెల్లడించింది. ఇలా వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ గురైన వ్యక్తులు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, సరిగ్గా ఎంతమంది వాట్సాప్ ఖాతాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలను వాట్సాప్ వెల్లడించలేదు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, దళిత, మానవ హక్కుల కార్యకర్తలు ఇలా కనీసం 24మందికిపైగా వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో రెండువారాలపాటు వారి వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, ఈ విషయాన్ని స్పెషల్ మెసెజ్ ద్వారా హాకింగ్ బారిన పడిన వ్యక్తులకు తెలియజేశామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘2019 మే నెలలో అత్యంత పటిష్టమైన సైబర్ అటాక్‌ను మేం అడ్డుకున్నాం. మా వీడియో కాలింగ్ సిస్టంలోకి చొరబడి.. పలువురు వాట్సాప్ యూజర్ల మొబైల్ డివైజ్‌ల్లోకి మాల్వేర్ను పంపేందుకు ఈ అటాక్ ప్రయత్నించింది. ఈ దాడి జరిగిన యూజర్ వీడియో కాల్‌ను ఎత్తకపోయినా.. ఇది మొబైల్‌లోకి చొరబడుతుంది. మేం వెంటనే కొత్త ప్రొటెక్షన్స్ యాడ్ చేసి వాట్సాప్ నూతన అప్డేట్ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల ఖాతాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. నేరుగా ఈ సైబర్ అటాక్ బారిన పడినట్టు భావిస్తున్న దాదాపు 1400మంది యూజర్లకు ప్రత్యేక వాట్సాప్ మెసెజ్ ద్వారా సమాచారమిచ్చాం’ అని ఫేస్బుక్ తెలిపింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తల వాట్సాప్ ఖాతాలపై ప్రభుత్వం గూఢచర్యం నెరిపినట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రైవసీ హక్కుల పట్ల బీజేపీ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
వాట్సాప్ యూకర్లకు షాకింగ్ న్యూస్
-
వాట్సాప్‌లో భద్రత ఉత్తదే!
సాక్షి, అమరావతి: వాట్సాప్ వాడకం అత్యంత భద్రమైనదని, ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ వల్ల వినియోగదారుల డేటాను తస్కరించడం కానీ కాల్స్‌ను ట్యాప్ చేయడం కానీ సాధ్యం కాదనే మాటల్లో వాస్తవం లేదని వెల్లడైంది. తమ మెసేజింగ్ యాప్ వైరస్ బారిన పడినట్లు వాట్సాప్ యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుతం లోపాలను సవరించామని, అయితే వాట్సాప్ వినియోగదారులు వెంటనే తమ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరింది. నిఘా పరికరాలుగా ఫోన్ కెమెరాలు మిస్డ్ వాయిస్ కాల్స్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలోకి వైరస్ చొరబడేలా ఓ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. వాట్సాప్ వినియోగదారుడు వాయిస్ కాల్‌ను లిఫ్ట్ చేయకపోయినా కూడా వైరస్ ఫోన్ లోపలికి ప్రవేశించేలా ఈ మాల్వేర్ను రూపొందించారు. ఒకసారి ఈ వైరస్ మొబైల్‌లోకి ప్రవేశిస్తే స్పైవేర్ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడంతోపాటు ఫోన్ కెమెరాలను నియంత్రించి నిఘా పరికరాలుగా మార్చేసి వాయిస్, వీడియో కాల్‌ను ట్యాప్ చేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే అడ్వాన్స్డ్ సైబర్ యాక్టర్ దీన్ని రూపొందించింది. లోపాలను సవరించినట్లు ప్రకటన ఇజ్రాయిల్ ప్రభుత్వం మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు లాంటి వారిపై నిఘా పెట్టాలనుకున్నప్పుడు ఎన్ఎస్వో సంస్థ ఇలాంటి పోగ్రాంలను సిద్ధం చేస్తుంది. ఇలా రూపొందించిన స్పైవేర్‌ను ఎంపిక చేసిన తమ వినియోగదారుల ఫోన్లలో ప్రవేశపెట్టినట్లు వాట్సప్ సంస్థే అంగీకరించింది. వాట్సప్ వాయిస్ కాలింగ్ ద్వారా వచ్చే మిస్డ్ కాల్స్‌తో ఈ మాల్వేర్ ఫోన్లోకి చొరబడినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటి వారంలోనే ఈ మాల్వేర్ను గుర్తించామని, వాయిస్ కాలింగ్‌కు అదనపు భద్రతా ఫీచర్లు సిద్ధం చేస్తుండగా తమ సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు ప్రకటించింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ వాట్సప్ అప్డేట్ చేసుకోవాలని సూచన తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 150 కోట్ల మంది వాట్సప్ వాడకందారులు యాప్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ మాల్వేర్ వల్ల ఎంతమంది వినియోగదారులకు నష్టం జరిగిందన్న విషయంపై వాట్సప్ స్పందించలేదు. 2014లో వాట్సప్‌ను ఫేస్బుక్ టేకోవర్ చేసినప్పటి నుంచి డేటా భద్రతపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. డేటా దుర్వినియోగంపై ఫేస్బుక్ తరచూ ఆరోపణలు ఎదుర్కొంటుండటమే దీనికి ప్రధాన కారణం. -
సైబర్ సెక్యూరిటీలో మన ర్యాంకు..?
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ ఎటాక్, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై యూకేకు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్ 60దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. కేవలం 1.34శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది. సైబర్ దాడులు నిరోధం, చట్టాలులాంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా వుందని తెలిపింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, కెనడా, డెన్మార్క్, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది. సైబర్‌దాడులకు సంబంధించి ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది. అలాగే సరైన చట్టాలు,రక్షణ చర్యలు లేని కారణంగా ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్ ఎక్కువ దాడులకు గురవుతున్నాయని నివేదించింది. -
మిస్టరీ మాల్వేర్ : వీవీఐపీల ఐఫోన్లే టార్గెట్
హైదరాబాద్ : ఇటీవల మాల్వేర్ వైరస్లు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయో చూస్తున్నాం. వ్యక్తిగత డేటాలను చోరి చేస్తూ.. మాల్వేర్లు విజృంభిస్తున్నాయి. తాజాగా భారత్‌లో 13 ఐఫోన్లపై అనుమానిత అప్లికేషన్ దాడి చేసిందట. డేటాను, సమాచారాన్ని ఆ అప్లికేషన్ దొంగలించేసింది. 13 ఐఫోన్లే కదా..! లక్షల ఫోన్ల మాదిరి చెప్పారేంటి అనుకుంటున్నారా? కానీ చోరికి గురైనా ఆ ఐఫోన్లు వీవీఐపీలవి అంట. వీవీఐపీ స్మార్ట్ఫోన్లను టార్గెట్ చేసి, ఓ మిస్టరీ మాల్వేర్ అటాక్ చేసినట్టు సిస్కో టాలోస్ కమర్షియల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మాల్వేర్ రీసెర్చర్లు, అనాలిస్టులు బహిర్గతం చేశారు. అయితే ఈ వీవీఐపీలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. భారత్‌లో ఉండే ఈ దాడి జరిపిన అటాకర్, రష్యాలో ఉన్నట్టు నమ్మిస్తున్నట్టు సిస్కో నిపుణులు చెప్పారు. రష్యన్ పేర్లు, ఈమెయిల్ డొమైన్లను ఇతను వాడుకున్నట్టు పేర్కొన్నారు. దాడికి రెండు వ్యక్తిగత డివైజ్‌లను వాడిన అటాకర్, భారత్‌లో వొడాఫోన్ నెట్‌వర్క్‌తో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను వాడినట్టు చెప్పారు. ఓపెన్ సోర్స్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎండీఎం)ను ఫోన్లలోకి చొప్పించి, ఆ 13 డివైజ్‌లలోకి అటాకర్ ఎన్రోల్ అయినట్టు టాలోస్ ఇంటెలిజెన్స్ నిపుణులు తమ బ్లాగ్‌లో రివీల్చేశారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లోకి ఫీచర్లను యాడ్ చేయడం కోసం పలు టెక్నికల్స్‌ను వాడటం, టార్గెట్ చేసిన డివైజ్‌లలోకి ఎండీఎం చెందిన టెలిగ్రామ్‌ను చొప్పించడం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు సిస్కో మాల్వేర్ రీసెర్చర్ ఆడ్రూ విలియమ్స్, మాల్వేర్ అనాలిస్ట్ పౌల్ చెప్పారు. మాల్వేర్, టార్గెట్ చేసిన ఐఫోన్ డివైజ్‌ల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను సేకరించడం, ఎస్ఎంఎస్లను, యూజర్ల ఫోటోలను, కాంటాక్ట్‌లను, లొకేషన్, సీరియల్ నెంబర్, ఫోన్ నెంబర్ లాంటి సమాచారాన్ని దొంగలించడం చేసిందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బ్లాక్మెయిల్ లేదా అవినీతికి ఉపయోగిస్తున్నట్టు లైనక్స్/యునిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆన్లైన్ కమ్యూనిటీ నిక్స్క్రాఫ్ట్ చెప్పినట్టు టాలోస్ రీసెర్చ్ కోట్ చేసింది. దీని బారిన పడిన ఐఓఎస్ డివైజ్ యూజర్లకు కనీసం దీని గురించే అర్థం కాదని చెప్పింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఆపరేషన్‌ను కనీసం గుర్తించలేకపోయామని చెప్పారు. ‘ఐఫోన్ ప్రమాదబారిన పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ మాల్వేర్ ప్రభావితం బారిన పడటం తక్కువగా నమోదవుతుంటుంది. దీనిలో యూజర్ల తప్పిదం కూడా ఉంటుంది. అటాకర్లు సోషల్ ఇంజనీరింగ్ వాడుకుని ఐఫోన్లలోకి చొప్పించి ఉంటారు’ అని తెలంగాణ సీఐడీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు యూ రామ్మోహన్ చెప్పారు. -
అప్పుడు కత్తులు.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, ఉండవల్లి : ఒకప్పుడు కత్తులు పట్టుకుని తిరిగిన నేరగాళ్లు ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరుగుతాన్నరని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయితీల వరకూ ఈ- ఆఫీసులను ఉపయోగించడం ద్వారా త్వరితగతిన పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా చౌర్యం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 58 శాతం మేర ఐటీ ప్రోడక్టులు మాల్ వేర్‌కు గురవుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడేవారు ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు...లోకేశ్‌పై ప్రశంసలు కురిపించారు. లోకేశ్ ఐటీ డిగ్రీ పరిజ్ఞానం ఇప్పుడు తన మంత్రిత్వ శాఖకు ఉపయోగపడిందని అన్నారు. తాను సాంకేతికపరమైన వ్యక్తిని కాదని, లీడర్‌ను మాత్రమే అని ఆయన అన్నారు. -
గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్‌పై మాల్వేర్ అటాక్
శాన్ఫ్రాన్సిస్కో : గూగుల్ ప్లే స్టోర్‌లోని గేమ్స్‌పై పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ అటాక్ చేసింది. ఈ అటాక్ బారితో దాదాపు 60 గేమ్స్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్‌లో ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌పై అటాక్ చేసినట్టు ఇజ్రాయిల్‌కు చెందిన సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఫేక్ సెక్యురిటీ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు డిజైన్ చేసినట్టు రీసెర్చర్లు రిపోర్టు చేశారు. గేమ్స్ యాప్‌లో పోర్నో యాడ్స్ ద్వారా ఈ మాల్వేర్ అటాక్ చేస్తుందని, ఒకవేళ వీటిని క్లిక్ చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఈ మాల్వేర్పై అలర్ట్ అయిన గూగుల్, వెంటనే తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్‌ను తొలగించింది. ప్లే స్టోర్ నుంచి తాము ఈ యాప్స్‌ను తొలగించామని, డెవలపర్ల అకౌంట్‌ను డిసేబుల్ చేశామని గూగుల్ తెలిపింది. వీటిని ఇన్స్టాల్ చేసుకునే వారికి తాము గట్టి హెచ్చరిక జారీచేస్తున్నామని పేర్కొంది. యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు చెక్ పాయింట్స్ చేసిన ఈ పనిని తాము అభినందిస్తున్నామని తెలిపింది. అయితే ఈ మాల్వేర్ ప్రభావానికి యూజర్ల డివైజ్‌లు ప్రభావితం కాలేదని చెప్పింది. మాల్వేర్ ప్రభావానికి గురైన యాప్స్‌ను మూడు నుంచి ఏడు మిలియన్ సార్లు డౌన్లోడ్ అయ్యాయి. వాటిలో ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్ కారు రేసింగ్ గేమ్ ఉన్నాయి. -
బార్ కోడ్ స్కాన్ కూడా ప్రమాదమే!
సాక్షి : సాంకేతికతతో ఎంత మేర ఉపయోగాలు ఉన్నాయో.. సరైన భద్రత పాటించకపోతే అదే స్థాయిలో కూడా ప్రమాదం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల నుంచే అన్ని అవసరాలు తీర్చుకుంటున్న వేళ ఆ జాగ్రత్త మరింత అవసరం. మెయిళ్లకు వచ్చే అనవసరమైన అటాచ్మెంట్ ఫైల్స్.. అనుమానాస్పదంగా కనిపించే లింకులు క్లిక్ చేయటం ఎంత ప్రమాదకరమో తరచూ నిపుణులు హెచ్చరిస్తుండటం చూస్తున్నాం. లాటరీ గెలుచుకున్నారనో లేక మనం నిత్యం ఉపయోగించే సాఫ్ట్ వేర్ల సాయంతోనే ప్రమాదకరమైన వైరస్‌ను హ్యాకర్లు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు బార్ కోడ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ది కన్వర్జేషన్ అనే ప్రముఖ మాగ్జైన్ ఈ మేరకు నిపుణుల అభిప్రాయంతో ఓ కథనం ప్రచురించింది. ఎక్కడపడితే అక్కడ క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్లను క్లిక్ చేయటం మంచిది కాదని.. అలా చేస్తే హ్యాకర్లు రూపంలో ముప్పుతప్పదని వారు చెబుతున్నారు. ‘ఉదాహరణకు మీ ఫోన్‌తో ఏదైనా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా లేక ఫోటో తీసినా చాలూ.. వెంటనే ఆ కోడ్‌లో అప్పటికే ఏర్పాటు చేసిన బగ్ యూఆర్ఎల్ లేదా మెయిల్ రూపంలో హ్యాకర్లకు సమాచారం చేరవేస్తుంది. తద్వారా మీ ఫోన్లోని డేటాను వారు తస్కరించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రమాదకరమైన వైరస్‌ను మీ కంప్యూటర్, ఫోన్లలోకి ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది’ అని అంటున్నారు. ఎంతటి టెక్నాలజీనైనా చేధించగలిగే స్థాయికి హ్యాకర్లు ఇప్పుడు చేరుకున్నారు. కీ బోర్డు మీద టైప్ చేసే ఎలాంటి సమాచారానైనా ఇట్టే పసిగట్టగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయా ఉత్పత్తులకు చెందిన వారు, వినియోగదారులు ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కానీ, 3-డి మోడలింగ్, 3-డి ప్రింటెడ్ విధానాల ద్వారా మాత్రం ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది నిపుణుల వాదన. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో డీఎన్ఏ(వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించింది) విధానం తరహాలోనే 3-డి విధానంలో కంప్యూటర్లు ఎలాంటి వైరస్ బారిన పడలేదని చెప్పారు. అయితే భవిష్యత్తులో వీటిని కూడా చేధించగలిగే ఆస్కారం లేకపోవటంతో పూర్తి స్థాయి అభివృద్ధి తర్వాతే ఈ విధానాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావటం మంచిదని వారు భావిస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్ పై మాలావేర్ ఎటాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ హ్యాకింగ్ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్‌లపై ఇటీవల మాల్వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది పిటిఐ నివేదిక ప్రకారం, దాదాపు 2,000 బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు దాడికి గురయ్యాయి. వెంటనే వీటి డిఫాల్ట్ పాస్వర్డ్ ‘అడ్మిన్’ను మార్చుకోవాలని సంస్థ కస్టమర్లను కోరింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సిస్టంలోని కొంత భాగంగా మాల్వేర్ దాడికి గురైంది. దీంతో తమ సొంత బ్రాడ్ బాండ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. చందాదారులు డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చకపోవడం మూలంగానే మాలావేర్ దాడికి గురయ్యాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే పరిస్థితిని చాలావరకు చక్కదిద్దామని, కానీ వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చకోవాలని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ సలహా ఇచ్చారు. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్ వర్క్, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు. -
ఈ ఏటీఏంలో వద్దంటే క్యాష్..
భువనేశ్వర్: నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఒడిశా వాసులు ఆకస్మాత్తుగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రభుత్వరంగ బ్యాంకుకు చెందిన స్థానిక ఏటీఎం ఒకటి డబ్బులు దానంతట అదే వెదజల్లడం కలకలం రేపింది. ఒడిషాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీంఎంలో ఎలాంటి కార్డు స్వైపింగ్ లేకుండానే డబ్బును అందిస్తోంది. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించారు. సాఫ్ట్వేర్ మాలావేర్‌అయి వుంటుందని భావిస్తున్నారు. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. చుట్టుపక్కల వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 10 ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. మరోవైపు కాలం చెల్లిన సాఫ్ట్ వేర్లతోనడుస్తున్న ఏటీఎంలపై స్థానిక హ్యాకర్ల పని అయివుంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ల్యాప్ టాప్ లేదా ఫోన్ మాలావేర్ ఎటాక్ తరహాలో ఏటీఎంపై వైరస్ ఎటాక్ జరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు. యూఎస్బీ పోర్ట్ ద్వారా ఫైల్స్ లేదా వైరస్‌ను ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా ఏటీఎం మెషీన్లు అసాధారణంగా పనిచేస్తాయని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రస్తుతం కొనసాగుతోందని, దీనికి గల కారణాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 10 ఏటీఎం సెంటర్లు ప్రభావితమయ్యాయని ఎన్సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. -
యాపిల్ యాప్‌స్టోర్‌పై హ్యాకర్ల దాడి!
శత్రుదుర్భేద్యంగా భావించే యాపిల్ కంపెనీ వాళ్ల యాప్ స్టోర్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. ఈ విషయాన్ని యాపిల్ కూడా నిర్ధారించింది. తమ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్‌ను హ్యాకర్లు కాపీచేసి, దానికి మార్పుచేర్పులు చేసి, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉండే యాప్స్‌లోకి వాళ్ల కోడ్‌ను ప్రవేశపెట్టారని యాపిల్ చెప్పింది. ఇప్పటివరకు 40 యాప్స్‌లో ఇలాంటి కోడ్ లేదా మాల్వేర్ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కోట్లాది మంది యాపిల్ యూజర్లపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. ఉదాహరణకు యాప్ స్టోర్‌లో ఉండే 'వుయ్ చాట్' లాంటి యాప్‌ను తీసుకుంటే.. దానికి దాదాపు 50 కోట్ల మంది యూజర్లున్నారు. అలాగే కామ్ కార్డ్ అనే బిజినెస్ కార్డ్ స్కానర్ యాప్‌లోనూ ఈ మాల్వేర్ ఉంది. దాదాపు 300 వరకు యాప్స్ ఇలా ఇన్ఫెక్ట్ అయ్యాయని చైనాకు చెందిన ఆన్లైన్ సెక్యూరిటీ కంపెనీ క్యోహో తెలిపింది. నకిలీ సాఫ్ట్‌వేర్‌తో మార్చినట్లు గుర్తించిన కొన్ని యాప్‌లను తాము ఇప్పటికే తొలగించామని యాపిల్ అధికార ప్రతినిధి క్రిస్టీన్ మొనాగన్ తెలిపారు. అయితే ఆదివారం నాడు ఎంతమంది ఇలా ఇన్ఫెక్ట్ అయిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి ఇలా మాల్వేర్ ఉన్న యాప్‌ను ఓపెన్ చేశారంటే.. ఆ ఫోన్ లేదా ట్యాబ్‌లోకి మరిన్ని వైరస్లు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.